సాక్షి, బెంగళూరు: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. నాగరభావి రెండవ స్టేజ్‌లో నూతనంగా నిర్మించదలిచిన బస్‌స్టేషన్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి అద్దెకు ఇవ్వడం వల్ల ఆయా సంస్థలకు లాభం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీజిల్ ఖరీదుకు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. బెంగళూరు శివారులో బస్‌స్టేషన్ నిర్మించడానికి అవసరమైన స్థలం లభించే అవకాశం ఉందన్నారు. అయితే బెంగళూరు నగరంలో బస్‌స్టేషన్‌లు నిర్మించడానికి అవసరమైన స్థల సేకరణలో పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన తెలిపారు.
శంకుస్థాపన జరిగిన పది నెలలల్లోపు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. కళాసిపాళ్య వద్ద అత్యాధునిక బస్‌స్టేషన్‌ను నిర్మించనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు మార్చిలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖలో కింది స్థాయి సిబ్బందిపై కొంతమంది అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
ఈ విషయమై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో ఉంటూ బస్ ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు కారణమైన డ్రైవర్, కండక్టర్లకు అండగా న్యాయపోరాటం చేయాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని వ ుంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ సత్యనారాయణ, ఉపమేయర్ ఇందిరా, బీఎంటీసీ డెరైక్టర్ అజుమ్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం
Published Mon, Dec 16 2013 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement