ఇటీవలి కాలంలో విదేశీ విద్యను కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో విద్యా రుణాలకు కూడా డిమాండ్ నెలకొంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన విద్యా రుణాలను అందించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ప్రక్రియలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన 7 కీలకాంశాలపై అవగాహన కల్పించేందుకే ఈ కథనం.
⇒ మొత్తం ఖర్చులపై అవగాహన ఉండాలి: విద్యార్థులు విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ట్యూషన్‌తో పాటు వసతి, జీవన వ్యయాలు, ప్రయాణ ఖర్చులు, బీమా, ఇతరత్రా అనుకోకుండా తలెత్తే ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా ఎంత రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనేది తెలుస్తుంది. అవసరానికి మించి తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఈ లెక్కలు వేసుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ కాల్‌క్యులేటర్, కాలేజ్ కోర్స్ ఎక్స్‌పెన్సెస్ కాల్‌క్యులేటర్ వంటి టూల్స్ ఉపయోగపడతాయి.
⇒ సమగ్ర పరిశోధన అవసరం: ఈ దశ పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న వివిధ రుణాల ఆప్షన్లు, అర్హతలు, వడ్డీ రేట్లు, మంజూరు విధానాలు, తిరిగి చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు, సహ–రుణగ్రహీత అవసరాలు, హామీలు, ప్రాసెసింగ్ ఫీజులపై పరిశోధన
⇒ ఖర్చులన్నింటికీ సరిపోయేలా ఉండాలి: కొత్త తరం ఎన్‌బీఎఫ్‌సీలు సమగ్ర విద్యా రుణాలను అందిస్తున్నాయి. అంటే ట్యూషన్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, లెరి్నంగ్ డివైజెస్ కొనుగోలు, జీవన వ్యయాలు మొదలైన అన్నింటికీ ఉపయోగపడే విధంగా లోన్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చదువు, కెరియర్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.
⇒ డాక్యుమెంటేషన్ ప్రధానం: విద్యార్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్ తయారు చేసుకోవాలి. వాటన్నింటినీ సరిగ్గా సమరి్పస్తే సకాలంలో రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు మెరుగుపడతాయి.
⇒ వేల్యుయేషన్‌పై అవగాహన ఉండాలి: రుణ ప్రొఫైల్స్‌ను మదింపు చేసేందుకు విద్యారి్థ–కేంద్రీకృత విధానాన్ని కొత్త తరం ఎన్‌బీఎఫ్‌సీలు అమలు చేస్తున్నాయి. సహ–రుణగ్రహీత ఆర్థిక నేపథ్యంపైనే ఆధారపడకుండా విద్యార్థి అకడమిక్ పనితీరు, ప్రవేశ పరీక్ష స్కోర్లు, ఎంచుకున్న కోర్సు .. యూనివర్సిటీ, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
⇒ వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలి: ముందస్తు అప్రూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి, పత్రాలు తనిఖీ చేయడానికి, రుణాన్ని ఖరారు చేయడానికి ఆర్థిక సంస్థకు కొంత సమయం అవసరవుతుంది. సంస్థను బట్టి అప్రూవల్ ప్రక్రియ వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే నిరీ్ణత సమయానికి రుణం మంజూరయ్యేలా చూసుకోవడానికి వీలవుతుంది.
⇒ స్మార్ట్ రీపేమెంట్ వ్యూహం ప్లాన్ చేసుకోవాలి: లోన్ తీసుకున్న తర్వాత నుంచి వడ్డీని కొంత కొంతగా కట్టుకుంటూ వెళ్లడం మంచిది. ఎందుకంటే గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ ఆ వ్యవధిలో వడ్డీ పడకుండా ఉండదు. ముందు నుంచి చెల్లించడం ప్రారంభిస్తే విద్యార్థులు ఆర్థికంగా మెరుగైన అలవాట్లను పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment