నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ. 18 కోట్లు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
సిద్దిపేట జోన్: నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ. 18 కోట్లు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సిద్దిపేట మండలం తోర్నాల నుంచి నారాయణరావుపేట వరకు రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు, మాచాపూర్ నుంచి నంగునూరు మండలం దర్గాపల్లి, బద్దిపడగ, సిద్దన్నపేట మీదుగా ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ రోడ్డును డబుల్‌లైన్‌గా మార్చడానికి రూ. 8 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామన్నారు.