జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్‌ఐ సర్వేలో వెల్లడి! | ASI Report Reveals That There Are Many Basements In The North Of Gyanvapi Complex, Details Inside - Sakshi
Sakshi News home page

ASI Report On Gyanvapi: జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్‌ఐ సర్వేలో వెల్లడి!

Published Thu, Feb 1 2024 8:15 AM | Last Updated on Thu, Feb 1 2024 8:46 AM

Many Basements in the North of Gyanvapi Complex - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. 

గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్‌) టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్‌ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్‌ఫారమ్ కింద, ప్లాట్‌ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్‌మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉంది. వీటిని మూసివేశారు. ప్లాట్‌ఫారమ్‌కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉన్నాయి. ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేసివున్నాయి. 

నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్‌ఫారమ్‌కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్ల రెండు వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి రెండు మీటర్ల వెడల్పు కలిగివుంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి.

బేస్‌మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్‌లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని జీపీఆర్‌ చూపించింది. ఏఎస్‌ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం,  పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్‌తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement