- కొనసాగుతున్న ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులు
- సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం
కొల్చారం : కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లోని ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ఓ వైపు కొనసాగుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఎత్తు పెంపు పనులు జరగడం లేదని కేవలం మరమ్మతు పనులే చేపడుతున్నామని అసత్య ప్రకటన చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు.
ఆదివారం ఘనపూర్ ఆనకట్టను సందర్శించిన సీపీఎం సభ్యులతోపాటు ఘనపూర్ ఆనకట్ట నిర్వాసితుల ఆధ్వర్యంలో ఎత్తు పెంపు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతు ఓ వైపు అధికారులు ఘన³Nర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనుల్లో తలమునకలై ఉంటే, మంత్రి అదేం లేదనడం రైతులను తప్పుతోవ పట్టించడమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసుతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.