Opportunity
-
ఉపాధి రహిత వృద్ధి వృథాయే!
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్‌కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్న వ్యూహంతో కమలదళం ముందుకు వెళ్లనుంది. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీ పిస్తున్నా టికెట్లు ఖరారు కాలేదంటూ, మేనిఫెస్టో, ప్రచార వ్యూహమే ఖరారు కాలేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ దూకుడు పెంచేలా కార్యా చరణ ప్రణాళిక అమలు చేయనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ లోని పాత, కొత్త నేతలతోపాటు తటస్థులు, మేధావులు, ప్రముఖులకు ఈసారి పోటీ అవకాశం కల్పించాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు వివరిస్తున్నాయి. మొత్తం 119 స్థానాల్లో ఎస్సీ 19, ఎస్టీ 12 సీట్లుపోగా మిగతా 88 సీట్లలో యాభై శాతానికిపైగా బీసీలు, ఇంతవరకు శాసనసభలో అడుగుపెట్టని ఎంబీసీ కులాల వారికి టికెట్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగిందని పేర్కొంటున్నాయి. మొత్తంగా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించి ఎన్నికల గోదాలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్టు వివరిస్తున్నాయి. దూకుడుగా ప్రచారం చేపట్టేలా.. అన్ని ప్రసార, ప్రచార సాధనాలు, మీడియా, సోషల్, డిజిటల్ మీడియాలలో ఒకేసారి దూకుడుగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రాధాన్యతా అంశాల వారీగా.. ముఖ్యంగా అందులో బీసీలు, ఎంబీసీలు, మహిళలకు సంబంధించిన సమస్యలు, అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వివరిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం, ప్రాంతానికి అన్నట్టుగా కాకుండా మొత్తంగా 119 సీట్లకు వర్తించేలా కామన్ ఎజెండాతో ముందుకెళ్లాలనే యోచనలో పార్టీ నేతలు ఉన్నట్టు తెలిసింది. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ సర్కారు పాలన లోపాలు, వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, అవినీతి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతా కలసి ముందుకు.. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలోని పాత, కొత్త, జూనియర్, సీనియర్ నేతలు అంతా కలసి ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లు, ఇతర పార్టీల నుంచి చేరి ప్రధానమైన బాధ్యతల్లోని వారూ ఉన్నారని అంటున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, సీనియర్ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు తదితరులు కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏకంగా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం
-
అత్యంత గౌరవంగా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు. నిద్ర లేచేవరకు నిరీక్షించి.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిట్ ఇన్చార్జ్ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు. అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్‌కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో గదిలో భేటీ శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు. నిద్రించేందుకు ప్రత్యేక గది అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు చంద్రబాబు సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. పటిష్ట భద్రతతో సెంట్రల్ జైలుకు.. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు పక్కనే దమ్మాలపాటి.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు. వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. ఆయన కోరినట్లుగానే.. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్‌ను ముందుకు పోనిచ్చారు. -
ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!
Blueberry Farming: రోజులు మారుతున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలనే విధానానికి నేటి యువత చెక్ పెడుతున్నారు. వ్యవసాయం మీద ఆసక్తితో విదేశాల్లో ఉద్యోగాలు వదిలి మళ్ళీ మన దేశానికే వస్తున్నారు. ఆధునిక పద్దతులతో, శాస్త్రీయమైన విధానంతో పంటలు పండించి లాభాలను పొందుతున్నారు. ఈ కథనంలో మనం 'బ్లూబెర్రీ' (Blueberry) సాగుతో మంచి ఆదాయం ఎలా పొందాలనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఒకప్పటి నుంచి పండిస్తున్న వరి, రాగి వంటివి మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లు వంటివి కూడా టెక్నాలజీ ఉపయోగించి పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే డ్రాగెన్ వంటి విదేశీ పంటల విషయంలో కూడా నేర్పు ప్రదర్శిస్తున్నారు. ఇక చాలామంది అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికన్ బ్లూబెర్రీ సాగుచేస్తున్నారు. అనేక పోషక విలువలు కలిగిన బ్లూబెర్రీని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అమెరికన్ సూపర్ ఫుడ్‌గా భావించే ఈ బెర్రీస్ ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ పొందుతున్నాయి. మన దేశంలో వీటి ఉత్పత్తి చాలా తక్కువ, కావున అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. 10 సంవత్సరాల పాటు పండ్లు.. ప్రస్తుతం మన దేశంలో పండుతున్న విదేశీ పంటల్లో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీని సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. బెర్రీస్ సాగులో ఉన్న ఒక బెనిఫిట్ ఏమిటంటే.. దీనిని ఒకసారి నాటితే సుమారు 10 సంవత్సరాల పాటు పండ్లు వస్తూనే ఉంటాయి. బెర్రీస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. అనేక విటమిన్లు, పోషకాలతో నిండిన ఈ పండ్లకు గిరాకీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకుని పండిస్తే తప్పకుండా ఆశించిన లాభాలను పొందవచ్చు. ఈ పంటకు అనువైన కాలం ఏప్రిల్, మే నెలలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు 10 నెలలకే ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెడతాయి. కావున ఫిబ్రవరి & మార్చి సమయంలో కోతకు వస్తాయి. జూన్ నెల వరకు దిగుబడి వస్తుంది. ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే.. సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు.. దిగుబడి అయిన తరువాత మొక్కలను కొంత కత్తిరించినట్లయితే.. మళ్ళీ చిగురిస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పత్తి మరింత ఎక్కువవుతుంది. ఎకరం భూమిలో సుమారు 3000 మొక్కలు నాటవచ్చు. ఒక చెట్టు సుమారు 2 కేజీల వరకు పండ్లు అందిస్తుంది. కేజీ రూ. 1000 విక్రయిస్తే సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పంట పండించాలనుకునే వారు అవగాహన ఉన్న వ్యక్తులను లేదా ఇప్పటికే పంట పండిస్తున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది. -
నిన్న రహానే.. నేడు మరొక స్టార్ ప్లేయర్ కి లండన్ టికెట్
-
శుద్ధ ఇంధన ఉపకరణాలకు పెద్ద మార్కెట్
న్యూఢిల్లీ: శుద్ధ ఇంధన ఆధారిత ఉపకరణాలకు భారీ మార్కెట్ ఉందని, 50 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవాకాశాలు ఉన్నట్టు ఓ నివేదిక తెలియజేసింది. వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ముఖ్యంగా మహిళల సాధికారతకు ఉపకరిస్తుందని పవరింగ్ లైవ్లీ హుడ్స్ అనే నివేదిక వెల్లడించింది. భారత్‌లో 75 శాతం మహిళా కార్మికులు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న విషయాన్ని ప్రస్తావించింది. వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన (డీఆర్ఈ) సాంకేతికతలు విద్యుత్ అంతరాయాలకు పరిష్కారమని చెబుతూ.. వీటి వల్ల గ్రామీణ మహిళల ఉత్పాదక పెరుగుతుందని పేర్కొంది. డీఆర్ఈ సాంకేతికతలపై లైవ్లీహుడ్ ఓ అధ్యయనం నిర్వహించింది. దీనివల్ల 13,000 మందికి పైగా డీఆర్ఈ లైవ్లీహుడ్ సాంకేతికతలు వాడగా, ఇందులో 10,400 మంది మహిళలు ఉన్నారు. వారి ఆదాయం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
కెరీర్లో మనం చేసే అతిపెద్ద తప్పులు ఇవే .. హర్ష గోయెంకా పాఠాలు
తప్పులు చేయడం.. ఆ తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం కామన్. అందుకే తప్పులు చేయండి. వాటి నుంచి అవకాశాల్ని సృష్టించుకోండి’ అని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పాఠాలు చెబుతున్నారు. చేసిన తప్పుల నుంచి జ్ఞానాన్ని సంపాదించడం గొప్ప అవకాశం. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచడంలో, మీకున్న అపారమైన తెలివితేటల్ని విస్తరించేందుకు సహాయ పడుతుందని హర్ష్ గోయెంకా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుండగా.. మీరు తప్పు చేసి.. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోంటే అది తప్పు కాదని అన్నారు. Always learn from your mistakes: - See what went wrong - See what could have been done better - See what was not necessary - See what took most of your energy - See what knowledge you lacked If you learn from a mistake, a mistake isn't a mistake anymore! — Harsh Goenka (@hvgoenka) October 18, 2022 ఇక ముఖ్యంగా కెరీర్లో చేసే తప్పుల్ని ఈ సందర్భంగా హర్ష గోయెంకా హైలెట్ చేశారు. అందులో ఒకటి అన్నీ తమకు తెలుసని అనుకోవడం, రెండోది సరైన పరిచయాలు లేకపోవడం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులకు ‘ఆన్లైన్ అవకాశం’
సాక్షి, అమరావతి: ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులకు భారత ఎన్నికల సంఘం కొత్త అవకాశాన్ని కల్పించింది. ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫామ్, అఫిడవిట్లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు, నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నామినేషన్లను జూన్ 6వ తేదీలోగా దాఖలు చేసుకోవాలని, నామినేషన్ల పరిశీలన 7వ తేదీన జరుగుతుందని, ఉపసంహరణకు 9 చివరి తేదీ అని మీనా తెలిపారు. -
ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు మరోమారు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
-
ఫుట్‌పాత్‌పై బిచ్చగాడి డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. వెంటనే గొప్ప అవకాశం
వేల కోట్ల బిజినెస్‌తో నిత్యం బిజీగా ఉంటూనే సమకాలిన అంశాలపై స్పందిస్తుంటారు ఆనంద్ మహీంద్రా. అంతేకాదు అవకాశాలు రాక.. గుర్తింపుకు నోచుకోకుండా మరుగున పడిపోయిన ప్రతిభను సోషల్ మీడియా వేదికగా పట్టుకుంటారు. ఈ లోకల్ టాలెంట్‌ని ప్రశంసలతోనే వదిలేయకుండా అద్భుతమైన అవకాశాలను కల్పించడం ఆయన ప్రత్యేకత. తాజాగా ఓ స్ట్రీట్ పెర్ఫార్మర్ ఆయన కంట పడ్డాడు. అతని దశ తిరిగే ఆఫర్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. కన్నాట్‌ప్లేస్.. కళాకారుడు హర్యాణాకి చెందిన వరుణ్ యువకుడికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. శబ్ధానికి తగ్గట్టుగా నర్తించడం అంటే ఇష్టం. కానీ అదే అతనికి కష్టాలను కొని తెచ్చింది. సంగీతం, డ్యాన్సులంటూ పని చేయకుండా పరువు తీస్తున్నాడని ఉన్న ఊరూ, కన్న తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో.. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వచ్చేశాడు. అక్కడ కన్నాట్ ప్లేస్‌లో ఫుట్‌పాత్‌పై తన కళను ప్రదర్శిస్తూ బతికేస్తున్నాడు. ఆ స్టోరీతో వెలుగులోకి సంగీతం, డ్యాన్సుల మీద ప్రేమతో నిత్యం కన్నాట్ ప్లేస్‌లో ఫుట్‌పాత్‌లపై స్ట్రీట్ పెర్ఫార్మర్గా వరుణ్ ప్రదర్శనలు ఇచ్చేవాడు. బిచ్చగాడిగా భావించిన పోలీసులు బెదిరించే వారు మరికొందరు అరకొర చిల్లర విదిల్చేవారు. వాటితో కడుపు నిండకపోయినా కళను వదిలేయలేదు. కొన్నాళ్లకి అతని కళకి గుర్తింపు వచ్చింది. క్రమంగా ఆ స్ట్రీట్ పెర్ఫార్మర్‌కి అభిమానులు పెరిగారు. ఓ జాతీయ మీడియా సైతం వరుణ్‌పై చిన్న కథనం ప్రసారం చేసింది. ఆనంద్ ప్రశంసలు స్ట్రీట్ పెర్ఫార్మర్ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు ఆనంద్ మహీంద్రా. డ్యాన్స్‌లో మనందరం భాగమే. డ్యాన్స్ ద్వారా నీ భావ వ్యక్తీకరణను ఇకపై ఎవ్వరూ ఆపలేరు. అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. జాతీయ మీడియా ప్రసారం చేసిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. బాలీవుడ్‌కి బాటలు ? వరుణ్ డ్యాన్స్‌కి పాటకి ముగ్ధుడై ప్రశంసలతోనే వదిలేయలేదు ఆనంద్మహీంద్రా. వరుణ్ ప్రతిభకి సరైన వేదిక కల్పించే పనిలో పడ్డారు. మహీంద్రా గ్రూపు కల్చరల్ విభాగం హెడ్ జయ్ ఏ షాని లైన్లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీంద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్ ఈవెంట్స్‌లో వరుణ్ ప్రోగ్రామ్ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏనాటికైనా బాలీవుడ్లో అడుగు పెట్టాలనే వరుణ్ కల ఆనంద్ మహీంద్రా తోడ్పాటుతో నిజం కావాలని ఆశిద్దాం. Dance on, Varun. We’re all part of the dance of life. Let no one curb your freedom to express yourself & your art. You embody the spirit with which we all hope to dance into the New Year. (@jaytweetshah we should get him to perform at our Delhi events) https://t.co/9VSP1A2Nbl — anand mahindra (@anandmahindra) January 3, 2022 చదవండి: పేద కమ్మరికి బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా! -
కోవిడ్ నేపథ్యంలో కాస్ట్ అకౌంటెంట్లకు కొత్త అవకాశాలు
కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యాపార ప్రణాళికలు సజావుగా నిర్వహించుకునేందుకు మరింతగా తోడ్పడటంపై సీఎంఏ కసరత్తు చేస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులపైనా దృష్టి పెడుతోంది. దివాలా కోడ్ వంటివి అమల్లోకి రావడంతో కాస్ట్ అకౌంటెంట్లు కొంగొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పి. రాజు అయ్యర్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ అంశాలు వెల్లడించారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. కోవిడ్ నేపథ్యంలో ఐసీఏఐ తీసుకున్న చర్యలు.. అనేక సంవత్సరాలుగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ) పాత్ర అనేక మార్పులకు లోనైంది. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్ కోణంలో కోవిడ్–19 అనంతరం బోర్డు రిపోర్టింగ్ విధానాలు, వ్యాపారాల కొనసాగింపు ప్రణాళికలకు సంబంధించిన టెక్నికల్ గైడ్ పేరిట రెండు ముఖ్యమైన పత్రాలను ఇనిస్టిట్యూట్ రూపొందించింది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో బోర్డు స్థాయి సమీక్షలు, అలాగే లాక్డౌన్ల తర్వాత వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికల అమలు సజావుగా జరిగేందుకు తోడ్పడాలన్నది వీటి ఉద్దేశ్యం. అలాగే, వివిధ కార్యకలాపాలను సక్రమంగా, సకాలంలో మదింపు చేయడంలో కంపెనీలకు సహాయకారిగా ఉండేలా యాక్టివిటీ ఆధారిత పెర్ఫార్మెన్స్ కాస్టింగ్ విధానాన్ని కూడా మేము రూపొందించాం. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను తగిన విధంగా రూపొందించడం, ధరల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, లాభదాయకమైన/నష్టదాయకమైన ఉత్పత్తులు/కార్యకలాపాలను గుర్తించడం మొదలైన వాటికి ఇది ఉపయోగపడగలదు. అలాగే, వ్యాపార ప్రణాళికలను, బడ్జెటింగ్‌ను, వనరుల కేటాయింపు .. వినియోగాన్ని మెరుగుపర్చుకునేందుకు తోడ్పడగలదు. దివాలా కోడ్‌పై .. దేశీయంగా అమలు చేసిన అత్యంక కీలకమైన ఆర్థిక సంస్కరణల్లో ఐబీసీ కూడా ఒకటి. నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకవైపు వాటాదారులందరి ప్రయోజనాలనూ పరిరక్షిస్తూనే మరోవైపు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలను గట్టెక్కించడంలో సమతౌల్యత పాటించేందుకు ఇది తోడ్పడుతుంది. రుణ సంస్కృతి మెరుగుపర్చడం, మొండిపద్దుల నుంచి ఎంతో కొంత రాబట్టడం, రుణదాతలు.. రుణగ్రహీతల మధ్య సమీకరణలు తదితర అంశాల్లో గడిచిన అయిదేళ్లలో ఐబీసీ గణనీయమైన మార్పు తెచ్చిం ది. ప్రస్తుతానికైతే ఈ చట్టం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఎంతో కీలకమైన చట్టం ప్రభావాలను అంచనా వేయడానికి అయిదేళ్ల వ్యవధి అనేది చాలా స్వల్ప కాలం. నిర్దేశిత లక్ష్యాల సాధనకు తోడ్పడేలా ఐబీసీలోని పలు నిబంధనలకు ఎప్పటికప్పుడు తగు విధంగా సవరణలు చేస్తున్నారు. ఐబీసీ విజయవంతంగానే అమలవుతోంది. అయితే, ఇప్పటికీ వ్యక్తిగత దివాలా, సీమాంతర దివాలా, గ్రూప్ దివాలా వంటి వాటికి సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై / అమలు చేయాల్సి ఉంది. ఐబీసీలో సీఎంఏల పాత్ర.. జీఎస్టీ అమలు.. చాలా మంది సీఎంఏలు ప్రస్తుతం దివాలా ప్రక్రియకు సంబంధించి ప్రొఫెషనల్స్‌గా మారారు. తరచుగా ఐబీసీ కింద పలు కేసులు చూస్తున్నారు. తాత్కాలిక పరిష్కార నిపుణులుగా, పరిష్కార నిపుణులుగా సీఎంఏలు .. ఫోరెన్సిక్ ఆడిట్, పరిష్కార ప్రణాళిక రూపకల్పన మొదలైన వాటిలో సహాయకరంగా ఉంటున్నారు. ఇక జీఎస్టీ విషయానికి వస్తే, వివిధ రాష్ట్రాల్లో వివిధ సిద్ధాంతాల ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో దీని అమల్లో సాంకేతికంగానే కాకుండా ఇతరత్రా సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ.. సవాళ్లను అధిగమించి జీఎస్టీ దీర్ఘకాలికంగా జీఎస్టీ విజయవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. కాస్ట్ అకౌంటెంట్లకు కొత్త కెరియర్ అవకాశాలు కంపెనీ నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ప్రభావితం చేసేలా కాలక్రమేణా ఫ్యాక్టరీల స్థాయి నుంచి బోర్డు రూమ్‌ల్లోకి సీఎంఏల పాత్ర విస్తరించింది. ట్యాక్సేషన్, కాస్ట్ ఆడిట్, కన్సల్టెన్సీ, కార్పొరేట్ చట్టాలు, ఆర్బిట్రేషన్, దివాలా పరిష్కార నిపుణులు, స్వతంత్ర డైరెక్టర్లు, బ్యాంకింగ్, బీమా తదితర విభాగాల్లో సీఎంఏలు అనేక మైలురాళ్లు అధిగమించారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు అనిశ్చితి, సంక్లిష్టత వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి మనుగడకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కీలకంగా మారింది. కంపెనీ సామర్థ్యాలను, ఉత్పాదకతను, ఫలితాలను మెరుగుపర్చుకునేందుకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ సహాయకరంగా ఉండగలదు. అన్ని ఆర్థిక కార్యకలాపాల్లోనూ సీఎంఏలు చోదకశక్తిగా ఉంటారు కాబట్టి ప్రభుత్వ.. ప్రైవేట్ రంగాలు, బహుళ జాతి సంస్థల్లో.. చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఫైనాన్స్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీస్, సీఈవో, జీఎం, ఫైనాన్స్ మేనేజర్ వంటి టాప్ మేనేజ్మెంట్ హోదాలను దక్కించుకోవడానికి అవకాశాలు మరింతగా పెరిగాయి. అవసరాలకు తగ్గట్లుగా కోర్సులో మార్పుచేర్పులు కొంగొత్త టెక్నాలజీల రాకతో వ్యాపార పరిస్థితులు అసాధారణంగా, శరవేగంగా మారిపోతున్నాయి. కొత్తగా ఎదురయ్యే ప్రతిబంధకాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి రావడం వల్ల ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. కొత్త లక్ష్యాలు, కొత్త సాధనాలు, కొత్త కోర్సులను రూపొందించాల్సి వస్తోంది. సీఎంఏ కోర్సు కోసం కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టడంపై కసరత్తు జరుగుతోంది. బిజినెస్ డేటా అనలిటిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ మొదలైనవి ప్రవేశపెట్టాము. ఇనిస్టిట్యూట్ తమ విద్యార్థుల కోసం ఎస్ఏపీ సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్, ఈ–ఫైలింగ్ వంటివి ప్రపంచ స్థాయి శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది. 15 నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి చేశాం. -
ఆర్బీఐలో ఇంటర్న్‌షిప్ రూ.20వేల స్టయిపండ్
దేశ కేంద్ర బ్యాంకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేల స్టయిపండ్ అందిస్తారు. ఇది బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకానమీ, లా తదితర విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. అర్హతలు, ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 31 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు అవకాశం కల్పించనుంది. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి గరిష్టంగా మూడు నెలలు ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఈ ఇంటర్న్‌షిప్ శిక్షణ కొనసాగుతుంది. ఎవరు అర్హులు ► స్వదేశీ విద్యార్థులకు అర్హతలు: ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు, అలాగే మేనేజ్మెంట్/స్టాటిస్టిక్స్/లా/కామర్స్ /ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్/బ్యాంకింగ్/ఫైనాన్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసించే వారు(లేదా) భారతదేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తిస్థాయి బ్యాచిలర్ డిగ్రీని చదువుతున్న వారు ఆర్బీఐ సమ్మర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఆయా కోర్సుల చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్నవారే కేంద్ర బ్యాంక్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులకు అర్హతలు: విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాం కింగ్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, లా(ఐదేళ్ల ప్రోగ్రామ్)లో గ్రాడ్యుయేషన్ ఆ పైస్థాయి ఉన్నత కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ► వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన వారికి 2022 జనవరి/ఫిబ్రవరిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు. తుది ఎంపికకు సంబంధించిన వివరాలను 2022 ఫిబ్రవరి/మార్చి నెలల్లో ప్రకటిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో ఇలా ► ఎంపికైన ఇంటర్న్లు ముంబైలో ఉన్న బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ విభాగాలు లేదా వివిధ ప్రాంతాల్లోని ఆర్బీఐ కంట్రోల్ ఆఫీస్‌ల్లో మాత్రమే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్‌కు రిపోర్ట్ చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకుకు డిక్లరేషన్ ఆఫ్ సీక్రసీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్ సమయంలో దూర ప్రాంతాల విద్యార్థులు తమవసతి సౌకర్యాలను సొంతంగా భరించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ► అర్హత, ఆసక్తి గల విద్యార్థులు తాము చదువుతున్న ఇన్స్టిట్యూట్ లేదా కాలేజీ ద్వారా ఆన్లైన్ వెబ్బేస్డ్ అప్లికేషన్ ఫామ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులు నిర్దేశిత దరఖాస్తును ఈమెయిల్ ద్వారా పంపించాలి. ► హార్ట్‌కాపీలు పంపేందుకు చిరునామా: ది చీఫ్ జనరల్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (ట్రైనింగ్–డెవలప్మెంట్ డివిజన్), సెంట్రల్ ఆఫీస్, 21వ అంతస్తు, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, షహీద్ భగత్ సింగ్ రోడ్, ముంబై 400 001కు పంపాలి. ► విదేశీ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్‌ను నింపి మెయిల్ ద్వారా cgminchrmd@rbi.org.in కు పంపించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021 ► వెబ్సైట్: https://opportunities.rbi.org.in -
రూ.14.7 లక్షల కోట్లకు ఈ-టైలింగ్
ఆన్లైన్ షాపింగ్ వచ్చే అయిదేళ్లలో 35 శాతం వార్షిక వృద్ధితో రూ.14.7 లక్షల కోట్లకు చేరుకోనుంది. ఇందులో అత్యధిక వృద్ధి డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్ నుంచే వస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అవెండస్ క్యాపిటల్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశీయ డైరెక్ట్ టు కన్జూమర్ మార్కెట్ 2025 నాటికి రూ.7.35 లక్షల కోట్లు ఉండనుంది. 2019లో భారత్ రిటైల్ మార్కెట్ రూ.73.2 లక్షల కోట్లు. ఈ–టైలింగ్ తోడు కావడంతో మొత్తం మార్కెట్ 2025 నాటికి రూ.127.5 లక్షల కోట్లకు చేరనుంది. 2019లో 17 శాతంగా ఉన్న మోడర్న్ ట్రేడ్ అయిదేళ్లలో 31 శాతానికి పెరగనుంది. 63.9 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఆన్లైన్ షాపింగ్‌ను నడిపిస్తున్నారు. ఏటా ఈ యూజర్ల సంఖ్య 24% అధికమవుతోంది. మూడేళ్లలో కొత్తగా 8 కోట్ల మంది తోడు కావడంతో ఆన్లైన్ కస్టమర్ల సంఖ్య 13 కోట్లకు ఎగసింది. గతేడాది దేశీయ ఈ–టైల్ మార్కెట్ రూ.2.92 లక్షల కోట్లుంది. మొత్తం రిటైల్‌లో ఇది 4 శాతం. ఆన్లైన్ వ్యవస్థ, కస్టమర్ల అవసరాలు అధికమవడంతో కొత్త వ్యాపార విధానాలు అనుకూలంగా ఉండడం కారణంగా డైరెక్ట్ టు కన్జూమర్ (డీ2సీ) వ్యవస్థ వృద్ధి చెందుతోంది. బ్యూటీ, పర్సనల్ కేర్, ఫుడ్, బెవరేజెస్, ఫ్యాషన్ విభాగాలు డీ2సీ బ్రాండ్లను నడిపిస్తున్నాయి. లెన్స్‌కార్ట్, లిసియస్, బోట్ వంటివి ఈ రంగంలో పోటీపడుతున్నాయి. 2016 నుంచి దేశంలో కొత్తగా 600లకు పైగా ఇటువంటి స్టార్టప్ కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. -
భారత్‌లో ఉగ్రదాడులకు అవకాశం
వాషింగ్టన్: భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా వెల్లడించింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు నిర్ణయాలతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత సరిహద్దుల వద్ద దాడులకు తెగబడే అవకాశం ఉందని పేర్కొంది. మిలిటెంట్ గ్రూపులను పాక్ కట్టడి చేయని పక్షంలో భారత్‌పై ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలో చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తాము భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ శ్రీవర్ వెల్లడించారు. కశ్మీర్ విషయంలో కేవలం దౌత్య, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై మాత్రమే పాక్‌కు చైనా అండగా ఉంటుందని శ్రీవర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై పాక్‌కు చైనా మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ఆస్ట్రేలియాలో ఈసారి సిరీస్ నెగ్గొచ్చు!
ముంబై: కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేనందున ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు గొప్ప అవకాశం వచ్చిందని మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తాను నెలకొల్పిన ‘టెండూల్కర్–మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ ప్రారంభం సందర్భంగా గురువారం సచిన్ మీడియాతో మాట్లాడాడు. స్మిత్, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేత గురించి స్పందించేందుకు అతడు నిరాకరించాడు. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఆకట్టుకుంటున్నాడని, భారత పేస్ బౌలింగ్‌లో బుమ్రా కీలకమని పేర్కొన్న సచిన్... ఇలాంటి ఆరోగ్యకర పోటీ ఆహ్వానించదగినదని అన్నాడు. ఒక క్రికెటర్‌గా విరాట్ కోహ్లి పురోగతి అద్వితీయమని, అతడిలో ఆ కసిని తాను చూశానని పేర్కొన్నాడు. ‘విరాట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలుస్తాడని నేను అంచనా వేశా. అతడు ఆల్‌టైమ్ గ్రేట్‌గా అవతరిస్తాడు. ఇక్కడ బౌలర్ల స్థాయి ఏమిటనేది అప్రస్తుతం. తరానికి తరానికి మార్పు తప్పనిసరిగా ఉంటుంది. అందుకని పోల్చి చూడటాన్ని నేను నమ్మను. యువ ఆటగాడు పృథ్వీ షా మరింతగా వెలుగులోకి వచ్చేందుకు ఆస్ట్రేలియా పర్యటన ఉపయోగపడుతుంది’ అని సచిన్ విశ్లేషించాడు. -
పార్టీ అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
మోటకొండూరు : పార్టీ అవకాశమిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని టీపీసీసీ నాయకుడు చామల ఉదయ్‌చందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మోటకొండూరు మండలం చాడ మదిర గ్రామం పిట్టలగూడెంలో పర్యటించా రు. ఇల్లిల్లు కలియతిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా గత పది సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డాని తెలిపారు. దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీ యువతకు ఎక్కవగా ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ఏఐసీపీ ప్లీనరీలోనూ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల నరేష్ గౌడ్, యాదగిరి గౌడ్, సిద్దులు, విజయ్, లక్ష్మయ్య, కరుణాకర్ యాదవ్, రాములు గౌడ్, పురుషోత్తం రెడ్డి, తులసయ్య తదితరులు పాల్గొన్నారు. -
అవకాశాన్ని వెతుక్కోవాలి!
మనలో చాలామందికి ఎన్నో విషయాలలో ప్రతిభ ఉంటుంది. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అవకాశం తమ తలుపు తట్టగానే చక్కగా అందిపుచ్చుకుంటారు. వెంటనే పని ప్రారంభిచేస్తారు. అయితే, తెలివైన వాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడరు. వెతుక్కుంటారు. ఉదాహరణకు వర్షం అంతటా ఒకేలా పడుతుంది. ముత్యపు చిప్పలో పడ్డ నీటిబొట్టు ఆణిముత్యమవుతుంది. సముద్రంలో పడ్డ వానచినుకు వల్ల సముద్రానికీ ప్రయోజనం ఉండదు. వానచుక్కకీ ఉపయోగం ఉండదు. ముత్యపు చిప్పలాంటి వారు అలా అవకాశాలను అందుకుంటారు. ఆణిముత్యాల్లా తయారవుతారు. అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక కళ. అ కళ అందరికీ ఉండకపోవచ్చు కానీ, అలవరచుకోవాలి నెమ్మదిగానైనా. లేదంటే సముద్రంలో పడ్డ వానచినుకుల్లా నిరుపయోగంగా తయారవుతారు. మనిషి పుట్టిందే విజయం సాధించడానికే. ఓడిపోవడానికి కాదు. అలాగని ఓడిపోయిన వారందరూ పనికి రాని వారు కాదు. ఎలా విజయం సాధించాలో ప్రళాళిక వేసుకోవాలి. విజయం సాధించేవరకు ఆ ప్రణాళికకు తగ్గట్టుగా పని చేయాలి. మనమేమిటో మనం తెలుసుకోవాలి. మనకు మనమే అభివృద్ధి చెందాలి. ఎవరో వచ్చి మనల్ని అభివృద్ధి చేయరు. ఊతం ఇస్తారంతే! ఆ ఊతాన్ని పట్టుకుని పాకిన వారే పైపైకి పోతారు. మన పెరట్లో అనుకోకుండా పడి మొలిచిన కాకర, బీర, చిక్కుడు, సొర, పొట్ల, దోస వంటి తీగజాతి మొక్కలు కూడా ఆసరా కోసం ఎదురు చూడవు. చిన్న చిన్న గోడపగుళ్లనో, దగ్గరలో ఉన్న వృక్షాలనో, కర్రదుంగలనో పట్టుకుని పైపైకి పాకుతాయి. పందిరి వేస్తే అల్లుకుంటాయి. -
నాటకరంగం చాలా గొప్పది
సాక్షి, సిటీబ్యూరో: నాటక రంగం చాలా గొప్పదని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 22వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీల 2016 బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి నాటకరంగానికి ఉందన్నారు. నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజాసామ్యం ధనసామ్యంగా మారిందన్నారు. ధనవంతులే సినీ, రాజకీయ రంగాల్లోకి వస్తున్నారన్నారు. ఏమీలేని వారికి సినిమాల్లో అవకాశం కల్పించిన దాసరి నారాయణరావును సినీ అంబేద్కర్గా అభివర్ణిస్తున్నట్లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావుకి తాను గొప్ప అభిమానినని, సత్కారాలకు దూరంగా ఉండేతాను డాక్టర్ అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అంటే అంగీకరించక తప్పలేదన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, సినీనటుడు డాక్టర్ కైకాల సత్యనారాయణ, డాక్టర్ అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు, చిత్ర దర్శకులు కోడి రామకృష్ణ , గజల్ శ్రీనివాస్. క్రిష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రామగిరి : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినందున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా ప్రీపేర్ కావాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో గ్రూప్ స్థాయి ఉద్యోగాల ప్రకటన ఎన్నడూ వెలుబడలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు తాగు, సాగునీటిలపై, ఉద్యోగాలపై చేస్తున్న విమర్శలు అసత్యాలను పేర్కొన్నారు. త్వరలో 5వేల గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వెలుబడనుందని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, మేడబోయిన వెంకన్న, బాషబోయిన లింగస్వామి, పెరిక దివాకర్, కొంపెల్లి సత్యనారాయణ, వెంకన్న, కుమార్‌నాయక్ తదితరులున్నారు. -
ఆ అవకాశం ఎప్పటికి వచ్చేనో?!
సౌత్‌లో స్టార్ హీరోలందరితోనూ త్రిష జోడీ కట్టారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్... తమిళంలో విజయ్, విక్రమ్, అజిత్, సూర్య, ఆర్య... మ్యాగ్జిమమ్ అందర్నీ కవర్ చేశారు. లోకనాయకుడు కమల్ హాసన్‌తో కలసి రెండు సినిమాలు ‘మన్మథ బాణం’, ‘చీకటిరాజ్యం’లలో నటించారు. కానీ, సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం మాత్రం త్రిషకు ఇప్పటివరకూ రాలేదు. అందుకు ఈ చెన్నై చందమామ బాధ పడుతున్నారట. రజనీతో కలసి నటించాలనే నా కోరిక ఎప్పటికి తీరుతుందో? రజనీ హీరోయిన్ అనే ట్యాగ్ ఎప్పుడు వస్తుందో? అని ఎదురు చూస్తున్నానని త్రిష తెలిపారు. ఇన్నేళ్లపాటు సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగడానికి ప్రతిభతో పాటు అదృష్టం కూడా కారణమన్నారు. ‘‘ఫ్యూచర్ ఎలా ఉండాలో ఎప్పుడూ డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడూ అంతే. ప్రతి రోజూ సంతోషంగా గడిపేయడమే నా పాలసీ’’ అని త్రిష చెప్పారు. -
డ్యూయల్ డిగ్రీకి అవకాశం
జేఎన్టీయూ: జేఎన్టీయూ(అనంతపురం), బ్లెకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(స్వీడన్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరినట్లు జేఎన్టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్ మంగళవారం తెలిపారు. ఈ ఒప్పందంతో జేఎన్టీయూలో ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ కోర్సుల్లో మూడేళ్లు, చివరి సంవత్సరం బ్లెకింగ్ వర్సిటీలో చదవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. డిగ్రీ జేఎన్టీయూ, బ్లెకింగ్ వర్సిటీ డ్యూయల్ డిగ్రీ ప్రదానం చేస్తామన్నారు. ఎంటెక్ కోర్సు చదవడానికి బ్లెకింగ్ వర్సిటీలో చదివే వెసులుబాటు విద్యార్థులకు కలుగుతుందన్నారు. బ్లెకింగ్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అండర్స్ హెడిస్ట్రేయాన్, జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య పాండురంగడు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ఆచార్య ఆనందరావు, ఆచార్య విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ట్రిపుల్ఈ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
రామన్నపాలెం(కొడవలూరు) : ట్రిపుల్ ఈ బ్రాంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెండుగా ఉద్యోగావకాశాలు లభ్యమవుతాయని ఏపీ ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. రామన్నపాలెంలోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం ట్రిపుల్ ఈ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తక్కువనే భావన ఉందన్నారు. దీనికి పక్కనపెట్టాలన్నారు. ప్రతి పరిశ్రమ విద్యాధారమైనందున ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రమేష్‌బాబు, ట్రì పుల్ ఈ హెచ్ఓడీ రత్నజ్వోతి, ఏఓ ఎస్.వేణుగోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రాజన్ ‘సెకండ్ ఇన్నింగ్స్’కు నెటిజన్ల మద్దతు
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్‌గా రెండోసారి రఘురామ్ రాజన్‌కు అవకాశం ఇవ్వడంపై ఒకపక్క రాజకీయంగా దుమారం చెలరేగుతుండగా... ఆయనకు నెటిజన్ల నుంచి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆన్లైన్ పిటిషన్ ప్లాట్‌ఫామ్ ఛేంజ్.ఆర్గ్ ద్వారా ఇప్పటివరకూ రాజన్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి 60 వేల మంది విజ్ఞప్తి చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఈ వెబ్సైట్ ద్వారా కనీసం ఏడు పిటిషన్లు ప్రారంభం కాగా, వీటిపై 60 వేల మంది సంతకాలు చేయడం గమనార్హం. దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్ తూట్లు పొడిచారని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అయితే, ప్రధాని మాత్రం ఆర్బీఐ గవర్నర్ పోస్టుకు సంబంధించి చర్చ అనవరమని, సెప్టెంబర్‌లోనే(రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 3తో ముగియనుంది) దీనిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేయడం గమనార్హం. రాజన్‌కు మరో చాన్స్ ఇచ్చేందుకుకే మోదీ సుముఖంగానే ఉన్నారంటూ ఊహాగానాలు ఇటీవల జోరందుకున్నాయి. అటు పారిశ్రామిక వర్గాల నుంచి కూడా రాజన్ రెండో విడత పగ్గాలకు మద్దతు లభిస్తుండటం దీనికి బలం చేకూరుస్తోంది. -
కోచ్‌గా చేసే తీరిక లేదు: గంగూలీ
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేనని మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆ అవకాశం ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేదన్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఉద్యోగం ఇచ్చినా చేయలేను. ఎందుకంటే క్యాబ్ అధ్యక్షుడిగా క్రికెట్‌ను నడిపిస్తున్నా. కాబట్టి ఒకేసారి రెండు పనులను చేయడం సాధ్యం కాదు. ఈ క్షణమైతే కోచ్ పదవికి నో అనే చెబుతాను. క్రికెట్ పరిపాలకుడిగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇక బీసీసీఐకి తదుపరి అధ్యక్షుడి విషయంపై ఏమీ చెప్పలేను. నేను ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టా. అది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ ముగుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. అలాగని ఏ విషయాన్ని నేను తోసిపుచ్చలేను. అలా చేసుకుంటూ వెళ్లడమే నా ముందున్న పని. నేను వర్తమానంలో జీవిస్తా. ప్రస్తుత నాకున్న బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని దాదా పేర్కొన్నారు. ప్రస్తుతానికి టీమిండియా బాగానే రాణిస్తుందని చెప్పిన సౌరవ్... భవిష్యత్‌లో అవసరమైతే కొత్త కోచ్ ఎంపికపై దృష్టిపెడతామన్నారు. అయితే కొత్త కోచ్ ఎంపికలో క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) పని చేస్తుందో లేదోనన్నారు. జీవిత చరిత్ర రాసేందుకు సమయం లభించడం లేదని, వృత్తిపరమైన, పరిపాలనపరమైన ఒప్పందాలతోనే రోజంతా గడిచిపోతోందన్నారు. విమర్శలను తీసుకోవడంలో వన్డే కెప్టెన్ ధోని చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాడని దాదా అన్నారు.