
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు వెళ్లే వారికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 11 వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరిచింది. ప్రతి కేంద్రానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, మెడికల్ ఆఫీసర్‌లను బాధ్యులను చేసింది. విదేశాలకు వెళ్తున్నట్లు పర్మిట్ వీసా, పాస్‌పోర్టును తీసుకుని నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి హాజరు కావాలని సూచించింది. విదేశాలకు వెళ్లేవారికి దీనితో ఊరట లభించనుంది.
జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఇలా..
► ఆదిలాబాద్ –పీపీయూనిట్
► రిమ్స్ నిజామాబాద్–యూపీహెచ్‌సీ, వినాయక్ నగర్
► కరీంనగర్– యూపీహెచ్‌సీ, బుట్ట రాజారాంకాలనీ
► వరంగల్–యూపీహెచ్‌సీ, లస్కర్ సింగారం
► ఖమ్మం– యూపీహెచ్‌సీ, వెంకటేశ్వర నగర్
► మెదక్–యూపీహెచ్‌సీ, మెదక్
► మహబూబ్‌నగర్–యూపీహెచ్‌సీ, రామయ్యబౌలి
► నల్లగొండ–యూపీహెచ్‌సీ, పానగల్
► రంగారెడ్డి– యూపీహెచ్‌సీ, సరూర్‌నగర్
► హైదరాబాద్ – యూపీహెచ్‌సీ, ఆర్‌ఎఫ్‌టీసీ, యూపీహెచ్‌సీ, తారామైదాన్
Comments
Please login to add a commentAdd a comment