షిర్డీ సాయిబాబా చూపిన మార్గం అనుసరణీయమని, బాబా అంటేనే సేవాభావమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు.