కొలిక్కి వస్తున్న బాంబు పేలుళ్ల కేసు | Blasts case | Sakshi
Sakshi News home page

కొలిక్కి వస్తున్న బాంబు పేలుళ్ల కేసు

Published Thu, Apr 21 2016 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

Blasts case

చిత్తూరు(అర్బన్) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరులోని జిల్లా న్యాయ స్థానాల సముదాయం వద్ద ఈ నెల 7వ తేదీన బాంబు పేలిన కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఈ ప్రమాదంలో ఓ న్యాయవాది గుమస్తా గాయపడి కాలును సైతం పొగొట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులు ఎవరన్న దానిపై దాదాపు 200 మందిని విచారించారు.


ఇటీవల వన్‌టౌన్ సీఐ హైదరాబాద్‌కు వెళ్లి నగరంలోని అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ జాబితా వివరాలు తీసుకొచ్చారు. దీనిని రెండు రోజులుగా క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఆధారంగా ఈ వారం రోజుల లోపు బాంబు ఘటన కేసులోని నిందితుల ఆచూకీ తెలుసుకుని చిక్కుముడిని విప్పనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement