
హస్తినలో నరసింహన్ బిజీ బిజీ
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం మధ్యాఃహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పరిపాలన విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఆయనతో చర్చిస్తారని భావిస్తున్నారు.
ఇక బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్ నరసింహన్ భేటీ అవుతారు. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేల అపాయింట్మెంట్ కూడా గవర్నర్ కోరినట్లు సమాచారం.