ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ భేటీ ముగిసింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన ప్రధానమంత్రిని కలిశారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ భేటీ ముగిసింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన ప్రధానమంత్రిని కలిశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ, అనంతర పరిణామాలను ప్రధానమంత్రికి నరసింహన్ వివరించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలను కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక వీరిద్దరి మధ్య గవర్నర్ సలహాదారుల గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ముగ్గురు సలహాదారుల నియామకానికి కూడా దాదాపుగా అంగీకారం కుదిరిందంటున్నారు. ఎ.ఎన్.తివారీ, విజయకుమార్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు మరొకరిని కూడా సలహాదారులుగా పంపే అవకాశం ఉంది.