చెన్నై: కులానికి వ్యతిరేకంగా ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో దుమారం రేగుతోంది. కులంపై తన కూతురు శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. సంస్కరణలను ముందుగా కమల్ ఆయన ఇంటి నుంచి ప్రారంభించాలని సూచించారు. తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ అడ్మిషన్ దరఖాస్తులో కులం, మతానికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగా వదిలేశానని కమల్ ఇటీవల ట్వీట్‌చేశారు. వచ్చే తరానికి కులం, మతం గురించి తెలియకుండా చేయాలంటే ఇదే సరైన మార్గమన్నారు. అయితే, కమల్ ట్వీట్‌పై ట్విట్టర్‌లో విమర్శల దాడి మొదలైంది. కొన్నేళ్లక్రితం శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. తాను ‘అయ్యంగర్’ (బ్రాహ్మణ) అని పేర్కొన్న వీడియోను ఓ ట్విటర్ ఖాతాదారుడు పోస్ట్ చేశాడు. ‘పిల్లలకు వారి కులం తెలియకుండా పెంచాలి’ అని వ్యాఖ్యానించాడు. ‘జంధ్యం తీసి, కుల ధ్రువీకరణ పత్రాన్ని చించినంత మాత్రాన కులం పోదు’ అని ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment