shirdi sai baba
-
ప్రత్యక్ష దైవం సాయిబాబా
షిర్డీ సాయిబాబా జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. సాయిబాబాగా రామలింగా రెడ్డి నటించారు. కొండవీటి సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. విశ్రాంత ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఓం సాయి ప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘సాయిభక్తుల అనుభవాలతో సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించారు మచ్చా రామలింగారెడ్డి’’ అన్నారు చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ‘‘యం.ఆర్. రెడ్డి మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించాలనుకోవడం అభినందనీయం’’ అని ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. చిత్రదర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్, వి. సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా, పాటల రచయిత బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సాయి జన్మభూమి ఏది?
షిర్డీ సాయినాథుని పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మదిప రవశమైపోతుంది. ఏటా లక్షలాది మం ది దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు షిర్డీని సందర్శించుకుంటారు,. జీవితంలో ఒక్కసారైనా షిర్డీ సాయిబాబాను దర్శించుకోవాలని కోరుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. నిజానికి మతాలకతీతంగా సాయిబాబాను పూ జిస్తారు. అయితే తాజాగా సాయిబాబా జన్మస్థలం ఏదనేది చర్చనీయాంశమైం ది. ఊరు పేరునే తన పేరులో ఇముడ్చుకున్న సాయినాథుడి జన్మస్థలం అసలు షిర్డీయా? లేక పర్బనీ జిల్లాలోని పత్రియా? అనే మీమాంస భక్తగణంలో నెలకొంది. భారత ప్రజల ఆధునిక ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో షిర్డీ సాయినాథుని దేవాలయాన్ని మూసివేస్తామని బెదిరింపులకు దిగేస్థాయికి చేరింది. ఇదే ఇప్పుడు భక్తుల్లో కలకలం రేపుతోంది. వివాదానికి కారణం.. నిజానికి మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా లో ఉన్న పత్రిని కూడా ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. అయితే ఈ పట్టణం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పత్రి సాయినాథుడి దేవాలయాన్ని ఇటీవల సందర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ పట్టణాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ ప్రజానీకం దీనిపై అభ్యంతరం తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోన్న షిర్డీ ఆలయ ప్రాధాన్యం తగ్గుతుందేమోననేది వారి ఆందోళనగా భావిస్తున్నారు. ఎవరీ సాయినాథుడు? షిర్డీ సాయిబాబా 1835, సెప్టెంబర్ 28న బ్రిటిష్ ఇండియాలో ని నిజాం రాష్ట్రంలోని పత్రిలో బ్రాహ్మణ దంపతులకు జన్మించారనీ, ఐదేళ్ల బాలుడిగా ఉండగా సాయిబాబాని ఓ ఫకీర్కి పిల్ల లు లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చేసినట్టు సత్యసాయి బాబా (పుట్టపర్తి) చెప్పినట్టు చరిత్రకారులు దాస్‌గణు మహా రాజ్, గోవింద్ దబోల్కర్‌లు తమ పుస్తకంలో ప్రస్తావించారు. మత సహన ప్రతీక.. ఆ రోజుల్లో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది. ఆ సందర్భంలో సాయిబాబా హిందూ దేవాలయాల్లోకి వెళ్లి ముస్లిం మత ప్రార్థనలు చేసేవారట. అలాగే ముస్లిం దేవాలయాల్లో హిందూ దేవతలను స్తు తిస్తూ గీతాలాలపించేవారట. దీంతో ఇరుమతాల వారు బాలుడిపై ఫకీరు భార్యకి ఫిర్యాదు చేసేవారు. ఈ బాలుడిని పెంచడం కష్టంగా భావించిన ఫకీరు భార్య సాయిబాబాని తమ పొరుగింట్లో ఉండే వెంకుశ అనే వ్యక్తికి అప్పగించారు. 1839 నుంచి 1851 వరకు ఈ బాలుడు వెంకుశ ఆశ్రమంలోనే గడిపాడు. సాయిబాబా 16 ఏళ్ల వయస్సులో షిర్డీకి వచ్చినట్టు చెబుతారు. దాడులకు వెరవని ధీశాలి.. తనపై అనేక దాడులు జరిగినా చలించకుండా ఉండడం సాయి సహనానికి ప్రతీకగా భావిస్తారు. చిన్న వయస్సులోనే ఆహారం, నీరు లేకుండా రోజుల తరబడి వేపచెట్టుకింద కూర్చుని ధ్యానం చేస్తోంటే జనం విస్తుపోయేవారని అంటారు. ప్రజలపై ఆయనకున్న ప్రేమ, ఔదార్యం, ఆయన భాష్యాలూ జనాన్ని ఎంతగానో ఆకర్షించేవి. క్రమంగా హిందూ ముస్లింలకు సాయిబాబా ఆరాధ్యులుగా మారారు. కర్మభూమి షిర్డీ.. జన్మభూమి పత్రి మరణానంతరం సాయిబాబాకు షిర్డీలోని బూటి వాడాలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పత్రియే సాయి జన్మస్థలమ నేందుకు ఆధారాలున్నాయని ఎన్సీపీ నాయకులు వాదిస్తున్నా రు. రామ్‌నాథ్ కోవింద్ సైతం ఇదే విషయాన్ని అంగీకరించినట్టు చెప్పుకొస్తున్నారు. పత్రిలోని సాయిబాబా దేవాలయాన్నీ, ఆ పట్టణాన్నీ అభివృద్ధి పరిస్తే, షిర్డీ ప్రాశస్త్యం తగ్గుతుందన్న ఆందోళనే ఈ వివాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. -
సాయిబాబా జన్మస్థలంపై వివాదం
ఔరంగాబాద్: షిర్డీ సాయి జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శివసేన–ఎన్సీపీ– కాంగ్రెస్ ప్రభుత్వం సాయి బాబా జన్మస్థలాన్ని వివాదాల్లోకి లాగుతోందని ఆరోపించింది. షిర్డీ సాయి జన్మ స్థలం విషయమై రాజకీయ జోక్యం ఇలాగే కొనసాగితే షిర్డీ ప్రజలు న్యాయపోరాటానికి దిగుతారని అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ హెచ్చరించారు. ఇక పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ గ్రామస్తులు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తో ట్రస్ట్‌కు సంబంధం లేదని తెలిపింది. భక్తులు ఆందోళనకు గురికావద్దని షిర్డీ ఆలయం, భక్తి నివాస్‌లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పీఆర్వో మోహన్ యాదవ్ చెప్పారు. సాయంత్రం షిర్డీ గ్రామస్తులతో సమావేశమవుతామని తెలిపారు. -
కన్నెత్తయినా చూడలేదు
శిరిడీలో బాబా అరవై ఏళ్లపాటు నడయాడితే, ఆ అరవై ఏళ్లపాటూ బాబా వెన్నంటే నడిచిన పునీతుడు మహల్సాపతి. సాయిప్రేమను సంపూర్ణంగా పొందిన మహల్సాపతి సదాచార సంపన్నుడు. సంస్కృతీ సంప్రదాయాల పట్ల మక్కువ కలిగినవాడు. ఒక రోజు మహల్సాపతి తన ఇంట్లోంచి ప్రసాదం తీసుకుని బాబా ఉండే మసీదుకు బయల్దేరాడు. అతని చేతిలోని ఫలహారం పళ్లెం వైపు చూసిన గజ్జి కుక్క ఒకటి ఆశగా తోక ఊపుకుంటూ మహల్సాపతి వెంటపడింది. మహల్సాపతి రెండు మూడుమార్లు దానిని అదిలించాడు. అయినా అది తన వెనకే రావడంతో విసుగెత్తి కర్ర తీసుకుని ఈడ్చిపెట్టి కొట్టాడు. పాపం ఆ కుక్క దీనంగా రోదిస్తూ వెళ్లిపోయింది. మహల్సాపతి ప్రసాదం తీసుకుని వెళ్లి బాబా ఎదుట పెట్టి భక్తితో రెండు చేతులూ జోడించాడు. బాబా ఆ ప్రసాదం పళ్లెం వైపు కన్నెత్తయినా చూడకుండా ఇలా అన్నారు. ‘‘మహల్సా! పాపం ఆ కుక్క నలుగురిపై ఆధారపడి ఎలాగో బతుకీడుస్తోంది. దానిని కొట్టడానికి మనసెలా వచ్చింది?’’ అంటూ తన వీపుపై తగిలిన దెబ్బను చూపించారు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాననేది బాబా ఉవాచ. బాబాతో అన్నేళ్లు సావాసం చేసి కూడా మహల్సాపతి ఆ నీతిని గ్రహించలేకపోయాడు. తోటి ప్రాణుల పట్ల భూతదయ కలిగి ఉండడం, ఉన్నంతలో సత్కర్మలు ఆచరించడం, చిత్తశుద్ధితో మనసును పరిశుద్ధం చేసుకోవడం... ఇవే భగవంతునికి మనం ఇవ్వగల నివేదనలు. డా. కుమార్ అన్నవరపు -
టెక్సాస్‌లో సాయిబాబా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ
టెక్సాస్ : శ్రీ షిర్డీ సాయిబాబా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం టెక్సాస్‌లోని ప్లానోలో ఘనంగా జరిగింది. షిర్డీ నుంచి వచ్చిన పూజారులు గురువారం ఉదయం 8.25 నిముషాలకు సద్గురు సాయినాథ్ మహరాజ్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆలయ ప్రారంభోత్సవాలను వారం పాటు (19 నుంచి 24 వరకు) జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3000 మంది భక్తులు పాల్గొన్నారు. -
బాబా దయవల్ల...
మచ్చా రామలింగారెడ్డి సాయిబాబాగా నటించి, నిర్మించిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిరిడి సాయి’. కొండవీటి సత్యం దర్శకత్వంలో దత్త ఫిలింస్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా పాటలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘షిర్డీ సాయిబాబా జీవితం ఎందరినో ప్రభావితం చేసింది. సాయిబాబా పాత్రకు రామలింగారెడ్డి కరెక్టుగా సరిపోయారు. బాబా లీలలను సత్యం చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ముందు వేరేవాళ్లు ప్రారంభించి, ఆపేశారు. బాబా దయవల్ల ఇదే సినిమాను కొండవీటి సత్యం దర్శకత్వంలో నిర్మించాను. బాబా గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను చూపించాం’’ అన్నారు మచ్చా రామలింగారెడ్డి. ‘‘బాబా దయతో సినిమాని అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించాను’’ అన్నారు కొండవీటి సత్యం. -
షిర్డీ సాయి మార్గం అనుసరణీయం
-
షిర్డీ సాయి మార్గం అనుసరణీయం
హైదరాబాద్: షిర్డీ సాయిబాబా చూపిన మార్గం అనుసరణీయమని, బాబా అంటేనే సేవాభావమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దానగుణం, అంతరాత్మ శాంతి, సంతృప్తి, సేవాభావాన్ని ఆచరించిన మహనీయుడు బాబా అన్నారు. ఎన్ని పదవులు, ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత లేని జీవితం వ్యర్థమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సాయి భక్తుల్లో ప్రేమ, దయ, క్షమాగుణం కనిపిస్తాయని, అంతా సేవా దృక్పథాన్ని అనుసరించాలన్నారు. సాయిబాబాతో తన అనుబంధం మాటల్లో చెప్పలేనని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. 2012లో షిర్డీ సాయిబాబా చిత్రం తీసే వరకు బాబా గురించి కొంత తెలిసిందని, కానీ తన స్నేహితుడు మహేశ్‌రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు ద్వారా పూర్తిగా తెలుసుకొని అనుభూతికి లోనయ్యానన్నారు. షిర్డీ సాయి సేవా సంస్థాన్ ట్రస్ట్ హైదరాబాద్, షిర్డీసాయి గ్లోబల్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం డాక్టర్ సతీశ్‌రెడ్డి, డాక్టర్ పి. రఘునాథరెడ్డిల పర్యవేక్షణలో జరిగింది. ఇందులో ఏపీ మంత్రి మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, చెంగారెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. పుస్తకాల ఆవిష్కరణ... ఈ సందర్భంగా షిర్డీసాయి గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చంద్రభాను శత్పతి రాసిన ‘సాయి శకం’ను గవర్నర్, ‘షిర్డీ సాయిబాబా అదర్ పర్ఫెక్ట్ మాస్టర్స్’తెలుగు అనువాద పుస్తకాన్ని దత్తాత్రేయ, ‘షిర్డీ సాయిబాబా–భక్తుల ప్రశ్నలు’పుస్తకాన్ని విశ్వేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. కాగా షిర్డీసాయి బాబా అరుదైన చిత్రాలను భక్తులు తిలకించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యేకతగా నిలిచాయి. గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి, విద్యార్థులు వివిధ రకాల నృత్యాలతో అలరించారు. -
మనకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు!
భక్తిలో తొమ్మిది మార్గాలున్నాయని, అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన చేయడం, నమస్కరించడం, దాస్యం, సఖ్యం, ఆత్మార్పణ చేసుకోవడం అని, వాటిలో ఏ ఒక్కమార్గాన్ని చిత్తశుద్ధితో అవలంబించినా భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చని బాబా బోధించాడు. భక్తజనుల పక్షపాతి అయిన శ్రీ షిర్డిసాయి క్తులకు వచ్చిన కష్టాలను తాను స్వీకరించి, వారిని ఆయా బాధలనుంచి విముక్తులను చేసిన ఉదంతాలు సాయి సచ్చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రేమించటం తప్ప ద్వేషించటం ఎరుగని సాయి తన భక్తులు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు మందలిస్తారు. మొక్కులు మొక్కి, అది తీరగానే అది చేస్తాం యిది చేస్తాం అని ఆ తర్వాత ముఖం చాటేసేవారిని సాయినాథుడు వదలడు. వారినుంచి తనకు రావలసిన బాకీని బహు చక్కగా వసూలు చేసుకుంటాడు. సమాధి నుంచే తాను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిన సాయి భగవానుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒక్కనాటికి కూడా మరచిపోలేదు. ప్రశాంతచిత్తంతో మొరపెట్టుకుంటే చాలు ఆయన భక్తుల మొర ఆలకిస్తాడు. అడిగినది ఇస్తాడు. అయితే ఆయన చెప్పేది ఒకటే, జలతారు వస్త్రం ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో తనకు తెలుసునని, అల్పమైన కోరికలు కోరకుండా, ఆత్మజ్ఞానం కలగాలని కోరుకున్న వారికి తాను అన్నీ ఒసగుతానంటాడు. సాయిబాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. -
అహంతోనే అన్ని అనర్థాలూ!
షిరిడీసాయి తత్వంలో అహానికి చోటు లేదు. అహం పట్ల బాబాకు ఎనలేని కోపం ఉండేది. బాబా అన్ని వేళలా అందరికీ అహాన్ని వీడమని బోధించారు. భక్తుల్లో తనను ఆశ్రయించి వచ్చిన వారిలో మొదటగా అహాన్ని తొలగించేవారు. అహం అనేది మనిషికి గుడ్డితనం లాంటిదన్నది బాబా భావన. అహంకారపు చీకట్లు తొలగనిదే ఏ మనిషినీ తన దరికి చేర్చుకునేవారు కాదు. తన ప్రేమతత్వంలో మానసికానందాన్ని, తన జీవిత చరిత్ర రాయటానికి అనుమతి కోసం వచ్చిన హేమాదిపంతుకు బాబా మొదటగా ఈ సందేశాన్నే అందించారు. మతాలపేరిట మనుషుల నడుమ అంతరాలను ఆయన తన మతంలో చేర్చలేదు. సమస్తప్రాణులు ఒకటేనని, ప్రేమ, దయ, కరుణలతో మానవ జీవిక సాగాలని, భగవంతునియందు అపారనమ్మకంతో మంచికర్మలు చేయడమే పరమావధిగా జీవించాలని, దానగుణం కలిగి ఉండటం, పనిపట్ల శ్రద్ధ వహించటం, బాధ్యతలను ఏమారకపోవటం ప్రతిమనిషి పరమ కర్తవ్యాలని గీతాసారంలా... బాబా తనదైన సాయిగీతలా భక్తులకు చెప్పేవారు. తనను విశ్వసించిన వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయమిచ్చేవారు. తన భక్తిసామ్రాజ్యంలో అందరూ సుఖసంతోషాలతో దేనికీ కొరత లేకుండా జీవిస్తారని భరోసా ఇచ్చే బాబా, యోగులలో పరమయోగి. నమ్మిన వారి ఏలిక. జీవితమంటేనే ప్రేమమయమని చాటిన సత్యస్వరూపుడు. బాబాను పూజించడంతో సంతృప్తి పడటం, ఉపవాసాలు ఉండి ఊరడిల్లడం, షిరిడీ వెళ్లి సంతోషపడటమే కాదు... ఆయన బోధలను ఆచరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సద్గురువు అనుగ్రహం లభిస్తుంది. -
‘భూత’భక్తులు
జీవన కాలమ్ మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండువేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సాయిబాబాని పూజించడం భూతాన్ని పూజించడం అన్నారు. నాకు ఓ సంఘటన ప్రముఖంగా జ్ఞాపకం వస్తుంది. 1991లో మా ఇద్దరి అబ్బాయిల పెళ్లిళ్లు 8 రోజుల తేడాలో జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఘట్టాలు. మాజీ ముఖ్యమంత్రులూ, ప్రధాని కొడుకులూ, సినీ ప్రముఖులూ, పద్మభూష ణ్లూ, రామోజీరావుగారూ, శోభన్‌బాబు, నాగేష్, బెజ వాడ గోపాలరెడ్డి, జగ్గయ్య, జానకి, కేఎస్ ప్రకాశరావు, అల్లు రామలింగయ్య– ఇత్యాది ఎందరో పెద్దలు హాజర యిన ఖరీదైన పండుగలు. విచిత్రంగా ఆ దశలో నా చేతిలో రొక్కం లేదు. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అప్పు చేయడం ఎప్పుడూ అలవాటు లేనివాడిని. ఏం చెయ్యాలి? అనే బెంగ మనసులో నిలదొక్కుకుని ఉంది. మద్రాసులో మా ఇంటి ముందు లాన్లో కూర్చుని ఉన్నాను. ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో మొబైళ్లు లేవు. ఎవరో పేరు తెలీని వ్యక్తి. ‘‘మీ ఇంటి వాస్తుని చూస్తాను మారుతీరావుగారూ– మీకభ్యంతరం లేకపోతే’’ అన్నారు. పోయేదేముంది? సరేనన్నాను. వచ్చాడు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. ముఖం ఇప్పటికీ గుర్తు లేదు. ఇల్లంతా కలయ దిరిగాడు. నేను లాన్లో కూర్చునే ఉన్నాను. నా దగ్గరికి వచ్చాడు. ‘‘ఇల్లు బాగుంది. చిన్న ఇబ్బందుల్లో ఉన్నారు. పరవాలేదు. బయటపడతారు’’ అంటూ సాయిబాబా బొమ్మని నా చేతిలో పెట్టి వెళ్లాడు. నేను సాయిబాబా భక్తుడిని కాను. పైగా ఆయన అభిప్రాయం నేను కోరలేదు. వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని దాదాపు అప్పుడే మరచిపోయాను. నాకు బోగ్రోడ్డులో ఒక ఫ్లాట్ ఉంది. రెండుమూడు రోజుల తర్వాత ప్రముఖ దర్శకులు రాంగోపాలవర్మ కంపెనీ మేనేజరు మా అబ్బాయిని కలిశారు. ఆ ఫ్లాట్‌ని ఆఫీసుకి అద్దెకి తీసుకున్నారు. అడ్వాన్సుగా 40 వేలు ఇచ్చారు (ఇది పాతికేళ్ల కిందటి మాట). దరిమిలాను రెండు పెళ్లిళ్లు జరిగి– ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసే రోజు దాకా ఆ డబ్బు సరిపోయింది. ఇది చేతిలో రొక్కం మాట. వ్రతం నాడు ఎందరో కొత్త బంధు వులూ, హితులూ ఉన్నారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. అంతా ఆనందంగా ఉన్నారు. నేను ఏదో సంద ర్భంలో గేటు దాకా వచ్చాను. ఒకాయన– ముందు వచ్చి నాయన కాదు– చెయ్యి జాచాడు. ఈ సమయంలో ఈ మనిషి ఏమిటి? అనుకుంటూ జేబులో చెయ్యి పెట్టాను. ఒక్క రూపాయి ఉంది. తీసి ఆయనకిచ్చి లోపలికి నడిచాను–అసంకల్పితంగా. మరోగంట గడిచాక మళ్లీ గేటు దాకా వస్తే ఇంకా అతను అక్కడే ఉన్నాడు. మళ్లీ చెయ్యి జాచాడు. ఈసారి కాస్త విసుగూ, కోపం వచ్చాయి. ఒకసారి ఇస్తే మళ్లీ అడుగుతాడేమిటి? అయినా ఇది శుభ తరుణం. జేబులో చెయ్యి పెట్టాను. మరో రూపాయి చేతికి తగిలింది. తీసి ఇచ్చాను. పెళ్లికి ముందు నా చేతికి వచ్చిన 40 వేల రొక్కంలో ఆఖరి చిల్లర అది–రెండు రూపాయలు. తర్వాత ఎవరో చెప్పారు–బాబాగారికి రెండు రూపాయల దానం అత్యంత ప్రీతికరమైనదట. చేతికందిన రొక్కం అక్క డితో సంపన్నమయింది. రొక్కమూ అయిపోయింది. ‘‘నేను మీ కంటే ముందు మీ ఇంట్లో ఉంటాను’’ అన్నారట బాబా. అంతకు ముందు మా ఇంట్లో బాబా ఫొటో లేదు. తర్వాత లేకుండా లేదు. చాలా ఏళ్ల కిందట విశాఖపట్నంలో ఓ సాయం కాలం నార్త్ షిర్డీ గుడికి వెళ్లాను. విపరీతంగా ఆకలి వేస్తోంది. దర్శనం అయాక ప్రసాదం చేతిలో పెట్టారు. చాలా రుచిగా ఉంది. ఇంకా తినాలనిపించే ఆకలి. మెట్ల పక్కన అరుగు మీద కూర్చున్నాను. అర్చకుడు పెద్ద ఆకులో ప్రసాదం తెచ్చి నా ముందు నిలబడ్డాడు. చేయి జాచి నా చేతిలో పెట్టాడు. తర్వాత కొన్ని వందలసార్లు ఆ గుడికి వెళ్లాను. ఎప్పుడూ అంత ఆకలి అనిపించలేదు. ఎప్పుడూ అలా ప్రసాదాన్ని కోరుకోలేదు. ఎవరూ అలా ప్రసాదాన్ని ఇవ్వలేదు.SSympathetic Vibration దేవుడా ? మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండు వేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. కొన్ని శతాబ్దాల ‘విశ్వాసం’లో ఎన్నో చేరాయి– రాళ్లూ, రప్పలూ, ఆలోచనలూ, నమ్మ కాలూ. హేతువాదులకి ఇది వెర్రి. కాని బయట కని పించే దృశ్యం కాక, అతని మనసులోని ‘ఆలోచన’ది ఆ శక్తి. ఒక మనస్తత్వ పరిశీలకుడు అన్నాడు కదా, వెంకటే శ్వరస్వామి – గుడిలో ఉన్న శిలలో లేకపోయినా కొన్ని కోట్ల మంది, కొన్ని వందల తరాలుగా తమ కోరికల కోసం, ఆర్తితో అనునిత్యం కేంద్రీకృతం చేసే ఆ ‘బిందువు’ మీద వారి దృష్టి, వారి అపారమైన anticipation, magnetic power కారణంగా ఆ శిల దేవుడ వుతుందని. విశ్వాసానికి మరో రకమైన వివరణ ఇది. దేవుడు వ్యక్తి యొక్క కొంగు బంగారం. విశ్వా సానికి మతం లేదు. రాయికి పేరుంది కాని, మనసు లోని ఆలోచనకి పేరు లేదు. నేను సాయిబాబా భక్తుడిని. (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు) -
నాంపల్లిలో స్వరూపానంద.. భారీ భద్రత!
హైదరాబాద్: షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వరూపానంద సరస్వతి ఆదివారం సాయంత్రం నగరానికి రావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ద్వారకా శారద పీఠం అధిపతి అయిన స్వరూపానంద సరస్వతి నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని లలిత కళాతోరణంలో గురువందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబాపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని స్వరూపానంద సరస్వతి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యలను సాయిబాబా భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
షిర్డీసాయి దేవుడు కాదా...?
-
బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు
స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు. శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. -
షిర్డీ హుండీలో రూ. 92 లక్షల వజ్రాలు!
ఆలయాల్లో దేవుడికి నగలు, నగదు భారీ మొత్తంలో సమర్పించుకునే భక్తులను చూశాం. కానీ, షిర్డీలోని సాయిబాబా ఆలయ హుండీలో భారీ మొత్తంలో బంగారం, వెండితో పాటు అత్యంత విలువైన వజ్రాలు కూడా కనిపించాయి. ఎవరో అజ్ఞాత భక్తులు రెండు వజ్రాల నెక్లెస్‌లను హుండీలో వేశారు. వాటి విలువ దాదాపు రూ. 92 లక్షలు ఉంటుందని నగల వ్యాపారులు చెప్పారు. షిర్డీ ఆలయ చరిత్రలోనే హుండీలో ఇంత పెద్దమొత్తంలో విరాళాలు రావడం ఇదే మొదటిసారి. సాధారణంగా పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చేవారు నేరుగా ట్రస్టీలకు అందజేస్తారు. హుండీలలో ఎప్పుడూ వివిధ దేశాలకు చెందిన నాణేలు, నగదు, బంగారు, వెండి ఆభరణాల లాంటివి కనిపిస్తూ ఉంటాయి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు భక్తులు 223 వజ్రాలను, ముత్యాలను, పగడాలను సాయిబాబాకు సమర్పించారని, వాటన్నింటి విలువ కలిపి రూ. 1.06 కోట్లు ఉంటుందని, కానీ ఈ రెండు వజ్రాల నెక్లెస్‌ల విలువ మాత్రం రూ. 92 లక్షలు ఉందని ఆలయ అకౌంట్ విభాగం అధిపతి దిలీప్ జిర్పే చెప్పారు. ఏప్రిల్ 21న హుండీలు తెరిచినప్పుడు ఈ నెక్లెస్‌లు బయటపడ్డాయి. వీటిలో ఒకటి 6.67 క్యారెట్లు, మరోటి 2.5 క్యారెట్లు ఉంటుందని, ఇందులోని వజ్రాలు చాలా విలువైనవని ముంబైకి చెందిన వజ్రాల నిపుణుడు నరేష్ మెహతా చెప్పారు. -
ఘనంగా గురుపౌర్ణమి
రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోలారు జిల్లా మాలూరులోని శిరిడి సాయిబాబా ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అఖండ భజన, పూల పల్లకి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని సాయిబాబా మూలవిరాట్‌ను విశేషంగా అలంకరించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను ఆలయ సమితి అధ్యక్షుడు ఆర్.సి.అప్పాజీగౌడ, విజయ్‌కుమార్, వి.గోవిందరాజశెట్టి, ఎం.ఎన్.లోకేష్, సోమశేఖర్ పర్యవేక్షించారు. - మాలూరు -
దేవుడిని నవ్వించేవాళ్లు!
దైవికం మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా? ఇఫ్ యు వాంట్ మేక్ గాడ్ లాఫ్, టెల్ హిమ్ అబౌట్ యువర్ ప్లాన్స్ - అంటాడు ఊడీ ఆలెన్. దేవుణ్ణి నవ్వించాలనుకుంటే, మన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయనకు చెబితే సరిపోతుందట. ఊడీ అమెరికన్ దర్శకుడు. నాలుగు ఆస్కార్ల విజేత. ఇదొక్కటే ఊడీ ప్రతిభ కాదు. మంచి రచయిత, న టుడు, జాస్ సంగీతకారుడు, కమెడియన్, నాటక కర్త, గొప్ప సెటైరిస్టు. మనిషికి 78 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నారు. ఇంతా చేసి ఆయన అఫీయిస్ట్ (నాస్తికుడు). దేవుడి మీద కూడా సెటైర్లు వేస్తుంటాడు. కానీ అవి దేవుడికి కోపం తెప్పించేవి కాదు. దేవుణ్ని, మనిషినీ ఇద్దర్నీ నవ్వించేవి. మన దగ్గర కూడా కొందరు అప్పుడప్పుడు తమకు తెలియకుండానే దేవుణ్ణి నవ్విస్తుంటారు... ‘మా దేవుడు గ్రేట్’ అంటే, ‘మా దేవుడు గ్రేట్’ అని. ఈ మధ్య అలా దేవుణ్ణి నవ్వించిన పెద్ద మనిషి ద్వారకపీఠం శంకరాచార్యులు స్వామీ స్వరూపానంద. షిర్డీ సాయిబాబా ముస్లిం అని, ఆయన్ని హిందువులు ఆరాధించకూడదని; బాబా ఏనాడూ పవిత్ర గంగా నదిలో స్నానమాచరించలేదు కనుక ఆయన్ని ఆరాధించేవారికి గంగలో మునిగే యోగ్యత ఉండదని ఇటీవలి ప్రసంగంలో స్వరూపానంద సెలవిచ్చారు. ఈ మాటలన్నీ ఆయన కేంద్ర మంత్రి ఉమాభారతిని ఉద్దేశించి అన్నవి. ‘సాధ్వి’ ఉమాభారతి కూడా సాయిబాబాను ఆరాధించడమేమిటన్నది ఆయన ప్రశ్న. లేదా ప్రశ్నార్థకంతో కూడిన ఆశ్చర్యం. ఇదే మాటను ఆయన గతంలో ఉమాభారతిని దృష్టిలో పెట్టుకుని అన్నప్పుడు ‘‘ఆరాధన అన్నది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది’’ అని ఒక్క మాటతో ఆమె సరిపుచ్చారు. ఇప్పుడు కూడా స్వరూపానంద వ్యాఖ్యలపై ఆమె ఏమీ మాట్లాడలేదు. అలా మాట్లాడక పోవడం కూడా ఆయనకు కోపం తెప్పించినట్లుంది. ‘‘ఉమాభారతి రంగులు మార్చి సాయిబాబాను కొలుస్తున్నారు. బాబా ముస్లిం. ఆ సంగతి తెలిసీ ఆయన్ని కొలుస్తున్నారంటే, ఇక ఆమెపై ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎలా కురుస్తాయి’’ అని అన్నారు. ఈ మాటలు ఆ భగవానుడికి నవ్వు తెప్పించకుండా ఎలా ఉంటాయి?! మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా? ఒకరిని వరం కోరుకుంటే, మనకెందుకులే అని ఇంకొకరు పట్టనట్లు ఉండిపోతారా? బాబా అంటే శ్రీరామచంద్రుడు పలక్కండా పోతాడా? రామా అంటే జీసెస్ రాకుండా ఉంటాడా? అల్లా అంటే ఆ పరమాత్ముడికి వినిపించకుండా ఉంటుందా?! మనుషుల్లోనే దేవుడు ఉంటాడంటారు కదా రమణ మహర్షి, అలాంటప్పుడు సృష్టికర్త ఎక్కడ ఉంటేనేం? ఏ పేరుతో ఉంటేనేం? ఏ రూపంలో ఉంటేనేం? అసలు ఏ రూపంలోనూ లేకపోతేనేం? దేవుడి గురించి పొసెసివ్‌గా (‘అమ్మా...నా దేవుడు’ అన్నట్లు) గొడవ పడడం అన్నది ‘మా ఇంట్లో దేవుడి పటానికి నువ్వెందుకు దండం పెడుతున్నావ్?’ అని అడగడం లాంటిది. లేదా ‘మా వీధిలో గుడికి నువ్వెందుకొచ్చావ్’ అని తగాదా పడడం లాంటిది. స్వామీ స్వరూపానందకు ఇవన్నీ తెలీదనుకోవాలా? లేక సచిన్‌ని దేవుడిలా భావించే ఒక సాధారణ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఆయన చేత ఈ మాటలన్నీ అనిపించిందా? రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నప్పుడు సచిన్ అభిమానులు తీవ్రంగా కలత చెందారు! ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ గురించి తెలీదా అని విస్తుపోయారు. కొందరైతే ‘‘పోనీయండి పాపం, దేవుడి గురించి తెలీదంటే ఆమె నాస్తికురాలు అయ్యుండాలి’’ అని పెద్దమనసు చేసుకున్నారు. కనీసం అలాగైనా పెద్దమనసు చేసుకోలేకపోయారా స్వరూపానంద!! - మాధవ్ శింగరాజు -
నేత్రపర్వంగా గురుపౌర్ణమి వేడుకలు
అనంతపురం కల్చరల్: జిల్లా వ్యాప్తంగా శనివారం గురుపౌర్ణమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. నగరంలోని వేమన టెలిఫోన్ భవన్ ఎదురుగా ఉన్న షిర్డీ సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం చేశారు. హెచ్చెల్సీ కాలనీలోని షిర్డీ సాయిబాబా మందిరం, వలీబాబా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. వేణుగోపాల్ నగర్‌లోని షిర్డీ సాయిబాబా మందిరంలో మేయర్ స్వరూప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే హౌసింగ్ బోర్డులోని సాయినాథుని మందిరం, ఆంధ్రాబ్యాంకు కాలనీ, మూడో రోడ్డులోని సాయి మందిరం, రామచంద్రనగర్‌లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మారుతీనగర్‌లోని బాబా మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం సాయిలీల బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ దేవరకొండ శాంతమూర్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాయలసీమ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాయత్రి హాస్పిటల్లో జరిగిన వేడుకల్లో సీఐ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. పాతూరు చెరువుకట్టపై గల సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా సంఘమేష్ నగర్, రామనగర్, అరవిందనగర్‌లోని సత్యసాయి కల్యాణమండపం, లక్ష్మీనగర్ సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు విశేష పూజల్లో పాల్గొన్నారు. -
షిర్డీసాయి సన్నిధిలో ఘనంగా గురుపౌర్ణమి
సాక్షి ముంబై: షిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా శనివారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం తో షిర్డీ పురవిధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మందిరాన్ని కూడా రకరకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపౌర్ణిమను పురస్కరించుకుని సోమవారం ‘శ్రీసాయి సచ్ఛరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండ పారాయణం ముగిసింది. ఈ సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశికాంత్ కులకర్ణి ‘పోతి’ (ధాన్యం సంచి), మందిరం ఈఓ కుందన్ కుమార్ సోనవణే, డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే సాయిచిత్రపటాన్ని చేతపట్టుకున్నారు. ఈ ఊరేగిం పులో సంస్థాన్ అధికారులు, వారి సతీమణులు, భక్తులు, స్థానికులు భారీ సంఖ్యల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై రోజంతా వివిధ భక్త మండలులు భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నాయి. ఉచిత ప్రసాదాలు.. తెలుగు భక్తులతోపాటు ఇతర ప్రాంతాల భక్తులు అందజేసిన విరాళాలలతో షిర్డీ వచ్చే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలు, భోజనాలు పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కరణం నారాయణ, పోత్రాపులా పార్థసారథి, సులోచనా కార్తీక్ సంజయ్, చీరాలకు చెందిన వెంకటరమణా రెడ్డితోపాటు ముంబై, జబల్పూర్ భక్తులు అందించిన సహాయంతో ప్రసాదాలు, భోజనాలు పెట్టారు. గురుపౌర్ణమి ఉత్సవాల మొదటి రోజు శుక్రవారం 70 వేల మంది భక్తులకు ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు. ‘సాయి సన్నిధ్యాత్’ పుస్తకం అవిష్కరణ... ముంబైకి చెందిన సాయిభక్తురాలు ముగ్ధా దివాడ్కర్ రచించిన ‘సాయి సన్నిధ్యాత్’ అనే గ్రంథాన్ని గురుపౌర్ణమిని పురస్కరించుకుని అవిష్కరిచారు. ఈ పుస్తకాన్ని సంస్థాన్ ఈఓ కుందన్‌కుమార్ సోనవణే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే, పిఆర్ ఓ మోహన్ జాధవ్, రచయిత ముగ్ధ, ప్రచురణకర్త కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. నేడు రుద్రాభిషేకం... గురుపౌర్ణమి ఉత్సవాల చివరి రోజు గురుస్థాన్ ఆల యంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉట్టిత్సవాలు, ప్రత్యేక కీర్తనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. గ్రాంట్‌రోడ్డులో.. గ్రాంట్ రోడ్డులోని జగనాథ్ శంకర్‌సేఠ్ సెకండరీ మున్సిపల్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో ‘గురుపూర్ణిమ’ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గురుశిష్యుల మధ్య సఖ్యత ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యార్థులు గేయాలు ఆలపించారు. తరువాత ప్రతి ఉపాధ్యాయుడికీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాపెల్లి సుదర్శన్ మాట్లాడుతూ గురుపూర్ణిమ చారిత్రక ప్రాధాన్యం, విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.రాజు, గాల్డె సదానంద్, తాటికొండ సంగీత, వసం షేక్, అర్చన, శిల్ప, రింకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
షిర్డి సాయిబాబాను దర్శించుకున్న శృతి హసన్
తెలుగు, తమిళ తార, కమల్ హసన్ కూతురు శృతి హసన్ ఆదివానం షిర్డిలోని సాయిబాబాను దర్శించుకున్నారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ ద్వారా లో షిర్డీ పర్యటన వివరాలను శృతి హసన్ తెలిపారు. భగవాన్ సాయిబాబాను దర్శించుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు. తొలిసారి షిర్డిని సందర్శించి సాయిబాబాను దర్శించుకోవడం గొప్ప అనుభూతి కలిగించింది అని అన్నారు. షిర్డి నుంచి ముంబై చేరుకుని చత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెంబూరు మురుగన్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకున్నానని తెలిపారు. ముంబైలో తక్కలి తోగయల్ పచ్చడి (తమిళ వంటకం)తో దోశ తిన్నాను.. ఆదివారం బ్రహ్మండంగా గడిచిందని శృతి హసన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. -
వృథాగా ఉన్న పసిడి కొనం: ఆర్బీఐ
ముంబై: ఆలయాల్లోనూ, ప్రజానీకం దగ్గర నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని కొనుగోలు చేసి, బులియన్ కింద మార్చే యోచనేదీ లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును (క్యాడ్) కట్టడి చేసేందుకు ఆర్బీఐ.. ఆలయాలు సహా ఇతరత్రా వర్గాల దగ్గరున్న పసిడిని కొనుగోలు చేసి బులియన్ కింద మార్చాలని భావిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, వెళ్లే నిధుల మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. -
షిర్డీ చేరిన పల్లకి యాత్ర
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని పద్మనగర్ నుంచి ఈ నెల 11న బయలుదేరిన సాయిబాబా పల్లకి శనివారం షిర్డీ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. ‘శ్రీ శ్రద్ధ సబూరి మిత్రమండలి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో దాదాపు 550 మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. ఇందులో స్థానికులతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సుమారు 50 మంది పాల్గొనడం విశేషం. వారం రోజులు సాగిన పాదయాత్ర ముగింపున సాయి భక్తులు నృత్యాలు చేస్తూ, సాయి నినాదాలు చేయడంతో బాబా సన్నిధి మారుమోగింది. సాయంత్రం 4.30 గంటలకు నిగోద్ నుంచి సాయిమందిరం వరకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రాత్రి తొమ్మిది గంటలకు బాబా దర్శనం చేసుకున్నారు. యాత్ర ముగింపు సందర్భంగా పట్టణం నుంచి పలువురు కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు తదితరులతో పాటు సుమారు రెండు వేల మంది భక్తులు షిర్డీకి రావడం విశేషం. శ్రావణ మాసం పురస్కరించుకొని గత ఆరేళ్లుగా ఈ పాద యాత్ర నిర్వహిస్తున్నామని మండలి అధ్యక్షుడు పోతు గంగాధర్ తెలిపారు.