Complex
-
జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్ఐ సర్వేలో వెల్లడి!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్‌ఫారమ్ కింద, ప్లాట్‌ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉంది. వీటిని మూసివేశారు. ప్లాట్‌ఫారమ్‌కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉన్నాయి. ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేసివున్నాయి. నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్‌ఫారమ్‌కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్ల రెండు వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి రెండు మీటర్ల వెడల్పు కలిగివుంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి. బేస్మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్‌లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని జీపీఆర్ చూపించింది. ఏఎస్ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్‌తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది. -
చైనాలో అగ్ని ప్రమాదం.. 39 మంది బలి
బీజింగ్/నాన్‌చాంగ్: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం ఒక దుకాణసముదాయంలో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్జిన్యూ నగరంలోని ఈ భవన సమదాయంలో ఇంకా కొందరు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక గ్జియాన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. -
రీ డెవలప్ చేసిన ఐఈసీసీ ఆవిష్కారం: అద్బుతమైన ఫోటోలు
-
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే!
సాక్షి సికింద్రాబాద్: ప్రమాదాలు జరిగినపుడు హడావుడి చేసే ప్రజాప్రతినిధులు.. అధికారులు తూతూమంత్రంగా చేపట్టే చర్యలు.. వెరసి అభాగ్యుల ఉసురు తీస్తోంది. గత జనవరిలో డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదాన్ని మరువకముందే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అలాంటి ఘటనే పునరావృతమైంది. భారీ అగ్ని ప్రమాదం బతుకు దెరువు కోసం ఆ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఆరుగురి ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపింది. నిండా పాతికేళ్లు కూడా లేని వారి జీవితాలను అర్థాంతరంగా ముగించింది. పని కోసం పట్నం వెళ్లిన తన బిడ్డలు ఎప్పుడు వస్తారా? అని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. అతికష్టమ్మీద గ్రిల్స్ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ అయిదుగురిని బయటికి తీసుకువచ్చారు. వీరికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే వీరు అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ సైతం కన్నుమూశాడు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారని వైద్యులు తెలిపారు. మృతుల వివరాలు ఇవే.. ►సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సురేష్ నగర్ గ్రామానికి చెందిన కె.ప్రమీల (22) మృతిచెందడంతో సురేష్ నగర్ గ్రామంలో విషాదచయలు అలుముకుంది. ప్రమీల ఈ కామర్స్ సంస్థలో పని చేస్తుంది. ► మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు ప్రశాంత్ (23) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ► వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ శ్రావణి(22) మృతి చెందింది. ఆమె ఈ కామర్స్ సంస్థలో పని చేస్తుంది. కూతురు మరణ వార్త విని ఆ తల్లిందండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రావణి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తుంటారు. ► వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల(22) మృతి చెందింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని ఐదవ అంతస్తులో ఉన్న కామర్స్ కాల్ సెంటర్లో వెన్నెల ఉద్యోగం చేస్తుంది. ►అగ్ని ప్రమాదంలో ఉప్పుల శివ (22) ఊపిరి ఆడక మృతి చెందాడు. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు, రజిత కుమారుడు శివ 2 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి రాజు వ్యవసాయం,తాపీ మేస్త్రి గా పనిచేసుకుంటున్నాడు. ►ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్థేపల్లి గ్రామనికి చెందిన రామారావు కుమార్తె త్రివేణి (22) అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గేలి చేయడం హింసే: దర్శకుడు
గేలి చేయడం కూడా హింసే అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందిస్తున్న చిత్రం ‘కాంప్లక్స్’ అని ఆ చిత్ర దర్శకుడు మంత్ర వీరపాండియన్ తెలిపారు. దీని గురించి ఆయన తెలుపుతూ ఇంజినీరింగ్ చదివిన తాను విదేశాలలో మంచి ఉద్యోగం చేసుకుంటూ సినిమాపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చానన్నారు. పలు షార్ట్ ఫిల్మ్ చేసిన తాను, దర్శకుడు బాలా వద్ద నాచియార్, వర్మ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశానన్నారు. ఆ తరువాత ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో ప్రముఖ నటీనటులతో చిత్రం చేసే అవకాశం వచ్చిందన్నారు. అయితే అంతకు ముందు కాంప్లక్స్ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. మనిషి రూపాన్ని చూసి అతని ప్రతిభను అంచనా వేయరాదని చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. అలాగే ఇతరుల రూపాన్ని పరిహాసం చేయడం కూడా హింసే అవుతుందని ఈ చిత్రం ద్వారా చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పాత్రలకు తగిన ఆర్టిస్టులను ఎంపిక చేసి నటింప చేసినట్లు చెప్పారు. ఆ విధంగా నటుడు వెంకట్ సెంగుట్టవన్, నటి ఇవన ఇందులో హీరో హీరోయిన్లుగా నటించినట్లు చెప్పారు. దీనికి కార్తీక్ రాజా సంగీతాన్ని అందించారని, షూటింగ్‌లు పూర్తి చేసి ఆయనకు చూపించగా చాలా బాగుందని అభినందించడంతో పాటు నాలుగు చక్కని పాటలను ఇచ్చారని తెలిపారు. చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం
-
గుంటూరు నడిబొడ్డున రూ.130 కోట్లతో నాయుడు కాంప్లెక్స్
సాక్షి, నెహ్రూనగర్: గుంటూరు నగరం నడిబొడ్డున పీవీకే (పి.వెంకట కృష్ణమనాయుడు) నాయుడు కాంప్లెక్స్ నిర్మాణానికి బీజం పడింది. రూ.130 కోట్లతో అత్యాధునిక హంగులతో జీ ప్లస్ 8తో పాటు రెండు సెల్లార్ల (పార్కింగ్)తో భవన సమూదాలకు సంబంధించిన ప్లాన్లకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో డీఎంఏ ఎంఎం నాయక్, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, నగర కమిషనర్ చల్లా అనూరాధ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ దాసరి శ్రీనివాసరావు, ఇన్చార్జి సీపీ హిమబిందుతో కలిసి పీవీకే నాయుడు మార్కెట్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీవీకే నాయుడు మార్కెట్‌కు ఘన చరిత్ర పి.వెంకట కృష్ణమనాయుడు (పీవీకే నాయుడు) 1945లో సుమారు ఎకర 60 సెంట్ల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు ఉచితంగా అందజేశారు. సదరు ప్రాంతంలో నగరపాలక సంస్థ షాపులు నిర్మించి వ్యాపారస్తులకు అద్దెకు ఇచ్చి వారి నుంచి అశీలు రూపంలో ఏడాదికి సుమారు రూ.20 లక్షలు వసూలు చేసేది. భవనం శిథిలావస్థకు చేరడంతో 2015లో పీవీకే నాయుడు మార్కెట్‌ను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో భేటి అయిన డీఎంఏ ఎంఎం నాయక్, నగర మేయర్ కావటి, నగర కమిషనర్ అనూరాధ, నగరపాలక సంస్థ అధికారులు కాంప్లెక్స్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ జీ ప్లస్ 8తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ (ఉచితంగా)తో పాటు 11 శ్లాబులతో ఈ కాంప్లెక్ నిర్మాణానికి అవసరమైన నమూనాను ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏసెట్ మేనేజ్మెంట్ లిమిటెట్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. వ్యాపారస్తులకు రెండు ఫ్లోర్లు గతంలో పీవీకే నాయుడు మార్కెట్లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు నూతనంగా నిర్మించే కాంప్లెక్స్‌లో రెండు ఫ్లోర్లు కేటాయించనున్నారు. మిగిలిన ఫ్లోర్లలో నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు ఇవ్వనున్నారు. ఒక్కో ఫ్లోర్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, మొత్తం 11 శ్లాబులకు కలిపి 5 లక్షలకు పైచిలుకు చదరపు అడుగుల విస్తీర్ణంలో కాంప్లెక్స్ నమూనాకు మంత్రి ఆమోదం తెలిపారు. -
సీబీఐ ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లోధిరోడ్‌లో ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బిల్డింగ్‌లోని, సీజీఓ కాంప్లెక్స్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కాగా, వెంటనే 6 ఫైరింజన్లు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. ఈ ప్రమాదం ఉదయం 11 తర్వాత జరిగిందని భావిస్తున్నారు. అయితే, మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్ అధికారి తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. ప్రమాదం తెలిసిన వెంటనే.. పెద్ద ఎత్తున పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, సీజీఓ కాంప్లెక్స్‌లోని సెకండ్ బేస్‌లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘పని 24 గంటలు.. జీతం 12 గంటలకే’
లక్నో: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ వాసులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సూపర్‌టెక్ ఎకోజోన్ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తికి సోమవారం కరోనా పాజిటీవ్‌గా తెలీంది. దాంతో పోలీసులు ఆ కాంప్లెక్స్‌ను సీల్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు, అపార్ట్మెంట్ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కరోనా బయటపడిన ఇంటిని మాత్రమే సీల్ చేయాల్సిందిగా అపార్ట్మెంట్ వాసులు పోలీసులను కోరారు. తాము పని చేస్తున్న కంపెనీలు తిరిగి తెరిచారని.. ఆఫీసులకు వెళ్లకతప్పదని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ('రథయాత్ర 'ఏమవుతుందో ఏమో...!) అపార్ట్‌మెంట్‌వాసులకు నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ‘మీకు ముందు మేము ఉన్నాం. మేం మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం. ఇది ప్రభుత్వ ఉద్యోగం. మేం 24 గంటలు పని చేస్తున్నాం.. కానీ మాకు 12 గంటలకే జీతం ఇస్తారు. అయినా మేం ప్రజల కోసం పని చేస్తున్నాం. ఒక వేళ మీరు గొడప పడాలనుకుంటే రండి’ అంటూ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల మాటలతో జనాలు శాంతించారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ పూర్తిగా సీల్ చేయబడింది. -
‘అనసూయ’ను కూల్చరా?
హిమాయత్‌నగర్: రహదారుల విస్తరణలో భాగంగా హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న అనసూయ కాంప్లెక్స్‌ను దాదాపు 15 ఏళ్ల క్రితమే కూల్చాల్సి ఉంది. అయితే అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప కూల్చాలని ఆలోచించడం లేదు. వంద అడుగుల మేర రోడ్డు విస్తరణకు అప్పట్లో ఎన్నో భవనాలను కూల్చివేసిన అధికారులు ఈ భవనం ముందుభాగాన్ని అంటే....దాదాపు 180 చదరపు గజాల మేర కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. కొద్దిమేర కూల్చివేతలు జరిపాక ఎందుకనోగానీ ఆపివేశారు. ప్రస్తుతం భవనంలో కూల్చిన ఫ్లోర్ల నుంచి పెచ్చులూడిపడుతున్నాయి. ఈ రహదారిలో ఇక్కడే రోడ్డు విస్తరణ జరగకపోవడంతో బాటిల్‌నెక్‌గా మారి తరచూ ట్రాఫిక్ ఇబ్బందులెదురవుతున్నాయి. ఏ క్షణాన్నయినా కూలడానికి సిద్ధంగా ఉన్న ఈభవనం కూలితే పెనుప్రమాదానికి అవకాశం ఉంది. ఈ విషయాల్ని వివరిస్తూ భవనంలోని ఫ్లాట్ల యజమానులు కూల్చివేయాల్సిందిగా ఎన్ని పర్యాయాలు జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేరు. రహదారి విస్తరణకోసం ఎప్పుడో కూల్చివేయాల్సిన ఈభవనాన్ని ఇంకా ఎందుకు కూల్చడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. భయం.. భయం.. తిరుమల తిరుపతి దేవస్థానం కాంప్లెక్స్‌కు ఎదురుగా అనసూయ కాంప్లెక్స్ ఉంది. ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడంతో లిబర్టీ వద్ద రెడ్ సిగ్నల్ పడ్డా ఇక్కడి వరకు వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. కాంప్లెక్స్‌లోని కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉన్నప్పటికీ, ఆ పనిచేయకపోవడంతో బాటిల్‌నెక్‌గా మారిన ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారి సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం పెచ్చులూడి రాలుతున్నాయి. లిబర్టీ వద్ద రెడ్ సిగ్నల్ పడితే స్ట్రీట్‌నెంబర్1 వరకు ట్రాఫిక్ బారులు తీరుతూ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బిల్డింగ్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణికులపై పెచ్చులు ఊడి పడుతున్నాయని బిల్డింగ్ యజమానులు వాపోతున్నారు. పెచ్చులు ఊడి పెద్ద ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూల్చమని కోరుతూనే ఉన్నాం లిబర్టీ వద్ద రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అనసూయ కాంప్లెక్స్ ఈ రోడ్డుపై బాటిల్‌నెక్‌గా మారడంతో వేలాది వాహనాలు ఇక్కడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. కూల్చాల్సివున్న ఈ భవనాన్ని కూల్చితే ట్రాఫిక్ సమస్యకు ఆటంకం ఉండదని ఇప్పటికీ కోరుతూనే ఉన్నాం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ముందుకొచ్చి సమస్యను పరిష్కరిస్తే ప్రయోజనం ఉంటుంది. – విద్యాసాగర్, ట్రాఫిక్ ఏసీపీ, సెంట్రల్‌జోన్ పరిశీలించిన అనంతరం కూల్చివేత ఈ భవనానికి సంబంధించిన సమస్యపై ఒక్కసారి ఫైల్ మొత్తాన్ని పరిశీలించి త్వరతగతిన కూల్చిందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఏ ఒక్కదాన్ని మేం ప్రోత్సహించేది లేదు. ఒకవేళ ఈ భవనానికి సంబంధించిన ఏవైనా ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని సరి చేసి మరీ బిల్డింగ్‌ను కూల్చివేస్తాం.– కరుణాకర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ, జీహెచ్ఎంసీ -
ఆంధ్రుల అనర్ఘరత్నం
‘ఇది చాలా విచిత్రమైన యుద్ధం. ఆంధ్రరత్న ప్రజలందరినీ కూడగట్టుకొని, చీరాల ప్రాంతాన్ని మునిసిపాలిటీగా రూపొందిస్తే ఆ గ్రామాన్ని పూర్తిగా విసర్జించి, వేరే తావులకు వలసగా వెడలి పోతామని తెలియచేశాడు. ఇది నిజంగా చాలా బ్రహ్మాండమైన ప్రయత్నం. చీరాల–పేరాల ప్రజలు పదిహేడువేల మందికి పైగా ఉన్నారు. వారందరినీ ఒక త్రాటి మీద నిలబెట్టి, వారి చేత తరతరాలుగా వారు వుంటూ వున్న ఇళ్లనీ, వాకిళ్లనీ విడిచి పెట్టించి వారిని రామనగరు పరిసర ప్రాంతాలకు తీసుకుని పోవడం అంటే మాటలా?’టంగుటూరి ప్రకాశం ఆత్మకథ ‘నా జీవితయాత్ర’లో కనిపించే మాటలివి. అది విచిత్ర యుద్ధమే. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు గ్రామాల ప్రజలని ఊరి బయట కాపురం పెట్టించడం చరిత్రలో ఎక్కడోగాని కనిపించదేమో! పాతిక మందో ముప్పయ్ మందో కాదు. వందో రెండు వందల మందో కూడా కాదు. దాదాపు 17 వేల మంది. పదకొండు మాసాలు ఊరి బయట వేసుకున్న పందిళ్లలో, గుడిసెలలో నివాసం ఉన్నారు. ఆ సంవత్సరమే దారుణంగా ఎండలు కాశాయి. కక్ష కట్టినట్టు కుంభవృష్టులు కురిపించడానికి వానదేవుడు కూడా ఆ సంవత్సరాన్నే ఎంచుకున్నాడు. వృద్ధులు, పసివారు, బాలలు, మహిళలు, వారిలో గర్భిణులు – అంతా ఒక దీక్షతో ఆ ఇక్కట్లను ప్రేమించారు. ఊరి చివరి ఇసుక పర్రలలో పాములు, మండ్రగబ్బలు, జెర్రులతో సహజీవనం చేశారు. అన్ని వేలమందిలో ఉద్యమ స్పూర్తిని నిలబెట్టడం ఎంత కష్టం! ఆ పని చేసినవారే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన బిరుదు ‘ఆంధ్రరత్న’. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (జూన్ 2,1889–జూన్ 10, 1928) కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో పుట్టారు. తండ్రి కోదండరామస్వామి ఉపాధ్యాయుడు. తల్లి సీతమ్మ. కొడుకును కన్న మూడో రోజునే ఆమె కన్నుమూశారు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన కూడా రెండేళ్లు తిరక్కుండానే చనిపోయారు. అప్పుడు పినతండ్రి, నానమ్మలు గోపాలకృష్ణయ్యను పెంచి పెద్ద చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ వెంటనే బాపట్ల తాలూకా కార్యాలయంలో గుమాస్తాగా చేరారు. గోపాలకృష్ణయ్య గొప్ప స్వేచ్ఛాప్రియుడు. ఆ స్వేచ్ఛాప్రియత్వం ఆయన ఉద్యోగ జీవితం తొలి నాళ్లలోనే బయటపడింది. ‘ఈ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయడం కంటే వీధుల్లో ముష్టెత్తుకు బతికితే బావుంటుంది. ఇదంతా గానుగెద్దు జీవితం. ఏ రోజూ ఉత్సాహమన్నది కనిపించదు. స్వేచ్ఛ లేదు. చొరవ తీసుకునే స్వాతంత్య్రం అంతకంటే లేదు. నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. పై చదువులు చదవాలని అనుకుంటున్నాను. దయచేసి ఇందుకు అనుమతించవలసింది అంటూ ఆయన పినతండ్రికి ఒక ఉత్తరం రాశారు. అందుకు పినతండ్రి ఒప్పుకున్నారు. అలా గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివారు. తరువాత తన మిత్రుడు నడింపల్లి నరసింహారావు చేయూతతో స్కాట్లండ్‌లోని ఎడిన్» రో వెళ్లి చరిత్ర, అర్థశాస్త్రాలలో ఎంఎ చదువుకుని, ఐదేళ్ల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చేశారు. రాజమండ్రి ఉపాధ్యాయ కళాశాలలో ఆచార్యునిగా నియమితులయ్యారు. అప్పుడు అక్కడ ఆర్ డబ్లు్య రాస్ ప్రిన్సిపాల్. అతడి నిరంకుశత్వానికి ఎదురు తిరిగి, ఉద్యోగానికి రాజీనామా చేసి, మచిలీపట్నం జాతీయ కళాశాలలో చేరారు. అప్పుడే అనీబిసెంట్ నాయకత్వంలో హోంరూల్ ఉద్యమం ఆరంభమైంది. 1903లోనే గోపాలకృష్ణయ్యకు, దుర్గాభవానికి వివాహం జరిగింది. బందరులో ఉండగానే ఆమెకు ఆరోగ్యం పాడయింది. దీనితో ఆమె కోలుకోవడం కోసం ఎంచుకున్న ప్రదేశమే చీరాల. ఆయన కుటుంబంతో చీరాలలో అడుగు పెట్టే సమయానికి భార్యకు వైద్యం చేస్తున్న వైద్యుడు తప్ప మరొకరు తెలియదు. కానీ కొద్దికాలానికే చీరాల వాసులే కాక, పక్కనే ఉన్న పేరాల ప్రజలు కూడా ఆయన మాట చెబితే ఏం చేయడానికైనా సిద్ధమయ్యారు. గోపాలకృష్ణయ్య బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలలో అభినివేశం ఉండేది. పాఠశాలలో ఉండగానే జాతీయ నాట్యమండలి పేరుతో ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించారు. ఆంధ్ర విద్యాపీuŠ‡ గోష్టి పేరుతో ఒక సాహిత్య సంస్థను కూడా స్థాపించారు. ఇవన్నీ జాతీయోద్యమ వేడిలో ఆయన జీవితం నుంచి మెల్లగా తప్పుకున్నాయి. ఎడిన్‌బరోలో ఆయన సహాధ్యాయుడు ఆనందకుమారస్వామి. నందికేశ్వరుడు రచించిన ‘అభినయ దర్పణం’ సంస్కృత గ్రంథాన్ని ఆనందకుమారస్వామి వంటి కళామర్మజ్ఞుడి ప్రోత్సాహంతో గోపాలకృష్ణయ్య ఆంగ్లంలోకి (మిర్రర్ ఆఫ్ గెస్చర్స్) అనువదించారు. దీనిని 1917లో కేంబ్రిడ్జ్–హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది కూడా. వీటన్నిటికీ తోడు సంగీతం తెలుసు. పాటలకు, పద్యాలకు బాణీలు కట్టడంతో పాటు, కమ్మగా పాడడం కూడా వచ్చు. వీటన్నిటి సమ్మేళనమనిపించే రీతిలో ఉండే ఆయన ఉపన్యాసాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. ‘సాధన’ పేరుతో ఒక సాహిత్య పత్రికను కూడా ఆయన వెలువరించేవారు. వీటికి తోడు గోపాలకృష్ణయ్యకు గొప్ప హాస్యచతురత ఉండేది. ఆయన విసిరిన చెణుకులు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. అందుకే ఆయన ప్రజలను అలవోకగా ఆకర్షిస్తూ ఉండేవారు. గాంధీజీ రాజకీయ సిద్ధాంతాలు, పంథా భారత స్వాతంత్య్రోద్యమంలోని ఒక దశను విశేషంగా కదిలించాయి. అనేకమంది ఆ పంథా వైపు మళ్లారు. అది 1920 ప్రాంతం. అహింసతో ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవడం గాంధీజీ సిద్ధాంతంలో ప్రధానమైనది. గాంధీజీ ప్రవేశించిన తరువాత వేసిన తొలి రాజకీయ అడుగు సహాయ నిరాకరణోద్యమం. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం ఇందులో ఒకటి. గోపాలకృష్ణయ్య కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఇదంతా 1920 నాగ్‌పూర్ కాంగ్రెస్ సమావేశాలలో గాంధీజీ రూపొందించారు. ఈ అంశం గురించే తెలుగు ప్రాంతమంతా తిరుగుతూ ప్రచారం చేసి, ఒక సంవత్సరం పాటు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి గోపాలకృష్ణయ్య. ఖద్దరు పంచె, కండువా, తలపాగాతో, మెడలో రుద్రాక్షమాలతో సదా కనిపించేవారాయన. ఇలాంటి నేపథ్యంలోనే సరిగ్గా పన్నులకు సంబంధించిన సమస్యే ఆనాడు చీరాలకు ఎదురయింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలలో ఉన్న చీరాల–పేరాల గ్రామాలను (ఆనాడు గుంటూరు జిల్లా) కలిపి మునిసిపాలిటీగా రూపొందించాలని బ్రిటిష్ కనుసన్నలలో నడిచే జస్టిస్ పార్టీ ప్రభుత్వం 1920లో నిర్ణయించింది.పానగల్లు రాజా రామరాయణం నాయకత్వంలో ఈ ఆలోచన రూపుదిద్దుకుంది. ఇందుకు ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. మునిసిపాలిటీ హోదా లేని కాలంలో అక్కడ వచ్చే పన్ను మొత్తం రూ. 4,000. కానీ మునిసిపాలిటీగా మారిస్తే పన్నుల రూపంలో రూ. 40,000 వసూలు చేయవచ్చు. కానీ సౌకర్యాలేమీ అదనంగా చేకూరవు. అయితే అక్కడ ఉన్నవారంతా చేనేత కార్మికులు, సాధారణ రైతులే. అందుకే వ్యతిరేకించారు. అయినా మునిసిపాలిటీ ఏర్పాటయింది. ప్రజలు కౌన్సిలర్లుగా ఎంపికై కూడా పదవులుకు రాజీనామాలు ఇచ్చారు. పెరిగిన పన్నులకు వ్యతిరేకంగా పురుషులతో పాటు ఆనాడే మహిళలు కూడా ఉద్యమంలోకి దిగారు. ఒక మహిళ అరెస్టయ్యారు కూడా. ఆమె జైలుకు కూడా వెళ్లివచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. అప్పుడే బెజవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన గాంధీజీ చీరాలను సందర్శించారు. ఈ అంశం గురించే గోపాలకృష్ణయ్య గాంధీజీ దృష్టికి తీసుకువెళ్లారు. గాంధీజీ రెండు మార్గాలను సూచించారు. ఒకటి– అహింసా మార్గంలోనే పన్నుల చెల్లింపు నిరాకరణోద్యమం నడిపించడం. రెండు అసలు ప్రజలంతా సామూహికంగా ఆ రెండు ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్లిపోవడం. గోపాలకృష్ణయ్య రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలంతా ఆయన మాటను తుచ తప్పకుండా మన్నించిన తీరు కూడా అద్భుతమనిపిస్తుంది. ‘చీరాల–పేరాల ఉదంతం ఆ ప్రాంతానికి చెందిన సమస్య అయినా, దాని చండ ప్రభావం వల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని మేటి ఉదంతంగానూ రూపొందడం చేత, అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది. ‘ఆ పోరాటం ముమ్మరంగా సాగుతూన్న రోజులలో నేను చీరాల ప్రాంతానికి వెళ్లాను. అచ్చట∙ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఆ గ్రామాలకు చెందిన యావత్తు బీదాసాదా, ముసలీ ముక్కీ, బ్రాహ్మణ, అబ్రాహ్మణాది విభేదాలు యీషణ్మాత్రమూ లేకుండా ఏకగ్రీవంగా ఆ గ్రామాన్ని వదలి ఇతర ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆనందంగా బయల్దేరారు’ అని ప్రకాశం గారు ‘నా జీవితయాత్ర’లో రాశారు.అంతమంది చీరాల ఊరి బయట ఇసుక తిన్నెల మీద తాత్కాలిక నివాసాలలో ఉన్నారు. వీటిని నిర్మించడానికి సహకరించవలసిందిగా గోపాలకృష్ణయ్య ఇచ్చిన పిలుపును అనుసరించి ఎందరో దాతలు విరాళాలు ఇచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మూడు వేల రూపాయలు ఇచ్చింది. దీనికే రామనగరం అని గోపాలకృష్ణయ్య పేరు పెట్టారు. ప్రజలకు సేవ చేయడానికి ఆయనే ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకుల బృందమే రామదండు. అక్కడ చీరాల, పేరాల గ్రామాలలోని తమ సొంత ఇళ్లు నక్కలకు, కుక్కలకు, పాములకు నిలయాలైపోయాయి. వీధులన్నీ అడవుల్లా తయారయ్యాయి. ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి నడిపించడమే గోపాలకృష్ణయ్య ఉద్దేశం. ఇందుకు ప్రతి కులం నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేయించారు. పదకొండు మాసాలు గడచిపోయాయి. ప్రభుత్వం దిగి రాలేదు. కానీ ప్రజలు అలాగే కొన్ని వారాలు ఓపిక పట్టి ఉంటే జస్టిస్ పార్టీ సర్కారు దిగి వచ్చేది. కానీ ఇన్ని మాసాల తరువాత సహనం ^è చ్చిపోయింది.ఇంతలోనే ఇంకొక పరిణామం కూడా జరిగింది. 1921లో బరంపురంలో ఏర్పాటయిన జాతీయ కాంగ్రెస్ సభలకు గోపాలకృష్ణయ్య వెళ్లారు. రామనగరం నిర్వహణకు నిధుల సమస్య తీవ్రమైంది. ఇందుకోసం విజ్ఞప్తి చేయడానికే గోపాలకృష్ణయ్య బరంపురం బయలుదేరారు. కానీ రెచ్చ గొట్టే ఉపన్యాసాలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ ఆయనను దేశద్రోహ నేరం మీద అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో కలెక్టర్ ముందు హాజరు పరిచారు. మీరు ఎంపరర్‌ను రావణుడు, బలి, హిరణ్యకశిపుడు వంటి పాత్రలతో పోల్చి చెప్పారట. నేరం కాదా! అని కలెక్టర్ అడిగితే. గోపాలకృష్ణయ్య తాను అలాగే మాట్లాడినట్టు ఒప్పుకున్నారు. పైగా అలాంటి పోలికలతో చెబితేనే భారతీయులకు బాగా అర్థమవుతుందని కూడా చెణుకు విసిరారు. ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించి తిరుచునాపల్లి తీసుకుపోయారు. ఆయన కారాగారానికి వెళ్లిపోవడంతోనే చీరాల–పేరాల ప్రజలలో విశ్వాసం సన్నగిల్లింది. తమ సొంత ఇళ్లకు తరలిపోయారు. ఇంతలోనే మరొక పరిణామం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. దీనితో గోపాలకృష్ణయ్య కూడా నిరాశ చెందారు. గాంధీజీ మీద ఒకింత నమ్మకం కోల్పోయారనే అనిపిస్తుంది. అప్పుడు ఎందరో చేసినట్టే ఆయన కూడా స్వరాజ్య పార్టీలో చేరారు. 1926లో గోపాలకృష్ణయ్యకు క్షయ వ్యాధి సోకింది. దానిని చాలా ఆలస్యంగా గుర్తించారు. పైగా అప్పటికి ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఆ లేమి కష్టాలలోనే గడుపుతూ తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 38 సంవత్సరాలు. భారతీయ చరిత్రకారుల ఆత్మసాక్షిగా అంగీకరించవలసిన విషయం ఒకటి ఉంది. అదే – ఈ రత్నం కూడా నిర్లక్ష్యం అనే మసిగుడ్డలోనే ఉండిపోయింది. డా. గోపరాజు నారాయణరావు -
అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడలోని విద్యాధరపురంలో రూ.60 కోట్లతో నిర్మించే ‘అమరావతి అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్’కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పతకం సాధించేందుకు పాఠశాల స్థాయి నుంచి ఎంపిక చేసే గాండీవ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్వహణకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు చెందిన టెన్విక్ సంస్థతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా పాంచజన్య ప్రాజెక్టు పేరుతో విశాఖపట్నం, నెల్లూరు, నర్సారావుపేట, గుడివాడ, అనంతపురంలో ఏర్పాటు చేసిన శాప్ స్పోర్ట్స్ అకాడమీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టెన్విక్ సంస్థ అధినేత అనిల్ కుంబ్లే, ఒలింపియన్లు, అర్జున, ద్రోణాచార్య అవార్డీలు కరణం మల్లేశ్వరి, షైనీ విల్సన్, అశ్వని నాచప్ప, సత్తి గీత, కోనేరు హంపి, కోనేరు అశోక్, రీత్ అబ్రహాం, సెయిలర్ పి.స్వాతి తదితరులు పాల్గొనగా వారిని సీఎం చంద్రబాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచాన్ని జయించే శక్తి క్రీడాకారులకు ఉందన్నారు. భారత దేశంలో క్రీడల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తామని, ఉత్తమ శిక్షణ ఇచ్చే కోచ్‌లను తీసుకొస్తామన్నారు. ఆర్చర్ డాలీ శివానికి 25 లక్షల నజరానా... వండర్ కిడ్ ఆర్చర్ డాలీ శివానిని సన్మానించి, రూ. 25 లక్షల నజరానాను ప్రకటించారు. ఒక ఇంటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పతకాలు సా«ధిస్తున్న ఓల్గా ఆర్చరీ అకాడమీకి కావల్సిన స్థలం, విదేశీ కోచ్‌ల కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 2024 ఒలింపిక్స్‌లో పతకం సాధించి ఇస్తామని, ఓల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. టెన్విక్ సంస్థ అధినేత అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో మంచి ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. సెయిలింగ్‌లో విశేష ప్రతిభ కనబరిచిన పి.స్వాతికి రూ.10 లక్షలు నజరానా సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ డాక్టర్ అంకమ్మ చౌదరి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శాప్ ఎండీ ఎన్.బంగారురాజు, శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. యువత, విద్యార్థులు సీకే నాయుడును ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జెడ్పీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు విగ్రహాన్ని కుంబ్లే ఆవిష్కరిం చారు. పట్టణంలో రూ.13 కోట్లతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. తొలిసారిగా మచిలీపట్నం రావడం, నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. –సాక్షి, మచిలీపట్నం -
వినూత్నంగా..ప్రభావ వంతంగా..!
పాఠశాల కాంప్లెక్స్‌ల నిర్వహణపై పీవో శేషగిరి సూచన. భానుగుడి (కాకినాడ) : స్కూల్ కాంప్లెక్స్‌ల సమావేశాలు వినూత్నంగా..ప్రభావ వంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ సొసైటీ నుంచి విషయాలను సేకరించి క్షేత్ర స్థాయిలో అమలు పరచాలని పీవో మేకాశేషగిరి తెలిపారు. పీవో కార్యాలయంలో దీనికి సంబంధించి బుధవారం ఏర్పాటు చేసిన మేధావుల కమిటీని సమావేశ పరిచి సూచనలు చేశారు. జిల్లాలో 322 స్కూల్ కాంప్లెక్స్‌ల్లో నెలకు రెండు రోజుల చొప్పున ఉపాధ్యాయులకు పాఠశాలల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఉపా«ధ్యాయులు తరగతి గదిని ప్రభావవంతంగా నడిపించేందుకు కావాల్సిన నైపుణ్యాలను శిక్షణ ద్వారా అందివ్వాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఎంఓ చామంతి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో క్షేత్ర స్థాయిలో సమస్యాత్మక విషయాల నివారణ, ఉపాధ్యాయులు మారుతున్న సమాజానికి అనుగుణంగా అప్డేట్ అవ్వడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీతో చర్చించారు. ఉపాధ్యాయులు అప్డేట్ కావడానికి స్కూల్ కాంప్లెక్స్‌లు ఒక సాధనంగా మలచాలన్నారు. ప్రతి కాంప్లెక్స్‌కి డిజిటల్ క్లాస్రూమ్ ఉండడం ద్వారా తరగతి బోధన మరింత నాణ్యమైదనదిగా తీర్చేందుకు ఉన్న అవకాశాలను స్కూల్‌కాంప్లెక్స్ సమావేశాల్లో చర్చించేలా చూడాలన్నారు. ఎస్ఎస్ఎ సెక్టోరల్ అధికారులు, అసిస్టెంట్ ఏఎంఓ ఆకేళ్ళ శ్రీనివాస్, సీఎంఓ ఐ.వెంకట్రావ్, కమిటీ కన్వీనర్ సలాది సుధాకర్, కమిటీ సభ్యులు మాచిరాజు, కేవీవీ నాయుడు, ఎస్ఎస్వీ చలపతి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కొలిక్కి వస్తున్న బాంబు పేలుళ్ల కేసు
చిత్తూరు(అర్బన్) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరులోని జిల్లా న్యాయ స్థానాల సముదాయం వద్ద ఈ నెల 7వ తేదీన బాంబు పేలిన కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఈ ప్రమాదంలో ఓ న్యాయవాది గుమస్తా గాయపడి కాలును సైతం పొగొట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులు ఎవరన్న దానిపై దాదాపు 200 మందిని విచారించారు. ఇటీవల వన్‌టౌన్ సీఐ హైదరాబాద్‌కు వెళ్లి నగరంలోని అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ జాబితా వివరాలు తీసుకొచ్చారు. దీనిని రెండు రోజులుగా క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఆధారంగా ఈ వారం రోజుల లోపు బాంబు ఘటన కేసులోని నిందితుల ఆచూకీ తెలుసుకుని చిక్కుముడిని విప్పనున్నారు. -
సముదాయంగా ప్రభుత్వ కార్యాలయాలు
అవకాశాలపై నివేదిక కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఓ సముదాయంగా నిర్మించే అంశాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష జరిపారు. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలో ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.? వాటి కున్న స్థలం ఎంత.? భవన సముదాయాల నిర్మాణం కోసం ఎంత స్థలం కావాలి వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ సముదాయాల్లో కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయం అత్యంత ఆధునికంగా ఉండేలా డిజైన్ చేయాలని సీఎం సూచించారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో కార్యాలయం ఒక్కో చోట ఉండడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు ఏది ఎక్కడుందో తెలియక అవస్థలు పడుతున్నందున వాటిని ఒకే చోట నిర్మిస్తే బావుంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, మిగిలిన జిల్లా కార్యాలయాల్లో ఒక్కోటి ఒక్కో చోట ఉన్నాయి. ఇతర జిల్లా కేంద్రాల్లోనూ ఆఫీసులు సుదూరంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే సీఎం సముదాయాలుగా ఒకేచోట ఉంచేందుకు యత్నిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరా.. హైదరాబాద్ నగర ప్రజల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఆయన సచివాలయంలో హైదరాబాద్ మహానగర మంచినీరు, మురుగునీటి పారుదల మండలి అధికారులతో నీటి సమస్యపై సమీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తాగునీరు ఎంత కావాలి..? భవిష్యత్తులో ఎంత నీరు అవసరం అనే విషయాన్ని అధ్యయనం చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీళ్లు మళ్లించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మేరకు నీటిని సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా సీఎం పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులు విధుల బహిష్కరణ
కాంప్లెక్స్ ఎదుట ధర్నా నిలిచిన డిపో బస్ సర్వీసులు ఆందోళనకు పాడేరు ఎమ్మెల్యే మద్దతు డీఎం ప్రవీణపై చర్యలకు అధికారుల హామీ పాడేరు: పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ వి.ప్రవీణ తమను వేధిస్తున్నారని, శాఖాపరమంటూ అక్రమంగా చర్యలు చేపడుతున్నారని యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ కార్మికులంతా గురువారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించారు. కాంప్లెక్స్ ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు ధర్నా చేపట్టడంతో ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం ఉదయం డిపోలోని 38 బస్సులూ కదల లేదు. డిపో మేనేజర్ ప్రవీణను బదిలీ చేసేంత వరకు విధుల్లోకి చేరేది లేదని భీష్మించారు. ప్రయాణికుల ఇక్కట్లు మధ్యాహ్నం వరకు బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కార్మికుల ఆందోళనకు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంపూర్ణ మద్దతునిచ్చారు. డీఎం బదిలీకి అధికారుల హామీ ఇంతలో విశాఖ నుంచి వచ్చిన ఆర్టీసీ డీవీఎం జీవన్ ప్రసాద్, సెక్యూరిటీ ఇంజినీర్ ప్రసాదరావు, కార్మిక సంఘం నేత రమణతో కలిసి ఎమ్మెల్యే చర్చలు జరిపారు. డీఎం ప్రవీణను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏఎస్పీ ఎ.బాబూజీ కూడా అక్కడకు చేరుకున్నారు. డీఎం ప్రవీణ బదిలీకి చర్యలు తీసుకుంటామని, విధులకు గైర్హాజరైనందుకు కార్మికులపై ఎలాంటి చర్యలూ ఉండవని ఆర్టీసీ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సంతృప్తి చెందారు. ఆమె సూచనతో కార్మికులంతా మధ్యాహ్నం 2 గంటలకు ఆందోళనను విరమించి విధులకు హాజరవడంతో డిపోలో బస్సులన్నీ కదిలాయి. -
‘మహా’జాగ్రత్తలు !
కొత్త సర్కారుకు దొరకకుండా ముందస్తు చర్యలు పరిశీలనకు పాత ఫైళ్లు సిద్ధం ల్యాండ్ పూలింగ్ స్కీం పక్కకు అతిజాగ్రత్తల్లో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు సాక్షి,సిటీబ్యూరో: రేపో, మాపో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలను పక్కకుపెడుతూ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల విక్రయాలు, భూవినియోగ మార్పిడి , భూములు, కాంప్లెక్స్‌ల లీజులు, ఆదాయ-వ్యయాలపై కొత్త ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఎక్కడా దొరకకుండా ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడ్డాక గత ప్రభుత్వమిచ్చిన జీవోలపై లోతుగా పునఃపరిశీలన జరుపుతామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో గతంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల అమలును హెచ్ఎండీఏ తాత్కాలికంగా నిలిపేసింది. వీటికి సంబంధించిన ఫైళ్లను మరోసారి లోతుగా పరిశీలించి ఏవైనా తప్పిదాలుంటే సరిదిద్దుకొనే పనిలోపడ్డారు. గతంలో నందగిరిహిల్స్, చందానగర్, నల్లగండ్ల, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేలం ద్వారా విక్రయించిన విలువైన భూముల వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడే అవకాశముండడంతో వాటికి సంబంధించిన ఫైళ్లను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కు ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. ఈ స్కీంను కొనసాగిస్తారా..? లేక సమూలంగా మార్పుచేసి మరో పద్ధతిలో ప్రవేశపెడ్తారా..? అన్నది కొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది. అక్రమాల పుట్ట : చూసేందుకు పైకి ‘మహా’ గొప్పగా కనిపిస్తున్న హెచ్ఎండీఏ అక్రమాలకు నిలయం. ఇందులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై కొత్త సర్కారు దృష్టిసారిస్తే..సగంమంది ఉద్యోగులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఇప్పటికే ప్రారంభించిన ఔటర్‌రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు, ఉప్పల్ భగత్ లేఅవుట్ డెవలప్మెంట్, కొత్వాలగూడ ఎకో పార్కు తదితర ప్రాజెక్టుల్లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.. కీసర మార్గంలో సుమారు 13 కి.మీ.మేర ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు జరగలేదు. సదరు కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన పలుకుతూ హెచ్ఎండీఏ ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో సంస్థపై రూ.100 కోట్లు అదనపు భారం పడింది. సాగర్ ప్రక్షాళనకు ఉద్వాసన పలుకుతారా..? లేక కొనసాగిస్తారా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. సాగర్‌ను పూర్తిగా కలుషితం చేస్తున్న కూకట్పల్లి నాలా మళ్లింపునకు పక్కా చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలకు సుమారు రూ.200 కోట్ల వరకు వెచ్చించారు. హెచ్ఎండీఏకు కామధేను లాంటి ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లను కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా..? లేక కొన సాగిస్తూ గడువును మరింత పెంచుతుందా..? అన్నది వేచిచూడాలి. -
ప్రమాదాలు జరిగినా.. పాఠాలు నేర్చుకోరు
=తీరు మారని టీటీడీ =బూందీపోటు సంఘటనతో రూ.10 లక్షల నష్టం = నిలిచిన లడ్డూ తయారీ సాక్షి, తిరుమల: తిరుమలలోని అదనపు బూందీపోటులో సోమవారం జరిగిన ప్రమాద సంఘటనలో రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఆల య, బూందీపోటులో, నిత్యాన్న భవన సముదాయం లో పలు అగ్నిప్రమాదాలు జరిగి భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ టీటీడీ అధికారుల తీరు మారలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారులు ప్రమాదం జరిగిన సందర్భం లో తీవ్రంగా స్పందిస్తారు. ఆ తర్వాత మరచిపోతారు. గత రెండు మూడేళ్లుగా ఆలయ పోటులో, బూందీ పోటులో, నిత్యాన్న భవన సముదాయంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరిగాయి. అప్పట్లో అధికారులు హడావుడి చేశారు. వెనువెంటనే పోటులో పొయ్యలను మార్పిడి చేశారు. అత్యాధునిక వసతులు పెంచారు. రోజువారీగా ప్రసాదాల తయారీలో గోడలకు అంటుకునే సిల్ట్ నెయ్యిని తొలగించే పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరిగినా దాన్ని ఎదుర్కొనే విధంగా డ్రై కెమికల్ సిలిండర్ల సంఖ్యను పెంచారు. వాటి సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఇలాం టి సౌకర్యాలే ఆలయం వెలుపల బూందీ పోటులోనూ, నిత్యాన్న భవన సముదాయంలోనూ పెం చా రు. అయితే సిలిండర్లను వాడే విధానంలో మెళుకువలు నేర్పించలేదు. సోమవారం సాయంత్రం అదనపు బూందీపోటులో హఠాత్తుగా జరిగిన సంఘటనతో పోటు కార్మికు లు అరుపులు, కేకలతో పరుగులు తీసారు. పలువురు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందిపడ్డారు. పదిహేను నిమిషాల తర్వాత లీకైంది డీసీపీ సిలిండరని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అయితే అనుకోని ప్రమాదం వల్ల సుమారు రూ.10 లక్షల విలువైన బూందీ, నెయ్యి, వంద బస్తాల శెనగ పిండి పూర్తిగా పాడైపోయాయి. మరోవైపు బూందీ తయారీ నిలిచిపోయింది. దీంతో లడ్డూ తయారీ ఆగిపోయింది. ప్రమాదాలు జరక్కండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే ఇలా జరిగింది. ఈ ప్రమాదానికి బాధ్యత తమదంటే తమది కాదని పోటు అధికారులు, సిబ్బంది భుజాలు తడుముకుంటున్నారు. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించలేదు. పోటు అధికారులు మాత్రం ఈ ఘటన చాలా చిన్నదని కొట్టిపారేయటం గమనార్హం. ఇకనైనా ప్రమాదాలు జరక్కుండా అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. -
ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. నాగరభావి రెండవ స్టేజ్‌లో నూతనంగా నిర్మించదలిచిన బస్‌స్టేషన్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి అద్దెకు ఇవ్వడం వల్ల ఆయా సంస్థలకు లాభం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీజిల్ ఖరీదుకు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. బెంగళూరు శివారులో బస్‌స్టేషన్ నిర్మించడానికి అవసరమైన స్థలం లభించే అవకాశం ఉందన్నారు. అయితే బెంగళూరు నగరంలో బస్స్టేషన్లు నిర్మించడానికి అవసరమైన స్థల సేకరణలో పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన తెలిపారు. శంకుస్థాపన జరిగిన పది నెలలల్లోపు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. కళాసిపాళ్య వద్ద అత్యాధునిక బస్‌స్టేషన్‌ను నిర్మించనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు మార్చిలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖలో కింది స్థాయి సిబ్బందిపై కొంతమంది అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో ఉంటూ బస్ ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు కారణమైన డ్రైవర్, కండక్టర్లకు అండగా న్యాయపోరాటం చేయాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని వ ుంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ సత్యనారాయణ, ఉపమేయర్ ఇందిరా, బీఎంటీసీ డెరైక్టర్ అజుమ్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల మధ్య ఘర్షణ, హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత