
పిట్టలగూడెంలో పర్యటిస్తున్న టీపీసీసీ నేత చామల తదితరులు
మోటకొండూరు : పార్టీ అవకాశమిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని టీపీసీసీ నాయకుడు చామల ఉదయ్‌చందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మోటకొండూరు మండలం చాడ మదిర గ్రామం పిట్టలగూడెంలో పర్యటించా రు. ఇల్లిల్లు కలియతిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా గత పది సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డాని తెలిపారు. దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీ యువతకు ఎక్కవగా ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ఏఐసీపీ ప్లీనరీలోనూ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల నరేష్ గౌడ్, యాదగిరి గౌడ్, సిద్దులు, విజయ్, లక్ష్మయ్య, కరుణాకర్ యాదవ్, రాములు గౌడ్, పురుషోత్తం రెడ్డి, తులసయ్య తదితరులు పాల్గొన్నారు.