- పౌర సర ఫరాల శాఖ మంత్రి దినేశ్‌గుండూరావు
బనశంకరి : రాష్ట్రంలో నిరుపేదలందరికీ బీపీఎల్ కార్డులు అందించడానికి ప్రభుత్వం కట్టుబడిఉందని పౌర సరఫరాల శాఖా మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ఆదివారం పద్మనాభ నగర నియోజకవర్గ పరిధిలోని యారబ్ న గర్‌లో ముస్లిం మహిళలకు చీరెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు దినేష్ గుండూరావు, రామలింగారెడ్డి పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 11 లక్షల మందికి రేషన్ కార్డులు అందజేశామని, మరో వారంలోగా 19 లక్షల మందికి రేషన్ కార్డులు అందించే చర్యలు చేపడతామని దినేష్ గుండూరావు తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నా. కేంద్రంలో అధికార మార్పుతో మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.
అనంతరం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ అత్యాచార సంఘటనలకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అనంతరం కేపీసీసీ కార్యదర్శి డాక్టర్ బీ.గుర్రప్పనాయుడు మాట్లాడుతూ... ప్రతి ఏడాది మైనార్టీలకు రంజాన్ మాసం సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ మైనారీటీల పార్టీ అని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా దాదాపు 5 వేల మందికి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మనాభనగర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, బనశంకరి వార్డు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీపతి, డీసీ.మంజు, నయాజ్‌బాషా, అన్సర్‌పాషా, సయ్యద్‌భక్షి, కోదండరామ్, రాందాస్, వెంకటేశ్, ఇట్టిమడుగు సురేశ్, మహిళా నేతలు ప్రేమా, సులోచనా, శుభా తదితరులు పాల్గొన్నారు.