
'రాష్ట్రపతి పాలనకు ఆస్కారం లేదు'
ఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం, ఆపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆస్కారం లేదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు చెందిన వారిని సీఎం చేసినా తాము మద్దతిస్తామని ఆయన అన్నారు.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నట్టు దామోదర రాజనర్సింహ తెలిపారు. కాగా, కేంద్రం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించినందుకు నిరసనగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.