ఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ‍్యస్వామి అన్నారు. మహబూబా ముఫ్తీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. సర్కార్ వైఫల్యం వల్లే అనంత్‌నాగ్ లో యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందన్నారు.
జమ్మూ ప్రజలకు భద్రత కరువైందని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి.
మరోవైపు ముఖ్యమంత్రి ముఫ్తీ తాజా పరిణామాలతో పాటు, శాంతి భద్రతలపై మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ఆమె ఉగ్రవాదిలో గాయపడ్డవారిని పరామర్శించారు. ఉగ్రదాడితో కాశ్మీరీలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అని ఆమె అన్నారు.