
‘ఎన్నాళ్లీ నరకం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. వరంగల్ జాతీయ రహదారిపై అసంపూర్తి దశలో నిలిచిపోయిన ఉప్పల్– నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అక్కడికక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది.
Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం?