peoples problems
-
ఏపీ: ప్రజలను చూసి.. కాన్వాయ్ ఆపి
భామిని: ప్రజల కష్టాలు గుర్తించడంలో ముఖ్యమంత్రి జగనన్న బాటలో మంత్రులు పయనిస్తున్నారు. శుక్రవారం భామిని మండలం చిన్నదిమిలి వద్ద రోడ్డుకు పక్కగా గ్రానైట్ క్వారీ బాధితులైన కాలనీవాసులు తమ సమస్య చెప్పేందుకు ఎదురు చూస్తుండగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జనవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు తమ కాన్వాయి ఆపారు. వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు. క్వారీ పేలుళ్లు, పరిహారం విషయమై కలెక్టర్‌కు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రులు పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి–బ్యారేజ్ నిర్మాణానికి తాము ఆటంకం కాదని చెప్పిన ఒడిశా రైతులను అభినందించారు. -
జనహృదయ స్పందన వింటున్నారు.. విన్నవిద్దాం..
ఇది ఏ ఒక్కరి ఆవేదనో కాదు.. కలెక్టరేట్లో వారం వారం జరుగుతున్న స్పందన కార్యక్రమానికి వస్తున్న వేలాది ఆర్తుల ఆక్రందన. అందరిదీ ఒకటే మాట. గత ప్రభుత్వం గ్రీవెన్స్ పేరుతో హడావుడి చేసి.. ఆనక అందిన దరఖాస్తులను రకరకాల కొర్రీలతో బుట్టదాఖలు చేసేది. ఫలితంగా ఒకటికి పదిసార్లు కాళ్లరిగేలా తిరిగినా బాధితులకు న్యాయం జరిగేది కాదు. కానీ వైఎస్జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జవాబుదారీతనం పెరిగింది. ప్రజల వినతులకు రోజుల వ్యవధిలోనే స్పందన లభిస్తోంది. జూలై నెల పరిస్థితినే పరిశీలిస్తే.. ఈ నెల ఒకటి నుంచి 25వ తేదీ వరకు స్పందన కార్యక్రమానికి మొత్తం 6,719 వినతులు అందితే.. వాటిలో సుమారు 72 శాతం పరిష్కారం సాధించడం ద్వారా విశాఖ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. కేవలం 179 అర్జీలనే అనర్హమైనవిగా తేల్చి తిరస్కరించారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధిక శాతం అర్జీలు కుంటి సాకులతో తిరస్కరణకు గురయ్యేవి. వైఎస్జగన్ ప్రభుత్వం ప్రతి అర్జీని ఆన్లైన్లో పొందుపర్చి, నెంబరు కేటాయించడం, ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలు కల్పించడంతోపాటు నిర్ధిష్ట గడువు విధించడంతో స్పందన వినతులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తోంది. ఇవే కారణాలతో స్పందన ప్రజామన్ననలు చురగొంటోంది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ప్రజలు వేల సంఖ్యలో వినతులిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ఏ వారానికావారం వినతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయినా అధికార యంత్రాంగం ఓపికగా వాటిని స్వీకరించి.. పరిష్కారం చూపుతున్నారు. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం జూలై 1–25 మధ్య అందిన వినతులు.. పరిష్కారాలు కేటగిరీ వినతుల పరిష్కార సంఖ్య శాతం రేషన్ కార్డులు 2,619 88.62 భూసమస్యలు 1,831 47.84 పింఛన్లు 1,655 92.27 పురపాలన 1,298 86.06 హౌసింగ్ 654 89.45 పంచాయతీరాజ్ 349 77.36 విద్యుత్తు 331 88.22 సాక్షి, విశాఖపట్నం: ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమానికి వస్తున్న ఆర్జీల సంఖ్య పెరుగుతోంది. తొలిసారిగా ఈనెల 1వ తేదీన జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘స్పందన’లోనే 513 ఆర్జీలు వచ్చాయి. రెండో సోమవారం 454 వచ్చాయి. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఆర్జీలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారంగాక నిరాశలో ఉన్నవారు ఇప్పుడు ‘స్పందన’ తీరు తెలుసుకొంటున్నారు. తమకొక మార్గం దొరుకుతుందనే కొండంత ఆశతో వస్తున్నారు. దీంతో మూడో వారం నుంచి ఆర్జీల సంఖ్య మరింత పెరిగింది. మూడో సోమవారం 897 ఆర్జీలు రాగా నాలుగో సోమవారానికి ఏకంగా 985 ఆర్జీలు దాఖలయ్యాయి. ఇక ఐదో సోమవారం కూడా అదే రీతిలో పెరుగుతూ 1,062 ఆర్జీలు వచ్చాయి. మరోవైపు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో 19, మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో 228 వినతులు అందాయి. పరిష్కారానికి పట్టుదల ఈనెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ కలెక్టరేట్ సహా జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’కు 6,719 అర్జీలు వచ్చాయి. వాటిలో 179 అనర్హమైనవిగా తిరస్కరించారు. మిగిలిన వాటిలో 1,927 అర్జీలు పరిశీలన దశలో ఉన్నాయి. 2,889 అర్జీల పరిశీలన పూర్తి అయింది. వాటిని మంజూరుకు సిద్ధం చేశారు. 1,922 ఆర్జీలను పరిష్కరించారు. ఇలా 72.17 శాతం అర్జీలను పరిష్కరించడంతో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఏదో మొక్కుబడిగా ఎండార్స్మెంట్ ఇచ్చేయకుండా ప్రతి అర్జీకి సరైన పరిష్కారం చూపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టం చేస్తున్నారు. అందుకు తగినట్లుగా అర్జీల పరిష్కారం ఏవిధంగా చేయాలో ఇప్పటికే ఒకటికి రెండుసార్లు అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ వివరించారు. దీంతో అర్జీల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి అర్జీకి ఒక సంఖ్య... ప్రజలు సమర్పించే ప్రతి అర్జీకి ఒక నంబరు కేటాయిస్తున్నారు. వాటిని ఆన్లైన్ చేసేందుకు జిల్లా కలెక్టరేట్లోనే 16 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి విభాగాల వారీగా ఆయా అర్జీలను విభాగాధిపతులకు పంపిస్తున్నారు. అలా వచ్చిన ప్రతీ అర్జీని సంబంధిత విభాగాధిపతి స్వయంగా పరిశీలించాల్సిందే. దిగువ స్థాయి సిబ్బంది ఇచ్చే ఎండార్స్‌మెంట్‌ను చూడకుండా డిస్పోజ్ చేయవద్దని ఇప్పటికే కలెక్టరు హెచ్చరించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి డిస్పోజ్ చేసినట్లు అప్లోడ్ చేయాలని చెప్పారు. పనిదినాల్లో ప్రతి రోజూ కార్యాలయానికి రాగానే అరగంట సమయాన్ని ఈ అర్జీల పరిష్కారానికి వెచ్చించాలని ఆదేశాలిచ్చారు. ఇలా ‘స్పందన’ దరఖాస్తుల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోందని జాయింట్ కలెక్టరు ఎల్.శివశంకర్ చెప్పారు. కొన్ని సమస్యలపైనే అత్యధికం.. ఆర్జీల్లో ఎక్కువగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇల్లు, ఇంటిస్థలం మంజూరు కోసమే ఉంటున్నాయి. అలాగే భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. మొత్తం 64 విభాగాల్లో అర్జీలను అంశాల వారీగా పొందుపర్చుతున్నారు. పోలీస్ కమిషనరేట్‌కు 103 ఫిర్యాదులు ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నగర పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన స్పందనకు 103 ఫిర్యాదులు అందాయి. 19 ఫిర్యాదులను సీపీ ఆర్కే మీనా స్వయంగా స్వీకరించారు. ఇతర 84 ఫిర్యాదులు సంబంధింత పోలీస్స్టేషన్లలో సీఐలు స్వీకరించారు. వీటిలో ఆస్తులు, కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన అంశాలు, చీటింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. జీవీఎంసీకి 228 ఫిర్యాదులు సాక్షి,విశాఖపట్నం: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 228 ఫిర్యాదులు అందాయి. జీవిఎసీ కమిషనర్ జి.సృజన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఫిర్యాదుల్లో ప్రధాన కార్యాలయానికి 88, ఒకటో జోన్‌కు సంబంధించి 30, మూడో జోన్‌కు సంబంధించి రెండు, నాలుగో జోన్‌కు సంబంధించి 12, ఐదో జోన్‌కు సంబంధించి 72, ఆరో జోన్‌కు సంబంధించి 10, భీమిలి జోన్‌కు సంబంధించి 14 ఫిర్యాదులందాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి 31, ప్రజారోగ్య విభాగానికి 14, ఇంజనీరింగ్ విభాగానికి 41, ఇ.ఇ విభాగానికి 4, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ విభాగానికి 54, యుసీడీ విభాగానికి 16 ఫిర్యాదులు అందాయి. డయల్ యువర్ కమిషనర్‌కు 23 ఫిర్యాదులు జీవిఎంసీ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. కమిషనర్ జి.సృజన పలువురి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పారు. ఇందులో ఒకటో జోన్ నుంచి 2, రెండో జోన్ నుంచి 6, మూడో జోన్ నుంచి రెండు, నాలుగో జోన్ నుంచి 4, ఐదో జోన్ నుంచి 1, ఆరో జోన్ నుంచి 5, అనకాపల్లి జోన్ నుంచి 1, భీమిలి జోన్ నుంచి 2 ఫిర్యాదులు అందాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి మూడు రోజులులోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
ఆధార్ అవస్థలు
వికారాబాద్ అర్బన్: కొత్తగా ఆధార్ కార్డు పొందాలన్నా, ఉన్న దాంట్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ముగిసి డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలి. ఇందుకోసం విద్యార్థి ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్ లింక్ తప్పకుండా ఉండాలి. చాలా మంది గ్రామీణ విద్యార్థుల ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్ లింక్ లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడంలో వెనకబడుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతీ పథకానికి ఆధార్ లింక్ తప్పని సరి చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మొదట్లో తీసుకున్న చాలా మందికి వారి ఫోన్ నంబర్ ఆధార్ కార్డుకు లింక్ లేదు. ఓటీపీ నంబర్ తెలుసుకునేందుకు ఆధార్ కేంద్రం నిర్వాహకులే వారి నంబర్లు ఇచ్చి అప్పటి పూర్తిగా పని ముగించారు. ఇటీవల బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సొంత ఫోన్ నంబర్ ఆధార్ లింకు ఉండాలని షరతు పెడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది మార్పుల చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అవస్థలు పడి మార్పులు, చేర్పుల దరఖాస్తులు నింపి ఇచ్చినా సకాలంలో మార్పులు జరగడం లేదు. కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారి అవస్థలు వర్ణనాతీతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అడుగుతున్నారు. ఇటీవల పోలీసులు రోడ్డుపై వాహనదారులను ఆపి తగిన పత్రాలు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, హెల్మెట్ లేకున్నా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులకు కూడా ఆధార్ కార్డు లింక్ అడుగుతున్నారు. ఇలా ప్రతిపనికి ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఒకేఒక ఆధార్ కేంద్రం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా, కొత్త కార్డు తీసుకోవాలన్నా వారం రోజుల సమయం పడుతోంది. ఆధార్ కార్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ప్రతి నియోజకవర్గానికి ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 24న నేతన్నల సమస్యలపై చలో ఢిల్లీ హిమాయత్‌నగర్: నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని జాతీయ చేనేత నాయకులు దాసు సురేష్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన నాయకులు ఎన్నికల అనంతరం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువైయ్యాడని వాపోయారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలపై తమ వాణి వినిపించేందుకు ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు దఫాలుగా బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.1,283 కోట్ల నిధులను ఏ మేరకు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
సాగర్ నీరు చేపలకా..?
కురిచేడు(ప్రకాశం): జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం విడుదల చేసిన సాగర్ జలాలు ఇరిగేషన్, ఆర్‌డబ్లు్యఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పక్కదారి పట్టాయి. విడుదల నీటిని ఎలా వినియోగించాలంటూ దిశానిర్దేశం చేసి, పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఈ అవకాశం చేపల చెరువుల కాంట్రాక్టర్లకు అందివచ్చిన అవకాశంగా మారింది. జిల్లాలో ఎన్ని చెరువులను నింపాలి, ఏ ప్రాతిపదికన నింపాలి అనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు జిల్లా కలెక్టరు ద్వారా ఎన్ఎస్పీ అధికారులకు తెలియజేయాల్సివుంది. వారు ఆయా మేజర్ల ద్వారా మాత్రమే నీరు విడుదల చేయాలి. కానీ ఈ తతంగం నీరు విడుదలకు ముందుగా జరగాలి. కానీ, ఇంతవరకు ఈ ప్రక్రియ జరిగిన దాఖలాలు లేవు. దీంతో నీటి సరఫరా వరకు మాత్రమే తాము.. మిగతా విషయాలు అధికారులు చూసుకోవాలని ఎన్ఎస్పీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. విడుదలైన నీరు ఎక్కడికి చేరుతుందనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు పట్టింకోకపోవడంతో చేపల చెరువులు జలంతో కళకళలాడుతున్నాయి. ఇదేమని అడిగేవారు లేక నాన్ నోటిఫైడ్ చెరువులకు కూడా నీరు నింపుకునే అవకాశం ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు చేపల చెరువులకు నీరు మళ్లించారు. పశువులకు తాగునీరు అవసరమని చెప్పి నీరు తస్కరించినా చివరకు పశువులకు నీరు లేకుండా చేపలు పెంచుకుంటున్నారు. ఇదేమని అడిగితే మేము నీరు తెచ్చుకున్నాం, మీరు పశువులకు తాపేందుకు వీలు లేదని దబాయిస్తున్నట్లు గ్రామాలలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో చేపల చెరువులు లేకపోయినా సొసైటీల పేరుతో గుత్తేదారులు దోచుకుంటున్నా మత్య్సశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు వాటాలు తీసుకుని నిద్ర నటిస్తున్నారు. దీని వలన పంచాయతీలకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. నాగార్జున సాగర్‌కాలువ ద్వారా జిల్లాలోని 230 నోటిఫైడ్ చెరువులు, 150 నాన్ నోటిఫైడ్ చెరువులను నింపాల్సివుంది. కానీ అవి నింపకుండా చేపల చెరువులను మాత్రమే నిపంటంలో ఆంతర్యమేమిటో ఆ శాఖల అధికారులకే తెలియాలి. -
కనికరించరేమయ్యా!
ఈ ఫొటోలోని ఇద్దరూ దివ్యాంగులు. ఒకరు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చెన్నమ్మ కాగా మరొకరు పెళ్లకూరు మండలం శిరసనంబేడుకు చెందిన ఇందిరాకుమారి. ఇద్దరికీ రెండు కాళ్లూ పనిచేయవు. గత కొన్నేళ్లుగా సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెన్నమ్మ ట్రై సైకిల్ తుప్పు పట్టిపోయింది. కొత్త సైకిల్ కోసం అధికారులను ప్రాథేయపడుతోంది. ఇందిరాకుమారి రుణం కోసం అర్థిస్తోంది. ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం కూడా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌డేకు తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చారు. చెన్నమ్మ తుప్పుపట్టిన ట్రైసైకిల్‌పైనే కలెక్టరేట్‌కు వచ్చింది. అది ముందుకు కదలక మొరాయించింది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు. అటూ.. ఇటూ తిరుగుతున్న కలెక్టరేట్ సిబ్బందికి ఆమె అవస్థ పట్టలేదు. పక్కనే ఉన్న ఇందిరాకుమారి, చెన్నమ్మ కష్టాన్ని చూసింది. పాకుకుంటూ వెళ్లింది. నీకు నేనున్నానంటూ ట్రైసైకిల్ చక్రాన్ని సరిచేసి సాయం అందించింది. ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకుసాగుతున్న వీరి కష్టాలు మాత్రం అధికారులకు కనిపించడం లేదు. ఎప్పటిలాగే వీరు అధికారులను కలిశారు. వినతిపత్రాలు ఇచ్చారు. మా సమస్య ఎప్పటికి తీరుతుందోనంటూ వారు వెనుదిరిగారు. ఫొటో– వి.సాంబశివరావు, నెల్లూరు (పొగతోట) నెల్లూరు(పొగతోట): సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ గోడు అధికారుల ఎదుట వెళ్లబోసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నీటి ప్రవాహాన్ని పెంచండి పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నెల్లూరు జిల్లాకు నీటిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదికి వరద అధికంగా వస్తోందని, ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా జిల్లాలోకురవడం లేదన్నారు.కరువుతో ప్రజలు అలమటిస్తున్నారని, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నీటి ప్రవాహాన్ని పెంచి జిల్లాలోని చెరువులను నీటితో నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. న్యాయ విచారణ జరిపించాలి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయడం లేదు. మండలానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేసే జేసీబీలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్లు పెద్ద పెద్ద భూస్వాములకు అందజేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇచ్చారు. గత మూడేళ్ల నుంచి గిరిజనులకు రుణాలు కూడా మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీల దారదత్తంపై న్యాయ విచారణ జరిపించాలి. గ్రామానికి 10 నుంచి 20 మందికి రుణాలు మంజూరు చేయకపోతే ఈ నెల 22 నుంచి జిల్లావ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం. – ఎస్.మల్లి తదితరులు, దళిత సంఘర్షణ సమితిజిల్లా అధ్యక్షుడు -
ఇళ్ల కోసం బారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. బడుగుల సొంతిం టి కల సాకారమవుతోంది. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం), రాజీవ్ గృహకల్ప, వాంబే పథకాల కింద జిల్లా యంత్రాంగం ఫ్లాట్లను కేటాయిస్తోంది. ఈ మేరకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా 12 చోట్ల నిర్మించిన కాలనీల్లోఖాళీగా ఉన్న 1900 ఫ్లాట్లను కేటాయించేందుకు దరఖాస్తుదారులను ఆహ్వానించింది. దీంతో శనివారం గడువు ముగిసే సమయానికి 1,366 మంది మొదటి విడతగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపేణా రూ.45,011 చెల్లించారు. డీడీలు చెల్లించేందుకు ఈ పథకాల కింద సుమారు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ తొలి వాయిదా కట్టడానికి ముందుకు రాలేదు. దీంతో డబ్బు చెల్లించినవారికి దాదాపుగా ఫ్లాట్ ఖాయమైనట్లే. అయితే, మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతితో బ్యాంకులకు సెలవు రావడంతో డీడీలు తీయలేకపోయామని పలువురు లబ్ధిదారులు వాపోయారు. ఫ్లాట్ల ఖాళీ ల నేపథ్యంలో వీరికి మరో అవకాశం కల్పించే అం శాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఫ్లాట్ల ఖాళీల కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిన కేటాయించి.. మిగతా వారికి డీడీలు వాపస్ ఇవ్వాలని యంత్రాంగం యోచిస్తోంది. -
విన్నపాలు వినవలె..!
ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు సానా వెంకట లక్ష్మిదేవి. చింతకొమ్మదిన్నె మండలం మూలవంక. భర్త సానా ప్రసాద్ లారీడ్రైవరుగా పనిచేస్తుండేవారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. దీంతో కడుపు చేతపట్టుకుని కువైట్ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. జూన్ 13వ తేదీ మృతి చెందారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే ఇక్కడికి పంపారు. భర్త శవంగా మారి రావడంతో భార్య వెంకట లక్ష్మిదేవి కన్నీరుమున్నీరైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నారు. ఊరిలో సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలను ప్రయోజకులను చేయాలనే పట్టుదలతో ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ ఇంగ్లీషు చదువుతోంది. కమలాపురంలో బీఈడీ కూడా చేస్తోంది. ఈ మధ్యకాలంలో కర్నూలులో పోలీసు సెలెక్షన్లకు కూడా వెళ్లింది. ప్రిలిమ్స్, ఈవెంట్స్‌లో ఉత్తీర్ణురాలైంది. మెయిన్స్‌లో నెగ్గలేక పోవడంతో వెనుదిరిగి వచ్చింది. తన భర్త మృతి చెందాడు గనుక కువైట్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఆమెకు రావాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఓమారు కలెక్టర్‌కు మొర పెట్టుకుంది. త్వరగా తమ ఫైలు పైకి పంపి నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. కడప సెవెన్‌రోడ్స్: స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఎన్ని సార్లు అర్జీలు సమర్పించినా పింఛన్లు అందలేదని కొందరు, వస్తున్న పింఛన్లను అర్ధాంతరంగా ఆపివేశారని మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రేషన్‌కార్డులు, చంద్రన్న బీమా, వ్యవసాయ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఎన్టీఆర్ గృహాలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని, సర్వే నిర్వహించి హద్దులు చూపించాలని.. ఇలా వివిధ రకాల సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. పెన్షన్ నిలిపేశారు నా కుమారుడు నాగసుబ్బయ్య మానసిక వికలాంగుడు. కుమారుని అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకోవాలి. మాకు వెనకా ముందు ఎవరూ లేరు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నా కుమారునికి రూ.1500 పెన్షన్ వస్తుండేది. ఎనిమిది నెలల నుంచి నిలిపివేశారు. ఎందుకిలా చేశారని అధికారులను అడిగాను. ఇప్పటికే నీకు వితంతు పెన్షన్ వస్తోంది గనుక నీ కుమారుడి పెన్షన్ నిలిపివేశామని చెప్పారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛన్ ఇవ్వరాదనే నిబంధన ఉన్నప్పుడు నా పెన్షన్ తొలగించి కుమారుని పెన్షన్ పునరుద్ధరించాలని కోరేందుకు వచ్చాను. – వీరమ్మ, బాలిరెడ్డిపల్లె, కమలాపురం మండలం ఇంటి స్థలాలు క్రమబద్ధీకరించాలి 19 ఏళ్ల నుంచి కడప తిలక్‌నగర్‌లో మేము కాపురముంటున్నాము. మాతోపాటే చాలా కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. అందరూ కూలీ పని, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మేము అక్కడ నివాసమున్నట్లు నిర్ధారించే విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు అన్నీ ఉన్నాయి. మాకు ఇళ్ల స్థలా పట్టాలు మాత్రం లేవు. ఈ విషయంపై అనేక ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. 1994లో అప్పటి తహసీల్దార్ టి.కృష్ణమూర్తి ఇచ్చిన లే అవుట్ రద్దు చేయలేదు గనుక మేము మీ ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించలేమని తహసీల్దార్ అంటున్నారు. నిబంధనలు అంగీకరించనపుడు గతంలో తహసీల్దార్‌గా పని చేసిన నాగరాజు కొంత మందికి పొసెషన్ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని మేము ప్రశ్నించగా, అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి జీఓ నంబర్ 388 ప్రకారం ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరేందుకు వచ్చాము. – ఎస్.మోహన్‌కుమార్, తిలక్‌నగర్, కడప పింఛన్ ఇప్పించి ఆదుకోండి నేను కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. వయసు పైబడడంతో ఇప్పుడు పనులు చేయడానికి శరీరం సహకరించే పరిస్థితిలో లేదు. నాకు ఆస్తిపాస్తులు గానీ, వెనకా ముందు గానీ ఎవరూ లేరు. ప్రభుత్వం కనీసం వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తే ఏదో కొంత ఆసరాగా ఉంటుంది. ఇప్పటికి పది సార్లు పెన్షన్ కోసం అర్జీలు సమర్పించాను. అయితే ఇంత వరకు మంజూరు కాలేదు. ఈ విషయాన్ని కిందిస్థాయి అధికారులను అడగ్గా, వారు సరైన సమాధానం చెప్పడం లేదు. నా సమస్యను కలెక్టర్ అయినా పట్టించుకుంటారనే ఆశతో వచ్చాను. – చెన్నప్ప, ఆజాద్‌నగర్, కడప. -
గుండేగాంపై ప్రభుత్వానికి పట్టింపేది?
భైంసా(ముథోల్): గుండేగాం గ్రామస్తుల పునరావాసంపై ప్రభుత్వానికి పట్టింపులేదని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం భైంసాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గుండేగాం, పాతమహాగాం, చింతల్బోరి గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గతేడాది గుండేగాం గ్రామంలోకి వరద నీరు చొచ్చుకువచ్చిందని, ఈఏడాది మళ్లీ అదే పరిస్థితి ఎదురైందన్నారు. అయినా.. అధికారుల్లో చలనంలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ముంపునకు గురయ్యే గ్రామాలు, నీట మునిగే పంటపొలాలను గుర్తించి పరిహారం చెల్లించాల్సిన కనీస బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మూడు రోజులుగా గుండేగాం గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారని, గ్రామంలోకి పాములు, అడవి పందులు వస్తున్నాయన్నారు. గుండేగాం గ్రామస్తులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా ముంపు బాధితులు, పునరావాస గ్రామాల వారికి పరిహారం ఇప్పించడంలో విఫలమవుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రానున్నరోజుల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తీరుస్తామన్నారు. గుండేగాం గ్రామస్తులకు పునరావాసం కల్పించి నీటమునిగే పంటపొలాలకు పరిహారం చెల్లించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
అడుగడుగునా గుంతలే..!
రెబ్బెన : గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం సరిగా లేక ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నాయే తప్ప పాల కుల్లో మాత్రం స్పందన కరువైంది. మండలంలోని నంబాల– నారాయణపూర్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల రోడ్డుతో అవస్థలు.. మండలకేంద్రంలోని రైల్వేగేట్ నుంచి నారాయణపూర్ వరకు గత కాంగ్రెస్ హయాంలో రూ. లక్షలు వెచ్చించి రోడ్డు మరమ్మతు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ కరువై పనుల్లో నాణ్యత కొరవడడంతో కొన్నాళ్లకే రహదారి ఛిద్రంగా మారిపోయింది. రైల్వేగేట్ నుంచి నారాయణపూర్ వరకు రోడ్డు మొత్తం అడుగడుగున గుంతలమయంగా మారిపోయింది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. ఈ దారి గుండానే మండలకేంద్రం మీదుగా బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో గుంతలరోడ్డుపై ప్రయాణం చేయలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు వాహనదారులు, ప్రయాణికులు. మూడు పంచాయతీ ప్రజలకు తప్పని తిప్పలు.. గుంతలమయంగా మారిన నంబాల–నారాయణపూర్ రోడ్డు మూలంగా నంబాల, నారాయణపూర్, కిష్టాపూర్ పంచాయతీ పరిధిలోని సుమారు 12 గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. నిత్యం ఏదో పని నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండానే మండలకేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో నడుంనొప్పితో పాటు వాహనాలు సైతం త్వరగా పాడైపోతున్నాయని ప్రైవేట్ వాహనాల యజమానాలు, ద్విచక్రవాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గుంతలతో నరకం చూస్తున్నాం నంబాల నుంచి నారాయణపూర్ వరకు ఉన్న బీటీ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు అధ్వానంగా మారినా మరమ్మతు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు పడాలో ఏమో. రోడ్డు మరమ్మతు చేపట్టాలి నంబాల– నారాయణపూర్ రోడ్డు కు అధికారులు వెంటనే మరమ్మ తు చేపట్టాలి. రెబ్బెన రైల్వే గేట్ నుంచి మొదలు నారాయణపూర్ వరకు రోడ్డు పూర్తిగా చెడిపోయింది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నాం. అత్యవసర సమయంలో రెబ్బెనకు చేరుకోవాలన్నా సకాలంలో చేరుకోలేకపోతున్నాం. -
పల్లెల్లో దొంగల కలవరం
పాకాల : మండలంలోని మొగరాల పంచాయతీ పచ్చిపాలపల్లెలో గురువారం రాత్రి 12 గంటల ప్రాతంలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానికులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు వివరాలివి. రెండు ద్విచక్ర వాహనాల్లో ముగ్గురు వ్యక్తులు గ్రామంలోని ట్యాంక్ వద్దకు వచ్చి చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించారు. గమనించిన గ్రామస్తులు కేకలు వేయడంతో ముగ్గురు దొంగలు వచ్చిన బైక్‌ల్లోనే పరారయ్యారని తెలిపారు. మేము గమనించకుంటే ఏదో ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు ఆందోళనగా చెప్పారు. శుక్రవారం ఉదయం కూడా ప్లాస్టిక్ బిందెలు విక్రయిస్తున్నట్లు ఓ వ్యక్తి అదే గ్రామానికి వెళ్లాడు. ఓ మహిళ బిందెలు కొనడానికి అతన్ని పిలిచింది. ఆ వ్యక్తి బందెలు అమ్మకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ గ్రామం నుంచి ఊడాయించాడని సమాచారం. ప్రస్తుతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో పార్థీ గ్యాంగ్ దొంగల ముఠాపై ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. దీనికి తోడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చుట్టు పక్కలే పార్థీ గ్యాంగ్ ఉందేమోనని అనుమానిస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గస్తీ నిర్వహించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దొంగలతో ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా తెలియజేసి అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
పార్టీ అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
మోటకొండూరు : పార్టీ అవకాశమిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని టీపీసీసీ నాయకుడు చామల ఉదయ్‌చందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మోటకొండూరు మండలం చాడ మదిర గ్రామం పిట్టలగూడెంలో పర్యటించా రు. ఇల్లిల్లు కలియతిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా గత పది సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డాని తెలిపారు. దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీ యువతకు ఎక్కవగా ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ఏఐసీపీ ప్లీనరీలోనూ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల నరేష్ గౌడ్, యాదగిరి గౌడ్, సిద్దులు, విజయ్, లక్ష్మయ్య, కరుణాకర్ యాదవ్, రాములు గౌడ్, పురుషోత్తం రెడ్డి, తులసయ్య తదితరులు పాల్గొన్నారు. -
నరకయాతన..!
బోనకల్ : రహదారి మార్గంలేక ఆళ్లపాడు, నారాయణపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులను వేడుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో 2012లో ఆళ్లపాడు నుంచి నారాయణపురం రహదారికి బీటీ రోడ్డు వేసేందుకు రూ.2.13కోట్ల నిధులను మంజూరు చేశారు. నాటి డిప్యూటీ æస్పీకర్ మల్లుభట్టి విక్రమార్క రోడ్డు పనులకు శంకుస్థాపన కూడా చేశారు. స్థానికులు మంచిరోజులు వచ్చినట్లే అనుకున్నారు. కానీ ఆ మంచిరోజులు ఎంతకీ రావడం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. రోడ్డుకు రెండు లేయర్ల కంకర, డస్ట్ మిశ్రమాన్ని వేసి రోలింగ్ చేసిన తరువాత బీటీ వేయాల్సి ఉంది. అంతేకాకుండా ఈ మార్గంలో వాగుపై వంతెన కూడా నిర్మించాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ రోడ్డుపై ఒక లేయరు కంకర పరచి వదిలేశాడు. వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు పిల్లర్లు వేసి అసంపూర్తిగానే వదిలేశాడు. దీంతో నిత్యం ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పశువులు వాగువద్ద వం తెన కోసం నిర్మించిన ఇనుపచువ్వలకు తగిలి గాయాలపాలవుతున్నాయి. రోడ్డు నిర్మాణపు పనులను అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌కు అ«ధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేసినా.. అధికారులు బిల్లులు ఇవ్వలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ప్రజాప్రతినిధులకు సమస్య వివరించినా... పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యేఅవకాశం ఉందని రోడ్డు పనులు ఇప్పట్లో అయ్యేపనికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగంసగం పనులతో ఇబ్బంది పడుతున్నాం... అసంపూర్తి రోడ్డు నిర్మాణం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం పనులను మధ్యలో వదిలేసిండు. రెండు గ్రామాల రైతులు పంటలను ఇంటికి తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. అధికారులు పట్టించుకోవడంలేదు. పైఅ«ధికారులు స్పందించి రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయాలి. – వేల్పుల ఆనందరావు, సర్పంచ్ ఆళ్లపాడు అధికారులు చర్యలు తీసుకోవాలి... రోడ్డులను వెంటనే పూర్తిఅయ్యేలా సంబంధిత అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. కంకర తేలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాగు పొంగి ప్రమాదాలు జరిగిన సంఘ టనలు ఉన్నాయి. పోలీసు శాఖ సహకారంతో గ్రావెల్ పోయించాము. ముళ్లకంచెను తొలగించాము. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – మరీదు బరకయ్య, సామాజిక కార్యకర్త -
మురుగు.. పరుగు
కల్వకుర్తి టౌన్ : పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రెయినేజీలు లేక మురుగు రోడ్లపై పారుతుంది. కల్వకుర్తి పట్టణంలో మొత్తం 20వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో డ్రెయినేజీల నిర్మాణం సరిగా లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతామని చెబుతున్నా ప్రజాప్రతి నిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పందులకు ఆవాసంగా.. గ్రామపంచాయతీ అనుమతితో పలు కాలనీల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో ఇళ్ల మధ్యలో మురుగు నిలుస్తుంది. దాంతో పందులు సంచిరిస్తూ ఆవాసాలుగా మారుతున్నాయి. గుంపులు గుంపులుగా రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2.18కోట్లు కల్వకుర్తి పట్టణంలో ఇప్పటివరకు 20 కాలనీల్లో డ్రెయినేజీల నిర్మాణానికి రూ.2కోట్ల18లక్షలు నగరపంచాయతీ ఖర్చుచేసింది. యీ నిధులతో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టామని పాలకులు చెబుతున్నా వివిధ కాలనీల్లో మురుగు మాత్రం రోడ్లపైనే పారుతోంది. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేకపోతున్నామని పట్టణంలోని వివిధ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపాం పట్టణంలో మురుగు రోడ్లపై పారుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. రూ.కోట్లు ఖర్చుచేసినా డ్రెయినేజీల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మురుగు కాల్వలు, రోడ్ల కోసం రూ.20కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాం. – రాచోటి శ్రీశైలం, చైర్మన్, నగర పంచాయతీ -
సమస్యలు పరిష్కరించరూ...!
భువనగిరి టౌన్ : స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రేషన్‌కార్డు, పెన్షన్ ఇప్పించాలని వేడుకున్నారు. మరికొందరు వ్యక్తిగత సమస్యలపై జాయిం ట్ కలెక్టర్ జి.రవినాయక్, జిల్లా రెవెన్యూ అధికారి రావుల మహేందర్‌రెడ్డికి వినతులు సమర్పించారు. చౌటుప్పుల్ మండలం కేసారం గ్రామానికి చెందిన జె.నరేష్ ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం తనను ఎంపిక చేశారని, ఇప్పటి వరకు లోను మంజూరు చెయ్యలేదని వినతి పత్రం అందజేశారు. చౌటుప్పుల్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మర్చాలని, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పుల్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని కోరుతూ రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన జెల్ల స్వరూప వినతి పత్రం అందజేశారు. బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురంలో ఇంటి పన్నులు వసూలు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బీఎన్ తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ రావుల అనురాధనందు విన్నవించారు. విలీన ప్రతిపాదన విరమించుకోవాలి భువనగిరి మున్సిపాలిటీ విలీనం కోసం ప్రతిపాదించిన గ్రామాల నుంచి గూడూరును మినహాయించాలి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడి మరిచి పట్టణాలను సుందరీకరించుకునేందుకు విలీనం చేయడం సబుకాదు. మున్సిపాలిటీలో మా గ్రామం కలపడం ద్వారా ఉపాధి హామీ పథకం కోల్పోతాము. దీంతో గ్రామంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. తక్షణమే మున్సిపాలిటీలో విలీన ప్రతిపాదన విరమించుకోవాలి. – గూడూరు గ్రామప్రజలు అన్ని మగ్గాలకు జియో ట్యాగింగ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ నంబర్లు ఇస్తుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిజమైన చేనేత కార్మికులు ఇంత వరకు జియో ట్యాగింగ్ నంబర్ కేటాయించలేదు. కొంత మంది మగ్గం పని చెయ్యని వారికి జియో ట్యాగింగ్ నంబర్ కేటాయించారు. జియో ట్యాగింగ్ లేకపోవడంతో కార్మికులు త్రిఫ్ట్ ఫండ్, నూలు యారన్ సబ్సిడీ, ముద్ర రుణాలు పొందలేక పోతున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. – తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు మోదుగుకుంటలో ఎలకబావిని చేర్చొద్దు ఆత్మకూర్(ఎం) మండలంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మోదుగుకుంట గ్రామ పంచాయతీలో ఎలకబావిని చేర్చొద్దు. మొరిపిరాల గ్రామ పంచాయతీ పరిధిలో యాధావిధిగా ఉంచాలి. ఈ గ్రామమే దగ్గరగా ఉంటుంది. రవాణా సౌకర్యానికి అనువుగా ఉంది. తక్షణమే అధికారులు స్పదించి యాధావిధిగా మొరిపిరాల గ్రామ పంచాయతీలో ఎలకబావిని ఉంచాలి. – ఎలకబావి గ్రామ ప్రజలు -
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
► జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలిగేడు: భూసమస్యలతోపాటు వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మండలంలోని బుర్హాన్ మియాపేటకు చెందిన రైతులు గత రెండేళ్లుగా తమ ప ట్టా భూములను ఆన్ లైన్ లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ జేసీకి ఫిర్యాదుచేయగా గురువా రం జేసీ ఎలిగేడు తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి తనిఖీ చేశారు. రైతుల సమస్యల ను 15రోజుల్లోగా పరిష్కరించాలని వీఆర్వో తిరుపతిపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, సాదాబైనామాల సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిం చడం సరికాదన్నారు. కార్యాలయ పనితీరుపై తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలతో సుదీర్ఘంగా చర్చించారు. జేసీ వెంట తహసీల్దార్ నాగరాజమ్మ, ఆర్ఐ అమ్జద్, వీఆర్వోలు, బుర్హాన్మియాపేట రైతులు పాల్గొన్నారు. -
'నోట్ల రద్దుతో సామాన్యులకే ఇబ్బంది'
ఒంగోలు : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులనే ఇబ్బందులకు గురిచేసిందని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం ఆయన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నల్ల కుబేరులు దర్జాగా కోట్లలో డబ్బును మార్చుకుంటున్నారన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. సామాన్య ప్రజలను నట్టేట ముంచిన విజయ్ మాల్యాకు రుణం మాఫీ చేయడం చోద్యమని బాలినేని అన్నారు. -
మురుగుతో అవస్థలు
నివాసాల మధ్య మురుగు నీటి కుంటలు కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ రోగాల బారినపడుతున్న చిన్నారులు సమస్యను పరిష్కరించాలంటున్న స్థానికులు గజ్వేల్ రూరల్: ఇళ్ల పరిసరాలలో మురుగు నీరు నిలుస్తుందని... వాటిలో పందులు స్వైర విహారం, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని వాసవీనగర్ కాలనీవాసులు వాపోతున్నారు. నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డు వాసవీనగర్ కాలనీలోని పలు నివాస ప్రాంతాల మధ్య మురుగునీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పల్లపు ప్రాంతంలోని నీరు పారదల లేక నిలిచిపోవడంతో కుంటగా తయారైంది. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో పాచిపట్టి దుర్గంధం వెదజల్లుతోందని, దీనికితోడు పందులు సంచరిస్తుండటంతో దోమల బెడదల ఎక్కువైందని చెబుతున్నారు. కాగా వాసవీనగర్‌లోని పలుప్రాంతాల్లో నివాస గృహాల మధ్య పశువుల వ్యర్థ పదార్ధాలను నిల్వచేస్తుడటంతో పందుల సంచారం ఎక్కువైందని వివరించారు. మురికినీరు నిల్వ ఉండటంతో తమ మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు ప్రబలు తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నగర పంచాయతి పరిధిలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సి ఉన్నా అటువంటి చర్యలు తీసుకునదాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. ముందుగా సమస్య ఉన్న ప్రాంతాలను యుద్ధప్రాతిపధిక గుర్తించాలని, అలాగే పారిశుద్ధ్యంపై అవగాహన చర్యలు, నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. నీరు లేకుండా చూడాలి ఇళ్ల మధ్యన చాలా కాలంగా నీరు నిలిచి ఉండడంతో దుర్వాసన వస్తోంది. పైగా ఈ మురికినీటి గుంటలు పందులకు ఆవాసాలు మారాయి. అధికారులు స్పందించి ఇళ్ల మధ్య మురుగు నీరు లేకుండా చర్యలు చేపడితే బాగుంటుంది. - రేణుక, గృహిణి పిల్లలకు రోగాలు ఇళ్ల మధ్య నీరు చేరడంతో దోమల బెడద ఎక్కువైంది. పిల్లలు అంటువ్యాధుల బారినపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మురుగు నీల్వ ఉండకుండా కాలువల గుండా బయటకు వెళ్లే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - ఎల్లవ్వ -
కాంగ్రెస్ హయాంలో ఏ పనీ కాలేదు
రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు జగదేవ్‌పూర్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏ ఒక్క పని కాలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మండలంలోని చేబర్తి, తిగుల్, అంగడికిష్టాపూర్, జగదేవ్‌పూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెలో ఏ ఒక్క పని పూర్తిగా చేయలేదని ఆరోపించారు. మాటలు తప్ప చేతల్లో చేయలేకపోయారని విమర్శించారు. విద్యుత్ సరఫరాల్లో గంట గంటకు బ్రేక్ ఉండేదని, దీంతో రైతుల మోటార్లు కుప్పలుగా కాలిపోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు, ఐటీ కంపెనీలకు, హైదరాబాద్‌కు నిరంతరం కరెంట్ ఇస్తూ పల్లెలో రైతులకు ఫ్రీ విద్యుత్తు అంటూ మోసం చేశారని ఆరోపించారు. ప్రీ కరెంట్ పేరుతో రైతులను దగా చేశారని విమర్శించారు. ప్రస్తుత సీఎం చేస్తున్న అభివృద్ధి పనులకు కాంగ్రెసోళ్లు ఎన్నో అనుమనాలు పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులు బాగుండాలని సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. 12 వందల మోగావాట్లు సింగరేణి నుండి తయారు కాగా, వేయ్యి మెగావాట్లు చత్తీస్ఘడ్ నుండి త్వరలోనే రావడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 నుండి 7 మెగావాట్లు వాడుతున్నమని త్వరలోనే 10 వేల మెగావాట్లు వాడేందుకు విద్యుత్ సంస్థలను తయారు చేయడం జరుగుతందని చెప్పారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం నియోజకవర్గంలో రూ.80 కోట్ల నిధులతో వర్గల్, అంగడికిష్టాపూర్, దుద్దెడ గ్రామాల్లో సబ్స్టేషన్లను నిర్మాణం చేశామని తెలిపారు. యాగంతోనే కాలం కాలిసోచ్చిందని ఇక నుండి కరెంట్ కష్టాలు ఉండవన్నారు. కాంగ్రెస్ పాలనలో చెపపిల్లల పెంపకంపై అంత శ్రద్ద పెట్టలేదని సీఎం కేసీఆర్ చెపపిల్లల పెంపకం కోసం రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేశారని, త్వరలోని అన్ని గ్రామాల్లో చెరువు, కుంటల్లో చెపపిల్లలను వదులుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు చెపపిల్లల కోసం 4 లక్షలు మంజూరు చేస్తే సీఎం కేసీఆర్ జిల్లాకు 4 కోట్లు నిధులు మంజూరు చేశారని అనందం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆడుగడునా వివక్షకు అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గఢా అధికారి హన్మంతరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకట్‌గౌడ్, నర్సింహ్మరెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక సర్పంచ్‌లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
జిల్లా అతలాకుతలం
మెదక్ బ్యూరో: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగుతున్నాయి. పాత ఇళ్లు కూలుతున్నాయి. ఆయా మండలాల పరిధిలో జరిగిన నష్టం వివరాలు.. ఝరాసంగం మండలం గంగాపూర్ చెరువు, జీర్లపల్లిలోని ప్యాలవరం ప్రాజెక్టు, కుప్పానగర్ గుండం చెరువు, మేదపల్లి ఏనుగుల చెరువు, ఏడాకుపల్లి కొత్తూర్, బర్దీపూర్‌లోని పెద్ద కుంటలు, చెక్‌డ్యాంలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండలంలో 26 ఇళ్లు పాక్షికంగా కూలాయి. చేతికొచ్చిన పత్తి, సోయాబీన్, మినుము, కంది పంటలు నీటమునిగాయి. దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డికి వెళ్లాల్సిన వాహనాలు హబ్షీపూర్, చేర్వాపూర్, దుబ్బాక, లచ్చపేట, చౌదర్పల్లి మీదుగా మళ్లించారు. పోతాన్‌పల్లి రామచెరువు, కసాన్పల్లి ఊర చెరువులకు బుంగలు పడ్డాయి. దుబ్బాక మండలంలో 500 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మిరుదొడ్డి మండలం లింగుపల్లి, అల్వాల కూడవెల్లి వంతెనలపై వరద నీరు ఊహించని రీతిలో ప్రవహిస్తోండటంతో రాకపోకలు స్థంభించిపోయాయి. మిరుదొడ్డి కాసులాబాద్‌కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగోడ్: మండలంలో దాదాపు 25 ఇళ్లు కూలిపోయాయి. చౌదర్పల్లి, గజ్వాడ, రేగోడ్, సాయిపేట, జగిర్యాల చెరువులు, కుంటల్లోకి వర్షపునీరొచ్చి చేరుతుంది. గజ్వాడలోని కామెల్లి చెరువు చిన్నతూము మట్టి కొట్టుకుపోయింది. మునిపల్లి మండలం పెద్దలోడిలో శిథిలావస్థకు చేరిన సుమారు 18 ఇళ్లు కూలాయి. జగదేవ్‌పూర్ మండలంలో మొత్తం 92 ఇళ్లు కూలినట్టు అంచనా. వెల్దుర్తి మండలంలో 220 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు హెక్టార్ల కంది, 20 హెక్టార్ల వరి, 10 హెక్టార్ల మక్కజొన్న పంటలు నీట మునిగాయి. హత్నూర మండలంలో ఈ నాలుగు రోజుల్లో 332 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 218 చెరువు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. వరి 60 హెక్టార్లు, పత్తి 80 హెక్టార్లు, సోయాబిన్ 20హెక్టార్లలో నీట మునిగింది. శివ్వంపేట మండలంలోని 206 కుంటలు, చిన్నచెరువులు, 16 పెద్ద చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. శివ్వంపేట పెద్దచెరువు, గూడూర్లోని బ్రహ్మసముద్రం చెరువులు 20 ఏళ్ల తర్వాత అలుగు పారాయి. దొంతిలోని పెద్ద చెరువు 30 ఏళ్ల తర్వాత అలుగు పారింది. మండలంలో 20 ఇళ్లు కూలాయి. నారాయణఖేడ్ మండలంలో 55 ఎకరాల్లో వరి, 750 హెక్టార్లలో సోయా, కంది, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. కల్హేర్‌లో వరి 250 ఎకరాలు, సోయా 550 ఎకరాలు, మనూరు మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కంగ్టి మండలం దామర్గిద్దాలో దాదాపు 40 కుటుంబాలకు చెందిన 135 మందిని స్థానిక పాఠశాల, పంచాయతీ కార్యాలయం, రామాలయంలో పునరావాసం కల్పించారు. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షానికి దాదాపు 3 వేల ఎకరాల్లో సోయా, కంది, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. 200పైగా ఇళ్లుకూలిపోయాయి. రాయికోడ్ మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయికోడ్, సింగితం, నాగ్వార్, కుసునూర్, రాయిపల్లి, యూసుఫ్పూర్, హుల్గేర తదితర గ్రామాల శివార్లలోని వాగుల్లో వరద ఉధృతి కారణంగా ఆయా గ్రామాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. మెదక్ మండలంలో వంద ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాల్వలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వంద ఎకరాలకుపైగా పంటలు నీట మునిగాయి. కౌడిపల్లి మండలంలో 94 ఇళ్లు కూలాయి. 50 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. జిన్నారం మండలం నర్రిగూడ, జంగంపేట వద్ద కల్వర్టులు పొంగి పొర్లుతుండంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జంగంపేట, జిన్నారం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలో దాదాపు వంద ఎకరాల్లో వరి పంట మునిగింది. -
సీఎంకు సామాన్యుల సమస్యలు పట్టవా?
- పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి - గోదావరి పుష్కరాలకు రూ.1600 కోట్లు ఎందుకు? - ప్రభుత్వ నిధులు స్వాహా చేయడానికే జన్మభూమి కమిటీలు కేవీపల్లె : రాజమండ్రి పుష్కర సంబరాల్లో మునిగి తేలిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలో సామాన్య ప్రజల సమస్యలు పట్టవా ? అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మండలంలోని సొరకాయలపేట పంచాయతీ వంగిమళ్లవారిపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రూ. 1600 కోట్లు కేటాయించి నిర్వహించడమెందుకన్నారు. అందులో కొంత సొమ్ము అయినా సామాన్య ప్రజల అభ్యున్నతికి వినియోగించి ఉండవచ్చని తెలిపారు. దాదాపు 12 రోజులను మంత్రివర్గమంతా పుష్కరాలకే కేటాయించారు తప్ప సామాన్యుల గురించి కొంతసేపైనా పట్టించుకున్న పాపానపోలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు ఆమోదించాల్సి ఉండడంతో సంక్షేమ పథకాలు సామాన్యుల దరి చేరలేద న్నారు. టీడీపీ కార్యకర్తలకు జన్మభూమి కమిటీల్లో స్థానం కల్పించడంతో వారు ప్రభుత్వ నిధులు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. పింఛన్ల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని తెలిపారు. రైతుల రుణమాఫీ చేశామని అధికార పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నారని, అయితే ఎక్కడ చూసినా తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపుతున్నారని తెలిపారు. ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారన్నారు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారన్నారు. జిల్లా అంతటా తాగునీటి సమస్య నెలకొందని, ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నీటి సమస్య ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి సామాన్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యుడు జయరామచంద్రయ్య, రాస్ సంస్థ పీవో మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. -
ఇదేమి హాజరు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజల సమస్యలపై గళమెత్తేందుకు కీలకమైన వేదిక శాసనసభ. ఎంతటి జఠిలమైన సమస్య అయినా సభాదృష్టికి తీసుకెళ్తే ముకుమ్మడి తీర్మానంతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎమ్మెల్యేలు సభల్లో పాల్గొని సమస్యలపై పాలకవర్గాలను నిలదీయాలి. సాధించుకునేంత వరకు పట్టుబట్టే అవకాశం ఉంది. అటువంటి మహత్తర అవకాశం శాసనసభ్యులకు మాత్ర మే ఉంది. ఆ ఆశతోనే 2009తో పది మంది ఎమ్మెల్యేలను జిల్లావాసు లు అసెంబ్లీకి పంపించారు. ఎమ్మెల్యేలు ఏం చేశారు. ప్రజల ఆశలను నీరుగార్చారు. ఏజెన్సీలో ఆరోగ్యం అదుపుతప్పి అడవిబిడ్డలు ఏటా వందల మంది మృత్యువాత పడ్డారు. గల్ఫ్ బాధితుల ఇళ్లలో అంతులేని విషాదం. కొందరు అన్నదాతలు ప్రతికూల పరిస్థితులతో కాటికి వెళ్లారు. డీజిల్, పెట్రోల్, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. అసంపూర్తి ప్రాజెక్టులు, ఉచి త కరెంటుకు మంగళం.. బడుగులకు అందని సంక్షేమ పథకాలతో ప్రజలు సతమతం అయ్యా రు.. ఈ నాలుగున్నరేళ్లలో ఇటువంటి సమస్యలపై స్పందించాల్సిన మన ఎమ్మెల్యేలు సమావేశాలకు తక్కువగా హాజరయ్యారు. ప్రజల పనుల కంటే తమ సొంత పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. శాసనసభ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఎమ్మెల్యేల హాజరు శాతం ఆందోళన కలిగిస్తోంది. నాలుగున్నరేళ్లలో 177 రోజుల పాటు 13వ శాసనసభ సమావేశాలు జరిగాయి. మన జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే 20 నుంచి 100 రోజుల వరకు అసెంబ్లీ ముఖం చూడలేదంటే ఆశ్చర్యపోక తప్పదు. డుమ్మాలో మొదటి స్థానంలో కాంగ్రెస్.. 2009 జూన్‌లో 13వ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నాలుగున్నరేళ్లలో 177 రోజులపాటు అసెంబ్లీ సమావేశమైంది. ఇందులో ముథోల్ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి 157 రోజులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ 154 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నిర్మల్ ఎమ్మెలే మహేశ్వర్‌రెడ్డి 95 రోజులు హాజరై 82 రోజులు డుమ్మా కొట్టి జిల్లా శాసనసభ్యుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 104 రోజులు సమావేశాలకు హాజరై, 73 రోజులపాటు దూరంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోడం నగేశ్ 131 రోజులు సమావేశాల్లో పాల్గొని, 46 రోజులు దూరంగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ 56 రోజులు అసెంబ్లీకి ఎగనామం పెట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 2011లో రాజీనామా చేసి ఆ ఏడాది డిసెంబర్లో 5 రోజులు అసెంబ్లీకి దూరంగా ఉన్నా.. మొత్తంగా 67 రోజులు శాసనసభ సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్యలు రాజీనామా చేయడం వల్ల 2010 ఫిబ్రవరి-మార్చిలలో 31 రోజులపాటు జరిగిన 4వ సెషన్ సమావేశాలకు హాజరుకాలేక పోయారు. వీటిని కలుపుకుని ఆ ముగ్గురు వరుసగా 115, 100, 71 రోజులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో ప్రజలు ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపిస్తే.. అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు ఈ రీతిలో గైర్హాజర్ అయితే ఎలా? అన్న చర్చ పలువురిలో సాగుతోంది. -
ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం
ఎర్రుపాలెం, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. వరుస తుపానులతో రైతులు తీవ్రం గా నష్టపోయినా అధికార కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని, కేవలం సీట్లు కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నారని అన్నా రు. నష్టం అంచనాలు వేయడంలో విఫలమైం దని అన్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండించాల్సిన టీడీపీ కేవలం వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇకనైనా జగన్మోహన్రెడ్డిని విమర్శించడం మానుకుని రైతుల గురించి పట్టించుకోవాలని అన్నారు. టీడీపీ, అధికార కాంగ్రెస్‌లను అనుకూలమైన దొంగ ఓట్లు ఉన్నాయని, వాటన్నింటిని వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించి తొలగించాలని కోరారు. ఈ నెల 15 వరకు మండల, గ్రామ, బూత్‌స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా కమిటీని మరింత పటిష్టంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ దళిత విభా గం జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, నియోజకవర్గ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లక్కిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై స్పందిస్తా..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాకు మొదటి పోస్టింగ్‌లో ఎస్పీగా నియామకం కావడం అదృష్టమని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని డాక్టర్ గజరావు భూపాల్ అన్నారు. సుమారు రెండేళ్లపాటు జిల్లా ఎస్పీగా పనిచేసిన సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ నెల 27 సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీగా(పరిపాలన) పనిచేస్తూ పదోన్నతిపై ఆదిలాబాద్ ఎస్పీగా నియమితులైన గజరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందని భూపాల్‌ను ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఎస్పీ భూపాల్ విలేకరులతో మాట్లాడారు. నక్సల్స్ కట్టడి.. మత ఘర్షణలు లేకుండా చూస్తాం.. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుశాఖ ప్రథమ కర్తవ్యమని, అయితే నక్సల్స్ కార్యకలాపాల కట్టడి, మత ఘర్షణలకు తావు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎస్పీ గజరావు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహారాష్ర్ట-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లా గనక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపడుతామన్నారు. సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదింవచ్చని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి రశీ దులు ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశిస్తామని ఎస్పీ భూపాల్ పేర్కొన్నారు. జిల్లాపై పూర్తిగా అవగాహన తెచ్చుకుని ప్రజల మనోభావాలకు అనుగుణంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. కలెక్టర్ , జిల్లా న్యాయమూర్తులను కలిసిన ఎస్పీ బుధవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ భూపాల్ కలెక్టర్ అహ్మద్ బాబు, జిల్లా న్యాయమూర్తి జి.గోపాల కృష్ణమూర్తిలను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలవగా పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపాల కృష్ణమూర్తిని కూడా ఎస్పీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీ జిల్లా జడ్జిని కలిసిన సమయంలో ఆయనతోపాటు జిల్లా అదనపు న్యాయమూర్తులు కె.సునీత, ఎన్.రాజ్‌కుమార్‌లు ఉండగా, జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిపారు. ఎస్పీ భూపాల్‌కు అభినందనలు తెలిపిన అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గజరావు భూపాల్‌ను ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓఎస్డీ పనసారెడ్డి, అదనపు ఎస్పీలు అప్పారావు (పరిపాలన), ఎన్వీ కిషన్‌రావు, బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ వోరం భాస్కర్‌రావు, ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్ డీఎస్పీలు లతామాధురి, ఎం.రవీందర్‌రెడ్డి, వి.శేషుకుమార్, దేవదాసు నాగుల, బి.సురేష్‌బాబులతో ఎస్బీఐ కె.సీతారాములు, ఆదిలాబాద్ పట్టణ సీఐలు గణపతి జాదవ్, నారాయణ, ఉదయ్కిరణ్లతోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, ఏఆర్‌ఐలు ఎస్పీని కలిశారు. కాగా పోలీ సు అధికారుల సంఘం ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది ఎస్పీని కలిశారు.