
సూర్యాపేట: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో జరపాలని పార్లమెంటులో చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు.
కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50వేల మెజార్టీతో కాంగ్రెస్ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ మెజారిటీ తగ్గితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
దేశాన్ని బీజేపీ ఛిన్నాభిన్నం చేయబోతుందని ఉత్తమ్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ మోసాలు ఎండగట్టేందుకే హాత్ సే హాత్ జోడో యత్ర చేపడుతున్నట్లు చెప్పారు.
చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment