ఆర్‌బీఐలో ఇంటర్న్‌షిప్‌ రూ.20వేల స్టయిపండ్‌ | RBI Summer Internship 2022: Notification, Eligibility, Selection Process Details | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐలో ఇంటర్న్‌షిప్‌ రూ.20వేల స్టయిపండ్‌

Published Mon, Nov 22 2021 8:31 PM | Last Updated on Mon, Nov 22 2021 8:31 PM

RBI Summer Internship 2022: Notification, Eligibility, Selection Process Details - Sakshi

దేశ కేంద్ర బ్యాంకు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేల స్టయిపండ్‌ అందిస్తారు. ఇది బ్యాంకింగ్‌, ఫైనాన్స్, ఎకానమీ, లా తదితర విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. అర్హతలు, ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్‌ 31 తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు అవకాశం కల్పించనుంది. ఈ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ కాల వ్యవధి గరిష్టంగా మూడు నెలలు ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య కాలంలో ఈ ఇంటర్న్‌షిప్‌ శిక్షణ కొనసాగుతుంది. 

ఎవరు అర్హులు
► స్వదేశీ విద్యార్థులకు అర్హతలు: ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు, అలాగే మేనేజ్‌మెంట్‌/స్టాటిస్టిక్స్‌/లా/కామర్స్‌ /ఎకనామిక్స్‌/ఎకనోమెట్రిక్స్‌/బ్యాంకింగ్‌/ఫైనాన్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అభ్యసించే వారు(లేదా) భారతదేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తిస్థాయి బ్యాచిలర్‌ డిగ్రీని చదువుతున్న వారు ఆర్‌బీఐ సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

► ఆయా కోర్సుల చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ చదువుతున్నవారే కేంద్ర బ్యాంక్‌ ఇంటర్న్‌షిప్స్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

► విదేశీ విద్యార్థులకు అర్హతలు: విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాం కింగ్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, లా(ఐదేళ్ల ప్రోగ్రామ్‌)లో గ్రాడ్యుయేషన్‌ ఆ పైస్థాయి ఉన్నత కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం
► వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన వారికి 2022 జనవరి/ఫిబ్రవరిలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో  ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు. తుది ఎంపికకు సంబంధించిన వివరాలను 2022 ఫిబ్రవరి/మార్చి నెలల్లో ప్రకటిస్తారు.

ఇంటర్న్‌షిప్‌లో ఇలా
► ఎంపికైన ఇంటర్న్‌లు ముంబైలో ఉన్న బ్యాంక్‌ సెంట్రల్‌ ఆఫీస్‌ విభాగాలు లేదా వివిధ ప్రాంతాల్లోని ఆర్‌బీఐ కంట్రోల్‌ ఆఫీస్‌ల్లో మాత్రమే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్‌కు రిపోర్ట్‌ చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకుకు డిక్లరేషన్‌ ఆఫ్‌ సీక్రసీ ఇవ్వాల్సి ఉంటుంది.  అలాగే ఇంటర్న్‌షిప్‌ సమయంలో దూర ప్రాంతాల విద్యార్థులు తమవసతి సౌకర్యాలను సొంతంగా భరించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు విధానం
► అర్హత, ఆసక్తి గల విద్యార్థులు తాము చదువుతున్న ఇన్‌స్టిట్యూట్‌ లేదా కాలేజీ ద్వారా ఆన్‌లైన్‌ వెబ్‌బేస్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

► విదేశీ విద్యార్థులు నిర్దేశిత దరఖాస్తును ఈమెయిల్‌ ద్వారా పంపించాలి.

► హార్ట్‌కాపీలు పంపేందుకు చిరునామా: ది చీఫ్‌ జనరల్‌ మేనేజర్, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ట్రైనింగ్‌–డెవలప్‌మెంట్‌ డివిజన్‌), సెంట్రల్‌ ఆఫీస్,  21వ అంతస్తు, సెంట్రల్‌ ఆఫీస్‌ బిల్డింగ్, షహీద్‌ భగత్‌ సింగ్‌ రోడ్, ముంబై 400 001కు పంపాలి.

► విదేశీ విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫామ్‌ను నింపి మెయిల్‌ ద్వారా cgminchrmd@rbi.org.in కు పంపించాలి.

ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021
► వెబ్‌సైట్‌: https://opportunities.rbi.org.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement