షిర్డీ సాయినాథుని పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మదిప రవశమైపోతుంది. ఏటా లక్షలాది మం ది దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు షిర్డీని సందర్శించుకుంటారు,. జీవితంలో ఒక్కసారైనా షిర్డీ సాయిబాబాను దర్శించుకోవాలని కోరుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. నిజానికి మతాలకతీతంగా సాయిబాబాను పూ జిస్తారు. అయితే తాజాగా సాయిబాబా జన్మస్థలం ఏదనేది చర్చనీయాంశమైం ది. ఊరు పేరునే తన పేరులో ఇముడ్చుకున్న సాయినాథుడి జన్మస్థలం అసలు షిర్డీయా? లేక పర్బనీ జిల్లాలోని పత్రియా? అనే మీమాంస భక్తగణంలో నెలకొంది. భారత ప్రజల ఆధునిక ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో షిర్డీ సాయినాథుని దేవాలయాన్ని మూసివేస్తామని బెదిరింపులకు దిగేస్థాయికి చేరింది. ఇదే ఇప్పుడు భక్తుల్లో కలకలం రేపుతోంది.
వివాదానికి కారణం..
నిజానికి మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా లో ఉన్న పత్రిని కూడా ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. అయితే ఈ పట్టణం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పత్రి సాయినాథుడి దేవాలయాన్ని ఇటీవల సందర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ పట్టణాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ ప్రజానీకం దీనిపై అభ్యంతరం తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోన్న షిర్డీ ఆలయ ప్రాధాన్యం తగ్గుతుందేమోననేది వారి ఆందోళనగా భావిస్తున్నారు.
ఎవరీ సాయినాథుడు?
షిర్డీ సాయిబాబా 1835, సెప్టెంబర్ 28న బ్రిటిష్ ఇండియాలో ని నిజాం రాష్ట్రంలోని పత్రిలో బ్రాహ్మణ దంపతులకు జన్మించారనీ, ఐదేళ్ల బాలుడిగా ఉండగా సాయిబాబాని ఓ ఫకీర్‌కి పిల్ల లు లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చేసినట్టు సత్యసాయి బాబా (పుట్టపర్తి) చెప్పినట్టు చరిత్రకారులు దాస్‌గణు మహా రాజ్, గోవింద్ దబోల్కర్‌లు తమ పుస్తకంలో ప్రస్తావించారు.
మత సహన ప్రతీక..
ఆ రోజుల్లో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది. ఆ సందర్భంలో సాయిబాబా హిందూ దేవాలయాల్లోకి వెళ్లి ముస్లిం మత ప్రార్థనలు చేసేవారట. అలాగే ముస్లిం దేవాలయాల్లో హిందూ దేవతలను స్తు తిస్తూ గీతాలాలపించేవారట. దీంతో ఇరుమతాల వారు బాలుడిపై ఫకీరు భార్యకి ఫిర్యాదు చేసేవారు. ఈ బాలుడిని పెంచడం కష్టంగా భావించిన ఫకీరు భార్య సాయిబాబాని తమ పొరుగింట్లో ఉండే వెంకుశ అనే వ్యక్తికి అప్పగించారు. 1839 నుంచి 1851 వరకు ఈ బాలుడు వెంకుశ ఆశ్రమంలోనే గడిపాడు. సాయిబాబా 16 ఏళ్ల వయస్సులో షిర్డీకి వచ్చినట్టు చెబుతారు.
దాడులకు వెరవని ధీశాలి..
తనపై అనేక దాడులు జరిగినా చలించకుండా ఉండడం సాయి సహనానికి ప్రతీకగా భావిస్తారు. చిన్న వయస్సులోనే ఆహారం, నీరు లేకుండా రోజుల తరబడి వేపచెట్టుకింద కూర్చుని ధ్యానం చేస్తోంటే జనం విస్తుపోయేవారని అంటారు. ప్రజలపై ఆయనకున్న ప్రేమ, ఔదార్యం, ఆయన భాష్యాలూ జనాన్ని ఎంతగానో ఆకర్షించేవి. క్రమంగా హిందూ ముస్లింలకు సాయిబాబా ఆరాధ్యులుగా మారారు.
కర్మభూమి షిర్డీ.. జన్మభూమి పత్రి
మరణానంతరం సాయిబాబాకు షిర్డీలోని బూటి వాడాలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పత్రియే సాయి జన్మస్థలమ నేందుకు ఆధారాలున్నాయని ఎన్సీపీ నాయకులు వాదిస్తున్నా రు. రామ్‌నాథ్ కోవింద్ సైతం ఇదే విషయాన్ని అంగీకరించినట్టు చెప్పుకొస్తున్నారు. పత్రిలోని సాయిబాబా దేవాలయాన్నీ, ఆ పట్టణాన్నీ అభివృద్ధి పరిస్తే, షిర్డీ ప్రాశస్త్యం తగ్గుతుందన్న ఆందోళనే ఈ వివాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
సాయి జన్మభూమి ఏది?
Published Sun, Jan 19 2020 2:50 AM | Last Updated on Sun, Jan 19 2020 2:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment