దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించండి: మమత | mamata banerjee dares centre to impose president rule in west bengal | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించండి: మమత

Published Sat, Nov 22 2014 3:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించండి: మమత

దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించండి: మమత

దమ్ముంటే పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని మమతా బెనర్జీ సవాలు చేశారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టడం కష్టమే. తాజాగా ఆమెకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద ఎక్కడలేని కోపం వచ్చింది. సెక్యులరిజం మీద ఏర్పాటైన సదస్సుకు హాజరుకావడం వల్లే తమ పార్టీ ఎంపీ శ్రింజయ్ బోస్ను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. ఇలాంటి సదస్సులకు వేలసార్లు తాను హాజరవుతానని స్పష్టం చేశారు. దమ్ముంటే పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని మమత సవాలు చేశారు.  

తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే తాము ప్రతిఘటిస్తామని, అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోడానికి తాను సిద్ధమని సవాలు చేశారు. ఇక సీబీఐ తీరుపై కూడా మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అనేక అల్లర్లు జరిగాయన్నారు. ఈ దేశాన్ని నడపడం అంత సులభం కాదంటూ బీజేపీకి కూడా హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement