
రామలింగా రెడ్డి, సీత
షిర్డీ సాయిబాబా జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. సాయిబాబాగా రామలింగా రెడ్డి నటించారు. కొండవీటి సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. విశ్రాంత ఇన్‌కమ్ టాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఓం సాయి ప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘సాయిభక్తుల అనుభవాలతో సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు.
‘‘యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించారు మచ్చా రామలింగారెడ్డి’’ అన్నారు చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ‘‘యం.ఆర్. రెడ్డి మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించాలనుకోవడం అభినందనీయం’’ అని ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. చిత్రదర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్, వి. సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా, పాటల రచయిత బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment