
సాక్షి, బెంగళూరు: సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ హంతకుల ఆచూకీ తెలిసిందని, అతి త్వరలోనే నిందితులను అరెస్టు చేయనున్నట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి తెలిపారు. శనివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే..
- గౌరి హంతకులు ఎవరనేది తెలిసింది. కొన్ని వారాల్లో నిందితులను అరెస్టు చేయటం తథ్యం. హంతకుల వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా తెలుసుకున్నాం.
- పదే పదే గొడవలకు దిగే గూండాలు, పోకిరీలతో పాటు సమాజ విద్రోహ శక్తులను నిర్దాక్షిణ్యంగా గూండాచట్టం కింద అరెస్ట్ చేసి ఆటకట్టించాలని, రాష్ట్రం నుంచి బహిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు 30 అంశాల కార్యక్రమాన్ని పోలీసులకు అందజేశాం.
- మహిళా కాలేజీలు, స్కూళ్ల వద్దగూండా కార్యకలాపాలు కనిపిస్తే వాటిని అంతం చేయాలి.మహిళలకు తగిన రక్షణ క ల్పిం చాలని సూచించాం. ఆఫ్రికా,నైజీరి యా తదితర దేశాల విద్యార్థులు నగరంలో పా ల్పడుతున్న అల్లరి చేష్టలను అరికట్టాం.
- యువకులను తప్పుదారి పట్టిస్తూ గంజాయి, హఫీమ్ తదితర మాదక వస్తువుల సరఫరా చేస్తున్న వారిపై నిఘా వహించాలని ఆదేశించాం. నేను మృదు స్వభావం కలిగిన వ్యక్తినే అయినా అవసరమైనపుడు కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనుకంజ వేయను. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు.
నెంబర్‌వన్ కావాలనుకోవడం లేదు
- ప్రభుత్వంలో నేను నెంబర్ వన్ కావాలనుకోవడం లేదు. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నవారే కొనసాగుతారు.
- నా కుమార్తెకు మొదటి నుంచి సామాజి క సేవలో చాలా ఆసక్తి ఉండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చినట్లయితే పోటీ చేస్తుంది. లేనిపక్షంలో కాంగ్రెస్ అ భ్యర్థి గెలుపునకు శ్రమిస్తారు. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి రాకూడదనే నిబంధన ఎక్కడా లేదు. అన్ని రాజ కీయ పార్టీల్లో నాయకుల పిల్లలు ఉన్నారన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు.
- టిప్పు జయంతిని జరగనివ్వరాదని బీజేపీ నాయకులు రాజకీయ స్వార్థంతో వ్యతిరేకించారు. అయితే వారు అధికారంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, సదానందగౌడ, ఆర్.అశోక్ తదితరులు టిప్పు సుల్తాన్ కండువా వేసుకొని టిప్పు జయంతిని ఆచరించటాన్ని మరచిపోయారు. టిప్పు జయంతికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వారికి నైతిక హక్కు లేదు.
- మా శాఖలో అవినీతి అక్రమాల నివారణకు అన్ని విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసు సంక్షేమ నిధిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణపై పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
బెంగళూరులోనూ సరి– బేసి పరిశీలన
వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీలోని సరి– బేసి వాహన విధానాల్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. డిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చే విధానం సక్సెస్ అయితే బెంగళూరులోనూ పాటిస్తామని చెప్పారు. బెంగళూరులో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది, దీంతో వాయు మాలిన్యమూ పెరుగుతోంది, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్నారని రామలింగారెడ్డి ఆరోపించారు. తమ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సదాశివ శెణై, ఉపాధ్యక్షుడు దొడ్డ బొమ్మయ్య, ప్రధానకార్యదర్శి కిరణ్, కోశాధికారి రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment