హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరురాష్ట్రాల్లో పదేళ్లపాటు ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానంపై టీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్...రాష్ట్ర గవర్నర్తో చర్చించనున్నారు. కాగా జూన్ 2వ తేదీ నుంచి పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలతో పాటు సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లోను ప్రస్తుతం ఉన్న ప్రవేశ కోటానే పదేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై టీఆర్ఎస్ అసంతృప్తి
Published Mon, May 19 2014 12:43 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement