internship
-
యువత కోసం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకం
న్యూఢిల్లీ: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చి0ది. ఏటా రూ.66,000 మేర ఆర్థికసాయం అందించనుంది. ఐదేళ్లకాలంలో మొత్తంగా కోటి మంది 21–24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారని కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.800 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ రెండో తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబి్ధపొందే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే యువతకు బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే pminternship.mca.gov.inలో యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.6,000 అదనం నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 ఆర్థికసాయం అందనుంది. దీనికి అదనంగా ఏడాదిలో ఒకసారి రూ.6,000 గ్రాంట్ ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి ప్రతి లబ్ధి దారుడు రూ. 66,000 లబ్ధి పొందనున్నారు. ఈ వెబ్‌పోర్టల్‌లో అక్టోబర్ 12వ తేదీ నుంచి 25వ తేదీలోపు అందుబాటులో ఉన్న సమాచారంతో దరఖాస్తులను నింపొచ్చు. వీటిని అక్టోబర్ 26వ తేదీన షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులను అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీలోపు కంపెనీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థు లు తమ నిర్ణయాన్ని నవంబర్ 8–15ల మధ్య తెలపాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా మూడు ఆఫర్స్ ఇస్తారు. టాప్ 500 కంపెనీల ఎంపిక గత మూడేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధి పథకంలో భాగంగా తమ నికరలాభాల్లో కొంతమేర సమాజసేవ కోసం సవ్యంగా ఖర్చుచేసిన టాప్ 500 కంపెనీలను ఈ పథకం కోసం కేంద్రం ఎంపికచేస్తుంది. రిజర్వేషన్లూ వర్తిస్తాయి! అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లనూ వర్తింపజేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు 1,077 ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌కు మార్గం! (ఫోటోలు)
-
నైపుణ్య యువతరం..ఉద్యోగ భారతం
న్యూఢిల్లీ: దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ 3.0 సర్కారు అడుగులు వేసింది. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా, రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను చేపడతామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రయోజనాలను కల్పిస్తామని ప్రకటించారు. ఈపీఎఫ్ఓ డేటా ఆధారంగా..కొత్త ఉద్యోగాల కల్పన పథకాలను..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో నమోదయ్యే వివరాల ఆధారంగా అమలు చేస్తామని నిర్మల తెలిపారు. మొత్తంగా ప్రస్తుత 2024–25 కేంద్ర బడ్జెట్లో విద్య, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు 23 వేల కోట్లు, జాబ్ క్రియేషన్ ఇన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌కు రూ.52 వేల కోట్లు, సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్‌కు రూ.32 వేల కోట్లు కలిపి రూ.1.07 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు వివరించారు.నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు..కార్కుల నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, తగిన నైపుణ్యమున్న కార్మకులతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈ–శ్రమ్, శ్రమ్ సువిధ, సమాధాన్ వంటి పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనితో స్కిల్ ప్రొవైడర్స్, ఎంప్లాయర్స్‌కు.. ఉద్యోగాలు కోరుకునే యువతకు మధ్య అనుసంధానంకుదురుతుందని వెల్లడించారు. ఐదేళ్లలో కోటి మందికిఇంటర్న్షిప్ దేశంలో యువత సులభంగా ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించేలా, ఉద్యోగంలో చేరే ముందే తగిన అనుభవం సాధించేలా.. విస్తృతస్థాయిలో ఇంటర్న్íÙప్ పథకాన్ని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 500 టాప్ కంపెనీల్లో మొత్తంగా కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తామని తెలిపారు. ఇంటర్న్íÙప్లో చేరేప్పుడు ఒకసారి రూ.6 వేలు అందిస్తామని, తర్వాత ప్రతినెలా రూ.5 వేలు ఇంటర్న్సిప్ అలవెన్స్ అందుతుందని వెల్లడించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో సంబంధిత ఉద్యోగం, పని వాతావరణంపై యువతకు అవగాహన ఏర్పడుతుందని.. దీనితో మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం వస్తుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్ పథకానికి ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకయ్యే వ్యయాన్ని, ఇంటర్న్íÙప్ అలవెన్స్‌లో పది శాతాన్ని కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి భరిస్తాయని తెలిపారు.స్కిల్స్పెరిగితే.. ఉద్యోగాలూ పెరుగుతాయి! బడ్జెట్లో దేశ యువతలో నైపుణ్యాల పెంపు, ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలు అందించే స్కీమ్‌లను ప్రకటించడంపై హ్యూమన్స్ రీసోర్స్, ఎడ్ టెక్ రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వికసిత్ భారత్’లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు. యువతలో నైపుణ్యాలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతాయని అంటున్నారు. ‘‘మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడ్పడతాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు అందేందుకు నైపుణ్య శిక్షణ బాట వేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయి..’’అని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘నైపుణ్య శిక్షణ మాత్రమేగాకుండా.. ఉద్యోగులు, ఉద్యోగాలను కలి్పంచే కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమని క్వెస్ కార్ప్ సీఈవో గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పారు.‘‘20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు వంటివి రాబోయే తరం సాధికారతకు తోడ్పడతాయి. దేశంలోని యువతలో నైపుణ్యాల లోటును పూడ్చవచ్చు..’’అని పియర్సన్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్‌కుమార్ స్వామి పేర్కొన్నారు. ..: ఉద్యోగాల కల్పన కోసం :.. 1 ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ : వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లింపు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీనితో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా. 2 జాబ్ క్రియేషన్ ఇన్‌మాన్యుఫాక్చరింగ్ స్కీమ్: కొత్తగా ఉద్యోగంలో చేరేవారు,కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలు చెల్లించేఈపీఎఫ్‌ఓ చందాలపై తొలి నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు. సుమారు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందనిఅంచనా.3 సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్:కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్ చందాల రీయింబర్స్మెంట్. ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పనజరుగుతుందని అంచనా. (ఈ మూడు స్కీమ్‌లనుగరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనంఇచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.)..: నైపుణ్యాల శిక్షణ కోసం :..1 వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. రాష్ట్రాలు, పరిశ్రమలు, కంపెనీలతో కలసి దీనిని అమలు చేస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్స్టిట్యూట్ల (ఐటీఐ) అప్‌గ్రెడేషన్. 2 వచ్చే ఐదేళ్లలో కోటి మందికి 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్íÙప్ అందించే మరో పథకం అమలు.3 పరిశ్రమలు, కంపెనీల అవసరాలకుతగినట్టుగా ఉండేలా కోర్సులు,పాఠ్యాంశాల రూపకల్పన.4 నైపుణ్య శిక్షణ కోసం ‘మోడల్ స్కిల్ లోన్ స్కీమ్’కింద ఏటా 25 వేల మంది యువతకు రూ.7.5 లక్షల వరకు రుణాలు.5 మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగాల్లో మహిళల భాగ స్వామ్యం పెరగడం కోసం.. పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్ విమెన్ హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణకు రూ.309.74 కోట్లుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్లో రూ.309.74 కోట్లను కేటాయించారు. ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్,లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.103.05 కోట్లు. వివిధ శిక్షణ స్కీమ్‌లకు రూ.120.56 కోట్లు, మిషన్ కర్మయోగికి రూ.86.13 కోట్లు ఇచ్చారు. వీటితో ఉద్యోగులకు వివిధ నైపుణ్యాలపై రిఫ్రెషర్ కోర్సులు, మిడ్ కెరీర్ శిక్షణ ఇస్తారు. -
ఇంటర్న్‌షిప్ కోసం ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు
విజయనగరం అర్బన్: స్టైఫెండ్ ఇస్తూ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించే మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనివల్ల 40 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం(జీవీ) యూనివర్సిటీలోని వివిధ అభివృద్ధి పనులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్ కోసం ఇంజినీరింగ్ విద్యార్థుల(4వ సంవత్సరం) నమోదు ప్రక్రియ ప్రారంభించామని.. 12 వేల మంది విద్యార్థులు ఇప్పటికే వివరాలు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రఖ్యాతి గాంచిన ఎడెక్స్ సంస్థ ద్వారా సుమారు 2 వేల ఆన్లైన్ కోర్సులను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కోర్సులకు ఫీజులను సైతం ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. విద్యా సంస్థల్లో పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైనంత మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా నియమిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా సుమారు 2,200 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యాపకుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని వివరించారు. విజయనగరంలోని జేఎన్టీయూ వర్సిటీని అత్యున్నత వర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులను కలి్పస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.నాగలక్ష్మి, జేఎన్టీయూ(జీవీ) వీసీ కె.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్ జి.జయ సుమ, ప్రిన్సిపాల్ కె.శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదుకున్న ‘దీవెన’..అందిన ఉద్యోగం
సాక్షి, అమరావతి: ఓ వైపు పేదరికంతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ప్రభుత్వం అందిస్తున్న ఫీజురీయింబర్స్‌మెంట్, మరోవైపు కోర్సుల్లో చేరాక ప్రముఖ సంస్థలతో ఉచితంగా ఇప్పిస్తున్న నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్.. వెరసి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు. బహుళజాతి సంస్థల్లో మంచి పే ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో అవకాశాలు పొందేలా కార్యాచరణ అమలు చేస్తోంది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఇంజనీరింగ్ కోర్సులకే కాకుండా అన్ని డిగ్రీ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ను వర్తింపచేసింది. ఆయా కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను అందించడానికి 30కిపైగా ప్రపంచ స్థాయి సంస్థలు, మరో 27 వేలకుపైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం ఏకంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. వీటికి తోడు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఫ్యూచర్ స్కిల్స్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో కొనసాగుతోంది. నైపుణ్యాలతో కూడిన ఉన్నత విద్యను అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ.. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.37 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. ఉద్యోగ నియామకాల్లో గణనీయ ప్రగతి.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గత మూడేళ్లలో విద్యార్థులకు ప్లేస్మెంట్లు గణనీయంగా పెరిగాయి. 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య కేవలం 37 వేలు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. ఇందులో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో ఉద్యోగాలు పొందినవారు 60 వేల మంది వరకు ఉన్నారు. ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే 12వేలకు పైగా ప్లేస్మెంట్లు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. సర్టీఫికెట్లను సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులు చేసి మరీ తమ పిల్లను చదివించాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి గరిష్టంగా రూ.35వేలలోపు ఇస్తే.. జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3 లక్షలకు వరకు చెల్లిస్తోంది. అంతేకాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థి తల్లులు ఖాతాల్లోనే క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేస్తోంది. లక్షన్నర మందికి శిక్షణ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజికి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) ఎనలిస్ట్ తదితర అంశాల్లో ఈ శిక్షణ అందించింది. ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి వీలుగా ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందించింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలనూ చెల్లించి.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లించడం విశేషం. గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. బాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతికి చెల్లింపులు ఏడాదికి సగటున కేవలం రూ.2,428 కోట్లు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లను చెల్లిస్తోంది. భోజన, వసతి ఖర్చు కింద ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గత ప్రభుత్వం కేవలం రూ.4 నుంచి రూ.10 వేల వరకే ఇచ్చేది. ఈ పథకం అమలుకు గత ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయాన్ని బీసీ, ఈబీసీ, కాపు, మైనారీ్టలకు రూ.లక్షకు, ఎస్సీ, ఎస్టీ, పీడీబ్ల్యూలకు రూ.2 లక్షలకు పరిమితం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి లబ్ధి చేకూర్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఆదుకుంది.. మాది పేద రైతు కుటుంబం. గతంలో సాగుకే అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. 2017లో అన్న వరుణ్‌కుమార్‌రెడ్డి తిరుపతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.35 వేలు మాత్రమే. మిగిలిన ఫీజు అప్పులు చేసి కట్టాల్సి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. దీంతో నేను 2019లో వడ్లమూడిలోని విజ్ఞాన్ లారాలో బీటెక్ సీఎస్ఈలో చేరాను. జగనన్న సాయంతో ఏటా రూ.85 వేల ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండానే నా చదువు పూర్తి చేశాను. ఇప్పుడు బెంగళూరులోని టీసీఎస్‌లో రూ.3.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. – బోరెడ్డి పవన్ కుమార్‌రెడ్డి, సొలస గ్రామం, పల్నాడు జిల్లా జగనన్న విద్యాదీవెన గొప్ప పథకం.. నాన్న హరనాథ్ నిర్వహించే ఫ్యాన్సీ షాపు మాకు జీవనాధారం. నన్ను, అన్నయ్యను చదివించడానికి చాలా కష్టపడ్డారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రావడంతో నేను దిగులు లేకుండా టెక్కలిలో బీటెక్ సీఎస్సీ పూర్తి చేశాను. ఏడాదికి రూ.80వేల చొప్పున కోర్సు నాలుగేళ్లపాటు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. కాలేజీలో ఉండగానే ఉచితంగా సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్ అందించడంతో డెలాయిట్‌లో ఉద్యోగం సాధించగలిగాను. జగనన్న విద్యాదీవెన కచ్చితంగా గొప్ప పథకం. – సత్యవరపు మహాలక్ష్మి, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు మా నాన్న నగేశ్ సామాన్య కూరగాయల వ్యాపారి. నేను విద్యా దీవెన సాయంతో గతేడాది బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశా. ఉన్నత విద్యా మండలి ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు అందించింది. ఫలితంగా సాధారణ డిగ్రీ చేసిన నాకు హెచ్‌సీఎల్‌లో రూ.2.40 లక్షల ప్యాకేజీతో ఫైనాన్స్ ఎనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి నాలుగు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయ్యాను. ఎడ్యుటెక్ సంస్థలో 6.50 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేశారు. కంప్యూటర్స్ కెరీర్లో ఎదగాలని హెచ్సీఎల్ను ఎంపిక చేసుకున్నా. – ముదిలి నాగకార్తీక్, విజయవాడ విద్యాదీవెన ఆదుకుంది మా నాన్న రామచంద్రరావు ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా చేస్తున్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములం. నాన్న ఏడాది సంపాదన లెక్కేస్తే మా ఇద్దరి చదువులకే సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ అందడంతో నేను బీఎస్సీ (ఐవోటీ) పూర్తి చేశాను. తమ్ముడు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేస్తున్నాడు. నాకు మూడేళ్లు రూ.30 వేల చొప్పున పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. – పట్నియక్ శ్రీనివాసరావు, విజయవాడ -
ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థుల దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌నకు సర్వం సిద్ధమైంది. ఈ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. గతేడాది 2.56 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయగా, ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం 30కి పైగా ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్చువల్‌గా, మరో 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ద్వారా ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. ఇంటర్న్‌షిప్ కోసం ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. ఆ సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కోసం పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో మాన్యుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది. ఎల్ఎంఎస్–ఐఐసీ పోర్టల్‌లో వీటి వివరాలు ఉంచింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, స్మార్ట్ ఇంటన్జ్, ఎక్సల్ ఆర్, సెలర్ అకాడమీ, సిస్కో, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, వాద్వానీ ఫౌండేషన్, టీమ్ లీజ్ వంటి సంస్థల ద్వారా ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్ట్రైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. వీరితో పాటు 2వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కింద సేవలు వినియోగించుకోనుంది. వీరికి నెలకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు నెలల పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించనుంది. చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకుంటారు విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అమలు చేస్తున్నాం. దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌ను చివరి సెమిస్టర్లో పెట్టడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలతో పాటు పరిశ్రమల్లో నేర్చుకున్న విజ్ఞానంతో వేగంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అందించింది. ఏపీలో విద్యార్థులు తొలిసారిగా చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకోనున్నారు. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
‘ఫ్యూచర్ స్కిల్స్’లో ఏపీకి అగ్రాసనం
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ నైపుణ్యాలు (ఫ్యూచర్ స్కిల్స్) కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇంటర్న్‌షిప్ కోరుకుంటున్న విద్యార్థుల విషయంలో ఏపీ అగ్రశ్రేణిలో కొనసాగుతోంది. 21వ శతాబ్దపు విద్యార్థులను ‘కృతిమ మేధ’ (ఏఐ)సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు–2024’ ఊతం ఇచ్చింది. ఈ క్రమంలోనే భవిష్యత్ నైపుణ్యాల కల్పనలో 76.15 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ ‘వీబాక్స్’ ఏటా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (ఏఐయూ)తో కలిసి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు’ను విడుదల చేస్తోంది. భవిష్యత్‌లో పరిశ్రమల డిమాండ్లు, సాంకేతిక పురోగతులకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేయడంలో బలమైన ప్రాధాన్యతను ప్రదర్శిస్తోందని తాజా నివేదిక ప్రశంసించింది. ఇక నైపుణ్యాభివృద్ధిలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ఆంగ్లం, న్యూమరికల్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ (సంఖ్యాపర నైపుణాలు) కనబరుస్తున్న సిటీల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఉండటం విశేషం. ఇంటర్న్‌షిప్‌లోనూ టాప్ విద్యార్థులకు పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను దేశంలోనే ప్రప్రథమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్.. మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వర్చువల్, హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌లో సుమారు 8 లక్షల మందికి షార్ట్‌టెర్మ్, లాంగ్ టెర్మ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం వరుసగా రెండో ఏడాది ఇంటర్న్‌షిప్‌కు ఆసక్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 93.50 శాతం స్కోరు సాధిస్తే.. ఇప్పుడు 98.33 శాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 96.72 శాతంతో తెలంగాణ, 93.44 శాతంతో పంజాబ్, 92.44 శాతంతో హర్యానా ఉన్నాయి. వచ్చే జనవరిలో మరో 2.20 లక్షల మందికి ఇంటర్న్‌షిప్ 22 ఎడ్యుటెక్ సర్విస్ ప్రొవైడర్ల ద్వారా స్టేట్, గ్లోబల్ ఇంటర్న్‌షిప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఎడ్యుటెక్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 27 వేలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను కళాశాలలకు అనుసంధానం చేసి వర్చువల్, హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పించింది. ఉద్యోగాల కల్పనలోనూ మేటి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగ అవకాశాల విస్తృతిలో సమతుల్యతను ప్రదర్శిస్తోందని నివేదిక కొనియాడింది. గతంతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగుపర్చుకుని ఏపీ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది 65.58 శాతం స్కోరుతో 4వ స్థానంలో ఉండగా.. తాజాగా 72.38 శాతం స్కోరుతో 3వ స్థానానికి చేరుకుంది. హర్యానా (76.47శాతం), మహారాష్ట్ర (73.03 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రోస్థాయి నగరాలు లేనప్పటికీ ఇంతటి గణనీయమైన స్థాయిలో నిలవడం చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు లేకపోవడం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పోటీపడీ మరి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరుతో అత్యున్నతంగా నిలిచిందని నివేదిక ఊటంకించింది. సీఎం జగన్ దార్శనికతో ఐటీ, ఇతర పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. ఇప్పుడు అన్ని వయసు్కలకు ఉపాధి బాగుందని, ముఖ్యంగా 18–21 ఏళ్ల వయసు్కల్లో (73.10 శాతం స్కోరు) ఉద్యోగాల అందించడంలో నాల్గవ స్థానంలో ఉంది. మహిళలు, పురుషులకు ఉపాధి, ఉద్యోగాల కల్పిస్తున్న అంశంలోనూ ఏపీ 3వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఎంబీఏలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతుంటే ఆ తర్వాత బీఈ/బీటెక్‌లో లభిస్తున్నాయి. ఈ లెక్కన బీఈ/బీటెక్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (73.32 శాతం స్కోరుతో) 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. కేరళ, కర్ణాటక మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐటీలో 68.44 శాతం, కంప్యూటర్ సైన్స్‌లో 66 శాతం, ఆ తర్వాత ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది సాంకేతిక విద్యార్థులకు ఏకంగా 1.20 లక్షలకు పైగా క్యాంపస్ ఉద్యోగాలు వచ్చాయి. గొప్ప టాలెంట్ రిజర్వాయర్! దేశంలో పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ను ‘టాలెంట్ రిజర్వాయర్’గా నివేదిక అభివర్ణించింది. విద్యార్థులకు మెరుగైన విద్య విషయంలో దృఢమైన నిబద్ధత, విభిన్న నైపుణ్యాల సాధికారత కల్పనలో చిత్తశుద్ధిని లేకుండా ఇతంటి వృద్ధి సాధ్యపడదని పేర్కొంది. భవిష్యత్ పారిశ్రామిక అవసరాల్లో ఏపీ కీలకంగా మారుతుందని, కంపెనీలకు స్వర్గధామంగా ఉంటోందని కొనియాడింది. ఉద్యోగాల్లో రూ.2.60 లక్షలు, అంతకంటే ఎక్కువ వేతనాన్ని కోరుకునే తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ముఖ్యంగా బీఈ/బీటెక్ విద్యార్థుల్లో నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పింది. ఏపీలో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలే ఎక్కువ. కానీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న మహిళా వర్క్పోర్స్లో మెట్రోపాలిటిన్ సిటీలను కూడా వెనక్కినెట్టింది. 39.96 శాతం స్కోర్‌తో హర్యానా తర్వాతో రెండో స్థానంలో నిలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సీఎం దార్శనికతకు నిదర్శనం భవిష్యత్ ప్రపంచం కృత్రిమ మేధపై ఆధారపడుతుంది. అలాంటి తరుణంలో మన విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్ అభివృద్ధి చేయాలి. ప్రపంచంలోనే ఏపీ విద్యార్థులను అగ్రస్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పిం చారు. అందుకే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. వాటిని ఫలితాల ప్రతిరూపం తాజా ఇండియా స్కిల్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. దేశంలోనే ‘ఫ్యూచర్ స్కిల్స్ రెడీస్’లో మనం టాప్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఏఐలో పరిపూర్ణ విజ్ఞానవంతులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే ఎల్ఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల భాగస్వామ్యంతో రిసోర్స్ సెంటర్లు, ఇన్నోవేటివ్ ల్యాబ్స్‌ను పెడతాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఓవైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిసూ్తనే.. మరోవైపు వారిని ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తూ నెలకు రూ.12 వేల స్టైఫండ్ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదించారు. ఆయా కోర్సులు అభ్యసిస్తున్నవారితో హైస్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులను పరిశీలిస్తారు. ఇంటర్న్‌షిప్‌కు వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. వర్చువల్ విధానంలో మరో ఇంటర్న్‌షిప్.. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ హైస్కూల్‌ను సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలతో జత చేయనున్నారు. ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హైస్కూల్లో ఇంటర్న్‌గా చేసూ్తనే వర్చువల్ విధానంలో కూడా మరో ఇంటర్న్‌షిప్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, జాబ్ మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి రెండు విధాల ఇంటర్న్‌షిప్ ఉపయోగపడనుంది. వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విద్యార్థి తమ కోర్సు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏటీఎల్ మెంటార్షిప్.. ‘ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్’ ప్రాజెక్టు కింద ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే హైస్కూల్ బాటపడుతున్నారు. రెండు నెలల ఈ ప్రాజెక్టులో భాగంగా హైస్కూళ్లలో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్‌్స (ఏటీఎల్)’కు మెంటార్షిప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే 577 హైస్కూళ్లలో ఏటీఎల్స్ను ఏర్పాటు చేసింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఏటీఎల్’ అవసరాన్ని గుర్తించి వినియోగంలోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఆయా హైస్కూళ్లను ఇంజనీరింగ్ కాలేజీలతో మ్యాపింగ్ చేస్తోంది. వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల సహాయంతో ‘ఏటీఎల్’కు జీవం పోస్తోంది. ఐక్యరాజ్యసవిుతికి చెందిన యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న పూణే సంస్థ.. విజ్ఞాన్ ఆశ్రమ్‌కు చెందిన సోర్స్ పర్సన్స్‌తో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎల్ ద్వారా పాఠశాల విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపిస్తోంది. ఈ కోర్సుల్లోనే శిక్షణ.. ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా/డేటా ఎనలిస్ట్, రోబోటిక్స్‌లో బేసిక్స్ బోధించనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్)ను సైతం రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయంతో బేసిక్స్ నేర్పిసూ్తనే.. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ పరికరాలపై విద్యా బోధన, హైçస్యూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే కొత్త కంటెంట్ ఇన్స్టాల్ చేసి అందించనున్నారు. చదువుతో పాటే సంపాదన దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించనున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ ఓ గొప్ప మార్పునకు నాంది. అందుబాటులోని మానవ వనరుల సమర్థవంత వినియోగానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లిటరసీ పెరుగుతోంది. పేదింటి విద్యార్థులు స్మార్ట్ ప్యానల్స్‌పై పాఠాలు వింటున్నారు. ట్యాబ్‌ల్లో పాఠాలు చదువుతున్నారు. వీటి ద్వారా మరింత నాణ్యమైన సాంకేతిక పాఠాలను నేర్పించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను హైస్కూళ్లలో ఇంటర్న్‌షిప్‌నకు ఆహ్వానిస్తున్నాం. తద్వారా పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్స్, ఏటీఎల్స్ పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. – ఆచార్య హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి -
బాదంపూడిలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
-
నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు!
Google Winter Internship 2024: ప్రస్తుతం ఎక్కువ శాలరీలు ఇస్తున్న కంపెనీలలో ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒకటని అందరికి తెలుసు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చాలామంది విశ్వప్రయత్నం చేస్తారు. అందులో అందరికి జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సంస్థ 'వింటర్ ఇంటర్న్‌షిప్-2024' పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? స్టైఫండ్ ఎంత ఇస్తారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో మీ కెరీర్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రెషర్లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం అనే చెప్పాలి. అప్లై చేయడం ఎలా? అప్లై చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి. https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2023 అక్టోబర్ 01. ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది! కనీస అర్హతలు.. ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అనుభవం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python). ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, నెట్వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని. స్టైఫండ్ ఎలా? ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది. -
‘అన్‌లాగ్’లో ఇంటర్న్‌షిప్‌కు ట్రిపుల్ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ఈసీఈ ఆఖరి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది మంది అమెరికన్ బహుళజాతి సెమీ కండక్టర్ కంపెనీ అయిన అన్‌లాగ్ డివైజెస్‌కి ఎంపికయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు ట్రిపుల్‌ఐటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఆప్టిట్యూడ్, టెక్నికల్ పరీక్షల అనంతరం తొమ్మిది మంది విద్యార్థులను ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఈ విద్యార్థులకు నెలకు రూ.40వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత వారి పనితీరు ఆధారంగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇదే సంస్థ గతేడాది నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి రూ.27లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలను ఇచ్చింది. ఈ సందర్భంగా ట్రిపుల్ఐటీ ఈసీఈ హెచ్‌వోడీ పి.శ్యామ్ మాట్లాడుతూ భారతదేశ సెమీ కండక్టర్ పాలసీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా అగ్రశ్రేణి విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సలహాలు, సూచనల మేరకు ట్రిపుల్‌ఐటీలో పాఠ్యాంశాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది రకాల అత్యాధునిక ల్యాబ్‌లతో నిరంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
‘విదేశీ’ వైద్య విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఎంబీబీఎస్, తత్సమాన మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ (సీఆర్ఎంఐ) చేసుకునేందుకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల వివరాలను పొందుపరిచింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) పాసైన విద్యార్థులంతా రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చని తెలిపింది. ఏడాది ఇంటర్న్‌షిప్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వారికి స్టైపెండ్ కూడా ఇవ్వాలని ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. త్వరలో ఇంటర్న్‌షిప్ కోసం ఎఫ్ఎంజీఈ పాసైన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కాళోజీ వర్సిటీ తెలి పింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. 3,833 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం.. కరోనా కాలంలోనూ, ఆ తర్వాత అనేకమంది విదేశీ ఎంబీబీఎస్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు అక్కడకు వెళ్లి చదవగా, చాలామంది ఆన్లైన్ క్లాసుల ద్వారా మెడికల్ కోర్సు పూర్తి చేశారు. అలా విదేశీ వైద్య విద్య పూర్తి చేసినవారు తర్వాత దేశంలో మెడికల్ రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్ కోసం ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసైన వారు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. గతంలో విదేశీ గ్రాడ్యుయేట్ల కోసం కొన్ని కాలేజీల్లోనే ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉండగా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 44 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో 3,833 మంది ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ బ్యాచ్ బయటకు రాని మెడికల్ కాలేజీల్లో ఆయా కాలేజీలకు చెందినవారు ఇంటర్న్‌షిప్ దశకు చేరుకోనందున, అక్కడ పూర్తిస్థాయిలో విదేశీ గ్రా డ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించారు. సీట్ల సంఖ్యకు మించి కూడా కొన్నిచోట్ల ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. -
విద్యాలయాలుగా ఆర్బీకేలు
సాక్షి, అమరావతి : అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) యూనివర్సిటీల్లో పాఠ్యాంశమయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, వెటర్నరీ, కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులుగా కూడా మారాయి. యూనివర్సిటీలు, అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు ఇక నుంచి విధిగా ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్ నిర్వహించేలా మార్పుచేశారు. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విద్యార్థులు ఇందుకు శ్రీకారం చుట్టగా, మత్స్య యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విజ్ఞాన భాండాగారాలుగా ఆర్బీకేలు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ ఆర్బీకేలు రెండున్నరేళ్లుగా రైతులకు విశేష సేవలందిస్తూ అంతర్జాతీయ మన్ననలు అందుకుంటున్నాయి. రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేశారు. వన్‌స్టాప్ సెంటర్‌గా వీటిని తీర్చిదిద్దారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగుల మందులతోపాటు ఎరువులను రైతు ముంగిటకు సరఫరా చేస్తున్నారు. వీటికి అనుబంధంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా అద్దెకు సాగు యంత్రాలనూ అందుబాటులోకి తెచ్చారు. అలాగే, ఆర్బీకేల్లో ఏర్పాటుచేసిన కియోస్‌్కలు, డిజిటల్, స్మార్ట్ గ్రంథాలయాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక పోకడలు, మెళకువలను మారుమూల రైతులకు అందిస్తూ వాటిని నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దారు. ఇక వీటిల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రెండున్నరేళ్లలో రెండు కోట్ల మందికి పైగా రైతులు వీటి ద్వారా సేవలందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టగా, పలు దేశాల ప్రతినిధులూ ఇక్కడికొచ్చి వీటిపై అధ్యయనం చేశారు. ఈ కేంద్రాల్లో ఇంటర్న్‌షిప్ సాధారణంగా.. మెడికోలకు బోధనాస్పత్రుల్లోనూ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత పరిశ్రమల్లోనూ చివరి ఏడాది ఇంటర్న్‌షి ప్ ఉంటుంది. అదేరీతిలో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులను జిల్లా కేంద్రాల్లో ఉండే డాట్ సెంటర్లకు, మిగిలిన వర్సిటీలు రీసెర్చ్ స్టేషన్, కేవీకేలకు అటాచ్ చేసేవారు. వాటి పరిధిలో ఓ వారం పదిరోజుల పాటు విద్యార్థులు స్టడీ చేసేవారు. ప్రస్తుతం ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షిప్ నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఉద్యాన విద్యార్థులకు ఆర్నెల్లు, వ్యవసాయ విద్యార్థులకు మూడు నెలలు, వెటర్నరీ విద్యార్థులకు నెలరోజుల చొప్పున ఇంటర్న్‌షి ప్ నిర్వహించేలా ఆయా యూనివర్సిటీ వీసీలు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనీసం 20 నుంచి నెలరోజులపాటు ఇంటర్న్‌షి ప్ ఉండేలా మత్స్య యూనివర్సిటీ కూడా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లో ఈ ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టారు. ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్ కార్నర్ ఇక ఇంటర్న్‌షి ప్ కోసం ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్ కార్నర్‌ను ఏర్పాటుచేశారు. రీసెర్చ్, ఎక్స్టెన్షన్ సెంటర్ల శాస్త్రవేత్తలతో పాటు స్థానిక అధికారులు, ఆర్బీకే సిబ్బందితో అనుసంధానం చేశారు. ప్రతీరోజు ఆర్బీకేలను విజిట్ చేస్తూ వాటి ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించేలా షెడ్యూల్ రూపొందించారు. ప్రధానంగా ఇన్పుట్స్ సరఫరా, కియోస్‌్కల పనితీరు, వాతావరణ సమాచారం, నాలెడ్జ్ షేరింగ్, ఈ–క్రాప్ బుకింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్ సరీ్వస్, కొనుగోలు తీరు, ఆర్బీకే సిబ్బంది, బ్యాంక్ మిత్రల సేవలు, పశువులకు వ్యాక్సినేషన్, హెల్త్‌కార్డుల జారీ, సీహెచ్‌సీలు, పొలంబడులు, తోటబడులు, పశు విజ్ఞాన బడులు, వ్యవసాయ సలహా మండళ్ల పనితీరు, ఎఫ్పీఓలు, జేఎల్‌జీ గ్రూపుల పనితీరుతో పాటు పంటల బీమా, రైతుభరోసా, సున్నా వడ్డీ పంటల రుణాలు వంటి పథకాల అమలు తీరుతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు సమరి్పంచాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై విద్యార్థుల అధ్యయనాన్ని అంచనా వేస్తూ 5–10 మార్కుల వరకు ఇస్తారు. తరగతి గదుల్లో ఆర్బీకేల గురించి.. ఈ నేపథ్యంలో.. రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆర్బీకేల అంశాన్ని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సీటీల్లో పాఠ్యాంశంగా చేర్చారు. గ్రామీణ ఆరి్థక వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్న వీటిæ గురించి తరగతి గదుల్లో బోధిస్తున్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది? వాటి ఆవశ్యకత, లక్ష్యాలు, వాటి ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలు, రైతుల జీవితాల్లో ఆర్బీకేలు ఎలాంటి మార్పును తీసుకొచ్చాయి.. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆర్బీకేలను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాయి వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు. ఆర్బీకేల ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాం నేను బీఎస్సీ హానర్స్ ఫైనల్ ఇయిర్ చదువుతున్నా. నాతో పాటు మరో ఆరుగురు విద్యార్థులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ఆర్బీకే పరిధిలో ఇంటర్న్‌షి ప్ చేస్తున్నాం. ఆర్బీకేల పనితీరు.. అందిస్తున్న సేవలను పరిశీలిస్తున్నాం. రోజూ ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నాం. సాయంత్రం పూట రైతులతో భేటీ అవుతూ వారి సమస్యలకు సలహాలు, సూచనలిస్తున్నాం. – దాసరి షీలా జయశ్రీ, పార్వతీపురం ఉద్యాన కళాశాల విద్యార్థిని ఆర్బీకేల గురించి కాలేజీలో ఎంతో చెప్పారు నేను బ్యాచురల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ చదువుతున్నా. ఏప్రిల్ నుంచి ఇంటర్న్‌షి ప్‌కు వెళ్లబోతున్నాం. ఈసారి ఇంటర్న్‌షి ప్లో ఆర్బీకేల విజిట్‌ను కూడా చేర్చారు. కాలేజిలో కూడా వాటి కోసం ఎంతో చెప్పారు. ఇంటర్న్‌షిప్‌లో వాటి పనితీరుపై ప్రత్యక్షంగా స్టడీ చేస్తాం. – భూక్యాసాయి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి సుశిక్షితులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం విద్యాబోధన తరగతి గదులకే పరిమితం కాకూడదు. వారు నేర్చుకున్న పాఠాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైనా అవగాహన పెంపొందించుకోవాలి. యూనివర్సిటీ నుంచి బయటకొచ్చేసరికి పరిశోధనలు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్ నిర్వహిస్తున్నాం. – డా.ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం. ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టాం. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఐదు నుంచి ఆరుగురు చొప్పున ఒక్కో ఆర్బీకేకు అటాచ్ చేశాం. – డాక్టర్ టి.జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్‌కు ముందే ఇంటర్న్‌షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
సాక్షి అమరావతి: ఏపీలోని 3.5 లక్షల మంది విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి తమ ఇంటర్న్‌షిప్‌లను ప్రారంభిస్తారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి తెలిపారు. మండలి కార్యాలయంలో లింక్డ్ఇన్ ద్వారా చేకూరే ప్రయోజనాలపై మంగళవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలి అభివృద్ధి చేసిన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ప్లాట్‌ఫారమ్ గురించి వివరిస్తూ.. ఇప్పటికే 9 లక్షల మంది విద్యార్థులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇక నుంచి ఎల్‌ఎంఎస్‌లో ఉద్యోగావకాశాలు కనిపిస్తాయని చెప్పారు. లింక్డ్ఇన్ ఇండియా హెడ్ సబాకరీం మాట్లాడుతూ.. ఏపీలో చాలా టాలెంట్ పూల్ ఉందని.. రాష్ట్రంలో విద్యార్థుల అవకాశాలు పెంచడానికి, యజమానులను ఆకర్షించడానికి లింక్డ్ఇన్ సహాయపడుతుందని చెప్పారు. లింక్డ్ఇన్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ మాట్లాడుతూ.. లింక్డ్ఇన్ లెర్నింగ్ సొల్యూషన్స్ నుండి విద్యార్థులు ప్రతివారం 60 కోర్సులు నేర్చుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథ్ దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నన్నయ వర్సిటీ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్
రాజమహేంద్రవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశమిచ్చి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు షీనా మేథ్యూ, ఎల్. రవి, సాయిసుస్మిత, శరణ్యలు మంగళవారం వీసీ ఆచార్య ఎం. జగన్నాథరావుతో సమావేశమయ్యారు. రెండు నెలలపాటు సాప్ట్వేర్ టూల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇప్పటికే తమ విద్యార్థులకు వికాస సహకారంతో కొన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. టీసీఎస్ సంస్థ కూడా ముందుకు రావడం హర్షణీయమన్నారు. జిల్లాలోని ప్రైవేట్ సంస్థలలో కూడా ఇంటెర్న్షిప్ అందించేందుకు తోడ్పడాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య టి. అశోక్, ఓఎస్డి ఆచార్య ఎస్. టేకి, డీన్ ఆచార్య పి. సురేష్‌వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. పెర్సిస్, వికాస్ పీడీ కె. లచ్చారావు, మేనేజర్ శ్రీకాంత్, శర్మ, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా రెండు నెలల శిక్షణ తూర్పు గోదావరి జిల్లాలో 3500 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా సెప్టెంబర్ చివరి వారం నుంచి రెండు నెలల శిక్షణ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కే.మాధవీలత తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో టీసీఎస్ ప్రతినిధులు ఎన్.రవి, సుస్మిత, శరణ్య, వికాస్ పీడీ కే.లచ్చారావుతో కలిసి శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంస్థ తరఫున 15 నుంచి 20 మంది శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్‌షిప్‌నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్‌గా పరిగణిస్తే భవిష్యత్‌కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్‌ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్‌షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్‌ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్‌చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్‌షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లోగాని, ఆఫ్‌లైన్‌లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్‌లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్‌కుమార్‌రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
విదేశీ వైద్య విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధం కారణంగా చదువు చివరి సంవత్సరంలో ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 30 కన్నా ముందు మెడిసిన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీచేసింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే వారు ఆ దేశంలో భౌతికంగా తరగతులకు హాజరుకానందున, ఎఫ్ఎంజీఈలో అర్హత సాధించాక వారు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ (సీఆర్ఎంఐ) చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా లేదా ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా చాలా మంది వైద్య విద్యార్థులు మెడిసిన్ పూర్తి చేయకుండా ఫైనల్ ఇయర్లోనే తిరిగొచ్చారు. వారు ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోలేదు. దీంతో సీఆర్‌ఎంఐని రెండేళ్లు తప్పనిసరి చేసింది. ఆ తర్వాత వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులవుతారు. అనంతరం ఎక్కడైనా ప్రాక్టీస్ గానీ, ఏవైనా ఆస్పత్రుల్లో పనిచేయడానికి గానీ వీలు కలుగుతుంది. కాగా, కేంద్రం ఈ వెసులుబాటును ఈ ఏడాది వరకే కల్పించినట్లు ఎన్ఎంసీ స్పష్టంచేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది మెడికల్ విద్యార్థులు ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అందులో చివరి ఏడాది చదువుతున్న వారు 4 వేల మంది వరకు ఉంటారని అంచనా. వారందరికీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటు ప్రయోజనం కలగనుంది. -
స్కిల్డు ఫోర్సు పేరిట... లక్ష మందికి నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: దేశంలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. స్కిల్డు ఫోర్సు పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్(ఎంజీఎన్సీఆర్ఈ), ఆరెస్బీ ట్రాన్స్మిషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వంటి సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇప్పించనుంది. ఉన్నత విద్యనభ్యసించే ఆసక్తిగల విద్యార్థులు ఇంటర్న్‌షిప్.ఏఐసీటీఈఇండియా.ఓఆర్జీ’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ సూచించింది. తరగతి గది పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు సరైన నైపుణ్యావగాహనకు అవకాశం ఉంటుందని ఏఐసీటీఈ అభిప్రాయం. సాంకేతిక విద్యనభ్యసించే వారే కాకుండా ఇతర కోర్సుల వారికీ ఈ ఇంటర్న్‌షిప్ మేలు చేయనుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ దేశంలో లక్ష మందికి ఏఐసీటీఈ నైపుణ్య శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండగా.. అంతకు మించి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తుండటం విశేషం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్షలాది మందికి ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయిస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రత్యేకంగా పలు ఐటీ ఆధారిత కోర్సులనూ అందిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 40కి పైగా ఐటీ కోర్సుల్లో ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. రాష్ట్రంలోని 1.60 లక్షల మందిని ఇప్పటికే ఈ కోర్సులకు ఎంపిక చేశారు. వాస్తవానికి ఈ ప్రత్యేక కోర్సులు అభ్యసించాలంటే ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి 15 వేల వరకూ ఖర్చవుతుంది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వమే ఈ కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది. దీనికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రూ.37 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ శిక్షణ కోసం ఉన్నత విద్యా మండలి, మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. (చదవండి: వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!) -
డిగ్రీ ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఏపీలో ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అమలు చేస్తున్నారు. నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్ కోర్సులు అభ్యసించే వారికి ఏడాది ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టారు. మూడేళ్లలో డిగ్రీ కోర్సు నుంచి ఎగ్జిట్ అయ్యేవారికి 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఇంటర్న్‌షిప్ అమలులో ఆటంకాలు కలిగాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కరోనా తగ్గింది. కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులూ జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ సూచనల మేరకు రాష్త్ర ఉన్నత విద్యా మండలి ఇంటర్న్‌షిప్ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. 27వేల సంస్థల గుర్తింపు.. విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌నకు రాష్ట్రంలోని 27,119 సంస్థలను గుర్తించారు. వీటిలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ఎంపికచేశారు. మాన్యుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. వీటిలో ఏపీ జెన్కో, హ్యుందాయ్, కియా మోటార్స్, విప్రో, అమర రాజా బ్యాటరీస్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెంబ్‌కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహా వేలాది కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌నకు అవకాశముంది. ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్లో ఉంచారు. ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. వీటిలో వర్సిటీల వీసీలు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు ఉన్నారు. విద్యార్థులకు సహకరించేందుకు కాలేజీల్లో సమన్వయకర్తలను నియమించారు. ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులను సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు. -
జాతీయ పాఠ్యప్రణాళికలో ‘స్థానిక’ అంశాలు
సాక్షి, అమరావతి: జాతీయ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో సమూల మార్పుల దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. జాతీయత, దేశీయ విజ్ఞానం, పౌరసత్వం, కళలు, సంస్కృతి సంప్రదాయాలు, వివిధ చేతి వృత్తుల్లో ఇంటర్న్‌షిప్ వంటి అంశాలకు పెద్దపీట వేయనుంది. ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని లోకల్ ఫ్లేవర్‌తో జాతీయ పాఠ్యప్రణాళికకు రూపకల్పన చేయాలని నిర్ణయించింది. 2022 ఆగస్టు నాటికి అమల్లోకి తేవాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సంకల్పించింది. ఈ లోగానే పాఠశాల స్థాయి పాఠ్యాంశ ప్రణాళిక, పుస్తకాల తయారీ వంటి ప్రక్రియలను కూడా పూర్తిచేసేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటోంది. పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్యలతో పాటు ఉపాధ్యాయ విద్య, వయోజన విద్యలోనూ మార్పులు జరిగేలా జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేపట్టనుంది. రానున్న 4 వారాల్లో జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేయడం, మొబైల్ అప్లికేషన్ల ద్వారా సర్వేలను పూర్తి చేసి ఆ నివేదికలను పంపించేలా రాష్ట్రాలకు సూచనలు చేసింది. పాఠశాల స్థాయిలోనూ సబ్జెక్టుల ఎంపిక పాఠ్యాంశాలు, బోధనా విధానాలు, ఇతర ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన అంశాలను పాఠ్యప్రణాళిక రూపకల్పనలో పొందుపర్చనున్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 17 కొత్త అకడమిక్ అంశాలు ఇందులో ఉండనున్నాయి. ఇప్పటివరకు ఉన్నత విద్యారంగంలోనే ఉన్న.. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్థులకు స్వేచ్ఛ వంటివి పాఠశాల స్థాయిలో సెకండరీ విద్యార్థులకూ వర్తింపచేయనున్నారు. కోర్ సబ్జెక్టులకు సంబంధించి కరికులమ్ సంక్షిప్తీకరణ, బహుభాషా నైపుణ్యాల పెంపుదల వంటివి ఉండనున్నాయి. ఆన్లైన్లో జిల్లా స్థాయి సంప్రదింపులను కొన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు, నిరక్షరాస్యులు ఇందులో పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల సేకరణకు ఎన్సీఈఆర్టీ 100 ప్రశ్నలతో ఒక పత్రాన్ని రూపొందించి ఇచ్చింది. ఇందులో 40 ప్రశ్నలు పాఠశాల విద్యకు సంబంధించినవి. తక్కినవి వయోజన విద్య, ఉపాధ్యాయ విద్య, పూర్వ ప్రాథమిక విద్యలకు సంబంధించినవి. -
వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో నాసిరకమైన వైద్య విద్యకు చెక్ పెట్టేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశాల్లో నాణ్యమైన ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికే మన దేశంలో శాశ్వత మెడికల్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఏ దేశంలోనైనా గుర్తింపు పొందిన వైద్య కాలేజీల్లోనే చదవాలని విద్యార్థులకు సూచించింది. మన దేశంలో మాదిరిగా వైద్య విద్య కోర్సు (నాలుగున్నరేళ్లు), ఇంటర్న్‌షిప్ (ఏడాది) రెండూ కలిపి ఐదున్నరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయాలి. కోర్సు పూర్తయి వచ్చాక, స్వదేశంలో మరో 12 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఎగ్జిట్ పరీక్షలో పాసై తీరాలి. పదేళ్లలోపే ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్‌షిప్ మొత్తం పూర్తిచేయాలి. అప్పుడే మనదేశంలో రిజి స్ట్రేషన్‌కు, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదా ఏదైనా ఆసుపత్రిలో పనిచేయడానికి వీలుపడుతుందని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. చదవండి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం సీటు రాక .. తక్కువ ఫీజుతో.. ఈ ఏడాది 15.44 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, దాదాపు 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కానీ, మన దేశంలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 5,200 బీబీఎస్ సీట్లున్నాయి. కానీ 20 వేల మందికిపైగా నీట్ అర్హత సాధించి ఉంటా రని అంచనా. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ.23 లక్షల వరకు ఉంటోంది. విదేశాల్లో చదివితే రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలవుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా, పాకిస్తాన్ ల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎఫ్ఎంజీఈ ఉత్తీర్ణత 14 శాతమే... విదేశాల్లో ఎంబీబీఎస్ అంత నాణ్యతతో ఉండటం లేదన్న అభిప్రాయం ఉంది. పలు దేశాల్లో చదివి వచ్చినవారు అనేకమంది ఇక్కడ రిజిస్ట్రేషన్‌కు ముందు రాసే పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మనదేశంలో ప్రాక్టీస్ చేసేలా లైసెన్స్ పొందడానికి మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలకు 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, కేవలం 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే 14.22 శాతమే ఉత్తీర్ణులయ్యారన్నమాట. చైనా, రష్యా, ఆయా దేశాల్లో చదివినవారు చాలా తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని కేంద్రం తెలిపింది. ప్రతి విద్యార్థికీ ఈఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు అవకాశముంటుంది. కొత్త నిబంధనల మేర కు విదేశాల్లో వైద్యవిద్య ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు నాణ్యమైన విద్యకు తోడ్పాటు ఎన్ఎంసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించడానికి తోడ్పడతాయి. తద్వారా ఇక్కడ ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసవడానికి, ప్రాక్టీస్ చేయడానికి వీలుకలుగుతుంది. మన దేశంలో మాదిరి కోర్సు కాలవ్యవధి, ఇలాంటి సిలబస్ ఉన్న వియత్నాంలో చదివేం దుకు అడ్మిషన్ తీసుకున్నా. – నర్మద తూతూ మంత్రం చదువుకు చెక్ కొన్ని విదేశీ మెడికల్ కాలేజీలు తూతూమంత్రంగా చదువుచెప్పి మన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ఎన్ఎంసీ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ -
ఆర్బీఐలో ఇంటర్న్‌షిప్ రూ.20వేల స్టయిపండ్
దేశ కేంద్ర బ్యాంకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేల స్టయిపండ్ అందిస్తారు. ఇది బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకానమీ, లా తదితర విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. అర్హతలు, ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 31 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు అవకాశం కల్పించనుంది. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి గరిష్టంగా మూడు నెలలు ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఈ ఇంటర్న్‌షిప్ శిక్షణ కొనసాగుతుంది. ఎవరు అర్హులు ► స్వదేశీ విద్యార్థులకు అర్హతలు: ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు, అలాగే మేనేజ్మెంట్/స్టాటిస్టిక్స్/లా/కామర్స్ /ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్/బ్యాంకింగ్/ఫైనాన్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసించే వారు(లేదా) భారతదేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తిస్థాయి బ్యాచిలర్ డిగ్రీని చదువుతున్న వారు ఆర్బీఐ సమ్మర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఆయా కోర్సుల చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్నవారే కేంద్ర బ్యాంక్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులకు అర్హతలు: విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాం కింగ్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, లా(ఐదేళ్ల ప్రోగ్రామ్)లో గ్రాడ్యుయేషన్ ఆ పైస్థాయి ఉన్నత కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ► వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన వారికి 2022 జనవరి/ఫిబ్రవరిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు. తుది ఎంపికకు సంబంధించిన వివరాలను 2022 ఫిబ్రవరి/మార్చి నెలల్లో ప్రకటిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో ఇలా ► ఎంపికైన ఇంటర్న్లు ముంబైలో ఉన్న బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ విభాగాలు లేదా వివిధ ప్రాంతాల్లోని ఆర్బీఐ కంట్రోల్ ఆఫీస్‌ల్లో మాత్రమే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్‌కు రిపోర్ట్ చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకుకు డిక్లరేషన్ ఆఫ్ సీక్రసీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్ సమయంలో దూర ప్రాంతాల విద్యార్థులు తమవసతి సౌకర్యాలను సొంతంగా భరించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ► అర్హత, ఆసక్తి గల విద్యార్థులు తాము చదువుతున్న ఇన్స్టిట్యూట్ లేదా కాలేజీ ద్వారా ఆన్లైన్ వెబ్బేస్డ్ అప్లికేషన్ ఫామ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులు నిర్దేశిత దరఖాస్తును ఈమెయిల్ ద్వారా పంపించాలి. ► హార్ట్‌కాపీలు పంపేందుకు చిరునామా: ది చీఫ్ జనరల్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (ట్రైనింగ్–డెవలప్మెంట్ డివిజన్), సెంట్రల్ ఆఫీస్, 21వ అంతస్తు, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, షహీద్ భగత్ సింగ్ రోడ్, ముంబై 400 001కు పంపాలి. ► విదేశీ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్‌ను నింపి మెయిల్ ద్వారా cgminchrmd@rbi.org.in కు పంపించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021 ► వెబ్సైట్: https://opportunities.rbi.org.in -
ఫెడరల్ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం
ముంబై: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ త్వరలో ప్రారంభించే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో చేరేందుకు అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడరల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (ఎఫ్ఐపీ) పేరిట నిర్వహించే ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఎంఏజీఈ)తో కలిసి ఈ కోర్సును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్టిఫికెట్ అందుకోవచ్చని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఫెడరల్ బ్యాంక్‌లోనే అవకాశాలు దక్కవచ్చు కూడా. ఈ ప్రోగ్రాంలో చేరే అభ్యర్థులు ఏటా రూ. 5.70 లక్షల దాకా ఆర్జించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. దరఖాస్తు చేసుకోవాలంటే.. ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ► పదో తరగతి, ఇంటర్(ఫ్లస్ టూ), గ్రాడ్యుయేషన్.. ఏదైనా సరే 60 శాతం మార్కులకు పైబడి ఉండాలి ► 2021 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. ► దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 23 ►నవంబర్ 11న ఆన్లైన్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి కింద లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.federalbank.co.in/federal-internship-program -
చట్టసభలను అధ్యయనం చేయాలనుకుంటున్నారా?
భారత పార్లమెంట్.. ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను అధ్యయనం చేయాలని, అవగాహన పెంచుకోవాలని కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. రాజ్యసభలో ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యసభ దరఖాస్తులు ఆహ్వా నిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌ల పూర్తి సమాచారం... ఆర్ఎస్ఆర్ఎస్ అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. 2009లో డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ చైర్ అండ్ రాజ్యసభ ఫెలోషిప్స్ పథకాన్ని రాజ్యసభ ఏర్పాటు చేసింది. దీనికి ‘రాజ్యసభ రీసెర్చ్ అండ్ స్టడీ’ (ఆర్ఎస్ఆర్ఎస్) స్కీమ్‌గా పేరుపెట్టారు. ఇందులో రాజ్యసభ ఫెలోషిప్‌లు నాలుగు, రాజ్యసభ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్‌షిప్‌లు పది అందిస్తున్నారు. వీటికి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యసభ ఇంటర్న్‌షిప్– అర్హతలు ► భారత పార్లమెంటులోని వివిధ విధానపరమైన అంశాలను..ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ ఇంటర్న్‌షిప్ లక్ష్యం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు అర్హులు. గ్రాడ్యుయేట్స్ ఐదుగురు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐదుగురికి(మొత్తం 10 మంది) ఇంటర్న్స్‌గా అవకాశం కల్పిస్తారు. రాజ్యసభ సెక్రటేరియట్ ద్వారా సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్న్స్ ఎంపిక జరుగుతుంది. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ► ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులను సచివాలయంలోని కీలకమైన లెజిస్లేటివ్ సెక్షన్, బిల్ ఆఫీస్, టేబుల్ ఆఫీస్, కమిటీ సెక్షన్స్ మొదలైన వాటిలో సంబంధిత బ్రాంచ్ సూపర్విజన్/మెంటారింగ్ కింద నియమిస్తారు. ఎంపికైన తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వీరికి నెలకు రూ.10వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. ► ఇంటర్న్‌షిప్ గడువు నాటికి ఇంటర్న్లు తాము చేసిన పని, నేర్చుకున్న అంశాలతో నివేదికను తమకు కేటాయించిన సూపర్వైజర్/మెంటార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసినవారికి రాజ్యసభ నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. రాజ్యసభ ఫెలోషిప్– అర్హతలు ► మొత్తం నాలుగు ఫెలోషిప్స్ అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్ స్కీమ్ ద్వారా అభ్యర్థులు పార్లమెంటరీ సంస్థల పనితీరు, ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేస్తారు. సంబంధిత విద్యార్హత, సోషల్ సైన్స్, లా ఇతర సంబంధిత అంశాల్లో కనీసం మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు/అనుభవం గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఫిల్, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వీటికి మాజీ పార్లమెంటు సభ్యులు/రాష్ట్ర శాసనసభ సభ్యులు, పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ సచివాలయాల మాజీ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 25ఏళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ► కాలవ్యవధి: ఫెలోషిప్ 18 నెలల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది. ► అధ్యయనం చేయాల్సిన అంశాలు: ప్రధాన చట్టాల మదింపు, పార్లమెంటరీ కమిటీల పనితీరు, ప్రధాన పార్లమెంటరీ కమిటీల సమర్థత, భారతీయ పార్లమెంట్లో సంస్థాగత/విధానపరమైన సంస్కరణలు, ఇతర కామన్వెల్త్ పార్లమెంట్ల ప్రత్యేకతలపై అధ్యయనం చేయాలి. రాజ్యసభ సెక్రటేరియట్ సూచించిన అంశాలపై కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ► రీసెర్చ్ గ్రాంట్: రాజ్యసభ ఫెలోషిప్స్ కేవలం నలుగురు మాత్రమే పొందగలరు. ప్రతి ఫెలోషిప్‌కు రీసెర్చ్ గ్రాంట్‌గా రూ.8లక్షలను పలు దఫాలుగా అందిస్తారు. దీంతోపాటు మరో రూ.50 వేలు కంటిజెన్సీ ఫండ్‌గా ఇస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► రాజ్యసభ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rksahoo.rs@sansad.nic.in ► రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rssei.rsrs@sansad.nic.in ► దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 ► వెబ్సైట్: https://rajyasabha.nic.in/rsnew/ fellowship/felloship_main.asp