ఏప్రాంత ప్రజలకైనా భద్రత కల్పిస్తాం: నరసింహన్ | Andhra Pradesh bifurcation will be smooth: ESL Narasimhan | Sakshi
Sakshi News home page

ఏప్రాంత ప్రజలకైనా భద్రత కల్పిస్తాం: నరసింహన్

Published Fri, May 30 2014 4:45 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ఏప్రాంత ప్రజలకైనా భద్రత కల్పిస్తాం: నరసింహన్ - Sakshi

ఏప్రాంత ప్రజలకైనా భద్రత కల్పిస్తాం: నరసింహన్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సాఫీగానే జరుగుతుందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ న్యూఢిల్లిలో వెల్లడించారు. ఏ ప్రాంత ప్రజలకైనా భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నరసింహన్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజనాథ్ తో కలిసిన గవర్నర్.. రాష్ట్ర విభజన జరుగుతున్న తీరు తెన్నులను వివరించారు. జూన్ 2 తేదిన తెలంగాణ అవతరణకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని రాజ్ నాథ్ కు గవర్నర్ తెలిపారు. 
 
రాజనాథ్ తో సమావేశమనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విభజన జరుగుతుంది.. సీమాంధ్ర ప్రజలకైనా.. ఇతర రాష్ట్రాలవారికైనా ఎలాంటి ఇబ్బందులుండవని ఓ ప్రశ్నకు నరసింహన్ జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా సేవలందిస్తున్న నరసింహన్ కు తెలంగాణ గవర్నర్ గా కొనసాగాలని అదనపు బాధ్యతల్ని ఇచ్చారు. జూన్ 2 తేదిన ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రానికి అదే రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement