చేబర్తిలో ఎడ్లబండిపై ప్రజలకు అభివాదం చేస్తున్నమంత్రి
రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు
జగదేవ్‌పూర్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏ ఒక్క పని కాలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మండలంలోని చేబర్తి, తిగుల్, అంగడికిష్టాపూర్, జగదేవ్‌పూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెలో ఏ ఒక్క పని పూర్తిగా చేయలేదని ఆరోపించారు. మాటలు తప్ప చేతల్లో చేయలేకపోయారని విమర్శించారు. విద్యుత్ సరఫరాల్లో గంట గంటకు బ్రేక్ ఉండేదని, దీంతో రైతుల మోటార్లు కుప్పలుగా కాలిపోయేవని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలకు, ఐటీ కంపెనీలకు, హైదరాబాద్‌కు నిరంతరం కరెంట్ ఇస్తూ పల్లెలో రైతులకు ఫ్రీ విద్యుత్తు అంటూ మోసం చేశారని ఆరోపించారు. ప్రీ కరెంట్ పేరుతో రైతులను దగా చేశారని విమర్శించారు. ప్రస్తుత సీఎం చేస్తున్న అభివృద్ధి పనులకు కాంగ్రెసోళ్లు ఎన్నో అనుమనాలు పడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రైతులు బాగుండాలని సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. 12 వందల మోగావాట్లు సింగరేణి నుండి తయారు కాగా, వేయ్యి మెగావాట్లు చత్తీస్‌ఘడ్ నుండి త్వరలోనే రావడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 నుండి 7 మెగావాట్లు వాడుతున్నమని త్వరలోనే 10 వేల మెగావాట్లు వాడేందుకు విద్యుత్ సంస్థలను తయారు చేయడం జరుగుతందని చెప్పారు.
ఆ దిశగా సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం నియోజకవర్గంలో రూ.80 కోట్ల నిధులతో వర్గల్, అంగడికిష్టాపూర్, దుద్దెడ గ్రామాల్లో సబ్‌స్టేషన్‌లను నిర్మాణం చేశామని తెలిపారు. యాగంతోనే కాలం కాలిసోచ్చిందని ఇక నుండి కరెంట్ కష్టాలు ఉండవన్నారు. కాంగ్రెస్ పాలనలో చెపపిల్లల పెంపకంపై అంత శ్రద్ద పెట్టలేదని సీఎం కేసీఆర్ చెపపిల్లల పెంపకం కోసం రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేశారని, త్వరలోని అన్ని గ్రామాల్లో చెరువు, కుంటల్లో చెపపిల్లలను వదులుతామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు చెపపిల్లల కోసం 4 లక్షలు మంజూరు చేస్తే సీఎం కేసీఆర్ జిల్లాకు 4 కోట్లు నిధులు మంజూరు చేశారని అనందం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆడుగడునా వివక్షకు అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గఢా అధికారి హన్మంతరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకట్‌గౌడ్, నర్సింహ్మరెడ్డి, జెడ్‌పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక సర్పంచ్‌లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.