న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పుణే, థానే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు ప్రాజెక్టుల పొడగింపునకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్–3లో రెండు కొత్త కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
44.65 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లలో మొత్తం 31 సేష్టన్లు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. జేపీ నగర్– కెంపపురా, హోషహళ్లి– కడబగెరే కారిడార్ల నిర్మాణానికి రూ.15,611 కోట్ల ఖర్చు కానుంది. బెంగళూరు పశి్చమ ప్రాంతాన్ని ఈ మెట్రోరైలు ప్రాజెక్టు మెరుగ్గా అనుసంధానిస్తుందని కేంద్రం పేర్కొంది. పుణె మెట్రో ఫేజ్–1లో స్వరగేట్– కాట్రాజ్ భూగర్భ రైల్వే లైన్ పొడిగింపునకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.
పుణే శివార్లలో కనెక్టివిటీని పెంచే ఈ లైన్–1బి పొడిగింపు ప్రాజెక్టు వ్యయం రూ.2,954 కోట్లని, కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును సమంగా భరిస్తాయని తెలిపింది. థానే పశి్చమ ప్రాంతాన్ని కలుపుతూ వెళ్లే.. థానే ఇంటెగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కారిడార్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కారిడార్‌లో 22 స్టేషన్లు ఉంటాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12,200 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరిస్తాయని వెల్లడించింది.
రెండు విమానాశ్రయాల విస్తరణ
మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ శుక్రవారం రెండు విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేసింది. పశి్చమబెంగాల్‌లోని బగ్డోగ్రా విమానాశ్రయంలో రూ. 1,549 కోట్లతో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. బిహార్‌లోని బిహ్తా విమానాశ్రయాన్ని రూ. 1,413 కోట్లతో విస్తరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment