ramalinga Reddy
-
ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మా సమస్యను పరిష్కరిస్తారు...
-
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఇది కూడా చదవండి: సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు.. సీఎం జగన్‌ను ఎదుర్కోలేకే: సజ్జల -
8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేయాలి
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో రెడ్డి సముదాయానికి చెందిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఏర్పాటులో ప్రాధాన్యత కల్పించాలని రెడ్డి సముదాయ గురువు శ్రీ వేమనానంద స్వామీజీ అన్నారు. మంగళవారం నగరంలోని కోరమంగలలో ఉన్న మహా యోగి వేమన విద్యా సంస్థల ఆవరణంలో కర్ణాటక రెడ్డి సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ... బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలో సుమారు 12 మందికిపైగా రెడ్డి సముదాయానికి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు ఎన్నికయ్యారని, వారికి ప్రభుత్వ ఏర్పాటులో ప్రాధాన్యత ఇవ్వాలని స్వామీజీ అన్నారు. గతంలో మాజీ సీఎం యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సముదాయానికి చెందిన ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చారని, బసవరాజ బొమ్మై హయాంలో రెడ్లకు అవకాశం కల్పించలేని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో రెడ్డి జనసంఘం అధ్యక్షుడు జయరామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి, కార్యదర్శి సదాశివరెడ్డి, కృష్ణారెడ్డి, కోశాధికారి చంద్రారెడ్డితో పాటు పలువురు రెడ్డి సముదాయం సభ్యులు పాల్గొన్నారు. -
ప్రత్యక్ష దైవం సాయిబాబా
షిర్డీ సాయిబాబా జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. సాయిబాబాగా రామలింగా రెడ్డి నటించారు. కొండవీటి సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. విశ్రాంత ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఓం సాయి ప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘సాయిభక్తుల అనుభవాలతో సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించారు మచ్చా రామలింగారెడ్డి’’ అన్నారు చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ‘‘యం.ఆర్. రెడ్డి మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించాలనుకోవడం అభినందనీయం’’ అని ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. చిత్రదర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్, వి. సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా, పాటల రచయిత బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఎదిగి నిరాడంబరుడిగా, ఆదర్శవాదిగా ప్రజా మన్ననలు పొందిననేత దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామలింగారెడ్డి మరణం దుబ్బాక నియోజకవర్గ ప్రజలనే కాక, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. రామలింగారెడ్డి మృతిపై సోమవారం శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని ఊహించలేదు. బాధాతప్త హృదయంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నా. రామలింగారెడ్డి మృతిపట్ల ఈ సభ సంతాపం తెలుపుతోంది. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నేత రామలింగారెడ్డి నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరనేతగా చెరగని ముద్ర వేశారు’అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారని, మెదక్ జిల్లాలో జరిగిన ఉద్యమాలకు బాసటగా నిలిచారని కొనియాడా రు. జర్నలిస్టుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎమ్మెల్యే కాక ముందు నుంచే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, తాను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాదని కొనియాడారు. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారని, ప్రజాకవి కాళోజీ, తన చేతుల మీదుగా ఆదర్శ వివాహం జరిగిందని గుర్తు చేశారు. ఇదే ఆదర్శంతో తన పిల్లలకు కూడా వివాహాలు జరిపించారన్నారు. రామలింగారెడ్డిలోని నిబద్ధత, విశ్వసనీయత, నాయకత్వ లక్షణాలు గమనించి.. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చామని, ఆ ఎన్నికల్లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచి యువ నేతగా శాసనసభలో అడుగుపెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైనపాత్ర పోషించారని, సమైక్యవాదుల ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని కొనియాడారు. గుండెలు బరువెక్కాయి... రామలింగారెడ్డి మరణం ఊహించనిదని, ఆయన మరణంపై తీర్మానాన్ని బలపరచాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని మంత్రులు పేర్కొన్నారు. నిరాడంబరంగా ఉండే మిత్రున్ని కోల్పోయామన్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని కేటీఆర్ కొనియాడారు. ఆయన మరణంతో తమ గుండెలన్నీ బరువెక్కాయని మంత్రులు పేర్కొన్నారు. -
వరవరరావుకు బెయిల్ ఇప్పించండి
సాక్షి,హైదరాబాద్: జూన్ 2న వరవరరావు(వీవీ) బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ఆయనకు షరతులతో కూడిన బెయి ల్కు అవకాశం ఇవ్వాలని వీవీ భార్య, కుమార్తెలు కేంద్ర హోంశాఖ సహా య మంత్రి కిషన్‌రెడ్డికి పంపిన ఓ వినతి పత్రంలో కోరారు. వీవీతో పాటు ప్రొఫెసర్ సాయిబాబాకూ బెయిల్ మంజూరు చేయించాలని కోరారు. వరవరరావు విడుదలకు చొరవ తీసుకోవాలని తెలంగాణ ప్రముఖ రచయితలంతా శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కవులు దేవిప్రియ, అంపశయ్య నవీన్, నందిని సిద్ధారెడ్డి, గొరటి వెంకన్న తదితర 27 మంది లేఖ రాశారు. వీవీ విడుదల కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలతో మాట్లాడి ఆయన జైలు నుంచి బయటకు వచ్చేలా సహకరించాలని కోరారు. ఇక అక్రమ నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయాలని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆదివారం నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. వరవరరావును విడుదల చేయాలి: ఎమ్మెల్యే రామలింగారెడ్డి పౌరహక్కుల నాయకుడు వరవరరావును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే 18 నెలలు జైల్లో ఉన్న ఆయనకు మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. వరవరరావు వయసు, ఆరోగ్యంతో పాటు ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. -
చెత్తబండి రోజూ రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడే: హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట : ఎండాకాలం వస్తే కరెంట్ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ, ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా భవన నిర్మాణానికి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులకు రెండు వేల పింఛన్ ఇచ్చి కొండంత అండగా నిలిచారని అన్నారు. మహిళలకు రూ.50 లక్షల రూపాయలతో మహిళా భవనం శంకుస్థాపన చేశామని తెలిపారు. ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. స్థలం ఉన్న వారికి తొందరలోనే డబుల్ బెడ్ రూంలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కట్టిస్తామని అందుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే పెద్ద సమస్య అయిన చెత్తపై అందరు కలిసికట్టుగా పని చేసి చెత్తను లేకుండా చేసి, స్వచ్చ దుబ్బాకగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు పని తగ్గాలంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. చెత్తను బయట పడేసిన వారికి అయిదు వందల రూపాయల ఫైన్ విధిస్తామన్నారు. ఇంటి ముందుకు చెత్తబండి ప్రతి రోజు రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడేనన్నారు. పేదవాడు ఇళ్లు కట్టుకుంటే రూపాయి లంచం అవసరం లేదని, తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ప్రతి నెల రూ. 78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక వద్ద మొక్కనాటిన మంత్రి హరీష్ రావు మొక్క సంరక్షణ కోసం పదివేల రూపాయలు అందజేశారు. -
రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంతో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రాంతంలో వీరు సమావేశం కావడం విశేషం. కాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి, బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డిని శనివారం రాత్రి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే రామలింగారెడ్డి తనకు జరిగిన అన్యాయంతో పాటు పార్టాలో నెలకొన్న సమస్యలనూ చెబుతూ రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడంతో వేణుగోపాల్ నిరాశతో వెనుదిరిగారు. ఈ సమావేశంలో రామలింగారెడ్డి డీసీఎం పరమేశ్వర్‌పైన ఆరోపణలు గుప్పించినట్లు తెలిసింది. మరోవైపు పార్టీలో జరుగుతున్న అనూహ్య మార్పులు తనను ఆవేదనకు గురి చేశాయని, దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, పార్టీకి కాదని, 46ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేస్తూనే ఉన్నానని రామలింగారెడ్డి అన్నారు. పార్టీ కూడా తనకు అనేక పదవులు ఇచ్చిందని, అయితే పార్టీలో జరుగుతున్న పరిస్థితులపై రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, సీఎం కుమారస్వామికి వివరించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఏమి జరుగుతుంతో చెప్పలేనని రామలింగారెడ్డి పేర్కొన్నారు. చదవండి: బుజ్జగింపుల పర్వం షురూ -
మోదీ ముందు మీ ప్రతాపం చూపించండి
సాక్షి, బెంగళూరు: మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్ ఏం మాట్లాడుతున్నారో అతనికే తెలియడం లేదని హోంమంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీలో స్థానం నిలుపుకునే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడిందే పదేపదే చెబుతున్నారని విమర్శించారు. మూడేళ్ల క్రితం బీబీఎంపీ ఫలితాల గురించి తాను తప్పుగా మాట్లాడినట్టు వార్త పత్రికలో ప్రచురితమైందని ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీబీఎంపీ వార్డుల్లో కాంగ్రెస్‌కు పూర్తిగా మద్దతు పలికారని తెలిపారు. అయితే బీజేపీ వారు మాత్రం తామే తెలివైన వారిగా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలే తెలివైన వారనే విషయాన్ని గమనించాలని సూచించారు. ఈసందర్భంగా ఆయన బీజేపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ ప్రతాపాలు ఇక్కడ కాదు.. మోదీ ముందు చూపించండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ ఫోన్ ట్యాపింగ్
రాష్ట్రంలో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ రగడ తెరపైకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఫోన్ సంభాషణలను చాటుగా వింటోందని రాష్ట్ర హోంమంత్రి మరోసారి ఆరోపణలు సంధించడం ఆసక్తికరంగా మారింది. కొద్దినెలల కిందట సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు ఇవే ఆరోపణలు చేయడం తెలిసిందే. బనశంకరి: కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆరోపించారు. దివంగత ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి 52వ వర్ధంతి సందర్భంగా గురువారం విధానసౌధ ఆవరణలోనున్న శాస్త్రి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై చాలారోజుల కిందటే ప్రస్తావించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారే ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారు, ఇది చేయడానికి ఇతరులకు సాధ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరంతరం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని, చట్టం ప్రకారం ఇతరుల ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు, దీనిని ఉన్నత న్యాయస్థానాలు ప్రశ్నించాలని మంత్రి పేర్కొన్నారు. పోలీసుల స్థైర్యంపై దాడులు చేస్తున్నారు చిక్కమంగళూరు జిల్లా మూడగెరె తాలూకాలో డిగ్రీ విద్యార్థిని ధన్యశ్రీ ఆత్మహత్య కేసులో బుధవారం బెంగళూరులో సంతోష్ అనే యువకుడితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశామని రామలింగారెడ్డి తెలిపారు. పోలీస్‌ల నైతికస్థైర్యంపై బీజేపీ యువమోర్చా దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా దౌర్జన్యాలు అధికమయ్యాయని, తమ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం తగ్గిందన్నారు. కానీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అంతకుముందు లాల్‌బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడిìన రామలింగారెడ్డి పేదల ఆకలి తీర్చడానికి రేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారని, కరువులను సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పారు. -
హీరో.. స్మైల్ ప్లీజ్
చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫొటో ఎగ్జిబిషన్లో హీరో యశ్‌ను సరదాగా ఫొటో తీస్తున్న హోం మంత్రి రామలింగారెడ్డి జయనగర: చిత్రకళా పరిషత్‌లో ఫొటో జర్నలిస్టŠస్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శకులను కనువిందు చేస్తోంది. ఫొటో జర్నలిస్టŠస్ ఆఫ్ బెంగళూరు అసోసియేషన్ సభ్యులు తీసిన ఛాయాచిత్రాలు నిత్యం జీవితంలో జరిగే సంఘటనలకు అద్దం పడుతోంది. టీవీలో నుంచి శునకం బయటకు వస్తుండటం, నీటి కోసం జింక, బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌పై వెళ్తూ కిందపడటం తదితర చిత్రాలో ఎంతో సజీవంగా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ల సునిశిత దృశ్యానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఇక ఓ ఫ్యాషన్‌లో దివంగత మైసూరు మహరాజు శ్రీకంఠదత్త వడియార్, ఆహారం కోసం గద్ద, తమిళనాడు జల్లికట్టులో ఎద్దును లొంగతీసుకుంటున్న చిత్రం, బరువును మోయలేక చతికిలబడిన వృషభం, భారీ వర్షాల కారణంగా నగరంలో ఏర్పడిన గుంతల వద్ద జలకన్య రూపంలో నిరసన వ్యక్తం చేసే చిత్రం తదితర చిత్రాలు చూపుతిప్పుకోలేకుండా చేస్తున్నాయి. ప్రదర్శన ఈనెల 24 వరకు నిర్వహిస్తారు. -
సన్నీలియోన్ వద్దు.. భరతనాట్యం ముద్దు!
సాక్షి, బెంగళూరు : బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. బెంగళూరులో నిర్వహించే న్యూఇయర్ వేడుకల్లో సన్నీలియెనపాల్గొనాల్సి ఉంది. సన్నీలియోన్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడంపై బెంగళూరులో వివాదాలకు దారితీసింది. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం సన్నీలియోన్ బెంగళూరు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హిందూ అతివాద సంస్థలకు మరింత ప్రోత్సాహం అందించేలా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నీలియోన్ రాకను వ్యతిరేకిస్తూ.. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక కొద్ది రోజుల నుంచి ఉద్యమాలను నిర్వహిస్తోంది. సన్నీలియోన్ రాకవల్ల కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని రక్షణ వేదిక పేర్కొంటోంది. న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీ పాల్గొంటే.. సామూహిక ఆత్మహత్యకు వెనుకాడే ప్రసక్తే లేదంటూ యువసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి కర్ణాటక రక్షణ వేదికకు అనుకూలంగా స్పందించారు. సన్నీలియోన్ పాల్గొనే కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అయితే సన్నీలియోన్ ప్రోగ్రాం స్థానంలో భరతనాట్యం, ఇతర సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించడం విశేషం. సన్నీలియన్ గతం మంచిదికాదని, ఆమెలాంటి వాళ్లను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని కర్ణాట రక్షణ వేదిక ప్రకటించింది. కర్ణాటక సంస్కృతిని రక్షించుకోవాలంటే ఆమెను ఇక్కడికి రాకుండా చేయాలంటూ కర్ణటక రక్షణ వేదిక యువసేన పిలుపునిచ్చింది. ఈ మేరకు కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాల్లో సన్నీ లియోన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేసిన విషయం విదితమే. -
గౌరి లంకేశ్ హంతకుల ఆచూకీ తెలిసింది
సాక్షి, బెంగళూరు: సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ హంతకుల ఆచూకీ తెలిసిందని, అతి త్వరలోనే నిందితులను అరెస్టు చేయనున్నట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి తెలిపారు. శనివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. గౌరి హంతకులు ఎవరనేది తెలిసింది. కొన్ని వారాల్లో నిందితులను అరెస్టు చేయటం తథ్యం. హంతకుల వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా తెలుసుకున్నాం. పదే పదే గొడవలకు దిగే గూండాలు, పోకిరీలతో పాటు సమాజ విద్రోహ శక్తులను నిర్దాక్షిణ్యంగా గూండాచట్టం కింద అరెస్ట్ చేసి ఆటకట్టించాలని, రాష్ట్రం నుంచి బహిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు 30 అంశాల కార్యక్రమాన్ని పోలీసులకు అందజేశాం. మహిళా కాలేజీలు, స్కూళ్ల వద్దగూండా కార్యకలాపాలు కనిపిస్తే వాటిని అంతం చేయాలి.మహిళలకు తగిన రక్షణ క ల్పిం చాలని సూచించాం. ఆఫ్రికా,నైజీరి యా తదితర దేశాల విద్యార్థులు నగరంలో పా ల్పడుతున్న అల్లరి చేష్టలను అరికట్టాం. యువకులను తప్పుదారి పట్టిస్తూ గంజాయి, హఫీమ్ తదితర మాదక వస్తువుల సరఫరా చేస్తున్న వారిపై నిఘా వహించాలని ఆదేశించాం. నేను మృదు స్వభావం కలిగిన వ్యక్తినే అయినా అవసరమైనపుడు కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనుకంజ వేయను. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు. నెంబర్‌వన్ కావాలనుకోవడం లేదు ప్రభుత్వంలో నేను నెంబర్ వన్ కావాలనుకోవడం లేదు. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నవారే కొనసాగుతారు. నా కుమార్తెకు మొదటి నుంచి సామాజి క సేవలో చాలా ఆసక్తి ఉండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చినట్లయితే పోటీ చేస్తుంది. లేనిపక్షంలో కాంగ్రెస్ అ భ్యర్థి గెలుపునకు శ్రమిస్తారు. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి రాకూడదనే నిబంధన ఎక్కడా లేదు. అన్ని రాజ కీయ పార్టీల్లో నాయకుల పిల్లలు ఉన్నారన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. టిప్పు జయంతిని జరగనివ్వరాదని బీజేపీ నాయకులు రాజకీయ స్వార్థంతో వ్యతిరేకించారు. అయితే వారు అధికారంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, సదానందగౌడ, ఆర్.అశోక్ తదితరులు టిప్పు సుల్తాన్ కండువా వేసుకొని టిప్పు జయంతిని ఆచరించటాన్ని మరచిపోయారు. టిప్పు జయంతికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వారికి నైతిక హక్కు లేదు. మా శాఖలో అవినీతి అక్రమాల నివారణకు అన్ని విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసు సంక్షేమ నిధిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణపై పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బెంగళూరులోనూ సరి– బేసి పరిశీలన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీలోని సరి– బేసి వాహన విధానాల్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. డిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చే విధానం సక్సెస్ అయితే బెంగళూరులోనూ పాటిస్తామని చెప్పారు. బెంగళూరులో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది, దీంతో వాయు మాలిన్యమూ పెరుగుతోంది, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్నారని రామలింగారెడ్డి ఆరోపించారు. తమ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సదాశివ శెణై, ఉపాధ్యక్షుడు దొడ్డ బొమ్మయ్య, ప్రధానకార్యదర్శి కిరణ్, కోశాధికారి రమేశ్ పాల్గొన్నారు. -
నరకం చూపిన పాలన...!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య హక్కులు కాదు కదా.. కనీస విలువలకు కూడా తావు లేకుండా చేశాడు చంద్రబాబు. కేసీఆర్‌ని ఆయన కుటుంబాన్ని తిరుపతి సందర్శనలో గౌరవించారు సరే. కానీ తెలంగాణ ఎంఎల్ఏలు, మంత్రులు తిరుపతి వెళితే అక్కడి ప్రభుత్వంకానీ, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గంటలకొద్దీ భంగపడితే ఏ అధికారైనా కరుణిస్తే కాస్త సౌకర్యం లభిస్తోంది తప్పితే దేవుడి ముందు కూడా తెలంగాణ నాయకుల పట్ల విపక్ష చూపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తన పాలనా కాలంలో చంద్రబాబునాయుడు తెలంగాణకు నరకం చూపించాడని టీఆర్ఎస్ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక భూమిక నిర్వహించిన సోలిపేట రామలింగారెడ్డి అంటున్నారు. నక్సలైట్లతో కనీస సంబంధం లేని వ్యక్తులను పట్టుకుపోయి చంపారని, షెల్టరిచ్చినందుకు, ఒక పూట వాళ్లకు అన్నం పెట్టినందుకు కాల్చిపడేశారని, నెలకు ఇంతమందిని చంపాలి అని టార్గెట్ పెట్టుకుని మరీ పోటీలు పడి ఎన్కౌంటర్లు చేశారని ఆరోపించారు. స్వయంగా తన సోదరుడు సోలిపేట కొండలరెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేశారని, పగలు జర్నలిస్టు నేతగా, ఆర్ఎస్యూ కార్యకర్తగా ఉంటున్న తాను సైతం రాత్రిపూట ఇంట్లో లేకుండా బయట షెల్టర్ తీసుకునేవాడినని చెప్పారు. కక్షసాధింపునకు మారుపేరు బాబు కాగా, తనను నిందించిన వారిని కూడా మరుక్షణంలో క్షమించి వదిలేసే జననేత కేసీఆర్ అంటున్న సోలిపేట అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ఆర్ఎస్యూలో పనిచేసిన మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేయాలనుకున్నారట కదా? నన్ను టాడా కేసు కింద అరెస్టు చేశారు. ఎన్కౌంటర్ చేయాలని కూడా తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబు హయాంలో నాకు తెలిసిన అనేకమంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. నక్సలైట్లతో కనీస సంబంధం లేని వ్యక్తులను పట్టుకుపోయి చంపారు. వైద్యం కోసం ఇంటికి వస్తే వాళ్లకు వైద్య సేవలందించారన్న సాకుతో ఆర్ఎంపీ డాక్టర్ని ఎన్కౌంటర్ చేశారు. షెల్టరిచ్చినందుకు, ఒక పూట వాళ్లకు అన్నం పెట్టినందుకు చంపేశారు. ఈ నెల ఇంతమందిని చంపాలి, వచ్చే నెలకు ఇంతమందిని చంపాలి అని టార్గెట్ పెట్టుకుని మరీ పోటీలు పడి ఎన్కౌంటర్లు చేశారు. టీఆర్ఎస్లో పనిచేస్తున్న ఈశ్వర్ అనే అతడిని టార్గెట్ చేసి తప్పుడు సమాచారం కారణంగా అతడి తమ్ముడిని ఎన్కౌంటర్ చేశారు. నా పరిస్థితి ఏమిటంటే పగటిపూట పెద్ద లీడర్ని. రాత్రి సమయంలో రహస్యంగా షెల్టర్‌లో ఉండేవాడిని. ఇంట్లో ఉంటే పోలీసులు పట్టుకుపోయి చంపేసేటోళ్లు. నిజంగానే బాబు పాలన ఘోరమైన పాలన. గ్రామాల్లో యువకులు రాత్రి ఇంట్లో ఉండాలంటే ప్రాణాలకు తెగించాల్సి వచ్చేది. మీ బ్రదర్ కూడా ఎన్కౌంటర్ అయినట్లున్నారు కదా? మా చిన్నమామ కుమారుడు సోలిపేట కొండల్ రెడ్డిని కాల్చి చంపారు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర, మీకు గుర్తున్న కొన్ని ఘట్టాలు చెప్పండి? తెలంగాణ ఉద్యమంపై ఘోరమైన నిర్బంధం విధించారు. నన్నయితే ప్రమాదకర శక్తిగా గుర్తించారు. బాబు హయాంలో మా దుబ్బాక నియోజకవర్గంలోనే 250 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని ఆకలి చావులు కాదన్నారు. అవమానించారు. చితికిన చేనేత బతుకులు.. భవనాలు పెట్టిన మెతుకులు వంటి పేరుతో అప్పట్లో ఒక వ్యాసం కూడా రాశాను. అధికారంలో ఉన్నప్పుడు బాబు చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఘోరంగా అవమానించాడు. అధికారం పోయాక ఆయన వాళ్లను పరామర్శ చేస్తానన్నాడు. ఈ కపటత్వం ఎందుకని మేం అడ్డుపడ్డాం. తెలంగాణ వచ్చాక ఎలా ఫీలవుతున్నారు? మా దుబ్బాక నియోజకవర్గం చాలా పేదది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదు. కెనాల్ లేదు. ప్రాజెక్టు లేదు. పదిహేనేళ్లుగా వరుస బెట్టి కరువు. సెంటిమెంటో ఏమో కాదు కానీ... చంద్రబాబు దుబ్బాకలో అడుగుపెట్టాడు. అప్పటినుంచి సర్వనాశనమైపోయింది. భూగర్భజలం 500 అడుగులు లోతుకు పడిపోయింది. కాని ఇప్పుడు వర్షాలు కురవడం, మిషన్ కాకతీయతో పరిస్థితి మెరుగుపడింది. అప్పట్లో గ్లాసుడు నీళ్లు తాగుదామన్నా కష్టంగా ఉండేది. నీళ్లు తాగుతామంటే టీ తాగితే నీళ్లు ఇస్తామనేవారు. ఇప్పుడు మిషన్ భగీరథ 99 శాతం వరకు గ్రామాల్లోకి వస్తోంది. కేసీఆర్ ప్రతిపక్షనేతలకు అప్పాయింట్మెంట్ ఇవ్వరు. ప్రజలను కలవరు అంటున్నారు? ప్రతిపక్షనేతలు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు మాకు సీఎం అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు అంటూ ప్రకటనలు చేస్తుంటారు. కాని మంత్రుల చాంబర్లలో, సీఎం చాంబర్లో ఎప్పుడు చూసినా కాంగ్రెస్ నేతలే ఉంటారు. సాక్షి తరపున అక్కడ నాలుగు కెమెరాలు పెడితే మీకే అర్థమవుతుంది విషయం. వారే సీఎంని కలిసి పనులు చేయించుకుం టుంటారు. చిన్న ఉదాహరణ. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అడిగిన మాటమీద కేసీఆర్ ఆయనకు వందకోట్ల విలువైన ప్రాజెక్టుకు అనుమతిచ్చారు. పదవిలో ఉన్న వారిని తీసుకుని విలీనం అంటే కుదుర్తుందా? తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వ్యవస్థాపితమై బలంగా ఉన్న రాజకీయ పార్టీ. మాది ఉద్యమపార్టీ. తెలంగాణ ప్రజల బతుకులను బాగు చేయాలని పుట్టుకొచ్చిన పార్టీ మాది. టీడీపీ ఎమ్మెల్యేల ద్వారానే తెరాస ప్రభుత్వంపై దాడి చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, వాళ్లకు వాళ్లుగా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నలుగురి కోసమే ప్రభుత్వం నడుస్తోందని అంటున్నారే? తెరాసది కుటుంబ పాలన అంటున్న వారు తాము అందమైన అబద్దం ఆడుతున్నామని వారికే స్పష్టంగా తెలుసు. మాపై విమర్శ చేస్తున్నారు కదా. చంద్రబాబు కుటుంబం పరిస్థితి ఏమిటి? బాబు, బాలకృష్ణ, లోకేశ్.. ఇదంతా కుటుంబ పాలన కాదా.. కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా? కేటీఆర్ ఉద్యమంలో రాటుదేలి నాయకుడయ్యారు. మంత్రి అయ్యారు. లోకేశ్ ఏపీకి ఏం చేశారని మంత్రి అయ్యాడు? ఓటుకు కోట్లు కేసు సరే.. నయీం కేసునూ నీరు కార్పించేశారు? వంద నాగార్జునసాగర్‌లు కట్టించిందానికంటే నయీంను తుద ముట్టించిన ఘటనే గొప్పదని నా ఉద్దేశం. నయీంను దశాబ్దాలుగా సమర్థించి కాపాడినవాళ్లు ఎవరో అందరికీ తెలుసు. నయీం ఎంత క్రూరాత్ముడో అనుభవించిన వాళ్లకే తెలుసు. కేసీఆర్ మాత్రమే నయీం పని పట్టగలిగారు. నూటికి నూరుపాళ్లు నయీం కేసు విచారణ నడుస్తోంది. ఈ విషయంలో టీఆర్ఎస్ వ్యక్తులకు సంబంధం ఉంటే వారిని కూడా పక్కన పెడుతున్నారు. నయీం కేసు వదిలే ప్రశ్నేలేదు. బాబు, కేసీఆర్.. పాలనపై మీ అభిప్రాయం? బాబు, కేసీఆర్ పాలనను పోలిస్తే నక్కకూ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. బాబు పాలనలో మా ఊళ్లో అయిదంటే అయిదు ఫించన్లు మాత్రం ఇచ్చారు. అయిదేళ్లలో ఫించన్ల సంఖ్య పెరగలేదు. అదే కేసీఆర్ పాలనలో వృద్ధులకు, వికలాంగులకు, మాత్రమే కాదు, వితంతువులకు.. ఒంటరి మహిళలకు కూడా ఫించన్లు ఇస్తున్నారు. కొన్ని వేలమందికి ఇలా ఇస్తున్నారు. మా నియోజకవర్గంలో ఉద్యోగులను తప్పిస్తే ఇంటింటికీ ఫించన్ ఇస్తామని చెప్పాము. ఇస్తున్నాం కూడా. వ్యక్తులుగా చంద్రబాబు, కేసీఆర్‌పై మీ అభిప్రాయం? కేసీఆర్ ఒక వ్యక్తిని పడగొట్టాలని, జీవి తాన్ని దెబ్బతీయాలని చూడరు. ఆయన నైజం కాదు. అదే బాబు అయితే నవ్వుతూ మాట్లాడుతూనే అవతలివాడిని ఎక్కడ తొక్కేయాలో అక్కడ తొక్కెయ్యాలని చూస్తాడు. పథకం ప్రకారం దెబ్బతీయాలని చూస్తాడు. కేసీఆర్ ఆవేశానికి గురై ఎవరినైనా తిట్టినా, ఆ మరుక్షణమే మర్చిపోతారు. కక్షసాధింపు మాత్రం లేదు. చంద్రబాబు అయితే నవ్వుతూ నవ్వుతూనే గొంతు కోసేస్తాడు. చాడీలను ఏమాత్రం పట్టించుకోని మంచి లక్షణం కేసీఆర్‌కి ఉంది. చంద్రబాబుకు చెప్పుడు మాటలు వినడమే కాదు. తాను కూర్చునే కుర్చీని కూడా అనుమానించే తత్వం చంద్రబాబుది. ఎన్టీరామారావును గద్దె నుంచి దింపిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఆయన ఫొటోకు మొక్కుతున్నారు కదా? మా ప్రాంతంలో దీన్ని సంపి సావు ఖర్చు పెడుతున్నట్లు లెక్కిస్తారు. అంటే మనిషిని చంపేసి తర్వాత చావు ఖర్చులకు డబ్బులిస్తారు కదా. ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు వ్యవహారం ఇలాగే ఉంది. (సోలిపేటతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/t2rMEM https://goo.gl/KQim3S -
సాయిబాబా చరిత్రతో...
షిరిడీ సాయిబాబా జీవితం ఆధారంగా కొండవీటి సత్యం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిరిడీ సాయి’. సాయిబాబాగా మచ్చా రామలింగారెడ్డి నటించారు. క్రోసూరి సుబ్బారావు, ఎం.ఆర్. రెడ్డి, పి. వెంకట్, డి. శివప్రసాద్ నిర్మాతలు. ప్రస్తుతం డీఐ, 5.1 మిక్సింగ్ (సౌండ్ మిక్సింగ్) పనులు జరుగుతున్నాయి. చందూ ఆది ఆధ్వర్యంలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ‘‘సాయిబాబా చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ సినిమా చేశాం’’ అని నిర్మాతలు అన్నారు. ప్రత్యేక పాత్రలను భానుచందర్, సీత చేశారు. విజేత కథానాయిక. ఈ చిత్రానికి కథ–మాటలు: దానం వెంకట్రావు, సంగీతం: కిషన్ కవాడియా, కెమెరా: వెంకట్. -
రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి
కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి శెట్టూరు: రెడ్డికులస్తులు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం చెళ్లికెర తాలూకా తిప్పరెడ్డిపల్లిలో సోమవారం యోగి వేమన తల్లి వేమారెడ్డి మల్లమ్మ 595వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్డి సామాజికవర్గం వారు వేమనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యోగి వేమన జీవిత విశేషాలను గుర్తుచేశారు. అంతకు ముందు గ్రామంలో పూర్ణకుంభాలతో యోగి వేమన, మల్లమ్మ చిత్రపటాలను ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.మంత్రిని సన్మానించారు. కర్ణాటక రెడ్డి సమాజ్ అధ్యక్షుడు కేటీ వెంకటరెడ్డి, కర్ణాటక మాజీ జెడ్పీటీసీ హనుమంతరెడ్డి, కాంగ్రెస్ నాయకులు దాస్‌రెడ్డి, శెట్టూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమనాథరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, మాజీ సర్పంచు సిద్దం రామిరెడ్డి, రెడ్డి కులస్తులు పాల్గొన్నారు. -
ప్రకాశం అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు
కందుకూరు: ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.రామలింగారెడ్డి తన ఆర్టికల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచారని కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామలింగారెడ్డి ఆర్టికల్స్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్స్ (ఐజెఐఆర్డీ)లో ప్రచురితమయ్యాయని తెలిపారు. దీంతో ఆర్టికల్స్ పరిశీలనార్థం కేంబ్రిడ్జి, స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సీటీ లైబ్రరీలలో ఉంచనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఇది తమ కాలేజీ అధ్యాపకుల సామర్ధ్యాన్ని తెలియజేస్తుందని వివరించారు. తమ కాలేజీ ప్రొఫెసర్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడించడం గర్వకారణం అన్నారు. రామలింగారెడ్డిని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావుతో పాటు, తోటి అధ్యాపకులు డాక్టర్ రవికుమార్, శ్రీనివాస్, రాముడు, ప్రసాద్ అభినందించారు. -
ప్రత్యక్ష దైవం
ఇప్పటి వరకూ షిరిడీ సాయి జీవితం ఆధారంగా పలు చిత్రాలొచ్చాయి. తాజాగా మచ్చ రామలింగారెడ్డి సాయిబాబా పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. విజేత, శ్రీకృష్ణ జంటగా కొండవీటి సత్యం దర్శకత్వంలో దత్త ఫిలింస్ పతాకంపై సుకుమార్, కోసూరి సుబ్బారావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి వరకూ షిరిడీ సాయిబాబా చరిత్రపై వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా మా చిత్రం ఉంటుంది. అనంతపురం, పెన్నా, అహోబిలం ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేశాం. కిషన్ కవాడియా మంచి పాటలు అందించారు. ఆడియో విడుదలైన తర్వాత ప్రతి ఇంట్లో ఈ చిత్రంలోని పాటలు మార్మోగుతాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంతో భక్తిరస చిత్ర దర్శకునిగా సత్యంకు మంచి పేరొస్తుంది. అందర్నీ అలరించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం’’ అని తెలిపారు. సతీష్, రేఖారాణి, కాటంరెడ్డి, రజనీ, శశికళ, ప్రశాంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: సూర్య. -
రూ.1500 కోట్ల భూమి ఆక్రమణ
* దుర్గం చెరువును పరిశీలించిన అంచనాల కమిటీ * వివరాలను వెల్లడించిన చైర్మన్ రామలింగారెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో రూ.1,500 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను అంచనాల కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ దుర్గం చెరువు పరిసరాల్లోని 60 ఎకరాల విలువైన భూమి అన్యాక్రాంతమైందన్నారు. చెరువు, శిఖం భూములను ఆక్రమించిన వాళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. ప్రాథమిక సర్వే చేసిన తర్వాత ప్రభుత్వానికి ఆక్రమణలపై నివేదిక ఇస్తామన్నారు. దుర్గం చెరువు పరిశీలన దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, వీరేశం, డి.కె.అరుణ, అంజయ్య, ప్రభాకర్‌రావు, కృష్ణారావు, జనార్ధన్‌రెడ్డి, హెచ్ఎండీఏ చైర్మన్ శాలిని మిశ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఆక్రమణల వివరాలతో కూడిన ప్రదర్శన... దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను, వాటి నమూనాలను, ఆక్రమణలతో కూడిన వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను అంచనాల కమిటీ సభ్యులు తిలకించారు. కాగా ఎఫ్టీఎల్ పరిధిలోనే అమర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ(హుడా అప్రూవ్డ్ లే అవుట్), కావూరి హిల్స్ (హుడా అప్రూవ్డ్ లే అవుట్), ఎస్టీపీ పక్కన, ఓరుగంటి నర్సింహ్మ లే అవుట్, కల్యాణ్ నగర్, బృందావన్‌కాలనీ, నెక్టార్ గార్డెన్, గఫూర్ నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయని ప్రదర్శనలో పేర్కొన్నారు. ఈ కాలనీ వివరాలను సభ్యులు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
'పేద ప్రజలకు మేం వ్యతిరేకం కాదు'
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకాల పేరిట కాంగ్రెస్ నాయకులు రూ.కోట్లు దోచుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పేరిట సొంత లాభం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రస్తుత టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద పట్టుబడ్డ డబ్బులు కూడా ఇందిరమ్మ ఇళ్లవేనంటూ ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు తాము వ్యతిరేకం కాదని.. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని రామలింగారెడ్డి అన్నారు. -
హామీల అమలుకు సీఎం కేసీఆర్ కృషి
దుబ్బాక రూరల్: సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలో చిట్టాపూర్, తాళ్లపల్లి, పోతరెడ్డిపేట, చిన్న నిజాంపేట, రామేశ్వరంపల్లి, ఎనగుర్తి, ఆకారం, గోసాన్‌పల్లి, శివాజీనగర్, గంభీర్పూర్, పోతారం గ్రామాల్లో ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగ కుటుంబాలకు కేసీఆర్ పెద్దకొడుకై బరువు బాధ్యతలు తీసుకున్నాడన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన వారందరికి పింఛన్లు అందజేస్తామన్నారు. అందనివారు ఉంటే రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దుబ్బాక నియోజక వర్గం కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వాటర్ గ్రిడ్, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక నిధులు విడుదల చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రంలో దుబ్బాక ఎంపీపీ ర్యాకం పద్మ శ్రీరాములు, ఎంపీడీఓ ప్రవీణ్, తహశీల్దార్ అరణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
భరోసా ఇచ్చిన ‘సాక్షి ‘జనపథం’
అనాజీపూర్‌లో పేపర్ చూసి జనం ఖుషీ దౌల్తాబాద్: మండలంలోని అనాజీపూర్ గ్రామంలో ఈ నెల 9న ‘సాక్షి‘ ఆధ్వర్యంలో నిర్వహించిన జనపథం కార్యక్రమంతో పింఛన్ లబ్ధిదారులకు భరోసా కల్గింది. స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అధికారుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో వృద్ధులు, విత ంతువులు, వికలాంగులు వారివారి అ నుమానాలను నివృత్తి చేసుకోవడంతో ఆసరాపై ఉన్న ఆందోళన తొలగింది. బుధవారం గ్రామంలో ఈ కార్యక్రమంపైనే చర్చలు సాగాయి. ఆసరాపై ఎమ్మెల్యే, అధికారులు ఇచ్చిన భరోసాను ‘సాక్షి’ దినపత్రికలో చూసి పలువురు ఖుషీ అయ్యారు. చదువురాని పలువురు వృద్ధులు, వికలాంగులు స్థానిక యువకులతో పేపర్‌ను చదివించుకొని ఆసక్తిగా విన్నారు. కొందరు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్లు పంచుతున్నారేమోనని పంచాయతీ కార్యాలయం వైపు తొంగిచూస్తూ కనిపించారు. ఒకటి రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ జరుగుతుందని వెల్లడవ్వడంతో బంధువుల ఇళ్ళకు వెళ్ళిన లబ్ధిదారులను తిరిగి రప్పించేందుకు పలువురు సమాచారం అందించారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రామ లింగారెడ్డి
-
అధైర్యపడకండి..అండగా ఉంటాం
సిద్దిపేట రూరల్: ‘‘అధైర్యపడకండి..అండగా ఉంటాం.. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు..ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతులకు ఏ సమస్యలున్నా స్థానిక నాయకులను, అధికారులను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇటీవలకాలంలో ఆత్మహత్య చేసుకున్న పదకొండు మంది రైతుల కుటుం బాలకు రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్రావుమాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరి గిందని, ఇప్పుడు మన రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే ప్రణాళికలు రుపొందిస్తున్నామన్నారు. ప్రతి రైతు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి రూ. వెయ్యి పిం ఛన్, అంత్యోదయకార్డుతో పాటు పదవ తరగతి లోపు చదువుకునే విద్యార్థులుంటే వారికి రెసిడెన్సీ పాఠశాలలో ఉచి త విద్యను అందిస్తామన్నారు. అదేవిధంగా ఇంటర్పైగా చదువుతున్న విద్యార్థులకు అదనంగా రూ. 10 వేలు అందిస్తామని చెప్పారు. ఇళ్లు నిర్మించుకోవాలని ఆసక్తి ఉంటే ఐఏవై కింద ఇళ్లు మంజూరుచేయిస్తామన్నారు. వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మెదక్ జిల్లాలో రైతులకు సాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఇబ్బందిని తొలగించేందుకు ప్రాణహిత- చేవేళ్ల పథకం ద్వారా జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతోందని, దీని ద్వారా రైతులకు సాగునీటి కష్టాలు దాదాపుగా తీరుతాయన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారె డ్డి మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యల ను నివారించేందుకు సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ పెద్దకొడుకుగా మారి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుం టున్నాడన్నారు. అంతకు ముందు కొండపాక మండలానికి చెందిన ఇద్దరు రైతు కుటుంబాలకు ఆపద్భందు కింద రూ. 50 వేల చొప్పున చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఎర్ర యాదయ్య, పద్మ, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వై గిరి తదితరులు పాల్గొన్నారు. మిల్క్ గ్రిడ్‌తో పాడి రైతులకు మేలు సిద్దిపేట కొండమల్లయ్య గార్డెన్లో ఆదివారం మధ్యాహ్నం మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, దుబ్బాక మిల్క్ గ్రిడ్ పథకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సహకార సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మా ట్లాడుతూ, సిద్దిపేట-దుబ్బాక నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో మిల్క్ గ్రిడ్ పథకం కోసం ప్రభుత్వం రూ. 60 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో గుజరాత్, పంజాబ్‌ల నుంచి తెచ్చిన పాడి గేదెలు సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో ప్రభుత్వం పాడి గేదెలు, ఆవుల కొనుగోలులో సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీంతో రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఎక్కడి నుంచైనా పాడి పశువులను ఖరీదు చేసే అవకాశం ఉందన్నారు. సబ్సిడీలను బ్యాంక్ ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించడం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించినట్లు చెప్పారు. రూ. 80 లక్షలతో సిద్దిపేటలో మిల్క్ ప్యాకెట్ల తయారీ యంత్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రూ. 75 లక్షలతో రైతులు పాలతో తయారు చేసే వెన్న, జున్ను, మజ్జిగ, కోవ, పెరుగు తదితర పదార్థాలను తయారు చేయడానికి వీలుగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం రూ. 2 కోట్ల సబ్సిడీని వ్యవసాయ పనిముట్ల కోసం మంజూరు చేసిందన్నారు. తోర్నాలలో రూ. 5 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను, రూ. 6.30 కోట్లతో మొక్కజొన్న పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు హరీష్‌రావు వెల్లడించారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీ సాగులో యంత్రికీకరణను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆధునిక ట్రాక్టర్లను కూడా రైతులకు 50 శాతం సబ్సిడీ తో అందించనున్నట్లు హరీష్‌రావు తెలిపారు. రైతులు 50 శాతం సబ్సిడీతో ఎన్ని టార్పాలీన్లనైనా కొనుగోలు చేయవచ్చన్నారు. గొర్రెల పెంపకం కోసం రూ. 10 కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని చెప్పారు. నిధులు మంజూరు కాగానే 20 శాతం సొమ్ము గొర్రెల, మేకల పెంపకందారులు చెల్లిస్తే మిగిలి మొత్తం సబ్సిడీ రూపంలో వస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణకు రూ. 180 కోట్లు చెరువుల పునరుద్ధరణకు గాను సిద్దిపేట నియోజకవర్గానికి రూ. 80 కోట్లు, దుబ్బాక నియోజకవర్గానికి రూ. 100 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. భూగర్భ జలవనరుల రక్షణకు సద్వినియోగం చేయాలన్నారు. చెరువులు, కుంటల్లో మట్టిని తొలగించి కట్టల మరమ్మత్తుకు వినియోగించాలని, అడుగులోని నల్లమట్టిని పొలాల్లోకి తరలించాలని సూచిం చారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఏజేడీ లక్ష్మారెడ్డి, పాడి పరిశ్రమ సహకార సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ జీఎం పాపారావు, డీఎల్ ఏఏ జనార్ధన్‌రెడ్డి, నాబార్డ్ ఏజీఎం రమేష్, సిద్దిపేట పాలకేంద్రం మేనేజర్ భానుప్రసాద్, ఆర్డీఓ ము త్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వై గిరి, పశువైద్యులు అంజయ్య, బాలసుం దరం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, నేతలు వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీలు ఎర్రయాదయ్య, జాప శ్రీకాం త్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పాల కేంద్రంలో పాల ప్యాకెట్ల తయారీ యంత్రాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. పాడి రైతుల శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అదనపు పాలధర చెక్కుల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పాలకు రూ. 4 పెంచిన క్రమంలో లబ్ధిపొందిన పాడి రైతులకు మంత్రి హరీష్‌రావు అదనంగా పొందిన డబ్బులకు సంబంధించి చెక్కులను సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు చెందిన పాడి రైతులకు పంపిణీ చేశారు. -
నేడు ఏయూ స్నాతకోత్సవం
ఏర్పాట్లు పూర్తి వెబ్సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏయూ క్యాంపస్: ఆంధ్రా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేదికను విద్యుత్ కాంతుల వెలుగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సోమవారం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు రెండు గంటల పాటు ఈ వేడుక సాగనుంది. వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఏర్పాట్లను ఆదివారం స్వయంగా పరిశీలించారు. వేదికకు ఇరువైపులా అందరికి కనిపించే విధంగా రెండు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అతిథుల ఆగమనం, సభావేదికపై సిటింగ్, డాక్టరేట్ తీసుకునే వారి సిటింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు పి.ఎస్.అవధాని, సి.వి.రామన్, డి.సూర్యప్రకాశరావు, బి.గంగారావు, కె.గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవాన్ని www.youtube.com/users/andhrauniversitylive, www.andhrauniversity.edu.in, www.aucoe.infoవెబ్సైట్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా రాఘవన్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కార్యాలయం సాంకేతిక కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆచార్య ఎస్.వి.రాఘవన్ హాజరుకానున్నారు. ఆయనకు వర్సిటీ తరఫున డాక్టర్ ఆఫ్ సైన్స్(డీ.ఎస్సీ)ను ప్రధానం చేస్తారు. ఆయన స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. ఆయన మద్రాసు ఐఐటీ ఆచార్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యునిగా, నేషనల్ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ ఆర్కిటెక్‌గా పనిచేస్తున్నారు. -
క్వార్టర్లు ఖాళీ చేయకుంటే నీళ్లు, కరెంట్ కట్
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు రామలింగారెడ్డి హెచ్చరిక హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా వాటిని ఖాళీ చేయాలని.. లేకుంటే కరెంటు, మంచినీటి సరఫరా వంటివి నిలిపేస్తామని ఎమ్మెల్యేల వసతుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. బుధవారం అసెంబ్లీ లో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్), జి.కిషన్‌రెడ్డి (బీజేపీ), కోవా లక్ష్మి (టీఆర్ఎస్), ఎమ్మెల్సీలు కె.నాగేశ్వర్, పి.సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరుకు చెందిన ఎమ్మెల్యే సి.కె.బాబు ఉంటున్న క్వార్టర్‌ను ఖాళీ చేయాలని కోరిన అసెంబ్లీ సిబ్బందిని బెదిరించి, దుర్భాషలాడారని ఆరోపించారు. వెంటనే సి.కె.బాబు ఉంటున్న ఎంఎస్-2లోని 207 క్వార్టర్‌కు కరెంటును, నీటి సరఫరాను నిలిపేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఎంఎస్-1లో ఉంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలకు క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ ఆంధ్రా సర్కారు నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. ఎంఎస్-2లో ఉంటున్న 15 మంది ఆంధ్రా ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా క్వార్టర్టు ఖాళీ చేయకుంటే కరెంటు, నీటి సరఫరా నిలిపేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలి
-
ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలి
హైదరాబాద్ : వారం రోజుల్లోగా ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ క్వార్టర్స్ అలాట్మెంట్ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ఆదేశించారు. లేకుంటే కరెంట్, నీటి కనెక్షన్లు తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలకు వేర్వేరు క్వార్టర్స్ కేటాయించినా రెచ్చగొట్టే విధంగా ఆంధ్రా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని రామలింగారెడ్డి బుధవారమిక్కడ అన్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోయినా ఇంకా ఆంధ్రుల పెత్తనం కొనసాగుతూనే ఉందని రామలింగారెడ్డి మండిపడ్డారు. -
పేదలందరికీ రేషన్ కార్డులు
పౌర సర ఫరాల శాఖ మంత్రి దినేశ్‌గుండూరావు బనశంకరి : రాష్ట్రంలో నిరుపేదలందరికీ బీపీఎల్ కార్డులు అందించడానికి ప్రభుత్వం కట్టుబడిఉందని పౌర సరఫరాల శాఖా మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ఆదివారం పద్మనాభ నగర నియోజకవర్గ పరిధిలోని యారబ్ న గర్‌లో ముస్లిం మహిళలకు చీరెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు దినేష్ గుండూరావు, రామలింగారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 11 లక్షల మందికి రేషన్ కార్డులు అందజేశామని, మరో వారంలోగా 19 లక్షల మందికి రేషన్ కార్డులు అందించే చర్యలు చేపడతామని దినేష్ గుండూరావు తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నా. కేంద్రంలో అధికార మార్పుతో మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. అనంతరం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ అత్యాచార సంఘటనలకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అనంతరం కేపీసీసీ కార్యదర్శి డాక్టర్ బీ.గుర్రప్పనాయుడు మాట్లాడుతూ... ప్రతి ఏడాది మైనార్టీలకు రంజాన్ మాసం సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ మైనారీటీల పార్టీ అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 5 వేల మందికి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మనాభనగర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, బనశంకరి వార్డు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీపతి, డీసీ.మంజు, నయాజ్‌బాషా, అన్సర్‌పాషా, సయ్యద్‌భక్షి, కోదండరామ్, రాందాస్, వెంకటేశ్, ఇట్టిమడుగు సురేశ్, మహిళా నేతలు ప్రేమా, సులోచనా, శుభా తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం పూర్తి
రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి వెల్లడి సాక్షి, బెంగళూరు : కబ్బన్ పార్క్ నుంచి మహాత్మాగాంధీ రోడ్ (ఎం.జీ రోడ్) వరకు నిర్మిస్తున్న మెట్రో సొరంగ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం నిర్మాణం పూర్తవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. శనివారమిక్కడ మెట్రో రైలు అధికారులతో కలిసి సొరంగ మార్గం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రో సొరంగ మార్గం నిర్మాణంలో ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ట్రాక్ వేసే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తికానున్నాయని, ఏప్రిల్ లేదా మే నెలలో సొరంగ మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ రోడ్ నుంచి బయ్యప్పన హళ్లి, మల్లేశ్వరం నుంచి పీణ్యా మెట్రో రైలు మార్గాలు అందుబాటులోకి రావడంతో వేలాది మంది నగరవాసులకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇక రెండో విడతలోని మెట్రో రైలు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భూ స్వాధీన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యే హ్యారిస్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో కలహం
పేలిన మాటల తూటాలు హరిప్రసాద్‌ను తూర్పారబట్టిన మంత్రి రామలింగారెడ్డి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌లో కలహాలు రేపుతోంది. తాజాగా రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే. హరిప్రసాద్‌ల మధ్య శుక్రవారం మాటల తూటాలు పేలాయి. సహజంగా సౌమ్యుడైన రామలింగా రెడ్డి, హరిప్రసాద్‌ను తూర్పారబట్టారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయా ఇన్‌ఛార్జి మంత్రులు రాజీనామా చేయాలని హరిప్రసాద్ సూచించడంపై రామలింగా రెడ్డి విలేకరుల వద్ద తీవ్రంగా స్పందించారు. శాసన సభ ఎన్నికల్లో ఆయన సోదరుడు, ఆయన నియోజక వర్గంలో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని, హరిప్రసాద్ పేరు ప్రస్తావించకుండా దెప్పి పొడిచారు. ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించిన రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం సాధ్యం కాలేదా అని ఎద్దేవా చేశారు. తాను అధికారానికి అతుక్కుని ఉండబోనని అంటూ ‘అవకాశం ఇస్తే సేవ చేస్తా, లేదంటే ఇంట్లో ఉంటా’ అని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరితే తక్షణమే రాజీనామా చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నామని, దేశంలో ఏ రాష్ర్టంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఉత్తమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కేవలం ఇన్‌ఛార్జి మంత్రులను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, కేపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. -
మరో ఏడాదిలో మెట్రో ఫేజ్1 పూర్తి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, బెంగళూరు : రానున్న ఏడాది సెప్టెంబర్ 15 లోపు నమ్మ మెట్రో ఫేజ్ 1 పనులు పూర్తి అవుతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. 42.3 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణం కోసం మొత్తం రూ. 11,609 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ర్ట రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి విధానసౌధ, హైకోర్టు మధ్య జరుగుతున్న మెట్రో పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం కుమార కృప గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ఫేజ్ 1 పనులు పూర్తి కావాల్సి ఉందని, అయితే సొరంగ మార్గాల తవ్వకంలో ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోదని వివరించారు.72.05 కిలోమీటర్ల పొడవైన మెట్రో పేజ్ 2 పనులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం నుంచి అనుమతి లభించిందని గుర్తు చేశారు. పనులు ప్రారంభించిన ఐదేళ్లలోపు పూర్తి అవుతుందని తెలిపారు. ఇందుకు మొత్తం రూ. 26,105 కోట్లు అవసరమవుతాయని అన్నారు. రాష్ర్టంలోని అన్ని అభివృద్ధి పనులకు స్థానిక ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకూ తావుండదని స్పష్టంచేశారు. ఎలక్ట్రానిక్ సిటీ వరకూ మెట్రో విస్తరణ వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని భేటీ అయ్యేందుకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... మెట్రో ఫేజ్ 2 పనులకు అవసరమైన నిధుల కోసం పన్ను రహిత బాండ్లను వితరణ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరనున్నట్లు చెప్పారు. ఈ విషయంగా తన వంతు సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారని తెలిపారు. -
చెత్తే కదా అని వదిలేస్తే ఊరుకోం!
బెంగళూరు, న్యూస్‌లైన్ : చెత్తను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని బెంగళూరు ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. అంతటితో ఆగకుండా చెత్త తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సంగమిత్రను తాను ఉన్న ప్రదేశం నుంచే సస్పెండ్‌కు గురిచేశారు. అలాగే పాలికె సీనియర్ ఇంజనీర్ నరసింహరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ లింగన్న, ఇంజనీర్ మోహన్ కుమార్‌ను వారివారి మాతృసంస్థలకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉదయం మంత్రి రామలింగారెడ్డి నగరంలోని మెయోహాల్ వద్ద బీబీఎంపీ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా ఆస్టిన్‌టౌన్ చేరుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్రభుత్వ పాఠశాల పక్కనే కుప్పలుతెప్పలుగా పడి ఉన్న చెత్తను చూసి అధికారులపై మండిపడ్డారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న స్థానికులు మాట్లాడుతూ... ఆ ప్రాంతంలో పోగవుతున్న చెత్త వల్ల అనారోగ్యాల పాలవుతున్నట్లు వాపోయారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సంగమిత్రను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు ఇంజనీర్లను వారి మాతృసంస్థలకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ప్రధాన డ్రెయినేజీ వద్దకు చేరుకోగానే అక్కడ వెలువడుతున్న దుర్గంధాన్ని భరించలేక మంత్రితో సహ అధికారులూ ముక్కులు మూసుకున్నారు. ‘ఒక్క నిమిషానికే ఇలా ముక్కులు మూసుకుంటున్నారే... మరీ స్థానికులు ఎలా ఉండగలుగుతున్నారు? మీరే కనుక ఇక్కడ నివాసముండగలరా?’ అంటూ అదికారులను నిలదీశారు. తక్షణమే అక్కడ దుర్గంధం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెత్త తొలగింపులో నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ, ఎమ్మెల్యే హ్యరీష్, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది ఉన్నారు. -
షెడ్యూల్స్ తగ్గిస్తాం
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించం నష్టనివారణ కోసమే ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యమంతో రూ.21.80 కోట్ల నష్టం టోల్ పెంపుతో బీఎంటీసీపై రూ.3.33 కోట్ల భారం మంత్రి రామలింగారెడ్డి వెల్లడి సాక్షి, బెంగళూరు : నష్టాలు తగ్గించుకోవడంలో భాగంగా రోడ్డు రవాణా సంస్థలోని కేఎస్ ఆర్టీసీతో పాటు మిగిలిన మూడు కార్పోరేషన్లలోని బస్సు షెడ్యూల్స్‌ను తగ్గించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎస్ ఆర్టీసీలో ప్రస్తుతం 7,791 షెడ్యూల్స్ ఉన్నాయని, దశల వారిగా ఎనిమిది శాతం షెడ్యూల్స్‌ను తగ్గించే అవకాశం ఉందన్నారు. దీని వల్ల నిర్వహణ వ్యయం తగ్గి సంస్థ నష్టాలు లేని స్థితికి చేరుకునే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్స్ తగ్గించడం వల్ల ప్రజల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కేఎస్ ఆర్టీసీతో సహా అన్ని విభాగాలు లాభాల్లో ఉండేవంటూ ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ హయాంలో ఒక్క కేఎస్ ఆర్టీసీ మాత్రమే రూ.1.74 కోట్లు లాభాల్లో ఉండేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షెడ్యూల్స్, ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం, ఇంధన ధరలు చాలా పెరిగాయన్నారు. ఇక గత ఏడాది జరిగిన తెలంగాణ బంద్ వల్ల సంస్థకు రూ.21.80 కోట్ల నష్టం (కేఎస్ఆర్టీసీ-రూ.10.50 కోట్లు, ఎన్ఈకే ఆర్టీసీ-రూ.6.09 కోట్లు, ఎన్డబ్ల్యూకే ఆర్టీసీ-రూ.5.21 కోట్లు) వాటిల్లిందన్నారు. అందువల్లే 2013-14 ఏడాదికి నష్టం రావచ్చని భావిస్తున్నామన్నారు. సంస్థ మనగడ సాగించాలనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్ చార్జీలు పెంచామని ప్రభుత్వ చర్యలను సమర్థించుకున్నారు. దేవనహళ్లి మార్గంలో టోల్ రూపేణా బీఎంటీసీ రోజుకు రూ.38,430 చెల్లిస్తున్నామన్నారు. టోల్ పెంచడం వల్ల ఈ మొత్తం రూ.1,29,930కు పెరుగుతుందన్నారు. అంటే రోజుకు టోల్ రూపేణ రూ.91,500 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్నారు. దీంతో ఈ ఒక్క మార్గంలో బీఎంటీసీ గత ఏడాదితో పోలిస్తే ఇకపై రూ.3.33 కోట్లు టోల్ రూపేణా ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వివరించారు. ఇక ఈ మార్గంలో కేఎస్ ఆర్టీసీ ఏడాదికి రూ.2.97 కోట్లు చెల్లించనుందన్నారు. ఈ పెంపు వల్ల టికెట్టు ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని భరోసా ఇచ్చారు. -
త్వరలో బస్సు చార్జీలు పెంపు
ఆదాయం జీతభత్యాలకే సరిపోతోంది మంత్రి రామలింగారెడ్డి సాక్షి, బెంగళూరు : ఒకటి రెండు రోజుల్లో కేఎస్ఆర్టీసీ (కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ) తోపాటు ఈశాన్య, వాయువ్య విభాగాల బస్సు టికెట్టు ధరలను పెంచబోతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. ఇంధన, నిర్వహణ వ్యయం పెరుగుతుండటం వల్ల ప్రయాణికులపై భారం వేయక తప్పడం లేదని అన్నారు. బెంగళూరులోని బీఎంటీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు రవాణా సంస్థకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఎక్కువ భాగం సిబ్బంది జీతభత్యాలకు, డీజిల్ కొనుగోలుకు వెచ్చిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే టికెట్టు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. టికెట్టు ధరల పెంపు 7 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చునని ఆయన తెలిపారు. ఇటీవల పెరిగిన బీఎంటీసీ ధరలతో పోలిస్తే త్వరలో పెంచనున్న కేఎస్ఆర్టీసీ టికెట్టు ధరల పెంపు తక్కువని మంత్రి రామలింగారెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చెన్నై, ఢిల్లీ తదితర నగర సిటీ బస్ సర్వీసులతో పోలిస్తే బీఎంటీసీలో మొదటి, రెండు, మూడో స్టేజీ టికెట్టు ధరలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వస్తే పెంచిన ధరలను తప్పకుండా తగ్గిస్తామన్నారు. అత్యవసర ద్వారం లేని వోల్వో బస్సులను సీజ్ చేసి నిర్వాహకుల నుంచి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీన పరుచుకుంటున్నారన్నారు. ఈ బస్సులను అధికారులే గ్యారేజీలకు తరలిస్తున్నారన్నారు. అక్కడ బస్సులకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసిన తర్వాతనే తిరగడానికి అనుమతిస్తామన్నారు. ఈ నిబంధనలు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు రాకపోకలు సాగించే వోల్వో బస్సులకూ వర్తిస్తాయన్నారు. బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీకి సంబంధించిన స్థలా లు, భవనాలు లీజుకు ఇవ్వడంలో అక్రమాల విషయంపై ఇప్పుడే తాను సమాధానం చెప్పలేనని మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసర ద్వారాలు లేని ‘వోల్వో’ల సీజ్
మే 1 నుంచి అమలు.. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఘోర రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అత్యవసర ద్వారాలు లేని వోల్వో బస్సులను నిషేధిస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో వోల్వో బస్సుల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో చాలా మంది అమాయక ప్రయాణికులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు అనేక మార్గదర్శకాలు జారీ చేశామని గుర్తు చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందులో భాగంగా అత్యవసర ద్వారాలు లేని వోల్వో బస్సుల సంచారాన్ని అనుమతించే ప్రసక్తే లేదని, వాటిని సీజ్ చేస్తామని చెప్పారు. బస్సుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు చాలా గడువు ఇచ్చామని తెలిపారు. అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని వోల్వో సంస్థకు కూడా సూచించామని వెల్లడించారు. బస్సుల నిర్మాణ దశలోనే అత్యవసర ద్వారాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కంపెనీలకు సైతం సూచించామని తెలిపారు. లేనట్లయితే అలాంటి బస్సులను ప్రభుత్వం ఇక కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ వోల్వో బస్సులకు అత్యవసర ద్వారాలు లేకుంటే సీజ్ చేస్తామని తేల్చిచెప్పారు. -
ఇక ఎలక్ట్రిక్ బస్సులు
దేశంలోనే తొలిసారిగా.. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా సక్సెస్ అయితే మరిన్ని బస్సులు సాక్షి, బెంగళూరు : నగరంలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశ పెట్టింది. ఇక్కడి శాంతినగర బస్సు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బస్సును మెజస్టిక్-కాడుగోడి మార్గంలో మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడుపుతామన్నారు. రోజుకు ఆరు ట్రిప్పులు చొప్పున ఈ బస్సు రాకపోకలు సాగిస్తుందన్నారు. వోల్వో బస్సు మాదిరే ఇందులో చార్జీలు ఉంటాయన్నారు. అంతకు ముందు మంత్రి బీఎంటీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపోలలో పని చేసే కార్మికుల సెలవుల కోసం నెలకొల్పిన యంత్రాన్ని (లీవ్ మేనేజ్మెంట్ కియోస్క్) ప్రారంభించారు. దీని వల్ల సెలవుల మంజూరు విషయంలో కార్మికులకు వేధింపులు తప్పుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. బస్సు విశేషాలు.. వంద శాతం కాలుష్య రహిత బస్సు (జీరో ఎమిషన్ వెయికల్) బస్సుపై ఉన్న సౌర ఘటకాల ద్వారా కూడా వాహనాన్ని చార్జ్ చేసుకోవచ్చు ఆరు గంటల పాటు చార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు వాహనంలో రెండు సీసీ కెమరాలు డ్రైవర్, కండక్టర్ సహా 31 మంది ప్రయాణించే సదుపాయం -
28 నుంచి ‘పీణ్యా-సంపిగే’ మెట్రో పరుగులు
1 నుంచి ప్రయాణికులకు అనుమతి 10 కిలోమీటర్ల దూరం.. పది స్టేషన్లు తొలుత మూడు బోగీల రైలు ‘స్మార్ట్ కార్డు’ వారికి టికెట్ ధరలో డిస్కౌంట్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి సాక్షి, బెంగళూరు : సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ‘పీణ్యా-సంపిగే’ మార్గంలో మెట్రో సేవలు ఈనెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆ రోజున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించనున్నారు. తర్వాతి రోజు అంటే మార్చి ఒకటి నుంచి ఇందులో ప్రయాణించడానికి ప్రజలకు అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉన్న పీణ్యా-సంపిగే మార్గంలో పది స్టేషన్లు ఉంటాయన్నారు. మొదట ఈ మార్గంలో మూడు బోగీలు గల రైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇందులో సుమారు 975 మంది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి వీలువుతుందని తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల స్పందనను బట్టి బోగీల, సమయం పెంపు విషయమై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే మెట్రో రైలు గరిష్టవేగాన్ని గంటకు 80 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లకు పెంచామన్నారు. ప్రస్తుతం ఓల్వో బస్సులో పిణ్యా నుంచి సంపిగే వరకూ చేరుకోవ డానికి ప్రయాణికులు రూ.45 చెల్లిస్తున్నారన్నారు. అదే సాధారణ బస్సులో రూ.16 వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునే ఈ రెండు మార్గాల మధ్య మెట్రో రైలులో ధరను రూ.23గా నిర్ణయించామని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డు పొందిన ప్రయాణికులకు ప్రయాణ ధరలో 15 శాతం రాయితీ కూడా దొరుకుతుందని తెలిపారు. ఈ మార్గంలోని స్టేషన్లలో వాహనాలకు పార్కింగ్ కల్పించే విషయమై బీబీఎంపీ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అస్కార్ ఫెర్నాండెజ్, మల్లిఖార్జున ఖర్గే, వీరప్పమొయిలీ తదితరులు పాల్గొననున్నారన్నారు. సీఎం సిద్ధరామయ్యతో కలిసి వీరు మెట్రోరైలులో రాజాజీనగర స్టేషన్ నుంచి పిణ్యా వరకూ ప్రయాణించి అక్కడి నుంచి సంపిగే స్టేషన్‌ను చేరుకోనున్నట్లు రామలింగారెడ్డి వివరించారు. -
గడువు లోపు... జీపీఎస్ సాధ్యం కాదు
రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో రాహుల్ రోడ్డు షో రద్దు సాక్షి, బెంగళూరు : ప్రజా రవాణా వ్యవస్థలోని అన్ని వాహనాలకు ఈ నెల 20 లోపు జీపీఎస్(గ్లోబల్ పోజిషన్ సిస్టం) వ్యవస్థను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా రవాణా వ్యవస్థలో బస్సు పాత్ర’ అనే అంశంపై బెంగళూరులో బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో బస్సు, ట్యాక్సీ తదితర ప్రజా రవాణా వాహనాలన్నింటికీ ఈ నెల 20 లోపు జీపీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్రం సూచించిందని గుర్తు చేశారు. అయితే గడువు తక్కువగా ఉండడం వల్ల మరింత సమయం కోరనున్నట్లు తెలిపారు. ఒకవేళ కచ్చితంగా ఏర్పాటు చేయాల్సి వస్తే బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరు, హుబ్లీ-ధార్వాడ నగరాల్లోని వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ కల్పిస్తామని చెప్పారు. రాబోవు బడ్జెట్లో రోడ్లకు ఇరువైపులా శౌచలయాలు, హోటళ్ల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. తరచూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల రాష్ట్ర రవాణా శాఖపై పెనుభారం పడుతోందని చెప్పారు. సగటున నెలకు లీటరు డీజిల్‌కు 60 పైసలు పెరుగుతుండడంతో ఒక్క బీఎంటీసీపై ఏడాదికి రూ. 36 కోట్ల భారం పడుతోందని వివరించారు. బెంగళూరులో రాహుల్‌గాంధీ రోడ్ షో రద్దయిందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. -
ప్రమాదాలలో భార త్ మొదటి స్థానం
స్కూల్ బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం వోల్వో బస్సు యజమానులకు కట్టుదిట్టమైన సూచనలు చేశాం : మంత్రి రామలింగారెడ్డి బెంగళూరు, న్యూస్‌లైన్ : ప్రమాదాలు సృష్టించడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలవడం చాలా బాధాకరంగా ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... గత ఏడాది దేశంలో 34,93,803 ప్రమాదలు జరిగాయని, అందులో 1,38,250 మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. అదే విధంగా అదే ఏడాది కర్ణాటకలో 36,395 ప్రమాదాలు జరిగాయని 8,051 మంది మరణించాని అన్నారు. బెంగళూరు నగరంలో 5,217 ప్రమాదాలు జరిగితే అందులో 767 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి ఎక్కువ వాహనాలు ఉన్న దేశాలలో భారత్ 12వ స్థానంలో ఉందని అన్నారు. అయితే ప్రమాదాలు సృష్టించడంలో కూడా ప్రపంచ దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రమాదాలు తగ్గించడానికి అనేక జాగృతి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రామలింగారెడ్డి చెప్పారు. స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లే వాహనాలలో నియమాలు ఉల్లంఘించే వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని రావాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. ఇటీవల నాలుగు వోల్వో బస్సు ప్రమాదాలు జరిగాయని అన్నారు. వోల్వో బస్సుల లోపాల వలన ప్రమాదాలు జరిగాయా, డ్రైవర్ల నిర్లక్షం కారణంగా ప్రమాదాలు జరిగాయా అని దర్యాప్తు జరుగుతోందన్నారు. వోల్వో బస్సులలో డీజిల్ ట్యాంక్‌లు, ఏసీ మిషన్లు నాసిరకంగా ఉన్నాయని విచారణలో వెలుగు చూశాయని చెప్పారు. వోల్వో బస్సులలో ఎమర్జెన్సీ డోర్లు, వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చెయ్యాలని వోల్వో బస్సు కంపెనీ ప్రతినిధులకు సూచించామని అన్నారు. నియమాలు ఉల్లంఘించి బస్సులు తయారు చేస్తే వాటిని రోడ్డు మీద తిరగడానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి ఇప్పటికే వాహన యజమానులకు 13 షరతులు విధించామని చెప్పారు. షరతులు ఉల్లంఘంచిన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ డోర్లలో ప్రకటనల బోర్డులు ఏర్పాటు చెయ్యడం పూర్తిగా నిషేధించామని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రోడ్డు రావాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అంతా క్షణాల్లోనే....
వచ్చేశాం... అనుకుంటుండగానే ఘోరం హొసకోటె వద్ద ప్రైవేట్ వోల్వో బస్సు బోల్తా ఐదుగురి దుర్మరణం.. మృతులందరూ నెల్లూరు జిల్లా వాసులే 28 మందికి గాయాలు.. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అధికం బాధితులను పరామర్శించిన మంత్రి రామలింగారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా కారణం డ్రైవర్ నిద్రమత్తా..? లేక కుక్కల గుంపా? కాసేపట్లో బస్సు దిగాలి.. బెంగళూరు వచ్చేస్తోందని ప్రయాణికులు అప్పుడప్పుడే నిద్రలోంచి మేల్కొంటున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఒక్క సారిగా.. ధడేల్ మంటూ పెద్ద శబ్ధం.. బస్సు డివైడర్‌ను ఢీకొందంటూ ప్రయాణికుల కేకలు.. అయ్యో.. బస్సు.. ఆపండి అంటూ ఆర్తనాదాలు.. అంతలోనే బస్సు డివైడర్‌పై నుంచి ఎడమ వైపు తిరిగి బోల్తా.. దేవుడా.. కాపాడు అంటూ గావు కేకలు.. అరుపులు, ఆర్తనాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు... సోమవారం తెల్లవారు జామున నెల్లూరు నుంచి బెంగళూరుకు వస్తూ హొసకోటె వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సు వద్ద దృశ్యమిది.. మహబూబ్ నగర్ జిల్లా పాలెం, కర్ణాటకలోని హావేరిలో రెండు వోల్వో బస్సులు దగ్ధమైన ఘటనలు ప్రజల స్మృతి పథం నుంచి చెరిగిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై కలుగుతున్న అనుమానాలకు బలం చేకూర్చింది. కోలారు, న్యూస్‌లైన్ : హొసకోట వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురైందని తెలియగానే అటు నెల్లూరు, ఇటు బెంగళూరు వాసుల్లో కలకలం రేగింది. ప్రమాదానికి కారణం అధిక వేగం అని ప్రయాణికులు ఆరోపిస్తుండగా, కుక్కల గుంపు అడ్డం రావడం వల్లే అదుపు తప్పిందని డ్రైవర్ చెబుతున్నాడు. బెంగళూరుకు చెందిన రాజేశ్ ట్రావెల్స్ బస్సు నెల్లూరులో ఆదివారం రాత్రి పదిన్నర గంటలకు బయలుదేరింది. ఆరు గంటల కల్లా బెంగళూరు చేరుకోవాల్సి ఉంది. బెంగళూరు మరో 25 కిలోమీటర్లు ఉందనగా హొసకోటె వద్ద అదుపు తప్పి మెయిన్, సర్వీసు రోడ్లను వేరు చేసే డివైడర్ పైకి ఎక్కి కొంత దూరం వెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నెల్లూరుకు చెందిన అనూష (24), ప్రదీప్ (28), విజయ్‌కుమార్ (30), ప్రసాద్ (30), మానస్ కుమార్(6)లు మరణించారు. గాయపడిన 28 మందిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మృతుల్లో కూడా ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. సాధారణంగా ఇక్కడి నెల్లూరు జిల్లా వాసులు వారాంతాల్లో శుక్రవారం రాత్రి సొంత ఊర్లకు వెళ్లి.. ఆదివారం రాత్రి తిరిగి బయలుదేరి రావడం పరిపాటి. కేఏ 01 ఏఏ 7709 నంబరు గల ఆ బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న హొసకోటె పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో సమీపంలోని ఎంవిజీ వైద్య కళాశాలకు తరలించారు. పది పదిహేను కుక్కలు హఠాత్తుగా రోడ్డుకు అడ్డం రావడంతో వాటిని తప్పించబోగా బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైందని డ్రైవర్ వెంకటప్ప తెలిపాడు. అప్పుడు బస్సు మామూలు వేగంతోనే నడిపానని చెప్పాడు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. నెల్లూరులో బస్సు బయలు దేరిన సమయంలో తిరుపతికి చెందిన డ్రైవర్ కోదండం డ్రైవింగ్ చేశాడు. చిత్తూరు జిల్లా నేండ్రగుంట వద్ద వెంకటప్ప డ్రైవింగ్ చేపట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను నిద్రిస్తున్నందున, సంఘటన ఎలా జరిగిందో తెలియదని కోదండం తెలిపాడు. డ్రైవర్ నిద్రమత్తుతోనే : పలువురు ప్రయాణికుల ఆరోపణ మితి మీరిన వేగంతో పాటు డ్రైవర్ నిద్రలో జోగినందు వల్లే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. తనను పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి వద్ద నెల్లూరు ప్రయాణికురాలు మస్తానమ్మ ఇదే విషయాన్ని చెప్పింది.ఎంవిజీ వైద్య కళాశాల మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్ను ముట్టాయి. ప్రమాద విషయం తెలియగానే మృతులు, క్షతగాత్రుల బంధువులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నెల్లూరు నుంచి సైతం మధ్యాహ్నం 12 గంటలకు పలువురు వచ్చారు. రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు. క్షత గాత్రులను ఒక్కొక్కరినే పలకరిస్తూఘటనపై ఆరా తీశారు. డ్రైవర్ వెంకటప్ప దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తాను కేవలం 80 కిలోమీటర్ల వేగంతోనే వెళుతున్నానని డ్రెవర్ మంత్రికి తెలుపగా, 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి కదా...అని మంత్రి ప్రశ్నించగా, అతని నోటి వెంట మాట రాలేదు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామని తెలిపారు. బస్సు బీమా నుంచి కూడా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందుతుందన్నారు. కాగా హొసకోటె ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్, బెంగుళూరు రూరల్ ఎస్పీ రమేష్, ఐజీ ఉల్హక్ హుసేన్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎవరూ పట్టించుకోలేదు తమ బస్సు ప్రమాదానికి గురైందని, చనిపోతున్నా తమను ఎవరూ పట్టించుకోలేదంటూ తన కుమారుడు ఫోన్ చేసి చెప్పాడని బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ తండ్రి, నెల్లూరుకు చెందిన నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యాడు. సాధారణంగా తన కుమారుడు బెంగుళూరుకు చేరుకున్న తరువాత ఏడు గంటలకు ఫోన్ చేసే వాడని, ఉదయం అయిదున్నరకే ఫోన్ రావడంతో భయపడుతూ తీశామని, తాము శంకించినట్లే జరిగిందని వాపోయాడు. తన కుమారుడు ప్రమాద విషయం చెప్పిన వెంటనే ఫోన్ ఆగిపోయిందని, తర్వాత తామెంతగా ప్రయత్నించినా అటు వైపు నుంచి సమాధానం రాలేదని తెలిపాడు. భార్యతో కలసి మధ్యాహ్నం ఆయన ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అయిదు నెలల గర్భిణీ అయిన తమ కోడలు అనూష చనిపోయిందని తెలుసుకుని గుండెలవిసేలా విలపించారు. -
సీమాంధ్ర ఎమ్మెల్యేల తీరుపై నిరసనలు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరుపై జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేలు పోటీపడి ముసాయిదా బిల్లును చించివేయడంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినాయకత్వం పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించి సీమాంధ్ర నేతల దుశ్చర్యలను ఎండగట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మెదక్‌లో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి బస్ డిపో వరకు సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో గజ్వేల్‌లో స్థానిక వివేకానంద చౌక్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అందోల్ నియోజకర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య నేతృత్వంలో జోగిపేటలోని హనుమాన్ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు. పటాన్చెరు బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు, సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నారాయణ్‌ఖేడ్‌లో రాజీవ్ చౌరస్తా వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. దుబ్బాకలో స్థానిక బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. -
ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. నాగరభావి రెండవ స్టేజ్‌లో నూతనంగా నిర్మించదలిచిన బస్‌స్టేషన్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి అద్దెకు ఇవ్వడం వల్ల ఆయా సంస్థలకు లాభం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీజిల్ ఖరీదుకు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. బెంగళూరు శివారులో బస్‌స్టేషన్ నిర్మించడానికి అవసరమైన స్థలం లభించే అవకాశం ఉందన్నారు. అయితే బెంగళూరు నగరంలో బస్స్టేషన్లు నిర్మించడానికి అవసరమైన స్థల సేకరణలో పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన తెలిపారు. శంకుస్థాపన జరిగిన పది నెలలల్లోపు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. కళాసిపాళ్య వద్ద అత్యాధునిక బస్‌స్టేషన్‌ను నిర్మించనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు మార్చిలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖలో కింది స్థాయి సిబ్బందిపై కొంతమంది అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో ఉంటూ బస్ ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు కారణమైన డ్రైవర్, కండక్టర్లకు అండగా న్యాయపోరాటం చేయాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని వ ుంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ సత్యనారాయణ, ఉపమేయర్ ఇందిరా, బీఎంటీసీ డెరైక్టర్ అజుమ్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్మాకు ఒకే
అసెంబ్లీలో బిల్లు ఆమోదం.. = అక్రమ సమ్మెలు చేస్తే నాన్-బెయిలబుల్ కేసు = అత్యవసర సేవలు అడ్డుకుంటే వారెంట్ లేకుండా అరెస్ట్ = సమ్మెను ప్రోత్సహించే వారూ శిక్షార్హులే = బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు = పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశముందంటూ విమర్శ = సమ్మె హక్కును కాలరాసేందుకే ఈ బిల్లంటూ ధ్వజం = వాకౌట్ చేసిన జేడీఎస్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రజలకు అత్యవసర సేవలను అందించే క్రమంలో భాగంగా అక్రమ సమ్మెలను నివారించడానికి ఉద్దేశించిన ‘కర్ణాటక అత్యవసర సేవల నిర్వహణ బిల్లు-2013’ (ఎస్మా)కు శాసన సభ బుధవారం ఆమోదం తెలిపింది. బెల్గాంలో శాసన సభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం జేడీఎస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. ఈ బిల్లు ‘అపాయకరమైనది. పోలీసుల అధికారాలను దుర్వినియోగం చేయడానికి ఉద్దేశించినది’ అని ఆ పార్టీ విమర్శించింది. రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి బిల్లును ప్రవేశ పెట్టారు. ఇందులోని ముఖ్యాంశాలను ఆయన వివరిస్తూ, అత్యవసర సేవలకు అడ్డు పడే ఎవరినైనా ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు అరెస్టు చేయవచ్చని వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం నేరాలన్నీ నాన్-బెయిలబుల్ కిందకు వస్తాయని తెలిపారు. సమ్మెను ప్రోత్సహించే వారు కూడా శిక్షార్హులేనన్నారు. ఆరోపణలు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా ఉంటుందని చెప్పారు. అక్రమ సమ్మెలకు ఆర్థిక సాయం అందించడం కూడా శిక్షార్హమేనన్నారు. అక్రమ సమ్మెలను నివారించడానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుత రూపంలోని బిల్లును ప్రతిపక్ష నాయకుడు హెచ్డీ. కుమారస్వామి, జేడీఎస్ సభ్యులు ఎంటీ. కృష్ణప్ప, ఎన్. చెలువరాయ స్వామి, కేఎం. శివలింగే గౌడ, బీజేపీ సభా నాయకుడు జగదీశ్ శెట్టర్, ఆ పార్టీ సభ్యులు విశ్వేశ్వర హెగ్డే కాగేరి, కేజీ. బోపయ్య, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్, బీఎస్ఆర్ సీపీ సభ్యుడు పీ. రాజీవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణప్ప బిల్లు ప్రతులు చించి పైకి విసిరేశారు. ఉద్యోగుల సమ్మె హక్కును ప్రభుత్వం కాలరాయదలచుకుందని దుయ్యబట్టారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ బిల్లు తీవ్ర వ్యతిరేకమని విమర్శించారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని రమేశ్ కుమార్, జగదీశ్ శెట్టర్ డిమాండ్ చేశారు. ఈ బిల్లు ద్వారా పోలీసులకు అపరిమిత అధికారాలు లభిస్తాయని, తద్వారా వారు చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు కార్మిక వ్యతిరేకమైనదని, కనుక ఉపసంహరించుకోవాలని రమేశ్ కుమార్ కోరారు. అయినప్పటికీ రామలింగా రెడ్డితో పాటు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర బిల్లును సమర్థించుకున్నారు. కాగా ఉత్పత్తి, స్టోరేజీ, పంపిణీ, సరఫరా, నీటి పంపిణీ, విద్యుత్, రవాణా సేవలు, సరుకుల రవాణా తదితర రంగాల్లో సమ్మెను ఈ బిల్లు నిషేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 2009లో తీసుకొచ్చిన కర్ణాటక అత్యవసర సర్వీసుల నిర్వహణా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. -
అతివేగమే బస్సు ప్రమాదానికి కారణం: కర్ణాటక రవాణా మంత్రి
కర్ణాటకలోని హవేరి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి గురువారం బెంగళూరులో వెల్లడించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సు 140 -150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు.హవేరి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదం,ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం వద్ద వోల్వో బస్సు అగ్ని ప్రమాదం ఘటనలు ఒకేలా ఉన్నాయని ఆయన చెప్పారు. మృతుల్లో ఒకరు ముంబైకి చెందిన శ్రీరాంగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరమే ప్రమాదం జరిగిన బస్సును కొనుగోలు చేశారని మంత్రి రామలింగారెడ్డి వివరించారు. అయితే ప్రమాదానికి ముందు పెధ్ద శబ్దం వచ్చి, మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అద్దాలు పగుల కొట్టి బయటకు దూకామని ఆ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు వెళ్లడించారు. అయితే తన పాస్‌పోర్ట్, డాక్యుమెంట్స్ కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెట్స్కు చెందిన వోల్వో బస్సు ఈ రోజు తెల్లవారుజామున కునుమళ్లహళ్లి వద్ద వర్దా నది సమీపంలోనిరోడ్డు డివైడర్‌ను ఢీకొంది. అనంతరం టైర్ పేలింది. దాంతో ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ బస్సు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రలును హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
మెజిస్టిక్ టు ఎలక్ట్రానిక్ సిటీ ‘బిగ్ ట్రంక్’ బస్సులు
సాక్షి, బెంగళూరు : మెజిస్టిక్ నుంచి నిత్యం రద్దీగా నడిచే ఎలక్ట్రానిక్ సిటీ, చందాపుర, అత్తిబెలెలకు బీఎంటీసీ సోమవారం 62 ‘బిగ్ ట్రంక్’ బస్సులను ప్రవేశ పెట్టింది. ఇకమీదట ఆ మార్గాల్లో ప్రతి రెండు, మూడు నిమిషాలకో సర్వీసు నడుస్తుంది. ఈ మొత్తం మార్గాన్ని ‘ట్రంక్3’గా వ్యవహరిస్తారు. ఈ మార్గాల్లోని బస్సులను సులభంగా గుర్తు పట్టడానికి వాటిపై 3ఈ (ఎలక్ట్రానిక్ సిటీ), 3సీ (చందాపుర), 3ఏ (అత్తిబెలె) అని పెద్దగా రాసి ఉంటాయి. నగర ప్రాంతాల్లో సంచరించే ఈ బస్సుల ద్వారా గ్రామీణులు సైతం తమ గమ్య స్థానాలను చేరుకోవచ్చు. దీని కోసం ఆయా గ్రామాలకు మరో 40 ఫీడర్ బస్సులను నడపనున్నారు. ఈ బస్సు సర్వీసులు ప్రతి 20 నిమిషాలకొకటి చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కనీస సంఖ్యలో బస్సులను మారడం ద్వారా సులభంగా గమ్య స్థానాలను చేరుకోవడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ వైపు ప్రయాణికులను ఆకర్షించడమే ఈ ప్రాజెక్టు ప్రధానోద్దేశమని బీఎంటీసీ వర్గాలు తెలిపాయి. ఈ బస్సు సర్వీసులు ఉదయం 3.45 గంటల నుంచి రాత్రి 11.45 వరకు నడుస్తాయని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. 4,684 కొత్త బస్సులు విధాన సౌధ ముంగిట సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడంతో పాటు రాష్ర్టంలోని వివిధ నగరాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,919 కోట్ల వ్యయంతో 4,684 కొత్త బస్సుల కొనుగోలు, ప్రాథమిక వసతుల కల్పనకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ఇందులో జెనర్మ్ కింద బెంగళూరు నగరానికి 2,500 బస్సులను ఇవ్వాలని కోరామని తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.2,063 కోట్లు, వర్క్‌షాపులు, బస్టాండ్లు, బస్సు డిపోల నిర్మాణానికి రూ.856 కోట్లు వ్యయం కాగలదని ఆయన అంచనా వేశారు. బెంగళూరు నగరంలో సుమారు 2,400 బస్సు రూట్లు ఉన్నాయని తెలిపారు. సియోల్ (500 రూట్లు), లండన్ (700 రూట్లు), షాంఘై (1000 రూట్లు)తో పోల్చుకుంటే ఇదెంతో ఎక్కువని ఆయన చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, బీఎంటీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీఎంటీసీ బస్సులో సీసీ కెమెరాలు ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్న బీఎంటీసీ అధికారుల అందులో మొదటి అడుగు వేశారు. బీఎంటీసీ బస్సుల్లో సీసీ కెమరాలు అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిగ్ట్రంక్ బస్సుల్లో మొదటి వీటిని అమర్చి అందులోని లోపాలను సవరించి మిగిలిన వాటన్నింటిలో ప్రవేశపెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించిన బస్సులో మాత్రమే సీసీ కెమరా ఏర్పాటు చేయడం మిగిలిన ఏ ఒక్క బస్సులో కూడా సీసీ కెమెరా లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కనీసం 10 వాహనాల్లోనైనా ఈ ఏర్పాటు చేస్తే లోపాల అధ్యయనం శాస్త్రీయంగా సాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.