ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేనిపోని చిక్కులు పెడుతోందని, విషయంలో విద్యార్థులకు న్యాయం చేయాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేనిపోని చిక్కులు పెడుతోందని, విషయంలో విద్యార్థులకు న్యాయం చేయాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్కు స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న చిక్కులపై ఆయనకు వివరించారు.
విద్యార్థుల స్థానికతపై తెలంగాణ ప్రభుత్వానిది వితండవాదమని, విద్యార్థి స్థానికతను వదిలేసి, తండ్రి స్థానికత ఆధారంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామనడం అన్యాయమని ఆయన అన్నారు. గవర్నర్ కలగజేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని గంటా చెప్పారు. ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నడచుకోవాల్సిందేనని, ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా వెనుకాడబోమని అన్నారు.