abroad
-
భర్తతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ (ఫొటోలు)
-
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీఎత్తున కేక్‌లు కట్‌చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలాగే.. బ్రిటన్‌లోనూ అంగరంగ వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. లండన్ ఈస్ట్ హాంలో వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్చింతా ప్రదీప్, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్ మాట్లాడుతూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పడంతో జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విమలారెడ్డి తనయుడు యువరాజ్‌రెడ్డి ఆన్లైన్లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డిఅనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.సింగపూర్‌లోనూ సంబరాలు..వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సింగపూర్‌లో కూడా ఆదివారం ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్ భాస్కర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్‌ను కొనియాడారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! దుబాయ్‌లో అత్యంత వైభవంగా..ఇక యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ ఎన్నాౖరె కమిటీ సలహాదారు ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యూఏఈ కో–కన్వీనర్ మైనర్ బాబు, తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్‌లోని హోటల్ విస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నాగేశ్వరావు తదితర వక్తలు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని.. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేద్దామని పిలుపిచ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారుగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విదేశాల్లోనూ పేటీఎం యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ప్రయాణించే తమ యూజర్లు .. యూపీఐ మాధ్యమంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును ఆర్థిక సేవల సంస్థ పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌లోని నిర్దిష్ట ప్రాంతాల్లో దీన్ని వినియోగించుకోవచ్చని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది.షాపింగ్, డైనింగ్ సహా వివిధ అవసరాలకు చెల్లింపుల కోసం ఈ ఫీచరు ఉపయోగపడగలదని పేర్కొంది. రానున్న హాలిడే సీజన్లో తమ యూజర్లు మరింత సౌకర్యవంతంగా విదేశీ ప్రయాణాలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొంది. -
విదేశీ విద్యా రుణాలు.. కీలకమైన 7 అంశాలు..
ఇటీవలి కాలంలో విదేశీ విద్యను కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో విద్యా రుణాలకు కూడా డిమాండ్ నెలకొంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన విద్యా రుణాలను అందించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ప్రక్రియలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన 7 కీలకాంశాలపై అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ⇒ మొత్తం ఖర్చులపై అవగాహన ఉండాలి: విద్యార్థులు విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ట్యూషన్‌తో పాటు వసతి, జీవన వ్యయాలు, ప్రయాణ ఖర్చులు, బీమా, ఇతరత్రా అనుకోకుండా తలెత్తే ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా ఎంత రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనేది తెలుస్తుంది. అవసరానికి మించి తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఈ లెక్కలు వేసుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ కాల్క్యులేటర్, కాలేజ్ కోర్స్ ఎక్స్పెన్సెస్ కాల్క్యులేటర్ వంటి టూల్స్ ఉపయోగపడతాయి. ⇒ సమగ్ర పరిశోధన అవసరం: ఈ దశ పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న వివిధ రుణాల ఆప్షన్లు, అర్హతలు, వడ్డీ రేట్లు, మంజూరు విధానాలు, తిరిగి చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు, సహ–రుణగ్రహీత అవసరాలు, హామీలు, ప్రాసెసింగ్ ఫీజులపై పరిశోధన⇒ ఖర్చులన్నింటికీ సరిపోయేలా ఉండాలి: కొత్త తరం ఎన్బీఎఫ్సీలు సమగ్ర విద్యా రుణాలను అందిస్తున్నాయి. అంటే ట్యూషన్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, లెరి్నంగ్ డివైజెస్ కొనుగోలు, జీవన వ్యయాలు మొదలైన అన్నింటికీ ఉపయోగపడే విధంగా లోన్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చదువు, కెరియర్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ⇒ డాక్యుమెంటేషన్ ప్రధానం: విద్యార్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్ తయారు చేసుకోవాలి. వాటన్నింటినీ సరిగ్గా సమరి్పస్తే సకాలంలో రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు మెరుగుపడతాయి. ⇒ వేల్యుయేషన్‌పై అవగాహన ఉండాలి: రుణ ప్రొఫైల్స్‌ను మదింపు చేసేందుకు విద్యారి్థ–కేంద్రీకృత విధానాన్ని కొత్త తరం ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. సహ–రుణగ్రహీత ఆర్థిక నేపథ్యంపైనే ఆధారపడకుండా విద్యార్థి అకడమిక్ పనితీరు, ప్రవేశ పరీక్ష స్కోర్లు, ఎంచుకున్న కోర్సు .. యూనివర్సిటీ, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ⇒ వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలి: ముందస్తు అప్రూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి, పత్రాలు తనిఖీ చేయడానికి, రుణాన్ని ఖరారు చేయడానికి ఆర్థిక సంస్థకు కొంత సమయం అవసరవుతుంది. సంస్థను బట్టి అప్రూవల్ ప్రక్రియ వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే నిరీ్ణత సమయానికి రుణం మంజూరయ్యేలా చూసుకోవడానికి వీలవుతుంది. ⇒ స్మార్ట్ రీపేమెంట్ వ్యూహం ప్లాన్ చేసుకోవాలి: లోన్ తీసుకున్న తర్వాత నుంచి వడ్డీని కొంత కొంతగా కట్టుకుంటూ వెళ్లడం మంచిది. ఎందుకంటే గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ ఆ వ్యవధిలో వడ్డీ పడకుండా ఉండదు. ముందు నుంచి చెల్లించడం ప్రారంభిస్తే విద్యార్థులు ఆర్థికంగా మెరుగైన అలవాట్లను పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. -
విదేశాల వైపు.. నర్సుల చూపు
రూ.లక్షల్లో జీతం... ఇండియాతో పోలిస్తే తక్కువ పని ఒత్తిడి... వీలైతే వసతి సౌకర్యం.. ఇలా అన్ని అంశాలు కలసి వస్తుండటంతో విదేశాల్లో నర్సుల ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఏపీ నుంచి కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న యువ నర్సుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. విదేశాలకు వెళ్లే వారి సర్టిఫికెట్లను నర్సింగ్ కౌన్సిల్, నర్సింగ్ కళాశాలల్లో వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా 2023లో ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో 2,821 వెరిఫికేషన్లు చేపట్టారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,662 వెరిఫికేషన్లు పూర్తయ్యాయి. – సాక్షి, అమరావతివైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషియువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నర్సింగ్ కౌన్సిల్‌తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జర్మనీ, జపాన్‌వంటి దేశాలకు పంపేందుకు అక్కడి భాషల్లో శిక్షణ కూడా ఇప్పించింది.పెద్ద దేశాల్లో విస్తృత అవకాశాలుభారత్ నుంచి ఎక్కువ మంది ఐర్లాండ్, సింగపూర్, అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఆ దేశాల్లో కొన్నేళ్లు పని చేసి నైపుణ్యం పెంచుకుని ఆస్ట్రేలియా, అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళుతున్నారు. నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలపైగా గొడ్డు చాకిరి చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య వేతనాలు ఇస్తున్నట్టు నర్సులు చెబుతున్నారు. అదే యూఎస్ఏలో సగటున నెలకు రూ.3.15 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.4.70 లక్షలు, జర్మనీలో రూ.3.15 లక్షలు, సింగపూర్‌లో రూ.2.50 లక్షలపైనే ఉంటోంది. దీనికి తోడు అక్కడ పని గంటలు కూడా మనతో పోలిస్తే చాలా తక్కువ.. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకోవడంతో వలసలపై ఆసక్తి పెరుగుతోంది. యూకేలో భారతీయులే అధికంవిదేశాల్లో మన వైద్యులు, సిబ్బంది చాలామందే పనిచేస్తున్నట్లు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. యూకే 2022–23 ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం ఆ దేశంలో కొత్తగా రిక్రూట్ అయిన వైద్యుల్లో 20%, నర్సుల్లో 46% భారతీయులు ఉన్నట్టు వెల్లడైంది. నర్సింగ్, మిడ్వైఫరీ రిజిస్టర్ బోర్డ్ ఐర్లాండ్‌లో 2023లో 15,060 మంది భారతీయ నర్సులు నమోదు చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. 2022లో 11,957 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విద్యార్హతలునర్సింగ్ రంగంలో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాలనుకునే వాళ్లు తొలుత బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అర్హత సాధించాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర/నేషనల్ నర్సింగ్ కౌన్సెల్లో రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి. కనీసం రెండేళ్ల క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓటీ, ఐసీయూ వంటి విభాగాల్లో అనుభవజ్ఞులైన వారికి విస్తృత అవకాశాలుంటాయి. విదేశాలు వెళ్లాలంటే...ఎంపిక చేసుకున్న దేశాన్ని బట్టి అక్కడి నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి వీసా ప్రాసెస్ చేస్తారు. ఉదాహరణకు కెనడా వెళ్లాలనుకునే వాళ్లు తొలుత నేషనల్ కౌన్సిల్ లైసెన్సర్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్) అర్హత సాధించాలి. దీంతో పాటు ఐఈఎల్టీఎస్/టోఫెల్ వంటి ల్యాంగ్వేజ్ పరీక్షలో అర్హత సాధిస్తే.. వారికి వీసా ప్రాసెస్ చేసి, అక్కడ ఉద్యోగం చేయడానికి వీలు కల్పిస్తారు. అదే సింగపూర్ వెళ్లాలనుకునే వాళ్లు ఎస్ఎన్బీ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది పాసైన వాళ్లకు యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లోను పని చేయడానికి అర్హత లభిస్తుంది. భారత్‌లో కొరతఇదిలా ఉంటే, మన దేశంలో జనాభాకు సరిపడా ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదు వేల మందికి సగటున 10 మంది నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా దేశంలో కేవలం సుమారు 35 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఓ మోస్తరు పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులు నర్సుల కొరతను అధిగమించేందుకు ఏకంగా కాలేజీలను కూడా ప్రారంభించడం పరిపాటిగా మారింది.ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) కింద ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 2015–21 మధ్య విదేశాలు వెళ్లిన నర్సుల సంఖ్య -
మనోళ్లు విదేశాలను చుట్టేస్తున్నారు..!
న్యూఢిల్లీ: సానుకూల స్థూలఆర్థిక పరిస్థితుల దన్నుతో విదేశాల్లో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా రెండుసార్లు లేదా అంతకు మించి పర్యటిస్తున్న వారి సంఖ్య 32 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ప్రయాణాలకు సంబంధించి ఎక్కువగా సెర్చ్‌లు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ టాప్‌లో ఉన్నాయి. 2023 జూన్ నుంచి 2024 మే మధ్య కాలానికి సంబంధించి ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫాం మేక్మైట్రిప్ రూపొందించిన ’హౌ ఇండియా ట్రావెల్స్ ఎబ్రాడ్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం విదేశాలకు వెళ్లే భారతీయులకు యూఏఈ, థాయ్‌లాండ్, అమెరికా టాప్ గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే కజకిస్తాన్, అజర్బైజాన్, భూటాన్‌లపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ‘చేతిలో కొంత మిగిలే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, అంతర్జాతీయ సంస్కృతుల గురించి మరింతగా తెలుస్తుండటం, ప్రయాణాలు సులభతరం కావడం తదితర అంశాల కారణంగా విహారయాత్రలు లేదా వ్యాపార అవసరాల రీత్యా దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా పర్యాటకం ప్రోత్సాహకరంగానే ఉండగా మా తాజా విశ్లేషణ ప్రకారం స్థూలఆర్థిక అంశాల ఊతంతో భారతీయుల్లో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ధోరణులు గణనీయంగా పెరుగుతున్నాయి‘ అని మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ మెగో తెలిపారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ⇒ టాప్ 10 వర్ధమాన గమ్యస్థానాలకు సంబంధించి సెర్చ్ చేయడం 70 శాతం పెరిగింది. అజర్‌బైజాన్‌లోని అల్మటీ, బకూ కోసం సెర్చ్‌లు వరుసగా 527 శాతం, 395 శాతం పెరిగాయి. ⇒ విలాసవంతమైన ప్రయాణాలపై కూడా భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో బిజినెస్ తరగతి ఫ్లయిట్స్ కోసం చేసే సెర్చ్‌లు 10 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. ⇒ సెర్చ్‌లలో 131 శాతం వృద్ధితో హాంకాంగ్ టాప్‌లో ఉంది. శ్రీలంక, జపాన్, సౌదీ అరేబియా, మలేíÙయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ⇒ ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్‌లో దాదాపు సగం బుకింగ్స్ టారిఫ్ రోజుకు రూ. 7,000 పైనే ఉంటున్నాయి. హోటళ్ల విషయంలో న్యూయార్క్ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఈ విషయంలో బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే టాప్ గమ్యస్థానాల జాబితాలో దక్షిణాసియాలోని పోఖారా, పట్టాయా, కౌలాలంపూర్ మొదలైనవి ఉన్నాయి. ⇒ సీజన్లతో పనిలేకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించి సెర్చ్‌ల పరిమాణం అన్ని కాలాల్లోనూ స్థిరంగా ఉంటోంది. డిసెంబర్లో మాత్రం అత్యధికంగా సెర్చ్‌లు నమోదవుతున్నాయి. -
విదేశీ విద్యపైనే మోజు!
విదేశాల్లో చదువుకునేందకు ఇష్టపడే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండటంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. అదే సమయంలో విదేశాల నుంచి మనదేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయితే భారతీయ విద్యార్థులు విదేశాలకు భారీగా తరలిపోవడం, వారి ఆదాయ, వ్యయాలు అన్నీ ఇతర దేశాల్లోనే జరుగుతుండటంతో దేశీయ కరెంట్ అకౌంట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి మరింత పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గుతోంది. దీని కారణంగా భారతదేశ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశాల్లో చదువుకుంటూ.. అక్కడే పని చేసుకుంటున్న వారు డబ్బును తిరిగి భారతదేశానికి పంపడం లేదు. ఫలితంగా సుమారు రూ.50 వేల కోట్ల కరెంట్ అకౌంట్ లోటును తెచ్చిపెట్టినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంకు చెబుతున్నదాని ప్రకారం గత పదేళ్లలో భారతీయుల విద్యా ప్రయాణానికి సంబంధించిన వ్యయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2014–15లో రూ.20,597 కోట్ల నుంచి 2023–24లో రూ.52 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 2025 నాటికి దేశం నుంచి విదేశాలకు వేళ్లే విద్యార్థుల మొత్తం ఖర్చు రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. మన విద్యార్థులు ఇష్టపడుతున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్(అమెరికా), కెనడా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అధిక ఫీజులు, అత్యధిక జీవన వ్యయాలున్నా భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే, దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారే. నేపాల్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులను భారతదేశానికి పంపుతోంది. 2014–15లో 21 శాతం నుంచి 2021–22లో 28శాతానికి పెరిగింది. 2014–15తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మలేషియా, సూడాన్, నైజీరియా విద్యార్థుల శాతం తగ్గింది. భారత్‌కు ఎక్కువ మంది విద్యార్థులను పంపుతున్న దేశాల వరుసలో ఆఫ్ఘనిస్తాన్ 6.72 శాతంతో రెండో, భూటాన్ 3.33 శాతంతో ఆరో దేశంగా నిలుస్తోంది. 2021–22లో అమెరికా విద్యార్థులు 6.71 శాతంతో మూడో స్థానాన్ని, బంగ్లాదేశ్ 5.55 శాతం, యూఏఈ 4.87 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్ని చేసినా ప్రయోజనం స్వల్పమే..అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య క్షీణిస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ను తెచ్చింది. ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అనేక ప్రతిపాదనలను రూపొందించింది. ఈ క్రమంలోనే యూజీసీ సైతం ద్వంద్వ, ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌లను అనుమతించేలా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. 2018లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అత్యుత్తమ స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందించేలా రూపొందించింది. అయితే భాగస్వామ్య దేశాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. కానీ, తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో విదేశీ విద్యార్థులను దేశానికి ఆకర్షించడంలో ఈ కార్యక్రమం నత్తనడకన సాగడంతో విఫలమైంది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2014–15 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరాల వరకు విదేశీ విద్యార్థుల నమోదు కేవలం 16.68శాతం మాత్రమే పెరిగిందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా చెబుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ఎఫెక్ట్‌తో విదేశీ విద్యార్థుల సంఖ్య 48,035కు, 2021–22లో 46,878కి తగ్గింది. విదేశీ విద్యకు రుణాలు పెరిగాయి..దేశంలో ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతుండటంతో డెమోగ్రాఫిక్ సమతౌల్యం దెబ్బతింటోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిలో ఆదాయం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు వంటివి లాభాలను సృష్టిస్తున్నాయి. నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు సైతం విద్యా రుణాలను గణనీయంగా పెంచాయి. ఫలితంగా విదేశాల్లో ఫీజులు చెల్లించే సామర్థ్యం పెద్ద సమస్య కాకుండాపోయింది. – మహేశ్వర్ పెరి, ఛైర్మన్,కెరీర్స్ 360 సీఈవో దేశంలో అంతర్జాతీయ విద్యార్థుల క్షీణత..భారతీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో గణనీయమైన క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్‌లో విద్యా సంబంధిత అంశాల ద్వారా వచ్చే ఆదాయం సగానికి సగం తగ్గింది. 2014–15లో రూ.4,345 కోట్ల నుంచి 2023–24కు రూ.2,068 కోట్లకు పడిపోయింది. అయితే 2022–23తో పోలిస్తే కేవలం విదేశీ మారకపు ఆదాయం స్వల్పంగా పెరిగింది. కోవిడ్ తర్వాత 2021–22లో రూ.912 కోట్ల కనిష్ట స్థాయి నుంచి పుంజుకుంది. అయినప్పటికీ 2014–15తో పోలిస్తే చాలా తక్కువగానే నమోదైంది. -
ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సోమవారం సమాధానమిచ్చారు.2019 నుంచి విదేశాల్లో వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న 633 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు తెలిపారు. ఈ మరణాలు 41 దేశాల్లో జరగ్గా.. కెనడాలో అత్యధికంగా 172 మంది, అమెరికాలో 108 మంది భారతీయ విద్యార్ధులు ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కెనడా, యూఎస్ తరువాత, అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో యూకే (58), ఆస్ట్రేలియా (57), రష్యా (37), జర్మనీ (24) ఉన్నాయి. పొరుగున ఉన్న పాక్‌లోనూ ఒకరు మరణించారు.అయితే వీరంతా ప్రమాదాలు, వైద్య పరిస్థితులు, దాడులు వంటి వివిధ కారణాల వల్ల చనిపోయినట్లు చెప్పారు. దీనికితోడు విదేశాల్లో జరిగిన దాడుల్లో 19 మంది మరణించగా.. అత్యధికంగా తొమ్మిది మంది కెనడాలో, ఆరుగురు అమెరికాలో ప్రాణాలు విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు.అయితే విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు. గత మూడేళ్లలో 48 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. వారి బహిష్కరణకు గల కారణాలను అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
భిన్న సంస్కృతుల ‘ప్రశాంతి’ నిలయం
సాక్షి, పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. ఇతర రాష్ట్రాలు, పలు దేశాల నుంచి భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులు వస్తుండటంతో దశాబ్దాల కాలంగా ఇతర రాష్ట్రాల పండుగలు ప్రశాంతి నిలయంలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేస్తుంటారు. ఏటా గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు, ఆయా రాష్ట్రాల ప్రధాన పండుగలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక రాష్ట్రం నుంచి భక్తులు పర్తియాత్రగా పుట్టపర్తి వస్తున్నారు.అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను పుట్టపర్తిలో ప్రదర్శిస్తున్నారు. పుట్టపర్తి వంటకాలు, వస్త్రధారణకు విదేశీయులు సైతం ముగ్దులు కావడం విశేషం. ఇతర రాష్ట్రాల, దేశాల భక్తులు సైతం స్థానికులతో సులువుగా కలసిపోతున్నారు. ఫలితంగా దేశ, విదేశీ భాషలను స్థానికులు సులువుగా మాట్లాడగలుగుతున్నారు. చదువు రాని వారు సైతం ఆ భాషలను నేర్చుకుంటున్నారు.విదేశాల నుంచి వచ్చే భక్తులు అక్కడి సంప్రదాయం వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్‌ను ఇష్టపడుతున్నారు. మహిళలు చీరకట్టులో, పురుషులు పంచెకట్టులో కనిపిస్తున్నారు. సుమారు 150 దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి వస్తుంటారు. వీరిలో చాలామంది భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.మనకు గర్వకారణంమేము తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. దశాబ్దాల కాలం నుంచి విదేశీయులను చూస్తున్నాం. మన సంప్రదాయాలను వారు ఆచరిస్తుండటం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. పాశ్చాత్య దేశస్తులు మన దుస్తులను ఇష్టపడుతున్నారు. ఇక్కడి వంటకాలు అందరినీ ఆకర్షిస్తాయి. – బాల దండపాణి, పుట్టపర్తిసంప్రదాయాల కేంద్రం పలు దేశాల నుంచి భక్తి భావంతో పుట్టపర్తికి వస్తుంటారు. ఇక్కడి ప్రజల సహకారం బాగుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను విదేశీయులు పాటిస్తారు. దేశ, విదేశ భేదాలు లేకుండా పరస్పర సహకారంతో మెలుగుతుంటారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పుట్టపర్తి.. సంప్రదాయాలకూ కేంద్రంగా ఉందని చెప్పొచ్చు. – ఆర్జే రత్నాకర్రాజు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు -
విదేశాల్లో చదువు : ఫన్ అన్నారు, అంట్లు కడిగితే తప్పేంటి?
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం ఒకప్పుడు కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది.అది గొప్పోళ్లకే సొంతం అన్నట్టు ఉండేది. కానీ చాలామంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ చదువు కోవడానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇలా పలుదేశాలకి ఎగిరిపోతున్నారు. తీరా అక్కడికెళ్లాక చాలామంది విద్యార్థులు కల్చర్ పరంగా, ఆర్థికంగా ఇలా రక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్వతంత్రంగా, భద్రంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అన్ని నిబంధనలూ, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేస్తూ కష్టపడాలి. మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. కానీ అపుడు మాత్రమే, అక్కడి ఖర్చులు లోన్లు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు విద్యార్థులు. కొందరు చదువుతున్న కాలేజీల్లోనే అసిస్టెంట్లుగా పనిచేస్తారు. పనికొందరు మాత్రం వంట చేయడం, గిన్నెలు కడగటం, పిల్లల సంరక్షణా కేంద్రాలు, మొదలు పెట్రోలు బంక్, ఇతర దుకాణాల్లో పనిచేస్తారు. తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు ఇలా అంట్లు కడుగుతున్న వీడియో నొక దాన్ని ఒకరు షేర్ చేశారు. విద్యార్థి నాన్-స్టిక్ పాన్‌ను కడుగుతున్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశాడు. ‘‘విదేశాలకి స్టడీకోసంవెళ్లండి, సరదాగా ఉంటుంది అన్నారు." క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను సానుకూలంగా అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం అంట్లు కడిగితే తప్పేంటి, చిన్న చిన్న పనులైనా నేర్చుకుని ఉండాలి అంటూ మండి పడ్డారు. విదేశాల్లో అయినా ఇండియాలో అయినా ఎవరో ఒకరు అంట్లు కడగాల్సిందే.. వాటంతట అవి శుభ్రపడవు. కాకపోతే నువ్వు ఇంటికొచ్చాక ఇంకొకరు చేస్తారు. లేదా పెళ్లి అయ్యాక నీకోసం ఆ పనులు మరొకరు చేయాలని భావిస్తావ్.. అంతే తేడా. దీన్ని ఫన్‌గా అనుకోకుండా, జీవితమంతా ప్రతిరోజూ మీకోసం మీరు పనులు చేసుకోవాలని అర్థం చేసుకోండి అని కమెంట్ చేయడం గమనార్హం. go study abroad it’ll be fun they said pic.twitter.com/3yoj19uKyC — Dew (@itmedew) March 19, 2024 -
కోహ్లీ భార్య అనుష్క శర్మకు ఏమైంది..?
బాలీవుడ్ నటి అనుష్కశర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మళ్లీ గర్భం దాల్చిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడు స్టార్ ఆటగాడైన కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ల్లో మూడు సిరీస్‌లకు దూరంగానే ఉన్నాడు. అదీగాక తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండటంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడనే అంతా అనుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల స్టార్ కపుల్ విరుష్కరెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే ఊహాగానాలొచ్చాయి. ఇంతలోనే అనుష్కకు ప్రెగ్నెన్సీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో అనుష్కకు ఏమైంది అంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నిజంగానే అనుష్క ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందా? అందుకే విదేశాలకు వెళ్లారా? అనే ఊహగానాలకు జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్వీట్ మరింత ఊత మిచ్చింది. ఈ మేరకు ఆయన ట్విటర్లో వారితో సంభాషించిన ట్వీట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విదేశాలకు వెళ్లినట్లు ఆ పోస్ట్ పేర్కొంది. విరాట్ తన కుటుంబంతో గడిపేందుకు వృత్తిపరమైన విరామం తీసుకున్నారనీ, ముఖ్యంగా అనుష్క ఆరోగ్య సమస్యల కారణంగా విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించాలని అనుకున్నట్లు ఆ ట్వీట్లో ఉంది. అందువల్లే కోహ్లీ తన కుటుంబంతో ఉండేందుకు మ్యాచ్‌లకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్కాకు ఏమైందంటూ చర్చలు మొదలయ్యాయి. తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు.అయితే తాజాగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని, జట్టుతో తిరిగి చేరతాడనేవార్త వెలుగులోకి వచ్చింది. సెలబ్రెటీ విషయంలో ఏ చిన్న విషయం బయటకు పొక్కినా.. అదో పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఏం జరిగిందంటూ..సోషల్ మీడియాలో పోస్టుల హడావిడి అంత ఇంతాకాదు. వీటన్నింటికి చెక్ పడాలంటే..పూర్తి స్పష్టత రావాలంటే ఏం జరిగిందనేది విరుష్క అధికారంగా ప్రకటించాల్సి ఉంది. (చదవండి: స్లిమ్‌గా మారిన టాలీవుడ్ నటుడు సురేష్! ఆయన ఫాలో అయ్యే డైట్ ఇదే..!) -
విదేశీ ఉద్యోగానికి నో చెప్పింది!
సంకల్పం గట్టిగా ఉంటే.. సక్సెస్ కాళ్ల దగ్గరకు రావాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అంబిక రైనా' (Ambika Raina). ఇంతకీ ఈమె ఎవరు ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబిక రైనా మంచి శాలరీలు వచ్చే ఉద్యోగాలను సైత వదులుకుని, అనుకున్న విధంగా ఐఏఎస్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. అంబిక తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ కావడంతో చిన్నప్పటి నుంచే.. క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని నింపారు. తండ్రి ఇండియన్ ఆర్మీ ఉద్యోగి కావడంతో చదువు వివిధ రాష్ట్రాల్లో సాగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్శిటీ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీని పూర్తి చేసి.. ఆ తరువాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని ఒక కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ ఆఫర్‌తో పాటు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లను కూడా పొందింది. అందివచ్చిన ఉద్యోగాలను సైతం వదులుకుని ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో అటువైపుగానే అడుగులు వేసింది. మొదటి రెండు ప్రయత్నాలలో అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకోలేకపోయినప్పటికీ.. పట్టు వదలకు మూడవ సారి ఐఏఎస్ జాబ్ కొట్టేసింది. ఇదీ చదవండి: లీటరు పెట్రోల్ రూ.450 - ఫిబ్రవరి నుంచి అమలు.. ఎక్కడంటే? నిజానికి అబ్రాడ్‌లో ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేసి మరీ వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరు జీతమే లక్ష్యంగా పని చేస్తారు, మరి కొందరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తారు. ఈ విధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ, వాటన్నింటిని వదులుకుని ముందుకు వెళ్ళిపోతారు. -
ప్రణాళికతోనే కెరీర్ బంగారం
మనీష్ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు. ఆద్య చదివే కోర్స్ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది. బోలెడు ఆప్షన్లు గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, కాగ్నిటివ్ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్ డిజైనింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)కు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ శాతం కెరీర్ ఆప్షన్లు సోషల్ మీడియా నుంచి ఉంటున్నాయి. వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ అడ్మిషన్స్ సంస్థ అధినేత శిరీష్ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, కంటెంట్ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి. ‘‘వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించి 85 శాతం ఉద్యోగాలు ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉంది. సంప్రదాయ ఉద్యోగాల నుంచి నిరంతరం మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగం దాదాపు ఉండకపోవచ్చు. అది రిటైల్ అయినా లేక ఈ కామర్స్ అయినా కృత్రిమ మేథ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుంది’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ తెలిపారు. అంటే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగై పోతాయని అనుకోవద్దు. అస్థిరతలు వద్దనుకునే వారు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు వెళుతుండడాన్ని గమనించొచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, చరిత్రకారుల అవసరం భవిష్యత్తులోనూ ఉంటుంది. కానీ, ఆటోమేషన్, ఏఐ కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పుగా మారడం ఖాయం. లోగో, గ్రాఫిక్ డిజైనింగ్ పనులు ఆటోమేషన్‌కు మారుతున్నాయి. ట్రాన్స్‌లేటర్లు, టెలీ మార్కెటర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. యంత్రాలు అంత సులభంగా చేయలేని నైపుణ్యాలు, కోర్సులను చేసే దిశగా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గుప్తా సూచించారు. విద్య, ఉపాధిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాయంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మెరుగైన విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించడాన్ని కూడా పరిశీలించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి పుట్టిన రోజు నుంచే.. పిల్లల ఉన్నత విద్యకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు ఉన్న సులభ మార్గం వారి మొదటి పుట్టిన రోజు నుంచి ఆరంభించడమే. దీనివల్ల పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం మిగిలి ఉంటుంది. నెలవారీ పరిమిత మొత్తంతో పెద్ద నిధిని సమకూర్చుకోగలరు. ఇందుకు గాను ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌ను ముందే సంప్రదించి తమకు అనుకూలమైన (తగిన) ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కేవలం ఉన్నత విద్య అనే కాకుండా వారి వివాహాలకు సంబంధించి కూడా విడిగా ప్రణాళిక అవసరం. భారీ ఖర్చులకు సంబంధించి ముందు నుంచే ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై పెద్ద భారం పడదు. పెట్టుబడుల్లో అధిక శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. 10–15 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కొంత మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలకు) వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యకు మిగిలి ఉన్న కాల వ్యవధి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రాబడులు అనే అంశాల ఆధారంగా నిపుణులు వివిధ సాధనాలను సూచిస్తుంటారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్య ఆగిపోకూడదు. అందుకని మెరుగైన కవరేజీతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో పిల్లలను కూడా భాగం చేయడం, లేదంటే వారి పేరిట ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఎంతో అవసరం. స్కాలర్ షిప్/విద్యారుణం దేశ, విదేశీ యూనివర్సిటీలు చాలా వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీ వెబ్సైట్లను సందర్శించి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. విదేశాల్లోనూ చాలా యూనివర్సిటీలు స్కాలర్షిప్లు, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పేరొందిన ట్రస్ట్‌లు కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు తమ వంతు ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఉన్న మార్గాలను తెలుసుకుని ఉండడం మంచిది. కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెషనల్ డిగ్రీలకు అనుబంధంగా అప్రెంటిషిప్ అవకాశం కలి్పస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష అనుభవంతోపాటు కొంత ఆర్థిక మద్దతు లభించినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు యూనివర్సిటీ కోర్సులకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్‌లు అనుబంధంగా ఉన్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సరిపడా సమకూర్చుకోలేని వారు విద్యా రుణాన్ని కూడా పరిశీలించొచ్చు. చిన్న మొత్తం అయితే ఎలాంటి ష్యూరిటీ అవసరం పడదు. పెద్ద మొత్తంలో రుణం తీసుకునేట్టు అయితే ఆస్తుల తనఖా, గ్యారంటీలను బ్యాంకులు కోరొచ్చు. ఇందుకు కూడా ముందుగానే సిద్ధమవ్వాలి. విద్యా రుణాలపై వడ్డీ రేటు 9–15 శాతం మధ్య ఉంది. పిల్లల విద్య పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు కోర్సు ఫీజులో 80–90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. పిల్లలు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ అవకాశాలను వినియోగించుకోవడం మరొక మార్గం. పెరిగిపోతున్న వ్యయాలు అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకమైన కోర్సులకు డిమాండ్, ఇందుకు మెరుగైన వసతుల కల్పన కారణంగా దేశ, విదేశాల్లో కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.50వేలకే పూర్తయ్యే ఎంబీఏ కోర్స్ నేడు రూ.5 లక్షలకు చేరడం ఇందుకు ఓ నిదర్శనం. ఐఐఎంలలో ఫీజులు రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నాయి. గతంలో ఇవి రూ.6 లక్షల స్థాయిలోనే ఉండేవి. ఐఐటీలోనూ కోర్సు ఫీజు రూ.6–10 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో ఫీజుల పెరుగుదల 100 శాతానికి పైనే ఉంటోంది. విదేశాల్లోనూ ఫీజుల పెరుగుదల ఇదే మాదిరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా డాలర్ మారకం రేటు అధికంగా ఉండడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ‘‘దశాబ్దం క్రితం విదేశాల్లో ఏడాది విద్యా వ్యయాలు రూ.25–30 లక్షల మధ్య ఉండేవి. ఇప్పుడు రూ.50 లక్షలకు చేరాయి’’అని గుప్తా తెలిపారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫీజు దశాబ్దం క్రితం రూ.కోటి స్థాయిలో ఉంటే, ఇప్పుడు అది రెట్టింపైంది. కేవలం ట్యూషన్ ఫీజుల వల్లే కాకుండా, జీవన వ్యయాలు కూడా పెరిగిపోవడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. కాకపోతే విదేశీ విద్యకు సంబంధించి నూరు శాతం స్కాలర్షిప్ పొందే అవకాశం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సొంతం చేసుకోవాలంటే విదేశీ విద్యా ప్రవేశానికి మూడేళ్ల ముందు నుంచే తమ ప్రొఫైల్‌పై పని చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘నూతనతరం కోర్సులు అయితే సాధారణంగా ఏటా రూ.5–10 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఢిల్లీలోని పెర్ల్ అకాడమీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూఐ/యూఎక్స్ (యూజర్ ఇంటర్ఫేజ్/యూజర్ ఎక్స్‌పీరియెన్స్) కు ఏటా రూ.7 లక్షల ఫీజు ఉంది’’అని గుప్తా వెల్లడించారు. కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజు కేవలం ఒక భాగమే. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు అదనంగా ఖర్చు చేయక తప్పదు. కాలం చెల్లిన కరిక్యులమ్ నేపథ్యంలో, పిల్లలకు సమాంతరంగా నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని గుప్తా అంటున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశానికి దూరంగా, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తే అప్పుడు వారి జీవనం కోసం మరింత వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక విదేశాలకు పంపించే వారిపై ఈ భారం మరింత పెరుగుతుంది. వసతి, ఆహారం, లాండ్రీ, ఇంటర్నెట్, మొబైల్, వస్త్రాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీవనం, రవాణా వ్యయాలు, యుటిలిటీలు (విద్యుత్, టెలిఫోన్), ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అరిజిత్ సేన్ పేర్కొన్నారు. భయపెట్టే అంచనాలు చారిత్రకంగా చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో కోర్సుల ఫీజులు నూరు శాతానికి పైగా పెరిగాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘కోర్సుల ఫీజుల పెరుగుదల వచ్చే దశాబ్దం పాటు ఇదే మాదిరిగా ఉంటుంది. జీడీపీ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వెళితే, దీనికి అనుగుణంగా సగటున పెరిగే కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, విద్యా వ్యయం 10 శాతం చొప్పున పెరుగుతూ వెళ్లినా.. ఫీజులు, విద్యా రుణాలు భారంగా మారతాయి’’అని నీతి శర్మ పేర్కొన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యామ్నాయాల రూపంలో రవాణా, జీవన వ్యయాల వంటివి ఆదా చేసుకునే అవకాశం ఉందని శర్మ వివరించారు. ‘‘ప్రతిష్టాత్మక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసేందుకు ఇప్పుడు ఏటా రూ.12–15 లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యా ద్రవ్యోల్బణం 10–12 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే పదేళ్లలో ఇది రూ.40 లక్షలకు చేరొచ్చు. ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీకి నేడు రూ.కోటి అవుతుంటే పదేళ్ల తర్వాత రూ.3 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చు’’అని అరిజిత్ సేన్ తెలిపారు. అనుసరణీయ మార్గాలు.. ఖరీదుగా మారుతున్న ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కాలేజీ ప్రవేశానికి రెండేళ్ల ముందు నుంచే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. విదేశాలకు పంపించేట్టు అయితే అక్కడి జీవన పరిస్థితులు, సంస్కృతి, దరఖాస్తు ప్రక్రియ, ఎదురయ్యే సవాళ్లపై అవగాహన తెచ్చుకోవాలి. కనుక ఈ విషయంలో నిపుణుల సాయం తప్పనిసరి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చదువులకు సంబంధించి ప్రస్తుత వ్యయాలు. తమ పిల్లల ఉన్నత విద్యకు ఇంకా ఎన్నేళ్ల కాల వ్యవధి మిగిలి ఉంది? ఎలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలి, అక్కడి ప్రస్తుత ఫీజులు, తమ పిల్లలు కాలేజీ ప్రవేశం పొందే నాటికి ఎంత మేర పెరగొచ్చనే విషయాలపై స్పష్టత అవసరం. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కోర్స్ వ్యయం, ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, రవాణా వ్యయాలు, స్కాలర్షిప్ ఉన్న అవకాశాలు, మెరుగైన విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను వారి నుంచి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వచ్చే నాటికి వారి ఆసక్తులు ఎలా ఉంటాయన్నది ముందే గుర్తించడం అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారు ఏ కోర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారన్నది ముందుగా తెలియదు. అందుకని ఖరీదైన కోర్స్‌కు సంబంధించి సన్నద్ధం కావడం మంచిది. -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాలు, రక్తహీనత సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్‌ను దేశంలోనే అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్‌పై మంగళగిరిలో గురువారం ఒక వర్క్‌షాప్ జరిగింది. దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాది పొడవునా వరి సాగవుతోందని, బియ్యం నిల్వల్లో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అవసరాలకు తగ్గట్టు విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సైతం ఫోర్టిఫైడ్ బియ్యం ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులతో పాటు మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విటమిన్లతో కూడిన ఈ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్/చైనా బియ్యంగా అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి... ముందుగా వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యత నిర్వహణ వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రతి దశలోనూ పరిశీలించిన తర్వాతే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. లిక్విడ్ టెస్టింగ్ ద్వారా మోతాదు ప్రకారం విటమిన్ల శాతం లేకుంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను అప్పటికప్పుడే తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారతీ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఉప కార్యదర్శి ఎస్‌హెచ్.లలన్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత మహమ్మారిని అరికట్టడంలో భాగంగా 2019లో 11 రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ.. ప్రస్తుతం 27 రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. మెక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థ (ఎంఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఎంఎస్సీ సహవ్యవస్థాపకుడు కుంజ్ బిహారీ, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు తేజస్ ఆచారీ, ఆహార భద్రత–ప్రమాణాల సంస్థ జేడీ కె.బాలసుబ్రహ్మమణ్యం, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, లద్దాఖ్, లక్షద్వీప్ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. -
ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?
కెనడాలో ఉంటున్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో విదేశాలలో ఇదేరీతిలో తలదాచుకున్న ఇతర ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కోరింది. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులను గుర్తించాలని, వారు భారతదేశానికి తిరిగి రాకుండా వారి విదేశీ పౌరసత్వాన్ని (ఓసిఐ) రద్దు చేయాలని ప్రభుత్వం ఆ ఏజెన్సీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫలితంగా భారతదేశానికి చెందిన ఈ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందదని, అప్పుడు వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ, పాకిస్తాన్ తదితర దేశాల్లో పరారీలో ఉన్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కెనడా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్లో నివసిస్తున్న 11 మందిని గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిలో ఎనిమిది మంది అనుమానితులు కెనడాలోనే ఉన్నట్లు అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ జాబితాలో గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్లో హర్విందర్ సంధు అలియాస్ రిండా ఉన్నాడని భావిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ అలియాస్ లాండా, సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునాకే (మూడు రోజుల క్రితం హతమయ్యాడు), అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా, రమణదీప్ సింగ్ అలియాస్ రామన్ జడ్జి, చరణ్‌జిత్ సింగ్ అలియాస్ రింకూ బిహాలా, సనావర్ ధిల్లాన్, గుర్పిందర్ సింగ్ అలియాస్ బాబా డల్లా కెనడాలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక అమెరికాలో గౌరవ్ పత్యాల్ లక్కీ, అన్మోల్ బిష్ణోయ్‌లు ఉన్నారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న తాజా చర్యలు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులతో విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారు భారతదేశంలో ఉద్యమాలు చేపట్టి, యువతను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
Africa : పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్!
సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్ హ్యాండ్ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్ హ్యాండ్ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. లక్షల టన్నుల్లో దిగుమతి ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్ (అరబ్ సంస్కృతి గల దేశాలు), సబ్ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్ దేశాల్లో సెకండ్ హ్యాండ్ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్ డాలర్లు కాగా, సబ్ సహారాలో 1,734 మిలియన్ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్ ఏటా లక్ష టన్నుల సెకండ్ హ్యాండ్ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్ హ్యాండ్ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమిలో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ట్రాషన్: ది స్టెల్త్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ క్లాత్స్ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్ హ్యాండ్ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్ హ్యాండ్ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్. ఆ దేశం నుంచి 14 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుండగా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సెకెండ్‌హ్యాండ్ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్ హ్యాండ్ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ముఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేస్తున్నాయని అంచనా. పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్‌పీస్ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్ హ్యాండ్ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు. -
జనం.. గగనయానం!
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏపీలోని విశాఖపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లి రావాలంటే.. మూడు, నాలుగు రోజులు సెలవు పెట్టాలి. పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఇబ్బంది. దీంతో విమానంలో వెళ్లాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్‌కు వచ్చేసి యథావిధిగా ఆఫీసుకు వెళ్లాడు. కీసర ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నాలుగు రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. విమాన టికెట్లు అందుబాటులో ఉండటంతో బుక్ చేసుకుని సింగపూర్ చుట్టి వచ్చేశారు. ఇదీ ప్రయాణికుల రద్దీ 2022 ఏప్రిల్‌నుంచి జూలై వరకు ప్రయాణికుల సంఖ్య: 26,73,979 పెరిగిన ప్రయాణికుల శాతం:28.2% ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు సంఖ్య: 34,29,083 ..రాష్ట్రంలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు ఈ రెండు చిన్న ఉదాహరణలే. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం, ప్రయాణ బడలిక, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం, విదేశాలకు వెళ్లేందుకు వీసాలు కూడా సులువుగా లభిస్తుండటంతో విదేశాలకు వెళ్లేవారూ పెరుగుతున్నారు. మరోవైపు చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. దీనితోనూ విమానాలకు డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు, ఆహా్వనం పలికేందుకు వస్తున్న బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి రావడం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. 25శాతం పెరిగిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపి రోజూ సుమారు 400 వరకు విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. సగటున రోజూ 65వేల మందికిపైగా వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ సంఖ్య 70వేలకుపైగా ఉంటోందని, విదేశాలకు వెళ్లే విద్యార్ధులే రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటున్నారని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాకు వెళ్లే విద్యార్ధులతోపాటు పర్యాటకులు, బంధువుల వద్దకు వెళ్లేవారు కూడా పెరిగారని అంటున్నారు. ఇక దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు,వ్యాపారం,ఇతర పనులపై రాకపోకలు సాగించేవారు ఎక్కువయ్యారని చెప్తున్నారు. గత ఏడాది జూలైలో 16,01,281 మంది విమాన ప్రయాణం చేయగా.. ఈసారి ఆ సంఖ్య 25శాతం పెరిగి 20 లక్షలకుపైగా నమోదైంది. అవసరం ఏదైనా విమానం ఎక్కాల్సిందే.. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ముఖ్యమైన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ పెరిగింది. యూరప్‌తోపాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, మాల్దీవులు, ఢాకా వంటి దేశాలు, అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్ తర్వాత చాలా మంది విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నట్టు ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక రంగ సంస్థలు చెప్తున్నాయి. ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్ప విమాన ప్రయాణం జోలికి వెళ్లనివారు కూడా.. ఏమాత్రం అవకాశం ఉన్నా విమానంలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి. కొంత ఖర్చయినా ఫర్వాలేదు, విమానంలో వెళ్లాలనే కోరికతో సాధారణ, మధ్య తరగతి వర్గాలవారు కూడా విమానం ఎక్కేస్తున్నారని పేర్కొంటున్నాయి. -
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 87 శాతం మంది ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ) పాసవడం కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో 13 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ) ప్రకటించింది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుపై విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన వైద్య విద్య ఆయా దేశాల్లో ఉండటం లేదన్న ఆరోపణలకు ఈ ఫలితాలు నిదర్శనంగా చెబుతున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మన దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు, లైసెన్స్ పొందడానికి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌కు, పీజీ మెడికల్ చదవడానికి ఎఫ్ఎంజీఈ పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షకు ఆ నాలుగేళ్లలో 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే ఆ నాలుగేళ్లలో కేవలం 14.22 శాతమే పాస్ అయ్యారు. ఈ ఏడాది అది మరింత తక్కువగా ఉండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జూలైలో 24,269 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, కేవలం 3,089 మందే పాసయ్యారు. మిగిలిన 21,180 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఏకంగా 87 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. చైనా, రష్యాలకు ఎక్కువగా వెళుతుండగా, ఆయా దేశాల్లో చదివినవారిలో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ విద్యార్థి ఈ ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు మాత్రమే అవకాశముంటుంది. కొన్ని దేశాలు, కొన్ని కాలేజీల్లో నాసిరకమైన వైద్య విద్య ఉండటం, మన దేశంలోని వైద్య విద్యకు సమాన స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. పైగా చైనా, రష్యాల్లో ఆయా దేశ భాషలోనే వైద్య విద్య నేర్చుకుంటారు. ఇక్కడకు వచ్చాక ఎఫ్ఎంజీఈ పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. దీనివల్ల చాలామంది ఫెయిల్ అవుతున్నారు. పైగా ఎఫ్ఎంజీఈ పూర్తిగా థియరీగా ఉండటం వల్ల కూడా ఫెయిల్ అవుతున్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకేల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన వైద్య విద్య పూర్తి చేసినవారికి మన దేశంలో ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సిన అవసరంలేదు. . ఎక్కువ ఫీజుతో విదేశాలకు దేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని పెరుగుతున్నా, డిమాండ్‌కు తగినంతగా సీట్లు లేకపోవడంతో అనేకమంది విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20.38 లక్షల మందికి విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 11.45 లక్షల మంది అర్హత సాధించారు. కానీ మన దేశంలో కేవలం 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్లే ఉన్నాయి.దీంతో మన దేశంలో సీటు రానివారు, విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తుంటారు. మరికొందరు మన దేశంలోనే ఎండీఎస్ లేదా ఆయుష్ కోర్సులు చేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా, తెలంగాణ నుంచి ఈ ఏడాది 72,842 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. అందులో 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంకా చాలామంది సీటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు ఎక్కువగా ఉంటాయి. కోర్సు పూర్తి చేయాలంటే బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ. 23.10 లక్షల వరకు ఉంటుంది. ఆయా దేశాల్లో ఫీజు తక్కువే కానీ.. అదే విదేశాల్లో చదివితే దేశాన్ని బట్టి ఎంబీబీఎస్ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఫీజు మాత్రమే ఉంటుంది. దీంతో చాలామంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, పిలిఫ్పైన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్‌తో.. తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు..
సీమా హైదర్, అంజూల తరువాత రాజస్థాన్‌లోని డూంగర్పూర్ జిల్లాకు చెందిన దీపిక ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. దీపిక తన భర్త, పిల్లలను వదిలేసి తన ప్రియునితో విదేశాలకు వెళ్లిపోయిందని సమాచారం. ఈ విషయమై ఇటీవలే దీపిక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పోలీసులకు ఆమె ఆచూకీ తెలియలేదు. స్థానికులు ఈ వ్యవహారాన్ని లవ్ జిహాద్ అని చెబుతున్నారు. ఈ ఘటన డూంగర్పూర్ జిల్లాలోని భౌమయీ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తమ ఇంటిలో చెప్పకుండా జూలై 10న మరో వర్గానికి చెందిన యువకునితో విదేశాలకు వెళ్లిపోయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తెకు 11 ఏళ్లు, మరొక కుమార్తెకు 7 ఏళ్లు. భార్య ఉన్నట్టుండి ఇంటినుంచి మాయం కావడంతో భర్త.. చిత్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో స్థానికులు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో పాటు గ్రామంలో ఉంటుంది. ముంబైలో భర్త పనిచేస్తుంటాడు. అయితే భర్తకు తెలియకుండా ఆమె వైద్యచికిత్స పేరుతో గుజరాత్, ఉదయ్‌పూర్ ప్రాంతాలకు తరచూ వెళుతుంటుంది. ఇదేవిధంగా జూలై 10న ఆమె అనారోగ్యానికి చికిత్స పేరుతో గుజరాత్ వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. అయితే ఆమె భర్తకు వాట్సాప్ కాల్ చేసి ‘నువ్వు నాతో సంతోషంగా లేవు. అందుకే నేను నీకు దూరం అవుతున్నాను’ అని తెలిపింది. ఈ మాటలు వినగానే భర్తకు గుండె గుభేల్మంది. వెంటనే అతను హడావుడిగా ముంబై నుంచి గ్రామానికి వచ్చి చూడగా, ఇంటిలో భార్య లేదు. అలాగే ఇంటిలోని విలువైన నగలు, నగదు కూడా మాయమయ్యింది. వెంటనే భర్త తన భార్య మాయమవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయమై చిత్రీ పోలీస్‌స్టేషన్ అధికారి గోవింద్ సింగ్ మాట్లాడుతూ ముఖేష్ పాటీదార్ అనే వ్యక్తి తన భార్య దీపిక మాయమయ్యిందంటూ జూలై 7 ఫిర్యాదు చేశాడని తెలిపారు. దర్యాప్తులో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు లభ్యమయ్యాయని తెలిపారు. వాటిలో ఆమె బుర్ఖా ధరించిన ఒక యువకుని పక్కన కనిపిస్తున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మహిళ కువైట్ వెళ్లివుంటుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం! -
ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయేందుకు కేసీఆర్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని సర్వేలు చెప్తున్నాయని, అందుకే ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోయేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడానికి స్థలం లేదంటున్న సీఎం కేసీఆర్.. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా అమ్ముతున్నారని నిలదీశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అలంపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నేతలు సోమవారం గాందీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు పట్టా భూములిస్తే.. బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి ముసుగులో వాటిని గుంజుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ప్రజల ఆకాంక్షల కోసమని.. అంతేతప్ప ఔటర్ రింగురోడ్డును, దళితుల భూములను అమ్ముకునేందుకు కాదని పేర్కొన్నారు. వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి.. ఓటమి భయంతోనే కేసీఆర్ రాష్ట్రంలో అన్నీ అమ్మేస్తున్నారని, పనులు చక్కబెట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. భూములు కొనేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ తన సొంత మనుషులకు అప్పగించుకునేందుకే వైన్‌షాపుల టెండర్లను నాలుగు నెలల ముందు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని రేవంత్ పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు బీఆర్ఎస్ నేతలకు తొత్తుల్లా పనిచేస్తూ.. కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొబ్బరి పొట్టు..లాభాలు పట్టు
సాక్షి, అమలాపురం: ఇరవై ఏళ్ల క్రితం కొబ్బరి పొట్టు నిరుపయోగ వ్యర్థ పదార్థం. దీనిని వదిలించుకోవడం పీచు పరిశ్రమల యజమానులకు తలకు మించిన భారంగా ఉండేది. కొబ్బరి పీచుకు ధర ఉంటేనే పరిశ్రమలు నడవడం.. లేదంటే మూసేయడంలా ఉండేది. కానీ.. ఆ వ్యర్థమే ఇప్పుడు బంగారమైంది. కొబ్బరి పొట్టును ఇటుకల తయారీలో వాడితే లాభమని గుర్తించారు. ఇటుక తేలిక కావడంతోపాటు ఆకర్షణీయమైన రంగు రావడంతో బట్టి యజమానులు దీని కొనుగోలు మొదలు పెట్టారు. ఆ తరువాత దీని నుంచి అత్యంత నాణ్యమైన కంపోస్టు తయారవుతోందని గుర్తించడంతో కంపోస్టును ఇటుక (కోకోపీట్ బ్లాక్)లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో దీని దశ తిరిగింది. నష్టాల్లో ఉన్న పీచు పరిశ్రమల ఉనికిని ఇప్పుడు కొబ్బరి పొట్టు కాపాడుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల టన్నుల పొట్టు రాష్ట్రంలో చిన్నాపెద్ద కలిపి సుమారు 950 వరకు కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 550 వరకు ఉన్నాయి. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మెట్రిక్ టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇందులో విద్యుత్ వాహకత (ఎలక్ట్రిక్ కండెక్టివిటీ–ఈసీ) 6 నుంచి 8 శాతం వరకు ఉంటోంది. అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా.. తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే.. దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. అదే ఇటుకల రూపంలో అయితే టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.26 వేలు పలుకుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ చేసే అమెజాన్, ఇండియా మార్ట్ వంటి సంస్థలు కేజీ రూ.25 నుంచి రూ.55 వరకు కోకో బ్రిక్ అమ్మకాలు చేస్తున్నాయి. విదేశాలకు కోకోపీట్ బ్లాక్స్ కొబ్బరి పొట్టు ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. వీటిలో గుజరాత్‌ది అగ్రస్థానం. ఇక్కడి నర్సరీలకు మట్టికన్నా కొబ్బరి పొట్టు మేలైన ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, మలేసియా, చైనా, జపాన్, అమెరికా, నెదర్ల్యాండ్, ఆస్ట్రేలియాలకు పొట్టుతో తయారు చేసిన బ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మొత్తం కొబ్బరి పొట్టు ఉత్పత్తిలో కేవలం 10% మాత్రమే బ్లాక్ రూపంలో వెళుతుండగా.. 20% కంపోస్టు రూపంలోను, 70% ఇటుక బట్టీలకు వెళుతోంది. మంచి డిమాండ్ ఉంది అంతర్జాతీయంగా కోకోపీట్ బ్లాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఎగుమతులకు వీలుగా కొబ్బరి పొట్టును తక్కువ ఈసీకి తీసుకువచ్చి బ్లాక్‌లుగా తయారు చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. మాకు స్థానికంగా ఇటుక బట్టీలకు అధికంగా వెళుతోంది. క్వాయర్ పరిశ్రమలు నడుస్తున్నాయంటే అందుకు కొబ్బరి పొట్టే కారణం. – నండూరి ఫణికుమార్, క్వాయర్ పరిశ్రమ యజమాని -
ఇక్కడి వాళ్లు విదేశాల్లో చనిపోయారా? డెడ్ బాడీ తేవడానికి ఒక పోర్టల్
విదేశాల్లో భారతీయ పౌరులు మరణించినప్పుడు, వారి మృతదేహాలను భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. దీని కోసం అన్ని ఎయిర్‌లైన్స్ ఏజెన్సీలు ‘ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించాయి. ఫలితంగా విదేశాలలో మరణించిన వ్యక్తి సంబంధీకులు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తును ఆమోదించి, విదేశాల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియను సంబంధిత అధికారులు ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో చేపట్టనున్నారు. సుదీర్ఘ ప్రక్రియ.. ఇకపై సులభతరం! ఇన్నాళ్లూ భారతీయ పౌరులెవరైనా విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలను తీసుకురావడానికి కుటుంబ సభ్యులు సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి వచ్చేది. ఒక్కోసారి వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టేది. అసాధారణ పరిస్థితుల్లో ఎవరైనా మృతి చెందిన సందర్బంలో వారి మృతదేహాలను తీసుకువచ్చేందుకు మరింత సమయం పట్టేది. ఇటువంటప్పుడు కొన్నిసార్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోవాల్సి అవసరం కూడా ఏర్పడేది. ఈ నేపధ్యంలోనే విదేశాల నుంచి భారతీయుల మృతదేహాలను తీసుకొచ్చే ప్రక్రియను సడలించాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ దిశగా సానుకూల చర్యలు మొదలయ్యాయి. ‘ఓపెన్ ఈ- కేర్’ అంటే ఏమిటి? ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫారమ్‌ను అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు కలిసి సిద్ధం చేశాయి. ఇక నుంచి విదేశాల్లో ఎవరైనా భారతీయ పౌరులు మరణిస్తే మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మరణించిన వ్యక్తి కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తును సంబంధిత అధికారులు తనిఖీ చేసిన తర్వాత, మృతదేహాలను తీసుకువచ్చే ప్రక్రియను వీలైనంత త్వరగా జరుగుతుంది. 48 గంటల్లోగా ఆమోదం విదేశాల్లో ఉన్న భారతీయుల మృత దేహాలను తిరిగి తీసుకురావడంలో జాప్యాన్ని నివారించేందుకు ఈ- పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ- పోర్టల్ ద్వారా సెంట్రల్ ఇంటర్నేషనల్ హెల్త్ డివిజన్, నోడల్ అధికారులు, రవాణాదారులు, విమానయాన సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్‌ల ద్వారా సమాచారం పొందుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ కోసం నియమితులైన నోడల్ అధికారి దరఖాస్తును తనిఖీ చేసి, 48 గంటల్లోగా ఆమోదం తెలియజేస్తారు. రిజిస్టర్డ్ నంబర్ ద్వారా అప్లికేషన్ స్థితిని ఈ-కేర్ పోర్టల్‌లో సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్ -
వీసా లేకుండానే 57 దేశాలకు!
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. – సాక్షి, అమరావతి -
ట్యూనా చేపకు ఫుల్ డిమాండ్.. ఆ దేశ సైనికుల కోసం దిగుమతి
విదేశీ రక్షణ దళాల్లో ట్యూనా పేరు తరచూ వినిపిస్తోంది. అలాగని.. ఇదేమీ సైనికులు వినియోగించే ఆయుధం కాదు. వివిధ దేశాల్లోని సైనికులు లొట్టలేసుకుని తినే ఆహారం. బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే లభించే ట్యూనా చేప దేశ సరిహద్దులు దాటుతోంది. ఎక్కువ పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం కావడంతో వివిధ దేశాలు సైనికుల కోసం వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ట్యూనా చేపలను ప్రాసెస్ చేసిన కేన్డ్ ప్రొడక్ట్స్ (మాంసంగా తయారుచేసి డబ్బాల నుంచి నేరుగా తినేసేలా–రెడీ టు ఈట్)ను విదేశాల్లోని జవాన్ల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ట్యూనా చేప బోర్డర్ దాటుతోంది. ట్యూనా ఏమిటి.. బోర్డర్ దాటడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. అన్ని సముద్రాలలో ట్యూనా చేపలు లభిస్తున్నా.. మన సముద్ర జలాల్లో లభించే ట్యూనా చేపలకుæ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ దేశాలలో విపరీతమైన గిరాకీ ఉంది. రుచితోపాటు పోషకాలు ఎక్కువ ఉండటంతో బలవర్ధక ఆహారంగా ట్యూనా చేపల్ని ఇతర దేశాలు ఎగరేసుకుపోతున్నాయి. నరాల పటుత్వం కోసం వినియోగించే.. కొలె్రస్టాల్ లేని అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలు ట్యూనా ప్రత్యేకత. 100 నుంచి 150 నాటికల్ లోతు జలాల్లో మెకనైజ్డ్ బోట్ల ద్వారా ప్రత్యేక వలలు, లాంగ్ లైన్(హుక్స్, గేలం)లకు మాత్రమే ట్యూనాలు చిక్కు తాయి. సముద్ర జలాల్లో ఎక్కువ.. ట్యూనా 20 నుంచి 80 కేజీల వరకు ఉంటుంది. వీటిపై 2012–15 మధ్య రెండు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి వాటి ఉనికి, రాకపోకలను గుర్తించాయి. ఇంకోయీస్, సీఎంఎఫ్ఆర్ఐ సంస్థలు బంగాళాఖాతంలోని విశాఖపట్నం, కాకినాడ, పసిఫిక్ మహాసముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతాల్లో రాడార్ల సాయంతో ఉపగ్రహాల ద్వారా ట్యూనాల గమనం, ఉనికి, దూరం, ఏ సమయాల్లో లోతు జలాల నుంచి పైకి వస్తున్నాయనేది గుర్తించాయి. అప్పటినుంచే ట్యూనా చేపలు మన సముద్ర జలాల్లో ఎక్కువగా పట్టుకుంటున్నారు. ముద్దుపేరు సీ చికెన్.. స్కాంబ్రిడే కుటుంబానికి చెందిన ట్యూనా శాస్త్రీయ నామం థున్నుస్ ఆల్బాకేర్. సాధారణంగా వీటిని వాడుక భాషలో సూరలు అని కూడా పిలుస్తారు. ఐదు రకాల ట్యూనాలు ఉన్నా మన సముద్ర జలాల్లో లభించే రెక్క సూర (ఎల్లో ట్యూనా) అంటే విదేశీయులు లొట్టలేస్తారు. ట్యూనాలో ఉండే ఒకే ఒక ముల్లు తీసేస్తే మటన్ (మేక మాంసం) కంటే రుచిగా ఉండటమే కాకుండా.. తినడానికి వీలుగా ఉంటుంది. అందుకే ట్యూనాకు సీ చికెన్ అని మరో ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ట్యూనా చేప మాంసంలో ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటంతో రక్తపోటు తగ్గించడంలో క్రియాశీలకంగా ఉంటుంది. ఫుల్ ప్రొటీన్స్.. అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలతో కూడిన కొవ్వు ఉండటంతో నరాలు పటుత్వం, శరీరంలో అవయవాలు బలీయంగా ఉండటానికి దోహదపడతాయి. వీటిలో విటమిన్ బి, బి–12, విటమిన్ సీ అధికంగా ఉండటంతో రోగనిరోధకత పెరుగుతుంది. పొటాషియం, మాంగనీస్, జింక్, సెలీనియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వారానికి రెండు రోజులు ట్యూనాను తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆరోగ్యానికి బలవర్ధక ఆహారంగా వైద్యులు నిర్ధారించడంతోనే విదేశీయులు మన సముద్ర జలాల్లోని ట్యూనాలను దిగుమతి చేసుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, అండమాన్, లక్షద్వీప్ నుండి ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతుల్లో రెండో స్థానం ట్యూనా చేపల ఎగుమతుల్లో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానం మన దేశానిదే. ఏటా 42 వేల టన్నుల ట్యూనా చేపలు లేదా, మాంసంగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2021–22 ఎంపెడా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో పట్టుకునే ట్యూనాలను మత్స్యకారులు రాష్ట్రంలో కాకినాడ, విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం రేవులకు చేర్చి అక్కడి నుంచి చెన్నై, కేరళ రాష్ట్రాలకు కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి జరుగుతోంది. ఇక్కడ కిలో రూ.1,200 నుంచి రూ.1,500 ధర పలుకుతోంది. విదేశాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండే సందర్భంలో కిలో రూ.3,500 కూడా పలుకుతోంది. స్థానిక ప్రజలు ట్యూనా చేపల్ని పెద్దగా ఇష్టపడరు. విదేశాల్లో మాత్రం చాలా బలవర్ధక ఆహారంగా ఆర్మీ జవాన్లకు వారానికి రెండు రోజులు కచి్చతంగా పెడుతున్నారు. అందుకే విదేశాల్లో మన ట్యూనాకు అంత డిమాండ్ ఉంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ బంగాళాఖాతంలో లభించే ట్యూనా చేపలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. క్యాన్సర్‌ను కూడా ఇది నియంత్రిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఎక్కువగా మిలట్రీలో పనిచేసే సిపాయిలకు వారం వారం క్రమం తప్పకుండా వినియోగిస్తున్నారు. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య పరిశోధకుడు, కాకినాడ విదేశాల్లో డిమాండ్ విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నాం. బంగాళాఖాతంలో లోతైన ప్రాంతాల్లో లభిస్తున్న ట్యూనా చేపలు పట్టుకోవడానికి 120 నాటికల్స్ వరకు వెళ్లాల్సి వస్తోంది. వేటకు వెళితే వారం రోజులు నడిసంద్రంలోనే ఉంటారు. ప్రస్తుతం ట్యూనాలు రాక కొంత తగ్గినా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి వేట లాభదాయకంగానే ఉంది. కాకినాడ తీరంలోని మెకనైజ్డ్ బోట్లు ఎక్కువగా ఉండటంతో ట్యూనా చేపలు ఎక్కువగా పడుతున్నాయి. – గోనెల వెంకటేశ్వరరావు, వ్యాపారి, కాకినాడ. ఇది కూడా చదవండి: నదిలో విహరిస్తూ...దేవాలయాలను దర్శిస్తూ..! -
పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!
ఇంగ్లాండ్‌లో అడుగు పెడుతూనే ‘ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను. నిజానికి అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు. బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒక్కటే’ అనుకుంటాడు పార్వతీశం. బారిష్టరు చదువు కోసం ఉన్న పల్లెటూరు నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లిన పార్వతీశం తెలియని భాష, మనుషులు, సంస్కృతుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ మనల్ని తెగ నవ్విస్తాడు. కాలం మారినంత మాత్రాన, చదువు కోసం వెళ్లినవారికి దేశం కాని దేశంలో సమస్యలు ఉండవని కాదు. అవి వేరే రకంగా ఉండవచ్చు. అవి ఏ రకంగా ఉన్నా సరే... యూత్ వాటిని లైట్‌గా తీసుకుంటుంది. విదేశీ యూనివర్శిటీలలో చదువుపై బోలెడు లవ్వు చూపుతోంది... విదేశీ చదువు అనేది ఒకప్పుడు సంపన్న వర్గాల వారికి మాత్రమే పరిమితమైన విషయం. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. ఆర్థికస్థాయి, చిన్నా, పెద్దా పట్టణాలు అనే తేడా లేకుండా ఎంతోమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఎనభైలలో ఫారిన్ యూనివర్శిటీ అంటే ఎక్కుమందికి అమెరికాలోని యూనివర్శిటీలు మాత్రమే. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు రిమోట్ ఈస్ట్ యూరోపియన్ దేశాలపై కూడా యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. అందులో ఒకటి... ‘పాఠ్యపుస్తకాలను, తరగతి గదినీ దాటి మన విద్యావ్యవస్థ బయటికి రాలేకపోతోంది. పాఠ్యాంశం యూత్‌కు దగ్గర కాలేపోతోంది’ దిల్లీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల శ్రేయకు ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అంటే ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను అమెరికాలోని ‘జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ వరకు తీసుకువ్చంది. ‘ఈ యూనివర్శిటీ డిగ్రీ మాత్రమే ఇవ్వదు. ఎంతో అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది’ అంటుంది శ్రేయ. ఫ్లెక్సిబుల్ కరికులమ్ నుంచి ప్రపంచంలోనే అత్యున్నతమైన బోధన సిబ్బంది వరకు ఆ యూనివర్శిటీ గురించి చెప్పుకోదగిన అంశాలను ప్రస్తావిస్తుంది శ్రేయ. ‘విద్యార్థులు తమను తాము వ్యక్తీకరించుకునే అనుభవ జ్ఞానాన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఇస్తాయి’ అంటున్నారు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్–ఛాన్సలర్ దినేష్ సింగ్. అయితే ‘అత్యున్నత ప్రవణాలతో కూడిన చదువు’ మాత్రమే మన విద్యార్థులు దేశం దాటడానికి కారణం కావడం లేదు. ‘భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో గడపడం, ఇతర దేశాల విద్యార్థులతో కలిసి చదువుకొనే అవకాశం దానికదే ఒక ఎడ్యుకేషన్’ అనే అభిప్రాయం కూడా విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆసక్తికి కారణం అవుతుంది. ‘విదేశీ యూనివర్శిటీలలో చదువుకోవడం అనేది మన విద్యావ్యవస్థను తక్కువ చేయడం కాదు. మన పరిధిని విస్తృతం చేసుకోవడం మాత్రమే’ అంటుంది పుణెకు చెందిన సుమన. దిల్లీకి చెందిన 19 సంవత్సరాల సైబా బజాజ్ కెనడాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ మనిటోబ’లో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ‘విదేశాలలో చదువు అనేది డిగ్రీలను మించినది. ఇది ఒక రకంగా సెల్ఫ్–జర్నీ’ అంటుంది సైబా. బెంగళరుకు చెందిన ప్రతిభా జైన్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేయడానికి యూకేకు వెళ్లాలనుకుంటోంది. ఈ మావ\త్రం దానికి అక్కడిదాకా వెళ్లాలా! అనిపిస్తుందిగానీ ప్రతిభ వెర్షన్ వేరు. ‘యూకేకు వెళ్లాలనుకోవడానికి కారణం... అక్కడి యూనివర్శిటీ ఫర్ ది క్రియేటివ్ ఆర్ట్స్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలో పెద్ద పేరు ఉండడం ఒక కారణం అయితే, సాంస్కృతిక వైవిధ్యం, గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది రెండో కారణం. మూడోకారణం ఒకేరకమైన అభిరుచులు ఉన్న వారితో, సబ్జెక్ట్‌కు సంబంధించిన నిపుణులతో కలిసి నెట్‌వర్క్‌గా ఏర్పడే అవకాశం ఉండడం’ అంటుంది ప్రతిభ. జాబ్ మార్కెట్లో సులువుగా విజయం సాధిస్తారు అనే ధీమా వల్ల, మల్టీ కల్చరల్ యూనివర్శిటీలలో తమ పిల్లలను చదివించడానికి పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. పక్కా ఫైనాన్స్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ లోన్ల వల్ల పిల్లలను విదేశీ యూనివర్శిటీలలో చదివించడం చాలామంది పేరెంట్స్‌కు పెద్ద సమస్య కావడం లేదు. తల్లిదండ్రుల ఆసక్తిని గమనించి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు ఎడ్యుకేషన్ లోన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మరోవైపు ‘అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్’కు బెస్ట్ ఎన్బీఎఫ్సీలు ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పేరెంట్స్. టెస్ట్–ప్రిపేరేషన్, కంట్రీ, కోర్సు, యూనివర్శిటీ ఎంపిక, డాక్యుమెంటేషన్ ప్లానింగ్... మొదలైన వాటిలో స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీలపై ఆధారపడుతోంది యూత్. జపాన్ అయినా ఓకే అబ్రాడ్ ఎడ్యుషన్ అనగానే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ... మొదలైన దేశాలు గుర్తుకు వస్తాయి తప్ప జపాన్ గుర్తుకు రావడం జరగదు. అయితే గణాంకాల ప్రకారం జపాన్ యూనివర్శిటీలలో చదివే మన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్‌లోని 20 యూనివర్శిటీల ప్రతినిధులు దిల్లీ, పుణె, చెన్నైలలో హైస్కూల్, కాలేజీలలో నిర్వహింన ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు మం స్పందన లభించింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
చక్రవర్తి (40) ఐటీ టెక్నికల్ మేనేజర్. శుభ్ర (32) ఐటీ బిజినెస్ అనలిస్ట్. ఈ దంపతులు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం, నాణ్యమైన జీవితం కోరుకుంటూ 2019లో విదేశానికి వెళ్లిపోయి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కెనడా శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 2022 మార్చిలో వీరు టొరంటోకు వెళ్లిపోయారు. ఇదొక్క ఉదాహరణ మాత్రమే. విద్యార్థులు ఉన్నత విద్య పేరుతో వెళ్లి, కోర్సు ముగిసిన అనంతరం అక్కడే అవకాశాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. ఇక్కడ కెరీర్ మొదలు పెట్టిన వారు కూడా విదేశీ అవకాశాల కోసం అన్వేíÙస్తున్నారు. కానీ, వలసపోవడం అంత సులభ ప్రక్రియ కాదు. దానికి చాలా సమయం తీసుకుంటుంది. అనుకున్న గడువు కంటే ముందుగా ఆరంభించాలి. దీనికి ఎన్నో పత్రాలు సమరి్పంచాలి. ముందస్తు ప్రణాళిక మేరకు నడుచుకుంటే అనుకున్న విధంగా విదేశీయానం సుఖవంతమవుతుంది. ఈ దిశగా ఆలోచన చేసే వారు నిపుణుల సూచనలు తెలుసుకోవడం వల్ల మెరుగైన ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది. ‘ప్యూ రీసెర్చ్’ అధ్యయనం ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉద్యోగ వలసలు భారత్ నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ‘‘2020లో 1.79 కోట్ల మంది అంతర్జాతీయ వలసవాదుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 1.12 కోట్ల మంది మెక్సికో, 1.08 కోట్ల మంది రష్యా మూలాలు కలిగి ఉన్నారు’’అని ‘ప్యూ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. మన దేశం నుంచి ఏటా లక్షల సంఖ్యలో విదేశాలకు వలస పోతున్నట్టు ఈ నివేదికలోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘విదేశీయాన ప్రక్రియను ముందుగా ప్రారంభించాలి. అప్పుడు అది సులభతరం అవుతుంది. ఏదైనా ఊహించని ఘటన ఎదురైనా ఎదురుకావచ్చు. మరో ఆరు నెలల్లో వెళ్లాలని అనుకుంటే ఇప్పుడే ఆ ప్రక్రి యను ప్రారంభించాలి’’అనిక్యానమ్ ఎంటర్ప్రైజెస్ సీఈవో క్యాలబ్రెస్ సూచించారు. క్యానమ్ అనేది న్యూయార్క్‌కు చెందిన బహుళజాతి పెట్టుబడుల నిర్వహణ సంస్థ. వివరాలతో సరైన ప్రణాళిక ఎలా..? చక్రవర్తి, శుభ్ర 2019లో కెనడా వెళ్లాలని ప్లాన్ చేసుకోగా, 2020లో కరోనా రాకతో ఆలస్యం అయింది. కాకపోతే భారత్‌లో వారు పనిచేస్తున్న కంపెనీయే ఇద్దరు బదిలీకి ఏర్పాట్లు చేయడంతో ఆలస్యమైనా సాఫీగా విదేశానికి తరలిపోయారు. కానీ, ప్రతి ఒక్కరికీ ఇలా జరగాలని లేదు. ‘‘కొందరు విద్యార్థులుగానే విదేశాలకు వెళ్లి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగంలో చేరిపోతారు. కొందరు స్వదేశంలోనే విద్య పూర్తి చేసుకుని నిపుణులుగా తర్వాత విదేశీ ఉద్యోగానికి వెళ్లిపోతుంటారు. కొందరు వ్యాపారవేత్తలుగా వెళ్లి వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. చివరిగా పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా విదేశీ పౌరసత్వం సొంతం చేసుకోవచ్చు’’అని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన గ్లోబల్‌గేట్ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అభినవ్ లోహియా వివరించారు. విదేశంలో ఉద్యోగం సంపాదించి వలసపోవడం అన్నింటిలోకి ప్రముఖమైనది. ‘ఎక్స్‌పాట్ ఇన్సైడర్ 2021’ సర్వే ప్రకారం విదేశాల్లో పనిచేస్తున్న 59 శాతం మంది భారతీయులు కెరీర్లో మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లినవారే. అంతర్జాతీయంగా ఈ రేటు 47 శాతంగానే ఉంది. ఇలా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో 23 శాతం మంది సొంతంగా ఉద్యోగాన్ని వెతుక్కోగా, 19 శాతం మందిని అంతర్జాతీయ సంస్థలు సొంతంగా నియమించుకున్నాయి. 14 శాతం మందిని వారి సంస్థలే పంపించాయి. కేవలం 3 శాతం మంది వ్యాపారం పేరుతో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. బ్రిటన్ను తీసుకుంటే భారత్ నుంచి ఎక్కువమంది స్కిల్డ్ వర్కర్ వీసా ద్వారానే అక్కడికి వెళుతున్నారు. 2022లో భారతీయులు 1,03,000 యూకే వీసాలను సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 148 శాతం ఎక్కువ. 2022లో యూకే జారీ చేసిన వర్కర్ వీసాల్లో 46 శాతం భారతీయులకే దక్కాయి. జాబ్ ఆఫర్ ఉన్న వారికే స్కిల్డ్ వర్కర్ వీసా జారీ చేస్తారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా ఉండాలి’’అని ఏవై అండ్ జే అసోసియేట్స్ డైరెక్టర్ యాష్ దుబాల్ తెలిపారు. స్టూడెంట్ వీసా ద్వారా విదేశాలకు వెళ్లడం మరో మార్గం. ఇది పరోక్ష మార్గం కిందకు వస్తుంది. సాధారణంగా స్టూడెంట్ వీసా గడువు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ఏడాది గడువుతో కూడిన విజిట్ పాస్ పొందొచ్చు. ఈ కాలంలో ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఉద్యోగం పొందిన ఆరు నుంచి రెండేళ్ల అనంతరం (వివిధ దేశాల్లో వివిధ కాల వ్యవధి) శాశ్వత నివాస హోదా పొందొచ్చు. స్టూడెంట్ వీసా ఖర్చు అన్నది వివిధ దేశాల మధ్య మారిపోతుంటుంది. కొన్ని దేశాల్లో పౌరసత్వం కొనుగోలు చేసుకోవడం మరొక మార్గం. పరిమితి మేరకు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈబీ–5 వీసా తీసుకోవచ్చు. అమెరికాలో ఈబీ–5 వీసా కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్íÙప్ సర్వీస్ ప్రాయోజిత ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికాకు స్వల్ప వ్యవధిలోనే పౌరసత్వం ద్వారా వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇది. విద్యార్థులు అయితే యూనివర్సిటీ ర్యాంకింగులు చూడాలి. కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వాన్ని పరిశీలించాలి. వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్లేవారు ముందే విజయావకాశాలను అంచనా వేసుకోవాలి. వ్యయాలు చూడాలి.. ఏ దేశానికి, ఏ రూపంలో వెళ్లాలనే దాని ఆధారంగా ఖర్చు మారిపోతుంది. ఓ కంపెనీలో పనిచేసే నిపుణుడు అదే కంపెనీ ఉద్యోగిగా వేరే దేశానికి వెళ్లేట్టు అయితే టికెట్, రవాణా చార్జీలను పెట్టుకుంటే చాలు. ఇమిగ్రేషన్ చార్జీలను కంపెనీలే భరిస్తాయి. వీసా, లీగల్ ఫీజు వంటి ఇతర వ్యయాలు కూడా ఉంటాయి. ‘‘నా స్నేహితులు కొందరు ఉద్యోగం కోసం ఇక్కడకు (కెనడాకు) వచ్చారు. తగిన ఉద్యోగం వెతుక్కునేందుకు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండాల్సి వచి్చంది. ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ. కనుక ఇక్కడకు వచ్చే వారు ముందుగానే ఈ ఖర్చుల గురించి తెలుసుకోవాలి. అందుకు సరిపడా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుని రావాలి. తమ ఖర్చులకు సరిపడా డబ్బులున్నట్టు ఆధారాలు కూడా చూపించాలి’’అని శుభ్ర తెలిపారు. కెనడాకు వెళ్లాలంటే ఒక వ్యక్తికి ఎంతలేదన్నా 15,500 కెనడియన్ డాలర్లు కావాలి. అదే దంపతులకు అయితే 21,000 డాలర్లు, పిల్లలతో వెళ్లాలంటే 30,000 డాలర్లు అవసరమవుతాయి. అమెరికాకు వెళ్లాంటే గ్రీన్ కార్డ్ కోసం కనీసం 1.8 మిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. అదే ఆ్రస్టేలియాకు వెళ్లాలంటే నలుగురు సభ్యుల కుటుంబానికి 30,000 నుంచి 40,000 ఆ్రస్టేలియన్ డాలర్లు కావాలి. ‘‘ఈబీ–5 వీసా కోసం పెట్టుబడి వేర్వేరుగా ఉంటుంది. అమెరికా అయితే ఈబీ–5 వీసా ఖర్చు 8 లక్షల డాలర్లు. కెనడా అయితే 12 లక్షల కెనడియన్ డాలర్లు. ఈబీ–5 వీసాకు ముందు లోతైన పరిశీలన ఉంటుంది. సంబంధిత వ్యక్తి చేసే పెట్టుబడులకు మూలాలు, ఎంత మందికి ఉపాధి కలి్పస్తున్నారన్నది చూస్తారు. దీనికి అదనంగా అమెరికాలో పరిపాలనా, న్యాయపరమైన చార్జీలు 75,000 డాలర్లు అవుతాయి. అటార్నీ ఫీజులు 10,000–20,000 డాలర్లు పెట్టుకోవాలి. అదే యూకే అయితే స్కిల్డ్ వర్కర్ వీసా కోసం దరఖాస్తు ఫీజు 625 నుంచి 1,423 బ్రిటిష్ పౌండ్లు ఉంటుంది. హెల్త్‌కేర్ సర్‌చార్జీ మరో 624 బ్రిటిష్ పౌండ్ల వరకు ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ, హోటల్ తదితర చార్జీలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వెళ్లే ముందుగా.. ‘‘విదేశానికి వలస వెళ్లే వరకు రెండు దేశాల కరెన్సీని దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే కొత్త దేశానికి వెళ్లి సెటిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నివసించే దేశానికి సంబంధించి పన్ను నిబంధనలు, పౌర చట్టాల గురించి తెలుసుకోవాలి. విదేశాల్లో నివాస ప్రమాణాలు చాలా ఎక్కువ. కనుక తగినన్ని నిధులు సిద్ధం చేసుకుని వెళ్లాలి. పెద్ద మొత్తంలో ఖర్చులు ఎదురుకావచ్చు’’ అని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్ రావు సూచించారు. ఇక బీమా తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. చాలా దేశాల్లో దీన్ని తీసుకోవడం తప్పనిసరిగా అమల్లో ఉంది. తీసుకునే బీమాలో వేటికి కవరేజీ ఉంది, లేనిదీ తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత భారత్‌లో కేవైసీల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా పెట్టుబడులు కలిగిన ఆరి్థక సంస్థలకు విదేశాల్లోని చిరునామా ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా హోదా మార్చుకోవాలి. అప్పుడు స్వదేశంలో పెట్టుబడులు, పన్నుల బాధ్యతలు కొనసాగించుకోవచ్చు. విదేశాలకు తరలిపోయే వారు స్వదేశంలో విలువ తరిగిపోయే ఆస్తులను వదిలించుకుని వెళ్లడమే సరైనది. విలువ పెరిగే రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యతలను ఎవరో ఒకరు చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకుని, అన్నీ విచారించుకుని, తగిన ప్రణాళికతో బయల్దేరితే విదేశీయానం సుఖవంతమవుతుంది. -
సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకే ఎందుకు?
భద్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయ సంపన్నులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. మెరుగైన శాంతిభద్రతలు, కాలుష్యానికి తావులేని చక్కటి వాతావరణం, సంపదపై తక్కువ పన్నులు వారిని ఆకర్శిస్తున్నాయి. ఈ ఏడాది భారత్ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్–2023 తాజాగా వెల్లడించింది. 2022లో భారత్ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు అంచనా. ► మిలియన్ డాలర్లు(రూ.8.2 కోట్లు), అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్నవారిని అల్ట్రా రిచ్(హెచ్ఎన్డబ్ల్యూఐ)గా పరిగణిస్తారు. ► శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ► ఇక 2023లో చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), రష్యా, బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్తారని అంచనా వేస్తున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధక సంస్థ చీఫ్ ఆండ్రూ ఆమోయిల్స్ చెప్పారు. ► భారత్ నుంచి మిలియనీర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు తయారవుతారని ఆమోయిల్స్ తెలిపారు. ► ఈ ఏడాది చైనా నుంచి 13,500 మంది ధనికులు వలస వెళ్తారని అంచనా. ► 2022 ఆఖరు నాటికి టాప్–10 ధనిక దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలు మొదటి 9 స్థానాలో ఉన్నాయి. ► భారత్‌లో మొత్తం జనాభా 142 కోట్లు కాగా, వీరిలో 3,44,600 మంది అల్ట్రా రిచ్(మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అస్తి), 1,078 మంది సెంటి–మిలియనీర్లు(100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి), 123 మంది బిలియనీర్లు(బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి) ఉన్నారు. ► చైనా జనాభా 141 కోట్లు కాగా, వీరిలో 7,80,000 మంది అల్ట్రా రిచ్, 285 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా జనాభా 34 కోట్లు కాగా, వీరిలో 52,70,000 మంది అల్ట్రా రిచ్, 770 మంది బిలియనీర్లు ఉన్నారు. అనువైన దేశం కోసం అన్వేషణ ► విదేశాలకు వలస వెళ్లడానికి సంపన్నులు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజకీయ స్థిరత్వం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు అనువైన దేశం కోసం అన్వేషిస్తున్నారు. ► పిల్లలకు నాణ్యమైన చదువులు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలని కోరుకుంటున్నారు. ► తమ సంపదకు, ఆస్తులకు రక్షణ కల్పించే దేశాన్ని ఎంచుకుంటున్నారు. ► చట్టబద్ధ పాలన ఉండడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛకు హామీ ఇచ్చే దేశాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ► ప్రైవేట్ సంపద వెళ్లిపోవడం దేశాలకు నష్టదాయకమేనని నిపుణులు చెబుతున్నారు. ► భారత్‌లో పన్ను నిబంధనలు కఠినంగా ఉండడంతో ధనవంతులు తమ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఐటీ విద్యార్థులకు విదేశాల రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంటే ప్రపంచంలోనే పేరెన్నికగన్న సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. ఐఐటీలో సీటు వస్తే ఆ విద్యార్థి అతను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గం ఏర్పడినట్టే. అత్యున్నత శిక్షణలో రాటు దేలే ఐఐటీ విద్యార్థులంటే విదేశీ సంస్థలకూ క్రేజే. అందుకే భారత ఐఐటీ విద్యార్థులకు విదేశాలు రాచబాట పరుస్తున్నాయి. వారికి విదేశీ సంస్థలు ఉద్యోగ, ఉన్నత విద్యాభ్యాసం అందించేందుకు పోటీ పడుతున్నాయి. తత్ఫలితంగా దేశం నుంచి మేధో వలసలో ఐఐటీ విద్యార్థులే అత్యధిక శాతం ఉంటున్నారు. దేశంలో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో మూడోవంతు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల ద్వారా దేశంలో అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. అక్కడ శిక్షణ పొందిన వారిని అత్యుత్తమ మానవ వనరులుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు భారత ఐఐటీ విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నాయని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రిసెర్చ్ (ఎన్‌బీఈఆర్) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలలోని 16,598 సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నిర్వహించిన పరీక్ష కోసం 1,89,744 మంది విద్యార్థులు పోటీ పడ్డారని ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని ఐఐటీలలో కూడా చెన్నై, ముంబై, ఖరగ్‌పూర్, ఢిల్లీ, కాన్పూర్ ఐఐటీల విద్యార్థులకు మల్టీ నేషనల్ కంపెనీలు మరింత పెద్దపీట వేస్తున్నాయని తెలిపింది. ఎన్‌బీఈఆర్ నివేదికలోని ప్రధాన అంశాలు సంక్షిప్తంగా.. ► భారత్‌లో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో 35 శాతం విదేశాలకు వెళ్లిపోతున్నారు ► ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో టాప్–1000లో నిలుస్తున్న విద్యార్థుల్లో 36 శాతం మంది విదేశాల బాట పడుతున్నారు. ► భారత ఐఐటీయన్ల ప్రధాన గమ్యస్థానం అమెరికా. విదేశాలకు వెళుతున్న ఐఐటీయన్లలో 65 శాతం అమెరికాకే వెళ్తున్నారు. వారిలో 85 శాతం మంది అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అక్కడే ప్రముఖ కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సీఈవోల వరకు బాధ్యతలు చేపడుతున్నారు. ► ప్రపంచంలో 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాలు జారీ చేస్తోంది. వారిలో భారత ఐఐటీ విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారు. ► భారత ఐఐటీ అంటే విదేశీ సంస్థలకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి వారణాశిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయమే (బీహెచ్‌యూ) తార్కాణం. బీహెచ్‌యూకు ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ సంస్థలోని విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్ ఏకంగా 540 శాతం పెరగడం విశేషం. -
ఎంఎస్.. చలో యూఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు అమెరికాలో ఎంఎస్ కోర్సు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అమెరికా వెళ్తే చదువుకుంటూనే ఉపాధి సైతం పొందవచ్చని భావిస్తున్నారు. కోవిడ్ కాలంలో అమెరికా వెళ్లాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కాస్త తగ్గినా గతేడాది నుంచి మళ్లీ ఆసక్తి పెరిగింది. ఆర్థిక మాంద్యంతో అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గినా విద్యార్థులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎంఎస్ పూర్తయ్యే నాటికి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నారు. దీంతో అప్పులు చేసి మరీ విదేశీ చదువుల కోసం పరుగులు పెరుగుతున్నారు. రాష్ట్రంలో 2020లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్లగా 2022లో ఈ సంఖ్య 52 వేలకు పెరిగిందని, ఈ ఏడాది ఆగస్టు నాటికి వారి సంఖ్య 60 వేల వరకు ఉండొచ్చని ఓ కన్సల్టెంట్ తెలిపారు. దేశం నుంచి ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఆగస్టులో అమెరికా, ఆ్రస్టేలియా ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జాబ్ వచ్చే కోర్సులే గురి... దేశంలో ఏ కోర్సులో ఇంజనీరింగ్ చేసినా అమెరికాలో ఎంఎస్ మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ రంగాల్లోనే చేయాలని విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా డేటా సైన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. డిజిటల్ ఎకానమీలో అత్యధికంగా ఉదోగాలు ఉండటం, నైపుణ్య విభాగాలైన బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్‌కు భవిష్యత్తులోనూ మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంచనాలతోనే ఎక్కువ మంది డేటా సైన్స్‌లో విదేశీ విద్య పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం డేటా అనాలసిస్‌లో 23 శాతం, డేటా విజువలైజేషన్లో 10 శాతం, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్‌లో 26 శాతం, మెషీన్ లెరి్నంగ్‌లో 41 శాతం మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. వారి లక్ష్యం మాత్రం ఈ కోర్సుల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమే. దేశంలో 2020–21 మధ్య డేటా సైన్స్‌లో ఉద్యోగాలు 47.10 శాతం మేర పెరిగాయి. ఎంఎస్ పూర్తి చేసిన వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రంగంలోకి కన్సల్టెన్సీలు... విదేశాలకు వెళ్లే విద్యార్థులను వెతికి పట్టుకొనేందుకు కన్సల్టెన్సీలు పోటీపడుతున్నాయి. వాస్తవానికి విదేశాల్లో ఎంఎస్ కోర్సు చేసేందుకు ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులు, విమాన ప్రయాణ చార్జీలు కలిపి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుంది. చదువుతూ ఉద్యోగం చేయడానికి చాలా దేశాలు ఒప్పుకోవు. కాబట్టి అక్కడ చవివే సమయంలో కావల్సిన మొత్తం తమ వద్ద ఉందని విద్యార్థి వెళ్లే ముందే ఆధారాలు చూపించాలి. ఈ ప్రక్రియలో కన్సల్టెన్సీలు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నాయి. విద్యార్థి ఖాతాలో డబ్బులు వేయడం, అతను విదేశాలకు వెళ్లిన తర్వాత తిరిగి తీసుకోవడం సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో విద్యార్థులు చదువును త్వరగా పూర్తి చేసి వీసా గడువులోగా ఎక్కువ ఉపాధి మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి వారికి కన్సల్టెన్సీలు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఎం.ఎస్. పూర్తి చేశాక కూడా ఉద్యోగం ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నాయి. విదేశాలకు విద్యార్థులు వెళ్లాక ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇవన్నీ సానుకూల మార్గాలు కావడంతో ఎక్కువ మంది వెళ్ళేందుకు ఇష్టపడుతున్నారు. -
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్..ఇకపై రెండు గంటల్లోనే ‘టోఫెల్’
న్యూఢిల్లీ: విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉపకరించే ‘టోఫెల్’ పరీక్ష ఇకపై రెండు గంటలలోపే ముగియనుంది. ప్రస్తుతం ఈ పరీక్షను మూడు గంటలపాటు నిర్వహిస్తున్నారు. అధికారిక స్కోర్‌ను విడుదల చేసే తేదీని టోఫెల్ పూర్తికాగానే అభ్యర్థులు తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఈటీఎస్) వెల్లడించింది. టోఫెల్ ఒక గంట 56 నిమిషాల పాటు ఉంటుందని పేర్కొంది. టోఫెల్లో చేస్తున్న మార్పులు ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టోఫెల్ స్కోర్‌ను 160కిపైగా దేశాల్లో 11,500కిపైగా యూనివర్సిటీలు అంగీకరిస్తున్నాయి. ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వర్సిటీలు ఉన్నాయి. టోఫెల్ రిజి్రస్టేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ తెలిపారు. టెస్టు ఫీజును భారతీయ రూపాయల్లో చెల్లించవచ్చని సూచించారు. టోఫెల్ ప్రక్రియలో తీసుకొస్తున్న మార్పులతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అసోసియేషన ఆఫ్ ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజంటేటివ్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి బొర్రా వివరించారు. చదవండి: పోతపోసిన పోస్టాఫీస్...! -
రాహుల్ గాంధీకి వాళ్లతో లింకులు.. ఆజాద్ సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మాజీ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. రాహుల్ విదేశాలకు వెళ్లి కలవకూడని వ్యాపారవేత్తలను కలుస్తారని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. దీన్నే అవకాశంగా అందిపుచ్చుకున్న బీజేపీ.. రాహుల్ విదేశాల్లో కలిసిన ఆ వ్యాపారవేత్తలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది. వాళ్లను ఎందుకో కలిశారో కూడా వివరణ ఇవ్వాలని నిలదీసింది. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం గౌతమ్ అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంటు సాక్షిగా గళమెత్తిన ఆయన మోదీ, అదానీ విమానంలో కలిసి ప్రయాణించిన ఫొటోను కూడా సభలో ప్రదర్శించారు. అయితే రెండు రోజుల క్రితం అదానీ కంపెనీలకు చెందిన రూ.20వేల కోట్ల బినామీ డబ్బు ఎవరిదని రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిజాన్ని దాస్తూ బీజేపీ ప్రతిరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అదానీ పేరులోని అక్షరాలతో కాంగ్రెస్ మాజీ నాయకులు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్లు కలిసేలా ఫొటో పోస్టు చేశారు. ఇందులో గులాం నబీ ఆజాద్ పేరుతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, హిమంత బిశ్వ శర్మ, అనిల్ ఆంటోని పేర్లు ఉన్నాయి. सच्चाई छुपाते हैं, इसलिए रोज़ भटकाते हैं! सवाल वही है - अडानी की कंपनियों में ₹20,000 करोड़ बेनामी पैसे किसके हैं? pic.twitter.com/AiL1iYPjcx — Rahul Gandhi (@RahulGandhi) April 8, 2023 దీనిపైనే స్పందిస్తూ ఆజాద్ రాహుల్‌పై ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబం అంటే తనకు ఇప్పటికీ అభిమానమే అని, అందుకే ఇంతకంటే ఎక్కువ ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడటానికి మాత్రం రాహుల్ గాంధీనే ప్రధాన కారణమని ఆజాద్ మరోసారి తేల్చిచెప్పారు. …their entire family (the Gandhis) have all along had association with businessmen, including him (Rahul Gandhi). He (Rahul) goes abroad and meets undesirable businessmen… - Ghulam Nabi Azad Rahul Gandhi must explain who are these businessmen he meets and for what purpose? pic.twitter.com/2juk0GlvhW — BJP (@BJP4India) April 9, 2023 కాగా.. అదానీ పేరులోని అక్షరంతో తన పేరును చూపడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు. అదానీతో సంబంధం లేని తనను ఈ వ్యవహారంలోకి లాగినందుకు రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్ -
విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్’ శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ముందడుగు వేసింది. మిడిల్ ఈస్ట్, యూరప్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో టీఏకేటీ గ్రూప్‌తో ఏపీఎస్ఎస్డీసీ, ఏపీఎన్ఆర్టీ ఎస్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ, ఏపీఎన్ఆర్టీ ఎస్ సీఈవో వెంకట్ ఎస్ మేడపాటి, టీఏకేటీ గ్రూప్ ఎండీ రాజ్‌సింగ్ సమక్షంలో పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వైద్యం, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లోని విదేశీ అవకాశాలపై టీఏకేటీ గ్రూప్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తొలి దశలో జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 15 మంది నర్సింగ్ అభ్యర్థులను ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. వీరికి జర్మనీ భాషపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో జర్మనీకి పంపిస్తారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు 192 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్ఎస్డీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. -
పాణిగ్రహణం.. దేశానికో సంప్రదాయం.. విదేశాల్లోని వింత సంప్రదాయాలివీ!
భారతదేశంలో వివాహం అనేది ఓ పవిత్ర కార్యం. రెండు హృదయాలను ఆలుమగలుగా మలిచే మనోహర ఘట్టం. వధూవరులు జీవితాంతం కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఒకరికొకరు హామీ ఇచ్చుకునే వివాహ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని పురాతనమైనవి కాగా.. మరికొన్ని ఆధునికమైనవి. కొన్ని తెగల్లో ఇప్పటికీ బహుభార్యత్వం కొనసాగుతోంది. కొన్ని తెగల్లో బహుభర్తృత్వం కూడా ఉంది. కొన్నిచోట్ల వివాహానికి ముందే కాపురం చేసి పిల్లల్ని కూడా కనడం.. ఆ తరువాత నచ్చితే పెళ్లి లేదంటే మరొకరితో సహజీవనం వంటి పద్ధతులూ ఉన్నాయి. కాగా.. విదేశాల్లో అమలులో ఉన్న కొన్ని వింత సంప్రదాయాలివీ... సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ వివాహ సంప్రదాయాన్నీ, వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటారు. అంత గొప్పది మన సంస్కృతి. అయితే జాతకాలను విశ్వసించే మన దేశంలో వధూవరులు పుట్టిన జాతకం (చార్ట్ మ్యాచింగ్) ఆధారంగా వివాహాలను నిశ్చయిస్తారు. వధువుకు కుజ దోషం ఉంటే.. భర్త చనిపోతాడనే నమ్మకం భారతదేశంలో ఉంది. దీనికి పరిహారంగా అమ్మాయికి చెట్టుతో పెళ్లి చేసి.. ఆ తరువాతే వరుడితో ముడిపెట్టడం ఆచారం. ఈ ప్రకారమే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకునే ముందు ఆమె మొదట ఒక చెట్టును వివాహం చేసుకుంది. ఒకవేళ వధువు ‘మంగ్లిక్’ అయితే శపించబడుతుందని నమ్ముతారు. కాగా.. వరుడి పాదరక్షల్ని దొంగిలించే (షూ గేమ్) విధానం భారతీయ వివాహ వేడుకల్లో ఒక సరదా. వధువు తరఫున యువతులు వరుడి పాదరక్షల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వరుడి సహచరులు వాటిని కాపాడతారు. ఒకవేళ వధువు సోదరీమణులు పాదరక్షల్ని దొంగిలించడంలో విజయం సాధిస్తే.. వాటిని తిరిగి పొందడానికి వరుడు డబ్బులివ్వాలి. భారతీయ వివాహాల్లో హెన్నాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వధువు చేతికి ఎర్రగా పండే హెన్నా ఆమె భర్త ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది. భారతీయ పెళ్లి తంతులో జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు ఉంచుకోవడం.. వధువు మెడలో వరుడు తాళి కట్టడం అనే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. వధువును విడిపించాలి రొమేనియాలో కొన్ని వివాహాల్లో వధువును స్నేహితులు, కుటుంబ సభ్యులు దాచడానికి ప్లాన్ చేస్తారు. భర్తను బెదిరించడానికి.. వధువును విడిపించడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. వరుడు ఆ మొత్తం చెల్లిస్తాడు. ‘టై’ ముక్కల వేలం స్పానిష్ వివాహ రిసెప్షన్ పార్టీలో వరుడి టైని ముక్కలుగా కోయడం కొందరు సంప్రదాయంగా పాటిస్తారు. ఆ ముక్కలను వేలం వేస్తారు. వాటిని పాడుకున్న వ్యక్తి ఆ క్షణం నుంచి అదృష్టవంతుడవుతాడని భావిస్తారు. ముద్దాడాలి మరి స్వీడన్లో కొన్ని పెళ్లిళ్లలో వధువు గది నుంచి బయటకు వచ్చిన వెంటనే వరుడిని ముద్దాడటానికి ఒంటరి మహిళలు క్యూలో ఉంటారు. వరుడు గదిని వధువు విడిచిపెట్టినప్పుడు యువకులు ముద్దాడుతారు. తెల్లటి డ్రెస్‌తో.. జపాన్‌లో అయితే.. పెళ్లి రోజున పైనుంచి కింది వరకు వధువు తెల్లటి డ్రెస్ ధరిస్తుంది. మహిళలు తెల్లని కిమోనోస్ ధరించి.. మేకప్ వేసుకుని.. వైట్ హుడ్ ధరిస్తారు. బరువు పెరిగితేనే.. పెళ్లికి ముందు అమ్మాయిలు స్లిమ్‌గా, ట్రిమ్గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేయడం సాధారణం. కానీ.. మారిషస్‌లో మాత్రం కొందరు బరువు తగ్గడానికి బదులుగా.. లావు పెరగాలి. వధువు ఎంత లావుగా కనిపిస్తే అంత ధనవంతులుగా కనిపిస్తారని నమ్ముతారు. అలాంటి వారినే వరుడు వరిస్తాడు. ఫ్రెంచ్ పద్ధతి ఇలా.. ఫ్రెంచ్ దేశస్తుల్లో కొందరు వివాహ విందులో టాయిలెట్ బౌల్ నమూనా ఏర్పాటు చేస్తారు. బంధుమిత్రులు తాము తినగా మిగిలిన ఆహారాన్ని అందులో పడేస్తే.. వధూవరులు ఆ ఆహారాన్నే ఆల్కహాల్ కలుపుకుని విందు భోజనంగా తినాలి. గుండుగీసి.. కెన్యా దేశస్తుల్లో కాబోయే భార్యను వరుడు ఎంచుకోవడానికి కొందరి కుటుంబ సభ్యులు అంగీకరించరు. అతని కుటుంబమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. పెళ్లి రోజున వధువు జుట్టు పూర్తిగా తీసేసి గుండుగీసి, తలపై గొర్రె కొవ్వుతో రుద్దుతారు. స్కాట్లాండ్లో ఇదీ పద్ధతి కొత్తగా వివాహం చేసుకున్న స్కాటిష్ వధువులను బంధువులు కట్టేసే సంప్రదాయం కొందరు పాటిస్తారు. సాస్, చేపలు, గుడ్లు, పిండి మొదలైన వాటిని వారికి పూసి స్నానం చేయిస్తారు. శుభ్రం చేయాలి మరి.. జర్మనీలో అయితే.. కొన్ని పెళ్లిళ్లలో స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేస్తారు. దీనికి హాజరైన వారు నేలపై పింగాణీ పాత్రల్లో ఉన్న వంటకాలను నాశనం చేసి ప్లేట్లు పగులగొడతారు. వధూవరులిద్దరూ కలిసి దానిని శుభ్రం చేయాలి. నెలపాటు ఏడవాలి మరి వధువును బాణంతో కొట్టడం చైనా వివాహ సంప్రదాయంలో ఒకటి. పెళ్లి కూతుర్ని కొట్టడానికి పెళ్లికొడుకు మూడుసార్లు బాణాలను ప్రయోగిస్తాడు. పెళ్లిలో కాకున్నా వరుడు జీవితకాలంలో ఒకసారి వధువును ఇలా కొట్టవచ్చు. మరో ఆచారం ఇక్కడ ఉంది. పెళ్లి కుదిరిన తరువాత వధువు ఒక నెల పాటు క్రమం తప్పకుండా రోజూ ఓ గంటపాటు ఏడవాలి. మూడు వారాల ముందు ఆమె తల్లి, వారం గ్యాప్‌లో సోదరి, అమ్మమ్మ ఏడుపు మొదలు పెడతారు. -
విదేశాల్లో చదువుకుంటున్నారా? కేంద్రం భారీ షాక్!
విదేశాల్లు చదువుకునే విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు కేంద్రం భారీ షాకిచ్చింది. యూనియన్ బడ్జెట్-2023 లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఏడాది జులై నుంచి విదేశాల్లో చదువుకు ఇతర ఖర్చుల కోసం పంపించే డబ్బుపై కేంద్రం ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) ట్యాక్స్‌ను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. సరళీకృత చెల్లింపుల పథకం (liberalised remittance scheme – LRS) కింద వసూలు చేసేవిదేశీ ప్రయాణాలు,పెట్టుబడులు, నగదు ట్రాన్స్‌ఫర్‌పై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్‌లో ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి రోజువారీ ఖర్చులకు తల్లిదండ్రులు పంపే మనీ.. వారి కాలేజీ ఫీజు సంబంధిత ఖర్చులకు కిందకు రావు. విదేశీ విద్యకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చెల్లిస్తే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ కింద ఎడ్యూకేషన్ లోన్ తీసుకొని విదేశాల్లో చదువు నిమిత్తం పంపే డబ్బు రూ.7లక్షలు దాటితే 0.5 శాతం ట్యాక్స్ కట్టాలి. అయితే, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా ఇతర లోన్లు తీసుకొని విదేశాలకు రూ.7లక్షలకు మించి పంపితే 5శాతం ట్యాక్స్ పడుతుంది. ఇతర ఖర్చులపై 20శాతం ట్యాక్స్ విదేశాలకు చెందిన కాలేజీ క్యాంపస్‌లోని హాస్టల్స్ ఉండి చదువుకునే పిల్లలకు హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు చెల్లించేందుకు డబ్బులు పంపుతున్నట్లు తల్లిదండ్రులు ఆధారాలు చూపించాలి. అలా కాకుండా రోజువారీ ఖర్చులకు పంపితే మాత్రం 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో ఏ-2 ఫామ్ తప్పని సరి ఎల్ఆర్ఎస్ విధానంలో భాగంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నామో తెలుపుతూ బ్యాంకులో ఏ-2 ఫామ్ నింపాలి. అందులో ఏ అవసరాలకు చెల్లిస్తున్నారో తెలుపుతూ డిక్లరేషన్ ఫామ్ సంతకం చేయాలి. అక్కడ మీరు మీ పిల్లల విద్యావసరాలకు కాకుండా ఇతర అవసరాల కోసం డబ్బులు పంపుతున్నారని తేలితే 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. -
ఖమ్మం మిర్చి.. విదేశాల్లో క్రేజీ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చి అంటేనే హాట్.. కానీ ఖమ్మం మిర్చి మరింత హాట్.. ఎందుకంటే విదేశాల్లో ఈ మిర్చికి హాట్ హాట్‌గా డిమాండ్ పెరిగిపోతోంది. ఖమ్మం రైతులు పండిస్తున్న మిర్చిలో 70శాతం మేర చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఘాటు ఎక్కువగా ఉండే తేజ రకం మిర్చి ఎక్కువగా సాగు చేయడం, తెగుళ్లు వంటివి పెద్దగా లేకుండా నాణ్యమైన దిగుబడులు రావడంతో డిమాండ్ మరింత పెరిగిందని రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ఏటా రూ.2 వేల కోట్లకుపైగా మిర్చి ఎగుమతి అవుతుండటం గమనార్హం. ఖమ్మం టు చైనా.. వయా చెన్నై తామర పురుగు బెడదతో రైతులు ఈసారి ముందుగానే మిర్చిని సాగు చేయగా జనవరి నుంచే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షకుపైగా ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. సమీపంలోని సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, హనుమకొండ, ఏపీలోని కృష్ణా, గుంటూరు రైతులు కూడా ఖమ్మం మార్కెట్లో మిర్చి విక్రయిస్తారు. వ్యాపారులు విదేశాల నుంచి ఆర్డర్లు తీసుకుని ఇక్కడ మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఆ మిర్చిని వాహనాల్లో చెన్నైతోపాటు తమిళనాడులోని కాట్పల్లి, ఆంధ్రాలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, ముంబై పోర్టులకు తరలించి నౌకల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా చైనాలో ఎక్కువ కారం ఉండే మిర్చి దొరకకపోవడంతో.. ఖమ్మం మిర్చిని దిగుమతి చేసుకుంటారని వ్యాపారులు చెప్తున్నారు. 3రూపాల్లో ఎగుమతి.. మన దేశంలో ఎక్కువగా పొడి కారం వినియోగిస్తారు. విదేశాల్లో నేరుగా ఎక్కువగా వాడుతారు. ఈ క్రమంలోనే మూడు రకాలుగా.. ఫుల్ మిర్చి (పూర్తిస్థాయి మిరప), స్టెమ్కట్ (తొడిమ కత్తిరించి), స్టెమ్‌లెస్ (తొడిమ పూర్తిగా తొలగించి) మిర్చిగా ఎగుమతులు జరుగుతాయి. స్టెమ్కట్ కోసం యంత్రాలను ఉపయోగిస్తారు. స్టెమ్‌లెస్ విధానంలో పంపే వ్యాపారులు మహారాష్ట్ర, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఖమ్మంలో కొనుగోలు చేసి తీసుకెళ్లారు. మిర్చి ఆయిల్ రూపంలోనూ.. చైనా వంటి దేశాల్లో మిర్చిని కాయల రూపంలో వాడితే.. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో మిర్చి నుంచి తీసిన ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఇందుకోసం మిర్చి నుంచి నూనె తీసే కంపెనీలు ఖమ్మం జిల్లా ముదిగొండ, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మన్నెగూడం, మరిపెడ బంగ్లా, హైదరాబాద్‌లోని శ్రీశైలం రోడ్డులో ఉన్న కందుకూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. 100 కేజీల మిర్చిని ప్రాసెస్ చేస్తే 8.50 కేజీల పొడి, కేజీన్నర ఆయిల్, మిగతా పిప్పి వస్తుందని చెప్తున్నారు. మిర్చి ఆయిల్‌ను ఆహార పదార్థాల్లో వినియోగించడంతోపాటు సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, టియర్ గ్యాస్, కాస్మొటిక్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. చైనా రెస్టారెంట్లలో మన మిర్చే.. చైనాలో హాట్ పాట్ రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే సిద్ధం చేసిన ఆహారం కాకుండా.. దినుసులు అందజేస్తారు. వాటితో సిద్ధం చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలో వినియోగదారులకు 10 నుంచి 15 వరకు స్టెమ్‌లెస్ మిర్చి ఇస్తారు. ఇందుకోసం ఖమ్మం నుంచి దిగుమతి చేసుకునే మిర్చినే వినియోగిస్తారని వ్యాపారులు చెప్తున్నారు. విదేశాల్లో ఖమ్మం మార్కెట్‌కు గుర్తింపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పండే మిర్చి నాణ్యత బాగుండటంతో ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం కూడా వ్యాపారులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. – దోరేపల్లి శ్వేత, చైర్పర్సన్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎనిమిదేళ్లుగా ఎగుమతి చేస్తున్నా.. మా నాన్న మిర్చి రైతు. నేను ఎనిమిదేళ్లుగా విదేశాలకు ఎగు మతి చేస్తున్నాను. తేజ రకానికి విదేశాల్లో డిమాండ్ ఉంది. – బొప్పన జగన్మోహన్రావు, మిర్చి ఎగుమతిదారు, ఖమ్మం దిగుబడి బాగుంది ఐదేళ్లుగా తేజ రకం సాగు చేస్తున్నా. ఈసారి మూడెకరాల్లో సాగు చేశా. మొదటితీతలో 30 క్వింటాళ్ల దిగుబడి రాగా.. మరో 30 క్వింటాళ్లు వస్తుంది. క్వింటాల్‌కు రూ.18,200 ధర వచ్చింది. – బానోత్ శంకర్, రైతు, మహబూబాబాద్ జిల్లా -
అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. 14 రోజుల్లోనే వీసా..!
న్యూఢిల్లీ: అమెరికా వీసా ఆశావహులు ప్రస్తుతం భారత్‌లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. బీ1, బీ2 వీసాల కోసం వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. మొదటిసారి దరాఖాస్తుదారుల్లా అందరికీ ఇంటర్వ్యూ మినహాయింపు లేకపోవడంతో వీసా అపాయింట్మెంట్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే భారతీయుల కోసం ఈ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తోంది అమెరికా. బ్యాంకాక్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లోని అమెరికా ఎంబసీలు భారతీయులు బీ1, బీ2 వీసాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రెండు మూడు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితమే అమెరికా వీసా గడువు ముగిసిన భారతీయులు ఈ దేశాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వీసా త్వరగా లభిస్తుంది. ప్రస్తుతం కోల్‌కతా నుంచి అమెరికా బీ1, బీ2 వీసాల కోసం ధరఖాస్తు చేస్తే ఇంటర్వ్యూ కోసం 589 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. ముంబై నుంచి అయితే ఏకంగా 638 రోజులు వేచి చూడాలి. చెన్నైలో అయితే 609 రోజులు, హైదరాబాద్‌లో అయితే 596 రోజులు, ఢిల్లీలో అయితే 589 రోజులు వెయిట్ చేయాలి. కానీ భారతీయులు బ్యాంకాక్ వెళ్లి అక్కడి అమెరికా ఎంబసీ నుంచి వీసా కోసం దరఖాస్తు చేస్తే 14 రోజుల్లోనే ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తవుతుంది. వీసా త్వరగా రావాలనుకునే వారు ఈ దేశాలకు వెళ్తే సరిపోతుంది. జనవరిలో తాము లక్ష వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ శనివారం వెల్లడించింది. 2019 జులై తర్వాత ఒక్క నెలలో ఇన్ని దరఖాస్తులు పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రానున్న రోజుల్లో సిబ్బంది పెరుగుతారు కాబట్టి ఇంకా ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేస్తామని పేర్కొంది. కరోనా సమయంలో అమెరికా ఎంబసీలు వేల మంది సిబ్బందిని ఇంటికి పంపాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిలో కొంతమందిని మాత్రమే తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. ఈ కారణంగానే వీసాల జారీ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. అయితే భారతీయుల కోసం అమెరికా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. బీ1, బీ2 వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చింది. చదవండి: డబ్బు ఉందా?.. దుబాయ్‌లో మంచి ఇల్లు.. బోలెడు రెంటు.. ఆపై గోల్డెన్ వీసా -
ప్రధాని మోదీ ఫారిన్ టూర్ల ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ఇప్పటి వరకు అయితే విదేశీ పర్యటనల ఖర్చు 22. 76 కోట్ల రూపాయలకుపై మాటేనని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కాలంలో మోదీ 21 విదేశీ పర్యటనలు చేశారని, ఈ పర్యటనల కోసం రూ. 22.76 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 2019 నుండి, ప్రధాని జపాన్ను మూడుసార్లు, అమెరికా, యుఎఇలను రెండుసార్లు సందర్శించారు. అలాగే 2019 నుండి రాష్ట్రపతి ఎనిమిది పర్యటనలలో అప్పటి దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఏడు, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక విదేశీ పర్యటన ( గత సెప్టెంబర్‌లో యూకేనుసందర్శించారు) ఈ పర్యటనల కోసం రూ. 6.24 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 2019 రాష్ట్రపతి ఎనిమిది విదేశీ పర్యటనల మొత్తం ఖర్చు 6,24,31,424, ప్రధానమంత్రి పర్యటన ఖర్చు రూ.22,76,76,934 అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలు చేయగా దీని వ్యయం రూ. 20,87,01,475 అని కేంద్రం వెల్లడించింది. -
ఇద్దరు ప్రయాణికులకు కరోనా
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని గుర్తించారు. ఇద్దరూ దుబాయ్ నుంచి ఇక్కడకు వచ్చినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అందులో ఒక వ్యక్తి (55 ఏళ్లు) ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ వచ్చారు. అలాగే మరో వ్యక్తి (26 ఏళ్లు) ఈ నెల 26వ తేదీన వచ్చారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. సాధారణ వేరియంట్ సోకిందా లేక బీఎఫ్ 7 ఉందా అనేది తెలుసుకోనున్నారు. కాగా, వారిని ఐసోలేషన్‌కు తరలించారా లేదా అన్న వివరాలను వైద్య వర్గాలు వెల్లడించడంలేదు. ఆ ఇరువురి ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, నమోదవుతున్న కరోనా కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 25 నమూనాలను లేబొరేటరీకి పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అందులో 11 ఎక్స్‌బీబీ ఉపరకం వేరియంట్ కేసులు, మిగిలినవి బీఏ 2 ఉపరకం కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. మరోవైపు రాష్ట్రంలో బుధవారం 5,580 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. -
విదేశీ బ్లాక్స్‌పై కోల్ ఇండియా కన్ను
న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశాలలో ఎలాంటి కోల్ బ్లాకులూలేని పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాకు త్వరలో ఈ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇందుకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇకపై విదేశాలలో బొగ్గు గనుల కొనుగోలు అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు ఆయా క్షేత్రాలపట్ల పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టవలసి ఉంటుంది. ప్రధానంగా తక్కువ యాష్గల కోకింగ్ కోల్ బ్లాకుల కొనుగోలుకి అనుమతించనున్నారు. దీంతో శిలాజ ఇంధనలాకు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా విదేశాలలో మైనింగ్‌పై కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంటుందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను పరిగణిస్తూ విదేశాలలో కోల్ బ్లాకులను కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫారసు చేస్తోంది. బొగ్గు శాఖ లేదా కోల్ ఇండియా ఇందుకు సిద్ధపడవచ్చని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో బొగ్గు, గనులు, స్టీల్‌పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ పేర్కొంది. 2009లో.. పూర్తి అనుబంధ సంస్థ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటాడా ద్వారా నిజానికి 2009లోనే కోల్ ఇండి యా మొజాంబిక్‌లోని కోల్ బ్లాకుల కొనుగోలుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను సొంతం చేసుకుంది. లోతైన అన్వేషణ, జియోలాజికల్, మైనింగ్ అవకాశాల నివేదికను అధ్యయనం చేశాక బొగ్గు నాణ్యత విషయంలో వెనకడుగు వేసింది. ఇక్కడ బొగ్గు వెలికితీత వాణిజ్యపంగా ఆచరణ సాధ్యంకాదని గుర్తించింది. ఫలితంగా బొగ్గు గనుల కొను గోలు లాభదాయకంకాదని 2016లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను తిరిగి మొజాంబిక్ ప్రభుత్వానికి దాఖలు చేసింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండి యా 80 శాతాన్ని ఆక్రమిస్తున్న విషయం విదితమే. -
తనను విడిచి కొడుకు విదేశాలకు.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు(క్రైమ్): కొడుకు తనను విడిచి విదేశాలకు వెళ్తున్నాడని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని న్యూమిలటరీ కాలనీ 6వ క్రాస్‌రోడ్డులోని సాయిబాబా మందిరం వద్ద చల్లా పెంచల నరసింహారెడ్డి, విజయకుమారి (45) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి సదాశివారెడ్డి, భరత్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడైన భరత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, పెద్ద కుమారుడు సదాశివారెడ్డి బీటెక్ పూర్తి చేయగా, ఫారిన్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అతను వెళ్లడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈక్రమంలో పెంచల నరసింహారెడ్డి అయ్యప్పమాల వేసి ఈనెల 18వ తేదీన శబరిమలకు వెళ్లాడు. దీంతో సదాశివారెడ్డి తల్లి విజయకుమారితో తాను విదేశాలకు వెళ్తానని చెప్పాడు. ఇంటి బాధ్యతలు చూసుకోవాలని, అలా కాకుండా విదేశాలకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె కొడుక్కి చెబుతూ ఉండేది. అయినా సదాశివారెడ్డి మాత్రం ఈనెల 25వ తేదీన విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయకుమారి బుధవారం ఇంట్లోని బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వేదాయపాళెం పోలీసులకు భరత్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (దేశం కాని దేశంలో.. మన కుర్రాళ్ల ఇబ్బందులు) -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఇక విదేశాల్లో రయ్..రయ్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. తొలుత నేపాల్‌లో ప్రవేశిస్తోంది. ఇందుకోసం సీజీ మోటార్స్‌తో పంపిణీ ఒప్పందం చేసుకుంది. వచ్చే త్రైమాసికం నుంచే ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఎగుమతి చేస్తామని ప్రకటించింది. రెండవ దశలో లాటిన్ అమెరికా, ఆసియాన్, యూరోపియన్ యూ నియన్‌కు విస్తరించనున్నట్టు వెల్లడించింది. చదవండి : బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్ -
ఏం జరిగింది?.. విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు డౌన్
ముంబై: భారత కంపెనీలు విదేశాల్లోని తమ వెంచర్లలో చేసే పెట్టుబడులు ఆగస్ట్ నెలలో 59 శాతం తగ్గి 1.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో భారత కంపెనీలు విదేశాల్లో చేసిన పెట్టుబడులు 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి పెట్టుబడులు చూసినా, 1.12 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్.. సింగపూర్‌లోని తన సబ్సిడరీలో 319 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ స్విట్జర్లాండ్‌లోని సబ్సిడరీలో 100 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. (క్లిక్: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట) -
విదేశీ చదువుల్లో ఏపీ దూకుడు
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే అగ్రస్థానంలో ఉన్నారు. 2016 నుంచి 2021 వరకు ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో 15 శాతం మంది ఏపీ విద్యార్థులే కావడం విశేషం. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 2019–2020లో కరోనా కారణంగా విదేశాలు రాకపోకలపై నిషేధం విధించాయి. పలు దేశాలు వీసాల మంజూరును నిలిపేయడంతో విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో విదేశాల్లో చదువులకు వెళ్లినవారు సైతం వెనక్కి వచ్చేశారు. అగ్రభాగాన ఏపీ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఏటా ఏపీ నుంచే అత్యధిక శాతం మంది ఉంటున్నారు. దేశం మొత్తం మీద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2016లో 3,71,506 మంది విదేశాలకు వెళ్లారు. వీరిలో ఏపీ విద్యార్థులు 12.43 శాతం మంది ఉన్నారు. ఇక 2017లో 4,56,823 మంది వెళ్లగా వారిలో ఏపీ విద్యార్థుల శాతం.. 12.27. అలాగే 2018లో 5,20,342 మంది విదేశాలకు వెళ్లగా 12.06 శాతం మంది ఏపీ విద్యార్థులే. 2019లో 5,88,931 మందికిగాను ఏపీ విద్యార్థుల శాతం.. 11.79గా ఉంది. 2020లో 2,61,604 మంది విదేశీ విద్యార్థుల్లో 13.62 శాతం మంది ఏపీ విద్యార్థులున్నారు. ఇక ఈ ఏడాది విదేశాలకు వెళ్లిన 71,769 మందిలో 16.42 శాతం మంది ఏపీ విద్యార్థులే ఉండడం విశేషం. (చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు) 2020లో తగ్గిపోయిన విద్యార్థులు.. 2020 తర్వాత గణాంకాలను పరిశీలిస్తే.. దేశం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్య ఆ ఏడాది ఒక్కసారిగా పడిపోయింది. కాగా, గత ఆరేళ్లలో 2019లో అత్యధికంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఆ ఏడాది దేశం నుంచి 5,88,931 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఇది 2020లో 2,61,406కు తగ్గిపోయింది. 2020 తర్వాత అత్యధిక కాలం ప్రవేశ నిషేధాలు అమలు కావడం, వీసాలు నిలిపివేయడం విదేశీ చదువులపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా సహా కొన్ని దేశాలు నిషేధాలను పాక్షికంగా సవరించాయి. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక వీసాల మంజూరును ప్రారంభించాయి. ఈ ఏడాది మంజూరైన వీసాలను బట్టి 71,769 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. వీరిలోనూ ఏపీ విద్యార్థులే అత్యధికం. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 11,790 మంది విదేశీ చదువులకు వెళ్లారు. ఏపీ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర నుంచి 10,166 మంది, గుజరాత్ నుంచి 6,383 మంది, పంజాబ్ నుంచి 5,791 మంది, తమిళనాడు నుంచి 4,355 మంది, కర్ణాటక నుంచి 4,176 మంది ఉన్నారు. (చదవండి: ఆరోగ్యంలో అగ్రపథం.. టాప్ 5లో ఏపీ) -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ..హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్‌కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్-2 వీసా, ఎఫ్-ఎమ్ వీసా, ఎకాడమిక్ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్ అధికారులకు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్ అధికారులు ఇన్‌పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది. చదవండి: విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం -
మాజీ ప్రధాని ప్రాణాలకు ముప్పు.. విదేశాలకు వెళ్లడానికి అనుమతివ్వండి
ఢాకా: గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, విపక్షనేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు(బీఎన్పీ) ఖలేదా జియా(76)ను వైద్యం కోసం విదేశాలకు పంపించకపోతే.. ఆమె జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు విదేశాల్లో అత్యాధునిక వైద్య చికిత్స చేయడం చాలా ముఖ్యం అని లేకుంటే జియా జీవితానికే ప్రమాదం అని తెలిపారు. ఆమెకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2018లో అవినీతి ఆరోపణలపై దోషిగా తేలిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన జియాను దేశం విడిచి వెళ్లకుండా కోర్టు నిషేధించింది. గత రెండు వారాల్లో ఆమెకు మూడుసార్లు భారీ అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా జియాకు చికిత్స అందిస్తోన్న ప్రధాన వైద్యుడు ఫకృద్దీన్ మొహమ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘మా దగ్గర అత్యాధునిక వైద్య సాంకేతికత అందుబాటులో లేదు. ముఖ్యంగా రక్తస్రావాన్ని నియంత్రించడానికి, ఆపడానికి కావాల్సిన అత్యాధునిక వైద్య సదుపాయాలు మా దేశంలో లేవు’’ అని తెలిపారు. (చదవండి: లైంగిక ఆరోపణలకు రివెంజ్!.. నటి అరెస్ట్‌తో ఉలిక్కిపాటు) వచ్చే వారంలో జియాకు మరో అంతర్గత రక్తస్రావం అయ్యేందుకు 50 శాతం అవకాశం ఉందని, వచ్చే ఆరు వారాల్లో 70 శాతం ఉందని సిద్ధిఖీ తెలిపారు. ఇది ఇలానే కొనసాగితే ఆమె ప్రాణాలకే ప్రమాదం అన్నారు. ‘‘జియా ప్రాణాలు కాపాడాలంటే.. అధునాతనమైన వైద్య చికిత్స ‘టిప్స్’(TIPS) చేయించాలి. అది కేవలం అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే వైద్యం నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి జియాకు అనుమతివ్వాలి’’ అని సిద్ధిఖీ కోరారు. (చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో...) కోవిడ్ నుంచి కోలుకున్న ఐదు నెలల తర్వాత జియా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో 2021, నవంబర్ 13 నుంచి జియాను ఢాకా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో బీఎన్పీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమెను చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చదవండి: చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు -
విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు రెట్టింపు
ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జూన్‌లో విదేశాల్లో ప్రత్యక్షంగా పెట్టిన పెట్టుబడులు 2.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్ నాటి 1.39 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అయితే, వార్షికంగా పెరిగినప్పటికీ నెలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది మేలో నమోదైన 6.71 బిలియన్ డాలర్ల కన్నా జూన్‌లో పెట్టుబడులు సుమారు 58 శాతం తక్కువ కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్ డాలర్లు పూచీకత్తు రూపంలో, 1.21 బిలియన్ డాలర్లు రుణంగాను, మరో 427 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి రూపంలోను నమోదైంది. భారీ పెట్టుబడుల్లో టాటా స్టీల్ .. సింగపూర్‌లోని తమ అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు, విప్రో తమ అమెరికా విభాగంలో 787 మిలియన్ డాలర్లు, టాటా పవర్ .. మారిషస్‌లోని యూనిట్లో 131 మిలియన్ డాలర్లు మొదలైన డీల్స్ ఉన్నాయి. డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ విదేశ్, పహార్పూర్ కూలింగ్ టవర్స్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలైనవి విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవి 45 మిలియన్ డాలర్ల నుంచి 56 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇది ప్రాథమిక డేటా మాత్రమేనని, అధీకృత డీలర్ బ్యాంకుల నివేదికలను బట్టి మారవచ్చని ఆర్బీఐ పేర్కొంది. -
Delhi: విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రం
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం చెప్పారు. మందిర్ మార్గ్‌లోని నవ్యుగ్ పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకొని 28 రోజులు గడిచిన వారు ఈ కేంద్రానికి వచ్చి రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. వచ్చేవారు తమ పాస్‌పోర్టులను, ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేవారికి వేగంగా వ్యాక్సినేషన్ చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సెంటర్లో కోవిïÙల్డ్ వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఆగస్టు 31లోగా వెళ్లేవారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: పీఎం కేర్స్ నిధులతో 850 ఆక్సిజన్ ప్లాంట్లు -
విదేశాల్లో పేటెంట్లే ఎక్కువ..
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన పరిశోధకులు, సైటింస్టులు, ఆవిష్కరణకర్తలకు భారత్‌లో కంటే విదేశాల్లోనే వేగంగా పేటెంట్ హక్కులు వస్తున్నాయని తేలింది. గడచిన పదేళ్ల కాలంలో విదేశాల్లో భారతీయులు దాఖలు చేసిన ప్రతి 10 పేటెంట్లలో నాలుగు పేటెంట్లు అనుమతులు పొందగా, భారత్‌లో భారతీయులే దాఖలు చేసిన ప్రతి 10 పేటెంట్లలో ఒక్కటి మాత్రమే అనుమతి పొందింది. భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసిన విదేశీయులకు ఎక్కువ శాతం అనుమతులు రావడం కూడా గమనార్హం. ఈ వివరాలన్నింటిని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (విపో) వెల్లడించింది. పేటెంట్ డేటా ఇదీ.. విపో వెల్లడించిన వివరాల ప్రకారం 2010 నుంచి 2019 మధ్య 1.2లక్షల మంది భారతీయులు మన దేశంలో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో కేవలం 13,670 మాత్రమే అనుమతులు పొందాయి. అయితే భారతీయులు విదేశాల్లో 1.07 లక్షల దరఖాస్తులు పేటెంట్ల కోసం పెట్టుకోగా వాటిలో ఏకంగా 44,477 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గత పదేళ్లలో విదేశీయులు భారత్‌లో 3.2లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటిలో ఏకంగా 76,637 పేటెంట్లకు అనుమతి లభించింది. అంటే భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసుకునే భారతీయుల్లో కేవలం 10.8శాతం మందికి అనుమతులు వస్తుంటే, భారత్‌లో పేటెంట్లు దాఖలు చేసే విదేశీయులకు 23.4 శాతం అనుమతులు లభిస్తున్నాయి. ఖర్చు కూడా ఓ కారణమే.. పేటెంట్ల కంట్రోల్ జనరల్ రాజేంద్ర రత్నూ ఈ విషయంపై స్పందిస్తూ.. భారత్‌లో పేటెంట్ దరఖాస్తుకు అయ్యే ఖర్చు రూ. 10 వేల లోపే ఉంటుందని, అయితే ఇదే అమెరికాలో రూ. 1.5లక్షల వరకూ ఉంటుదన్నారు. ధర తక్కువగా ఉంటడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారని, అమెరికాలో మాత్రం ఖర్చు అధికం కావడంతో పూర్తిస్థాయిలో పరిశోధన చేపట్టిన వారే దరఖాస్తు చేసుకుంటూ ఉంటారని అన్నారు. అందుకే పేటెంట్లు దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలని చెప్పారు. -
యూరప్ నుంచి భారతీయులు వెనక్కి
సాక్షి, హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్‌తో గడగడలాడుతున్న యూరప్, అమెరికా తదితర దేశాలు అక్కడున్న విదేశీయులను వెనక్కు పంపించేస్తున్నాయి. ఉద్యోగులు, కూలీలు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం ఆ దేశాలకు వెళ్లిన ఇక్కడి వారు తిరిగొస్తున్నారు. అక్కడ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న మనవారిని కూడా పంపించేస్తున్నారంటే కరోనా సెకండ్ వేవ్‌తో ఆ దేశాలు ఎలా వణికిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం హైదరాబాద్‌కు ప్రతిరోజూ విదేశాల నుంచి 11 అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. అందులో నిత్యం దాదాపు 2 వేల మంది ప్రయాణికులు వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆయా దేశాల్లో కరోనా నెగెటివ్ టెస్టు రిపోర్టులు పట్టుకొని వస్తుండగా, కొందరైతే హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాక పరీక్షలు చేయించుకుంటున్నారు. అందుకోసం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసే లేబొరేటరీని ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్‌తో పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైద్యం అందరికీ అందించడం ఆయా దేశాలకు సవాల్‌గా మారింది. అందువల్ల అవకాశమున్నంత మేరకు విదేశీయులను వారి దేశాలకు పంపించేస్తున్నాయి. హైదరాబాద్‌కు విమానాల ద్వారా బ్రిటన్, అమెరికా దేశాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇటు సింగపూర్, దుబాయ్‌ల నుంచి కూడా కొందరు వస్తున్నారు. యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన వారు లండన్‌కు వచ్చి అక్కడి నుంచి ఇక్కడకు చేరుకుంటున్నారు. వీరేగాక ఆయా దేశాల్లో విమానాలు ఎక్కిన వారు ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో దిగి దేశంలో స్థానిక విమానాల ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇటు ఆయా దేశాల నుంచి వచ్చే ఖైదీల్లో కొందరు హైదరాబాద్‌లో దిగాక కనీసం హోటల్ క్వారంటైన్లో కూడా ఉండలేని దుస్థితి నెలకొంది. డబ్బులు లేవని, తమను విడుదల చేసి పైసా చేతిలో పెట్టకుండా పంపించేశారని వారంటున్నారు. మరో 10 విమానాలకు అనుమతి.. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగటంతో మరిన్ని విమానాలు నడిపేందుకు కొన్ని విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించేలా, అందుకు అవసరమైన సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. మరో పది విమానాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య రోజుకు మరో 4 వేల మంది వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. కరోనా కారణంగానే తాము ఇక్కడకు వస్తున్నట్లు, ఆయా దేశాల ప్రభుత్వాలు పంపించి వేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. యూరప్ వంటి దేశాల్లో కరోనా టెస్టులు చేయించుకోవడం కూడా కష్టంగా మారిందని.. ఇక్కడ కరోనా పరీక్షలు విమానాశ్రయంలోనే చేస్తుండటంతో కొంతమేరకు ఊరటగా ఉందని అంటున్నారు. విదేశాల నుంచి వేలాది మంది వస్తుండటంతో కరోనా నెగెటివ్ రిపోర్టులు చూడడం, రిపోర్టులు లేని వారికి పరీక్షలు చేస్తుండటంతో విమానాశ్రయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. జైలు నుంచి పంపించేశారు.. ఒక నేరం విషయంలో ఇటలీలో నాకు జైలు శిక్ష విధించారు. దాదాపు రెండేళ్లుగా జైలులోనే ఉన్నాను. మొదటి విడత కరోనా వచ్చిన సమయంలో ఇటలీ వణికిపోయింది. నేనున్న జైలులో అనేకమంది కరోనా బారిన పడ్డారు. కొందరు చనిపోయారు. ఇప్పుడు అక్కడ సెకండ్ వేవ్ మొదలు కావడంతో పరిస్థితి ఘోరంగా మారింది. జైళ్లను ఖాళీ చేస్తున్నారు. నేరస్తుల కంటే కరోనా ప్రమాదంగా మారడంతో వదిలేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ఖైదీలను వారి దేశాలకు పంపించేస్తున్నారు.. – ఇటలీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు లండన్‌లో దారుణంగా పరిస్థితి.. నేను లండన్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మొదటి విడత కరోనా కారణంగా ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోయింది. సెకండ్ వేవ్ మొదలు కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం నేను పనిచేసే కంపెనీ మూతపడింది. ఏ దిక్కులేక మన రాష్ట్రానికి తిరిగి వచ్చాను.. – బ్రిటన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు -
విదేశాలకు మన వంగడాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఏటా రూ.2,000 కోట్ల విలువైన విత్తనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో టమాట, మిరప, పుచ్చకాయ, మొక్కజొన్న తాలూకు విదేశీ వెరైటీలు కూడా ఉన్నాయి. పలు విదేశీ కంపెనీలు ఇక్కడి రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని విత్తనాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల విలువైన విదేశీ వెరైటీల విత్తనాల ఎగుమతి జరుగుతోంది. ఇక్కడి విత్తనాలకు విదేశాల్లో మార్కెటింగ్, సర్టిఫికేషన్, సబ్సిడీలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తే అయిదేళ్లలో మొత్తం ఎగుమతులు నాలుగు రెట్లకు చేరడం ఖాయమని సీడ్స్‌మెన్ అసోసియేషన్ అంటోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు మరింత ప్రయోజనమని చెబుతోంది. నాబార్డు సహకారంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని అసోసియేషన్ ధీమాగా ఉంది. విత్తన భాండాగారాలు.. తెలుగు రాష్ట్రాలు విత్తన భాండాగారాలుగా విరాజిల్లుతున్నాయి. వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 60 శాతంగా ఉంది. మొక్కజొన్న, జొన్న విత్తనాల్లో 90 శాతం, సజ్జలు 85 శాతం, వరి 60 శాతం, పత్తి విత్తనాల్లో 50 శాతం తెలుగు రాష్ట్రాలు సమకూరుస్తున్నాయి. ఇక రూ.200 కోట్ల విలుౖÐð న కూరగాయల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల్లో 90 శాతం ఇక్కడ కొలువుదీరాయని సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కార్న్టెక్ సీడ్స్ సీఈవో యాగంటి వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా రైతులు విత్తన సాగులో నిమగ్నమయ్యారని చెప్పారు. రబీకి పెరగనున్న విక్రయాలు.. కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన, ఉద్యోగాలు వదులుకున్న యువత తిరిగి గ్రామాల బాట పట్టారు. వీరిప్పుడు వ్యవసాయంపై దృష్టిసారించారని కంపెనీలు అంటున్నాయి. మరోవైపు వర్షాలు దేశవ్యాప్తంగా అంచనాలను మించి కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పరిశ్రమ 5 శాతం వృద్ధి సాధించింది. రబీకి విత్తన అమ్మకాలు 20–25 శాతం అధికం కావచ్చని పరిశ్రమ భావిస్తున్నట్లు రాశి సీడ్స్ సీవోవో ఏ.ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఎంక్వైరీలనుబట్టి చూస్తే సాగు విస్తీర్ణమూ పెరగనుందని అన్నారు. రెండున్నర దశాబ్దాల్లో కూరగాయల ఉత్పత్తి మూడు రెట్లు అధికమైందని ఈస్ట్–వెస్ట్ సీడ్ ఎండీ దిలీప్ రాజన్ వెల్లడించారు. కాగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్–19 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేదని.. ఇందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించడమే కారణమని సీడ్స్‌మెన్ అసోసియేషన్ తెలిపింది. పరిశోధనకు రూ.2 వేల కోట్లు.. దేశవ్యాప్తంగా విత్తన పరిశ్రమ ఏటా 5–10 శాతం వృద్ధితో రూ.30,000 కోట్లకు చేరుకుంది. ఇందులో కూరగాయల విత్తనాల విలువ రూ.3,000 కోట్ల మేర ఉంది. మొత్తం ఎగుమతులు రూ.2,000 కోట్ల మేర జరుగుతున్నాయి. 2,000 కంపెనీలు పరిశ్రమలో నిమగ్నమయ్యాయి. ఇందులో 500 దాకా కంపెనీలు జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి విభాగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జీనోమ్ ఎడిటింగ్ సాంకేతిక విధానంపై ఫోకస్ చేయనున్నందున వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పరిశోధన, అభివృద్ధి విభాగంలో రానున్నాయి. 16 లక్షల మంది రైతులతో కంపెనీలు చేతులు కలిపాయి. శాస్త్రవేత్తలు, తయారీ, మార్కెటింగ్ సిబ్బంది ఒక లక్ష వరకు ఉంటారు. -
కరోనా సంక్షోభం : కేరళకు లక్షల్లో రిజిస్ట్రేషన్లు
సాక్షి, తిరువనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో విదేశాల్లో వుంటున్నలక్షలాదిమంది కేరళీయులు తిరిగి కేరళ రాష్ట్రానికి రావాలని భావిస్తున్నారట. కరోనా వైరస్ వ్యాప్తి భయాలకు తోడు, ఉద్యోగాలపై నెలకొన్న అభద్రత కారణంగా వారంతా సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దాదాపు 2 లక్షల మంది ప్రవాస కేరళీయులు తమ అభ్యర్థనను నమోదు చేసుకున్నారని నాన్-రెసిడెంట్ కేరలైట్ వ్యవహారాల విభాగం (నార్కా) వైస్ చైర్మన్ కె వరదరాజన్ తెలిపారు. భారతదేశంలో విమానాశ్రయాలు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఇంటికి రావాలనుకునేవారి కోసం ప్రారంభించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)నుండి 70వేలమంది, 30వేల సౌదీ అరేబియా నుండి నమోదు చేసుకున్నారని తెలిపారు. 40 శాతానికి పైగా యుఎఇ నుంచి రాగా, మిగిలినవి సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఇతర పెర్షియన్ గల్ఫ్ దేశాలనుంచి వచ్చాయన్నారు. అమెరికా, బ్రిటన్ నుండి కూడా ఇలాంటి అభ్యర్థనలున్నట్టు చెప్పారు. వీరిని దశల వారీగా తిరిగి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. (తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం) కరోనా వైరస్ భయాలు, లాక్డౌన్ కారణంగా ఆయా దేశాలలో ఉద్యోగాలు కోల్పోనున్నామన్నఆందోళనతో 160 దేశాల్లోని కేరళీయులు తొలి విమానాల ద్వారా తమ సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి ఆతృతగా ఉన్నారని వరద రాజన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధామంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్టు తెలిపారు. అంతేకాదు ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరవచ్చని భావిస్తున్నామన్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రజల భద్రత తమ ప్రాధాన్యత అని, వారిని తిరిగి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవ్యక్తులు, వీసా గడువు ముగిసి అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను తిరిగి తీసుకురావడానికి చార్టర్డ్ విమానాలు అవసరమని వరద రాజన్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రవాసీయుల కోసం రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరీక్షలు,క్వారంటైన్ లాంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఈ ప్రజలను తిరిగి తీసుకు రావడానికి సిద్దంగా ఉన్నామన్నారు. అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమైన ఒక నెలలోనే 5 లక్షల మంది తిరిగి వస్తారని కేరళ అంచనావేస్తోంది. కేరళ 33 మిలియన్ల జనాభాలో 10 శాతం విదేశాల్లో నివసిస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నాన్-రెసిడెంట్ కేరళీయుల ఆదాయం 80,000 కోట్ల రూపాయలు. కరోనా ప్రభావంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో తమ వారిని ఆహ్వానించేందుకు కేరళ సన్నద్ధంగా వుండటం విశేషం. -
‘క్వారంటైన్’కు వెళ్లాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు కుటుంబ సభ్యుల్లా కలిసి ఉన్నారు.. నేడు కరోనా భూతం అనుమానపు చూపులతో విభజన రేఖ గీసింది. అమెరికా నుంచి వచ్చారు.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని పొరుగిళ్లవారు.. మా ఇల్లు మా ఇష్టం ఇక్కడే ఉంటాం అని ప్రవాసీలు.. ఇదీ ప్రస్తుతం చాలాచోట్ల నెలకొన్న పరిస్థితి. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్ బందంకొమ్ము ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో నివసించే కుటుంబం ఇటీవల యూఎస్ వెళ్లివచ్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరి కా నుంచి నేరుగా ఇంటికే చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ చేసి కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో పంపించే శారు. అయితే, ఇది ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ఇరుగు పొరుగు ఫ్లాట్ల జ నం.. అమెరికా నుంచి వచ్చారు కదా! క్వారంటైన్‌కు వెళ్లాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో పోలీసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పరీక్షలు చేసేందుకు రా వాలని కోరేందుకు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఇంకేముంది అమెరికా నుంచి వారు అంతెత్తున లేచారు. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి... వదంతులతో ఇబ్బందులు.. చెన్నై ఐఐటీలో చదివే ఓ విద్యార్థికి సెలవులకు ఇంటికి వచ్చాడు. అతడు వచ్చిం ది చెన్నై నుంచైతే.. చైనా నుంచి వచ్చాడనే వదంతి పుట్టింది. అంతే, అధికారులంతా పరుగో పరుగు. ఆపై విషయం తెలిసి నో ళ్లువెళ్లబెట్టారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లక్ష్మాపూర్ తండాలో జరిగింది. -
విదేశాంగశాఖకు రూ.16 వేల కోట్లు
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. గత బడ్జెట్లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. మాల్దీవులకు సాయం రూ.125 కోట్ల నుంచి రూ.575 కోట్లకు పెరిగింది. భూటాన్‌కు సాయం గత ఏడాది రూ.2,650 కోట్లు కాగా ఈసారి రూ.2,615 కోట్లకు తగ్గించింది. అఫ్గానిస్తాన్‌కు రూ.325 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.175 కోట్లు, శ్రీలంకకు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.5 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. నేపాల్‌కు రూ.700 కోట్లు కేటాయించారు. -
చోరీ ఫోన్లకు ‘రెక్కలు’
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యధాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది.ఆ తర్వాత కొన్నాళ్లకు తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు.ఇప్పుడు చోరీ చేసిన వాటిలో అత్యంత ఖరీదైన సెల్ఫోన్లను గుట్టుగా విదేశాలకు తరలించేస్తున్నారు.నగరంలో అపహరణకు గురవుతున్న సెల్ఫోన్లలో ఖరీదైనవి అత్యధిక భాగం బ్యాంకాక్, చైనాలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో ఉన్నవి సైతం ప్రధానంగా కర్ణాటకలోని గుల్బర్గా మార్కెట్‌కు వెళ్తున్నాయి. ఫలితంగా వీటిని రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. రాజధానిలో అనేక ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్ఫోన్ల చోరీ చేస్తున్నారు. బాధితు ల్లో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. పర్సుల నుంచి సెల్ఫోన్ల వరకు... నగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సులను మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో వీరికి పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు.ఈ నేపథ్యంలో ఇటీవల వీరు సెల్ఫోన్లపై దృష్టి సారించారు. పీడీ యాక్ట్ ప్రయోగం వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఐదుగురు సభ్యుల ముఠాను ముషీరాబాద్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరొకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యలకు దారి తీస్తున్నాయి. గతంలో ఐఎంఈఐ నంబర్ మార్చేసి... ప్రతి మొబైల్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్‌గా పిలిచే ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మనిషి వేలిముద్రల తరహాలోనే ప్రపంచంలోని ఏ రెండు సెల్ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసే వారు. దీంతో సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. సరిహద్దులు దాటిస్తూ... తాజాగా చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్న, చోరీ చేస్తున్న వారి పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో ఒకడైన నజీరుద్దీన్ ఆరునెలల్లో దాదాపు నాలుగు సార్లు బ్యాంకాక్ వెళ్ళి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కోణంపై ఆరా తీయగా, తనతో పాటు మరికొందరు ‘ఐ–ఫోన్లను’ సరిహద్దులు దాటించేస్తున్నట్లు వెల్లడించాడు. ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్ల చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్లి అక్కడ మార్కెట్లో అమ్మేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నగరంలో జగదీష్ మార్కెట్ తరహాలోనే ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే అక్కడ ఐ–ఫోన్లకు మాత్రమే గిరాకీ ఉన్నట్లు వెల్లడించాడు. గుల్బర్గాలోని సెకండ్ హ్యాండ్ మార్కెట్ దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పోలీసులు గుర్తించారు. ఇలా తరలిపోతున్న వాటిని ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని చెబుతున్నారు. రిటర్న్ రూపంలో చైనాకు... నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణమైంది. ఇలా వచ్చిన మాల్లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి ఖరీదు చేసిన ఖరీదైన హై–ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు భావిస్తున్నారు. రిటర్న్ మాల్లో గోప్యంగా దాచి పంపిస్తున్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులకూ చిక్కట్లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చోరీకి గురైన హై–ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. జాగ్రత్తలే మేలు... సెల్ఫోన్లను కోల్పోయిన సందర్భంలో బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు... చివరకు తల్లిదండ్రులు, భార్య ఫోన్ నెంబర్లు, అత్యంత కీలకమైన డేటాను సెల్లోనే ఫీడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే... దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. విలువైన సమాచారం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఉంటుంది. మెబైల్ ప్యాకింగ్ బాక్స్‌పైనా, అమ్మకం బిల్లుపైనా దీన్ని ముద్రిస్తారు. మీ సెల్ఫోన్లో (06) బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకుని భద్రంగా ఉంచుకోవాలి. ఫోను పోయినప్పుడు దీన్నిబట్టి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. మీ సెల్‌ఫోన్‌ను సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా... వినియోగించుకోవడం, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు. ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిని వినియోగిం చుకోవడం ద్వారా మీ ఫోన్లో సేవ్ చేసుకుంటున్న డేటా అంతా ఓచోట బ్యాకప్ అవుతుంది. దీని వల్ల ఫోన్ పోయినా... మీ డేటా సర్వర్‌లో సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కేవలం సెల్లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తం డేటా కార్డు సాయంతో కంప్యూటర్లో, సీడీల్లో భద్రపరుచు కోవడం లేదా కీలక నెంబర్లన్నీ రాసి పెట్టుకోవడం మంచిది. -
మెడిసిన్ అబ్రాడ్
మన దేశంలోని విద్యార్థులకు మెడిసిన్ కోర్సుల పట్ల అత్యంత క్రేజ్. దాదాపు 60 వేల సీట్లకు 12 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు అంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ! దాంతో నీట్లో మంచి ర్యాంకులు పొందిన కొద్ది మందికే దేశంలో వైద్య కోర్సులుఅభ్యసించే అవకాశం లభిస్తోంది. దాంతో ఎలాగైనా ‘డాక్టర్’ కల నెరవేర్చుకోవాలనుకునే విద్యార్థులు విదేశాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఎంబీబీఎస్ అబ్రాడ్ కోణంలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు, ప్రవేశ విధానం, ఫీజులు, ఆయా దేశాల్లో పేరున్న యూనివర్సిటీల గురించి తెలుసుకుందాం.. చైనా మెడికల్ కోర్సుల పరంగా ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థుల ఆదరణ పెరుగుతున్న దేశం చైనా. కారణం.. ఇతర దేశాలతో పోల్చితే తక్కువ ఖర్చు, సరిహద్దునే ఉన్న దేశం. అన్నిటికంటే ముఖ్యంగా కరిక్యులం పరంగా క్లినికల్ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. ఇంగ్లిష్ మీడియం బోధన మరో కలిసొచ్చే అంశం. ఆరేళ్ల వ్యవధిలో ఉండే కోర్సు సమయంలో అయిదేళ్లు క్లాస్‌రూం బోధన, మరో ఏడాది ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. ఫీజు ఏడాదికి గరిష్టంగా రూ.రెండున్నర లక్షలు ఉంటుంది. ఏటా ఆగస్ట్/సెప్టెంబర్‌లో క్లాసులు ప్రారంభమవుతాయి. చైనా ప్రభుత్వం ఏటా అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు అనుమతి పొందిన మెడికల్ కాలేజీల జాబితాను ప్రచురిస్తుంది. విద్యార్థులు ఆ కాలేజీల్లోనే చేరడం మేలు. ఇలాంటి కాలేజీలు దాదాపు 50 వరకూ ఉంటాయి. ఇంటర్/10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన విద్యార్థులు చైనాలో మెడిసిన్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. యూనివర్సిటీస్/ఇన్స్టిట్యూట్స్: చైనా మెడికల్ యూనివర్సిటీ; దలైన్ మెడికల్ యూనివర్సిటీ; జియాంగ్జు యూనివర్సిటీ; టియాన్జిన్ మెడికల్ యూనివర్సిటీ, జిలిన్ యూనివర్సిటీ; నాన్జింగ్ మెడికల్ యూనివర్సిటీ; సూచో యూనివర్సిటీ; సౌత్ఈస్ట్ యూనివర్సిటీ; సదరన్ మెడికల్ యూనివర్సిటీ; యాంగ్‌ఝౌ యూనివర్సిటీ తదితరాలు. వివరాలకు వెబ్సైట్: mbbs.cucas.edu.cn రష్యా రష్యా ప్రభుత్వం ఉన్నత విద్యకు రాయితీలు ఇస్తోంది. అంతేకాకుండా ఎక్కువ శాతం సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దాంతో రష్యాలో చదువుకయ్యే ఖర్చు తక్కువగా ఉంటోంది. రష్యాలో ఎండీగా పిలిచే మెడికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వ్యవధి ఆరేళ్లు. ప్రవేశాలు ఆయా యూనివర్సిటీలను బట్టి జూలైలో జరుగుతాయి. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం లభిస్తుంది. అర్హత 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). కోర్సు బోధన ఇంగ్లిష్, రష్యన్లో కొనసాగుతుంది. ఫీజు ఏడాదికి రూ. రెండు లక్షలు నుంచి రూ. నాలుగున్నర లక్షల మధ్యలో ఉంటుంది. యూనివర్సిటీలు: రష్యన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కర్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కజన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఐ.ఎం.షెనోవ్ మాస్కో మెడికల్ అకాడమీ, పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ ఆఫ్ రష్యా మొదలైనవి. వివరాలకు వెబ్సైట్: en.russia.edu.ru ఉక్రెయిన్ ఫీజులు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయంతోపాటు నాణ్యమైన విద్యను అందుకునే అవకాశం ఉండటంతో మన విద్యార్థులు ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌లో మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ యూనివర్సిటీలకు యూరోపియన్ విశ్వవిద్యాలయాలతో ఉన్న అవగాహన కారణంగా ఎక్సే ్చంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. కోర్సును రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలలోపు పూర్తిచేసుకునే అవకాశం ఉండటం వంటి కారణాలు సైతం ఉక్రెయిన్ను బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుపుతున్నాయి. డాక్టర్ ఆఫ్ మెడిసిన్‌గా పిలిచే ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. వార్షిక ఫీజు రూ.2.25 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. అర్హత 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). యూనివర్సిటీలు: ఇవానో–ఫ్రాంకివ్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ; లుగాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఎం.గోర్కీ డొనెట్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ; ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ తదితర. వివరాలకు వెబ్సైట్: www.kmu.gov.ua జర్మనీ ప్రపంచంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది జర్మనీ. వాస్తవానికి జర్మనీలో అన్నిరకాల కోర్సులకు ఫీజులు తక్కువ. అలాగే మెడిసిన్ కోర్సులను కూడా తక్కువ ఫీజులతోనే పూర్తిచేసుకునే వీలుంది. జర్మనీ యూనివర్సిటీలు 5 శాతం సీట్లను విదేశీ విద్యార్థుల కోసం కేటాయిస్తుండటం ఈ దేశం ప్రత్యేకత. అయితే జర్మనీలో వైద్య కోర్సుల్లో చేరాలంటే.. టెస్ట్ ఫర్ మెడికల్ స్టడీస్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. జర్మనీలో మెడికల్ కోర్సులను జర్మన్ భాషలో బోధిస్తారు. మెడికల్ కళాశాలలను డిసీజెస్ రీసెర్చ్ సెంటర్లతో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థులకు చికిత్స పద్ధతులతోపాటు ఆయా వ్యాధులకు సంబంధించిన మూలాల గురించి తెలుసుకునే ప్రాక్టికల్ నైపుణ్యం లభిస్తుంది. జర్మనీ మెడికల్ ఎడ్యుకేషన్ విధానంలో మరో ప్రత్యేకత అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్), పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ) అని తేడా లేకుండా ఇంటిగ్రేటెడ్‌గా యూజీ, పీజీ కోర్సును అందించడం. ఏడేళ్ల వ్యవధిలో మొత్తం కోర్సు ఉంటోంది. అంతేకాకుండా జర్మనీలో అధిక శాతం యూనివర్సిటీలు ప్రభుత్వ పరిధిలో ఉండటం, నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలోని ఇన్స్టిట్యూట్లలో ట్యూషన్ ఫీజులు లేకపోవడం మరో విశేషం. మెడికల్ కోర్సులకు ప్రవేశాలు జూలైలో ఉంటాయి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్: టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యునిచ్, లడ్విగ్ మ్యాక్స్ మిలన్ యూనివర్సిటీ–మ్యునిచ్, ఆల్బర్ట్–లడ్‌విగ్స్ యూనివర్సిటీ, హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, హంబర్గ్ యూనివర్సిటీ మొదలైనవి. కిర్గిజిస్థాన్ కిర్గిజిస్థాన్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య పొందొచ్చు. ఆరేళ్ల వ్యవధిలో ఉండే ఎండీ పేరుతో పిలిచే ఎంబీబీఎస్ తత్సమాన కోర్సు పూర్తిచేసేందుకు అయ్యే వ్యయం రూ.11 లక్షల నుంచి రూ. 20 లక్షలలోపే. ఏటా ఆగస్టు/సెప్టెంబర్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వవిద్యాలయాలు: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిజిస్థాన్, ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్, ఓష్ స్టేట్ యూనివర్సిటీ, కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ. జల్–అలాబాద్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ తదితర. ఫిలిప్పీన్స్ తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తిచేయొచ్చు. ఆరేళ్ల వ్యవధిలో ఉండే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సు ఫీజు 30 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్లు ఉంటుంది. యూనివర్సిటీలు: అవర్ లేడీ ఫాతిమా యూనివర్సిటీ; ఏఎంఏ ఎడ్యుకేషన్ సిస్టమ్–మనీలా; ఎమిలో అగ్వినాల్డో కాలేజ్–మనీలా మొదలైనవి. వెబ్సైట్: www.ched.gov.ph జార్జియా ఇక్కడ ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కచ్చితంగా యూఎస్ఎంఎల్ఈ లేదా పీఎల్‌ఏబీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఫీజు ఏడాదికి 4,500–6,500 డాలర్లు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ప్రవేశాలు ఉంటాయి. ప్రముఖ యూనివర్సిటీలు: జియోమెడి మెడికల్ యూనివర్సిటీ; టిబిల్సి మెడికల్ అకాడమీ; డేవిడ్ ట్విల్డియాని మెడికల్ యూనివర్సిటీ; కౌకాసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తదితరం. వివరాలకు వెబ్సైట్: www.mes.gov.ge -
'కౌంటింగ్ జరుగుతుంటే రాహుల్ అలా వెళ్లొచ్చా?'
సాక్షి, పట్నా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. ఓపక్క ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లారని సెటైర్ వేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ ఎక్కడా విజయం సాధించదని రాహుల్‌గాంధీకి ముందే తెలుసు. రాజకీయాలంటే అసలు రాహుల్‌కు సీరియస్‌నెస్ లేదు. ఇలాంటి కీలకమైన సమయంలో ఒక పార్టీ చీఫ్ ఎవరైనా పార్టీని, కార్యకర్తలను, నాయకులను ఇలా ఒంటరిగా వదిలేసి వెళతారా. ఇలాంటి సమయంలో కనీసం కార్యకర్త కూడా ఎక్కడికీ వెళ్లడు. పార్టీ అధ్యక్షుడిగా అసలు రాహుల్ గాంధీకి ఏమాత్రం ఆసక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు' అంటూ ఆయన తీవ్రంగా విమర్శిచారు. హోలీ సందర్భంగా తాను తన అమ్మమ్మ (93) దగ్గరకు ఆశ్యర్యంలో ముంచెత్తేందుకు వెళుతున్నట్లు రాహుల్‌గాంధీ తన ట్విట్టర్ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గిరిరాజ్ సింగ్ విమర్శలు చేశారు. -
విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజి వాస్తవమే
న్యూఢిల్లీ : విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజీ వాస్తవమేనని రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు. అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ..మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ వార్తలపై వెంటనే స్పందించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగిందన్నారు. మొబైల్ ఫోన్ల భద్రత, రక్షణ కోసం ఫోన్ల తయారీ సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి..ఆయా ఫోన్ల ఆర్కిటెక్చర్, ఫ్రేమ్ వర్కు తదితర వివరాలను సమర్పించాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు మంత్రి తెలిపారు. మొబైల్ డేటా విదేశాలకు లీకవుతున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత తమ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ విభాగం దీనిపై లోతుగా పరిశీలన జరిపిందని చెప్పారు. మొబైల్ ఫోన్ల నుంచి షేర్ అవుతున్న డేటా సంకేత సంక్షిప్త సందేశం (ఎన్‌క్రిప్ట్) రూపంలో ఉంటున్నందున అది ఎలాంటి సమాచారమో కనిపెట్టడం కష్టమవుతోందని మంత్రి చెప్పారు. ఈ డేటా కేవలం తమ ప్రతిభా సామర్థ్యాలను మరింతగా పెంపొందిచుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయని మంత్రి వివరించారు. -
వారికి ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లోపనిచేసే ఉద్యోగులకు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) శుభవార్త అందించింది. విదేశాలకు వెళ్లి పనిచేసే భారతీయ ఉద్యోగులకు ఇకపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో భద్రతను, సౌకర్యాలను అందించనుంది. స్వల్పకాలం పాటు పనిచేసేందుకు ఇతర దేశాలకు వెళ్లేవారికి ఈ సౌకర్యం బాగా ఉపయోగపడనుంది. ఈ మేరకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహించే ఈపీఎఫ్‌వో 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. విదేశాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక ఆయా దేశాల్లో అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను తామే మినహాయించుకుని ఈపీఎఫ్‌వోను ఎంచుకునే సౌలభ్యాన్ని ఈపీఎఫ్‌వో కల్పిస్తోందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జోయ్ శుక్రవారం తెలిపారు. ఇందుకోసం ఆన్లైన్లో వ్యవస్థను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం ప్రక్రియను సులభతరంగా సిద్ధం చేశామని చెప్పారు. పరిమిత కాల వ్యవధిలో విదేశీ ఉద్యోగాలకు భారత కార్మికులకు ఈ పథకం ఎంతో సహాయపడుతుందనీ ఎ వరైతే ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తారో వారికి సర్టిఫికెట్ ఆఫ్ కవరేజీ (సీవోసీ)ని అందిస్తామని, దాన్ని పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక పేజీతో కూడిన దరఖాస్తు ఫారాన్ని ఈపీఎఫ్‌వో వెబ్సైట్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. తద్వారా ఉద్యోగులు డబ్బు దీర్ఘకాలంపాటు విదేశాలకలో బ్లాక్ కాకుండా ఉంటుందంటూ పథకం ప్రయోజనాలను వివరించారు. ఇందుకు బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, కొరియా రిపబ్లిక్, నెదర్లాండ్స్, హంగేరీ, ఫిన్లాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్, నార్వే, ఆస్ట్రియా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ , పోర్చుగల్ దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ప్రపంచంలో ఉద్యోగులకు భద్రతను అందించే అతిపెద్ద సంస్థల్లో ఈపీఎఫ్‌వో ఒకటి. ఇందులో 9.26లో యజమానులతో పాటు, 4.5 కోట్ల మంది సభ్యులుగా ఉండగా, ప్రతి నెలా 60.32 లక్షల మంది ఈపీఎఫ్‌వో ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు. -
తనిఖీల విషయంలో చూసి చూడనట్టుగా..
బెంగళూరు: విదేశాల నుంచి బంగారం బెంగళూరు మీదుగా వివిధ ప్రాంతాలకు తరులుతోంది. వివిధ దేశాల నుంచి నేరుగా బెంగళూరుకు విమానాలు అందుబాటులో ఉండటంతో పాటు ఇక్కడ తనిఖీల విషయంలో కొంత చూసి... చూడనట్లు వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని సమాచారం. మూడు రోజుల ముందు అక్రమ మార్గంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 12 కిలోల బంగారు బిస్కెట్లు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు గుర్తించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటివి అడపా దడపా గుర్తించినా అధికారుల కన్నుగప్పి వందల కిలోల బంగారం భారత దేశంలోకి దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ నుండి థాయ్ ఎయిర్ ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను ఎయిర్‌పోర్టులోని శౌచాలయంలో దాచినట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారమందింది. దీంతో విమానాశ్రయంలోని శౌచాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు శౌచాలయంలో పిల్లల డైపర్డిస్పెన్సరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ యంత్రాన్ని స్కానర్ల సహాయంతో స్కానింగ్ చేయగా అందులో కార్బన్, ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన ప్యాకెట్లను గుర్తించారు. డిస్పెన్సరీని తెరచి చూడగా అందులో బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి. యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆచూకీ కోసం ఎయిర్‌పోర్టులోని సీసీకెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన అధికారులు డిస్పెన్సరీ యంత్రంతో శౌచాలయంలోకి వెళుతున్న వ్యక్తిని గమనించిన అధికారులు ఎయిర్‌పోర్టును సిబ్బందిని అప్రమత్తం చేసారు. ఎయిర్‌పోర్టు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వ్యక్తిని తమిళనాడుకు చెందిన మహమద్ మోహిద్దిన్గా గుర్తించారు. తమిళనాడులో చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే వ్యాపారాన్ని నిర్వహించే మహమద్ మోహిద్దిన్ డబ్బులకు ఆశపడే బంగారు ఆభరణాలను అక్రమంగా తరలించాడినికి అంగీకరించినట్లు తమ విచారణలో తెలిసిందని అధికారులు తెలిపారు. అయితే బంగారు ఆభరణాల అక్రమ రవాణకు ఎయిర్‌పోర్టుకు చెందిన సిబ్బంది కూడా మహమద్ మోహిద్దిన్కు సహకరించినట్లు సంబంధిత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగారు బిస్కెట్లు విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఏఐయూ)అధికారులు అరెస్ట్ చేసారు. ఈ ఘటనలో రూ.2.60కోట్ల విలువ చేసే 6.65కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో... ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన వీమానంలోని శౌచాలయంలో దాదాపు 6 కిలోల బరువున్న 12 బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు. ఈ విషయమై ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. -
అమెరికా...సౌదీ..హైదరాబాద్..
రచ్చబండ విన్నాం. ఊరి పెద్దలు ఊరి విషయాల్లో అక్కడే న్యాయం చెబుతారు. పట్టణాల్లో, నగరాల్లో ఉండేవాళ్లకి... కోర్టుల్లో న్యాయం దక్కుతుంది. కానీ విదేశాల్లో... న్యాయం మన పక్షం ఉండకపోవచ్చు! మన అక్కచెల్లెళ్లు విదేశాల్లో న్యాయం కోసం పడుతున్న అగచాట్లే.. ఈ ‘చట్ట’బండలు. మూడు కథలు. మూడు దేశాలు. మూడు అడ్డుబండలు. అక్కడ... అమెరికాలో! ‘అమ్మాయి బాగుంటుంది. ఫోటో చూశావుగా..! బాగా చదువుకుంది కూడా. అక్కడ ఉద్యోగం చేయగలదు. మంచి కుటుంబం! ఇంతకన్నా ఏం కావాలిరా? ఓకే చెప్పేయ్..’ అన్న అమ్మ మాటకు ‘ఊ.. ఆ..’ అంటూ రెండు రోజులు సాగదీసి మూడో రోజు ఓకే అనేశాడు అమెరికాలో ఉన్న అబ్బాయి. పెళ్లయింది. పదిరోజుల్లో తను వెళ్లిపోయి నెలకు భార్యనూ రప్పించుకున్నాడు. అక్కడ అమ్మాయికీ ఉద్యోగం దొరికింది. సంపాదిస్తున్నారు. చక్కగా కాపురం చేసుకుంటున్నారు. కాలం గడుస్తోంది. అమ్మాయి అమ్మ అయింది. కూతురు పుట్టింది. బిడ్డను చూసి మురిసిపోయారు. పాపకు ఆర్నెల్లు వచ్చాయి. సెలవు పెట్టిన అమ్మ మళ్లీ ఉద్యోగానికి వెళ్లడం మొదలుపెట్టింది. అమ్మానాన్న వంతుల వారీగా బిడ్డ ఆలనాపాలన చూస్తున్నారు. ఇంతలో బిడ్డలో ఏదో మార్పు! ఏంటో తెలియట్లేదు అమ్మకు. ఇండియాలో ఉన్న తల్లికి ఫోన్ చేసి అడిగేది. ‘ఏం కాదులే’ అని భరోసా ఇచ్చింది తల్లి. నిజమే కాబోలు అనుకుంది అమెరికాలో అమ్మ. పాపకు యేడాది వయసు వచ్చింది. ఒకరోజు.. తను ఆఫీస్ నుంచి రావడం.. భర్త ఆఫీస్‌కి వెళ్లిపోవడం ఒక్కసారే జరిగాయి. ఇంట్లోకి వెళ్లీవెళ్లగానే బిడ్డను చూసుకుంది. గుక్కపెట్టి ఏడుస్తోంది. బిడ్డ రెండు కాళ్ల మధ్య రక్తం! ఏమీ అర్థం కాలేదు ఆ తల్లికి. శుభ్రం చేసి ఎత్తుకొని పాలుపట్టింది. బిడ్డ నిద్ర పోయింది. భర్తకు ఫోన్ చేసింది. బిడ్డ విషయం చెప్పి హాస్పిటల్ తీసుకెళ్దామని అడిగింది. ‘అర్జెంట్ మీటింగ్‌లో ఉన్నా. వచ్చాక తీసుకెళదాములే’ అన్నాడు. ఆమె మళ్లీ పనిలో పడిపోయింది. తెల్లారి మామూలుగానే ఉంది బిడ్డ. ఆ తర్వాత కూడా అనారోగ్యం కనిపించకపోవడంతో డాక్టర్ దగ్గరకి వెళ్లాలన్న విషయాన్ని వాయిదా వేసేసుకుంది. తర్వాత పని ఒత్తిడిలో పడి మర్చేపోయింది. ఆర్నెల్లు గడిచాయి. పాపకు మాటలు రావడమూ మొదలైంది. శారీరకంగా పాపలో ఎలాంటి తేడా కనిపించకపోయినా మానసికంగా చాలా తేడా కనిపిస్తోంది ఆ తల్లికి. తండ్రిని చూస్తే భయపడిపోయేది. తండ్రి ముద్దు చేస్తుంటే వణికిపోయేది. అర్థమయ్యేది కాదు అమ్మకు. ఓరోజు ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అమ్మకు మళ్లీ రక్తంతో కనిపించింది పాప. అంతేకాదు. సొమ్మసిల్లి పడిపోయి ఉంది. భయంతో కంపించింది తల్లి. కూతురు లేచాక బుజ్జగించి అడిగింది ఏమైందని. ‘డాడీ.. నన్ను ఎక్కడెక్కడో ముద్దు పెట్టుకుంటున్నాడు..’ అంటూ తండ్రి చేష్టలన్నిటినీ వచ్చీరాని మాటలతో చెప్పింది. అది విన్న తల్లి చేష్టలుడిగిపోయింది. రాత్రికిరాత్రే భర్త ఆఫీస్ నుంచి వచ్చేకంటే ముందే ఇల్లు వదిలి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. బిడ్డను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపారు తప్ప ఏం జరిగిందో పరీక్ష చేయలేదు. ఇంట్లో భార్య లేకపోయే సరికి ఫోన్ చేశాడు. భార్య రియాక్షన్‌తో విషయం అర్థమైంది ఆయనకు. వెంటనే లాయర్ నుంచి విడాకుల నోటీస్ పంపాడు భార్యకు. దానికి జవాబుగా కోర్టుకు అటెండ్ అయింది భార్య. భర్త తన కూతురు మీద చేస్తున్న అఘాయిత్యాన్ని మొరపెట్టుకుంటుంది. వైద్య పరీక్షల కోసం పాపను డాక్టర్ దగ్గరకు పంపింది. భౌతిక పరీక్షల్లో ఏమీ లేదనే రిపోర్ట్ వచ్చింది. మానసిక వైద్యుల దగ్గరకూ పంపింది. పాప మీద అఘాయిత్యం జరుగుతోంది అందుకే పాప ప్రవర్తనలో తేడా ఉందని తేల్చారు వైద్యులు. అయితే అమెరికా కోర్టు భౌతిక పరీక్షా ఫలితానికే విలువనిచ్చి మానసిక వైద్య పరీక్షల ఫలితాలను కొట్టిపారేసింది. విడాకులు మంజూరు చేసింది. బిడ్డ అమెరికాలోనే పుట్టింది కాబట్టి అమెరికా పౌరురాలని ఆ పిల్ల సంరక్షణాబాధ్యతను అప్పటికే అమెరికా పౌరసత్వం ఉన్న తండ్రికి అప్పజెప్పింది కోర్టు. ఆ తీర్పుకి భయపడ్డ తల్లి ఆ రాత్రికి రాత్రే బిడ్డను తీసుకొని ఇండియా వచ్చేసింది. ఇక్కడ... విజయవాడలో! వచ్చాక కష్టాలు కడతేర లేదు. నా బిడ్డను కిడ్నాప్ చేసిందని అక్కడ కేస్ పెట్టాడు. అక్కడి కోర్టు ఇక్కడున్న భార్యకు ఉత్తర్వులు పంపింది బిడ్డను తండ్రికి అప్పజెప్పాలని. అప్పజెప్పకుండా ఉండడానికి ఇక్కడి నుంచి ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడింది ఆ తల్లి. కానీ లాభం లేకపోయింది. అక్కడి నుంచి కాన్స్లేటర్స్ని పంపింది అమెరికన్ కోర్టు... బిడ్డను తండ్రికి అప్పజెప్పాలంటూ. ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. ప్రస్తుతం పాపకు నాలుగన్నరేళ్లు. ఆ రాక్షసుడు తన బిడ్డను ఎత్తుకుపోకుండా ఉండడానికి ఇక్కడి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. మహిళా సంఘాలను కలసింది. కానీ లాభం లేకపోయింది. పాప అమెరికన్ సిటిజన్.. అందుకని పాప విషయంలో అమెరికన్ కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించే వీలు లేదు. మన కోర్టు తీర్పులకు అక్కడ విలువ లేదు అని చెప్పారు. హతాశురాలైంది అమ్మ. అయినా పోరాటం ఆపలేదు. అక్కడ.. సౌదీలో! ‘పిల్లగాడు సౌదీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు. బాగా సంపాదిస్తున్నాడు. ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది?’ చెప్పాడు మధ్యవర్తి. ఆ తండ్రికి నిజమనిపించింది. అందుకే కూతురి అభిప్రాయం కూడా అడగకుండా ఆ సంబంధాన్ని ఖాయం చేశాడు. షాదీ తర్వాత వెంటనే భార్యను సౌదీకి తీసుకెళ్లాడు. నెల రోజులు ప్రశాంతం. నెమ్మది నెమ్మదిగా అసలు స్వభావం చూపించసాగాడు పెళ్లి కొడుకు. అది రోజురోజుకీ ఎక్కువైంది కానీ తక్కువవలేదు. నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. కాబట్టి ఎంత సహనంతో ఉండాలో తల్లి చెప్పి మరీ సౌదీకి సాగనంపింది. కాబట్టి తల్లితండ్రి ఎప్పుడూ ఫోన్ చేసినా అంతా బాగున్నట్టే చెప్పేది. ఈలోపు గర్భం దాల్చింది. బిడ్డ కూడా పుట్టింది. పాప పుట్టాక భర్త హింస మరింత ఎక్కువైంది. నరకం చూపించసాగాడు. రోజు ఒక గండంగా గడవసాగింది. భరించలేక తల్లికి చెప్పింది. సర్దుకుపొమ్మనే జవాబు వచ్చింది. సర్దుకుపోయింది ఆత్మహత్య చేసుకొని. అక్కడ ఆత్మహత్య నేరం. దానికి దారితీసిన పరిస్థితుల మీద విచారణ జరపరు. అది ఆత్మహత్యా, హత్యా అన్న విషయం మీదే విచారణ. ఆత్మహత్య అని తేలింది. భర్త నిర్దోషిగా మిగిలాడు. మూణ్ణెల్లలో హాయిగా మళ్లీ పెళ్లి. ఇక్కడ హైదరాబాద్‌లో! బిడ్డను పోగొట్టున్న తల్లిదండ్రులు బాధతో కేసు పెట్టారు. కూతురు అత్తామామలను అరెస్ట్ చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేవని వదిలిపెట్టారు. అక్కడి కోర్టు తీర్పు సవాలు చేసే వీలు ఇక్కడ లేదు. ఇక్కడి న్యాయ పోరాటం అక్కడ చెల్లుబాటు కాదు అని చెప్పారు న్యాయ నిపుణులు. నిస్సహాయులుగా మిగిలిపోయారు ఆ తల్లిదండ్రులు. అక్కడ... యూకేలో! మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరింది ఆ జంటకు. ఇద్దరూ ఇంజనీర్లే. అబ్బాయికి యూకేలో ఉద్యోగం. అక్కడ పర్మెనెంట్ రెసిడెంట్ కూడా. అమ్మాయికి నచ్చాడు. అంగరంగ వైభవంగా పెళ్లయింది. మూడు నెలల్లోనే యూకేలో కాపురం పెట్టారు. ఆర్నెల్లకే అమ్మాయి పిచ్చిదని నిరూపించి అక్కడి కోర్టు ద్వారా భార్యకు విడాకులిచ్చి బలవంతంగా ఇండియాకు పంపించాడు. ఇక్కడ... అనంతపురంలో! ఇక్కడ పెళ్లికి అక్కడి కోర్టు ఎలా విడాకులిస్తుందని అమ్మాయి ప్రశ్న. దీనికి సమాధానం మన న్యాయస్థానాలు, ప్రభుత్వాల దగ్గర లేవు. వందలు... వేల కేసులు!! ఈ మూడు కేసులే కాదు ఇండియాలో ఇలాంటి ఎన్ఆర్ఐ మ్యారేజ్ కేసులు కొన్ని వందల్లో.. వేలల్లో ఉన్నాయి. అన్యాయమై పోయిన ఆడపిల్లలు న్యాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అయితే మరీ ఘోరంగా ఉంది. పెళ్లయి అక్కడికి వెళ్లాక గర్భం దాల్చిన భార్యకు అక్కడ లింగ నిర్థారణ పరీక్ష చేయించి ఆడపిల్ల అని తేలగానే ఇండియాకు వచ్చి అబార్షన్ చేయించి తీసుకెళ్తున్నారు. వ్యతిరేకించిన భార్యను ఇక్కడే వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా ఇంకో పెళ్లి చేసుకొని ఫ్లయిట్ ఎక్కేస్తున్నారు. ఇందులో మన తెలుగు రాష్ట్రాలూ ఏం తక్కువ తినలేదు. పంజాబ్, హర్యానా తర్వాత మూడో స్థానంలో మనమే ఉన్నాం. ఈ సంగతి అలా ఉంచితే.. ముందు చెప్పుకున్న కేస్స్టడీస్కి వస్తే విడాకులు, సెక్సువల్ అబ్యూజ్, భ్రూణ హత్యలు.. విషయం ఏదైనా.. నేరం ఏదైనా ఇక్కడి చట్టాలకు, విదేశీ చట్టాలకు చాలా తేడా ఉంది. అందుకే మన అమ్మాయిలు అలా అన్యాయమైపోయారు. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. రోజురోజుకీ ఈ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇందుకు పరిష్కారంఆ మన చట్టాల తీర్పునీ పరిగణనలోకి తీసుకొని విదేశీ కోర్టులు తమ తీర్పును ఇవ్వాలని, అందుకు మన దేశం విదేశాలతో ఓ ఒప్పందానికి రావాలని తెలుగు రాష్ట్రాల మహిళా కమిషన్, మహిళా సంఘాలు, లాయర్లు, మహిళా సమస్యల మీద పనిచేసే స్వచ్చంద సంస్థలూ... సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో ముందుగా అమ్మాయిలకు, వాళ్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పెళ్లికి ముందు మ్యారిటల్ కౌన్సిలింగ్ని తప్పనిసరి చేయాలని సామాజిక కార్యకర్త దేవి, మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. -
విదేశీ నౌకరి అదే వారికి కడసారి
► చెరువులో పడి కుమార్తె మృతి ► కూతురు కడసారి చూపుకోసం తల్లి ఆవేదన ► దాత సహాయంతో చివరకు స్వస్థలం చేరుకున్న తల్లి విదేశాల్లో ఉపాధి.. అందమైన రంగుల వల. ఆ వలలో చిక్కుకున్నవారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిర్దయులైన యజమానుల తీరు. అయినవారికి జరగకూడనిది జరిగినప్పుడు వచ్చేందుకు నానా తంటాలు పడాలి. దానికి అద్దంపడుతుందీ సంఘటన. మలికిపురం: అయిన వారిని వదిలి ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారు పడుతున్న ఇబ్బందులకు ఈ ఉదంతం మరో ఉదాహరణగా నిలుస్తుంది. మలికిపురం మండలం కత్తిమండ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కడలి సత్య సాయి ప్రసాద్, వాణి చంద్రకళ. వారిద్దరూ ఉపాధి కోసం రెండు నెలల కిత్రం విదేశాలకు వెళ్లారు. భార్య దోహా కత్తర్లో, భర్త కువైట్‌లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వారిని కత్తిమండలోని నానమ్మ, తాతయ్యల వద్ద ఉంచారు. చిన్న కుమార్తె ఖ్యాతిశ్రీ తాత నాగేశ్వరరావుతో కలసి గత ఆదివారం పొలం వెళ్లింది. ప్రమాదవశాత్తూ అక్కడ రొయ్యల చెరువులో పడిపోయింది. ఆరోజే మృతదేహం పైకి తేలింది. అయితే ఈ విషయం బయట వారెవరికీ తెలియనీయలేదు. ఈ సమాచారాన్ని వెంటనే విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. దోహా కత్తర్లో పని చేస్తున్న తల్లి వాణి చంద్రకళ తన కుమార్తెను కడసారి చూసుకొనేందుకు స్వస్థలం వెళ్లేందుకు ఆమె పని చేస్తున్న యజమాని షేట్ ఇండియా వెళ్లేందుకు అంగీకరించలేదు. తనను పంపించమని కాళ్ళా వేళ్ళా పడింది. అయినా వారు కనికరించలేదు. బోరుమని విలపిస్తూ ఆమె బతిమిలాడగా ఎట్టకేలకు రూ. లక్ష తన వద్ద సెక్యూరిటీ ఇచ్చి వెళ్ళమన్నాడు. చివరికి విషయం తెలుసుకున్న అక్కడి తెలుగు వారు దోహా కత్తర్లో ఉంటున్న మలికిపురానికి చెందిన జీఎన్నార్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ గెద్దాడ నాగేశ్వరరావుకు విషయం తెలిపారు. ఆయన వాణి చంద్రకళ పని చేస్తున్న సేట్ వద్దకు వెళ్లారు. సేట్‌కు సెక్యూరిటీ ఇచ్చారు. వాణి చంద్రకళకు రూ. 50 వేలతో మంగళవారం బిజినెస్ క్లాస్‌లో విమా నం టికెట్ బుక్ చేసి స్వస్థలం పంపారు. ఆమె బుధవారం రాత్రి స్వస్థలం కత్తిమండ చేరుకొంది. ప్రత్యేక బాక్స్‌లో భద్రపరచిన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. ఆ బాలిక తండ్రి కూడా కువైట్ నుంచి మంగళవారం కుమార్తె చివరి చూపు కోసం వచ్చాడు. బుధవారం రాత్రి ఆబాలిక అంత్య క్రియలు జరిగాయి. ఆ విషయం గురువారం నాడు బయట ప్రపంచానికి తెలిసింది. -
వీసాల మోసగాళ్లపై హెచ్చార్సీకి ఫిర్యాదు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ హెచ్చార్సీ గడపతొక్కింది. సైనిక్‌పురికి చెందిన తాటిపత్రి డానియల్, షీబారాణి దంపతులు విదేశాల్లో ఉద్యోగం చూపుతామంటూ తన వద్ద రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ ఇర్ఫానా సుబానీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. గతంలో వీరిపై సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్స్టేషన్లలో కూడా ఇదే విషయంలో కేసులున్నాయని ఆమె బుధవారం అందజేసిన ఫిర్యాదులో వివరించింది. -
మన వాల్యూ పడిపోదు
మనీ వాల్యూ కిందామీదా అయినా... దాదాపు ప్రతి కుటుంబంలో లేదా బంధుమిత్రులలో ఎవరో ఒకరు ఏదో ఒక ప్రత్యేక సందర్భాలలో విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తున్నప్పుడు ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశంలోని కరెన్సీలోకి మన కరెన్సీని మార్చకోవలసి ఉంటుంది. (ఉదా: యు.ఎస్. వెళుతుంటే రూపాయలను డాలర్లలోకి మార్చుకోవాలి). అలాగే విదేశాల నుంచి మన దేశానికి డబ్బు పంపిస్తున్నప్పుడు అక్కడి కరెన్సీని మన రూపాయలలోకి మార్చుకోవలసి ఉంటుంది. మారకపు విలువను మన దేశంలో రిజర్వు బ్యాంకు వివిధ అంశాల ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ కరెన్సీ మారకపు విలువ ఆధారంగా కరెన్సీ డెరివేటివ్స్ 2008లో ప్రారంభం అయ్యాయి. మొదట ‘కరెన్సీ ఫ్యూచర్స్’ని ప్రారంభించారు. తరువాత 2010లో ‘కరెన్సీ ఆప్షన్స్’ని కూడా మొదలుపెట్టారు. ఈ కరెన్సీ డెరివేటివ్స్ని ఉపయోగించుకుని కరెన్సీ మారకపు విలువ హెచ్చుతగ్గుల నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి ముందుగా జాగ్రత్త పడవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుమారుడిని 3 నెలల తర్వాత పైచదువుల కోసం అని యు.ఎస్. పంపించ దలచుకున్నారనుకుందాం. ప్రస్తుతం డాలరుకు 67 రూ. మారకపు విలువ అనుకుంటే కనుక 1500 డాలర్లు కావాలంటే 1,00,500 రూ. అవసరమౌతాయి. అయితే 3 నెలల తర్వాత కూడా డాలరుకు కరెన్సీ మారకపు విలువ ఇంతే ఉంటుందని గ్యారెంటీ లేదు. పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. తగ్గితే మంచితే కానీ, పెరిగితే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి ఆ తండ్రి యు.ఎస్.డాలరు కరెన్సీ ఫ్యూచర్ తీసుకుంటే లాభం గానీ, నష్టం గానీ లేకుండా తను అనుకున్న మారకపు విలువకు డాలర్లను పొందవచ్చు. ఇక ఈ కరెన్సీ డెరివేటివ్స్ ఎలా పనిచేస్తాయో, ఖాతా ఎలా ప్రారంభించాలో చూద్దాం. ఎక్స్ఛేంజీలలో ఎవరైతే కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కి సభ్యత్వం తీసుకుంటారో వారి దగ్గర ఖాతాను ప్రారంభించవచ్చు. ట్రేడింగ్ సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు, ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు ఉంటుంది. మొత్తం నాలుగు రకాల కరెన్సీలలో కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి : యు.ఎస్. డాలరు, యూరో, పౌండు స్టెర్లింగ్. జపనీస్ ఎన్. లాట్ సైజ్ జపనీస్ ఎన్ కి మాత్రమే 100000 ఒక యూనిట్‌గా ఉంటుంది. మిగతా మూడింటికి 1000 ఒక యూనిట్‌గా ఉంటుంది. ప్రతి కాంట్రాక్టు 12 నెలల కాలపరిమితి కలిగి ఉంటుంది. రేటు నాలుగు డిసిమల్స్లో కోట్ అవుతూ 0.25 పైసా / ఐ.ఎన్.ఆర్ 0.0025 టిక్ సైజ్ కలిగి ఉంటుంది. ఉదా: 67.0025; 67.0050 లా కోట్ ఉంటుంది. లాస్ట్ ట్రేడింగ్ డే అనేది ఆ కాంట్రాక్టు చివరి నెల చివరి బిజినెస్ డే కన్నా రెండు రోజుల ముందు వరకు ఉంటుంది. కాంట్రాక్టు సెటిల్మెంట్ ఇండియన్ రుపీస్లో మాత్రమే జరుగుతుంది. కాంట్రాక్టు తీసుకున్న తర్వాత ప్రతి రోజూ సెటిల్మెంట్ ప్రైస్‌కి సెటిల్ చేస్తారు. ఫైనల్ సెటిల్మెంట్ ఆర్.బి.ఐ. రిఫరెన్స్ ప్రైస్ ఆధారంగా జరుగుతుంది. కాంట్రాక్టు తీసుకున్నప్పుడు మొత్తం కాంట్రాక్టు విలువను కట్టనవసరం లేదు. ఎంత మొత్తాన్నైతే మార్జిన్‌గా నిర్ణయిస్తారో అంతవరకు కడితే సరిపోతుంది. పై చదువులకు వెళ్లే వారికి, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారికి, అలాగే తాము విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబానికి సొమ్మును పంపించేవారికి ఈ కరెన్సీ డెరివేటివ్స్ అనేవి మారకపు విలువ హెచ్చుతగ్గుల ఇబ్బందులను దాటడానికి బాగా తోడ్పడతాయి. ఇక ‘కరెన్సీ ఆప్షన్’ గురించి మరోసారి తెలుసుకుందాం. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
వీసా కోసం అడ్డదారి తొక్కి....
‘అమెరికా కాన్సులేట్’లో నకిలీ ప్రతాలు సమర్పణ దరఖాస్తుదారుడితో పాటు మరో వ్యక్తి అరెస్టు సనత్‌నగర్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని భావించిన ఓ యువకుడు నకిలీ పత్రాలతో వీసా పొందేందుకు యత్నించి అమెరికా కాన్సులేట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బేగంపేట పోలీసులు శుక్రవారం ఇతడితో పాటు నకిలీ పత్రాలు సమకూర్చిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. అల్వాల్‌కు చెందిన బి.సాయివర్దన్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలని భావించాడు. వీసా పొందేందుకు అవసరమైన పత్రాల కోసం కర్నూల్‌కు చెందిన డెంటిస్ట్ వెంకటేష్‌ను సంప్రదించగా... అతను రాజస్థాన్‌లోని సీజర్ యూనివర్సిటీలో చదివినట్లుగా నకిలీ విద్యార్హత పత్రాలు సృష్టించి ఇచ్చాడు. వీటితో సాయివర్దన్‌రెడ్డి బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో గత మార్చిలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన అధికారులు అవి నకిలీవిగా గుర్తించారు. ఇదిలా ఉండగా... సాయివర్దన్‌రెడ్డి శుక్రవారం సర్టిఫికెట్ల కోసం యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి రాగా... అక్కడి అధికారుల సమాచారం మేరకు ఎస్ఐ నాగరాజు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే, ఇతనికి నకిలీ పత్రాలు సమకూర్చిన వెంకటేష్‌ను సైతం పట్టుకున్నారు. ఇద్దరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
ఏ దేశమేగినా... నో ప్రాబ్లమ్!
స్విట్జర్లాండ్: కొత్త ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లినపుడు ఎవరికైనా ఎదురయ్యే ప్రధాన సమస్య భాష. మనం చెప్పేది అవతలి వారికి అర్థం కాదు... వారికేమో స్థానిక భాష తప్పితే ఇంగ్లీషు రాదు. చాలాచోట్ల ఎంతోమందికి ఇది అనుభవంలోకి వస్తుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్లోరియాన్ నాస్ట్, జార్జ్ హార్న్, స్టెఫాన్ స్ట్రీయిట్లకు ప్రపంచదేశాలను చుట్టి రావడం హాబీ. ఇందులో భాగంగా 2013లో వియత్నాం పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరు ప్రయాణిస్తున్న బైక్ మొరాయించింది. దాన్ని రిపేర్ చేయించాలి. స్థానికులను మెకానిక్ గురించి అడిగి... వారి నుంచి సమాధానం రాబట్టడం వీరికి తలకు మించిన పనైందట. దాంతో భాషతో పనిలేకుండా బొమ్మలతో సంభాషిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వీరికి వచ్చింది. చివరికి ఓ రెండేళ్లు తర్జనభర్జన పడి అందరికీ పనికొచ్చేలా 40 కామన్ చిహ్నాలతో ఓ టీ షర్టును రూపొందించారు. రెస్టారెంట్, లాడ్జి, బ్యాంకు, డ్రింక్, వాటర్, విమానాశ్రయం... ఇలాంటి 40 చిహ్నాలతో ఓ టీషర్టును రూపొందించారు. దాంతో వీరికి భాష సమస్య తప్పింది. ఎక్కడికెళ్లినా స్థానికులకు తమ టీ షర్టుపై ఉన్న బొమ్మను చూపించి సమాచారం అడుగుతున్నారు. అవతలి వారికి అది సులభంగా అర్థమై దారి చూపిస్తున్నారట. ఇదేదో బాగుంది కదూ... విదేశాలకు వెళ్లేటపుడు మనమూ ఇలాంటి టీషర్టు ఒకటి దగ్గర పెట్టుకుంటే సరి. -
విదేశాల్లో విద్యాభ్యాసానికి 300 మంది
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 300 మంది ఎస్సీ విద్యార్థులను పంపించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తుండగా, దాన్ని ప్రభుత్వం రూ.20 లక్షలకు పెంచనుంది. గతేడాది 160 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు వెళ్లారు. ఈ ఏడాది కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, వేసవిలోనూ హాస్టళ్లను ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సచివాలయం నుంచి ఎస్సీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా పథకాల అమలు తీరును సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఏజెన్సీలతో మాట్లాడి హాస్టళ్లకు కావాల్సిన మౌలిక మరమ్మతులను క్షేత్రాధికారులు చేయించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సలో ఎస్సీ శాఖ అధికారులు ఉమాదేవి, సురేశ్‌రెడ్డి, వసంతలక్ష్మి, ఆనంద్‌కుమార్, జిల్లా ఈడీలు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త!
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త! ఇకపై తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లను విదేశాల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కొత్తగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నారైలు, విదేశీయులు భారత్ పర్యటనకు వచ్చేముందు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఇండియాలోని తమ బంధువులు, టూర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఈ పరిస్థితిలో మార్పులు చేర్సులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్ సైట్ లో అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం కల్పించింది. విదేశీ ప్రయాణీకులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడటమే లక్ష్యంగా కొత్త టికెట్ బుకింగ్ వ్యవస్థను భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కొత్త పద్ధతిలో విదేశీయులు, ఎన్నారైలు తమకు ఫారిన్ బ్యాంకులు అందించిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 'ప్యాలెస్ ఆన్ వీల్స్' , 'మహరాజా' వంటి లగ్జరీ ట్రైన్లు, విదేశీయుల పర్యటనలకు అనువుగా ఉండే ఇతర టూరిస్ట్ స్పెషల్ ట్రైన్లతోపాటు, సాధారణ సర్వీసుల్లో కూడ ఈ కొత్త అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటువంటి అంతర్జాతీయ లావాదేవీలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ప్రత్యేక అవకాశం కల్పించడం ఇది రెండోసారి. క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని గమనించిన ఐఆర్ సీటీసీ మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని అప్పట్లో రద్దు చేసింది. ప్రస్తుతం హ్యాకింగ్ వంటి సమస్యలు ఎదురు కాకుండా వెబ్ సైట్ లో భద్రతను మరింత పటిష్ఠ పరచి ముందుగానే అన్నిరకాల పరిశీలనలు పూర్తయిన తర్వాతే టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నిమిషానికి 15,000 బుకింగ్స్ ను చేసే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ... సెకనుకు 250 టికెట్లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 58 శాతం టికెట్లు ఆన్ లైన్ లోనే అమ్మకాలు జరుగుతుండటం విశేషం. కాగా ప్రస్తుతం ఐఆర్ సీటీసీ అందిస్తున్న కొత్త సదుపాయం ఏప్రిల్ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. -
విజయ్ మాల్యా విదేశీ ఆస్తుల వివరాలపై ఈడీ కన్ను
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాకు విదేశాల్లో ఉన్న ఆస్తుల సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సేకరించేక్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, తదితర దేశాలకు లెటర్స్ రొగటొరీస్(ఎల్ఆర్)ల జారీకి సిద్దమవుతోంది. యునెటైడ్ బ్రూవరీస్ చైర్మన్ మాల్యాకు కొన్ని దేశాల్లో ఉన్న చర, స్థిరాస్థి వివరాలను ఈడీ ఇప్పటికే సేకరించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐడీబీఐకి రూ. 900 కోట్ల రుణ ఎగవేత కేసులో యాంటీ మనీ ల్యాండరింగ్ చట్టాల ప్రకారం ఆస్తుల ఆటాచ్మెంట్కు అవసరమైన మాల్యా ఆస్తులు భారత్‌లో లేవని, అందుకే విదేశాల్లోని మాల్యా, కింగ్ ఫిషర్ ఆస్తులపై దృష్టిపెట్టినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఎందుకు పెరిగాయంటే... 1200 శాతం స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించిన నేపథ్యంలో హిందూస్తాన్ జింక్ దూసుకుపోయింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడింది. అమెరికాకు చెందిన స్ట్రెంగ్త్ ఆఫ్ నేచర్ ఎల్ఎల్సీ హెయిర్ కేర్ కంపెనీని కొనుగోలు చేయడంతో గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ షేరు పెరిగింది. ఎందుకు తగ్గాయంటే... లోహాలను అధికంగా వినియోగించే చైనా అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలం స్థాయికి స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ తగ్గించడంతో వేదాంత, హిందాల్కో, ఎన్ఎండీసీ వంటి లోహ షేర్లు తగ్గాయి. ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను సుప్రీం కోర్ట్ పొడిగించడంతో డీజిల్ కార్లను అధికంగా తయారు చేసే మహీంద్రా అండ్ మహీంద్రా తగ్గింది. లుపిన్ గోవా ప్లాంటుపై అమెరికా ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ షేరు క్షీణ త కొనసాగుతోంది. -
2.5 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చేశారు
ఇస్లామాబాద్ : ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి మొత్తం 251,624 పాకిస్తానీ జాతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని ఆదేశ మీడియా సంస్థ శనివారం వెల్లడించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పాక్ తిరిగి వచ్చిన వారి వివరాలను ఆ దేశ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ గణాంకాలతో సహా వివరించారని తెలిపింది. 2013లో జున్ 1 - డిసెంబర్ 31 మధ్య 45,008 మంది పాకిస్థానీయులు స్వదేశం చేరుకున్నారని వివరించారు. అలాగే 2014లో 78, 409 మంది... 2015లో 116,165 మంది... గత కొన్ని నెలలుగా 12,022 మంది స్వదేశం పాక్ చేరుకున్నారని విశదీకరించారు. అధికారిక నివేదిక ప్రకారం గత రెండున్నర ఏళ్లుగా.... సౌదీ అరేబియా నుంచి 120,393 మంది, ఇరాన్ నుంచి 38,097 మంది, యూఏఈ నుంచి 23, 330 మంది, బ్రిటన్ నుంచి 5400 మంది, యూఎస్ నుంచి 358 మంది, ఒమెన్ నుంచి 11,248 మంది, మలేషియా నుంచి 9, 789, గ్రీస్ నుంచి 6,976 నుంచి పాక్ చేరుకున్నారని పేర్కొంది. భారత్ నుంచి మాత్రం 27 మంది పాక్ చేరుకున్నారని చెప్పింది. -
విదేశాల్లో పండుగ చేస్కో!
ముంబై: సాధారణంగా భారతీయులు దీపావళి పండుగను బంధుమిత్ర పరివారంతో ఇంటివద్దే జరుపుకుంటారు. ఇంటి ముందట టపాసులు కాల్చి సంబరాలు జరుపుతారు. కానీ ఆ సంప్రదాయం ఇప్పుడు మారుతున్నట్టు కనిపిస్తున్నది. దీపాల పండుగను భారతీయులు విదేశాల్లో జరుపుకొనేందుకు ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నారట. విదేశాల్లో దీపావళి పండుగను ఆస్వాదించేందుకు పెద్దసంఖ్యలో భారతీయులు సిద్ధమవుతున్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. 'ఒకప్పుడు కుటుంబ పరిధిలో ఇంటివద్దే జరుపుకొనే దీపావళి పండుగను ఇప్పుడు భారతీయులు విదేశాల్లో జరుపుకొనేందుకు ఉత్సాహం చూపించడం నిజంగా మంచి విషయమే' అని సర్వే నిర్వహించిన హోటల్స్.కామ్ తెలిపింది. దీపావళి సందర్భంగా యూరప్ దేశాలకు వెళ్లేందుకు భారతీయులు అధిక ఆసక్తి కనబరుస్తున్నారని ఈ సర్వేలో తెలిపింది. దేశీయంగా గోవా ఈ విషయంలో టాప్ స్థానంలో ఉంది. దీపావళి పండుగతో భారత్‌లో సెలవుల సీజన్ ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా విదేశాలకు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే తెలిపింది. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే దీపావళి పండుగ సంబరాలను వీక్షించేందుకు సాధారణంగా విదేశీయులు భారత్‌కు వస్తుంటారని, అదేసమయంలో భారతీయులు కూడా విదేశాల్లో పండుగ జరుపుకొనేందుకు వెళుతున్నారని పేర్కొంది. -
'విదేశాల్లో భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారు'
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. విదేశీ పర్యటనల్లో మోదీ దేశ అంతర్గత సమస్యలను ప్రస్తావిస్తూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ విమర్శించారు. మోదీలాగా గతంలో ఏ ప్రధానీ విదేశ గడ్డపై భారత అంతర్గత విషయాలను ప్రస్తావించలేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అయితే గతంలో ఏ ప్రధాని కూడా విదేశీ గడ్డపై దేశ అంతర్గత రాజకీయాలను ప్రస్తావించలేదని షకీల్ అహ్మద్ పేర్కొన్నారు. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఏ పార్టీకీ, మతానికీ, సమూహానికి ప్రతినిధిలా వ్యవహరించరని వ్యాఖ్యానించారు. విదేశీ గడ్డపై భారత అంతర్గత రాజకీయాల గురించి మోదీ మాట్లాడరాదని షకీల్ అహ్మద్ డిమాండ్ చేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లంచం తీసుకున్న విషయాన్ని యావత్తు దేశం చూసిందని, ప్రత్యర్థి పార్టీ నాయకులు ఈ విషయాన్ని ఎవరైనా విదేశాల్లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. -
'దేశాలు తిరిగితే దేశాన్నెవరు చూస్తారు'
కోల్‌కతా: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చేరిగారు. 'అచ్చే సర్కార్' అంటూ ఊదరగొడుతన్న మోదీ పాలనలో...9 నెలలు 11 విదేశీ పర్యటనలు మాత్రం కనబడుతున్నాయన్నారు. ఆయన విదేశీ పర్యటనలతో నాకేమీ ఇబ్బందిలేదు కానీ ఎక్కువ సమయం విదేశాల్లోనే ఉంటే దేశాన్ని ఎవరు చూడాలని మమత మండిపడ్డారు. అవాస్తవాలు చెప్పుతూ భూసేకరణ బిల్లుతో దేశాన్ని తప్పుదొవ పట్టిస్తున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రధానమంత్రి కనుసన్నల్లో నడుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ ప్రధానమంత్రి విభాగం(పీఎం డిపార్ట్ మెంట్)గా మారిందని విమర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ నడుస్తోందని మండిపడ్డారు. -
కలెక్టర్ త్వరలో రిలీవ్!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు.. 25న సీఎస్‌ను కలవనున్న ఆరోఖ్యరాజ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ త్వరలో రిలీవ్ కానున్నారు. ఉన్నత చదువుల కోసం సెలవుపై విదేశాలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలవనున్నారు. సీఎస్ అనుమతి ఇస్తే కొద్ది రోజుల్లోనే విధుల నుంచి రిలీవై ఇన్చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సెలవు కావాలని ఎన్నికలకు మూడు నెలల ముందే కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అప్పుడే అనుమతి లభించినా సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున రిలీవ్ కాలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో సెలవుపై వెళ్లాలని కలెక్టర్ భావిస్తున్నారు. రిలీవ్కి అనుమతి కోసం ఈ నెల 25న కలెక్టర్ సీఎస్‌ను కలవనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు బదిలీలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిలీవ్‌కు అనుమతి లభిస్తుందా? లేదా అనే విషయం ఈ నెల 25 తర్వాత తేలనుంది. ఒకవేళ అనుమతి రానిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఆయన విధుల నుంచి రిలీవ్‌కానున్నారు. -
విదేశాల్లో ఆంధ్రా రొయ్య జోరు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మత్స్య ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. వెనామీ, టైగర్ రొయ్యల లభ్యత పెరగడంతో మత్స్య ఎగుమతులు బాగా పెరిగాయి. 2012-2013లో 9,28,215 టన్నుల విలువైన రూ.18,856 కోట్ల మత్స్య ఎగుమతులు సాధించామని విశాఖలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివద్ధి సంస్థ(ఎంపెడా) తెలియజేసింది. 2011-12లో ఈ పరిమాణం 8,62,021 టన్నులు కాగా వీటి విలువ రూ.16,597 కోట్లు కావటం గమనార్హం. నిజానికి గత కొన్నేళ్లలో వెనామీ, టైగర్ రొయ్య లభ్యత బాగా పడిపోయింది. దీంతో ఎగుమతుల్లో వ్యాపార వృద్ధి అంతగా లేదు. ఇప్పుడు ఈ రెండూ దొరుకుండటంతో ఎగుమతులకు ఊపొచ్చింది. మొత్తం ఎగుమతుల్లో ఫ్రోజెన్ రొయ్యి వాటా 51%గా ఉంది. రొయ్య ఎగుమతులు గతేడాదితో పోల్చితే 20%నికి పెరిగాయని ఎంపెడా తెలిపింది. వీటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే సింహభాగం. ఏటా దేశవ్యాప్తంగా 2 లక్షల టన్నుల రొయ్య సాగు జరగ్గా, మన రాష్ట్ర వాటానే (ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు, నెల్లూరు) 1.5 లక్షల టన్నులు. పెరుగుతున్న విదేశీ మార్కెట్... దేశీయ రొయ్యకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు వీటి దిగుమతికి పోటీపడుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో 23% ఈ దేశాలకే వెళుతున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ ఉత్పత్తులకు ప్రాధాన్యం లభిస్తోంది. వాస్తవానికి థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియాల్లో రొయ్యల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ రుచి, నాణ్యత పరంగా మన రాష్ట్ర రొయ్యలే ముందుంటున్నాయి. అందుకే వీటికి అంత డిమాండ్. -
బియ్యం ఎగుమతులకు బ్రేక్
మద్దతు ధర ప్రకటించని కేంద్రం విదేశాలలో దిగుమతి సుంకాల పెంపు ప్రభావం తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: విదేశాలకు బియ్యం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్‌కు లేవీ సేకరణ బియ్యానికి మద్దతు ధరను ఇంకా ప్రకటించకపోవడం, ఇక్కడి నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునే ఆఫ్రికా దేశాల్లో బియ్యం దిగుమతులపై కొత్తగా సుంకాలు విధించడం దీనికి ప్రధాన కారణాలు. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే దొడ్డ(లావు, ముతక) బియ్యానికి ఆఫ్రికా దేశాల్లో మంచి మార్కెట్టే ఉంది. ఈ బియ్యాన్ని అక్కడ పిండి ఆడించి, దానితో తయారుచేసిన జావను పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందేవారికి ఆహారంగా ఇవ్వడం తదితర కారణాల వల్ల మన బియ్యానికి అక్కడ బాగా డిమాండ్ ఉంది. కొండ ప్రాంతాల్లో నివసించే వారు దొడ్డ బియ్యాన్ని ఇష్టపడతారు. ఆ దేశాల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ వచ్చాక, రాష్ట్రంలోని ఎగుమతిదారులు, ఆ దేశాల్లోని దిగుమతిదారుల ప్రతినిధులు రైస్ మిల్లర్లు, వ్యాపారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. నూకల శాతం ఆధారంగా బియ్యం ధర నిర్ణయిస్తారు. ఐదు అంతకంటే తక్కువ శాతం నూకలు ఉండే బియ్యానికి మంచి ధర వస్తుంది. ఇటీవల జపాన్ దేశం కూడా ఇక్కడి బియ్యంపై మక్కువ చూపడంతో ఆ దేశానికీ ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టులో ఈ బియ్యం రవాణా సందడి ఒక్కసారిగా తగ్గిపోయింది. దిగుమతులపై ఆఫ్రికా దేశాలలో కొత్తగా వచ్చిన నిబంధనలు దీనికి ప్రధాన కారణం. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంకా లెవీ సేకరణ బియ్యానికి మద్దతు ధరను ప్రకటించలేదు. వాస్తవానికి ఇప్పటికే మద్దతు ధరను ప్రకటించాల్సి ఉన్నా అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేస్తోంది. ఈ ప్రభావం ఎఫ్‌సీఐ లెవీ సేకరణ ప్రక్రియపైనా ఉంది. మిల్లర్ల నుంచి లెవీగా ఎఫ్‌సీఐ స్వీకరించే బియ్యానికి కొత్త మద్దతు ధరరాని కారణంగా గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ఇచ్చిన ధరలో 90 శాతం సొమ్మును మాత్రమే మిల్లర్లకు ఎఫ్‌సీఐ చెల్లిస్తోంది. ఈ కారణాలతో పాటు ధాన్యం ధరలు మార్కెట్లో ఆకాశంలో ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు. ధాన్యం ధరలు అదుర్స్ మార్కెట్లో కొత్త ధాన్యం ధరలు మెరిసిపోతున్నాయి. స్వర్ణ రకం 75 కిలోల బస్తా లోడింగ్‌తో రూ. 1,040 ఉండగా, మిల్లులకు చేరాక కిరాయితో కలిపి రూ. 1,065 ఉంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే సోనా ధాన్యం 75 కిలోల బస్తా రూ.1,350 పలుకుతోంది. మిల్లర్లు ఈ ధరలో ధాన్యాన్ని కొని బియ్యం ఆడించి ఎగుమతి చేసే పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్లో 1010 రకం బియ్యం ధర ఐదు శాతం నూకలతో క్వింటాలు రూ.2,250 నుంచి రూ. 2,300 మధ్య ఉంది. ధాన్యం ధరలు తగ్గి, బియ్యానికి కొత్త మద్దతు ధర ప్రకటిస్తే, ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాతే మిల్లర్లు బియ్యం ఎగుమతులకు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
విదేశాల్లో పెట్టుబడికి ఐసీఐసీఐ ఫండ్
మన మార్కెట్లు పడిపోతున్నాయి. విదేశాల్లో అయితే కాస్తంత స్థిరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికోసం విదేశీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ గ్లోబల్ ఈక్విటీ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని వివిధ దేశాలకు చెందిన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే గ్లోబల్ స్టేబుల్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆగస్టు 27న ప్రారంభమయ్యే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ.5,000గా నిర్ణయించారు. ఇది ఓపెన్ ఎండెడ్ పధకం కావడంతో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు. 90 రోజుల్లో వైదొలిగితే 3%, ఆ తర్వాత 540 రోజులలోపైతే 1% అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్తో రైల్వే బుకింగ్: ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్ఎంఎస్ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు 139 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే నేరుగా ఖాతా నుంచి నగదు తీసుకొని టికెట్లను జారీ చేయడం జరుగుతుంది.