మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం శనివారం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు.
ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో చవాన్ శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, వచ్చే నెల 15న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది.