షిర్డి సాయిబాబాను దర్శించుకున్న శృతి హసన్
తెలుగు, తమిళ తార, కమల్ హసన్ కూతురు శృతి హసన్ ఆదివానం షిర్డిలోని సాయిబాబాను దర్శించుకున్నారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ ద్వారా లో షిర్డీ పర్యటన వివరాలను శృతి హసన్ తెలిపారు. భగవాన్ సాయిబాబాను దర్శించుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు. తొలిసారి షిర్డిని సందర్శించి సాయిబాబాను దర్శించుకోవడం గొప్ప అనుభూతి కలిగించింది అని అన్నారు.
షిర్డి నుంచి ముంబై చేరుకుని చత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెంబూరు మురుగన్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకున్నానని తెలిపారు. ముంబైలో తక్కలి తోగయల్ పచ్చడి (తమిళ వంటకం)తో దోశ తిన్నాను.. ఆదివారం బ్రహ్మండంగా గడిచిందని శృతి హసన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.