విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు | Relief to MBBS Abroad Students: NMC Validates Older Internships For 1 Year | Sakshi
Sakshi News home page

విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు

Published Sat, Jan 7 2023 3:34 PM | Last Updated on Sat, Jan 7 2023 3:34 PM

Relief to MBBS Abroad Students: NMC Validates Older Internships For 1 Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినా కూడా భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంది. 

ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్‌కు ముందే ఇంటర్న్‌షిప్‌ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్‌ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్‌ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. 

తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్‌ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement