మనోళ్లు విదేశాలను చుట్టేస్తున్నారు..! | Indians taking multiple international trips surge by 32 percent in the past year: MakeMyTrip report | Sakshi
Sakshi News home page

మనోళ్లు విదేశాలను చుట్టేస్తున్నారు..!

Published Wed, Sep 4 2024 2:29 AM | Last Updated on Wed, Sep 4 2024 8:09 AM

Indians taking multiple international trips surge by 32 percent in the past year: MakeMyTrip report

ఏటా రెండు సార్లు పైగా వెళ్తున్నవారి సంఖ్య 32% అప్‌

మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యధికంగా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ సెర్చ్‌లు

మేక్‌మైట్రిప్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: సానుకూల స్థూలఆర్థిక పరిస్థితుల దన్నుతో విదేశాల్లో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా రెండుసార్లు లేదా అంతకు మించి పర్యటిస్తున్న వారి సంఖ్య 32 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ప్రయాణాలకు సంబంధించి ఎక్కువగా సెర్చ్‌లు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ టాప్‌లో ఉన్నాయి. 2023 జూన్‌ నుంచి 2024 మే మధ్య కాలానికి సంబంధించి ట్రావెల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాం మేక్‌మైట్రిప్‌ రూపొందించిన ’హౌ ఇండియా ట్రావెల్స్‌ ఎబ్రాడ్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం విదేశాలకు వెళ్లే భారతీయులకు యూఏఈ, థాయ్‌లాండ్, అమెరికా టాప్‌ గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే కజకిస్తాన్, అజర్‌బైజాన్, భూటాన్‌లపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ‘చేతిలో కొంత మిగిలే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, అంతర్జాతీయ సంస్కృతుల గురించి మరింతగా తెలుస్తుండటం, ప్రయాణాలు సులభతరం కావడం తదితర అంశాల కారణంగా విహారయాత్రలు లేదా వ్యాపార అవసరాల రీత్యా దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా పర్యాటకం ప్రోత్సాహకరంగానే ఉండగా మా తాజా విశ్లేషణ ప్రకారం స్థూలఆర్థిక అంశాల ఊతంతో భారతీయుల్లో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ధోరణులు గణనీయంగా పెరుగుతున్నాయి‘ అని మేక్‌మైట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు రాజేశ్‌ మెగో తెలిపారు.  

నివేదికలోని మరిన్ని విశేషాలు..  
టాప్‌ 10 వర్ధమాన గమ్యస్థానాలకు సంబంధించి సెర్చ్‌ చేయడం 70 శాతం పెరిగింది. అజర్‌బైజాన్‌లోని అల్మటీ, బకూ కోసం సెర్చ్‌లు వరుసగా 527 శాతం, 395 శాతం పెరిగాయి.  

⇒ విలాసవంతమైన ప్రయాణాలపై కూడా భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంటర్నేషనల్‌ సెగ్మెంట్‌లో బిజినెస్‌ తరగతి ఫ్లయిట్స్‌ కోసం చేసే సెర్చ్‌లు 10 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. 

⇒ సెర్చ్‌లలో 131 శాతం వృద్ధితో హాంకాంగ్‌ టాప్‌లో ఉంది. శ్రీలంక, జపాన్, సౌదీ అరేబియా, మలేíÙయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  

⇒ ఇంటర్నేషనల్‌ హోటల్‌ బుకింగ్స్‌లో దాదాపు సగం బుకింగ్స్‌ టారిఫ్‌ రోజుకు రూ. 7,000 పైనే ఉంటున్నాయి. హోటళ్ల విషయంలో న్యూయార్క్‌ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఈ విషయంలో బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే టాప్‌ గమ్యస్థానాల జాబితాలో దక్షిణాసియాలోని పోఖారా, పట్టాయా, కౌలాలంపూర్‌ మొదలైనవి ఉన్నాయి.  

సీజన్‌లతో పనిలేకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించి సెర్చ్‌ల పరిమాణం అన్ని కాలాల్లోనూ స్థిరంగా ఉంటోంది. డిసెంబర్‌లో మాత్రం అత్యధికంగా సెర్చ్‌లు నమోదవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement