'హ్యాపీ బర్త్ డే అప్పా' | 'Happy Birthday to the best Appa' tweets Shruti haasan | Sakshi
Sakshi News home page

'హ్యాపీ బర్త్ డే అప్పా'

Published Sat, Nov 7 2015 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

'హ్యాపీ బర్త్ డే అప్పా'

'హ్యాపీ బర్త్ డే అప్పా'

లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయన తనయ శృతిహాసన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే టు ది  బెస్ట్ అప్పా' అంటూ ట్వీట్ చేసి తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. అలాగే కమల్తో కలిసి సరదాగా దిగిన ఓ  ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.

61వ ఏట అడుగుపెట్టిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలికి తెలుగు, తమిళ రంగాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ల వయస్సులో బాలనటుడిగా మొదటిసారి స్క్రీన్ మీద కనిపించిన కమల్ హాసన్ క్రమంగా భారతదేశం గర్వించదగిన నటుడిగా ఎదిగారు.  కమల్ నటించిన 'చీకటి రాజ్యం' దీపావళి కానుకగా నవంబరు 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement