minister harishrao
-
అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): దక్షిణ భారతదేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఎల్ఐసీ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం రంగ అతి పెద్ద సంస్థ అయిన ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే ఏజెంట్లకు భద్రత లేకుండా పోతుందన్నారు. ఎల్ఐసీ ప్రజల నుంచి పాలసీల రూపంలో సేకరించిన డబ్బును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా ఇస్తుందని తెలిపారు. దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ను మూసివేశారని, బలవంతంగా యాభై వేల మంది ఉద్యోగులను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి తొలగించాలన్నారు. ఎల్ఐసీలో ఎఫ్‌డీఐకి అనుమతివ్వడం దుర్మార్గమన్నారు. ఎల్ఐసీని పరిరక్షించుకోవాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండు సంవత్సరాలు అవుతున్నా హుజూరాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక విద్యానగర్‌లోని చొల్లేటి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సైదాపూర్ రోడ్డు పునర్నిర్మాణం చేస్తామని.. సిద్దిపేట, కరీంనగర్ రోడ్ల తరహాలో అద్దంలా మెరిసేలా రోడ్డు నిర్మాణం ఉంటుందన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. బతుకమ్మ పండుగలోపు రుణాలు బతుకమ్మ పండుగ లోపు మహిళా సంఘాలకు రూ.కోటి 50లక్షలు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ యార్డులో బుధవారం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి హాజరై రూ.2కోట్ల13లక్షల 48వేల వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. ఈ సంవత్సరానికి సంబంధించి రూ.కోటి 50లక్షలు బతుకమ్మ పండగ లోపు జమ చేస్తానని వెల్లడించారు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. జమ్మికుంట పట్టణంలో ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీళ్లు అందిస్తున్నామని వివరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఏం ఇచ్చిందని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మెటి సమ్మిరెడ్డి, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, జెడ్సీటీసీ మాజీ సభ్యుడు ఆరుకాల వీరేశలింగం, నాయకులు పోడేటి రామస్వామి, టంగుటూరి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మిత్రమా హరీశ్‌రావు.. ఈ బాధలన్నీ నీకు తెలియవా: ఈటల -
సచివాలయం ఫైళ్లన్నీ భద్రం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఫైళ్లన్నీ భద్రంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సచివాలయం తరలింపులో భాగంగా ఫైళ్లను జాగ్రత్త చేసేందుకు ప్రతి శాఖకు ఓ కస్టోడియన్ అధికారిని నియమించామని, ఫైళ్లన్నీ భద్రపర్చేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, వయోపరిమితి పెంపు అంశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉందన్నారు. బాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 1.49 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కొన్ని కోర్టు కేసుల నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. పోటీ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌లోనే కాకుండా ఉర్దూలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరగా.. మంత్రి స్పందిస్తూ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలను ఉర్దూలో కూడా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 42 శాతం పీఆర్సీ అడిగితే కేసీఆర్ 43 శాతం ఇచ్చి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈసారి కూడా తప్పకుండా ఉద్యోగులు సంతృప్తిపడేలా ఫిట్మెంట్ ఇస్తారని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా భారీ మొత్తంలో వేతనాలు పెంచారని తెలిపారు. 2018 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 130 ఏసీబీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. -
ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరు
అల్గునూర్(మానకొండూర్): ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు ఈ ఖరీఫ్‌లో నీరందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కాలువల ఆధునీకరణ పనుల వేగం పెంచాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో తగినన్ని నీటి నిలువలు లేనందున ఇప్పటికిప్పుడే నీటి విడుదల సాధ్యం కాదని, రైతులు దీనిని అర్థం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో మంగళవారం మంత్రి.. అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీతోపాటు, ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టుల కింద చేపట్టిన పనులు, వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణ పనుల వేగం పెంచాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, నెలరోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో పనులు నత్తనడకన సాగడంపై మంత్రి అసం తృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎస్సారెస్పీ అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. వేగం పెంచకుంటే కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు కాలువల పనులుపై ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కాలనీలో కల్పించిన సౌకర్యాలు, ఇంకా కల్పించాల్సిన వసతులు, పరిహారం తదితర అంశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పనులు, కాలువల నిర్మాణం, నీటి విడుదల, ఆయకట్టు పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఎల్లంపల్లి ఆయకట్టుకు సాగునీరు.. ఎల్లపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు. ఈ నెలలో మంచి వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని, ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపాలని సూచించారు. ఎస్సారెస్పీలోకి ఈనెలలో భారీగా నీరు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ నుంచి ఇప్పుడే నీటి విడుదల సాధ్యం కాదు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరుమాత్రమే ఉందని, ఈ పరిస్థితుల్లో పంటలకు నీరివ్వడం సాధ్యం కాదని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ఉన్న నీటిలో మిషన్ భగీరథ కోసం 6 టీఎంసీలు వినియోగిస్తామని, మరో నాలుగు టీఎంసీలు ఆవిరి నష్టాలు ఉంటాయని తెలిపారు. ఈ తరుణంలో నీటిని విడుదల చేస్తే తాగునీటి సమస్య తలెత్తుతుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. విపక్షాలు నీటి విడుదలపై రాజకీయం చేయడం సరికాదని సూచించారు. ప్రాజెక్టు పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గతేడాది 40 టీఎంసీల నీరు చేరితే రెండు పంటలకు నీరు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈనెలాఖరులోగా ప్రాజెక్టులోకి భారీ వరద వస్తుందనే నమ్మకం ఉందన్నారు. రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. -
అన్నదాతల ఆశలు మీపైనే..
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: ‘కరువుతో అల్లాడిన తెలంగాణ రైతులు.. మీరు చేసే పనులు త్వరగా పూర్తయితే సాగుజలాలు తమ పొలాల్లోకి వస్తాయని ఆశగా చూస్తున్నారు. అన్నదాత ఆశలను త్వరగా తీర్చేందుకు మీరు పనుల్లో వేగం పెంచాలి’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులు, రంగనాయకసాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్, టన్నెల్, విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ పనిచేసే కార్మికులు, అ«ధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. 90 కిలోమీటర్ల దూరం నుంచి టన్నెల్ పనులు వేగంగా చేస్తున్నారని, చివరగా ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. రిజర్వాయర్ కట్ట పనుల్లో వేగం పెంచాలని, రాతి కట్టడం పనుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌స్టేషన్ పనులు పరిశీలించారు. ప్రభుత్వ పనితీరుకు మార్కెట్లే నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో ఉన్న మార్కెట్లు, వాటి పనితీరు, ఉత్పత్తుల కొనుగోళ్లే నిదర్శనమని మంత్రి అన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు ఐఎస్ఓ–9001 అవార్డు రావడంపై మంత్రి విలేకరులతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నూతన గోదాంలు నిర్మించామని, దీంతో రైతుల ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు, మద్దతు ధరకు అమ్ముకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ పద్ధతిని అమలు చేయడంలో దేశంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు వరుసలో ఉండటం తెలంగాణకే గర్వకారణమన్నారు. కాంగ్రెసోళ్లు ఉంటే ఇన్ని పనులు జరిగేవా? ‘ఇన్నేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు.. ఏ ఒక్క రోజు కూడా రైతుల గురించి ఆలోచించలే. ఇయ్యాల కేసీఆర్ అన్నదాతల కోసం నిరంతరం పరితపిస్తూ సాహసోపేతంగా ‘రైతుబంధు’పేరిట పెట్టుబడి సాయం పథకం తీసుకొచ్చిండు. ఈ పథకం చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంటోంది’అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ‘రైతు బంధు’అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కరెంటు, నీళ్ల కోసం రైతులు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయన్నారు. 70 ఏళ్లలో జరగని పనులెన్నో ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే 10 నుంచి 17 వరకు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చివరిదశకు ‘ఉదయసముద్రం’ పనులు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని ఉదయసముద్రం ప్రాజెక్టు నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్నాయని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఏప్రిల్ 5న ఒకటి, అదే నెల 25న మరొక పంపు డ్రై రన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా పనులన్నీ జెట్ స్పీడ్‌తో చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను శనివారం శాసనమండలిలోని మినిస్టర్స్ చాంబర్స్‌లో సమీక్షించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నదన్నారు. ప్రాజెక్టు నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌లోకి నీరు చేరేవిధంగా మే నెల చివరికల్లా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్ పనులు పూర్తయ్యాయని, 3.665 కిలోమీటర్ల పొడవున్న కాలువకట్ట పనుల్లో మిగిలినవాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 6.9 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 10.625 కిలో మీటర్ల టన్నెల్ పనుల్లో 2.22 మీట ర్లు మినహా మిగతావన్నీ పూర్తయ్యాయని తెలిపారు. మే చివరికల్లా మొత్తం టన్నెల్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. టన్నెల్ పనులు పూర్తయితేనే రిజర్వాయర్‌లో నీరు నింపేందుకు వీలవుతుందన్నారు. ఆ లోగా పంప్‌హౌస్ పనులు మరింత వేగవంతం చేయాలని కోరారు. ఖరీఫ్‌లోగా రిజర్వాయర్ నుంచి 40 చెరువులను నింపేవిధంగా పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద మొదటి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 40 చెరువులను నింపడానికి గాను ఫీడర్ చానళ్ల పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఇరిగేషన్ సీఈ ఎస్.సునీల్, ఎస్ఈ హమీద్ ఖాన్, ఈఈ గంగం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కుట్ర పన్ని కేసులు వేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు పన్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. చనిపోయిన వారు, గ్రామాల నుంచి వలస వెళ్లిన వారి పేర్లతో న్యాయస్థానాల్లో కేసులు వేయించారని ఆరోపించారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన న్యాయవాదులకు రూ.లక్షలు ఫీజులు చెల్లించారన్నారు. కేసుల విచారణకు వెళ్లే న్యాయవాదులకు డెబిట్ కార్డులతో విమాన టికెట్లు బుక్ చేశారని తెలిపారు. వీటన్నింటికి సంబంధించిన ఆధారాలతో కాంగ్రెస్ సభ్యుల ముందు మాట్లాడటానికి వచ్చానని, దురదృష్టవశాత్తు సభలో వారు లేరన్నారు. వచ్చే సమావేశాల్లో అయినా ఈ ఆధారాలను కాంగ్రెస్ సభ్యుల ముందు ఉంచి మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఆధారాలను వెల్లడించి సభ బయట కూడా మాట్లాడవచ్చని, కాని సభలోనే మాట్లాడాలని అనుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర నీటి పారుదల ఆర్థిక పద్దులపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడారు. కొత్తగా 11 లక్షల ఎకరాలు సాగులోకి.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 53 శాతం తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ గురువారం పార్లమెంటుకు తెలిపారని హరీశ్ గుర్తు చేశారు. బీజేపీ పాలిత మహారాష్ట్ర, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్, సాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతు ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నా రు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి సీఎం కేసీఆర్ ఆశయం మేరకు కోటి ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి వివరాలను సభకు వివరించారు. -
కాళేశ్వరం పరిధిలోకి ‘అప్పర్‌మానేరు’
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ప్రాజెక్టును కాళేశ్వరం పరిధిలోకి తీసుకురావాలని గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, పురపాలక మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు (నర్మాల) 2.2 టీఎంసీల రిజర్వాయర్ కాగా చాలాకాలంగా పూడుకుపోయిన దృష్ట్యా, ఇక్కడ పూడికతీతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాళేశ్వరంలోని ప్యాకేజీలు 9, 10, 11, 12లకు చెందిన టన్నెళ్లు, పంప్‌హౌస్, సర్జ్ పూల్, మెయిన్ కెనాళ్లు,, డిస్ట్రిబ్యూటరీలు ఇతర పనులపై గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. అప్పర్ మానేరులో పూడికతీత చేయాలని కేటీఆర్ కోరగా, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నర్మాలకు వెళ్లే కాలువలను రూ.38 కోట్లతో మరమ్మతు చేయనున్నట్టు హరీశ్ చెప్పారు. కాళేశ్వరంలో భాగమైన 9, 10, 11, 12 ప్యాకేజీల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు జరుగుతున్నట్టుగానే మిగతా ప్యాకేజీల పనులు అదే వేగంతో జరగాలని సూచించారు. ఈ నాలుగు ప్యాకేజీల కింద 3,51,150 ఎకరాలు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగులోకి రానున్నాయని మంత్రులు గుర్తు చేశారు. ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 625 చిన్న తరహా నీటి వనరులున్నాయని, వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపడం ద్వారా జిల్లాను మోడల్‌గా మార్చాలని కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు. సమీక్షలో శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్, ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఈఎన్సీ విజయప్రకాశ్, లిఫ్టుల సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు. జూన్ కల్లా కాళేశ్వరం పంపుల రన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల రన్ నిర్వహించాలని హరీశ్ ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు మూడు పంప్‌హౌస్‌ల పనులను విడిగా మంత్రి సమీక్షించారు. షిప్పింగ్ వల్ల ఆలస్యమయ్యే పక్షంలో ఆయా యంత్రాలను ఎయిర్ కార్గో ద్వారా దిగుమతి చేయాలని ఆదేశించారు. ప్యాకేజీ 6,8 పనులను కూడా సమీక్షించారు. ఇందులో వాడనున్న 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల పంపు ఆసియా ఖండంలోనే లేదని, చారిత్రక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం వైపు దేశమంతా చూస్తోందని అన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం ముఖం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు
సిద్దిపేటజోన్: తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం ముఖం పెట్టుకుని బస్సుయాత్ర చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పంథా ఏ మాత్రం మారలేదన్న విషయం ఇటీవల కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ మాటలతో అర్థమవుతోందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామని జైరాం అనడాన్ని హరీశ్ ఖండించారు. తాము ఏపీకి వ్యతిరేకం కాదని, అయితే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు రెండు రాష్ట్రాలూ సమానమన్న విషయాన్ని విస్మరించి జైరాం ఏకపక్షం గా వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రమే తప్పుబ డుతున్నామన్నారు. సోమవారం హరీశ్‌రావు సిద్దిపేటలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్‌తో కలసి విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నా ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రశ్నించక పోవ డం దారుణమన్నారు. తెలంగాణలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతలు అధిష్టానం వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఖండిస్తారా? చెప్పాలన్నారు. అప్పుడే బస్సు యాత్ర చేయా లన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. పోలవరానికి జాతీయ హోదాను కట్టబెట్టి, వెనకబడిన తెలంగాణ ప్రాజెక్ట్ అయిన అప్పటి ప్రాణహిత– చేవెళ్లకు మొండిచెయ్యి చూపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అప్పు లు తెచ్చి కడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించడాన్ని మంత్రి ఖండించారు. ఆనాడు ప్రాణహితను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చేవన్నారు. ఎనిమిదేళ్ల పాటు ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతులు, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఆ తప్పును సరిదిద్దేందుకే ఇప్పుడు అప్పుచేసైనా కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నామన్నారు. తెలంగాణను అవమానించినట్లే.. తలుపులు మూసి పార్లమెంట్లో విభజన బిల్లు పాస్ చేశారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని కోరినా, తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేసినా, ఉమాభారతి, గడ్కరీకి వినతిపత్రాలు అందజేసినా న్యాయం జరగలేదన్నారు. -
అవ్వా.. నేనున్నా!
సిద్దిపేటజోన్: అధునాతన హంగులతో రూపుదిద్దుకున్న ఆధునిక రైతుబజార్.. అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమం జరుగుతోంది. అంతలో ఓ వృద్ధురాలు కాలూ చేయీ కూడదీసుకుంటూ ఓ కాగితం పట్టుకుని నేరుగా మంత్రి హరీశ్‌రావు ఉన్న సభా వేదికపైకి చేరుకుంది. ఆమె ఇచ్చిన కాగితాన్ని చదివిన ఆయన చలించిపోయారు. మొదట ఆ వృద్ధురాలిని తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించాలని వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఆమె సమస్యను జిల్లా కలెక్టర్‌కు అప్పగించి.. న్యాయం చేయాలని ఆదేశించారు. అధైర్యపడొద్దని, అండగా తానుంటానని ఆ పండుటాకుకు భరోసానిచ్చారు. ఆ కాగితంలో ఉన్న వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం సింగన్నగూడేనికి చెందిన వీరస్వామిగౌడ్, వెంకటమ్మ భార్యాభర్తలు. భర్త కొద్ది కాలం క్రితం మరణించాడు. ఆమె పేరిట మూడు ఎకరాల 20 గుంటల భూమి ఉంది. అందులో కొంత పెద్ద కుమారుడు రాములుగౌడ్ ఫోర్జరీ పట్టాలు సృష్టించి సొంతం చేసుకున్నాడు. తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. ఆదరించే వారు లేక ఆమె కడుపు నింపుకొనేందుకు నానా అగచాట్లు పడుతోంది. ఆదరించాల్సిన కొడుకు అడుక్కుతినే పరిస్థితికి తెచ్చాడంటూ వెంకటమ్మ తన చిన్న కుమారుడితో కలసి సోమవారం మంత్రి హరీశ్‌రావును కలిసింది. ఓ లేఖను ఆయనకు అందించింది. అది మొత్తం చదివిన మంత్రి.. ఆమెను మొదట తన ఇంటికి పంపించారు. కడుపు నిండా అన్నం పెట్టించి.. సాయంత్రం కలెక్టరేట్‌కు తీసుకురావాల ని సిబ్బందికి సూచించారు. రాత్రి ఆయన కలెక్టరేట్లో సమీక్షలో ఉండగా, వెంకటమ్మ అక్కడకు వచ్చింది. విషయం తెలుసుకున్న మంత్రి.. సమీక్ష మధ్యలోనే బయటకు వచ్చారు. కలెక్టర్, జేసీలను పిలిపించి ఆమె ఇచ్చిన లేఖను ఆయన వారికి చదివి వినిపించారు. ‘అమ్మకు న్యాయం చేయండి. విచారణ చేపట్టి.. తల్లిని రోడ్డుకీడ్చిన కొడుకును జైలుకు పంపించడానికి వెనుకాడకండి’అని ఆదేశించారు. వృద్ధురాలితో ‘అమ్మా! అధైర్యపడకు. నీకు నేనున్నాను’ అని ధైర్యం చెప్పారు. ఇంత జాప్యమా..? కోనరావుపేట(వేములవాడ): కాళేశ్వరం ఎత్తిపోతల ప్యాకేజీ–9 పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లోగా పూర్తికావాల్సిన పనుల్లో 20 శాతమే పూర్తికావడం ఏమిటని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే జేఈ, డీఈ, ఏఈలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చేపట్టిన మల్క పేట రిజర్వాయర్ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పనుల్లో క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదికలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఈఈ బుచ్చిరెడ్డిపై మండిపడ్డారు. పక్షంరోజుల్లోగా పురోగతి కనిపించకపోతే వేరే ఏజెన్సీకి పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. నిర్దేశిత గడువులోగా కాళేశ్వరం ఎత్తిపోతల–9 ప్యాకేజీ పనులు పూర్తిచేసి ఈ ఏడాదిలోగా జిల్లా ప్రజలకు నీళ్లు అందించాలని సూచించారు. -
షిర్డీ సాయి మార్గం అనుసరణీయం
-
షిర్డీ సాయి మార్గం అనుసరణీయం
హైదరాబాద్: షిర్డీ సాయిబాబా చూపిన మార్గం అనుసరణీయమని, బాబా అంటేనే సేవాభావమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దానగుణం, అంతరాత్మ శాంతి, సంతృప్తి, సేవాభావాన్ని ఆచరించిన మహనీయుడు బాబా అన్నారు. ఎన్ని పదవులు, ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత లేని జీవితం వ్యర్థమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సాయి భక్తుల్లో ప్రేమ, దయ, క్షమాగుణం కనిపిస్తాయని, అంతా సేవా దృక్పథాన్ని అనుసరించాలన్నారు. సాయిబాబాతో తన అనుబంధం మాటల్లో చెప్పలేనని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. 2012లో షిర్డీ సాయిబాబా చిత్రం తీసే వరకు బాబా గురించి కొంత తెలిసిందని, కానీ తన స్నేహితుడు మహేశ్‌రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు ద్వారా పూర్తిగా తెలుసుకొని అనుభూతికి లోనయ్యానన్నారు. షిర్డీ సాయి సేవా సంస్థాన్ ట్రస్ట్ హైదరాబాద్, షిర్డీసాయి గ్లోబల్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం డాక్టర్ సతీశ్‌రెడ్డి, డాక్టర్ పి. రఘునాథరెడ్డిల పర్యవేక్షణలో జరిగింది. ఇందులో ఏపీ మంత్రి మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, చెంగారెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. పుస్తకాల ఆవిష్కరణ... ఈ సందర్భంగా షిర్డీసాయి గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చంద్రభాను శత్పతి రాసిన ‘సాయి శకం’ను గవర్నర్, ‘షిర్డీ సాయిబాబా అదర్ పర్ఫెక్ట్ మాస్టర్స్’తెలుగు అనువాద పుస్తకాన్ని దత్తాత్రేయ, ‘షిర్డీ సాయిబాబా–భక్తుల ప్రశ్నలు’పుస్తకాన్ని విశ్వేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. కాగా షిర్డీసాయి బాబా అరుదైన చిత్రాలను భక్తులు తిలకించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యేకతగా నిలిచాయి. గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి, విద్యార్థులు వివిధ రకాల నృత్యాలతో అలరించారు. -
అనుమతులన్నీ క్లియర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, భూగర్భ జల శాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ అనుమతులురాగా.. కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త అని, ప్రాజెక్టు కీలకమైన మైలురాయిని అధిగమించిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను ఇక యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ అనుమతులు రావడానికి కృషి చేసిన మంత్రి హరీశ్‌రావును, నీటి పారుదల, అటవీశాఖ అధికారులను సీఎం అభినందించారు. సంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ ఈ నెల 5న ఢిల్లీలో సమావేశమైన జల సం బంధమైన ప్రాజెక్టుల ‘ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు నివేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదని తేల్చింది. ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు, కాలువలు, పంపుహౌజ్‌ల నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అయితే పలు షరతులు విధించింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను సోమ వారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ నరేందర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎల్ అండ్ టి, మెగా సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. జూన్ నుంచే నీటిని తీసుకోవాలి నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ‘‘ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు పాత జిల్లాల పరిధిలో సాగు, తాగునీరు అందుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నాం. అటు అధికారులు, ఇటు వర్క్ ఏజెన్సీలు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వపరంగా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం. అటవీ, పర్యావరణ అనుమతులు రావడానికి అటవీశాఖ అధికారులు శ్రమించారు. అందరికీ ధన్యవాదాలు. పర్యావరణ అనుమతులు వచ్చిన స్ఫూర్తితో ప్రాజెక్టు నిర్మాణ వేగం మరింత పెంచాలి. వాస్తవానికి ఓ భారీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 20 ఏళ్లకుపైగా సమయం తీసుకునే సంప్రదాయం ఉంది. కానీ రాష్ట్రంలో రెండు మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తిచేసి.. కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందించాలని సంకల్పించాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది వర్షాకాలం నుంచే పాక్షికంగా నీటిని ఎత్తిపోసి వీలైనంత వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపుతాం. వచ్చే ఏడాది చివరి నాటికల్లా కాళేశ్వరం ప్రాజె క్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజ్‌లు, కాల్వలు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా ం. ఇందుకు అనుగుణంగా అధికారులు, ఇంజనీర్లు పనిచేయాలి..’’ అని సూచించారు. నిధులకు ఇబ్బందేమీ లేదు.. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించడంతో పాటు వివిధ బ్యాం కుల ద్వారా మరో రూ. 20 వేల కోట్లు సమీకరిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ‘‘అవసరమైన నిధులు, భూమి, అనుమతులు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల నిర్మాణంలో వేగం పెంచాల్సిన అవసరముంది. మూడు షిఫ్టుల్లో 365 రోజులు పనిచేయాలి. జూన్ నుంచి వర్షాలు కురిసి గోదావరికి వరదలు వస్తాయి. ఆలోగా ఏయే పనులు చేయాలి, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏమేం చేయాలి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ పనులు చేయాలన్న విషయంలో స్పష్టతకు రావాలి. రోజువారీ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేయాలి..’’అని సూచించారు. తాను నెలకోసారి, మంత్రి హరీశ్‌రావు పది రోజులకోసారి ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పారు. ఈఏసీ పెట్టిన షరతులివీ.. - ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున నిర్మా ణ దశలో, నిర్మించిన తర్వాత ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు సం బంధించిన అంశాలను నివేదించాలి. - అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్మెంట్ను చేపట్టాలి. దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలి. - ఘనవ్యర్థాల నిర్వహణ పర్యావరణ హితంగా ఉండాలి. ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిలో నిక్షిప్తం చేయొద్దు. శాస్త్రీయ విధానంతో రీసైక్లింగ్ చేయాలి. - భూమిని కోల్పోయిన వారికి భూసేకరణ చట్టానికి అనుగుణంగా పరిహా రం ఇవ్వాలి. - ఆధునీకరణ పనులు పూర్తయ్యే వరకు చెన్నైలోని కేంద్ర అటవీ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి అర్ధ వార్షిక నివేదికలు సమర్పించాలి. -
పది నెలల్లో కాళేశ్వరం పూర్తి
వచ్చే జూన్‌లో సాగునీరిచ్చి తీరుతాం: మంత్రి హరీశ్ సాక్షి, జగిత్యాల: పదినెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని.. వచ్చే జూన్ నాటికి తెలంగాణలోని 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగుకు నీరందించి తీరుతామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లను అతి తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో.. ఎక్కువ ఆయకట్టుకు తరలించేలా సీఎం కేసీఆర్ ప్రారంభించిన వరద కాల్వ ఎస్సారెస్పీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి, ధర్మపురిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసం గించారు. కాళేశ్వరం పూర్తయితే.. ఉత్తర తెలంగాణలో బోరు ఎండుడు.. బావిలో నీరు దంగుడు ఉండదన్నారు. ‘ఒకప్పుడు ఎస్సారెస్పీ నిండి.. పొర్లితే.. వరద కాల్వలోకి నీళ్లు పారితేనే మనకు నీళ్లొచ్చేవి.. కానీ, మనం వరదకాల్వనే రిజర్వాయర్‌గా మారుస్తున్నాం. మధ్యలో మూడు క్రాస్ రెగ్యులేటర్ల ఉన్నాయి. మనం కాళేశ్వరం నీటిని రిజర్వాయర్‌లో నింపితే అవి రివర్స్లోకి వెళ్లి ఎస్సారెస్పీలో పడతాయి.దీంతో వరదకాల్వ.. కాకతీయ కాల్వ మధ్య ఎండిపోతోన్న లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి..’ అన్నారు. మిడ్‌మానేరుకు కొబ్బరి కాయ కొట్టింది తామే అని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు 2005 నుంచి 2015 వరకు తొమ్మిదేళ్ల కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.106 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ.407 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేసిన విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ ఏడాది కచ్చితంగా 10 టీఎంసీల నీళ్లు మిడ్‌మానేరులో నింపడమే కాకుండా హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు ఈ ఏడాది నీరందిస్తామని స్పష్టం చేశారు. మండలానికో కార్యాలయం... రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాల్లో వెలుగుచూస్తున్న అవినీతి ఆరోపణలపై దృష్టిసారించిన సీఎం త్వరలోనే మండలానికో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారని హరీశ్ తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. -
త్వరలో కొత్త మార్కెట్ చట్టం: హరీష్‌రావు
హైదరాబాద్: మార్కెట్‌యార్డుకు బయట కొనుగోలుచేసిన ధాన్యానికి కూడా చట్టబద్ధత కల్పించే విధంగా నూతన చట్టాన్ని అమల్లోకి తేబోతున్నామని సాగునీటి, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరిష్‌రావు ప్రకటించారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మార్కెటింగ్ శాఖలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ రైతులు విక్రయించిన ధాన్యానికి వచ్చిన రూ.920 కోట్లు నగదును రైతుల అకౌంట్లలోకి బదిలీ చేశామని చెప్పారు. హమాలీ, దడ్వాయి, చేట కూలీలతో కలిపి మార్కెట్లలో 15399 మంది కూలీలు పనిచేస్తున్నారని వారికి కూడా నగదు రహిత లావాదేవీల ద్వారానే డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. -
రబీ సీజన్‌కు యాక్షన్ ప్లాన్
-
జిల్లాలో ఆరు రోడ్ల అభివృద్ధికి రూ.74 కోట్లు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సంగారెడ్డి జోన్: జిల్లాలో 6 రోడ్లు అభివృద్ధి చేసేందుకు సెంట్రల్ రోడ్డు ఫండ్ (సీఆర్ఎఫ్) కింద రూ. 74కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఒక్కో దానిలో ఒక్కో రోడ్డు చొప్పున మొత్తం ఆరు రోడ్లను వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు 64 కి.మీ మేరకు పనులు చేపట్టేందుకు 2016-17 సంవత్సరంలో సీఆర్ఎఫ్ రెండో విడత కింద రూ .74 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ క్రాస్ రోడ్డు నుంచి మైతాభ్ఖాన్గూడ వరకు రోడ్డు వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు 10 కి.మీ.లకుగాను రూ.12 కోట్లు. సిద్దిపేట నియోజకవర్గంలోని తోమాల నుండి నారాయణరావు పేట వరకు 12 కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఒంటి మామిడి-బండమైలారం మధ్య రోడ్డు వెడల్పు, మెరుగు పర్చేందుకు, మూడు హైలెవల్ బ్రిడ్జ్‌లను నిర్మించేందుకు రూ. 9 కోట్లు, నర్సాపూర్ నియోజక వర్గంలోని చిన్న గొట్టిముక్కుల నుంచి జీడిపల్లి వరకు 16 కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగుపర్చేందుకు రూ.20 కోట్లు, దుబ్బాక నియోజకవర్గంలో సిద్దిపేట రోడ్డు నుంచి పులిమామిడి వరకు 10.60కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగుర్చేందుకు రూ.11 కోట్లు, పటాన్చెరు నియోజకవర్గంలోని గద్దపోతారం నుండి బొల్లారం వరకు 12 కి.మీ రోడ్డును వెడల్పు చేసేందుకు, మెరుగు పర్చేందుకు రూ. 12 కోట్లు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. వివిధ సందర్భాల్లో పర్యటనలకు వెళ్లినపుడు అందిన అభ్యర్థనల మేరకు రోడ్డు పనుల అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు త్వరలోనే పనులు చేపట్టేందుకు ççతగిన సూచనలు జారీ చేస్తామన్నారు. -
రోడ్ల నిర్మాణానికి రూ.18 కోట్లు
సిద్దిపేట జోన్: నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ. 18 కోట్లు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సిద్దిపేట మండలం తోర్నాల నుంచి నారాయణరావుపేట వరకు రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు, మాచాపూర్ నుంచి నంగునూరు మండలం దర్గాపల్లి, బద్దిపడగ, సిద్దన్నపేట మీదుగా ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ రోడ్డును డబుల్‌లైన్‌గా మార్చడానికి రూ. 8 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. -
కాంగ్రెస్ హయాంలో ఏ పనీ కాలేదు
రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు జగదేవ్‌పూర్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏ ఒక్క పని కాలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మండలంలోని చేబర్తి, తిగుల్, అంగడికిష్టాపూర్, జగదేవ్‌పూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెలో ఏ ఒక్క పని పూర్తిగా చేయలేదని ఆరోపించారు. మాటలు తప్ప చేతల్లో చేయలేకపోయారని విమర్శించారు. విద్యుత్ సరఫరాల్లో గంట గంటకు బ్రేక్ ఉండేదని, దీంతో రైతుల మోటార్లు కుప్పలుగా కాలిపోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు, ఐటీ కంపెనీలకు, హైదరాబాద్‌కు నిరంతరం కరెంట్ ఇస్తూ పల్లెలో రైతులకు ఫ్రీ విద్యుత్తు అంటూ మోసం చేశారని ఆరోపించారు. ప్రీ కరెంట్ పేరుతో రైతులను దగా చేశారని విమర్శించారు. ప్రస్తుత సీఎం చేస్తున్న అభివృద్ధి పనులకు కాంగ్రెసోళ్లు ఎన్నో అనుమనాలు పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులు బాగుండాలని సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. 12 వందల మోగావాట్లు సింగరేణి నుండి తయారు కాగా, వేయ్యి మెగావాట్లు చత్తీస్ఘడ్ నుండి త్వరలోనే రావడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 నుండి 7 మెగావాట్లు వాడుతున్నమని త్వరలోనే 10 వేల మెగావాట్లు వాడేందుకు విద్యుత్ సంస్థలను తయారు చేయడం జరుగుతందని చెప్పారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం నియోజకవర్గంలో రూ.80 కోట్ల నిధులతో వర్గల్, అంగడికిష్టాపూర్, దుద్దెడ గ్రామాల్లో సబ్స్టేషన్లను నిర్మాణం చేశామని తెలిపారు. యాగంతోనే కాలం కాలిసోచ్చిందని ఇక నుండి కరెంట్ కష్టాలు ఉండవన్నారు. కాంగ్రెస్ పాలనలో చెపపిల్లల పెంపకంపై అంత శ్రద్ద పెట్టలేదని సీఎం కేసీఆర్ చెపపిల్లల పెంపకం కోసం రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేశారని, త్వరలోని అన్ని గ్రామాల్లో చెరువు, కుంటల్లో చెపపిల్లలను వదులుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు చెపపిల్లల కోసం 4 లక్షలు మంజూరు చేస్తే సీఎం కేసీఆర్ జిల్లాకు 4 కోట్లు నిధులు మంజూరు చేశారని అనందం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆడుగడునా వివక్షకు అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గఢా అధికారి హన్మంతరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకట్‌గౌడ్, నర్సింహ్మరెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక సర్పంచ్‌లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో గజ్వేల్ రోల్‌మోడల్
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్: గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలబెట్టడమే లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌లో రూ.8.5 కోట్ల వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరిస్తున్న జాలిగామ బైపాస్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంతానికి వరమని చెప్పారు. సీఎం కృషితో ఇప్పటికే గజ్వేల్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. గజ్వేల్‌ను అభివృద్ధిలో మోడల్‌గా చూపేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కనీస సౌకర్యాలు కరువై కొట్టుమిట్టాడిన గ్రామాలు నేడు కొత్తరూపును సంతరించుకుంటున్నాయని చెప్పారు. ‘మిషన్ భగీరథ’, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల జీవనంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం రెండు కళ్లులా భావిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. చివరగా మంత్రి పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘గడ’ ఓఎస్డీ హన్మంతరావు, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, కమిషనర్ శంకర్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ చిన్న మల్లయ్య, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రవీందర్రావు, ఆకుల దేవేందర్, బెండ మధు, శ్యాంమనోహర్, కౌన్సిలర్లు బోస్, రాజ్‌కుమార్, వసీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో ఇన్ని నీళ్లా..?
సింగూరు నీరు చూసి ఆశ్చర్యపోయిన మంత్రి హరీశ్‌రావు జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్రీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు నిండుకుండలా కనిపించిన సింగూరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్‌తో కలిసి సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. మంత్రి తన వాహనం దిగుతూనే ప్రాజెక్టు రీడింగ్ ఉండే ప్రదేశంలోని మెట్ల వద్దకు వెళ్లి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడి పోయారు. కొన్ని నిమిషాల పాటు దూరంగా ఉన్న నీటిని పరిశీలిస్తూ ఉండిపోయారు. నెల రోజుల కింద వచ్చినప్పుడు ప్రాజెక్టులో నీళ్లే లేవని , ఇప్పుడేమో ఇన్ని నీళ్లు వచ్చాయని, వీటిని చూస్తుంటే ఒక్క బొట్టు కూడా బయటకు పంపకూడదనిపిస్తోందని నవ్వుతూ అన్నారు. దేవుడు కరుణించడం వల్ల 15 రోజుల్లో ప్రాజెక్టు నిండిపోయిందని నిండిపోవడమే కాకుండా 41 టీఎంసీల నీరు మంజీర నదిలోకి వృధాగా పోయిందని మంత్రి అన్నారు. ప్రాజెక్టులో నీరు ఎండిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే బాబూమోహన్ మంత్రి దృష్టికి తీసుకుపోయారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, డిప్యూటీ స్పీకర్లు ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా నీటిని చూసి అనందం వ్యక్తం చేశారు. -
ముంపు గ్రామస్తుల తరలింపు
ఖాజీపూర్,ఎలగందుల(గూడెం)లకు నిలిచిన విద్యుత్ సరఫరా ఎలగందుల మోడల్ స్కూల్లో పునరావాసం మంత్రి హరీశ్‌రావు పర్యటన కరీంనగర్ : కరీంనగర్ మండలం ఖాజీపూర్, ఎలగందుల(గూడెం) గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాల్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం పర్యటించారు. రెండు గ్రామాల ప్రజల్లో మనోధైర్యం నింపారు. ఖాజీపూర్ శివారులో మానేరువాగు ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. రెండు గ్రామాలకు చెందిన ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా ఎలగందులలోని మోడల్ స్కూల్‌కు తరలించి పునరావాసం కల్పించారు. ఇళ్లల్లో ఉన్న విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఆ రెండు గ్రామాల్లో పోలీసులతో పహారా ఉంటుందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మిడ్‌మానేరుకు అధికంగా వస్తున్న వరద నీటితో ప్రమాదం పొంచి ఉందని ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడమే శ్రేయస్కరమని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్ వివరించారు. ఖాజీపూర్, ఎలగందుల(గూడెం)కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, తహసీల్దార్ జయచంద్రారెడ్డి, సర్పంచులు వెల్దండి ప్రకాశ్, మంద శేఖర్, ఆరె అనిల్‌కుమార్, వైస్ ఎంపీపీ నిమ్మల అంజయ్య, దావ కమల, ఆర్ఐ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
పరిస్థితి చక్కబడే వరకు సెలవులు వద్దు సమన్యయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలి జిల్లాలోని వర్షాలపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష సిద్దిపేట జోన్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున వర్షతీవ్రత తగ్గేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత శాఖల అధికారులకు సెలవులు మంజూరు చేయరాదని రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు జేసీ వెంకట్రాంరెడ్డికి సూచించారు. శనివారం రాత్రి ఆర్డీఓ కార్యాలయంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ, రెవెన్యూ, ఆటవీ శాఖల అధికారులతో భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం రాత్రిపూట పడుతున్న నేపథ్యంలో బుంగలు పడ్డ చెరువులకు గండి పడే అవకాశం ఉన్నందున పోలీసు, నీటి పారుదల శాఖ యంత్రాంగం సమన్వయంతో సహయక చర్యల్లో పాల్గొనాలన్నారు. చెరువుల వద్ద ఇసుక బస్తాలు కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. దెబ్బతిన్న రోడ్లకు తాత్కలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. అలాగే ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారుల పనితీరు భేష్ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందని అన్ని శాఖల పనితీరు ప్రసంశనీయమని మంత్రి సమీక్షలో అభినందించారు. ఇదే స్ఫూర్తితో సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వర్షం తగ్గిన వెంటనే పంట నష్టం అంచనా వేయలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఆదనంగా నీరు వస్తుందని అదే విధంగా ఎగువ మానేరు డ్యాంలో నీరు పుష్కలంగా చేరి డ్యాం నిండిందన్నారు. ఈ నేపథ్యంలో రబీ సీజన్లో వరి సాగు పెరగనుందని అందుకు ఆవరసరమైన ప్రణాళికలు సిద్ధ చేయాలని అధికారులను అదేశించారు. ఓపిక, సహనం ముఖ్యం అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు ప్రతి అధికారికి ఓపిక సహనం ఎంతో ముఖ్యమన్నారు. ఆ దిశగా పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూసేకరణ పనులు నియోజకవర్గ కాళేశ్వర ప్రాజెక్ట్ పురోగతిని ఆరా తీశారు. సమీక్షలో జేసీ వెంకట్రాంరెడ్డి, నీటిపారుదల శాఖ సీఈ హరిరాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ అనంద్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సుడిగాలి పర్యటన
వాగులు, వంకల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటన సిద్దిపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల పరిశీలన సిద్దిపేట జోన్: మూడు రోజులగా నియోజకవర్గంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలను శనివారం రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు నియోజకర్గంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు. ఉదయం 8 గంటల నుంచి మొదలుకోని మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల పరిధిలోని 30 చెరువులను మంత్రి పరిశీలించి వరద నీటి ప్రవాహం, స్థితిగతులపై నీటిపారుదల శాఖ, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా పట్టణంలోని కోమటి చెరువును, వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ మార్గంలోని ప్రధాన బ్రిడ్జి ( బావిస్ఖానాపూల్ ) ను సందర్శించి నీటి ప్రవాహం, బ్రిడ్జి స్థితిగతులు అధికారులను అడిగారు. శుక్రవారం అర్థరాత్రి పోటెత్తిన వరదనీటితో హైదరాబాద్ బ్రిడ్జి మార్గంలో నీరు పెద్ద ఎత్తున చేరిన విషయాన్ని గుర్తించారు. ఫీడర్ చానల్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన గేట్లను వెంటనే ఎత్తివేయాలని అర్అండ్బీఈఈ బాల్‌నర్సయ్యను., ఏఈ రవికుమార్‌కు సూచించారు. అలాగే నర్సాపూర్ చెరువులోకి ఫీడర్ చానల్ ద్వారా వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఫీడర్ లేకుంటే ఫికరే.. నాడు కోమటి చెరువు మత్తడి నీటి ప్రవాహాన్ని తరలించేందుకు సిమెంట్ లైనింగ్‌తో పట్టణ శివారులోని కెనాల్ మార్గంలో ఫీడర్ చానల్‌ను నిర్మించేందుకు ముందుకోస్తే స్థానికులు అభ్యంతరం చెప్పారని, నేడు సిమెంట్ లైనింగ్ ఫీడర్ చానల్ లేకుంటే కోమటి చెరువు లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా ఉండేదని మంత్రి స్థానికులతో అన్నారు. అనంతరం బృందావన్ కాలనీలోని నర్సాపూర్ ఫీడర్ చానల్‌ను పరిశీలించారు. పేట చెరువు నిండడమే నా కల రాజగోపాల్‌పేట పెద్ద చెరువును నింపడమే తన లక్ష్యమని, ఇలాంటి వర్షాలు మరింతగా కురిస్తే తన కల తీరుతుందని దానికి నీటి పారుదల శాఖ అధికారుల సహకారం కూడా ఎంతో ఆవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బృందావన్ కాలనీలోని నర్సాపూర్ ఫీడర్ చానల్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కోమటి చెరువు వరద నీరు ప్రవాహం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం పట్ల అక్కడే ఉన్న నీటిపారుదల శాఖ ఈఈ రవీందర్‌రెడ్డిని పిలిచి వివరాలు సేకరించారు. ఫీడర్ చానల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించాలన్నారు. అదే విధంగా నర్సాపూర్ ఫిడర్ చానల్‌ను సిమెంట్ లైనింగ్ ద్వారా మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు. మంత్రి అదేశాలతో నీటిపారుదల శాఖ అధికారులు అప్పటికప్పుడే యంత్రాలను తెప్పించి ఫిడర్ చానల్‌లోని చెట్ల పొదలు తొలగించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ డీఈ నాగరాజు, ఏఈ విష్ణు, తహశీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేటలోనే నంగునూరు మండలం
స్పష్టం చేసిన మంత్రి హరీశ్‌రావు నంగునూరు: నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగుతుంది.. ఎవరి మాటలు నమ్మవద్దు.. అంటూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మండల పర్యటనలో భాగంగా శనివారం ఆయన నంగునూరులోని మైసమ్మచెరువును సందర్శంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగుతుందన్నారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టస్తున్నారన్నారు. నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే ఉంటుందని మంత్రి ప్రకటించడం పట్ల మండల నాయకులతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
వర్షం బాధితులను ఆదుకోండి
మంత్రి హరీశ్‌రావు ఆదేశం నంగునూరు మండలంలో పర్యటన కూలిన ఇళ్లు పరిశీలన నంగునూరు: వర్షాలతో పంటలు, ఇళ్లు నష్టపోయిన బాధిత కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. కూలిన ఇళ్లను పరిశీలించారు. అక్కేనపల్లిలోని బుడుగ జంగాల కాలనీ మొత్తం నీట మునిగిందని, నిత్యావసర వస్తులు తడిసి నష్టం వాటిల్లిందని మహిళలు మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి తహసీల్ధార్ గులాం ఫారూక్ అలిని పిలిచి బాధిత కుంటుంబాలకు సాయంకాలంలోగా బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశించారు. ఇళ్లు కూలిపోయిన వారిని గుర్తించి డబుల్ బెడ్రూం పథకం వర్తింపజేయాలన్నారు. అనంతరం ఖాత, ఘణపూర్, నంగునూరులో మంత్రి పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు పంటలు నీట మునిగాయని ఆదుకోవాలని వేడుకున్నారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పురేందర్, సర్పంచ్‌లు విజయలక్ష్మి, రాధిక, లచ్చవ్వ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నర్సింలు, ఎంపీటీసీలు జయపాల్‌రెడ్డి, రామవ్వ, నాయకులు మల్లయ్య, రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, బాలు, చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
రిజర్వాయర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ద్విముఖం
సిద్దిపేట జోన్: కరీంనగర్ జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ధర్నాలు చేసిన కాంగ్రెస్.. నేడు మల్లన్నసాగర్ రిజర్వాయర్ విషయంలో ఆందోళనలు చేయడం విడ్డూరంగా రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 400 మంది విద్యార్ధులకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణ సమయంలో రామాచంద్రపురం, గుగ్గిల్లా, ఓబులాపూర్ మూడు గ్రామాలు ముంపునకు గురయ్యే సమస్య ఏర్పడిందన్నారు. అప్పట్లో తాను ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడి గ్రామాలను ముంపునకు గురికాకుండా వాగుమీద ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే గ్రామాలను ముంచాలని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు ధర్నాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇదే సమయంలో మల్లన్నసాగర్‌పై కాంగ్రెస్ పార్టీ భిన్నస్వరాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతుందన్నారు. 60 సంవత్సరాలుగా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం నోచుకోలేక బీడు భూములుగా మారిన తెలంగాణలో కోటి ఎకరాల మాగాని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. రైతు బ్రతుకు చిద్రం కాకుండా గోదావరి జలాలతో పచ్చని తెలంగాణను నిర్మిస్తామన్నారు. గత పాలకుల హయంలో విద్యుత్ కోతలతో సతమతం అయ్యామని నేటి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సమస్యను అధిగమించిందన్నారు. విద్యుత్ కోతలు లేని సరఫరా జరుగుతుందన్నారు. ఇవాళ నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గమైనా, హైటెక్ సిటీ అయినా సరే 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీ కాలం అనంతరం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం 365 గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిందన్నారు. నారాయణఖేడ్ బాధ్యత నాదే.. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు విద్య కోసం 150 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేటకు రావడం తనకు ఎంతో బాధను కలిగించిందన్నారు. ఇటీవల సీఎంతో మాట్లాడి జిల్లాకు 8 గిరిజన వసతి గురుకులాలు మంజూరైతే వాటిలో నాలుగింటిని నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేశామన్నారు. విద్య, వైద్యం, రవాణా, సాగునీటి రంగాల్లో ఖేడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు మురళియాదవ్, రాష్ర్ట నాయకులు బిడే కన్నె హనుమంతు, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, ప్రవీణ్, బర్ల మల్లికార్జున్, వెంకట్‌గౌడ్, సాకి అనంద్, దీప్తి నాగరాజు, బ్రహ్మం, టీఆర్ఎస్ నాయకులు కొండం సంపత్‌రెడ్డి, సాయిరాంతో పాటు గిరిజన విద్యార్ధి సంఘం కన్వీనర్ అజయ్‌నాయక్, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవికుమార్ వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
కోటి లక్షల టన్నుల ధాన్యం లక్ష్యం
సిద్దిపేట జోన్: సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలలు తరలించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి లక్షల టన్నుల వరిధాన్యాన్ని పండించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. బుధవారం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ బాంక్వేట్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ర్ట మంత్రి ఈటెల రాజేందర్‌తో మాట్లాడి రైస్ మిల్లర్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. సిద్దిపేటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, కరీంనగర్ రహదారిలో ఎస్పీ కార్యాలయంలో పరేడ్ గ్రౌండ్, మరో పైపు కలెక్టరేట్, మరొక దిక్కు జెడ్పీ కార్యాలయం ఏర్పాటుచేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో పత్తిపై సెస్‌ను 1.5 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి సాధ్యమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిచేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతి రోజు 2.5 టీఎంసీల నీటితో 25 వేల ఎకరాలకు నిత్యం నీరు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. సిద్దిపేట జిల్లాలో అంతగిరి, రంగనాయక్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్ట్‌ల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతుందన్నారు. మెదక్ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు కూడా ఇదే ప్రాజెక్ట్‌తో నీటిని అందిస్తామన్నారు. మరో 2 లక్షల ఎకరాలను బెజ్జంకి పరిసర గ్రామాలకు సాగునీరు కోసం అందిస్తామని చెప్పారు. సిరిసిల్ల వద్ద ఎగువ మానేరుకు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అన్నదాతకు సాగు నీరు అందినప్పుడే పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరించేందుకు సబ్‌కమిటీ నియమిస్తామన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావును అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, రైస్ మిల్లర్స్ రాష్ర్ట అసోసియేషన్ కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోడుపునూరి చంద్రపాల్, పట్టణాధ్యక్షులు కొమరవెల్లి చంద్రశేఖర్‌తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, టీఆర్ఎస్ రాష్ర్ట నాయకులు దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆకుపచ్చ జిల్లాగా సిద్దిపేట
సమైక్య రాష్ర్టంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం భవిష్యత్తులో గ్రీన్ డిస్ట్రిగ్గా మార్పు రాష్ర్ట మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేటను.. ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు సర్వత్రా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా జిల్లాను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సిద్దిపేట జిల్లాలో సహజ వనరులు-అభివృద్ధి అవకాశాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా గురించి బాధాకరమైన అంశాలు ఉన్నాయన్నారు. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, ఇల్లంతకుంట తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పొట్ట చేతపట్టుకొని బతుకు కోసం వలసలు వెళ్లిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ర్ట ముఖచిత్రంతో పోలి ఉండే సిద్దిపేట జిల్లా ప్రస్తుత కరువు పరిస్థితి నుంచి భవిష్యత్తులో సస్యశ్యామల జిల్లాగా మార్పు చెందడం ఖాయమన్నారు. 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ర్టంలో సిద్దిపేట ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. 1969లో తొలిదశ ఉద్యమంలో అనంతుల మదన్మోహన్ అందించిన సిద్దిపేట గడ్డ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ లాంటి చరిత్రకారుడిని అందించిందన్నారు. వామపక్ష భావాలకు సిద్దిపేట కేంద్రంగా నిలిచిన చరిత్ర కూడా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు , చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతో ముఖ్యమని హరీశ్‌రావు అన్నారు. దేశంలో 683 జిల్లాల్లో 121 కోట్ల జనసంద్రత.. సగటున ప్రతి జిల్లాకు 18 లక్షల జనసాంద్రత ఉందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ర్టంలోని 10 జిల్లాల్లో 3.60 కోట్ల జనసాంద్రత ఉండగా సగటున జిల్లాకు 36 లక్షల జనాభా ఉందన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే 27 జిల్లాల్లో సగటున 13 లక్షల 30 వేల జనాభా జనసాంద్రత ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మాత్రం 11 లక్షల జనాభా ఉందన్నారు. ఆలయాల గని సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో ఆలయాలు మెండుగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అంతగిరి పోచమ్మ, సిద్దిపేట కోటిలింగాలు, వర్గల్, అనంతసాగర్, సరస్వతి ఆలయాలు.. కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మలాంటి ప్రసిద్ధ ఆలయాలకు నూతన సిద్దిపేట జిల్లా కేంద్రంగా మారిందన్నారు. దేశంలోనే అతి ఎక్కువ సాగునీటి వనరులున్న జిల్లాగా సిద్దిపేట భవిష్యత్తులో మారనుందరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మిడ్ మానేరు ద్వారా 25 టీఎంసీలు, పోచమ్మ సాగర్ 3.5 టీఎంసీలు, రంగనాయక సాగర్ 3.5 టీఎంసీలు, 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 7.5 టీఎంసీలు, గౌరిపల్లి రిజర్వాయర్ 8.5 టీఎంసీలు, గంగిరెడ్డిపల్లి ద్వారా 2 టీఎంసీల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్ట్‌ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చే దిశగా సిద్దిపేట ప్రాజెక్ట్‌లు చరిత్రలో నిలుస్తాయన్నారు. రిజర్వాయర్ల ద్వారా 10 శాతం నీటిని పరిశ్రమలకు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందస్తుగానే నిర్ణయం తీసుకున్నారన్నారు. భవిష్యత్తులో సిద్దిపేట పట్టణం 2 లక్షల జనాభాకు చేరుకుంటుందన్నారు. జిల్లాకు మూడో జాతీయ రహదారి ఇప్పటికే రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా మారనున్న సిద్దిపేటకు మరో సువర్ణ అవకాశం లభించనుందని మంత్రి తెలిపారు. మూడో జాతీయ రహదారిగా సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్ మార్గానికి కేంద్రం త్వరలో పచ్చజెండా ఊపనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వీడిపోయినా ఆత్మీయులుగా ఉందాం మెదక్ జిల్లా విడిపోయినప్పటికీ ప్రజలు, నాయకులు, అధికారులు ఆత్మీయులుగా కలిసి ఉండాలని రాష్ర్ట శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా మంత్రిగా హరీశ్‌రావు నేటి వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుల సహకారంతో మెదక్ జిల్లా ఏర్పడిందని.. ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతులు చెప్పారు. అంతకు ముందు ప్రముఖ పరిశోధకుడు గోపాల సుదర్శనం.. జిల్లాలోని సహజ వనరులు, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావును, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, టీఆర్ఎస్ రాష్ర్ట కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గ్యాదరి రవి, సాకి ఆనంద్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, లెక్చరర్లు హరినాథ శర్మ, రవికుమార్, దుర్గాప్రసాద్, మామిడాల శ్రీనివాస్, భవానీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
దసరాకు సిద్దిపేట జిల్లా షురూ
సిద్దిపేట తాత్కలిక కలెక్టరేట్‌గా ఎల్లంకి కళాశాల భవనాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: దసరా పండుగ నుంచి సిద్దిపేట జిల్లాకు రాజముద్ర పడనుందని, అధికారికంగా జిల్లా ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా కేంద్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట తాత్కాలిక కలెక్టరేట్ కోసం ఎంపిక చేసిన పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాలను బుధవారం మంత్రి పరిశీలించారు. రాష్ర్టంలో సిద్దిపేట ఎంతో ఖ్యాతి గడిచిందని, జిల్లా కేంద్రంగా మారనున్న సిద్దిపేట కలెక్టరేట్‌కు కావాల్సిన భవన సముదాయాలు ఎల్లంకి కళాశాలలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కలెక్టరేట్ కానున్న దృష్ట్యా కళాశాలలోని ప్రతి భవనాన్ని మంత్రి పరిశీలించారు. పార్కింగ్‌కు అనువైన మైదానం, మౌలిక వసతులను ఆరా తీశారు. ఆయన వెంట ఓఎస్డీ బాల్‌రాజు, తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, మచ్చవేణుగోపారెడ్డి, చిప్ప ప్రభాకర్, గ్యాదరి రవి, సాకి అనంద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
50 ఏళ్ల కలలపై నీళ్లు చల్లొద్దు!
కాంగ్రెస్, టీడీపీలు అభివృద్ధి వ్యతిరేకులు పారదర్శకంగా జిల్లాల పునర్ఃవిభజన రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, పరిపాలన సౌలభ్యం కోసమే పారదర్శకంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపడుతున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పునర్విభజన ప్రక్రియపై కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ అభివృద్ధి నిరోధక పార్టీలుగా అభివర్ణించారు. ఇదే ప్రక్రియను కొనసాగిస్తే ఆ రెండు పార్టీల నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అడ్డుకునేందుకు కోర్టుకు, నల్ల జెండాలతో భూసేకరణ ప్రక్రియను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తే తమకు భవిష్యత్తు ఉండదన్న సందేహంలో వారంతా ఉన్నారన్నారు. 50 ఏళ్లుగా ఆయా ప్రాంతాల ప్రజలు కన్నకలలను సీఎం కేసీఆర్ నేడు అమలుచేసే దిశగా ముందుకు నడుస్తున్నారని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ద్వారా సమగ్ర నివేదికను రూపొందిస్తున్నామన్నారు. అఖిలపక్షంతో సమావేశం నిర్వహించి, డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసి సలహాలు, సూచనలు, అభ్యంతరాల కోసం 30 రోజుల గడువు కూడా ప్రకటించామన్నారు. జగిత్యాల, వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ కూడా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని, రాజకీయ ఉద్దేశం ఉంటే ఇదంతా జరిగేదా అని ప్రశ్నించారు. అదే విధంగా తమ పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా, జనగామలో జిల్లా ప్రకటన లేకపోవడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు. ఉత్తమ్.. సిద్దిపేటలో మాట్లాడు.. ‘మెదక్ జిల్లాలో మూడు జిల్లాలు అవసరమా?’ అని ప్రశ్నించిన రాష్ర్ట టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి దమ్ముంటే అదే మాటను సిద్దిపేట పాత బస్టాండ్ వద్దకు వచ్చి మాట్లాడాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. సిద్దిపేటకు వ్యతిరేకంగా ఒక్క ప్రకటన చేసినా సహించేది లేదన్నారు. జిల్లాల పునర్విభజనపై మాట్లాడే నైతిక హక్కు ఉత్తమ్‌కుమార్ లేదని స్పష్టం చేశారు. మహారాష్ర్ట ఒప్పందంపై రాద్దంతం, ప్రాజెక్ట్‌ల భూసేకర అడ్డుకోవడం, జిల్లాల పునర్విభజనపై కోర్టును ఆశ్రయిస్తామనడాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. వారే సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ.. ఒకే నిర్ణయం ప్రకటించే ధైర్యముందా? అని మంత్రి ప్రశ్నించారు. సొంత పార్టీలో ఐక్యత రాగం లేని కాంగ్రెస్.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. ప్రతిపక్షాలు మంచి సూచనలు ఇస్తే అంగీకరస్తామని.. అందుకు వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్ది సూచన మేరకు మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వ రిజర్వేషన్లు అమలు చేసిందని గుర్తుచేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
సీఎం ‘ఇలాకా’లో పనుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ ఇకపై ప్రతి సోమవారం సమీక్షలు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు హరీష్‌రావు గజ్వేల్: సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై ఇక నుంచి ప్రతి సోమవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడ’ ఓఎస్డీ హన్మంతరావు నేతృత్వంలో సమీక్ష ఉంటుందని, అవసరాన్ని బట్టి తానుకూడా సమీక్షలకు హాజరవుతానని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమాత్యులు హరీశ్‌రావు వెల్లడించారు. సోమవారం గజ్వేల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడ’ ఓఎస్డీతో కలిసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు. తమ శాఖలకు సంబంధించి సమగ్ర సమాచారం అధికారుల వద్ద ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా గజ్వేల్‌ను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ‘మిషన్ భగీరథ’ పనుల ప్రగతిపై ఈఈ రాజయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేశామని, మరో 14 వరకు గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. ఆర్అండ్బీ శాఖ పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. గజ్వేల్‌తో పాటు ఆయా మండల కేంద్రాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా తలెత్తే సమస్యలను ఎంపీ, ‘గడ’ ఓఎస్డీలు పరిష్కరిస్తారని చెప్పారు. గజ్వేల్‌లోని వంద పడకల ఆసుపత్రి, తూప్రాన్‌లోని 50 పడకల ఆసుపత్రిని డిసెంబర్ 31 నాటికి పూర్తిచేసి అప్పగించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నగర పంచాయతీలో విద్యుదీకరణ కోసం చేపట్టిన దీన్‌దయాళ్ పథకాన్ని ప్రజలు విరివిగా వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ పథకం ద్వారా రూ. 125 లకే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. చెరువుల్లో జేసీబీ గుంతలను ఇష్టానుసారంగా తీయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం చర్చకు రావడంతో మంత్రి సీరియస్‌గా స్పందించారు. ఇకనుంచి చెరువుల్లో లోతుగా గుంతలు తీస్తే సహించేదిలేదన్నారు. అలాంటి చర్యలకు పాల్పడింది ఎంతటి వారైనా సరే కేసులు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇకపై గుంతలు సమాంతరంగా తీయాలని సూచించారు. ఈ సమావేశంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. -
రిమ్మనగూడకు మంత్రి వరాలు
గజ్వేల్: గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి మంత్రి హరీశ్‌రావు వరాలు కురిపించారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సందర్భంలో గ్రామసర్పంచ్ పోచి చిన్నరాములు, గ్రామస్తులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా గ్రామానికి రూ. 10లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ. 10లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, ఈద్గా నిర్మాణం కోసం రూ. 2లక్షలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు గదుల నిర్మాణానికి నిధులు, లైబ్రరీ, యూత్ బిల్డింగ్ కోసం రూ. 10లక్షలు, రిమ్మనగూడ-కోనాపూర్ బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు విడుదల చేస్తామని ప్రకటించగానే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కొడకండ్ల గ్రామంలోనూ పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. -
అధికారులకు ప్రశంసాపత్రాలు
రామాయంపేట: ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా మంత్రి హరీశ్‌రావుతోపాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి చేతులమీదుగా ఎంపీడీవో రాణి, మండల వ్యవసాయ అధికారి రమేశ్, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతిర్మయి. స్థానిక ఎంపీపీ సూపరిండెంట్ గఫూర్‌ఖాన్ ప్రశాంసాపత్రాలను అందుకున్నారు. మండలానికి చెందిన అధికారులు సన్మానం పొందడంపై ఆయా పార్టీల ప్రతినిధులతోపాటు అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
ఉప్పొంగిన ఉత్సాహం
కనులపండువగా పంద్రాగస్టు వేడుకలు పరేడ్‌గ్రౌండ్స్‌లో మిన్నంటిన సంబురాలు అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్న శకటాలు సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సంగారెడ్డిలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలకు జిల్లా మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి హరీష్‌రావు పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జ్ఞాపికలను అందజేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సాంస్కృతి ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ రూ.5వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. అలరించిన ప్రదర్శనలు పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. చిట్కుల్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు జాతీయసమైక్యత, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున పథకాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మిషన్ భగీరథను ప్రధాని మోడీ ప్రారంభించటం, మిషన్‌కాకతీయ పథకం అమలు, భ్రూణహత్యల నివారణ, బేటీబచావో..బేటీపడావో కార్యక్రమాలను వివరిస్తూ విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అలరించాయి. సంగారెడ్డికి చెందిన శ్రీచైతన్య హై స్కూల్ విద్యార్థిని కౌశిక భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కేజీవీబీ నర్సాపూర్, సంగారెడ్డి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల, సంగారెడ్డి విద్యాభారతి హైస్కూల్, సెయింట్ ఆంథోనీ హై స్కూల్, పటాన్చెరు శిశు విహార్ విద్యార్థుల ప్రదర్శనలను అందరినీ అలరింపజేశాయి. శకటాల ప్రదర్శన వివిధ ప్రభుత్వశాఖలు ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉద్యానవనశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన, మహిళా శిశు సంక్షేమం, ఉపాధి హామీ పథకం, అటవీశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్బీఎస్ఏ, 108,104, ఫైర్ డిపార్టుమెంట్ శకటాలు ప్రదర్శించాయి. ఇదిలా ఉంటే ఐసీడీఎస్, అటవీశాఖల శకటాలపై జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ చిత్రాలను ముద్రించకపోవటం విమర్శలకు దారితీసింది. స్టాల్స్‌ను తిలకించిన మంత్రి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వ శాఖలు తమ పనితీరును వివరిస్తూ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. మంత్రి హరీశ్‌రావు స్టాల్స్‌ను తిలకించి అధికారుల పనితీరును అభినందించారు. జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ, డీఆర్డీఏ, ఈజీఎస్, ఐసీడీఎస్, ఎస్ఎస్ఏ, డీఎంహెచ్ఓ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎస్సీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్, పశుసంవర్థకశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, అటవీశాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఆయా స్టాల్స్‌ను మంత్రి హరీష్‌రావు, కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు తిలకించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు కారు తాళాలు అందజేశారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌లోని వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. -
రావెల్లికి మంత్రి హరీశ్ రాక
తూప్రాన్: తూప్రాన్ మండలం రావెల్లికి నేడు మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రావెల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి గత ఆరు నెలల క్రితం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో విద్యుత్ శాఖ నుంచి మృతుడి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుచేసినట్లు తెలిపారు. ఈ చెక్కును మంత్రి చేతుల మీదుగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. -
హరీశ్‌రావు ప్రకటన అవాస్తవం
కొనసాగుతున్న ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం కొల్చారం : కొల్చారం మండలం చిన్నఘనపూర్లోని ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ఓ వైపు కొనసాగుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఎత్తు పెంపు పనులు జరగడం లేదని కేవలం మరమ్మతు పనులే చేపడుతున్నామని అసత్య ప్రకటన చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. ఆదివారం ఘనపూర్ ఆనకట్టను సందర్శించిన సీపీఎం సభ్యులతోపాటు ఘనపూర్ ఆనకట్ట నిర్వాసితుల ఆధ్వర్యంలో ఎత్తు పెంపు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతు ఓ వైపు అధికారులు ఘన³Nర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనుల్లో తలమునకలై ఉంటే, మంత్రి అదేం లేదనడం రైతులను తప్పుతోవ పట్టించడమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసుతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఖరీఫ్‌లో 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు: హరీష్‌రావు
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 4.60 లక్షల ఎకరాలకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి నీరందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జులై1 నాటికి కల్వకుర్తి నుంచి 1.50లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు నుంచి 1.50లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్టు నుంచి 1.40 లక్షల ఎకరాలకు, కోయిల్ సాగర్ కింద 20వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తయ్యేట్లు చూడాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో కచ్చితంగా ఉండాలని జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున చెరువుల సామర్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో వర్షాలకు చెరువులు నిండుకుండాల్లా ఉన్నాయని తెలిపారు. చెరువుల నీటి మట్టాన్ని ప్రతిరోజూ నమోదు చేసుకోవాలని నీటి ఒరవడికి చెరువులకు గండీ పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
అభివృద్ధి-అణిచివేతకి మధ్య పోరు
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికలు అభివృద్ధి-అణిచివేతకి మధ్య జరుగుతున్న పోరాటమని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ... బెదిరింపులకు పాల్పడుతున్న పార్టీలను సాగనంపాలని, ప్రజలకు అండగా తాముంటామన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ బండారం బయటపడుతుందని ఆగమాగమవుతున్నారని హరీష్ ఎద్దేవా చేశారు. -
'రాముపని రాముకే.. నాపని నాకే'
హైదారాబాద్: 'రాముకు(కేటీఆర్) నాకు ఆధిపత్య పోరని, గ్రేటర్ ఎన్నికల్లో నన్ను దూరం పెట్టారనేది ఓ న్యూసెన్స్' అని టీఆర్ఎస్ పార్టీ నేత మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలా చౌకబారు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 'మేమంతా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. రెండు ఎన్నికలూ మాకు ముఖ్యమే. జిల్లా మంత్రిగా నారాయణఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతలను సీఎం నాకు అప్పగించారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను రాముకు, ఇతర మంత్రులకు ఇచ్చారు' అని హరీష్ రావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ కనీసం 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నారాయణఖేడ్‌లో 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని తాను ముఖ్యమంత్రికి మాటిచ్చానని, కానీ, ప్రజా స్పందన చూస్తుంటే మాత్రం మిగిలిన రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని హరీష్ రావు చెప్పారు. తాము 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తామని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
మంత్రులతో హరీశ్‌రావు భేటీ
-
నిజాయితీ వుంటే ప్రశంసించండి కానీ...
-
అపరిశుభ్రత ఇక కను‘మరుగు’
- మహా సంకల్పానికి శ్రీకారం.. - రూపు మారనున్న నవాబుపేట - 72 గంటల్లో 243 మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం - ముమ్మరంగా ప్రారంభమైన పనులు - పనుల్ని పర్యవేక్షించిన మంత్రి హరీశ్‌రావు హత్నూర: జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న ఆ గ్రామంలో ఎటుచూసినా అధికారులు.. ముమ్మరంగా పనులు.. మహా సంకల్పంలో నిమగ్నమైన గ్రామస్తులు.. వారిని ఉత్సాహపరుస్తూ మంత్రి హరీశ్‌రావు.. జిల్లాలో ఇప్పుడు నవాబుపేట హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిష్టాత్మకంగా 72 గంటల్లో 243 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి హత్నూర మండలంలోని నవాబుపేట గ్రామం నడుం బిగించింది. అదే సమయంలో ఇంకుడుగుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టుకుంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు 46 మండలాల ఎంపీడీఓలు, ఏఓలు.. అందరూ నవాబుపేటలోనే మకాం వేశారు. వీరంతా గ్రామంలోనే ఉండి నిర్మాణం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో ఎంపీడీఓృబందానికి 6 చొప్పున మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణ బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. ఈ టార్గెట్‌ను పూర్తిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక, గ్రామస్తులు తమ ఇంటి వద్దే ఉంటూ మరుగుదొడ్ల నిర్మాణంలో నిమగ్నమయ్యారు. 72 గంటల తరువాత నవాబుపేట వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా గుర్తింపు పొందనుంది. 311 ఇళ్లు.. 68 మరుగుదొడ్లు నవాబుపేట గ్రామంలో 311 ఇళ్లు ఉన్నాయి. వీరిలో 68 కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు మరుగుదొడ్లు ఉన్నాయి. 243 కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం విచారకరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన జిల్లా ఉన్నతాధికారులు, పార్టీ ప్రముఖులు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు. నిర్మాణం పనుల్లో తానూ తాపీ పట్టారు. లక్ష్యసాధన దిశగా గ్రామస్తులను, అధికారులను ఉత్సాహపరిచారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రామజ్యోతి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో జిల్లా యంత్రాంగాన్ని మొత్తం మోహరించి ప్రతిష్టాత్మకంగా లక్ష్యాన్ని చేపట్టామని మంత్రి చెప్పారు. ఈ రోజు (గురువారం) నుంచి 72 గంటల్లో.. అంటే మూడు రోజుల్లో వంద శాతం మరుగుదొడ్ల, ఇంకుడుగుంతల లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన వెంటనే మరుగుదొడ్లను వాడుకోవాలని ప్రజలకు సూచించారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు, ఇంకుడుగుంత నిర్మాణానికి రూ.4500 ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. లక్ష్యాన్ని సాధిస్తే గ్రామానికి ఏది కావాలిస్తే అది సమకూరుస్తానని మంత్రి హామీనిచ్చారు. -
బదిలీలకు తెర
- 25 మంది ఎంపీడీఓలకు స్థానచలనం - పదోన్నతులు పొందిన 10 మందికి పోస్టింగ్‌లు - అయిష్టంగానే జెడ్పీ చైర్పర్సన్ ఆమోదం - ఎంపీడీఓల అసంతృప్తి.. మంత్రి హరీశ్‌ను కలిసే యత్నం సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్‌లో ఎంపీడీఓల బదిలీల వ్యవహారానికి తెరపడింది. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే పదోన్నతులపై జిల్లాకు వచ్చిన పది మంది ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీల ఫైల్‌పై జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ అయిష్టంగానే సంతకం చేసినట్లు తెలుస్తోంది. బదిలీల విషయమై జెడ్పీ చైర్పర్సన్, సీఈఓ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఒత్తిడి రావటంతో బదిలీల జాబితాపై ఆమె సంతకం చేసినట్టు తెలుస్తోంది. శివ్వంపేట, జిన్నారం, రామచంద్రాపురం, కొండాపూర్, జిన్నారం మండలాల్లో బదిలీలపై ఆమె కొన్ని సూచనలు చేయగా.. ఆ మార్పులు చేయకుండానే అధికారులు బదిలీ జాబితాను ఆమోదం కోసం బుధవారం సాయంత్రం పంపినట్లు సమాచారం. ఆపై బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. మరోపక్క బదిలీలపై ఎంపీడీఓలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గురువారం ఉదయం పలువురు ఎంపీడీఓలు నవాబ్‌పేటకు వచ్చిన మంత్రి హరీష్‌రావుకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో శుక్రవారం కలిసేందుకు సిద్ధమవుతున్నారు. 25 మంది బదిలీ.. పదిమందికి పోస్టింగ్‌లు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న 25 మంది ఎంపీడీఓలను బదిలీ చేశారు. పదోన్నతి పొందిన 10 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఫిర్దోస్ అలి-మనూరు, జితేందర్‌రావు-పాపన్నపేట, బి.శ్రీరాములు-కౌడిపల్లి, ఆర్.మల్లేశం-టేక్మాల్, ఎం.ఎ.ముజీబ్-కల్హేర్, పి.బాల-చిన్నశంకరంపేట, రహ్మతుల్లాఖాన్-దుబ్బాక, ఎం.డి.జాఫర్-చిన్నకోడూరు ఎంపీడీఓగా పోస్టింగ్‌లు పొందారు. పదోన్నతి పొందిన జయలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె డీఆర్డీఏ ఏపీఓగా ఉన్నారు. బదిలీలు, పోస్టింగ్‌లు ముగిసినా.. ఇంకా రామాయంపేట, చేగుంట, నంగునూరు, తొగుట, అందోలు, చిన్నకోడూరు, రామచంద్రాపురం మండలాల్లో ఎంపీడీఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పారదర్శకంగా బదిలీలు చేపట్టామని సీఈఓ మధు తెలిపారు. -
అన్నదాత ఉసురుతీస్తున్న అప్పులు
ఆరుగురు రైతుల ఆత్మహత్య సాక్షి నెట్వర్క్: అప్పులు అన్నదాతను ఆత్మహత్యలవైపు ఉసిగొల్పుతున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు కాలం కలిసి రాక.. పూలమ్మిన చోటే కట్టెలమ్మలేక బలవన్మరణాల బలిపీఠం ఎక్కుతున్నారు. అప్పుల బాధ తాళలేక శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు తెలంగాణ జిల్లాల్లో మొత్తం ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండ లం ఎలుకుర్తి హవేలికి చెందిన రైతు నౌగిరి శ్రీను(44) తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న వేశాడు. రెండేళ్ల నుంచి సాగు చేస్తున్నా దిగుబడి రాక.. గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో అప్పుల పాలయ్యాడు. రూ. 2.40 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది శు క్రవారం అర్ధరాత్రి ఉరివేసుకున్నాడు. ఇదే జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన రైతు దంతెనపల్లి నర్సింహారావు(40) ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేసేందుకు దుక్కి సిద్ధం చేశాడు. చేతిలో పెట్టుబడి లేక, అప్పు తీరే మార్గం కనిపించక శనివారం క్రిమిసంహారక మందుతాగాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన రైతు నరిగె రవి అప్పులు చేసి తనకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేశాడు. అవసరమైన నీరు అందకపోవడంతో పంట దెబ్బతింది. మనోవేదనకు గురైన రవి గత నెల 31న రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. అప్పటి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవి శుక్రవారం రాత్రి చనిపోయాడు. మెదక్ జిల్లా ఇదే మండలం రాజ్‌పల్లి పరిధి తిమ్మక్కపల్లికి చెందిన రైతు శ్రీపతి మైపాల్(30) తన భూమిలో నీటి కోసం అప్పు చేశాడు. అది తీరే మార్గం కానరాక శనివారం ఉరి వేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన కుర్వ బక్కన్న, కుర్వ సవారమ్మ(35) పంటల సాగుకోసం రూ.8 లక్షలు అప్పుచేశారు. పంట పోవడంతో సవారమ్మ పురుగుమందు తాగింది. ధరూరు మండలంలోని దోర్నాలకు చెందిన హరిజన్ దుబ్బన్న (42)వ్యవసాయం కోసం రూ.రెండులక్షలు అప్పుచేశాడు. అవి తీరే దారి కానరాక శనివారం రాత్రి పురుగు మందు తాగి మృతి చెందాడు. రైతులూ ఆత్మహత్యలొద్దు: మంత్రి హరీశ్ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు కోరారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం నారాయణరావుపేటలో శనివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాద న్నారు. సీఎం కేసీఆర్ సాగునీటి కోసం భగీరధుడిలా కృషి చేస్తున్నారని అన్నారు. -
నెలరోజుల్లో ఇరిగేషన్ పాలసీ
- సీఎం ప్రకటిస్తారన్న భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌రావు - ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తాం.. రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు - 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే.. - రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు సత్తుపల్లి/ వేంసూరు:‘తెలంగాణలో విద్యుత్ లేకుం డా చేస్తే పంటలు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడతారనే కుట్రతో అర్ధరాత్రి అడ్డగోలుగా చంద్రబాబు తొమ్మిది మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారు. లోయర్ సిలేరును తెలంగాణకు కాకుండా చేసి.. ఇప్పుడు విభజనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని భారీ నీటి పారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. బేతుపల్లి ప్రత్యామ్నాయ వరద కాలువకు బుధవారం రాత్రి నీరు విడుదల చేశారు. అనంతరం వేంసూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. చంద్రబాబునాయుడు లోయర్ సిలేరు ప్రాజెక్టు లేకుండా చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చారన్నారు. కేసీఆర్ పారిశ్రామిక పాలసీ ప్రకటించిన తరువాత పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పరుగులు తీయటం బాబుకు మింగుడు పడటం లేదన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో జిల్లాకు ఇరిగేషన్ పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల్లో ప్రకటిస్తారని తెలిపారు. దుమ్ముగూడెం వద్ద బ్యారెజ్ కట్టలేదు కానీ.. మోటార్లు తెప్పించి బిల్లులు మింగేశారని ఆరోపించారు. జరిగిన ఖర్చు వృథాకాకుండా రిటైర్డ్ ఇంజనీర్లతో రీ-డిజైన్ చేయించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు లిఫ్ట్ సంఖ్యను తగ్గిస్తూ త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మొదటి దశలో చెరువులన్నీ మిషన్ కాకతీయలో బాగు చేసుకుంటున్నామని.. మీడియం ఇరిగేషన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ముందుకు వెళ్తున్నామన్నారు. పత్రి మండల కేంద్రంలో గౌడౌన్ ఏర్పాటు కోసం రూ.85 కోట్లు మంజూరు చేశామన్నారు. ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తాం.. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్రప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నామని మంత్రి అన్నారు. జీ-4 దశలో ఐరన్ ఓర్ ఉందన్నారు. ఎక్స్‌ఫ్లోరేషన్ చేసి జీ-4 జీ-3 దశకు తెచ్చి తెలంగాణలో ఐరన్‌ఓర్ వెలికితీత పనులు సింగరేణికి అప్పగించామని.. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. పత్తి ైరె తుల మద్దతు ధర కోసం సీసీఐతో చర్చిస్తున్నామన్నారు. జిల్లాకు నాలుగేళ్లలో గోదావరి జలాలు తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బేతుపల్లి ప్రత్యామ్నాయ వరద కాలువ నీటి విడుదల చేయటం నా పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జలగం వెంకటరావు, బాణోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, వేంసూరు జెడ్పీటీసీ గుగులోత్ భాషా, ఎంపీపీ మోటపోతుల జగన్నాథం, సర్పంచ్ తక్కెళ్లపాటి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
మార్కెట్లలో రైతులకు న్యాయం జరగాలి
మంత్రి హరీశ్‌రావు ఆర్కేపురం: రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసమే మార్కెటింగ్‌శాఖ పనిచేస్తుందని, రైతు లేనిదే మార్కెట్, కమిషన్ ఏజెంట్లు ఉండరని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్లో రూ. 2.60 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ భవనాన్ని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులకు, ఏజెం ట్లకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వారికి న్యాయం జరిగేలా మార్కెటింగ్ శాఖ పని చేయాలన్నారు. మార్కెట్లో ఫిర్యాదుల బాక్స్, టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్లో తెల్లచిట్టీలతో వ్యాపారం చేయవద్దని, తక్పట్టీలతోనే వ్యా పారం కొనసాగించాలని, ఎలక్ట్రానిక్ వే మిషన్స్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్నగర్ మార్కెట్లో చిరువ్యాపారులకు షెడ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. మార్కెట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధర ఎంత ఉన్నా ప్రభుత్వం భరిస్తుందని, రూ. 20లకు కేజీ ఉల్లిగడ్డ అందిస్తామని పేర్కొన్నారు. నగరంలో 46 సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఇతర సంఘాల నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఎ.శరత్, సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ కమిటీ కార్యదర్శి శాస్త్రి, మల్లేషం, రాంమోహన్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, తీగల విక్రమ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆర్కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్, బీరెళ్లి వెంకట్‌రెడ్డి, కంచర్ల శేఖర్, పగిళ్ల భూపాల్‌రెడ్డి, తుమ్మల శ్రీరాంరెడ్డి, మహ్మద్, రామాచారి, శ్రీనివాస్, మల్లేష్, మార్కెటింగ్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, ముకారం పాల్గొన్నారు. -
హబ్.. కబ్?
గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి శ్రీకారం చుట్టారు. నాబార్డు సహకారంతో నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేళ్లలో నాబార్డు కింద 2,500 యూనిట్ల డెయిరీ పథకాలను వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు రైతులకు చెక్కులను సైతం పంపిణీ చేశారు. మొదటి ఏడాది 500, రెండో ఏడాది 1000, మూడో ఏడాది మరో వెయ్యి యూనిట్ల రైతులకు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్ విలువ(రెండు ఆవులు లేదా గేదెలు) రూ.1.2లక్షలు ఉంటుంది. ఇందు కోసం బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇస్తారు. సాధారణ రైతులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతుండగా... దానిని లక్ష లీటర్లకు పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ మొదటి ఏడాదిగా భావించిన 2014లో కేవలం 200 మందికి మాత్రమే రూ.60 వేల చొప్పున చెక్కులను(మొత్తం రూ.1.2కోట్లు) పంపిణీ చేశారు. నిజానికి పంపిణీ చేసింది 200 యూనిట్లలో సగం మాత్రమే. ఈ ఏడాదిలో సగం గడిచిపోయినా ఇప్పటివరకు ఈ వ్యవహారంపై చడీచప్పుడు లేదు. గత ఏడాది యూనిట్లు పంపిణీ చేసిన రైతుల్లో చాలావరకు నాబార్డ్ నుంచి సబ్సిడీ అందక ‘స్త్రీనిధి’ నుంచి రుణాలు అందజేసినట్లు తెలిసింది. ‘గజ్వేల్ మిల్క్‌గ్రిడ్’ పథకం ముందకు సాగకపోవడానికి నాబార్డు, బ్యాంకర్ల సహకార లోపమే కారణంగా తెలుస్తున్నది. తాజాగా ఈసారి కూడా సబ్సిడీలు అందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు.. కానీ రూపాయి అందలేదు గతేడాది డిసెంబర్ 24న గజ్వేల్‌కు నన్ను పిలిచిండ్రు. బర్ల లోన్ రూ.60 వేలు వచ్చిందని ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు రూపాయి అందలే. బ్యాంకుకు ఈ ప్రొసీడింగ్ తీసుకొని వెళ్తే వాళ్లు పట్టించుకుంటలేరు. ఏడు నెలల నుంచి ఇంతే పరిస్థితి. - కుంట శ్రీనివాస్‌రెడ్డి, ఆహ్మాదీపూర్ గ్రామ రైతు మంత్రి దృష్టికి తీసుకెళ్లాం... ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి బడ్జెట్ సక్రమంగా కేంద్రం నుంచి రావటం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ మేరకు మంత్రి కేంద్రానికి లేఖ రాశారు. కొద్ది రోజుల్లో బడ్జెట్ పెంపునకు అవకాశమున్నది. ప్రస్తుతం వచ్చిన బడ్జెట్‌తో పథకం కొనసాగుతుంది. గజ్వేల్ పథకానికి ఇబ్బంది ఉండదు. - రమేశ్ కుమార్, నాబార్డు ఏజీఎం -
ఆకుపచ్చ తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కొండపాక : సీమాంధ్ర ప్రాంత నాయకుల మోసాలతో వెనుకబాటుకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణాగా మార్చేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి చేతుల మీదుగా జరిగాయి. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో అరకొర విద్యుత్తు సరఫరాతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణా ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా వ్యవసాయరంగానికి నాణ్యమైన పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు రూ. 91వేల కోట్లతో సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారన్నారు. రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రలకు విద్యుత్తును ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామన్నారు. గోదావరి నదీ జలాలతో కొండపాక మండలంలోని అన్ని గ్రామాలకు నల్లాల ద్వారా మంచినీరందిస్తామన్నారు. దీంతో పాటు వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని తపాస్‌పల్లి రిజర్యాయర్ నుంచి కొండపాక మండలంలోని 11 గ్రామాలకు, సిద్దిపేట మండలంలోని 4 గ్రామాల చెరువులకు కాల్వల ద్వారా నీరు మళ్లించేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల రూ. 40 కోట్లను మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మ-నరేందర్, జెడ్పీటీసీ మాధురి, నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, టీడీబీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు కొడకంచికి కేసీఆర్
- వంద కోట్లతో నిర్మించిన ఆటో మొబైల్ పరిశ్రమ ప్రారంభం - ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు జిన్నారం: ముఖ్యమంత్రి కేసీఆర్ జిన్నారం మండలంలో శనివారం పర్యటించనున్నారు. కొడకంచిలో సుమారు వంద కోట్లతో నిర్మించిన డక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటైన మొదటి పరిశ్రమ ఇదే కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం పర్యవేక్షించారు. మంత్రితోపాటు కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎస్పీ సుమతి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పరిశ్రమలో పర్యటించారు. మంత్రి హరీశ్‌రావు సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలను తెలుసుకున్నారు. పరిశ్రమ ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్కలను నాటే స్థలాన్ని కూడా మంత్రి పరిశీలించారు. సుమారు ఐదెకరాల స్థలంలో మొక్కలను నాటేందుకు పరిశ్రమ యాజ మాన్యం చర్యలు తీసుకోవటం అభినందనీయమన్నారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఫారెస్ట్, స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాలలో సీఎం మొక్కలను నాటేందుకు సైతం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఇదిలా ఉండగా మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు రావటంతో, విద్యార్థులకు విద్యను బోధించాలని, ఇలాంటి కార్యక్రమాలను చేయించొద్దని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి దృష్టికి సమస్యలు గిరిజన గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను మంత్రి హరీశ్‌రావు స్వయంగా తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీగోడ లేకపోవటం, నీటి సమస్య తదితర సమస్యలను పాఠశాల ప్రిన్సిపల్ శశికళ మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. -
సతతం.. హరితం
- వృక్ష సంపదలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి - గత పాలకుల వైఫల్యాల వల్లే కరువు, కాటకాలు - మొక్కల పెంపకం.. కేసీఆర్ ఆలోచనే.. - మంత్రి హరీశ్‌రావు వెల్లడి మెదక్ రూరల్: హరితహారం.. మెతుకుసీమకు మణిహారంగా మారాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. పథకాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట, మెదక్ మండలం, పాపన్నపేట మండలాల్లో పర్యటించి మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యాల వల్లే రాష్ట్రంలో కరువు, కాటకాలు ఏర్పడ్డాయన్నారు. భవిష్యత్తు కోసం కేసీఆర్ హరితహారం పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. మొదటి విడతగా జిల్లాలో 3.52కోట్ల మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. ఇందులో ప్రతి గ్రామానికి 40వేల మొక్కల చొప్పున నాటాలన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములై.. విరివిరిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈయేడు పక్క జిల్లా అయిన ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయన్నారు. అక్కడ అడవులు ఉండటం వల్లే వర్షాలు ముందస్తుగా కురిశాయన్నారు. జిల్లాలో నేటికీ ఎక్కడా సరిగ వర్షాలు కురవక పోవడానికి కారణం అడవుల నరికివేతనే కారణమన్నారు. మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. మొక్కల పెంపకం కోసం కలెక్టర్‌తోపాటు అధికార యంత్రాంగం ఒకరోజు వేతనం ఇచ్చారని, దీంతో డిప్యూటీ స్పీకర్‌తోపాటు తాముసైతం ఒకనెల వేతనం ఇచ్చామన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో మొదటి మొక్కను చిన్నశంకరంపేట అమర వీరుల స్థూపం వద్ద నాటడం మరిచిపోలేని జ్ఞాపకమన్నారు. అనంతరం మెదక్ మండలం మాచవరం ఎంఎన్ కెనాల్ ప్రాంతాల్లో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఎఫ్ఓ శివాని డోగ్రె, ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్ తదితరులుపాల్గొన్నారు. కెనాల్ పనుల నాణ్యతపై మండిపాటు మెదక్ రూరల్: మెదక్ మండలం మహబూబ్‌నహర్(ఎంఎన్) కెనాల్ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఓ చోట సిమెంట్‌కు పగుళ్లు రావటంతో ఇదేమిటని ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరిగేషన్ ఈఈ ఏసయ్య బదులిస్తూ వర్షాలు కురవడంతో పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. ఆయనతో పాటు డిప్యూటి స్పీకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులున్నారు. చెర్మన్ నల్లగుడ్డలతో నిరసన చిన్నశంకరంపేట: హరితహారం పథకం పైలాన్ ప్రారంభించే కార్యక్రమంలో శిలాఫలకంపై తన పేరు పెట్టలేదని చిన్నశంకరంపేట సహకార సంఘం అధ్యక్షుడు కె.సత్యనారాయణరెడ్డి నల్లగుడ్డలతో మంత్రి హరీశ్‌రావు కార్యక్రమానికి హాజరయ్యారు. విషయం గ్రహించిన పోలీస్‌లు వారిని అడ్డకున్నారు. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తన పేరును కావాలనే శిలాఫలకంపై పెట్టడంలేదని ఆరోపించారు. అటవీశాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం పాపన్నపేట: ‘ఇరవై మంది అధికారులున్నారు. మొక్కలు నాటేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. కాని మొరం పోసిన గుంతలో మొక్కను నాటేందుకు మీకు మంత్రి కావాలా?’ అంటూ అటవీశాఖ అధికారులపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండలం ఏడుపాయల్లో శుక్రవారం మంత్రి హరీశ్‌రావు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చెలెమెల కుంట వద్ద మంత్రి చేత ఓ మొక్కను నాటించేందుకు ఏర్పాటు చేశారు. కాని ఆ గుంతలో మొరం వేయడం చూసిన మంత్రి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్‌పై ఫైర్ అయ్యారు. మొరంతో మొక్క ఎలా బతుకుతుందంటూ ప్రశ్నించారు. ఇందుకోసం ఇంత పెద్ద ఏర్పాట్లు చేయాలా? అంటూ నిలదీశారు. దీంతో అటవీశాఖ అధికారులు ఖంగుతిన్నారు. దుర్గమ్మకు మంత్రి పూజలు ఏడుపాయల దుర్గమ్మకు మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ వెంకట కిషన్‌రావు, డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్, ఇన్స్పెక్టర్ శివరాజ్‌లు వారికి స్వాగతం పలికి, సన్మానించారు. అనంతరం లక్ష్మినగర్‌లో సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి మొక్కలు నాటారు. -
అద్దంలా సిద్దిపేట
సీఎం కేసీఆర్ రాక నేడే - ఏర్పాట్లు పూర్తి.. 3 గంటల పాటు టూర్ - మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం సిద్దిపేట జోన్: సర్వాంగ సుందరంగా సిద్దిపేట ముస్తాబైంది. హరితహారంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటకు వస్తుండటంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి హరీశ్‌రావు రెండు రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి సుమారు 3 గంటల పాటు హరితహారంలో పాల్గొననున్నారు. పొన్నాల దాబా నుంచి బద్ధిపడగ వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమం కొనసాగనుంది. సీఎం పర్యటన ప్రాంతాలను ఆర్డీఓ ముత్యం రెడ్డి, జిల్లాకు చెందిన డీఎస్పీల బృందం పరిశీలించింది. పట్టణంలో నిర్దేశించిన పది జోన్ల పరిధిలో గుంతలు తీయడం, మొక్కలు సిద్ధంగా ఉంచడం, ట్రీగార్డుల పంపిణీ, డివైడర్లకు తుదిమెరుగులు దిద్దడం, పలు చోట్ల రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు, మురికి కాలువల శుభ్రం తదితర పనులను చేపట్టారు. మరో వైపు తమ పార్టీ అగ్రనేత రెండో సారి ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేటకు రానుండటంతో పార్టీ నేతలు ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో సిద్దిపేటకు కొత్త శోభను తెచ్చిపెట్టారు. ఇదిలా ఉండగా రాత్రి ఎస్పీ సుమతి బందోబస్తును పర్యవేక్షించారు. -
రేపు సిద్దిపేటలో సీఎం పర్యటన
- పాత బస్టాండ్‌లో కేసీఆర్ ప్రసంగం, 10వేల మందితో సమావేశం - రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు - పట్టణంలోని రోడ్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్: సీఎం కేసీఆర్ శనివారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం సిద్దిపేటలో మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం పర్యటన సాగే రూట్లను పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన రోడ్లుపైనే సంబంధిత అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని పలు రోడ్లను పరిశీలించారు. సీఎం పట్టణ పరిధిలోని పొన్నాల దాబాల నుంచి సిద్దిపేటకు రానున్న క్రమంలో రహదారికి ఇరువైపులా చెట్లను నాటనున్నారు. అలాగే పట్టణంలోని పాత బస్టాండ్ వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద సుమారు 10వేల మంది మహిళలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు మంత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో సీఎం హరితహారంపై ప్రసంగిస్తారు. పది బ్లాక్‌లుగా విభజన సిద్దిపేట పట్టణాన్ని పది బ్లాకులుగా విభజించినట్లు మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒక్కో బ్లాక్‌ను ఒక్కో శాఖకు కేటాయించి, ఆ బ్లాక్‌లో మొక్కలు నాటే బాధ్యత ఆ శాఖ అధికారులే తీసుకోవాలన్నారు. సీఎం పర్యటిస్తున్న క్రమంలో విజిలేస్తే అధికారులు అలర్ట్ కావాలన్నారు. మొక్కలపై ఆరా సీఎం పర్యటన సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఎలాంటి మొక్కలు నాటాలని, ఏ మొక్కలు నాటితే బాగుంటుందనే విషయమై మంత్రి అధికారులతో చర్చించారు. రోడ్లకు ఇరువైపులా పలు రకాల మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి పాల్గొన్నారు. జిల్లాలోనే వర్షపాతం తక్కువ సిద్దిపేట రూరల్: గతంలో చైనా ఇసుక తుఫానులతో ఆగమయ్యేదని, తుఫానుల నివారణ కోసం దేశమంతా 80 కోట్ల మొక్కలు నాటడంతో ఇసుక తుఫాన్ జాడలేకుండా పోయిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండాయన్నారు. మెదక్ జిల్లాలో ఎక్కడా ఒక్క చెరువు కూడా నిండలేదన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు భాగస్వాములై మొక్కలు పెంచితే వారికి మంచి గుర్తింపు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, వైస్ ఎంపీపీ శ్రీహరిగౌడ్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి పాల్గొన్నారు. లక్షా ఇరవై వేల ట్రీ గార్డులు అందజేస్తాం: మంత్రి నంగునూరు: హరితహారం పథకంలో భాగంగా జిల్లాకు లక్షా ఇరవై వేల ట్రీగార్డులు అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జరిగిన నంగునూరు మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్నందునే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు ప్రతి గ్రామంలో 40 వేల చొప్పున మొక్కలు నాటి హరిత తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు. మెదక్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మొక్కలను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో జిల్లాకు కోటి 20 లక్షల ట్రీగార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రతి గ్రామానికి వంద చొప్పున ట్రీ గార్డులు అందజేసి 20 వేల ట్రీగార్డులు కలెక్టర్ ఆధీనంలో ఉంచుతామన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, రోడ్ల వెంబడి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ప్రజాప్రతినిధుకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ ఉపాద్యక్షుడు నర్సింలు, నాయకులు దువ్వల మల్లయ్య, ఎంపీడీఓ ప్రభాకర్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, మంత్రి ఓఎస్డీ బాలరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసాచారి, ఇరిగేషన్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
3.52 కోట్ల మొక్కలు రెడీ
సర్వం సిద్ధం - ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి - నేడు మెదక్‌లో ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు - 4న సిద్దిపేటకు సీఎం కేసీఆర్ - కలెక్టర్ రాహుల్ బొజ్జా వెల్లడి సంగారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇందుకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమమైనా జయప్రదమవుతుంద న్నారు. కలెక్టరేట్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వందలో మూడో వంతు చెట్లు వుంటాయని అన్నారు. చెట్లు విరివిగా వుంటే పర్యావరణ పరిరక్షణతో పాటు సకాలంలో వర్షాలు కురిసి ఆ దేశం సుభిక్షంగా వుంటుందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం 20 శాతం మాత్రమే పచ్చదనం వుందని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హరిత హారం కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఈనెల 4న సిద్దిపేట నియోజకవర్గంలో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల నుంచి 50వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. 450 నర్సరీల్లో 250 అటవీ శాఖ, 200 డోమా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రైతులు పొలాల్లో టేకు, యూకలిప్టస్ మొక్కలు, రహదారుల వెంట పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పండ్ల మొక్కలను ఎంపిక చేశామన్నారు. జిల్లాలో దాదాపు 4.70లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు వున్నారని, ప్రతి ఇంటికి 5 నుంచి 10 మునగ, కరివేపాకు, మామిడి, సపోటా, అంజూర పండ్ల మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటేందుకు కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. గృహాల్లో స్థలం లేని వారికి క్రీపర్లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కింద ఇప్పటివరకు 900 చెరువులను పునరుద్ధరించామని, వాటి కి చుట్టూ ఈత, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని పారశ్రామిక వాడల్లో పది లక్షల మొక్కలు నాటేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని, లక్ష ట్రీగార్డులను సమకూరుస్తున్నారని చెప్పారు. జిల్లాలో రిజర్వు ఫారెస్ట్ కేవలం పది శాతం వున్నందున రూట్స్టాక్ ఉన్న మొక్కలన్నింటినీ పురుద్ధరిస్తామని అన్నారు. పదివేల ఎకరాల్లో పెద్ద ఎత్తున ట్రెంచ్ కటింగ్ కూడా చేస్తున్నామన్నారు. ఫారెస్ట్ చుట్టూ రక్షణగా గచ్చకాయ మొక్కలను పెంచేందుకు ఇప్పటికే రెండు లక్షల మొక్కలను కూడా అందుబాటులో వుంచామని చెప్పారు. అనంతరం స్వచ్ఛ హరిత మెదక్ పేరిట రూపొందించిన లోగోను కలెక్టర్, జేసీ తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్ఓ దయానంద్, డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, జేడ్పీ సిఇఓ/డోమా పీడీ మధు, వాటర్ గ్రిడ్ ఎస్.ఇ.విజయప్రకాష్ పాల్గొన్నారు. వారానికి సరిపడా గుంతలు.. మొక్కలు నాటేందుకు తొమ్మిది లక్షల గుంతలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. వారం రోజులతో పాటు సెప్టెంబర్ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతున్న దృష్ట్యా గుంతలను తవ్వించి సిద్ధం చేస్తామని వివరించారు. బహిరంగ మల విసర్జన లేని స్వచ్ఛమైన జిల్లాగా మార్చడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. లక్ష మరుగుదొడ్లు నిర్మించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు. -
నేటి నుంచి ‘హరితహారం’
పోయిన వానలను మళ్లీ వెనక్కి తెప్పించే మహా యజ్ఞం సాగుతోంది.. పంట చేల మీది వానరాలను వెనక్కి పంపే గొప్ప యాగం జరుగుతోంది. రాబోయే విపత్తును తప్పించి, జన జాతులను, సకల జీవాలను కాపాడుకునే మహా ‘హరిత’ ఉద్యమం మన తలుపు తడుతోంది. ఉద్యమాల గడ్డ మనది.. ఉద్యమించే తరుణం ఇది. మరొక్కసారి అందరం చేయి.. చేయి కలుపుదాం.. బడిలో, గుడిలో.. చావడిలో.. చెరువుల్లో.. చేలల్లో.. ఇంటి పరిసరాల్లో.. చెట్లు పెరగటానికి అనువైన ప్రతి చోటా బాధ్యతగా మొక్కలను నాటుదాం.. నీళ్లుపోసి.. పొతం చేసి కాపాడుకుందాం. మన ఊరికి మనమే పచ్చని చెట్లను హారంగా వేద్దాం. దూరమైన కోయిలమ్మల కమ్మటి రాగం మళ్లీ చెవులారా విందాం. - మొత్తం మొక్కలు 3.52 కోట్లు - మొత్తం నర్సరీలు 450 - ఒక్కో నియోజకవర్గంలో నాటే మొక్కలు 40 లక్షలు - ఒక్కో గ్రామంలో నాటే మొక్కలు 40 వేలు - మహా ఉద్యమంలా ముందుకు... - ప్రతి ఒక్కరూ భాగస్వాములే! సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుతం జిల్లాలో 9.95 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. తక్షణం అటవీ శాతం పెంచి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి పల్లెను పచ్చని వనంగా మార్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పల్లెలో మొక్కను నాటి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంబించనున్నారు. పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కల చొప్పున జిల్లా వ్యాప్తంగా 3.50 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో కనీసం 30 నుంచి 40 వేల మొక్కలను పెంచటానికి ప్రభుత్వం సంకల్పించింది. మనందరి బాధ్యత... దాదాపు 60..70 ఏళ్ల నుంచి చెట్లను నరుక్కుంటూ వస్తున్నాం.. జిల్లాలో ఒకప్పుడు 35 శాతం ఉన్న అడవుల విస్తీర్ణం ఇప్పుడు కేవలం 9.95 శాతానికి పడిపోయింది. వాతావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే జిల్లా భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలి. ఇంత శాతాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న చెట్లు కాకుండా 10.56 కోట్ల మొక్కలు అదనంగా పెంచాలి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇన్ని కోట్ల మొక్కలు పెంచడం ఒక్క ప్రభుత్వ యంత్రాంగంతో సాధ్యమయ్యేపని కాదు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కల నాటినప్పుడే జిల్లా 33 శాతం అడవులతో నిగనిగలాడుతుంది. అధికారులు నిబద్ధతో మెలగాలి... ‘చెప్పేదే చెయ్యి.. చేసేదే చెప్పు’ ఇదే హరితహారం నినాదం. లక్ష్యాన్ని చేరే క్రమంలో అధికారిక లెక్కలు.. అంచనాలు వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయి. మొక్కలు నాటేందుకు కీలకమైన గుంతల తవ్వకాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం డొల్లతనం బయటపడింది. శుక్రవారం నాటి కార్యక్రమానికి ఎన్ని గుంతలు తీశారో అధికారులు ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోయారు. ‘మమ’ అనిపించుకుని కాకి లెక్కలతో నివేదికలు రూపొందించి మభ్య పెట్టే బదులు చేతనైనంతలోనే నిఖార్సుగా.. నిబద్ధతతో మొక్కలు నాటుదాం. నాటిని ప్రతి మొక్కను కాపాడుకునేందుకు కంకణబద్ధులవుదాం. దేశంలో మూడో పెద్ద కార్యక్రమంగా చరిత్రకెక్కిన హరితహారం పథకానికి అధికారులే నిబద్ధతతో మెలిగి పథకాన్ని విజయవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి... పొలంగట్ల మీద: టేకు, వెదురు, గచ్చకాయ, గోరింట, సుబాబుల్, పండ్ల మొక్కలు ఇంటి పరిసరాల్లో: కరివేపాకు, మునగ, బొప్పాయి, జామ, ఉసిరి, దానిమ్మ, కానుగ, వేప, బాదం పాఠశాలలు, కార్యాలయాలు: కానుగ, వేప, బాదం, రావి, జువ్వి, మర్రి, నేరేడు, ఉసిరి రహదారుల పక్కన: ఎర్రతురాయి, పచ్చతురాయి, బాహీనియా, కానుగ, నేరేడు, దిరిశిన, సిస్సు చెరువుగట్లు: ఈత, తాటి, ఖర్జూర, కొబ్బరి, తెల్లమద్ది, నల్లతుమ్మ బోడిగుట్టలు: ఉసిరి, సీతాఫలం, మర్రి, రావి, వేప తదితర మొక్కలు నాటుకోవచ్చు. -
సర్కారు బడుల్లో..ఇంగ్లిష్ విద్య
♦ మంత్రి హరీష్‌రావు ♦ ప్రభుత్వ స్కూళ్లకు ‘రోటరీ’ బెంచీల పంపిణీ మాదాపూర్: ప్రభుత్వం సర్కారుబడుల్లో ఇంగ్లిషు మాధ్యమం ప్రవేశపెట్టేందుకు యోచిస్తోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. రోటరీ ఫౌండేషన్ఆధ్వర్యంలో గురువారం 145 ప్రభుత్వ పాఠశాలకు 7,593 డ్యూయల్ డెస్క్‌లు పంపిణీ చేశారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యలో నాణ్యత చాలా ముఖ్యమని, బోధనతో పాటు పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించాలన్నారు. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో ప్రతి విద్యార్థి 10 మొక్కలను నాటాలని సూచించారు. పోలియో నిర్మూలనకు రోటరీ ఫౌండేషన్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ డెరైక్టర్ మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ.. త్వరలో విన్స్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఇందులో పదేళ్లలో 10 వేల టాయిలెట్ల నిర్మాణం చేపడతామన్నారు. కాగా, కార్యక్రమం జరుగుతుండగా వీడియో క్రేన్ ప్రమాదవశాత్తు ఊడిపోయి టేబుల్‌పై పడి పక్కనే ఉన్న విద్యార్థినికి తగిలింది. దీంతో బాలికకు స్వల్ప గాయమైంది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రోటరీ ఫౌండేషన్ కౌన్సిలర్ మర్రి రవీంద్రారెడ్డి,సేవ్ అవర్ స్కూల్స్ చైర్మన్ రవి వడ్లమాని, ఎం.వి. ఫౌండేషన్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు. -
మార్కెటింగ్ శాఖలో మరిన్ని ఉద్యోగాలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో 200 కొత్త పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని... వీటితో పాటు మరికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 150 మార్కెట్ కమిటీలున్నాయని... మరో 30 కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త పోస్టుల మంజూరు కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. గోదాముల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని, వాటి నిర్మాణానికి టెండర్లు పిలవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో రైతు బజారు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థల సేకరణపై దృష్టి సారించాలన్నారు. రైతు బజార్లన్నింటికీ కామన్ డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖలోనూ ఆన్లైన్ ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ (బార్ కోడింగ్)ను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. పనిలో వేగంతోపాటు పారదర్శకత కోసం వాట్స్ అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్స్ వేతనాలు పెంచుతామని, దీనిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే దడ్వాయి కార్మికులకు బీమా వర్తింప చేస్తామన్నారు. మార్కెటింగ్ ఫీజులకు ఎగనామం పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. యార్డుల్లో సరుకు అమ్మకం నుంచి రైతులకు సొమ్ము చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియను ఆన్లైన్లో పెట్టాలన్నారు. మార్కెట్ కమిటీలు హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. -
నష్టపోయిన 24 గంటల్లోనే పరిహారం..
మెదక్(సిద్దిపేట): వర్షాలతో నష్టపోయిన బాధితులకు 24 గంటల్లోనే పరిహారాన్ని అందిస్తున్నామని, ఏ ప్రభుత్వం చేయని తరహాలో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది ఒక రికార్డు అని మంత్రి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం, పట్టణంలో కురిసిన వర్షానికి నష్టపోయిన బాధితులకు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో రూ. 3,200 చొప్పున 48వేల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు. దళితుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నంగా దళిత కుటుంబాల్లో వివాహాలకు చేయూతనిచ్చేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరువేల మందికి రూ.51వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. దళిత లక్ష్మి పథకానికి నిర్ణీత పరిమితి, గడువు లేదని ఎంత మందికైనా, అర్హులు ఎక్కడున్నా పథకం అమలు చేస్తామన్నారు. -
‘మార్కెట్’ కుర్చీ కోసం ఆరాటం
- మార్కెట్ కమిటీల చైర్మన్ పదవి కోసం ఆశావహుల పోటాపోటీ - మంత్రి హరీష్‌రావుకు నేడు స్వాగతం పలికేందుకు పోటాపోటీ ఏర్పాట్లు చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్ల చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. చేవెళ్లలోని మార్కెట్ యార్డులో గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంగళవారం వస్తున్న మార్కెటింగ్ శాఖా మంత్రి హరీష్‌రావు, జిల్లా మంత్రి మహేందర్రెడ్డిలను ప్రసన్నం చేసుకునేందుకు అనేక తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండళ్లలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా తెలపడంతో పలు సామాజికవర్గాల నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆశావహులు వీరే.. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సామ మాణిక్‌రెడ్డి సైతం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతోపాటు పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడిన చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డుమెంబర్ బర్కల రాంరెడ్డి, మాసన్నగారి మాణిక్‌రెడ్డి, చనువల్లి రామేశ్వర్‌రెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు. రిజర్వేషన్ విధానం అమలై ఎస్సీకి దక్కితే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.వసంతం, నర్సింహులు తదితరులు పోటీలో ఉన్నారు. బీసీ అయితే మండల యూత్ నాయకులు ఎం.యాదగిరి, మీర్జాగూడ మాజీ సర్పంచ్ భీమయ్య, కె.పాండు, సత్యనారాయణగౌడ్ తదితర నేతలు పోటీలో ఉన్నారు. సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం జనరల్ కేటగిరీకి రిజర్వు అయితే షాబాద్ మండలంలోని చందనవెళ్లికి చెందిన కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కక్కులూరుకు చెందిన మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జీవన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయిస్తే సంకెపల్లికి చెందిన చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవుని పరమేశ్వర్‌రెడ్డి, మహాలింగపురం గ్రామానికి చెందిన బల్వంత్‌రెడ్డి పోటీపడుతున్నారు. బీసీలకు కేటాయిస్తే శంకర్‌పల్లికి చెందినబొమ్మనగారి కృష్ణ, మోకిలకు చెందిన లింగం, ఎస్సీలకు రిజర్వు చేస్తే మహారాజ్‌పేటకు చెందిన సామయ్య, జన్వాడకు చెందిన యాదయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
అన్నదాతకు చేయూతనందిస్తాం
- 15 నుంచి రైతు చైతన్య యాత్రలు - జిల్లాలో రూ. 80 కోట్లతో గోదాముల నిర్మాణం - మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: రైతాంగానికి చేయూతనందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోదని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గణేష్ నగర్లో రూ.35 లక్షలతో నిర్మించనున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలక కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణం విస్తరిస్తున్న క్రమంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖకు సొంత భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పశుసంవర్థక శాఖ, వ్యవసాయ శాఖ ఒకే ప్రాంగణంలో ఉండడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు. ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా రైతు చైతన్య యాత్రలను నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా చైతన్య యాత్రలను నిర్వహించి రైతులకు ప్రభుత్వం అందించే పథకాలను, సబ్సిడీలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు. జిల్లాలో లక్షా 20వేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ నిల్వను అందుబాటులో పెడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి 35వేల మెట్రిక్ టన్నుల యూరియాను నిల్వ రూపంలో బఫర్ స్టాక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లాలో గోదాముల కొరతను అధిగమించేందుకు రూ. 80 లక్షలతో అవసరమైన చోట గోదామును నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ హుక్యానాయక్, ఏడీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఎన్‌వైగిరి పాల్గొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి చేయూత రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో అర్హులైన వారందరికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ తరహాలో స్వచ్ఛ సిద్దిపేట ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులను కేటాయించామని, దీనిని విజయవంతం చేసి రాష్ట్రానికే సిద్దిపేట ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లబ్ధిదారుల కోసం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో ప్రారంభిస్తున్న పథకం తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రక్రియగా చేపట్టడం జరుగుతుందన్నారు. రహదారులపై నిఘా పటిష్టం పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.ఆదివారం సిద్దిపేటలో పోలీస్ కమాండ్ కాంట్రోల్ భవనానికి ఆయన శంకుస్థాన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు జాతీయ రహదారులపై నిఘాను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిద్దిపేటలో పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణం కోసం రూ.2.20 కోట్లు మంజూరయ్యాయని, దీంతో జిల్లా కేంద్రం ఏర్పాటుకు నాంది పడనుందన్నారు. అదే విధంగా రూ.40 లక్షలతో సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సుమతి, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి,డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు. -
‘సభ్యత్వ’ ప్రభంజనం
రెట్టింపు దిశగా సాగుతున్న నమోదు లక్ష్యాన్ని ఎప్పుడో దాటేశాం కేసీఆర్ పథకాలకు ఆకర్శితులవుతున్న జనం ‘సాక్షి’తో టీఆర్ఎస్ జిల్లా పరిశీలకుడు సామ్యుల్ సంగారెడ్డి : ఉద్యమగడ్డ అయిన మెతుకుసీమలో టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారు.. అదే స్ఫూర్తితో జిల్లాలో ప్రభంజనంలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సాగుతోంది..రాష్ట్రంలోనే మెదక్ జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం’.. అని చెబుతున్నారు టీఆర్ఎస్ జిల్లా పరిశీలకులు మందుల సామ్యుల్. నేటితో సభ్యత్వ నమోదుకు తెరపడనున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు,పార్టీ తీరుతెన్నులపై గురువారం సామ్యుల్‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? జ : మెదక్ జిల్లా ఉద్యమానికి దిక్సూచి. ఈ జిల్లానే తెలంగాణ ప్రజలకు యుద్ధం నేర్పింది. ఉద్యమనేత, సీఎం కేసీఆర్ సొంత జిల్లా ఇది. టీఆర్ఎస్ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు మా పార్టీకే పట్టం కడుతున్నారు. మంత్రి హరీష్‌రావు సారథ్యంలో జిల్లాలో టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉంది. ప్ర: సీఎం సొంత జిల్లాకు పరిశీలకునిగా రావడాన్ని ఎలా భావిస్తున్నారు? జ : అదృష్టంగా భావిస్తున్నా. నాది నల్గొండ జిల్లా మోత్కూరు మండలం ధర్మారం గ్రామం. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నేను కేసీఆర్ వెన్నంటే ఉన్నా. పదేళ్లుగా ఎస్సీ సెల్ విభాగానికి అధ్యక్షునిగా పనిచేస్తున్నా. కేసీఆర్ నాపై నమ్మకం ఉంచి మెదక్ జిల్లాకు సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించడం గర్వంగా ఉంది. ప్ర: జిల్లాలో పార్టీ నాయకత్వం పనితీరు ఎలా ఉంది? జ: చాలా బాగుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సహా ముఖ్యనేతలంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ప్ర: జిల్లాలో సభ్యత్వ నమోదుకు స్పందన ఎలా ఉంది? జ: అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ కార్యక్రమం ప్రభంజనంలా సాగుతోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి న్యాల్కల్ వంటి మారుమూల మండలంలోని పల్లెల్లో తిరిగి చూశా. ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. పది నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరిస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు సైతం ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. ప్ర: లక్ష్యాన్ని చేరుకుంటారా? జ: లక్ష్యాన్ని ఎప్పుడో దాటాం. రెట్టింపు దిశగా అడుగులు వేస్తున్నాం. జిల్లాలో మూడు లక్షలపైచిలుకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 4,22,230 సభ్యత్వ నమోదు పూర్తయింది. ఇందులో 88 వేల పైచిలుకు మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. శుక్రవారంతో సభ్యత్వ నమోదు పూర్తవుతుంది. సభ్యత్వ నమోదు ఆరు లక్షలు దాటుతుందని భావిస్తున్నాం. ప్ర: ఎందుకు ఇంత స్పందన వస్తుందంటారు? జ: సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ వైపు ఆకర్శితులవుతున్నారు. పింఛన్లు, భూ పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలను ఎవరూ విశ్వసించడంలేదు. కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ప్ర: మంత్రి హరీష్‌రావు ఏమైనా సూచనలు చేశారా? జ: కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ‘హరీష్‌రావు ముఖ్యమైన మంత్రి’. హరీష్‌రావు రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు అద్భుతం. కేసీఆర్ నాయకత్వ లక్షణాలను హరీష్‌రావు అచ్చంగా పుణికి పుచ్చుకున్నారు. సభ్యత్వ నమోదు విజయవంతమయ్యేందుకు ఆయన సలహాలు ఎంతో ఉపకరించాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం సంపూర్ణ సహకారాన్ని అందించారు. ప్ర: సభ్యత్వం తీసుకున్న వారికి ఎలాంటి ప్రయోజనాలున్నాయి? జ: టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించిన వారికి పార్టీలో సముచితమైన గుర్తింపు లభిస్తుంది. పార్టీకి పునాదులైన కార్యకర్తలను టీఆర్ఎస్ గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. సభ్యత్వం స్వీకరించిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా వారిదే. ప్ర: సభ్యత్వం పూర్తయిన తర్వాత ఏం చేస్తారు? జ: సభ్యత్వం నమోదు పూర్తి కాగానే గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత జిల్లా కమిటీని ఎన్నుకుంటాం. ఏప్రిల్ 17 వరకు అన్ని కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తాం. -
కరెంటు కష్టాలకు ఇక చెల్లు
మెదక్ జిల్లాలో లో ఓల్టేజీ సమస్యను నియంత్రించి, నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంగళవారం స్థానిక విద్యుత్ డీఈ కార్యాలయ ప్రాంగణంలో రూ. 1.72 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిద్దిపేట సబ్ స్టేషన్‌ను నాలుగు నెలల్లోనే నిర్మించడం అభినందనీయమన్నారు. జిల్లాకు కేంద్రం రూ. 82 కోట్లను మంజూరు చేసిందని, ఆ నిధుల్లో సిద్దిపేటకు రూ. 6 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటి ద్వారా నూతన లైన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితర విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మార్చి 31 లోగా ఈ నిధులను వినియోగించుకోవాలని, లేకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే రంగధాంపల్లి, పుల్లూరు, చౌడారంలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు మరో మూడు నెలలో పూర్తి కానున్నాయన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో రూ. 25 కోట్లతో 133 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 34 సబ్స్టేషన్ల పనులు ప్రారంభంలో ఉన్నాయని, మరో 30 సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భవిష్యత్‌లో జిల్లాకు విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ సదాశివరెడ్డి, డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఈ ప్రశాంత్, ఏఈలు రమేష్, వెంకటేష్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. సేవాభావంతో వైద్యం చేయాలి సిద్దిపేట పట్టణంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రావడం అభినందనీయమని, అయితే తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చేలా కార్పొరేట్ ఆస్పత్రులు పని చేయాలని మంత్రి హరీష్‌రావు కోరారు. మంగళవారం మంత్రి పట్టణంలో సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, సురక్ష ఆస్పత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేటలో హైదరాబాద్ తరహాలో సురక్ష ఆస్పత్రి ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌కు పరుగులు తీసే బాధ లేకుండా స్థానికంగా కార్పొరేట్ వైద్యంతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయ మరింత వేగమంతం
నిజామాబాద్: ‘మిషన్ కాకతీయ’ పనులు మరింత వేగవంతంగా సాగనున్నాయి. మొదటి దశలో 34 చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రెండు రోజుల కిందట రూ.14.95 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి శనివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు, నూతన ఇసుక పాలసీ, నాబార్డ్ లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రతీ చెరువును ప్రత్యక్షం గా పరిశీలించి, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మొదటి దశలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించినందుకు కలెక్టర్‌ను, అధికారులను అభినందించారు. కాకతీయ మిషన్ కార్యక్రమం అమలులో జిల్లా మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. అధికారుల భాగస్వామ్యం కీలకం మిషన్ కాకతీయ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఈ సంవత్సరం 20 శాతం పనులను చేపట్టాలని, ఇందులో అధికారులు, ప్రజల భాగస్వామ్యం ప్రధానమని చెప్పారు. చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల వివరాలనన్నింటినీ సమగ్రంగా రూపొందించాలని సూచించారు. చెరువుల పూడిక మట్టిని రైతులు తమ పొలాలలో చల్లుకొనే విధంగా కళాజాత ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన అన్ని పాఠశాలలలో ‘మిషన్ కాకతీయ’పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉంటే సత్వరమే రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పనిచేస్తున్న వివిధ ఏజెన్సీలకు అవసరమైన సమాచారంతోపాటు, పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పనులలో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో నడిచే పథకాలను వేగవంతం చేయాలని, తద్వారా ప్రపంచ బ్యాంకు మరికొన్ని అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందని తెలిపారు. చిన్న నీటిపారుదల, భారీ నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని వివరించారు. తక్షణమే ఇసుక రీచ్‌ల గుర్తింపు నూతన ఇసుక విధానంపై మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడికి సైతం ఇసుక ధరలు అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇసుక రీచ్‌లను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇసుక విక్రయాలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేపడతామన్నారు. నూతన ఇసుక విధానంపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. గనులు, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి, ఇసుక విక్రయాలలో పారదర్శకత పాటించాలన్నారు. ఇసుక నిల్వల కోసం స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేస్తే వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 3,250 చెరువులు గుర్తించామని, వాటిలో ఈ సంవత్సరం 20 శాతం పనులను చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా 701 చెరువుల సర్వేను పూర్తి చేశామని, 437 చెరువులకు 318 చెరువుల అంచనా ప్రతిపాదనలను సమర్పించామని వివరించారు. 89 చెరువులకు మంజూరు లభించిందని, అందులో 67 పనులకు టెండర్లు పిలిపించామన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, మన్సూర్ పాల్గొన్నారు. జిల్లా నుంచి నీటిపారుదల ఎస్ఈ షకీ ల్ ఉర్ రహ్మన్, ఈఈ భూపాల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, సత్యశీల్‌రెడ్డి, డివిజన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.