abroad students
-
విదేశాల్లో చదువు : ఫన్ అన్నారు, అంట్లు కడిగితే తప్పేంటి?
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం ఒకప్పుడు కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది.అది గొప్పోళ్లకే సొంతం అన్నట్టు ఉండేది. కానీ చాలామంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ చదువు కోవడానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇలా పలుదేశాలకి ఎగిరిపోతున్నారు. తీరా అక్కడికెళ్లాక చాలామంది విద్యార్థులు కల్చర్ పరంగా, ఆర్థికంగా ఇలా రక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్వతంత్రంగా, భద్రంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అన్ని నిబంధనలూ, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేస్తూ కష్టపడాలి. మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. కానీ అపుడు మాత్రమే, అక్కడి ఖర్చులు లోన్లు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు విద్యార్థులు. కొందరు చదువుతున్న కాలేజీల్లోనే అసిస్టెంట్లుగా పనిచేస్తారు. పనికొందరు మాత్రం వంట చేయడం, గిన్నెలు కడగటం, పిల్లల సంరక్షణా కేంద్రాలు, మొదలు పెట్రోలు బంక్, ఇతర దుకాణాల్లో పనిచేస్తారు. తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు ఇలా అంట్లు కడుగుతున్న వీడియో నొక దాన్ని ఒకరు షేర్ చేశారు. విద్యార్థి నాన్-స్టిక్ పాన్‌ను కడుగుతున్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశాడు. ‘‘విదేశాలకి స్టడీకోసంవెళ్లండి, సరదాగా ఉంటుంది అన్నారు." క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను సానుకూలంగా అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం అంట్లు కడిగితే తప్పేంటి, చిన్న చిన్న పనులైనా నేర్చుకుని ఉండాలి అంటూ మండి పడ్డారు. విదేశాల్లో అయినా ఇండియాలో అయినా ఎవరో ఒకరు అంట్లు కడగాల్సిందే.. వాటంతట అవి శుభ్రపడవు. కాకపోతే నువ్వు ఇంటికొచ్చాక ఇంకొకరు చేస్తారు. లేదా పెళ్లి అయ్యాక నీకోసం ఆ పనులు మరొకరు చేయాలని భావిస్తావ్.. అంతే తేడా. దీన్ని ఫన్‌గా అనుకోకుండా, జీవితమంతా ప్రతిరోజూ మీకోసం మీరు పనులు చేసుకోవాలని అర్థం చేసుకోండి అని కమెంట్ చేయడం గమనార్హం. go study abroad it’ll be fun they said pic.twitter.com/3yoj19uKyC — Dew (@itmedew) March 19, 2024 -
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్..ఇకపై రెండు గంటల్లోనే ‘టోఫెల్’
న్యూఢిల్లీ: విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉపకరించే ‘టోఫెల్’ పరీక్ష ఇకపై రెండు గంటలలోపే ముగియనుంది. ప్రస్తుతం ఈ పరీక్షను మూడు గంటలపాటు నిర్వహిస్తున్నారు. అధికారిక స్కోర్‌ను విడుదల చేసే తేదీని టోఫెల్ పూర్తికాగానే అభ్యర్థులు తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఈటీఎస్) వెల్లడించింది. టోఫెల్ ఒక గంట 56 నిమిషాల పాటు ఉంటుందని పేర్కొంది. టోఫెల్లో చేస్తున్న మార్పులు ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టోఫెల్ స్కోర్‌ను 160కిపైగా దేశాల్లో 11,500కిపైగా యూనివర్సిటీలు అంగీకరిస్తున్నాయి. ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వర్సిటీలు ఉన్నాయి. టోఫెల్ రిజి్రస్టేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ తెలిపారు. టెస్టు ఫీజును భారతీయ రూపాయల్లో చెల్లించవచ్చని సూచించారు. టోఫెల్ ప్రక్రియలో తీసుకొస్తున్న మార్పులతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అసోసియేషన ఆఫ్ ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజంటేటివ్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి బొర్రా వివరించారు. చదవండి: పోతపోసిన పోస్టాఫీస్...! -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్‌కు ముందే ఇంటర్న్‌షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
Corona Vaccination: విదేశాలకువెళ్లే వారికి ఊరట
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు వెళ్లే వారికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 11 వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరిచింది. ప్రతి కేంద్రానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్లను బాధ్యులను చేసింది. విదేశాలకు వెళ్తున్నట్లు పర్మిట్ వీసా, పాస్‌పోర్టును తీసుకుని నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి హాజరు కావాలని సూచించింది. విదేశాలకు వెళ్లేవారికి దీనితో ఊరట లభించనుంది. జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఇలా.. ► ఆదిలాబాద్ –పీపీయూనిట్ ► రిమ్స్ నిజామాబాద్–యూపీహెచ్సీ, వినాయక్ నగర్ ► కరీంనగర్– యూపీహెచ్సీ, బుట్ట రాజారాంకాలనీ ► వరంగల్–యూపీహెచ్సీ, లస్కర్ సింగారం ► ఖమ్మం– యూపీహెచ్సీ, వెంకటేశ్వర నగర్ ► మెదక్–యూపీహెచ్సీ, మెదక్ ► మహబూబ్‌నగర్–యూపీహెచ్సీ, రామయ్యబౌలి ► నల్లగొండ–యూపీహెచ్సీ, పానగల్ ► రంగారెడ్డి– యూపీహెచ్సీ, సరూర్‌నగర్ ► హైదరాబాద్ – యూపీహెచ్సీ, ఆర్ఎఫ్టీసీ, యూపీహెచ్సీ, తారామైదాన్ చదవండి: థర్డ్‌వేవ్‌పై ఆందోళన.. డాక్టర్లేమంటున్నారంటే.. -
‘7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు’
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. ఇందుకు మే7 నుంచి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుంచి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇందుకు ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమిషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. (గుడ్ న్యూస్: త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు..) సామాజిక దూరాన్ని పాటించి.. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాధాన్యతా క్రమంలో విదేశాల నుంచి భారతీయుల తరలింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో వాయు మార్గం ద్వారా 13 దేశాలనుంచి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్, యుకె, యుఏఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకురానున్నాయన్నారు. సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుంచి 300 మందిని తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (కిచెన్‌లో బాత్రూమ్: ‘ఓనర్‌ను జైలులో వేయాలి’) రక్షణశాఖ ఆధ్వర్యంలో.. భారత్‌కు రావలనుకునేవారు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించుకొని సర్టిఫికెట్ పొంది ఉండాలని మంత్రి పేర్కొన్నారు. వీరు భారత్‌కు చేరుకున్న తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటెన్ కేంద్రాలను నిర్వహిస్తాయని వెల్లడించారు. అదే విధంగా రక్షణశాఖ ఆధ్వర్యంలోని నౌకల ద్వారా కొన్నిదేశాల నుంచి మన దేశస్థులను తీసుకువచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో కొనసాగనుందని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. (‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ బాటలోనే’ ) విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ క్రింది ప్రాధాన్య క్రమంలో భారత్ కు తరలించనున్నారు. 1. ఆయా దేశాల నుంచి వెలి వేయబడినవారు 2. వీసా గడువు ముగిసినవారు 3. వలస కార్మికులు 4. ఆరోగ్యరీత్యా భారత్ లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైనవారు 5. గర్భిణీ స్త్రీలు 6. భారత్‌లో చనిపోయిన వారి బంధువులు 7. ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు 8. విదేశాల్లో హాస్టల్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులు -
విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రత్యేక సెల్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న విద్యార్థులకు వీసాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఇందిరా భవన్లో టీపీసీసీ, ఎన్ఆర్ఐ విభాగం, ఏపీసీసీ, ఎన్ఎస్యూఐల ఆధ్వర్యం లో అవగాహన సదస్సు జరిగింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, అమెరికా న్యాయ నిపుణులు షాండ్రిల్ల శర్మ, ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈ సదస్సులో మాట్లాడారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేసి వారికి సూచనలు, సలహాలు అందించడానికి కృషి చేయనున్నట్లు వారు చెప్పారు. ఇటీవల అమెరికా నుంచి వెనక్కు పంపిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు.