టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..

TPCC Chief Revanth Reddy Padayatra Schedule - Sakshi

వరంగల్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. 'హాత్ సే హాత్ జోడో' అభియాన్ లో భాగంగా రేవంత్ ఈ యాత్ర చేపడుతున్నారు.

తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైఎస్‌ఆర్ స్ఫూర్తితో తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో వైఎస్‌ఆర్‌ చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 2004లో టీడీపీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాకతీయ రాజులపై వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం కోసమే తన పాదయాత్రను మేడారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇలా..

  • సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలుదేరుతారు
  • వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు.
  • ఉదయం 10 గంటలకు ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
  • అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు  మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు
  • 12 గంటలకు పాదయాత్ర ప్రారంభం
  • మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర
  • మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్‌లో భోజన విరామం
  • ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి పాదయాత్ర
  • సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం
  • పస్రా జంక్షన్‌లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్
  • తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి మళ్లీ పాదయాత్ర
  • రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకోనున్న రేవంత్ పాదయాత్ర
  • రాత్రికి రామప్ప గ్రామంలోనే బస

రేవంత్ మొదటి విడత పాదయాత్రలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఫిబ్రవరి 22 వరకు ఈ యాత్ర సాగుతుంది. ఆ తర్వాత రెండు రోజులు విరామం తీసుకుని చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి హాజరవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24 పాదయాత్ర రెండో విడత ప్రారంభమవుతుంది.

'హాత్ సే హాత్ జోడో అభియాన్‌'లో భాగంగా తెలంగాణలోని అన్ని గ్రామాలను కవర్ చేసి ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేడయమే ఈ యాత్ర లక్ష‍్యమని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే చెప్పారు.
చదవండి:  కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top