Evidence
-
లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఉందా!?
ఒంగోలు టౌన్: ‘ఏంటి.. లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఏమైనా ఉందా’.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బిత్తరపోయింది. పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సురేంద్రబాబు, డీఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబరు 18న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన తాలుకా పోలీసుస్టేషన్‌కు రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలుకా పోలీసుస్టేషన్ నుంచి పిలుపు రాగా.. ఆమె వెళ్లి సీఐ అజయ్‌కుమార్‌కు తన సమస్య చెప్పుకుంది. వారిరువురూ ద్వంద్వార్ధాలతో కామెంట్ చేస్తున్నారని వాపోయింది. సీఐ స్పందిస్తూ.. ‘నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా’.. అని చెప్పారు.తన దగ్గర ఎలాంటి వీడియోల్లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఊరికే ఎలా చెబుతుందని ప్రశ్నించింది. ఇది జరిగి నెలరోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రిలో పనిచేసే మహిళలతో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయించారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు చంద్రశేఖర్, భాస్కర్ బెదిరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు కలిసి తన గోడు చెప్పుకుంది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి ఎస్పీని కలిసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళితే అక్కడ సిబ్బంది ఆమెను ఎస్పీ వద్దకు వెళ్లనీయలేదు.ఇక దిక్కుతోచని స్థితిలో మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పైనుంచి వచ్చిన కేసులు విచారించి నివేదిక పైకి పంపిస్తామని, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలిందని సీఐ అజయ్‌కుమార్ చెబుతున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో టూ వీలర్ల కుప్పలు : ఆధారాలు చూపిస్తే మీవే!
సోలాపూర్: సోలాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో వ్యర్థంగా పడిఉన్న వాహనాలను పక్షంరోజుల్లోగా రుజువులు చూపించి తీసుకువెళ్లాలని, లేని పక్షంలో వాటిని స్క్రాప్ కింద పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని సోలాపూర్ తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేశ్‌పాండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘స్టేషన్ ఆవరణలో నాలుగు ఫోర్‌వీలర్లు, 67 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి యజమానులు అవసరమైన పత్రాలు చూపించి తమ తమ వాహనాలను గుర్తించి తీసుకువెళ్లాలని కోరారు. లేకుంటే వాటిని పాడుబడిన వాహనాలుగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి : ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా! -
ప్రచారం పీక్ దర్యాప్తు వీక్
సాక్షి, హైదరాబాద్: గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ పెద్దలు పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. మత్తుపదార్థాలను కట్టడి చేస్తున్నామంటూ అధికారులు భారీగా ప్రచారం చేస్తుండగా కేసుల దర్యాప్తు పేల వంగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా వరకు వీగిపోవడమే అందుకు నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన 226 కేసులకుగాను కేవలం 39 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి. అంటే ఆయా కేసుల్లో నేర నిరూపణ 17 శాతంగానే ఉంది. ఇక ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్డీపీఎస్ చట్టం కింద గత పదేళ్లలో నమోదు చేసిన కేసుల్లో నేర నిరూపణ అత్యంత తక్కువగా 0.85 శాతంగా ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆధారాల సేకరణలో లోపాలే శాపాలై.. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసుల నమోదు, మత్తుపదార్థాల స్వాధీనం, కోర్టుకు ఆధారాల సమర్పణ తదితర అంశాల్లో దర్యాప్తు అధికారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్లే ఎక్కువగా కేసులు వీగిపోతున్నాయి. చాలా వరకు ఎన్డీపీఎస్ కేసులు కనీసం విచారణ దశకు కూడా రాకుండానే సాంకేతిక కారణాలతో కోర్టులు కొట్టేస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. గంజాయి, డ్రగ్స్ సరఫరా సమాచారం అందాక దర్యాప్తు అధికారులు తన పై అధికారికి సమాచారం ఇవ్వడంతోపాటు వారి నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు తీసుకోవాలి. ఆ తర్వాత తనిఖీ చేసేందుకు వెళ్లే సమయంలో ఇద్దరు పంచ్ విట్నెస్లను వెంట తీసుకెళ్లాలి. అందులో కనీసం ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి. ఆ తర్వాత ఎవరి వద్ద తనిఖీ చేయడానికి వెళ్లారో ఆ వ్యక్తికి సదరు అధికారులు ఆప్షన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం..దర్యాప్తు అధికారులను అవతలి వ్యక్తులు తనిఖీ చేయవచ్చు (అధికారులే మత్తుపదార్థాలను తెచ్చి పెట్టారన్న సందేహాలకు తావు లేకుండా). ఆపై తనిఖీలను అధికారులు ప్రారంభించాలి. నూతన చట్టాల ప్రకారం ఈ వ్యవహారాన్ని వీడియో తీయాలి. సాంకేతిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోకపోయినా.. కొన్నిసార్లు పంచ్ విట్నెస్లు అందుబాటులో లేక అందుబాటులో ఉన్న వారితోనే పంచనామా చేయడం.. వారు సాక్ష్యం చెప్పడంలో తడబడటం వంటి కారణాలతో కేసులు నిలబడట్లేదు. సోదాల్లో దొరికిన మత్తుపదార్థాల నమూనాల సేకరణ, వాటికి సంఖ్య కేటాయింపు సైతం ఈ కేసుల్లో కీలకంకాగా అందులోనూ దర్యాప్తు అధికారులకు అవగాహన లేక కేసులు నిలబడట్లేదు.శిక్షలు పెంచేలా శిక్షణపై దృష్టి.. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు పక్కాగా జరిగేలా చూడటంతోపాటు ఆధారాల సేకరణపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు శిక్షణా తరగతుల నిర్వహణపై దృష్టిపెట్టారు. టీజీఏఎన్‌బీ ఆధ్వర్యంలో పోలీ స్, ఎక్సైజ్, ప్రాసిక్యూషన్, రైల్వే శాఖ అధికారులకు సైతం ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 22,654 సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు టీజీఏఎన్‌బీ అధికారులుతెలిపారు. -
Phone Tapping Case: పగలు చేశారా? రాత్రి చేశారా?
నల్లగొండ/ హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాల్ని సేకరణ దిశగా దర్యాప్తు బృందం తీవ్రంగా యత్నిస్తోంది. ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కేసు వీగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కీలకంగా భావిస్తున్న హోంగార్డు, ఎలక్ట్రిషియన్ల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIB(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)లో ఆధారాలు ధ్వంసం చేసిన ఎలక్ట్రిషియన్, హోంగార్డులను విడివిడిగా పోలీసులు విచారించారు. ‘‘ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎంత డబ్బు ఇచ్చారు?. జనవరి 4వ తేదీన ఎస్ఐబీలోకి రమ్మని ఎవరు పిలిచారు?. ఆ టైంలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా?. అసలు ఎస్ఐబీ కార్యాలయంలోకి కట్టర్లతో ఎలా వెళ్లారు?.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను, పెన్‌డ్రైవ్, ఇతర డివైజ్‌లను డే టైంలో ధ్వంసం చేశారా? నైట్‌టైంలో ధ్వంసం చేశారా?. ఎస్ఐబీ ఆఫీస్‌లో కాకుండా వేరే చోట కూడా ధ్వంసం చేశారా?’’ ఇలాంటి ప్రశ్నలు ఆ ఇద్దరికి సంధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కోర్టు కేసు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వృథా కాకుండా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్? ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల టైంలో పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అభియోగాలతో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. నల్లగొండలో సర్వర్ రూం ఏర్పాటు చేసుకుని ఈ ఇద్దరూ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఓ మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఫోన్లను ఎప్పటికప్పుడు వీళ్లు అబ్జర్వ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొందరు అధికారుల హస్తం ఉందని భావిస్తున్నారు. రాధాకిషన్ అస్వస్థత ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. రెండోరోజు విచారణ సందర్భంగా.. హైబీపీకి ఆయన గురైనట్లు సమాచారం. అయితే బంజారాహిల్స్ పీఎస్‌లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. -
సంతకం సాక్షిగా..మద్యంలో ముడుపులు
-
వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఏవైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు సీబీఐను ప్రశ్నించింది. ఇదే కేసులో నిందితుడైన దినేశ్ అరోరా వాంగ్మూలం మినహా ఇంకా ఏం ఆధారాలున్నాయని అడిగింది. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ పేర్కొంది. కొన్ని వాట్సాప్ సందేశాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యం ఆమోదయోగ్యమేనా? అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఇచి్చన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా ఎలా భావించగలం? అని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారని అభిప్రాయపడింది. సిసోడియా ముడుపులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, మరి ఆ డబ్బులు ఆయనకు ఎవరిచ్చారు? డబ్బులిచి్చనట్లు ఆధారాలున్నాయా? ఈ కేసులో అరోరా వాంగ్మూలం కాకుండా సాక్ష్యాలున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల కస్టడీ బుధవారం అదుపులోకి తీసుకున్న ఆప్ నేత ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అధికారులు గురువారం ప్రత్యేక కోర్టు జడ్జి నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో మిగతా నిందితులతో కలిపి ఆయన్ను విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. దీంతో జడ్జి నాగ్‌పాల్ ఆయన్ను విచారణ నిమిత్తం అయిదు రోజుల ఈడీ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జడ్జి అనుమతి మేరకు సంజయ్ సింగ్ కోర్టులో మాట్లాడారు. -
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా...అవినీతి కేసులు మూసివేయడం తగదు
సాక్షి, అమరావతి: సీబీఐ, ఏసీబీ నమోదు చేసే అవి నీతి కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా ఆ కేసులను సంబంధిత కోర్టు లు మూసివేయడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లకు సాక్ష్యం చెప్పే అవకా శాన్ని నిరాకరిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు 2014లో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఇద్ద రు అధికారులకు సాక్ష్యం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువ రించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో తన పేరు ఎక్కించేందుకు చిత్తూరు జిల్లా ఏర్పేడు తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వో బాలకృష్ణారెడ్డి రూ.2,500 లంచం డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి 2009లో ఏసీ బీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాది నుంచి బాలకృష్ణారెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఈ కేసును కర్నూలు కోర్టు విచారణ చేసింది. అయితే, లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టు కుని ఈ కేసులో సాక్షులుగా ఉన్న డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ఎన్నికల విధుల్లో ఉండటంతో సాక్ష్యం చెç³్పలేక పోయారు. వారు సాక్ష్యం ఇచ్చేందుకు కేసును రీ ఓపెన్ చేయాలని కర్నూలు కోర్టును ఏసీబీ అధికా రులు అభ్యర్థించారు. దీనిని ఆ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీబీ 2014లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. ఏసీబీ తరఫు న్యాయవాది ఎస్ఎం సుభానీ వాదనలు వినిపిస్తూ మరో అధికారిక విధుల్లో ఉండటంతో ఆ ఇద్దరు అధికారులు సాక్ష్యం చెప్పలేకపోయారని,ఎన్నికల విధులు ముగిశాక సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమని చెప్పినా కర్నూలు కోర్టు పట్టించుకోలేదన్నారు. వీఆర్వో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సాక్ష్యం చెప్పేందుకు అధికారులకు ఏసీబీ కోర్టు పలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేదని, దీంతో కోర్టు వారి సాక్ష్యాలను మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పునిచ్చారు. కర్నూలు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. కేసులను త్వరగా పరిష్కరించడం అంటే సాక్షులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వకపోవడం కాదన్నారు. ఈ కేçÜులో వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వక పోవడం సరికాదన్నారు. మూసివేసిన సాక్ష్యాలను తిరిగి తెరిచే అవకాశాన్ని కోర్టులకు చట్టం కల్పిస్తోందన్నారు. అవకాశం ఇచ్చినా అధికారులు సాక్ష్యం చెప్పేందుకు రాకపోతే ఆ విషయాన్ని లేఖ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సాక్షులుగా ఉన్న సంబంధిత అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా అవినీతి కేసులను మూసివేయకుండా న్యాయాధికారులకు ఆదేశాలు ఇస్తూ సర్క్యులర్ జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. -
రామోజీ, కిరణ్, శైలజలపై ప్రాథమిక ఆధారాలున్నాయి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల మళ్లింపు, ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీపై ‘ఈనాడు’ పత్రిక ప్రచురిస్తున్న అసత్య, తప్పుడు కథనాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు న్యాయస్థానం స్పందించింది. ఈ ఫిర్యాదులో నిందితులపై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ఆ తర్వాతే ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించారని వెల్లడించింది. ఈ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో నన్నపనేని విశ్వప్రసాద్, హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఎం.నరసింహారెడ్డి, ఏపీ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాసులు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు గుంటూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సీహెచ్.రాజగోపాలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 25న రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్‌లతో సహా మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు వారు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు విచారణ మొదలవుతుంది. ఈనాడు తప్పుడు, విష కథనాలపై ఫిర్యాదు.. మార్గదర్శి అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీపై ఈనాడు వరుసగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ‘మార్గదర్శిపై భారీ కుట్ర’ అంటూ ఓ కథనం ప్రచురించింది. ఇందులో సీఐడీపై పలు అసత్య, నిరాధార ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనాడు ఎడిటర్, ఇతరులపై సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ఈనాడు, రామోజీరావు తదితరులపై గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసే ఫిర్యాదులో వాదనలు వినిపించే బాధ్యతలను అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగించింది. దీంతో గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలై 4న కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతోపాటు ఈనాడు ప్రచురించిన కథనం, ఫిర్యాదుల కాపీలు, ఎఫ్ఐఆర్లు, రామోజీరావు, కిరణ్‌ల వాంగ్మూలం, శైలజా కిరణ్ రిమాండ్ రిపోర్టులు తదితరాలను అందించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి దీన్ని మరో న్యాయమూర్తికి పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సీహెచ్ రాజగోపాలరావు గురువారం విచారణ జరిపారు. సీఐడీ మనోస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు కథనాలు.. ఫిర్యాదుదారు తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారం చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చేసిన తనిఖీల్లో ఆ సంస్థ అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయన్నారు. దీంతో వాటిపై చిట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారని, దీని ఆధారంగా సీఐడీ విచారణ మొదలు పెట్టిందన్నారు. సీఐడీ చట్టప్రకారమే నడుచుకుంటున్నా దాని మనో, నైతిక స్థైర్యాలు దెబ్బతీసేలా ఈనాడు యాజమాన్యం తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని కోర్టుకు నివేదించారు. సీఐడీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఈనాడు ఇలా చేసిందన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే ఈనాడు యాజమాన్యం చేస్తున్న పనులకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెడుతూ న్యాయమూర్తులను లంచగొండులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరువు, ప్రతిష్టలు ఎవరికైనా ఒకటేనని, వాటిని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ముందుకు రాకపోతే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుందని తెలిపారు. ‘ప్రభుత్వాలను నిలబెట్టేది మేమే.. కూల్చేది మేమే’ అన్నట్లు ఈనాడు యాజమాన్యం వ్యవహరిస్తోందని.. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ఈనాడు తప్పుడు, విష కథనాల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. -
అడ్డంగా బుక్కయిన చంద్రబాబు!
చిత్తూరు అర్బన్/బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీడీపీ శ్రేణులను బహిరంగంగా రెచ్చగొట్టి దాడులు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. విధ్వంసానికి దిగాలని చంద్రబాబు బహిరంగంగానే పిలుపునివ్వగా.. పార్టీ శ్రేణులు, కిరాయి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ‘పచ్చ మీడియా’ సహా అన్ని చానళ్లలోనూ ప్రసారమయ్యాయి. వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన లేకపోయినా.. ముందురోజు సాయంత్రం పర్యటనలో మార్పు చేయడం.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లేకున్నా ములకలచెరువు, బురకాయలకోట, అంగళ్లు గ్రామాల పర్యటనకు వెళ్లడం వంటి అంశాలు చంద్రబాబు ఈ కుట్రకు ఏవిధంగా తెర తీశారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. ఆ ఆడియో టేపులోని మాటలు తనవి కాదని బొంకారు. కానీ.. తాజా కేసులో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు తాను రెచ్చగొట్టలేదని మాట మారిస్తే.. పోలీసుల వద్ద ఉన్న, ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి.. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1గా కేసు నమోదైంది. అంతా వ్యూహం ప్రకారమే.. ఈ నెల 4న ఉదయం 10:30 గంటలకు నాయన చెరువుపల్లెలో పనుల పరిశీలనకు రావాల్సిన చంద్రబాబు 12 గంటలు దాటాక చేరుకున్నారు. నేరుగా పనుల పరిశీలనకు వెళ్లకుండా షెడ్యూల్‌ను పక్కనపెట్టి ములకలచెరువులో ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అక్కడినుంచి నాయన చెరువుపల్లెకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బురకాయలకోటలో కారు ఫుట్ బోర్డుపైకి ఎక్కి రోడ్‌షో నిర్వహించారు. బి.కొత్తకోట మండలంలో హంద్రీ–నీవా కాలువను కొద్దిసేపు పరిశీలించారు. అంగళ్లులో చంద్రబాబు రోడ్‌షో, ప్రసంగం లేదు. కానీ.. మసీదు వద్దకు రాగానే చంద్రబాబు తాను ప్రయాణించే కారుపై రోడ్‌షో నిర్వహించారు. నాయన చెరువుపల్లె, హంద్రీ–నీవా కాలువ పనుల పరిశీలన మినహా షెడ్యూల్ మేరకు మిగతా ఏ కార్యక్రమం లేదు. కానీ.. ఆద్యంతం షెడ్యూల్‌కు భిన్నంగానే చంద్రబాబు పర్యటన కొనసాగించారు. ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు విధ్వంసక వ్యూహం ప్రకారమే వచ్చినట్లు అర్థమవుతోంది. వాస్తవానికి హంద్రీ–నీవా కాలువ వద్ద రైతులతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉంది. దానిని రద్దు చేసుకుని మరీ అంగళ్లు గ్రామానికి చేరుకున్న చంద్రబాబు మసీదు వద్దకు రాగానే కారుపై నిలబడి రోడ్‌షో ప్రారంభించారు. అంగళ్లులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. పిచ్చలవాండ్లపల్లె రిజర్వాయర్‌పై చంద్రబాబు కోర్టులో కేసు వేయించి పనులు అడ్డుకున్నందుకు నల్లకండువాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ గొడవకు ఉసిగొల్పారు. అంతటితో ఆగక ‘పుంగనూరులో ఆ పుడింగి సంగతి తేలుద్దాం.. పదండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో అప్పటికే ముందస్తు వ్యూహం ప్రకారం పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ మూక, అల్లరి మూక విధ్వంసకాండకు దిగారు. అంగళ్లులో చెలరేగిన టీడీపీ నేతల రౌడీయిజంలో వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు వద్ద మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలతో చేసిన దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ రణ«దీర్ ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయారు. డీఎస్పీ బాబుప్రసాద్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మహిళా ఎస్ఐ కరీమున్నీసా నడవలేని పరిస్థితి. -
కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ –3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి. డైలీ మిర్రర్, సండే మిర్రర్ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ (ఎంజీఎన్) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్ హ్యారీ కూడా మిర్రర్ గ్రూప్‌పై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్ హైకోర్టులో ప్రిన్స్ హ్యారీ హాజరై ఫోన్ ట్యాంపింగ్‌పై సాక్ష్యం ఇవ్వనున్నారు. గతంలో 1870లో ఎడ్వర్డ్–7 ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. -
శ్రద్ధ వాకర్ హత్య కేసు.. పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు మెహ్రౌలీ అడవిలో ఆదివారం వెతికారు. పుర్రె, దవడ భాగాలతో పాటు మరికొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి శ్రద్ధవో కావో నిర్ధరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మిగతా శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. అలాగే మైదాన్‌గడీ కొలనులో నీటి స్థాయి తగ్గడంతో గజ ఈతగాళ్లతో అందులో వెతికించారు పోలీసులు. శ్రద్ధ శరీర భాగాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధవో కావో నిర్ధరించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం ఆమె తండ్రి, తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటి ఫలితాలు రావడానికి 15 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు శ్రద్ధవో కావో కచ్చితంగా చెప్పవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ ఈ హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధ ఫొటోలను కూడా కాల్చివేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ మెహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అఫ్తాబే తన ప్రేయసిని చంపేసి శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఆ తర్వాత వాటిని అడవితో పాటు ఇతర ప్రదేశాల్లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల పాటు శరీర భాగాలను పడేశాడు. చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు.. -
గులాబీ రంగునీళ్లు బాటిలే మెయిన్ ఎవిడెన్స్.. దీని వెనుక కథ తెలుసా?
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): అవినీతి నిరోధక శాఖ(యాంటీ కరప్షన్ బ్యూరో) పలు ఆకస్మిక దాడుల్లో లంచావతారాలను పట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా అధికారులు లంచాలు తీసుకునే క్రమంలో ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అయితే ఇలా అవినీతిపరులను పట్టుకున్నప్పుడు కామన్‌గా కనిపించే ఒక ఇమేజ్ ఎప్పుడైనా గుర్తించారా.? అదే కరెన్సీ నోట్లపై గులాబీ రంగు నీళ్ల బాటిళ్లు ఉంచే ఫొటో. అయితే దీని వెనుక కథ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయతనించారా? చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? నిజానికి ఈ రంగు నీళ్ల బాటిలే ఆ నేరంలో ప్రధాన సాక్షమని మీకు తెలుసా.? అయితే రండి తెలుసుకుందాం. లంచం డిమాండ్‌తో విసుగుపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించినప్పుడు ఆయనకు ఇవ్వబోయే కరెన్సీ నోట్లకు ఏసీబీ అధికారులు ముందుగా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ నోట్లపై ఫినాప్తలీన్ అనే తెల్లని రసాయన పొడిని ఆ నోట్లపై చల్లి బాధితుడి చేత అవినీతి అధికారికి ఇప్పిస్తారు. బాధితుడి నుంచి అధికారి ఆ నోట్లు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. లంచగొండి అధికారి తీసుకున్న ఆ నోట్లను గుర్తించి వాటిని తొలుత ఆ అధికారి ఎదుటే చేతులతో తాకుతారు. అనంతరం చేతులను సోడియం కార్బోనేట్‌తో ఓ బౌల్లో కడిగినప్పుడు రసాయన చర్య జరిగి నీళ్లు గులాబీ రంగులోకి మారతాయి. దీంతో ఆ అధికారి లంచం తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారించడంతో పాటు ఈ ద్రావణాన్ని బాటిళ్లలో సేకరించి నోట్లపై ప్రదర్శిస్తారు. ఆ అవినీతి ఘటనలో ఆ బాటిళ్లలో ద్రావణాన్ని ప్రధాన సాక్షంగా తీసుకుంటారు. -
నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..
అనంతపురం క్రైం/చిత్తూరు అర్బన్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం, సేకరించిన ఆధారాలతోనే నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని డీఐజీ ఎం.రవిప్రకాష్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేసును పకడ్బందీగా, క్షుణ్నంగా విచారించడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా, ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నారాయణ యాజమాన్యం వ్యవహరించిందన్నారు. నారాయణ ఆదేశాల మేరకు డీన్, వైస్ ప్రిన్సిపాళ్లు, ప్రిన్సిపాళ్లు కలసి కొందరు స్వార్థపరులైన ఉపాధ్యాయులను, సిబ్బందిని డబ్బులతో లోబర్చుకున్నట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని వారే పోలీసు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తెప్పించుకుని నారాయణ విద్యా సంస్థల హెడ్ ఆఫీస్‌కు పంపారని చెప్పారు. దర్యాప్తులో ఇవన్నీ నిర్ధారణ కావడంతో నారాయణతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సాక్ష్యాధారాలతో కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు. కాగా, చిత్తూరు మేజిస్ట్రేట్ న్యాయస్థానం మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని పేర్కొన్నారు. -
హత్యకేసులో ఆధారాలు ఎత్తుకెళ్లిన కోతి!
జైపూర్: ఓ హత్య కేసులో కోర్టు ఎదుట హాజరైన పోలీసులు చెప్పిన సమాధానం విని జడ్జి బిత్తర పోయారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలన్నింటిని ఓ కోతి ఎత్తుకెళ్లిపోయిందట. ఈ ఘటన రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. ఓ హత్య కేసులో పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఇతర వస్తువులను ఓ బ్యాగ్‌లో ఉంచారట. అయితే ఆ సంచిని కోతి ఎత్తుకెళ్లిందని పోలీసులు, కోర్టు ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. 2016, సెప్టెంబర్‌లో.. జైపూర్ చాంద్వాజీ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శశికాంత్ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత న్యాయం కోసం మృతదేహాంతో అతని కుటుంబం ఢిల్లీ-జైపూర్ హైవేని దిగ్భంధించింది కూడా. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఐదురోజుల తర్వాత రాహుల్, మోహన్‌లాల్ కండేరా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే స్టేషన్లో జాగా లేకపోవడంతో.. ఈ కేసులో సేకరించిన పూర్తి ఆధారాలను ఓ బ్యాగులో ఉంచి.. స్టేషన్ బయట ఓ చెట్టుకింద పెట్టాడట డ్యూటీ కానిస్టేబుల్. ఆ టైంలో కోతి వచ్చి ఆ బ్యాగును ఎత్తుకెళ్లిందట. ఈ కేసులో కోర్టు విచారణ.. ఏళ్ల తరబడి సాగింది. ఈమధ్యే ఈ కేసు విచారణకు రాగా.. ఆ సమయంలో ఎవిడెన్స్ ఏవని? జడ్జి ప్రశ్నించారు. దీంతో.. కోతి ఎత్తుకెళ్లిందని సమాధానం ఇచ్చారు పోలీసులు. ఆ బ్యాగులో మొత్తం 15 వస్తువులు కేసుకు సంబంధించినవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసులు కోర్టుకు సమర్పించిన రాత పూర్వక స్టేట్మెంట్లో.. ఈ విషయాన్ని కింది న్యాయస్థానానికి తెలియజేశామని, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ను ఘటన తర్వాత సస్పెండ్ చేశారట. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ కావడంతో పాటు మరణించాడని సదరు స్టేట్మెంట్లో కోర్టుకు వివరించారు పోలీసులు. ఇది కోతి కథతో పోలీసులు ఇచ్చిన వివరణ. -
ఉత్పాతం నుంచి ఉత్పత్తి
ఒక తార జన్మించాలంటే ఒక నిహారిక మరణించాలని ఇంగ్లిష్ సూక్తి. ఒక గ్రహం జన్మించాలంటే అంతకన్నా ఎక్కువ ఉత్పాతం జరగాలంటున్నారు సైంటిస్టులు. శిశువుకు జన్మనిచ్చేందుకు తల్లి పడేంత కష్టం గ్రహాల పుట్టుక వెనుక ఉందంటున్నారు. తాజాగా ఇందుకు బలమైన సాక్ష్యాలు లభించాయి. గ్రహాల పుట్టుక ఒక తీవ్రమైన, విధ్వంసకర ప్రక్రియని ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తున్నారు. హబుల్ టెలిస్కోపు తాజాగా పంపిన చిత్రాలను శోధించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ప్రొటో ప్లానెట్ పుట్టుకను హబుల్ చిత్రీకరించింది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే వాయువులు, ధూళితో కూడిన వాయురూప ద్రవ్యరాశిని(గ్యాసియస్ మాస్) ప్రొటో ప్లానెట్‌గా పేర్కొంటారు. ఈ గ్యాసియస్ మాస్పైన ధూళి, వాయువుల ఉష్ణోగ్రతలు తగ్గి అవి చల్లారే కొద్దీ ఘన, ద్రవ రూపాలుగా మారతాయి. అనంతరం ప్రొటోప్లానెట్ సంపూర్ణ గ్రహంగా మారుతుంది. సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహాలను(శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్) జోవియన్ గ్రహాలంటారు. మిగిలిన ఐదు గ్రహాలతో పోలిస్తే వీటిలో వాయువులు, ధూళి శాతం ఎక్కువ. ఈ జోవియన్ ప్లానెట్లు కోర్ అక్రేషన్ ప్రక్రియలో ఏర్పడ్డాయని ఇప్పటివరకు ఒక అంచనా ఉండేది. భారీ ఆకారంలోని ఘన సమూహాలు ఢీకొనడం వల్ల ప్రొటో ప్లానెట్లు ఏర్పడతాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది డిస్క్ ఇన్‌స్టెబిలిటీ (బింబ అస్థిరత్వ) సిద్ధాంతానికి వ్యతిరేకం. డిస్క్ ఇన్‌స్టెబిలిటీ ప్రక్రియ ద్వారా జూపిటర్ లాంటి గ్రహాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతాన్ని ఎక్కువమంది సమర్థిస్తారు. తాజా పరిశోధనతో కోర్ అక్రేషన్ సిద్ధాంతానికి బలం తగ్గినట్లయింది. వేదనాభరిత యత్నం ఒక నక్షత్ర గురుత్వాకర్షణకు లోబడి అనేక స్టెల్లార్ డిస్కులు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలకు ఈ స్టెల్లార్ డిస్క్‌లు చాలా కష్టంమీద సదరు నక్షత్ర గురుత్వాకర్షణ శక్తికి అందులో పడి పతనం కాకుండా పోరాడి బయటపడతాయని, అయితే నక్షత్ర ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకుపోలేక ఒక నిర్ధిష్ఠ కక్ష్యలో పరిభ్రమిస్తూ క్రమంగా ప్రొటోప్లానెట్లుగా మారతాయని డిస్క్ ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతం చెబుతోంది. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే దుమ్ము, ధూళి, వాయువులు (డస్ట్ అండ్ గ్యాస్ మాసెస్), అస్టరాయిడ్లవంటి అసంపూర్ణ ఆకారాలను స్టెల్లార్ డిస్క్లంటారు. తాజా చిత్రాలు ఇన్‌స్టెబిలిటీ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిశోధన వివరాలు జర్నల్ నేచుర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రొటోప్లానెట్ (ఆరిగే బీ– ఏబీ అని పేరుపెట్టారు) 20 లక్షల సంవత్సరాల వయసున్న కుర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థ కూడా సూర్యుడికి దాదాపు ఇంతే వయసున్నప్పుడు ఏర్పడింది. ఒక గ్రహం ఏ పదార్ధంతో ఏర్పడబోతోందనే విషయం అది ఏర్పడే స్టెల్లార్ డిస్కును బట్టి ఉంటుందని సైంటిస్టులు వివరించారు. కొత్తగా కనుగొన్న ఏబీ గ్రహం మన గురు గ్రహం కన్నా 9 రెట్లు బరువుగా ఉందని, మాతృనక్షత్రానికి 860 కోట్ల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోందని పరిశోధన వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ 13 సంవత్సరాల పాటు పంపిన చిత్రాలను, జపాన్‌కు చెందిన సుబరు టెలిస్కోప్ పంపిన చిత్రాలను పరిశీలించి ఈ గ్రహ పుట్టుకను అధ్యయనం చేశారు. దీనివల్ల మన సౌర కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడతాయని ఆశిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మస్తాన్ వలీని కస్టడీకి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసేందుకు జరిగిన కుట్ర కేసులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్ వలీ పాత్రపై హైదరాబాద్ సెంట్రల్ క్రెమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆయ న పాత్రను పక్కాగా నిర్ధారించడంతో పాటు సూత్రధారులను గుర్తించేందుకు అతడిని విచారించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో జైల్లో ఉన్న మస్తాన్ వలీని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మస్తాన్ వలీ విచారణ తర్వాతే ‘తెలుగు అకాడమీ’ సూత్రధారులు సాయి తదితరులకు ఈ కేసుతో ఉన్న సంబంధాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
టెన్నిస్ ప్లేయర్ ఆచూకిని సరైన ఆధారాలతో సహా తెల్పండి: యూకే
లండన్: బ్రిటన్ చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయ్ భద్రత దృష్ట్యా ఆమె ఆచూకికి సంబంధించి ధృవీకరించ దగిన ఆధారాలను అందించాలని చైనాను కోరింది. ఆమె అదృశ్యం కావడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని దయచేసి సాధ్యమైనంత వరకు సరైన ఆధారాలను త్వరితగతిన అందించాలంలూ బీజింగ్‌లోని యూకే విదేశీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు తమకు ఏం జరుగుతోందని భయపడకుండా ప్రతిఒక్కరు మాట్లాడటానికి ముందుకు రావలంటూ విజ్ఞప్తి చేసింది. (చదవండి: అమెజాన్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు) అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే లైంగిక వేధింపులకు సంబంధించిన అన్ని నివేదికలు సత్వరమే దర్యాప్తు చేయాలంటూ బ్రిటన్ వక్కాణించింది. పైగా యూనైటెడ్ స్టేట్స్, యూఎన్ టెన్నిస్ స్టార్ ఆచూకి కోసం పిలుపినిచ్చే నేపథ్యంలో చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ చక్కగా నవ్వుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా చైనా పోస్ట్ చేసింది. దీంతోబ్రిటన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రెండుసార్లు గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఛాంపియన్ని గెలుచుకున్న 35 ఏళ్ల పెంగ్ షువాయ్ ఆచూకీ గురించి అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. పైగా పెంగ్ ఈ నెల ప్రారంభంలో ఒక మాజీ వైస్ ప్రీమియర్ తనను సెక్స్ చేయమని బలవంతం చేశాడని ఆరోపించిన నేపథ్యంలోనే ఆమె ఆచూకి కానరాకపోవడం గమనార్హం. (చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య) -
కూతురి సాక్ష్యం, తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, మైసూరు(కర్ణాటక): తల్లిని తండ్రే హత్య చేయడం తాను చూశానని చిన్నారి కూతురు చెప్పిన సాక్ష్యంతో తండ్రికి శిక్ష పడింది. వివరాలు.. చామరాజనగర జిల్లా కోళిపాళ్య గ్రామానికి చెందిన తొళచనాయక్కు, పుష్పబాయికి పెళ్లి సమయంలో 20 గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఇచ్చారు. వీరికి 8 ఏళ్ల కూతురు ఉంది. తొళచనాయక్ తమ్మునికి సమస్య వస్తే డబ్బుల కోసం బంగారు నెక్లెస్‌ను కుదువ పెట్టాడు. నెక్లెస్‌ను విడిపించుకురావాలని భార్య ఒత్తిడి చేసేది. 2017 మార్చి 27న ఇదే విషయమై గొడవ జరగ్గా తొళచనాయక్ వేటకొడవలితో భార్యను నరికి చంపాడు. ఈ కేసులో తుది విచారణ చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. తండ్రి దాష్టీకంపై కూతురు సాక్ష్యం చెప్పడంతో నేర నిరూపణ అయ్యింది. దోషికి జీవితఖైదును విధించారు. -
మొదటిసారి నిందితుడిని చూస్తే అది బలహీనమైన సాక్ష్యమే: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక నేరం జరిగిన సమయంలోనే నిందితుడిని మొదటిసారి చూసి, ఆ తర్వాత కోర్టులో ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం అనేది అత్యంత బలహీనమైన సాక్ష్యాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులోనూ నేరం జరిగిన తేదీకి, కోర్టులో విచారణ జరిగే సమయానికి మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మరింత బలహీనంగా మారుతుందంది. మద్యం అక్రమ రవాణా కేసులో కేరళ అబ్కారీ చట్టం కింద దోషులుగా నిర్ధారించిన నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్‌ల ధర్మాసనం ఈ∙వ్యాఖ్యలు చేసింది. నలుగురు వ్యక్తులు 6,090 లీటర్ల మద్యాన్ని 174 ప్లాస్టిక్ క్యాన్లలో ఉంచి తప్పుడు రిజిస్టేషన్ ఉన్న వాహనంలో తరలిస్తున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 11 ఏళ్ల నాటి ఘటనలో మొదటిసారి ఆ వ్యక్తుల్ని చూసినందున వారిని గుర్తు పట్టలేకపోతున్నానని సాక్షి పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరిని మాత్రం ఐడెంటిఫికేషన్ పెరేడ్లో గుర్తు పట్టగలిగారు. దీంతో సుప్రీంకోర్టు ఆ సాక్ష్యం చెల్లదని ప్రకటించింది. నలుగురు నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
'సెలబ్రిటీల వద్ద డ్రగ్స్ లభించలేదు...కెల్విన్ వాంగ్మూలం సరిపోదు'
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సినీతారలపై కెల్విన్ ఇచ్చిన కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని, కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 'సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా సిట్ బృందం పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించింది. అయితే సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లభించలేదు. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదు. అంతేకాకుండా సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదు' అని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కాగా నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లను ఎక్సైజ్ శాఖ పొందుపరచలేదు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ గురించి మాట్లాడుతూ.. 'కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడు. వాట్సప్, మెయిల్ ద్వారా ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడు. చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదు. కెల్విన్, అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయం ఆధారాలున్నాయి. సోదాల సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు' అని ఎక్సైజ్ శాఖ వివరించింది. -
కృష్ణ జన్మస్థలి కేసులో కొత్తమలుపు
మథుర: శ్రీకృష్ణ జన్మస్థలిగా భావించే స్థలంలో లభించిన కొన్ని వస్తువులకు సంబంధించిన వీడియో ఆధారాలను కృష్ణ జన్మస్థలి పిటీషనర్లు కోర్టు ముందుంచారు. ఈ వస్తువులు హిందూ మతవిశ్వాసాలకు సంబంధించినవని, వీటిని తర్వాత నిర్మించిన మసీదునుంచి తొలగించడం లేదా కనిపించకుండా చేయడం జరిగిఉంటుందని వివరించారు. ప్రస్తుతం మథురలోని షాహీ మసీదు స్థలంలో కృష్ణ జన్మస్థలి ఉందని చాలా సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడున్న కట్రా కేశవ్ దేవ్ గుడి ఆవరణలోని షాహీ ఇద్గా మసీదును తొలగించాలని పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు ఆధారంగా తాజాగా ఒక వీడియోను కోర్టుకు సమర్పించారు. ఇందులో మసీదులో శేష నాగు చిహ్నం, తామర పువ్వు, శంఖం చూపుతున్నాయి. ఇవన్నీ తర్వాత కాలంలో మసీదు నుంచి తొలగించి ఉంటారని, లేదా కనిపించకుండా రంగులు వేసి ఉంటారని పిటీషనర్లు ఆరోపించారు. తదుపరి విచారణ ఈ నెల 15న ఉందని పిటీషనర్ల తరఫు న్యాయవాది మహేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు. ఆ రోజు భారత పురాతత్వ సంస్థతో భౌతిక సర్వే కోసం పట్టుపడతామని చెప్పారు. -
‘దిశ’ కమిషన్ విచారణకు మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ ఎదుట రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ శనివారం విచారణకు హాజరయ్యారు. అయితే అప్పటికే నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన ఆరిఫ్ (ఎన్కౌంటర్లో మృతి చెందాడు) తండ్రి హుస్సేన్‌ను విచారిస్తుండటంతో భగవత్‌ను విచారించలేదు. దీంతో ఆయన విచారణను కమిషన్ ఈనెల 13కి రీషెడ్యూల్డ్ చేసినట్లు తెలుస్తోంది. హుస్సేన్ విచారణ శనివారం పూర్తయింది. ఇప్పటివరకు రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి, షాద్‌నగర్ రోడ్లు, భవనాల విభాగం (ఆర్అండ్బీ) డీఈఈ ఎం రాజశేఖర్, దిశ సోదరిలను చైర్మన్, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇందులో దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని విచారించి కమిషన్ పలు కీలక సమాచారాన్ని రాబట్టింది. ఎన్కౌంటర్ తర్వాత నిందితుల మృతదేహాలకు పంచనామ చేసిన వైద్యులు, ఆయుధాలు (తుపాకులు) నిర్వహణ అధికారులు, సాంకేతిక, కాల్ రికార్డింగ్ బృందాలను విచారించనున్నట్టు సమాచారం. మరొక 15 రోజుల్లో సిర్పుర్కర్ కమిటీ విచారణ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇదిలా ఉండగా...ఇప్పటికే ఒక పర్యాయం నిందితుల కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్‌కు ‘ఇది బూటకపు ఎన్కౌంటర్’అని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని, పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
గాంధీ హాస్పిటల్ సీసీ ఫుటేజీలో బయటపడ కీలక సాక్ష్యాలు
-
Covid Vaccine: టీకాతో వ్యంధ్యత్వం రాదు
న్యూఢిల్లీ: పురుషులు, మహిళల్లో వ్యంధ్యత్వానికి (ఇన్ఫెర్టిలిటీ) కోవిడ్–19 వ్యాక్సినేషన్ కారణమవుతోందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ పూర్తి సురక్షితం, ప్రభావవంతం అని గుర్తుచేసింది. పాలిచ్చే తల్లులు సైతం కరోనా టీకా తీసుకోవచ్చని జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొంది. టీకా తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత బిడ్డకు పాలివ్వడం మానాల్సిన అవసరం లేదని సూచించిందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
లవ్ జిహాద్: విచారణలో కీలక విషయాలు
లక్నో: కర్ణాటక నుంచి హర్యానా వరకు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హిందూ యువతులను బలవంతంగా ముస్లింలుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని గట్టిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ జిహాద్’ పేరుతో ఇలా చేస్తున్నారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఇలాంటి పనులకు పాల్పడితే అంతిమ సంస్కారాలు తప్పవని బాహాటంగానే ప్రకటించారు. అయితే ఈ కేసులను విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి కేసులు కాన్పూర్‌లో 14 నమోదు కాగా వాటిలో 7 కేసులు విచారణ చేపట్టిన పోలీసులకు ఈ అన్ని కేసులలో తమ ఇష్టప్రకారమే యువతి యువకులు ఒక్కటయినట్లు తెలిసింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులు నీరుగారిపోయాయి. ఆగస్టు 7 వతేదీన జుహి కాలనికి చెందిన షాలిని యాదవ్ అనే యువతిని మహ్మమద్ ఫసిల్ అనే వ్యక్తి తమ కూతురి పై గన్ను గురిపెట్టి ఆమెను బలవంతంగా పెళ్లి తీసుకోని ఇస్లాంలోకి మారాలని బలవంతం పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ యువతి తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, తనకు నచ్చే ఇస్లాంలోకి మారానని ఇందులో ఎవరి బలవంతం లేదని కోర్టుకు తెలిపింది. ఇంకా వేరే కేసులో కూడా ఆ అమ్మాయి అబ్బాయి ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారని ఇలా కేసు పెట్టడానికి ముందు వరకు వారు బాగానే ఉన్నారని వారి ఇరుపొరుగువారు తెలిపారు. చదవండి:లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: సీఎం -
ఆస్తుల వివరాల కోసం ఒత్తిడి చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల సమాచారం ఇవ్వాలంటూ ప్రజలను ఒత్తిడి చేయ రాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబం ధించి ఆధార్ నంబర్, కులం వివరాలు సేకరించొ ద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సేకరించిన కోటి మంది ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించింది. సమర్థమైన చట్టాలు రూపకల్పన చేయకపోతే ప్రజలకు శాపంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. ప్రజల నుంచి ఆస్తులకు సం బంధించి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సమాచారం సేకరిస్తోందని, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఆధార్, కులం వివరాలు తప్పనిసరిగా అడుగుతోం దని న్యాయవాదులు ఐ.గోపాల్‌శర్మ, సాకేత్ కాశీ భట్‌లతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ‘వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి ప్రజల నుంచి సేకరించిన సమాచారానికి భద్రత ఎలా కల్పిస్తారు? ఏ స్థాయి అధికారి అధీనంలో ఈ సమాచారం ఉంటుంది? ఈ సమాచారాన్ని పరిశీలించే అధీకృత అధికారం ఎవరికి ఉంటుంది? సమాచారం బయటకు వెళ్లకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఏ చట్టం ప్రకారం వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు? ఏ నిబంధన ప్రకారం ఆధార్ నంబర్, కులం వివరాలు అడుగుతున్నారు? వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి యజమానితో పాటు ఇతర కుటుంబసభ్యుల ఆధార్ నంబర్లను ఎందుకు అడుగుతున్నారు? ఈ ప్రక్రియ ప్రజల వ్యక్తిగత విషయాల గోప్యతకు విఘాతం కలిగించేదిగా ఉంది. ఈ సమాచారాన్ని ఇతరులతో పాటు ప్రభుత్వం దుర్వినియోగం చేయదనే నమ్మకం ఏంటి?’అంటూ ధర్మాసనం ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంలోనూ సేకరించిన సమాచార భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయలేదని పేర్కొంది. ఏ అధీకృత అధికారి పర్యవేక్షణలో ఈ సమాచారం ఉంటుందో కూడా చట్టంలో లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందంటూ మండిపడింది. కాగా, ఈ వ్యవహారంపై 2 వారాల సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. ధరణిలాగే మరో నాలుగు యాప్స్... ‘ప్రభుత్వం తీసుకొస్తున్న ధరణిని పోలిన నాలుగు యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది ప్రభుత్వం నిర్వహిస్తున్నదో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచారాన్నే హ్యాక్ చేసినట్లుగా పత్రికల్లో కథనాలు చూశాం. ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని హ్యాకర్స్, ఇతరులు తస్కరించకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని హ్యాక్ చేయరనే భరోసా ఏంటి? ఆధార్ వివరాలను సంక్షేమ పథకాల అమలులో భాగంగా మాత్రమే తీసుకోవాలని సుప్రీం కోర్టు పుత్తస్వామి కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా 2020లో తెచ్చిన చట్టంలో పేర్కొనకుండా, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆధార్ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ మా ఇంటికీ వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. అయితే వచ్చిన వారు ప్రభుత్వ అధికారులేనా? వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్, భూ హక్కుల చట్టం–2020 వ్యవసాయ భూములకు మాత్రమే. అలాంటప్పుడు వ్యవసాయేతర ఆస్తుల వివరాలు కోరడం చట్టబద్దం కాదు’అంటూ ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. కర్ణాటకలో కొట్టేశాం.. ‘ఉబర్ క్యాబ్స్‌కు సంబంధించి.. క్యాబ్ బుక్ చేసుకున్న వారి ఫోన్ నంబర్‌ను ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా తెలుసుకునేలా కర్ణాటక ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు ఐటీ, ఇతర చట్టాల మేరకు మార్గదర్శకాలు రూపొందించింది. అయితే అప్పడు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఈ కేసును సుదీర్ఘంగా విచారించి ఆ మార్గదర్శకాలను కొట్టేశాను’అని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. ఇంచు భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయరట.. ధరణిలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోకకపోతే ఇంచు భూమి కూడా ఇతరులకు అమ్ముకోలేరంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయని సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదించారు. వ్యవసాయేతర ఆస్తుల సేకరణ చట్ట విరుద్ధమని, ఆధార్, కులం వివరాలు అడగడం సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వివేక్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరిన వారికి ఇవ్వాల్సి ఉంటుందని మరో న్యాయవాది సుమన్ పేర్కొన్నారు. మెరుగైన పాలన కోసమే.. భూ క్రయవిక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు, మెరుగైన పాలన కోసమే ప్రజల నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు తదితర సంక్షేమ పథకాల కోసమే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు అడుగుతున్నామని పేర్కొన్నారు. అయితే ఎలాంటి ఆస్తులు లేని వారికే కదా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేది అంటూ ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. -
ఆమె మృత్యు ఘోషకు భయపడే..
సాక్షి, న్యూఢిల్లీ : ఒళ్లంతా ఛిద్రమై పక్షం రోజులపాటు ఆస్పత్రిలో అవస్థపడి అశువులు బాసిన 19 ఏళ్ల కూతురును కడసారి నుదిటి మీద ముద్దు పెట్టుకొని కాటికి పంపుదామనుకున్న ఆ కన్న తల్లి కల నెరవేరలేదు. పొంగి పొర్లుకొచ్చే కన్నీటి బిందువులు కనిపించకుండా ముఖాన కొంగు కప్పుకొని ఆఖరి సారి ఆప్యాయంగా ఆ చెంప నిమిరి పంపించాలనుకున్న కుటుంబ సభ్యుల ఆఖరి కోరిక తీరలేదు. అంబులెన్స్‌లో ఇంటికొచ్చిన మృతదేహాన్ని ఆపండంటూ ఇంటి ముందే గుమిగూడిన జనం అడ్డం పడినా....పట్టించుకోకుండా నేరుగా శ్మశానానికి పంపించి అర్ధరాత్రి దాటాక దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించిన పోలీసులకు ఎన్ని శాపనార్థాలు పెడితే ఏం లాభం...? మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉండనిస్తే మరుసటి రోజు పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందని తెలిసే రాత్రికి రాత్రే దహన సంస్కారాలు జరిపించామని ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ పోలీసులు స్వయంగా కోర్టు ముందే ఒప్పుకున్నారు. వారి చెబుతున్నది అబద్ధమని, నలుగురు నిందితులను అత్యాచారం నుంచి తప్పించేందుకు ‘రేప్ జరగలేదు’ అంటూ ఫోరెన్సిక్ నివేదిక తీసుకున్న పోలీసులు, మరోసారి అటాప్సీ చేయడానికి ఆస్కారం లేకుండా దేహాన్ని దగ్ధం చేశారని ఇటు కాంగ్రెస్, అటు దళిత పార్టీలతోపాటు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. (మేమిద్దరం ఫ్రెండ్స్.. వాళ్లే చంపేశారు..) ఆలిగఢ్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన సాక్షాత్తు మేజిస్ట్రేట్ నమోదు చేసిన దళిత యువతి మరణ వాంగ్మూలంలో నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై దాడి జరిగిందని తప్ప రేప్ జరిగిందని ఆ దళిత యువతి ఆరోపించలేదంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేసిన వీడియో క్లిప్ ద్వారా కూడా వాస్తవం ఏమిటో తెలుస్తోంది. తనపై నలుగురు యువకులు ‘జబర్దస్థ్’ చేశారని ఆ వీడియోలో దళిత యువతి నాలుగు సార్లు ఆరోపించింది. దారుణంగా రేప్ చేశారని చెప్పడాని యూపీ హిందీ యాసలో ‘జబర్దస్థ్’ అని వాడడం అక్కడ సర్వసాధారణం. అత్యాచారం జరగలేదని ఢిల్లీ ఆస్పత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. రేప్ జరిగిందని చెప్పడానికి ఆనవాళ్లు లేవని, లైంగికదాడి జరిగిన 15 రోజులకు వైద్య పరీక్షలు జరిపితే అలాంటి ఆనవాళ్లు దొరకవని వైద్య నిపుణులే తేల్చి చెప్పారు. (భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!) తెల్లారితే మృతదేహం వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగే అవకాశం ఉందని తెలిసే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేశామంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంలోనే నిజముందని అనిపిస్తోంది. ఇదే కారణంగా కశ్మీర్లో అనాదిగా మిలిటెంట్ల మృతదేహాలను, భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో మరణించిన వారి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు జరుపతూ వస్తున్నారు. ఇక టెర్రరిస్టుల విషయంలోనైతే దహనం తర్వాత మిగిలే బూడిదను కూడా ఎవరికి దొరక్కుండా చేస్తున్నారు. దళిత యువతి మరణ వార్త ఇప్పటికే ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించగా, మృతదేహం రూపంలో ఆమె వినిపించే మృత్యుఘోష ఎంత మందిని కదిలిస్తుందో, ఎంత హింసను సృష్టిస్తుందోనన్న పోలీసుల భయంలో నిజం లేదనలేం! (హథ్రాస్ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు) -
హంతకుడిని పట్టించిన గుండీ
ఔరంగాబాద్: చిన్న ఆధారమూ క్రిమినల్ కేసులో ఎంత కీలకంగా మారుతోందో చెప్పే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఔరంగాబాద్‌లో బికన్ నిలోబ జాదవ్‌ను ఏడు నెలల క్రితం కొందరు హత్య చేశారు. ఘటనా స్థలంలో పోలీసులకు గుండీ మాత్రమే దొరికింది. గుండీ మీద రోప్లాస్ట్ స్టిచ్ అనే అక్షరాలు ఉండటంతో పోలీసులు ఆయా విక్రేతల నుంచి ఎవరెవరు చొక్కాలు కొనుగోలు చేశారో పరిశీలించారు. దాదాపు 10 వేల మంది వారి నుంచి చొక్కాలను కొనగా అందులో 246 మందికి నేరచరిత్ర ఉంది. అందులో హత్యకు నాలుగు రోజుల ముందు రగాడే అనే వ్యక్తి కత్తులను కొనుగోలు చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో మిగిలిన వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అజయ్ రగాడే, చేతన్ గైక్వాడ్, సందీప్ గైక్వాడ్‌లు ఈ హత్య చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. -
మా దగ్గర అన్నింటికీ ఆన్సర్లున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో : దిశ మిస్సింగ్, ఆపై హత్యచారంలో కేసు నమోదు నుంచి నిందితుల ఎన్కౌంటర్ వరకు అంతా చట్టపరిధిలోనే జరిగిందని చెబుతున్న సైబరాబాద్ పోలీసులు.. అందుకు తగిన ఆధారాలు సిద్ధం చేశారు. గత నెల 27న దిశా ఘటన జరిగినప్పటి నుంచి ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కూడా వస్తున్న విమర్శలన్నింటికీ పక్కా సాక్ష్యాలతో రూపొందించిన నివేదికను ఇటు న్యాయస్థానాలకు, అటు హక్కుల కమిషన్‌కు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్‌కౌంటర్‌పై కొందరు సానుకూలంగా, మరికొందరు వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ప్రతి అంశాన్ని పక్కాగా నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ఈ కేసు విచారణలో సీసీ కెమెరాల ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు, పరిస్థితులను బట్టి నిర్ధారించే సర్కమ్స్టాన్సియల్ ఎడివెన్స్‌లతో పాటు లారీలో సేకరించి ఫోరెన్సికల్ ల్యాబ్‌కు పంపిన రక్తపు మరకలు, వెంట్రుకలే కీలక ఆధారాలుగా ఉన్నాయి. కిడ్నాప్, అత్యాచారం, హత్య.. ఇవి జరుగుతున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, హతురాలి శరీరం కాలిపోవడంతో స్వాబ్స్ వంటివి సేకరించే పరిస్థితి లేదు. కాగా, ఎన్కౌంటర్ మరణాలకు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాల ప్రకారం ఇప్పటికే షాద్‌నగర్ ఠాణాలో చటాన్‌పల్లి వద్ద జరిగిన నలుగురి ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్తోపాటు కేసు డైరీ, ఎంట్రీలు, పంచనామాల తదితర సమాచారాన్ని కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడా అతిక్రమించలేదని, నిందితులు ఎదురుతిరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని సైబరాబాద్ పోలీసులు స్పష్టంచేస్తున్నారు. -
ఇక పోలీసుల నుంచి తప్పించుకోలేరు!
కేసు నమోదుతోనే పోలీసుల పని అయిపోదు. నేర పరిశోధన చేయాలి. అన్ని ఆధారాలూ సేకరించాలి. సాక్ష్యాలను కోర్టు లో ప్రవేశపెట్టాలి. నేరాన్ని రుజువు చేయాలి. నిందితుడికి శిక్ష పడేలా చూడాలి. అప్పుడే కేసుకు న్యాయం చేసినట్లు.. పోలీసులు విజయం సాధించినట్లు.. ఇటీవలి కాలంలో కామారెడ్డిలో పలు కేసులను పోలీసులు ఛేదించారు. నిందితులకు శిక్ష పడేలా చేశారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ కృషితో మూడు నెలల్లో ఐదు కేసుల్లో జీవిత ఖైదు పడడం గమనార్హం. సాక్షి, కామారెడ్డి: ఏ కేసులో అయినా పోలీసులు సరైన కోణంలో దర్యాప్తు చేసి న్యాయస్థానంలో సాక్ష్యాలను ప్రవేశపెడితే నిందితులు శిక్ష నుంచి తప్పిం చుకోలేరని ఇటీవల వెలువడిన తీర్పు లు స్పష్టం చేస్తున్నాయి. కామారెడ్డి జి ల్లా ఏర్పాటైన తరువాత ఎస్పీగా శ్వేత బాధ్యతలు స్వీకరించారు. ఆమె కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకూ తమ సిబ్బందికి, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ పోలీసు యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఎస్పీ శ్వేతకు సాంకేతిక అంశాలపై మంచి పట్టు ఉంది. దీన్ని కేసుల ఛేదనకు ఉపయోగిస్తున్నారు. ఎక్కడ హత్య జరిగినా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి వెళ్లడం, నేరస్తులను పట్టుకునేందుకు చేయాల్సిన పనులను అక్కడి అధికారులు, సిబ్బందికి సూచించడం ద్వారా చాలా కేసులను త్వరగా ఛేదించగలుగుతున్నారు. నిందితులకు శిక్షలూ పడుతున్నాయి. ఒక్క హత్య కేసులే కాకుండా దోపిడీ, దొంగతనాలు వంటి కేసుల్లోనూ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని, శిక్ష పడే విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు. ఆధారాల సేకరణ నేరస్థలంలో ఏ చిన్న ఆధారం దొరికినా నిందితుల వివరాలు సేకరించడం పెద్ద కష్టం కాదు. హతుడు గుర్తు తెలియని వ్యక్తి అయినపుడు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. హతుడు తెలిస్తేనే హంతకులు చిక్కుతారు. హతుడి వివరాలు తెలిస్తే హంతకులు ఎవరో తేలిపోతుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత వివరాల సేకరణ కొంత సులువైంది. ప్రధానంగా హతుడికి సం బంధించిన సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా హత్యకు ముందు ఎవరితో మాట్లాడాడు అన్నది తె లుస్తోంది. హత్య కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం.. నేరం జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు సేకరించడం ద్వారా నిందితులను గుర్తిస్తుంటారు. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు కూడా ఒక్కోసారి కేసులో కీలకంగా మారతాయి. పోలీసులు కేసు దర్యాప్తు అనంతరం ఆయా వివరాలను కేస్‌డైరీ రూపంలో న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. కేసు నమోదు నుంచి నిందితుల గుర్తింపు వరకు సాక్ష్యాధారాలు ఇతరత్రా అన్నింటినీ కోర్టు ముందుంచుతారు. కోర్టులో నమోదు చేసిన వివరాల్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా నిందితుడి తరపున వాదించే డిఫెన్స్ లాయర్‌కు అవకాశం దొరుకుతుంది. కాబట్టి పోలీసులు సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయంతో పొరపాట్లకు తావులేకుండా కేసుడైరీ రూపొందిస్తున్నారు. భార్యపై అనుమానంతో హత్య.. 2009 ఫిబ్రవరి 2న సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వహీదా (35) అనే మహిళ హత్యకు గురైంది. తన భార్యపై అనుమానంతో ఆమె భర్త అబ్దుల్ హకీం పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేనిది చూసి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సదాశివనగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అప్పటి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేయగా.. సీఐ రవికుమార్ దర్యాప్తు చేపట్టారు. కొద్దిరోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన హకీం విదేశాలకు పారిపోవడంతో కేసు విచారణకు అంతరాయం ఏర్పడింది. పదేళ్ల తరువాత నిందితుడు సొంత గ్రామానికి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తొమ్మిది మంది సాక్షులను ప్రాసిక్యూషన్ తరపున ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో గతనెల 26న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి బి.సత్తయ్య తీర్పు వెల్లడించారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. కేసు పరిశోధనలో, సాక్షాధారాలను రుజువు చేయడంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమృత్‌రావు వైద్య, ఎస్సై లింబారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారి రాజారాం సాయిలు చురుకుగా పనిచేశారు. కన్నతల్లిని చంపిన కొడుకు.. 2017 ఆగస్టు 10న దేవునిపల్లి గ్రామానికి చెందిన నోముల వెంకటలక్ష్మి (65) అనే వృద్ధురాలు తన ఇంట్లోనే దారుణహత్యకు గురైంది. అప్పటి రూరల్ సీఐ కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. విచారణ జరుపగా మృతురాలి కుమారుడు సత్యనారాయణే హత్య చేశాడని తేలింది. అతడు తరచుగా డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. స్థలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుల కోసం సంఘటన జరిగిన రోజు కూడా తల్లికొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తన తల్లిని చంపితే కానీ డబ్బులు దక్కవని భావించిన సత్యనారాయణ.. 2017 ఆగస్టు 10న సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండగా వెదురు నరికే కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హతమార్చారని సమాచారం ఇచ్చాడు. పోలీసులు విచారణలో నేరం వెల్లడైంది. దీంతో ప్రాసిక్యూషన్ తరపున 11 మంది సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో తల్లిని హత్య చేసిన సత్యనారాణయణకు జీవిత ఖైదు, రూ.500 జరిమానా, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో మూడేళ్లు, జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ గతనెల 26న న్యాయమూర్తి బి.సత్తయ్య తీర్పు వెల్లడించారు. ఈ కేసు పరిశోధనలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమృతరావు, సీఐ కోటేశ్వర్రావు, కోర్టు లైజన్ ఆఫీసర్ లింబారెడ్డి, కోర్టు కానిస్టేబుల్ రమేశ్ తదితరులు చురుకుగా పనిచేశారు. భార్యను చంపిన భర్త.. 2015 ఏప్రిల్ 27న గాంధారి మండలం వండ్రికల్కు చెందిన సుమలత అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురా లి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆ మె భర్త చిన్నప్ప ఉరివేసి చంపాడని ని ర్ధారించారు. సరైన సాక్షాధారాలను ప్రవేశపెట్టడంతో నిందితుడికి గత నెల 15న నిజామాబాద్ ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్‌రెడ్డితో పాటు పోలీసులు చురుకుగా పనిచేశారు. ఇటీవలి కాలంలో మరో రెండు కేసుల్లోనూ ఇద్దరికి జీవిత ఖైదు పడింది. నేరస్తులకు శిక్ష పడాల్సిందే.. నేరాలను అరికట్టడం ఎంత ముఖ్యమో నేరం చేసిన వారికి శిక్ష పడేలా చూడడం కూడా అంతే ముఖ్యం. జిల్లాలో ఇటీవలి కాలంలో ఐదుగురు నేరస్తులకు జీవిత ఖైదు పడింది. ఆయా కేసుల పరిశోధనలో పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కృషి అభినందనీయం. నేరస్తులకు శిక్షలు పడినప్పుడు ఇతరులు నేరం చేయాలంటే కొంత వెనుకంజ వేస్తారు. అందుకే నేరం చేసిన వారికి శిక్షలు పడడం న్యాయం. – ఎన్.శ్వేత, ఎస్పీ, కామారెడ్డి శిక్ష భయంతో నేరాలు తగ్గుతాయి సాక్ష్యాలు తారుమారు కాకుండా పక్కాగా చర్యలు తీసుకోవడం మూలంగా శిక్షలు సాధ్యమవుతున్నాయి. ప్రాసిక్యూషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరుగుతున్నాయి. సాక్ష్యాలతో పాటు సాంకేతిక అంశాలను జోడించడంతో నేరస్తులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేసుల నిరంతర పర్యవేక్షణ మూలంగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. గతంలోలాగా కాకుండా నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఏర్పడడం వల్ల నేరాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. –వైద్య అమృత్‌రావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, కామారెడ్డి -
అవంతిపూరా దాడిలో ఎన్ఐఏ చేతికి కొన్ని ఆధారాలు
-
సాయి తేజ స్వరూపం
ఏదీ తగిన ప్రమాణం ఆధారం లేకుండా దీన్ని మీరు నమ్మి తీరాల్సిందే! అనే తీరు ధోరణి సాయి చరిత్రలో కనిపించనే కనిపించదు. ఆ దృష్టితోనే అలాంటి సాక్ష్యాలతో కూడిన సంఘటనలతో సాయి.. ఈ అనంత పృథ్వినీ జలాన్నీ తన అధీనంలోకి వినయంతో.. భక్తితో.. గౌరవంతో మాత్రమే... తెచ్చుకోగలిగాడని నిరూపించుకుని తెలుసుకున్నాం. ఈ క్రమంలో తేజస్సు అనే పంచభూతాల్లోని మూడవదాన్ని ఎలా అదుపులోనికి తెచ్చుకోగలిగాడో చూద్దాం! శాంతించు! ప్రతిరోజూ మసీదులో ఉన్న ధుని(అగ్నిహోత్రస్థలం)లో భక్తులు తెచ్చిన కట్టెలని వేస్తూనే ఉండేవాడు సాయి. భక్తులు కూడా ధునికి ప్రదక్షిణాన్ని చేస్తూ భక్తి గౌరవ ప్రపత్తులతో కట్టెలని వేస్తూ ఉండేవారు. ఆ అగ్నిహోత్ర కార్యక్రమం చూడటానికి నయన మనోహరంగా ఉంటూ ఉండేది. కేవలం కట్టెల్ని తగలబెట్టడం దీని లక్ష్యం కాదనీ, మన పూర్వజన్మపాపకర్మలని అగ్నిలో ఎవరికి వారు దహించివేసుకోవడమనేది దీని లక్ష్యమనీ సాయి భక్తులందరికీ బోధ చేస్తూ ఉండేవారు వివరంగా. అయితే కిందిస్థాయి పామరునికి కూడా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. దాంతో విశేషసంఖ్యలో భక్తులొస్తూ నిత్యం ధుని కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఓ వేసవి కాలంలో.. అందునా మిట్ట మధ్యాహ్నపువేళ ధునిలో కట్టెల్ని అందరూ క్రమంగా వేస్తూ ఉంటే మంటలు మరింత అయ్యాయి. కొద్ది ఎత్తు తక్కువగా ఉన్న ఆ మసీదులో దూలాలు కొద్ది కిందుగానే ఉన్న కారణంగా ఎక్కడ ఆ మంటలు ఆ దూలాలకి అంటుకుని ఏ ఉపద్రవాన్ని తెచ్చిపెడతాయోనని భక్తులు కట్టెలని వేయడం తగ్గించారు. ఓ దశలో మానేసారు కూడా. అందరి దృష్టి పూర్తిగా అగ్నికారణంగా మసీదు పైకప్పుకి మంటలు వ్యాపిస్తాయేమోననే ఆలోచనతో ఉండిపోయింది గానీ, దాదాపుగా ఆధ్యాత్మిక భావం ఎవరిలోనూ లేదు. పోనీ ఆ దశలో సాయి కూడా వెనక్కితగ్గచ్చుగా కర్రలని ధునిలో వేయకుండా. ఆయన కట్టెలని ఎగదోస్తూ కర్రలని వేస్తూ ఇంకా అగ్నిహోత్రం విజృంభించేలానే చేస్తూ ఉండటం భక్తులందరికీ ఆవేదనని కలిగించింది. ఆయనతో మాట్లాడలేక.. పరిస్థితిని వివరించలేక.. ఒక పక్క కొన్ని నీటి బిందెలని సిద్ధం చేసారు. మరో పక్క కట్టెలమోపులోని కట్టెలని కొన్నింటిని పక్కకి జరిపేసారు. ఇంతలో సాయి ఆ ధునిలోని అగ్ని జ్వాలలని గమనించి మరింత ఎత్తుగా మసీదులోపలి కప్పుకి అగ్ని అంటుకోబోతోందని గ్రహించి భక్తులతో ఆ నీటిబిందెలని తేవలసిందని అనలేదు. అగ్నిని చూస్తూ తన చేతిలోని సటకాతో ఆ పక్కనున్న స్తంభం మీద కొడుతూ.. ‘‘అగ్నిదేవా! శాంతించు! శాంతించు!! దిగిపో! దిగు! దిగు!!’’ అనడం మొదలెట్టాడు. సటకాతో కొట్టిన ఒక్కొక్క దెబ్బకి కొంచెం కొంచెం తప్పున జ్వాల తగ్గుతూ తగ్గుతూ మొత్తం అగ్ని శాంతించింది. భక్తుల ఆశ్చర్యానికి అవధి లేదు. కట్టెలని తగ్గించుకుండానూ, ఏ నీళ్లో పోయకుండానూ మంటలు అదుపులోకి రావడమంటే సామాన్య విషయమా? ఈ కారణంగా సాయి.. అగ్నిత (తేజస్సు నిప్పు)ని కూడా తన అదుపులో ఉంచుకోగలగాడని అర్థమయింది భక్తులకి. దైవశక్తి విజృంభించిన వేళ మనుష్యశక్తి (నీళ్లు పోయడం.. కట్టెల్ని తగ్గించడం..) ఏ విధంగానూ ప్రయోజనపడదని దీని ద్వారా గ్రహించాలి. ఇంతకీ అగ్ని సాయికి ఎందుకు అధీనుడై ఉన్నాడో మరో సంఘటనని కూడా తెలుసుకున్నాక వివరించుకుందాం! వేడి వంటపాత్రలో చేయిపెట్టి.... చక్కగా వెలుగుతున్న దీపంలో ఎక్కడా చీకటి అనేది ఎలా కనిపించదో... బాగా తృప్తిగా భోజనం చేసిన వ్యక్తిలో ఎలా ఆకలి అనేది మచ్చుకైనా ఉండదో... అలా సాయి చేసే ఏ చేష్టలోనూ ఏ దోషమూ ఉండదు సరికదా! నేర్చుకోవలసిన అంశమే ఉండి తీరుతుంది. తాను భోజనాన్ని చేయడం కంటే పదిమందికి అన్నాన్ని పెట్టడంలో చెప్పలేని తృప్తినీ, ఆనందాన్నీ పొందుతూ ఉండేవాడు సాయి. భోజనాన్ని పెట్టడంలో కూడా ముందుగా కుంటి, గుడ్డి, కుష్ఠిరోగస్థులూ, ఇతర రోగులూ, అతి వృద్ధాప్యం కారణంగా ఆకలికి ఆగలేనివారూ, అంగవికలురూ ఉంటే వారికి పెట్టేవాడు. ఆ మీదట మాత్రమే అందరికీ భోజనం. ఎప్పుడూ ఒక్కడే దొంగలాగా తినరాదంటూ ఉండేవాడు. పశుపక్షి, క్రిమికీటకాలకి ఓ సమయమంటూ ఉండదు కాబట్టి ఎప్పుడూ వాటికి ఆహారాన్ని ఓ స్థలంలో వేస్తూనే ఉండాలంటూ ఉండేవాడు. సాయి వద్ద రెండే రెండు వంటపాత్రలుండేవి. ఒకటి వందమందికి ఆహారాన్ని వండగలిగేదీ.. మరోటి 50 మందికి సరిపోయేలా వండగలిగేదీను. ఎప్పుడూ భక్తజనుల సంఖ్యని గమనించి తానే వండి వడ్డించేవాడు. దాంట్లో అపరిమితానందాన్ని పొందుతుండేవాడు. ఇలా ఉండగా ఓ సారి దాదాకేల్కర్ అనే తన భక్తుడ్ని పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికిందో లేదో పరీక్షించి చెప్పు అన్నాడు. జాతికి బ్రాహ్మణుడైన కేల్కర్ ఆ పలావు గిన్నె మూతని కూడా తీయడానికి ఇష్టం లేనివాడౌతూ.. సాయి దగ్గరకొచ్చి బాగానే ఉందని సమధానం చెప్పాడు. దాంతో సాయి నవ్వుతూ.. ‘‘మూత తీయలేదు. వాసన చూడలేదు. దాని పదునుని పరిశీలించలేదు. నాలుకతో రుచి చూడలేదు. ఎలా బావుందని చెప్పావు?’’ అంటూ కేల్కర్ ఎందుకు చూడలేదో గమనించి మరోమారు నవ్వుకున్నాడు.వెంటనే తనకి తానే ఆ మరుగుతున్న పలావు డేగిసాలో తెడ్డు పెట్టకుండా తన చేతినే పెట్టి కలయదిప్పుతూ.. ఇప్పుడు డేగిసాలోని పదార్థాలన్నీ ఒకటికొకటి కలిసి మంచి రుచిని ఇయ్యబోతున్నాయనడమే కాకుండా కేల్కర్ చేతిని పట్టుకుని డేగిసాలో పెట్టించాడు కూడా. ఏ విధంగానూ ఇద్దరి చేతులూ కాలకపోవడాన్ని గమనించిన భక్తజనమంతా ఆశ్చర్యపడ్డారు.కేల్కర్ బ్రాహ్మణత్వాన్ని కించపరచడం సాయి లక్ష్యమే కాదు. మరోమారు ఆ విశేషాన్ని గమనిద్దాం! ఈ సంఘటనలో అగ్ని సాయికి అధీనుడై ఏ మాత్రమూ గాయపరచలేదు. సాయినే కాదు కేల్కర్‌ను కూడా. అగ్ని ఎందుకు సాయికి సహకరిస్తూ సాయికి అధీనుడయ్యాడో తెలుసుకోబోయే ముందు అగ్ని బాధకి సాయి గురైన ఓ సంఘటనని కూడా తెలుసుకోవాల్సి ఉంది. కాలిన చేతితో సాయి ఓ సంవత్సరంలో అది దీపావళి రోజు. సాయికి పరమభక్తులైన మాధవరావు, దేశపాండే, తాత్యా మొదలైన ఎందరో సాయి చుట్టూ ఉన్నారు. సాయి ఆ ధునిలో కట్టెలని చేతితో పైకి ఎగదోస్తూ ‘అల్లాహ్ హో మాలిక్’ (అల్లాయే నిజమైన నా యజమాని) అంటూ పరవశించిపోతూ ధునిని ప్రజ్వరిల్లజేస్తూ ఉన్నాడు. అందరూ చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా తన చేతిని తానే ఆ మంటలో పెట్టి క్షణకాలంలో పైకితీసుకున్నాడు. కణకణమండే ఆ కట్టెల మంటకి సాయి చేయి కాలింది. నల్లగా కమిలిపోయింది.సాయి మాత్రం ఏ మాత్రపు బాధా లేకుండా ఉంటే.. మాధవురావు మాత్రం గట్టిగా కేకలు వేస్తూ.. ‘‘బాబా! ఏమిటీ పని? అగ్నిహోత్రానికి నీ చేతిని కానుకగా ఇయ్యలనుకున్నావా? మా భక్తుల పరిస్థితిని గమనించవా?..’’ అని అరుస్తూ ఉన్నాడు. భక్తులందరికీ ఏమీ తోచలేదు.సాయి నిదానంగా.. ‘మాధవరావూ! ఏ ప్రమాదమూ లేదయ్యా! నా చేతికి నిప్పు అంటుకుని గాయమైన ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేని పక్షంలో మాడి మసి అయిపోయేవాడు’ అన్నాడు. ఎవరికీ ఏమీ అర్థం కాకపోతే సాయే వివరించాడు వృత్తాంతాన్ని. ‘‘ఇనుప పనిని చూస్తూ ఇనుప వస్తువులని తయారు చేసే కమ్మరివాడొకడున్నాడు. కమ్మరి వాళ్లెందరు లేరు? అయితే ఆ కమ్మరికి అసూయ లేదు. తెగ సంపాదించెయ్యాలనే అత్యాశ లేదు. అన్నింటికీ మించి ‘సర్వం దైవ అనుగ్రహమయం’ అనే చక్కని బుద్ధి అతనిది. మంచి జరిగినా, చెడు కలిగినా అదంతా దైవదత్తమే.. దైవకల్పితమే.. అనుకునే ఉత్తమ లక్షణం అతనిది. ఇక్కడికి 300 మైళ్ల దూరంలోని చిన్న పల్లెలో ఉంటున్న అతనికి సుస్తీ (అనారోగ్యం) చేస్తే అతని కమ్మరి పనిలో గాలి తిత్తి కొలిమిని అతడి భార్య వేయడం మొదలెట్టింది. కణకణమండే నిప్పులకొలిమి సమీపంలో కూచుని తిత్తిని వేస్తుంటే పిల్లవాడు పాలకి ఏడ్చాడు. వాడ్ని ఒళ్లో వేసుకుని తిత్తివేస్తూ అనారోగ్యంతో ఉన్న భర్త పిలవగానే.. అతనికి ఎలా ఉందో, ఏమయిందోనని హఠాత్తుగా లేవగానే ఒళ్లోని బిడ్డ కొలిమిలో పడిపోయాడు. వాడు ‘సాయీ! బాబా!!’ అన్నాడు. అంతే! చేతిని చాచి బయటికి తీశాను. అపాయం లేకుండా ఒళ్లు కాలకుండా బయటికి వచ్చాడు. నా చేయి కాలితే ఏమైంది?’’ అన్నాడు సాయి.ఇదేదో కట్టుకథ కాదు. విచారించగా అక్కడివాళ్లు వచ్చి నిజమని చెప్పిన సత్యకథ. అయితే ఇక్కడ మనకో సందేహం రాక మానదు. ‘మరి సాయి పంచభూతాలకీ అధికారి అనీ, వాటిని తన అధీనంలో ఉంచుకున్నాడనీ అన్నారు గదా మరి అగ్నిదేవుడు సాయి చేతిని ఎందుకు కాల్చాడు? అని. నిజమే కదా! కర్మానుభవం ఎవరికి వ్యాధి వస్తే వాళ్లే బాధని అనుభవించవలసినట్లుగానూ, వ్యాధి వచ్చిన వారికి దగ్గరివాళ్లూ, బంధువులూ, ఆప్తులూ, మిత్రులూ ఎవరి స్థాయిలో వాళ్లు సహాయపడటం వరకు మాత్రమే చేయగలిగేటట్లూ ఎవరి పాపకర్మని వాళ్లు మాత్రమే అనుభవించక తప్పదు. ఏ మహనీయుల్నో మనసా–వాచా–కర్మణా(త్రికరణశుద్ధిగా) నమ్మి ఆరాధిçస్తున్న పక్షంలో వాళ్ల సహాయం సకాలంలో తీరుతుంది. ఇదీ ఇక్కడి రహస్యం. కాబట్టి కమ్మరికీ, కమ్మరివాని భార్యకీ, అతడి పుత్రునికీ సంబంధించిన పాపఫలానికి అనుగుణంగా ఆ మానసిక ఆందోళననీ, ఆ వ్యాధి బాధనీ ఆ దంపతులు పొందవలసివస్తే, ఆ పుత్రుడు తాత్కాలిక అగ్ని బాధకి గురి కావలసిన సందర్భం రావడం, అంతలోనే అతడు నమ్మిన సాయి రక్షించడమనేవి జరిగాయి. చివరికి మోక్షాన్ని పొందినా భారతంలో ‘భీష్ముడూ’, శ్రీమద్రామయణంలో ‘అహల్యా’, భాగవతంలో ‘పరీక్షిత్’ ఎలా తీవ్రమైన మనో వ్యథకీ, అవమానాలకీ, అపనిందకీ గురయ్యారో ఇదీ అలాంటిదే. ఆ కర్మఫలాన్ని ఆ పుత్రుని నుండి తాను తీసుకోదలిచాడు కాబట్టీ, ఆ కర్మఫలం సిద్ధుడైన సాయిది కాదు కాబట్టీ తప్పక తానూ సాధారణ వ్యక్తిలా అగ్ని బాధకి గురికావలసే వచ్చాడు. రుణమంటూ ఒకరి వద్ద చేసాక దాన్ని తీర్చడం తప్పనిసరి. ఆ రుణాన్ని తానే తీర్చనక్కరలేదు తనకి సహాయకునిగా ఉన్న ఎవరైనా కూడా తీర్చవచ్చు. ఆ తీర్చడానికి కావలసిన ఇబ్బంది ఏదైనా ఉంటే పడవలసింది కూడా రుణాన్ని తీర్చదలచిన వ్యక్తే. ఏది ఏమైనా రుణం మాత్రం తీర్చబడాల్సిందే! అందుకే సాయి చేతికి అగ్ని గాయమయిందనేది సమాధానం. లో రహస్యం శ్రీమద్రామాయణ భారత భాగవతాల్లో మనం ‘అస్త్రా’లనే పేరిట కొన్నింటిని గూర్చి చదువుతాం. వింటాం. శస్త్రమంటే కేవలం ఎదుటి శత్రువుని వధించడం కోసం వాడే మారణాయుధం. అదే మరి అస్త్రం అన్నట్లైతే ఆ శస్త్రానికే మంత్రశక్తిని జోడించి ప్రయోగించబడేది అని అర్థం. ఏ పేరున్న అస్త్రమైతే ఆ దైవానికి సంబంధించిన మంత్రాన్ని జపించి.. జపించి.. ఆ శక్తిని ఆ శస్త్రంలోనికి నింపితే ఆ పేరిటి అస్త్రమౌతుందన్నమాట.ఆ క్రమంలో అగ్నిదేవుని మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని శస్త్రంలో ప్రవేశపెడితే అది ఆగ్నేయాస్త్రంగా అవుతుంది. ఈ ఆగ్నేయాస్త్రపు మంటలనీ, జ్వాలలనీ, వేడిమినీ ఎదుర్కోని నిలిచేందుకు వరుణుని (జలానికి అధిష్ఠాన దేవత) మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని శస్త్రంలో నింపితే ఆ అస్త్రం వారుణాస్త్రం అవుతుంది. అగ్నిని ఆర్పేంతటి నీటిధారని పంపగలుగుతుంది. దేవతలే ఇలాంటి అస్త్రాలని వాడారనుకోకూడదు. భారతయుద్ధంలో ఎందరో యోధులు ఇలాంటి అస్త్రాలని ప్రయోగించినవారే. అదే తీరుగా సాయి కూడా శస్త్రం (మారణాయుధం) అనేదాన్ని తీసుకోకుండా తనదైన మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని వారుణాస్త్ర శక్తితో సమానంగా చేసుకున్న కారణంగానే ఆ వేడితో ఉడుకుతున్న వంట డేగిసాలో చేతిని పెట్టినా ఆయనకి ఏమీ కాలేకపోయింది. అంటే వేడిమిలో వేడితనం లేకుండా పోయిందన్నమాట. వెనుక భాగంలో నీళ్లలో ఉండే సహజధర్మమైన చల్లదనం అక్కడ పోయి వేడిమితనం కలిగి దీపాలు వెలిగినట్లే, ఇక్కడ కూడా నిప్పులో ఉండే ఆ వేడిమితనం పూర్తిగా పోయి నీటికుండే చల్లదనమే ఆ తేజస్సు (అగ్ని)లో ప్రవేశించిందన్నమాట. సిద్ధుడైన వ్యక్తికి పంచభూతాల్లోని పదార్థాలకుండే సహజధర్మాన్ని తాత్కాలికంగా తొలగించగల శక్తి ఉంటుందనేది సోదాహరణంగా అర్థమౌతోంది కదా!శ్రీమద్రామాయాణంలో ఆంజనేయుని తోకకి నిప్పు అంటించబడింది. ఆంజనేయునికి చల్లగా అనిపించి, కొంతసేపటికి గాని ఆ విషయమేమంటే సీతమ్మ తన పాతివ్రత్యశక్తి ద్వారా అగ్నిదేవుడ్ని ప్రార్థించి నిప్పులో ఉండే వేడిమిని తొలగించి నీటికుండే చల్లదనాన్ని ఆ అగ్నిలోనికి నింపి ఉంచడమే! మరొకరి తోకకి అంటుకున్న నిప్పుని కూడా చల్లబరచగల శక్తి ఉన్న సీతమ్మని చితిలో ప్రవేశించవలసిందని రాముడనగానే ఈ ఆలోచన లేని, రానీ వాళ్లంతా రాముడ్ని తిట్టిపోస్తారు తమ అజ్ఞానాన్ని గ్రహించుకోలేక కొందరు స్త్రీలైతే మరీను. ఎంతగా రాముడ్ని నిందిస్తే ఆ స్థాయి అవివేకం అజ్ఞానం ఉన్నట్లే కదా అర్థం.మరో ఉదాహరణం కూడా ఈ సందర్భంలో చెప్పుకోక తప్పదు. హనుమ లంకాదహనాన్ని ప్రారంభించి చేస్తుంటే లంకలో ఉన్న అన్ని ఇళ్లు దాదాపుగా తగులబడుతూ కనిపించాయి గానీ.. ఒక్క విభీషణుని ఇల్లు మాత్రమే.. అగ్నికి గురి కాలేదు. దానికి కారణం కేవలం మంత్రమనన శక్తి విభీషణుని ధర్మబద్ధవిధానం, రామానుగ్రహమున్నూ అతడే కాదు అతని భార్య ‘సరమ’ కూతురు ‘అనల’ కూడా విభీషణుని త్రోవలోనే ఉండటం కూడా వాళ్ల ఇల్లు అగ్ని నుంచి రక్షింపబడటానికి కారణం. ఆదిశంకరులవారి మీది కోపంతో ఆయన జ్ఞాతులూ ఇంకకొందరూ (దాయాదులూ మొదలైనవారూ ఆ దేశ రాజభటులు కూడా) ఆయన పార్థివ శరీరాన్ని ఒకచోట దాచి ఉంచితే దాన్ని చితి మీద పెట్టి దహించబోయారు. ఆ విషయాన్ని గ్రహించిన ఆదిశంకరుల వారు లక్ష్మీనరసింహ కరావలంబస్తోత్రాన్ని ఆశువుగా పఠిస్తూ తన పార్థివ శరీరం దహింపబడకుండా రక్షించుకున్నారు. ఒకవేళ ఆ అసూయాపరులు పగ సాధించుకోవాలనుకున్న వారూ చితి మీద పెట్టిన ఆదిశంకరుల శరీరానికి అగ్నిని ముట్టింపబోయినా ఆ అగ్ని తనలోని దాహకశక్తిని (మండించే గుణాన్ని) కోల్పోయి చల్లగానే ఉండబోతాడు వారి మంత్ర మనన శక్తి కారణంగా.ఇలా పంచభూతాలలోని సహజధర్మాన్ని పంచభూతాలూ కోల్పోయిన సందర్భాలు అనేకం గోచరిస్తాయి పురాణాల్లో. అవన్నీ కేవలం మంత్రమనన శక్తి కారణంగానే.సాయి అంతటి వారితో పోల్చదగిన మంత్ర శక్తి కలవాడా? అనుకోనక్కరలేదు. భూత భవిష్యద్ వర్తమానాలు మూటినీ గమనించుకుంటూ వ్యాఖ్యంగా ఆ విశేషాలని బహిరంగంగా చెప్తూంటే ఇంకా సాయిని విశ్వసించక పోవడమా?‘షిర్డీలో ముందు నాటికి భవంతులెన్నో వస్తాయి. భక్త జనం లక్షల సంఖ్యలో నుండి కోటికి వెళ్తుంది. షిర్డీలో ఉచితాన్నదానం నిరంతరం జరుగుతుంది. దేవాలయాలు కూడా సాయికి ఎన్నో ఎన్నో ఎన్నో రాబోతాయి’ ఇవి భవిష్యత్తుని సంబంధించిన సాయి మాటలు. నిజమయ్యాయా? లేదా?‘కమ్మరి భర్య – పుత్రుడు కొలిమిలో పడిపోవడం.. సాయి రక్షించడమనేది చేయికాలిన కాలంలో అంటే వర్తమానంలో జరిగిన విషయం నిజమయిందా? లేదా?తనకి ఎవరెంత దక్షిణగా ఇస్తామని లోగడ మొక్కుకున్నారో మొక్కుకుని కూడా తీర్చకుండా ఉన్నారో ఆ విషయాన్ని చెప్పడం (గోవా భక్తుడు 15 రూపాయలిస్తానని మొక్కుకుని తీర్చలేదు) భూత కాలానికి (ఒకప్పటి లోగడ విషయం కదా!) సంబంధించిన విషయం నిజమయిందా? లేదా? కాబట్టి సిద్ధపురుషుడైన సాయిని కేవలంధర్మబద్ధంగా వ్యవహరించడం అగ్ని హోత్రాన్ని నిరంతరం చేయడం అనే లక్షణాల కారణంగా అగ్ని కూడా స్వాధీనుడయ్యాడనేది లో రహస్యం. ఇక నాలుగూ ఐదూ అయిన వాయువూ ఆకాశమూ కూడా ఎలా సాయికి అధీనులయ్యారో తెలుసుకుందాం!సశేషం. - డా. మైలవరపు శ్రీనివాసరావు -
చెప్పుకోండి చూద్దాం
ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్ స్టార్ట్ చేయ్’ అని డ్రైవర్నుఆదేశించాడు సీఐ. కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైరన్ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. జూన్ 05. 2017. సాయంత్రం.చిత్తూరు జిల్లా, భాకరాపేట సమీపం. దుస్సావాండ్లపల్లి శివారు చెరువు దగ్గర. అంతసేపూ కురిసిన వాన ఎవరో స్విచాఫ్ చేసినట్టు ఆగింది. గాలి మాత్రం హోరున వీస్తోంది.ఉండుండి ఉరుములు, మెరుపులు పోటీ పడుతున్నాయి. గాలి విసురుకి నేలను తాకుతూ పైకి లేస్తూ తంగేడు చెట్ల కొమ్మలు అవస్థపడుతున్నాయి.మళ్లీ వాన మొదలవుతుందేమో అని ఇంటికి త్వరగా వెళ్లేందుకు ఊరి మనిషి ఒకడు సైకిల్ తొక్కుతున్నాడు వేగంగా. గాలికి ఏదో ఎండుగడ్డి నలుసు కంట్లో పడింది. సైకిల్ తొక్కుకుంటూనే ఒక చేత్తో తీసేందుకు ప్రయత్నించాడు. కుదరలేదు. సైకిల్ ఆపి భుజంపై ఉన్న టవల్‌తో తుడుచుకున్నాడు. అప్పుడే అప్రయత్నంగా చెరువు వైపు చూశాడు. ఏదో కనిపించినట్టయ్యింది.మళ్లీ చూశాడు.వెంపలి చెట్టు పక్కన ఆకు పచ్చని గుడ్డ ఏదో గాలికి రెపరెలాడుతోంది. నిశితంగా చూశాడు. అది చీర. లోతుగా చూశాడు. గుండె ఝల్లుమంది. బురదలో నుంచి పైకి లేచిన రెండు కాళ్లు. నాలుగు అడుగులు వేసి చెరువు దగ్గరికి వెళ్లాడు. దుర్వాసన. అతనికి అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పుడే మళ్లీ వర్షం మొదలైంది. సీఐ చెరువు దగ్గరకు వచ్చి చూశాడు. అప్పటికే బాగా ఉబ్బి, చివికిపోయిన మహిళ శవం. కొంత నీళ్లలో మరికొంత బురదలో కూరుకుపోయి ఉంది. ఊర్లో వాళ్లతో కలిసి శవాన్ని బయటికి తీయించాడు.చనిపోయిన మనిషి బాహ్య ఆనవాళ్లు తెలుస్తున్నాయి. కాని ముఖం గుర్తుపట్టలేకుంది. ఎన్ని రోజులయ్యిందో... శరీరం జీర్ణావస్థలో ఉంది.‘వాన తగ్గింది కదా.. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో జాగ్రత్తగా వెదకండి’ సిబ్బందిని ఆదేశించాడు సీఐ.క్లూ కోసం వెదుకుతున్నారు కానిస్టేబుళ్లు. చెరువు గట్టు కింద ఒక చెప్పు దొరికింది. సిబ్బంది ఆ చెప్పును సీఐకి చూపించారు. అది ఆమెదే అయ్యుంటందనే నిర్థారణకు వచ్చాడు సీఐ. శవాన్ని పోస్టుమార్టంకి పంపాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు.ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్ స్టార్ట్ చేయ్’ అని డ్రైవర్‌ను ఆదేశించాడు సీఐ.కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైర న్ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. 20 నిమిషాల తరువాత ఆ గ్రామానికి చేరుకున్నారు. సైరన్ సౌండ్‌కు ఇళ్లలోని జనం ఆందోళనగా బయటికొచ్చారు.‘ఊరి చివర చెరువులో ఓ ఆడమనిషి చచ్చి శవమై తేలిందంట. ఎవరై ఉంటారో’.. అని జనం బిక్కుబిక్కుమంటున్నారు.కానిస్టేబుల్ మైక్‌లో ‘ఆడోళ్లందరూ రచ్చబండ ఉన్న చోటుకు రావాలి’ అని అనౌన్స్ చేశాడు.భయం భయంగా పరుగున వచ్చారు గ్రామంలోని మహిళలు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులూ.‘ఒక్కొక్కరికీ.. చెరువు దగ్గర దొరికిన చెప్పు చూపించు’ కానిస్టేబుల్‌ను ఆదేశించాడు సీఐ. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకునేవారా? జాగ్రత్తగా చూసి చెప్పండి’.. అని అందరికీ చూపిస్తున్నాడు కానిస్టేబుల్.అందరూ ‘తెలియదు’ అని చెప్పారు.‘అది ఖరీదైన చెప్పు సార్! మా ఊళ్లో ఎవరూ వేసుకోరు’ బదులిచ్చారు.సీఐ ఆలోచనలో పడ్డాడు.అటువైపుగా గడ్డి ఎత్తుకెళుతున్న ఓ ఆడమనిషిని దూరం నుంచే చూసిన సీఐ ‘ఆమెను ఇలా పిలుచుకురండి’ అని ఆదేశించాడు.కానిస్టేబుల్ ఆమె దగ్గరికి పరిVð త్తుకు వెళ్లి ‘మా సార్ పిలుస్తున్నాడు’ అన్నాడు.‘ఎందుకూ’ అంది ఆమె. ‘ఊరంతా అక్కడే ఉంది..’ అని కానిస్టేబుల్ విషయం చెప్పేసరికి ఆమె గడ్డి మూట కింద పడేసి గబగబా సీఐ ఉన్న చోటుకు వచ్చింది. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకోవడం చూశావా..’ ప్రశ్న పూర్తికాకముందే... ‘చూశా సార్! బెంగుళూరామే వేసుకుంటది’.. అందామె.‘బెంగుళూరామేనా?’ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సీఐ.‘ఈ ఊరోళ్లే సార్. ఏడెనిమిదేళ్ల కింద బెంగుళూరు వెళ్లిపోయారు! ఇప్పుడు బెంగుళూరులో బతుకుతాండారు. వెంకటప్ప పెండ్లాం అనిత ఇట్టాంటి చెప్పులే వేసుకుంటాది సార్’ అంది.‘ఈ మధ్య కాలంలో ఆమె ఎప్పుడైనా ఈ ఊరు వచ్చిందా’‘రాలేదు సార్. మొగుడొక్కడే వస్తున్నాడు.అంతకుమించి నాకేం తెలియదు సార్’ అంది ఆమె.‘సరే.. సరే..’ చెప్పిన వివరాలు నోట్ చేసుకొని అందరినీ వెళ్లిపొమ్మన్నారు. ‘చనిపోయిన మహిళ పేరు అనితనే అయ్యుంటుందా?’ సీఐ ఆలోచనలో పడ్డాడు.ఇది తమ అనుమానం మాత్రమే. రుజువులు ఏమీ లేవు. ఒకవేళ అనితనే అనుకుంటే ఆమెను ఎవరు చంపి ఉంటారు? భర్తా? అయితే, ఎందుకు? పోలీసులు రోజూ దుస్సావాండ్లపల్లికి వెళ్లి వస్తూ మరికంత సమాచారం కోసం వాకబు చేస్తున్నారు అనిత కుటుంబీకులు ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నారు. ఈలోపు అనిత భర్త వెంకటప్ప, అతని అన్న ఊరికి వచ్చారని అనిత రాలేదని తెలిసింది. వెంటనే వెంకటప్పను పిలిచి ‘నీ భార్య అనిత ఏమైంది’ అని అడిగాడు సీఐ. ‘బెంగుళూరులోనే ఉంది సార్. ఎందుకు అడుతున్నారు?’ అనుమానంగా అడిగాడు వెంకటప్ప. ‘మరేం లేదు. ఓ కేసు విషయమై ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు వెళ్లచ్చు’ అని స్టేషన్‌కి బయల్దేరాడు సీఐ. అనిత బెంగళూరులో ఉంటే చనిపోయిన ఈమె ఎవరు? అనుమానాలే తప్ప మరే రుజువులు దొరకడం లేదు. విసుక్కున్నాడు సీఐ. ఊర్లోనే మరికొందరిని కలిసి, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వాలో చెప్పి స్టేషన్‌కి వెళ్లిపోయాడు. జులై 15. దుస్సావాండ్లపల్లి నుంచి సీఐకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ‘బెంగళూరులో అనిత భర్త వెంకటప్ప అన్న కూతురు వివాహం జరుగుతోంది’ అని ఆ ఫోన్ తాలూకు సారాంశం.సీఐకి అనుమానం వచ్చింది. సొంత ఊళ్లో పెళ్లి జరపకుండా బెంగళూరులో పెళ్లి ఎందుకు జరుపుతున్నారు? బెంగుళూరు వెళ్లి స్థిరపడినా తరచూ ఊరికి మాత్రం వస్తూనే ఉన్నారు... స్థిరాస్తులు కూడా ఇక్కడే ఉన్నప్పుడు పెళ్లి ఇక్కడే చేయాలి కదా అనుకున్నాడు. ఏదైతేనేం మరిన్ని వివరాలు రాబట్టాలంటే ఈ పెళ్లికి వెళ్లాలి. నిర్ణయానికి వచ్చిన సీఐ తన సిబ్బందిని పిలిచాడు. పెళ్లి జరుగుతున్న రోజు సీఐ టీమ్ బెంగుళూర్ వెళ్ళింది. ఆ పెళ్లిలో అనిత లేదు. పోలీసులకు అర్థమైంది. వెంటనే అనిత భర్త వెంకటప్ప, అతని అన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో విచారణ చేయడంతో వెంకటప్ప అతని అన్న తప్పు ఒప్పుకున్నారు. అనితను చంపడానికి ఒక్కో కారణాన్ని పోలీసుల ముందు బయటపెట్టారు అన్నాదమ్ములు. అనితకు వెంకటప్పకు పెళ్లయ్యి 15 ఏళ్ల పైనే అయ్యింది. ఓ కూతురు కూడా ఉంది. వెంకటప్ప చిన్న కంపెనీలో ప్రైవేట్‌జాబ్ చేస్తుండేవాడు. అతని అన్న కుటుంబం కూడా బెంగుళూరులోనే ఉంది. రెండేళ్ల కిందటి వరకు బాగానే ఉన్న అనితకు కొత్త కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. విలాసవంతమైన జీవనం కోరుకునేది. అందుకు భర్త వెంకటప్పని డబ్బులు ఇవ్వాలని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ‘కోరినవన్నీ తెచ్చివ్వలేనని, ఉన్నదాంట్లోనే సర్దుకోవాలని’ ఖరాకండిగా చెప్పేవాడు వెంకటప్ప. ఇద్దరికీ తరచూ గొడవలు అయ్యేవి. వెంకటప్పతో ఉంటే తన సరదాలు ఎలాగూ తీరవని నిశ్చయించుకున్న అనిత తనకు ఉన్న పరిచయాలను ‘ఉపయోగించుకోవడం’ మొదలుపెట్టింది. ఎంతటి పనులు చేయడానికైనా వెనకాడేది కాదు. ధనవంతులతో పరిచయాలు ఏర్పరుచుకుంది. కార్లు, నగలు, ఖరీదైన దుస్తులు కొనుగోలు చేస్తుండేది. వెంకటప్ప నచ్చచెప్పాలని చూసినా వినేది కాదు. ఎదురు తిరిగేది. ఓ రోజు వెంకటప్ప అన్న కూడా అనితకు చెప్పి చూశాడు. ఇలాగే ఉంటే విషయం చాలా దూరం వెళుతుందని బెదిరించాడు. ‘నాకు పెద్ద పెద్దవాళ్లతో పరిచయాలున్నాయి. నా దారికి అడ్డు వస్తే మీ ఇద్దరిని చంపేయడానికి నాకెంతో టైమ్ పట్టదు’ అంటూ ఎదురు తిరిగింది అనిత. దాంతో అన్నదమ్ములిద్దరూ భయపడిపోయారు. ఈ విషయం బంధువుల్లోనూ, ఊర్లోనూ తెలిస్తే తమ పరువు పోతుందని ఆలోచనలో పడ్డారు. ఒక నిశ్చయానికి వచ్చారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న వెంకటప్ప ఓ రోజు అనితతో.. ‘ఊళ్లో మనకు భూములున్నాయి కదా! వాటిని అమ్మకానికి పెట్టాం. నువ్వు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఊరెళ్లి రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాక తిరిగి వద్దాం’ అన్నాడు.‘సరే’ అని బయల్దేరింది అనిత. మే 31 రాత్రి సమయానికి కారులో దుస్సావాండ్లపల్లి శివారు ప్రాంతంలోని చెరువు కట్టమీదుగా వెళుతున్నారు అనిత, వెంకటప్ప అతని అన్న. అప్పటికే బాగా చీకటి పడింది. ఓ చోట కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందని అన్నదమ్ములిద్దరూ కిందకు దిగారు. కారు స్టార్ట్ అవడం లేదని అనిత కూడా దిగింది. అక్కడే అన్నదమ్మలిద్దరూ అనితను గొంతుపిసికి చంపేశారు. అనిత శరీరాన్ని చెరువు కట్టమీదుగా ఓ వైపుకు తీసుకెళ్ళారు. చెరువు ఒడ్డున కొంతమేరలోపలికి వెళ్లి అక్కడ బురదగా ఉన్న చోట తవ్వి, అనిత శరీరాన్ని అందులో పూడ్చేసి, పైన కొన్ని రాళ్లు పడేసి తిరిగి కారులో వెళ్లిపోయారు. పెనుగులాటలో అనిత చెప్పు ఒకటి గట్టు మీద పడిపోగా,మరికొటి చెరువు నీటిలో ఎటో కొట్టుకుపోయింది. గట్టు మీద పడిపోయిన కాలి చెప్పు మౌన సాక్ష్యంగా ఉండిపోయింది.ఐదు రోజుల తర్వాత విపరీతంగా కురుస్తున్న వానలకు శరీరం కొంతవరకు పైకి తేలింది. అభిప్రాయ భేదాలు, చెడు ప్రవర్తనలు, కుటుంబానికి మచ్చ తెచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు అందుకు కారణమైన వ్యక్తులను చట్టబద్ధంగా వదిలించుకోవచ్చు.కాని మనమే నేరపూరితమైన చర్యలకు పూనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. – గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు -
‘మావో’ లింకులపై బలమైన సాక్ష్యాలు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలపై బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతోనే ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేశామని మహారాష్ట్ర బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవలం అసమ్మతి, అభిప్రాయభేదం కారణంగా ఈ అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా చెలరేగిన హింసకు మావోలతో కలసి కుట్రపన్నారంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల వంటి మానవహక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఐదుగురిని విడుదలచేసి గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా అసమ్మతి, భిన్నాభిప్రాయం అన్నది ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని కోర్టు పేర్కొంది. తాజాగా ఈ హక్కుల కార్యకర్తల అరెస్ట్‌ను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, సామాజికవేత్త సతీశ్ దేశ్‌పాండే, న్యాయ నిపుణుడు మజా దరువాలాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం విచారణ సాగుతుండగానే వీరు ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేశారు. మేం అరెస్ట్ చేసిన ఐదుగురు నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చురుగ్గా పనిచేస్తూ నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు. వీరు ఎల్గర్ పరిషత్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటుచేశారు. రాజకీయ సిద్ధాంతాలు, భావజాలాల మధ్య భిన్నాభిప్రాయంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేయలేదు. వీరు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి. తనిఖీల సందర్భంగా వీరి ఇళ్లలోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరి కార్డుల్లో లభ్యమైన సమాచారాన్ని బట్టి వీరు సమాజాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు తేలింది’ అని తెలిపారు. ‘రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, ఇతరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో దేశంతో పాటు భద్రతాబలగాలపై దాడికి ప్రణాళిక, ఇతర కార్యకర్తలతో సమన్వయం తదితరాలపై కీలక సమాచారం లభిం చింది. అంతేకాకుండా వీరు తమ పార్టీలోకి నియామకాలను చేపట్టడంతో పాటు వారిని అండర్‌గ్రౌండ్ శిక్షణకు పంపడం, నిధుల సమీకరణ–పంపకం, ఆయుధాల ఎంపిక, కొనుగోలు, వీటిని దేశంలోకి అక్రమరవాణా చేసేందుకు మార్గాలను ఎంపికచేయడంలో భాగస్వాములయ్యారు. అరెస్టయినవారిలో కొందరు కూంబింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులను మావోలకు అందజేస్తున్నట్లు ఆ పత్రాల్లో లభ్యమైంది’ అని పోలీసులు చెప్పారు. ధనరూపంలో వెలకట్టలేనిది జీవితం రేప్ బాధితులపై సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీః జీవితం అమూల్యమైనదని, ఏ కోర్టూ దాన్ని ధనరూపంలో వెలకట్టలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచార, యాసిడ్ దాడి బాధిత మహిళలకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) రూపొందించిన పరిహార పథకంపై విచారణ సందర్భంగా బుధవారం పైవిధంగా స్పందించింది. పైన పేర్కొన్న రెండు నేరాల్లో బాధిత మహిళకు కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా(మరణించిన పక్షంలో) రూ.10 లక్షలు చెల్లించాలని నల్సా సిఫార్సు చేసింది. ఈ పరిహార పథకాన్ని ఓ లాయర్ ప్రశ్నించగా..‘జీవితానికి వెలను నిర్ధారించలేం. దాన్ని ధనరూపంలో చెప్పలేం’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆమోదించిన నల్సా పరిహార పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఏపీలో 901 కేసుల్లో ఒక్కరికే... రేప్, యాసిడ్ దాడి బాధితుల్లో కేవలం 5 నుంచి 10 శాతం మందికే పరిహారం అందుతోందని నల్సా ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 901 కేసులు నమోదైతే ఒక బాధితురాలికే పరిహారం దక్కినట్టు వెల్లడించింది. పోక్సో చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1028 కేసులు నమోదైతే కేవలం 11 మంది బాధితులకే పరిహారం అందినట్లు తెలిపింది. -
దానం అంటే అది..!
కురేశులు రామానుజాచార్యులకు ప్రధానమైన శిష్యుడు. కుర్ అనేగ్రామానికి అధినేత మహాసంపన్నుడు అయిన కురేశుడు తెల్లవారినప్పడి నుంచి రాత్రి దాకా దానాలు చేస్తూనే ఉంటాడు. వచ్చిన వారందరికీ దానాలుచేసిన తరువాత ఒక రోజు రాత్రి కురేశుని భవనం ప్రధాన ద్వారాన్ని మూసినప్పుడు దఢేలని ధ్వని వచ్చింది. ఆ ధ్వని ఏమిటని వరదరాజ పెరుమాళ్‌ను లక్ష్మీదేవి అడిగింది. కురేశుడు రోజంతా వచ్చిన వారికి దానధర్మాలు చేసి ఇప్పుడే తలుపు మూసుకున్న చప్పుడు దేవీ అది అంటూ, ఎంత మంది వచ్చినా కాదనని కురేశుడి దానశీలాన్ని వరదుడు వివరిస్తే ఆయనను ఒకసారి చూడాలని లకీ‡్ష్మదేవి భర్తను అడిగింది. సరేనని కురేశుడిని సతీసమేతంగా తీసుకురమ్మని వరదుడు కాంచీపూర్ణులను ఆదేశించారు. కాంచీపూర్ణుల వారు కురేశుని ఇంటికి వచ్చి, విషయమంతా వివరించి, తనతో రమ్మని కురేశుని అడుగుతారు. తన ఇంటి తలుపు చప్పుడు గురించి కంచి వరదుడు, లక్ష్మీదేవి మాట్లాడుకున్నారని తెలిసి కురేశుడు, ఆండాళ్ ఆశ్చర్యపోతారు. అలా తలుపు చప్పుడయ్యేట్టుగా వేయడం అహంకారానికి నిదర్శనంగా మారిందని తెలుసుకుని, అందుకు ఎంతో బాధపడతారా దంపతులు. ఎవరెవరో తమ ఇంటికి వచ్చి తమను దానం చేయమని అడగడం కాదు, తామే వెళ్లి అందరికీ దానాలు చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు కురేశుడు. తనకు ఏమీ మిగుల్చుకోకుండా మొత్తం ఆస్తినంతా పేదలకు పంచి పెట్టారు. ఆ తరువాత కంచి వరదుడిని కురేశ దంపతులు దర్శనం చేసుకున్నారు. కురేశుని భార్య ఆండాళ్, కంచి వరదుని క్షమాపణ వేడింది. స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆచార్యుడైన రామానుజుడి దగ్గరకు వెళ్లాలని వారిరువురూ శ్రీరంగం బయలుదేరారు. దారిలో అరణ్యమార్గంలో ప్రయాణించినపుడు ఆండాళ్ భయపడితే, ‘‘ఎందుకు భయపడుతున్నావు? చేపలు నీటిలో పురుగులను తినేస్తాయి. మరణం జీవితాన్ని తినేస్తుంది. దొంగలు ధనాన్ని తింటారు. మనదగ్గర ధనం ఏమీ లేదుకదా దొంగలేం చేస్తారు?’’ అని అడిగాడు కురేశుడు.‘‘మీరు నీళ్లు తాగడానికని ఒక బంగారు పాత్రను వెంట తెచ్చుకున్నాను స్వామీ’’ అంటుంది ఆండాళ్. ‘‘ఓస్, దీని కోసమే కదా, నీవు భయపడుతున్నది, ఇది మన వద్ద లేకపోతే, ఇక మనం ఏమీ పోతుందని భయపడాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంటూ, దాన్ని తీసుకుని విసిరి పారేస్తారు కురేశులు. తర్వాత నిర్భయంగా ప్రయాణం చేసి, రామానుజుని వద్దకు చేరుకుంటారా దంపతులు. శిష్యుని సంతోషంతో కౌగిలించుకుంటాడు రామానుజులు.దానం చేసేటప్పుడు అవతలి వారికి తాను సహాయం చేస్తున్నాను అనే భావన దాతకు కలిగితే, అది దానం అనిపించుకోదు. సహాయ పడే అవకాశాన్ని కల్పించినందుకు అవతలి వారికి ధన్యవాదాలు చెప్పుకోవడం వినయం అవుతుంది. అలాంటి దానాన్నే భగవంతుడు ఆమోదిస్తాడు. – డి.వి.ఆర్. -
గూగుల్‌లో వెతికి మరి చంపాడు
న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన శైలజ ద్వివేది హత్య కేసులో పోలిసులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. శైలజ ద్వివేదిని హత్య చేసని నిఖిల్ హండా ప్రస్తుతం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే నేపంతో నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ముందు ఈ హత్యను ఆక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శైలజను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించడానికి నిఖిల్ హండా గూగుల్ సాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ‘హత్యను యాక్సిడెంట్‌గా చిత్రికరించడం ఎలా...చంపిన తరువాత సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలి’ వంటి పలు అంశాల గురించి నిఖిల్ గూగుల్‌లో సర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నిఖిల్ ఫోన్ కాల్ డేటాను, ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు ఈ విషయాలు తెలిసాయి. ఈ విషయం గురించి పోలీసులు ‘శైలజ, నిఖిల్ కారులోకి ఎక్కిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు నిఖిల్ ఆమె గొంతు నులిమి చంపాడు. తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా శైలజ మృతదేహాన్ని రోడ్డు మీద పడేశి, ఆపై ఆమె గొంతు మీద నుంచి కారును పొనిచ్చాడు. చూసేవారికి అది యాక్సిడెంట్‌లా కనిపించాలని ఇలా చేశాడు. కానీ పోలీసులకు తన మీద అనుమానం రావడంతో సాక్ష్యాలను నాశనం చేయాడానికి ప్రయత్నించాడు. శైలజను చంపడానికి ఉపయోగించిన కత్తితో పాటు ఆ రోజు తాను ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లను కాలబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే హరిద్వార్ నుంచి మీరత్ వెళ్లే దారిలోఈ పనులన్నింటిని ముగించాలని భావించాడు. కానీ నిఖిల్ హండా కారు టోల్‌ప్లాజా నుంచి వెళ్లే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫూటేజ్ ఆధారంగానే నిఖిల్‌ను అరెస్ట్ చేశాము. ప్రస్తుతం ఈ సాక్ష్యాలను ఫోరెన్సిక్ లాబ్‌కి పంపించారు. నివేదికల కోసం ఎదురు చూస్తున్నామ’ని తెలిపారు. -
సరైన తీర్పు
ఒకవ్యక్తి పనిమీద దూరప్రాంతానికి వెళుతూ తనవద్ద ఉన్న సొమ్మును మిత్రుడివద్ద దాచాడు. కొన్నాళ్ళకు తిరిగొచ్చి తన పైకం ఇమ్మని మిత్రుణ్ణి అడిగాడు. దానికి మిత్రుడు, ఏమి పైకం? నాకెప్పుడిచ్చావు? అని అమాయకంగా ఎదురు ప్రశ్నించాడు. దాంతో సొమ్ము దాచుకున్న వ్యక్తి లబోదిబోమంటూ, న్యాయస్థానం గడప తొక్కాడు. ‘నువ్వతనికి సొమ్ము ఇచ్చినట్లు ఏమైనా సాక్ష్యం ఉందా?’ అని అడిగారు న్యాయమూర్తి. లేదని సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. డబ్బు తీసుకున్న వ్యక్తిని కూడా హాజరు పరిచి ప్రశ్నించారు. ఇరువురి వాదనా విన్న తరువాత ఇతను సొమ్ము దాచింది నిజమే, అతను అబద్ధమాడుతున్నదీ నిజమే అని న్యాయమూర్తికి అర్ధమైపోయింది. కాని సాక్ష్యం లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్ధంకాక, విచారణను మరుసటి రోజుకు వాయిదా వేశాడు. ఇంటికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. భర్త పరధ్యానంగా ఉండడం చూసి, ఏమిటని ప్రశ్నించింది. న్యాయమూర్తి ఏమీలేదని దాటవేసే ప్రయత్నం చేశాడు. కాని ఆమె గుచ్చిగుచ్చి అడగడంతో చెప్పక తప్పింది కాదు. ‘ఓస్ ఇంతేనా! నేనొక ఉపాయం చెబుతా వినండి’ అన్నదామె. న్యాయమూర్తి నవ్వుకున్నారు. కాని నిజంగానే ఆమె చెప్పిన ఉపాయానికి ఆశ్చర్యపోవడం అతని వంతయింది. మరునాడు న్యాయమూర్తి ఇద్దర్నీ పిలిచి, నువ్వు పైకం అతనికిచ్చినప్పుడు సాక్షులెవరూ లేరంటున్నావు. కనీసం అక్కడ ఏదైనా చెట్దుగాని, పుట్టగాని మరేవైనా ఇతర వస్తువులన్నా ఉన్నాయా? అని ఇచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు. అప్పుడా వ్యక్తి, అవునండీ అక్కడొక జామచెట్టు ఉంది. అని చెప్పాడు. ‘‘అయితే ఆ జామ చెట్టునే వచ్చి సాక్ష్యం చెప్పమను’’ అన్నాడు న్యాయమూర్తి. దీంతో సభికులంతా ఆశ్చర్యపోయారు. చివరికి మిత్రద్రోహానికి ఒడి గట్టిన వాడు కూడా ‘జామ చెట్టు ఎలా సాక్ష్యమిస్తుంది’ అని వెటకారంగా నవ్వుకున్నాడు. కాని న్యాయమూర్తి ఇవేమీ పట్టించుకోకుండా, నువ్వు వెంటనే వెళ్ళి జామచెట్టును సాక్ష్యంగా తీసుకురమ్మని బలవంతంగా పంపించాడు.అతడు వెళ్ళిన కొద్దిసేపటికి న్యాయమూర్తి డబ్బుతీసుకున్న వ్యక్తినుద్దేశించి, ‘అతనా జామచెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటాడా?’అని అడిగాడు. దానికతను, ‘ఇంకా చేరుకోక పోవచ్చు’. అన్నాడు ఆద్రోహి.అంతలో వెళ్ళిన వ్యక్తి తిరిగొచ్చి,’అయ్యా..! మీరు చెప్పినట్లే నేను ఆ జామచెట్టు దగ్గరికెళ్ళి సాక్ష్యం చెబుదువు గాని పద.. అని అడిగాను. కాని అది చెట్టుకదా.. ఎలా వస్తుంది... ఎలా మాట్లాడుతుంది? మీరు నన్ను ఆటపట్టిస్తున్నట్లున్నారు.’ అన్నాడా వ్యక్తి.‘లేదు లేదు జామచెట్టు వచ్చి నువ్వు సొమ్ము ఇతని దగ్గర దాచినమాట నిజమేనని చెప్పి వెళ్ళిపోయింది’ అన్నారు న్యాయమూర్తి. దీంతో సభికులంతా నోరెళ్ళబెట్టారు. సొమ్ము తీసుకొని అబద్ధమాడుతున్న వ్యకి ్తకూడా, ‘అదేంటీ.. జామచెట్టు ఇక్కడికెప్పుడొచ్చిందీ?’ అన్నాడు. అప్పుడు న్యాయమూర్తి,‘అతనా జామచెట్టు వరకు వెళ్ళి ఉంటాడా? అని ఇంతకుముందు నేనడిగినప్పుడు, నువ్వు, అప్పుడే వెళ్ళి ఉండడని సమాధానం చెప్పావు. అతను గనక నీకు పైకం ఇచ్చి ఉండకపోతే, నాకేం తెలుసు.. జామచెట్టో, గీమచెట్టో నాకేమీ తెలియదనేవాడివి. కాని, అతడింకా వెళ్ళి ఉండకపోవచ్చు అని చెప్పావు. అంటే, అతను నీకు పైకం ఇచ్చిందీ నిజమే, నువ్వు తీసుకుందీ నిజమే. ఎగ్గొట్టే ఉద్దేశ్యంతోనే నువ్వు అబద్ధమాడావు. వెంటనే అతని సొమ్ము అతనికి చెల్లించు. లేకపోతే జైలుకు పోతావు.’ అన్నారు న్యాయమూర్తి కఠినంగా.. ఈ మాటలు వినగానే అతనికి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే అతని పైకం అతనికి చెల్లించి,క్షమించమని ప్రాధేయపడ్డాడు. –ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇక ఆధారాలు పదిలం!
సాక్షి, హైదరాబాద్: ఎంత సంచలన కేసు దర్యాప్తు అయినా చిన్న చిన్న ఆధారాల దగ్గరే మొదలవుతుంది. నిందితుడిని పట్టుకోవడంలో క్లూస్ టీమ్స్ పాత్ర కీలకం. హైదరాబాద్ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్లూస్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. కమిషనరేట్లలో డివిజన్ స్థాయిలో, జిల్లాల్లో ఒక్కోటి చొప్పున వీటి ని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాల్లో ముగ్గురు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, డ్రైవర్ చొప్పున ఉండనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే ఒక్కో క్లూస్ టీమ్ పని చేస్తోంది. ఇందులో ఉన్న సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ క్లూస్ టీమ్‌లను వికేంద్రీకరించాలని నిర్ణయించారు. త్వరలో సైబరాబాద్ లో 9, రాచకొండలో 8 బృందాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కమిషనరేట్/జిల్లాల్లో ఉండే క్లూస్టీమ్లకు అదనంగా ఓ ప్రధాన క్లూస్ టీమ్ ఉం డనుంది. ఈ టీమ్స్‌లో పని చేయడానికి సైన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారిని ఎంచుకోనున్నారు. వీరిని హోంగార్డ్స్ క్యాడర్లో రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నారు. సైంటిఫిక్ ఆఫీసర్స్‌గా పిలిచే వీరికి 6 నెలల పాటు సీఐడీ, గ్రేహౌండ్స్, సీసీఎస్, ఎఫ్ఎస్ఎల్ విభాగాల్లో శిక్షణిస్తారు. ఈ ఆధారాలు సేకరించేలా శిక్షణ బయోలాజికల్ ఎవిడెన్స్: రక్తం, వీర్యం, ఉమ్మి సహా శరీర సంబంధిత వాటితో పాటు కనిపించే వేలిముద్రలు లేటెంట్ ప్రింట్ ఎవిడెన్స్: చోరీ కేసుల్లో కంటికి కనిపించని వేలిముద్రలు, పాదముద్రలతో పాటు ఇతర ఆధారాలు ఫుట్‌వేర్ అండ్ టైర్ ట్రాక్ ఎవిడెన్స్: నేరస్థలాల్లో ఉన్న పాదరక్షల గుర్తులు, ప్రమాద స్థలాల్లో ఉండే వాహనాల టైర్ల మార్కులు తదితరాలు ట్రేస్ ఎవిడెన్స్: సూక్ష్మమైన ఆధారాలుగా పిలిచే ఫైబర్ (నూలు పోగులు వంటివి), జుట్టు, కాల్పులు జరిగినప్పుడు పడే గన్‌పౌడర్ తదితరాలు డిజిటల్ ఎవిడెన్స్: కంప్యూటర్లు, సెల్ఫోన్లకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, ఫ్లాపీలు, పెన్‌డ్రైవ్‌లతో పాటు చిప్స్ తదితరాలు టూల్ అండ్ టూల్ మార్క్ ఎవిడెన్స్: బాధితులు, మృతులను కొరకడం వంటివి జరిగితే ఆ ఆధారాలు, తాళాలు, డోర్లు పగులకొట్టిన ఆధారాలు డ్రగ్ ఎవిడెన్స్: వివిధ రకాలైన మాదకద్రవ్యాలకు సంబంధించి ఘటనా స్థలాల్లో ఉన్న వాటితో పాటు పోలీసులు పట్టుకున్న వాటి నమూనాలు ఫైర్ ఆరమ్స్ ఎవిడెన్స్: తూటాలు, ఖాళీ క్యాట్రిడ్జ్‌లు ఇతర ఆధారాలు -
సంక్లిష్టంగా కథువా కేసు!
శ్రీనగర్ : కథువా హత్యాచార కేసులో దర్యాప్తు చాలా కష్టతరంగా మారిందని డీఎస్పీ శ్వేతాంబరి శర్మ ప్రకటించారు. ఆధారాలను సేకరించటం చాలా కష్టతరంగా ఉందన్న ఆమె.. ఈ కేసు చాలా సంక్లిష్టంగా మారిందని తెలిపారు. బుధవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె కేసు పురోగతి విషయాలను వెల్లడించారు. (మోదీకి షాకిచ్చారు) ‘మైనర్ బాలిక హత్యాచార కేసులో ప్రత్యక్ష సాక్ష్యులు లేకపోవటంతో కేసులో దర్యాప్తు చాలా సంక్లిష్టంగా మారింది. నిందితులను విచారణ చేపట్టినా.. ఆధారాలను సేకరించటంలో చాలా కష్టాలు ఎదుర్కుంటున్నాం. ఈ ఘటన అత్యంత పాశవికమైందని ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ, కావాల్సింది ఆధారాలు. ప్రకటనలు చేసినంత సులువు కాదు కేసు దర్యాప్తు చేయటం’ అని ఆమె వ్యాఖ్యానించారు. బాధితుల తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ దీపికా సింగ్ రజావత్ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. డిఫెన్స్ లాయర్ ఆరోపణలపై... ఇక ఈ కేసులో డిఫెన్స్ లాయర్ అంకుర్ శర్మ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘ ఒక మహిళను ఇలా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం సరికాదు. అలాంటి వ్యాఖ్యలపై నేను స్పందించను. దేశ ప్రజలే బదులిస్తారు’ అంటూ శ్వేతాంబరి వెల్లడించారు. ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యానికి తాను చలించిపోయానన్న ఆమె.. తర్వాత కోలుకుని దర్యాప్తును వేగవంతం చేశానని ఆమె తెలిపారు. ‘మన న్యాయ వ్యవస్థ చాలా శక్తివంతమైంది. దానిపై అనుమానాలు అక్కర్లేదు’ అని ఆమె అన్నారు. కథువా కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న అంకుర్ శర్మ తాజాగా సిట్ పర్యవేక్షకురాలు డీఎస్పీ శ్వేతాంబరి శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మేధాశక్తిపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. బృందంలో ఉన్న మిగతా సభ్యుల ప్రభావంతోనే ఆమె దర్యాప్తు చేస్తున్నారంటూ అంకుర్ ఆరోపించారు. Special Investigation Team formed in #Kathuacase has faced a lot of difficulties in collecting evidence in the rape and murder of an eight-year-old girl as told by Deputy Superintendent of Police (DSP) #ShwetambariSharma Read @ANI story | https://t.co/ld8j9KKU9b pic.twitter.com/q8UmcLPfY3 — ANI Digital (@ani_digital) 18 April 2018 -
పనివాడే ప్రధాన సూత్రధారి?
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన వద్ద పని చేస్తున్న వ్యక్తే ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్థారించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి చిలకలగూడ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. లక్ష్మీకాంత్ శర్మ ప్రతిరోజూ బంజారాహిల్స్ రోడ్ నెం.7లో ఉన్న ఓ టీవీ కార్యాలయానికి వస్తుంటారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు డ్రైవర్లు, సహాయకుడితో కలిసి వచ్చారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో టీవీ కార్యక్రమం పూర్తయిన తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కారు ముందు సీట్లో కూర్చున్న అతడిని సఫారీ సూట్లలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, విచారణ నిమిత్తం రావాలంటూ చెప్పి బలవంతంగా వెనుక సీట్లో కూర్చోబెట్టారు. డ్రైవర్లతో పాటు సహాయకుడినీ కారు నుంచి దింపేసిన వారు ఇద్దరి సెల్ఫోన్లు సైతం లాక్కుని లక్ష్మీకాంత్ ఐదు నిమిషాల్లో వస్తారని చెప్పారు. ఆయనను వాహనంతో సహా రోడ్ నెం.7లోని వాటర్‌ట్యాంక్ వైపు తీసుకుని వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడ వేచి చూసిన అతని అనుచరులు ముగ్గురిలో ఒకరి సెల్‌ఫోన్‌కు లక్ష్మీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది. తనను ఎంక్వైరీ కోసం తీసుకువెళ్తున్నారంటూ చెప్పిన ఆయన అది పూర్తయిన తర్వాత వస్తానని, మీరు ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఈ ముగ్గురూ చిలకలగూడ పరిధిలోని మధురానగర్‌లో ఉన్న లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో లక్ష్మీకాంత్‌కు చెందిన వాహనంలోనే ఇంటికి వచ్చిన ‘ఆ నలుగురూ’ ఓ చిన్న లేఖ తీసుకువచ్చి లక్ష్మీకాంత్ తండ్రి రాజగోపాల్రావుకు ఇచ్చారు. అందులో ‘నాన్న సార్ వారు వస్తారు. వాళ్లు అడుగుతారు మీకు తెలిసింది చెప్పండి’ అంటూ లక్ష్మీకాంత్ చేతిరాతతోనే రాసి ఉంది. దీనిని చూపించిన దుండగులు తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని వెళ్ళారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లు సైతం తొలగించిన దుండగులు డీవీఆర్ పట్టుకెళ్లారు. మరుసటి రోజు (శుక్రవారం) లక్ష్మీకాంత్ శర్మను ఆరామ్‌ఘర్ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆయన చిలకలగూడ పోలీసుస్టేషన్‌కు వచ్చి తన కళ్లకు గంతలు కట్టారని, బెదిరించి చీటీ రాయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి శుక్రవారం బంజారాహిల్స్ ఠాణాలో లక్ష్మీకాంత్ డ్రైవర్ చంద్రశేఖర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదైంది. మరోపక్క ఆయన తండ్రి రాజగోపాలరావు ఫిర్యాదుతో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టరైంది. చంద్రశేఖర్ తన ఫిర్యాదు లో ఇంటికి వచ్చిన దుండగులు రూ.30 లక్షల నగదు, 30 తులాల బంగారం తీసుకువెళ్లారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. లక్ష్మీకాంత్ తండ్రి తన ఫిర్యాదులో 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకువెళ్లారంటూ పేర్కొ న్నారు. ఈ రెండు కేసుల్నీ బంజారాహిల్స్, చిలకలగూడ పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నా రు. ప్రాథమికంగా చిలకలగూడ పోలీసుల లక్ష్మీకాంత్ శర్మ వద్ద పని చేస్తున్న, పని చేసి మానేసిన వారి వివరాలు సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఓ పనివాడే సూత్రధారిగా ఈ వ్యవహారం సాగినట్లు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేసిన చిలకలగూడ పోలీసులు సోమవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని వి చారిస్తున్న పోలీసులు మిగిలిన నిందితుల్ని పట్టుకోవడంతో పాటు రికవరీలపై దృష్టి పెట్టారు. అయితే ఈ కేసులో అనేక అంశాలు మిస్టరీగా ఉన్నాయన్న అధికారులు నిందితులందరూ చిక్కితేనే చిక్కుముడులు వీడతాయని పేర్కొన్నారు. -
సంచలన కేసు.. షాకింగ్ తీర్పు
సాక్షి, బెంగళూరు : సంచలనం సృష్టించిన మంగళూరు పబ్ కేసులో నిందితులను కోర్టు వదిలేసి అందరిని షాక్‌కు గురిచేసింది. సరైన ఆధారాలు నిందితులకు వ్యతిరేకంగా సమర్పించలేకపోయారని, ప్రత్యక్ష సాక్షులమంటూ కోర్టుకు వచ్చిన వారు సైతం స్పష్టమైన వివరాలు వెల్లడించలేపోయారంటూ కోర్టు వారిని విడిచిపెట్టిన సందర్భంగా తెలిపింది. 2009లో జనవరిలో యూట్యూబ్‌లో వచ్చిన ఓ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మంగళూరులోని పబ్‌లో చోటుచేసుకున్న అభ్యంతరకర దాడుల దృశ్యాలే ఆ వీడియో. నైతిక విలువలు కోల్పోయి, విలువలకు తిలోదకాలు ఇచ్చి సంస్కృతిని దెబ్బకొడుతున్నారనే కారణంతో శ్రీ రామ్ సేన అనే ఓ వర్గం మంగళూరులోని 'ఆమ్నేసియా-దిలాంజ్' అనే పబ్‌లోకి చొరబడి అందులోని యువతి యువకులపై దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు యువతులపై దాడులకు పాల్పడిన అస్పష్టమైన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్‌తోపాటు మొత్తం 30మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. అయితే, ఆ దాడికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలు ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సమర్పించలేదని కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు పలువురిని విస్మయానికి గురిచేసింది. అయితే, కోర్టుకు స్పష్టమైన ఆధారాలే ముఖ్యం అని, భావోద్వేగాల ఆధారంగా, అభిప్రాయాల ద్వారా తీర్పులు చెప్పలేమని తెలిపింది. తమకు సమర్పించిన వీడియోల్లో కేవలం నీడలు మాత్రమే కనిపించాయని, వీరే స్పష్టం అనడానికి ఆధారాలు లేవని తెలిపింది. -
గౌతమికి బాకీ లేదు
తమిళసినిమా: కమలహాసన్పై ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని నటి గౌతమి అన్నారు. మూడు రోజుల క్రితం కమలహాసన్ చిత్రాలకు పనిచేసినందుకు గానూ తనకు ఆయన పారితోషికం చెల్లించలేదంటూ పలు ఆరోపణలను గుప్పించిన గౌతమి మంగళవారం మరోసారి ఆయనపై ధ్వజమెత్తారు. గౌతమి తన ట్విట్టర్లో పేర్కొంటూ తాను ఇంతకు ముందు రాసిన పాస్ట్ ఈజ్ పాస్ట్ లేఖలో నటుడు కమలహాసన్ నుంచి తాను ఏ విధంగానూ, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించలేదన్నానని, తాను ఆయన పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఖండించానన్నారు. తాను కమలహాసన్ చిత్రాలకు పని చేసిన దానికి పారితోషికం అడిగానని, తన ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని అన్నారు. అయితే వాటికి తారుమారుగా ప్రచారం జరగడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. తన నిర్ణయాలను మార్చుకోకపోవడానికి ఒక తల్లిగా కొత్త జీవితాన్ని సాగించడానికి, సురక్షితమైన భవిష్యత్ కోసం ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పారు. జీవితంలో ఎన్నో నిజాయితీతో కూడిన సంతోషాన్ని కలిగించే మార్గాలు ఉన్నాయని, మంచి, మానవత్వం కలిగిన మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారని, వారితో కలిసి సమాజ సేవకు ఉపక్రమించాలని కోరుకుంటున్నానన్నారు. జీవితంలో చెడు సంఘటనలు అనేవి అందరి జీవితంలోనూ జరుగుతుంటాయని, అయితే అది మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ప్రకాశవంతమైన జీవితం కోసం కొన్ని సవాళ్లను నిజాయితీగా ఎదుర్కొనాలని అన్నారు. తానిప్పుడు అదే చేస్తున్నానని చెప్పారు. 20 ఏళ్లుగా తన జీవితంలో అన్నీ ఎదుర్కొన్నానని, ఇప్పుడు నిజాయతీతో కూడిన ప్రశాంత జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని గౌతమి పేర్కొన్నారు. గౌతమికి బాకీ లేదు: నటి గౌతమి ఆరోపణలకు స్పందించిన కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో దశావతారం చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్ సంస్థకు, విశ్వరూపం చిత్రాన్ని చేసిన పీవీపీ సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన సమస్య రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ ఎలా బాధ్యత అవుతుందని ప్రశ్నించారు. రాజ్‌కమల్ సంస్థకు సంబంధించి గౌతమికి ఎలాంటి బాకీ లేదని, అందుకు ఆధారాలు చూపితే ఆమె పారితోషికాన్ని చెల్లించడానికి సిద్ధం అని పేర్కొన్నారు. -
'దిలీప్‌ను జైలుకు పంపే ఆధారాలున్నాయి'
కొచ్చి: కేరళ ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్‌ను జైలుకు పంపించేందుకు కావాల్సినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మేం ఆయనను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న ఏవీ గార్గ్ ఈ కేసు విషయంపై ప్రశ్నించగా దర్యాప్తునకు సంబంధించి ఇంతకుమించి ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. దిలీప్‌నకు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలు తమ ఉన్నాయని మాత్రం పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దిలీప్ మేనేజర్ అప్పునీ బుధవారం దిలీప్ కోసం కేరళ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అంతేకాకుండా, తన బెయిల్ పిటిషన్లో పోలీసుల వద్ద అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే దిలీప్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో నటుడు, దర్శకుడు నదీర్ షా అప్రూవర్‌గా మారేందుకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దిలీప్ యాంటిసిపేటరీ బెయిల్‌పై హైకోర్టు గురువారం విచారించనుంది. -
మసూద్‌పై ఆధారాలున్నాయ్
-
మసూద్‌పై ఆధారాలున్నాయ్
సాక్ష్యాలు చూపాలన్న చైనా డిమాండ్‌పై భారత్ బీజింగ్: జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ దుశ్చర్యలన్నిటికీ ‘పక్కాఆధారాలు’ ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో సరైన ఆధారాలు చూపాలన్న చైనా డిమాండ్‌పై భారత్ తాజాగా స్పందించింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ తమ వద్ద మసూద్ దుశ్చర్యలకు సంబంధించి సరైన ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే ఈ విషయంపై ఇతర దేశాలను ఒప్పించాల్సిన బాధ్యత భారత్‌పై లేదన్నారు. దీనిపై ఐరాసలో దరఖాస్తు పెట్టిన దేశాలు మసూద్‌కు సంబంధించి బాగా తెలిసుకున్నాయి కాబట్టే ఆ ప్రతిపాదన చేశాయని.. లేకుంటే అసలా ప్రస్తావనే తెచ్చేవి కావని అన్నారు. ఆయన బుధవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఇతో సమావేశమయ్యారు. ఇండో–చైనా వ్యూహాత్మక సమావేశాల్లో భాగంగా ఇది జరిగింది. ఎన్ఎస్జీ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ సభ్యత్వంపై చైనా సానుకూలంగా ఉందన్నారు. అయితే విధివిధానా లపై ఆ దేశానికి తనదైన వైఖరి ఉందన్నారు. -
'రాహుల్ గాంధీ సాక్ష్యాలతో రావాలి'
ఉదయ్‌పూర్: మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దానికి సంబంధించిన సాక్ష్యాలతో రావాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మన్మోహన్ వైద్య కోరారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల సమావేశంలో పాల్గొనడానికి రోజుల పర్యటన నిమిత్తం ఉదయ్‌పూర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీజీ హత్యకు ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుందని, రాహుల్ గాంధీ కాదని వైద్య స్పష్టం చేశారు. ఓ ఆర్ఎస్ఎస్ వాలంటీర్ కోర్టులో రాహుల్‌ను సవాల్ చేయగా.. పారిపోయాడని ఎద్దేవా చేశాడు. రాహుల్ తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని సూచించారు. గాంధీజీ హత్యకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో సైతం ఆర్ఎస్ఎస్ ప్రస్థావన లేదని వైద్య గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలు అసత్యమని ఆయన కొట్టిపారేశారు. కోర్టు ఉగ్రవాదులని పేర్కొన్నవారికి రాహుల్ మద్దతిస్తున్నారని.. అసలు దేశంలోని న్యాయవ్యవస్థపై అతనికి నమ్మకముందా అని వైద్య ప్రశ్నించారు. -
ఆధారాల కోసం భారత్ కు పాక్ లేఖ
ఇస్లామాబాద్: ఉగ్రవాద దాడుల కేసు దర్యాప్తులో పాకిస్థాన్ మరోసారి దాటవేత ధోరణి ప్రదర్శించింది. 26/11 ముంబై ముట్టడి కేసులో ఇప్పటికే భారత్ ఆధారాలు సమర్పించినా ఇంకా సాక్ష్యాలు కావాలని అంటోంది. ఈ కేసుకు సరైన పరిష్కారం దొరకాలంటే మరిన్ని ఆధారాలు సమర్పించాలని భారత్ ను కోరింది. 26/11 ముంబై దాడి కేసులో పాకిస్థాన్ ప్రమేయం ఉందని మోపిన అభియోగాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని భారత్ కు తమ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌధురి లేఖ రాశారని విదేశాంగ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వెల్లడించారు. ఈ కేసుకు సరైన ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్లామాబాద్ ఉందని తెలిపారు. లేఖలోని మిగతా వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. 2008, నవంబర్ లో ముంబై లో జరిగిన దాడులతో సంబంధముందన్న ఆరోపణలతో ఏడుగురు లష్కరే-ఇ-తోయిబా తీవ్రవాదులను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన కుట్రదారుడు జకివుర్ రెహ్మాన్ ను బెయిల్ పై విడుదల చేసింది. మిగతా ఆరుగురు రావల్పిండి జైల్లో ఉన్నారు. -
కేసుల అంతుచూసే లేడీ డిటెక్టివ్...
బాండ్ ‘ఒక హత్య కేసులో ఫలానావాడు నిందితుడు అని నాకు తెలుసు. కాని ఆధారాలు కావాలి. అందుకని అతని ఇంటిలో పని మనిషిగా చేరాను. ఇది చాలా ప్రమాదకరమైన పనే. కాని అనుమానం రాకుండా పని చేస్తూ ఆధారాలన్ని సేకరించాక అతణ్ణి అరెస్ట్ చేయించాను’ అంటుంది రజని పండిట్. ముంబైలో ఆమెను అందరూ ‘లేడీ డిటెక్టివ్’ అని అంటారు. కొందరు క్లయింట్లు ‘మా దుర్గ’ అని దుర్గాదేవితో పోలుస్తారు. మరి కొందరు ‘లేడీ జేమ్స్‌బాండ్’ అంటారు. ఎవరు ఎలా పిలిచినా నేను మాత్రం డిటెక్టివ్‌నే అంటుంది రజని. భారతదేశంలో డిటెక్టివ్‌ల ప్రాబల్యం ఇటీవల పెరిగింది. ఇంతకు పూర్వం మిలట్రీ నుంచి వచ్చిన మాజీ సైనికోద్యోగులు అదీ మగవాళ్లు మాత్రమే డిటెక్టివ్‌లుగా పని చేసేవారు. కాని 1983లో ముంబై యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి రజని డిటెక్టివ్‌గా మారింది. ‘చదువుకు దూరమై డ్రగ్స్‌కు అలవాటు పడిన ఒకమ్మాయిని సాక్ష్యాధారాలతో సహా ఆమె తల్లిదండ్రులకు అప్పగించాను. అప్పటి నుంచి నన్ను అందరూ డిటెక్టివ్ పనులకు ప్రోత్సహించారు’ అంటుంది రజని. సాధారణంగా మగవాళ్లకు అనుకూలమైన ఈ పని ఆడవారికి ఇంకా అనుకూలమైనది రజని అభిప్రాయం. ఆడవాళ్లు సులభంగా ఇరుగుపొరుగు వారితో మాట కలపగలరు. ఎదుటివారు కూడా కావలసిన సమాచారం సులభంగా ఇచ్చేస్తారు అంటుంది రజని. అయితే ఆమెకు ఎక్కువగా వచ్చే కేసులు మాత్రం భార్య లేదా భర్త మీద అనుమానం కలిగి దానిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోమని కోరేవే. ‘నా జీవితంలో చాలా కేసులు అలాంటివి చేశాను. చేస్తున్నాను. పెళ్లయ్యాక ఇంకో ఎఫైర్ కోసం వెంపర్లాడేవాళ్లను చూస్తే బాధేస్తుంది. ఇంత వెంపర్లాట ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అంటాను’ అందామె. అలాగే ఆఫీసుకు బ్లూ షర్ట్‌తో బయలుదేరి మళ్లీ మనసు మార్చుకుని తెల్లషర్ట్ వేసుకున్నా సరే అనుమానించే భార్యలు కూడా ఉంటారని అంటోందామె. చాలామంది ఆడవాళ్లు ఒంటరిగా మిగిలినప్పుడు నా డిటెక్టివ్ పనితో వారికి బాసటగా నిలిచాను. అందుకు వారు చాలా కృతజ్ఞతగా ఉంటారు. ఆ ఆనందం చాలు అంటుంది ముంబై డిటెక్టివ్ రజని పండిట్. -
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!
సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను.. సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి. సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు. -
కొలిక్కి వస్తున్న బాంబు పేలుళ్ల కేసు
చిత్తూరు(అర్బన్) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరులోని జిల్లా న్యాయ స్థానాల సముదాయం వద్ద ఈ నెల 7వ తేదీన బాంబు పేలిన కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఈ ప్రమాదంలో ఓ న్యాయవాది గుమస్తా గాయపడి కాలును సైతం పొగొట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులు ఎవరన్న దానిపై దాదాపు 200 మందిని విచారించారు. ఇటీవల వన్‌టౌన్ సీఐ హైదరాబాద్‌కు వెళ్లి నగరంలోని అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ జాబితా వివరాలు తీసుకొచ్చారు. దీనిని రెండు రోజులుగా క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఆధారంగా ఈ వారం రోజుల లోపు బాంబు ఘటన కేసులోని నిందితుల ఆచూకీ తెలుసుకుని చిక్కుముడిని విప్పనున్నారు. -
ఆరు నిమిషాల్లోనే...
ఇదీ వృద్ధుడి అపహరణ ‘దృశ్యం’ సీసీ కెమెరాలో రికార్డైన ఆధారాలు సిటీబ్యూరో: తొమ్మిది మంది దుండగులు... ఆరు నిమిషాల నిడివి... తలుపులు పగులకొట్టి అపహరణ... స్థూలంగా ఇదీ ఒంటరి వృద్ధుడు బాలకృష్ణరావును కిడ్నాప్ చేసిన సీన్ ఈ దృశ్యాలు సైనిక్‌పురిలోని బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గత నెల 25 తెల్లవారుజాము 5.32 గంటల నుంచి 5.39 గంటల మధ్య నమోదైన ‘దృశ్యాలు’ ఇలా... సీన్-1 1. ఓ చేతిలో కొన్ని పత్రాలు, మరో చేతిలో తలుపు పగుల కొట్టే ఆయుధంతో ఒకడు, అతడి వెంట మరొకడు మొదటి అంతస్తులోని బాలకృష్ణ ఇంటికి వెళ్తున్నారు. 2. వీరి వెనుకే ముసుగులు ధరించి ముగ్గురు... మామూలుగా మరో నలుగురు ఇంటి మొదటి అంతస్తులోని ఇంటి వద్దకు చేరుకున్నారు. సీన్-2 3. బాలకృష్ణ ఇంటి తలుపులు పగులకొట్టడం పూర్తయిన తర్వాత... ఏడుగురు ఇంట్లోకి వెళ్లగా... మరో ఇద్దరు వాహనం సిద్ధం చేయడానికి కింది వచ్చారు. 4. అర్ధనగ్నంగా ఉన్న బాలకృష్ణను కాళ్లు చేతులు పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్న కిడ్నాపర్లు. రివార్డ్స్ ప్రకటించిన సీపీ... బాలకృష్ణ కిడ్నాప్ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన మల్కాజిగిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ను కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామితో పాటు ఎస్సై రాములు, సిబ్బంది వెంకటేశ్వర్, శ్రీరాములు, ఎన్.శ్రీనివాసులు, బ్రహ్మం, కె.శ్రీధర్‌బాబు, వెంకట్‌రెడ్డి, దిలిప్రెడ్డిలకు కమిషనర్ ప్రత్యేక రివార్డులను ప్రకటించారు. ఫిర్యాదు చేస్తే వారి పైనా కేసు... బాలకృష్ణకు ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో ఉన్న 2400 గజాల స్థలంపై కన్నేసిన మరో వర్గం మేకల శ్రీనివాస్‌యాదవ్ తదితరులపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. వీరంతా ఆ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించారని బాధితుడు చెప్తున్నారని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
'దృశ్యం' లాగా ఆధారాలను మాయం చేశాడు!
పాట్నా: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన దృశ్యం సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యాడో హంతకుడు. హత్యా నేరాన్ని కప్పిపుచ్చేందుకు సినిమాలో హీరో వేసిన ఎత్తులను బాగా ఒంటబట్టించుకొని పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కాని చివరికి అందరు నేరస్తుల లాగే చట్టానికి దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పాట్నాలోని వైశాలి ప్రాంతానికి చెందిన రజనీష్ సింగ్‌ను వారం క్రితం జరిగిన సృష్టీ జైన్ అనే మహిళ హత్య కేసులో అరెస్టు చేశారు. విచారణలో రజనీష్ వెల్లడించిన నిజాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పిలిపించి ఆమెను కాల్చి చంపిన రజనీష్ ఆధారాలను ధ్వంసం చేయడానికి దృశ్యం సినిమాను అనుకరించాడు. తన మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేసి పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని భావించి దానిని ఓ ట్రక్కులోకి విసిరేశాడు. అయితే ఆ మొబైల్ ట్రక్కులో వేయగానే పగిలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే తన మోటార్ సైకిల్‌ను సైతం గంగా నదిలో పడేశాడు. ఇందుకోసం రూ 500 చెల్లించి ఓ బోట్‌ను మాట్లాడుకొని వెళ్లి మరీ నదిలో బైక్‌ను పడేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న రజనీష్ ఓ మ్యాట్రీమోని సైట్ ద్వారా సృష్టి జైన్‌ను తనకు వివాహం కానట్లు నమ్మించి పాట్నాకు రప్పించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. -
పఠాన్ కోట్ దాడి దర్యాప్తుకు పాక్‌లో బ్రేక్
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన దర్యాప్తును ఇక ముందుకు తీసుకెళ్లలేమని పాకిస్థాన్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆధారాలను తమకు అందించాల్సిందిగా భారత్‌ను కోరినట్లు సమాచారం. కీలక వర్గాల సమాచారం మేరకు పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉపయోగించిన ఐదు ఫోన్ నెంబర్లను భారత్ పాకిస్థాన్ దర్యాప్తు అధికారులకు అందించింది. అయితే వీటిని పరిశీలించిన వారు వాటి ద్వారా ఎలాంటి సమాచారం రాబట్టలేమని చెప్పినట్లు అక్కడి పత్రిక డాన్ తెలిపింది. 'దర్యాప్తు బృందం భారత అధికారులు ఇచ్చిన ఐదు నెంబర్లను పరిశీలించింది. కానీ, ఈ నెంబర్ల ఆధారంగా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఎందుకంటే అవి ఫేక్ ఐడెంటిటీ ఉన్న ఫోన్ నెంబర్లు. వాటిద్వారా దర్యాప్తు ముందుకు వెళ్లదు. అందుకే ఆ బృందానికి మరిన్ని ఆధారాలు కావాలి. అందుకే ఈ మేరకు వాటిని త్వరగా తమకు పంపించాలని భారత్‌కు అధికారులు లేఖ రాశారు' అని డాన్ తెలిపింది. -
బంగారం నింపిన రైలును నిజంగా పాతిపెట్టారా?
బెర్లిన్: ఎప్పుడో నాజీల నాటి రోజుల్లో.. బంగారంతో నింపిన ఓ రైలును భూగర్బంలో పాతిపెట్టి దాచి ఉంచారని జానపదులు చెప్పుకునే మాటలు విని కొందరు గుప్త నిధుల వేటగాళ్లు చెమటోడుస్తున్నారు. రోజుల తరబడి దానికోసం గాలింపులు చేపట్టి చివరకు ఆ ప్రాంతాన్ని గుర్తించి ప్రత్యేక తవ్వకాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే, వారు వెతికిన ఆ చోట ఓ సొరంగ మార్గమైతే కనిపించిందికానీ, రైలు మాత్రం అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆ వెతికే వారితోపాటు పనిచేస్తున్న నిపుణులు తెలిపారు. పియోర్ కోపర్, ఆండ్రెస్ రిచ్టెర్ అనే ఇద్దరు వ్యక్తులు తమ హంటింగ్ కు సంబంధించిన విశేషాలు తెలియజేశారు. పోలాండ్ లోని వాల్బ్రిక్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ వంతెన వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం సమయంలో యుద్ధంలో తలమునకలైన నాజీలు తమ భవిష్యత్తు అవసరాలకోసం బంగారంతో నింపిన ఓ రైలును సొరంగంలో ఎవరికి కనిపించకుండా పాతిపెట్టి ఉంచారని కథలుకథలుగా అక్కడ జానపదులు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. నిజంగానే ఆ ప్రాంతంలో ఏదో దాచి ఉంచబడిందనే చెప్పే కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభ్యం అయ్యాయి. అయితే, అది బంగారు రైలే అని మాత్రం స్పష్టంగా తెలియదు. అయినా, ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నారేమో ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పరిశీలనలు జరిపారు. ఆ ప్రాంతం మొత్తాన్ని రాడార్ల సహాయంతో స్కానింగ్ చేయగా అక్కడ ఓ టన్నెల్ లాంటిది ఉందని తెలిసింది. అయితే, అందులో రైలు ఉన్నట్లు ఆధారాలు మాత్రం ఇప్పటివరకు లభించలేదట. మరోపక్క, ఇదే విషయాన్ని చెప్పేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఒక బృందమేమో తమ బంగారంతో నింపిన రైలు ఉన్నట్లు తోచడం లేదని చెప్పగా మరో బృందం మాత్రం 1945లో సోవియెట్ రెడ్డ్ ఆర్మీ కంటపడకుండా ఉండేందుకు నాజీలు బంగారంతో నింపిన రైలు పెట్టెలను సొరంగంలో పాతిపెట్టారని ఇప్పటికీ జానపదులు చెప్పుకుంటారని, తాము ఆ విషయాన్ని నమ్ముతున్నామని, ఏదేమైనా ఆ సొరంగంలో గాలింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, వారి నమ్మకం నిజమే అయ్యి బంగారు రైలు దొరుకుతుందేమో వేచి చూడాల్సిందే. -
కేసులు సరే.. ఆధారాలేవి?
* సేకరించడంలో పోలీసులు విఫలం * సులువుగా తప్పించుకుంటున్న నిందితులు సాక్షి, హైదరాబాద్: దర్యాప్తు అధికారులు చేసే చిన్న పొరపాటు నిందితుడికి అనుకూలంగా మారుతోంది. ఘటన అనంతరం నిందితుడ్ని పట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసే పోలీసులు... అదే సమయంలో కోర్టులో కేసు నిలదొక్కుకునేందుకు జాగ్రత్తలు తీసుకోకపోవడం నేరగాళ్లకు వరమవుతోంది. కోర్టుల్లో ఏళ్ల తరబడి విచారణ జరిగినా... చివరకు నేరం నిరూపించే ఆధారాలు లేకపోవడంతో నిందితులు సులువుగా బయటపడుతున్నారు. దీనిపై డీజీపీ అనురాగ్‌శర్మ దృష్టి సారించారు. ఆ ఉత్సాహం ఏమవుతోంది! గతంలో... హైదరాబాద్‌లో ఒకే కుటుంబంలో ఐదుగుర్ని హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడికి సంబంధించి ఆధారాలు లేవనే కారణంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 2006లో ఓడియన్ థియేటర్లో జరిగిన పేలుడులో పోలీసులు కీలక నిందితుడిగా పేర్కొన్న జియా ఉల్హక్ విషయంలోనూ ఇదే జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం సరైన ఆధారాలు లేవన్న కారణంతో న్యాయస్థానం అతడిని నిర్దోషిగా పేర్కొంది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం బయటి వారికి చేరవేశాడనే అభియోగంపై గతంలో ఆర్మీ జవాన్ పతన్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పతన్ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతర పరికరాలు దర్యాప్తు అధికారులు సీజ్ చేసి వాటిలో కొన్నింటిని వివరాల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. అయితే వివరాల కోసం పంపిన సామగ్రికి... వారు అడుగుతున్న సమాచారానికి సంబంధం లేకుండా ఉండటంతో ఎఫ్ఎస్ఎల్ అధికారులు సరైన వాటిని పంపించాల్సిందిగా కోరారు. దీంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇలాంటివెన్నో..! నిర్లక్ష్యం తగదు...: ఈ క్రమంలో... కేసుల్లో కీలకమైన ఆధారాల విషయంలో ఎటువంటి పొరపాట్లకూ తావివ్వద్దని సిబ్బందికి డీజీపీ అనురాగ్‌శర్మ ఆదే శాలిచ్చినట్లు సమాచారం. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌ల నుంచి సేకరించాల్సిన ఫైల్స్ విషయంతో పాటు వాటిని భద్రపరచడంపై కూడా దృష్టి సారించాలన్నారు.ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపేటప్పుడు నిర్లక్ష్యం వహించవద్దన్నట్టు తెలిసింది. -
కేరళ నుంచి తమిళనాడు వరకు పరుగో పరుగు
కొచ్చి: అచ్చం సినిమాలో కనిపించే చేజింగ్ లాంటి సీన్.. ఇంకా ఎంత దూరం చేయాలని వెంబడిస్తున్నవారికి చిరాకు. పోని ఎటువైపు వెళుతున్నారో అనే ఆలోచన చేద్దామా అనుకునే లోగానే అంచనాకు అందకుండా దిశమారుతోంది.. అయితే, ఇక్కడ జరిగింది మాత్రం దొంగా-పోలీస్ చేజింగ్ కాదు. మీడియా పోలీసు చేజింగ్.. చేతిలో కెమెరాలతో మీడియా సోదరులు తెగ అలసిపోయారు. కేరళ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు పోలీసు జీపును వెంబడించారు. ఎందుకని అనుకుంటున్నారా అందులో ఉన్నది కీలక నేరస్తుడు మరి. కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి సంబంధించి ఓ కీలక వీడియో పోలీసులకు ఇస్తానని చెప్పడంతో కెమెరా కళ్లని ఆ జీపుపైనే పడ్డాయి. మధ్యాహ్నం 3గంటల ప్రారంభమైన ఆ పరుగు తమిళనాడులోని కోయంబత్తూర్ వైపుగా సాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాం కేసులో పోలీసులు బిజు రాధాకృష్ణన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్ ముందు గతవారం అతడు హాజరైన సందర్భంలో గురువారం ఒక కీలక వీడియోను అందజేస్తానని చెప్పాడు. ఆ వీడియోలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆయన కేబినెట్ మంత్రులు, తన లివింగ్ పార్ట్నర్ సరితా నాయర్ తో సన్నిహితంగా ఉన్న వీడియో ఉందని చెప్పారు. అయితే, గురువారం కమిషన్ వద్దకు వచ్చిన బిజు తన వద్ద మొత్తం మూడు వీడియో కాపీలు ఉండగా ఒకటి దేశం వెలుపల ఉందని, మరొకటి తనను 2013లో అరెస్టు చేసినప్పుడు పోలీసులు తీసుకున్నారని, మరొకటి మాత్రం తన స్నేహితుడి వద్ద భద్రంగా ఉందని చెప్పాడు. దీంతో వెంటనే ఆ వీడియోను తీసుకొని రావాల్సిందిగా కమిషన్ పోలీసులకు ఆదేశాలిచ్చి తన తరుపున ఇద్దరు అధికారులను ఇచ్చి పంపించింది. దీంతో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అతడిని పోలీసులు జీపులో ఎక్కించుకొని బయలుదేరగానే ఆ వీడియో కోసం మీడియా ప్రతినిధులు కూడా పోలీసులను చేజింగ్ చేశారు. -
ఎవిడెన్స్
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 23 నేను మరో హంతకుడితో సెల్లో ఉన్నాను. అతని పేరు జాన్. తన భార్యని చంపాడన్న అభియోగం మీద అతను శిక్ష అనుభవిస్తున్నాడు. తను నా అభియోగం మీద ఆసక్తిని చూపించాడు. జరిగింది ఒకటికి పదిసార్లు నా చేత చెప్పించుకుని శ్రద్ధగా కళ్లు మూసుకుని విన్నాడు. ‘‘నేను దొంగని తప్ప హంతకుడ్ని కాను. నేను చేయని హత్యని పోలీసులు నామీద రుద్దారు. హంతకులు ఎవరో నాకు చూచాయగా తెలుసు’’ చెప్పాను. నేను కిటికీ అద్దాలు పగలగొట్టుకుని అర్ధరాత్రుళ్లు చీకట్లో రహస్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించే దొంగను కాను. అది నాకు ఇష్టం లేని పని. ఆహ్వానంపై ఇళ్లకి వెళ్లి, దొంగతనం చేయడం నా వృత్తి. అలా ఆహ్వానం అందుకోడానికి ఓ మార్గం... అమ్మకానికి ఉన్న ఇళ్లకి కొనుగోలు దారుడిలా వెళ్లడం. అక్కడ వారి కన్నుగప్పి జేబులో పట్టే విలువైన వస్తువులు తస్కరించడం నా వృత్తి. ఓ రోజు నా గాలానికి ఇళ్ల బ్రోకర్ గ్లోరియా చిక్కింది. ‘ఇల్లు అమ్మకానికి’ అన్న ప్రకటనకి నేను ఎప్పటిలానే జవాబు రాశాను. గ్లోరియా నాకు ఫోన్ చేసి అడిగింది. ‘‘మిస్టర్ చార్లీ?’’ ‘‘అవును. మీరు?’’ ‘‘నా పేరు గ్లోరియా. ఇల్లు కొందామనుకుంటున్నారా?’’ ‘‘అవును. మీ ప్రకటనని చూశాను.’’ ఆ ఇంటి విస్తీర్ణం, వయసు లాంటివి అడిగి తెలుసుకుని చెప్పాను. ‘‘నేను వెదికే ఇల్లు అలాంటిదే.’’ అడ్రస్ చెప్పింది. మంగళవారం సాయంత్రం ఐదున్నరకి ఇల్లు చూపిస్తానని చిరునామా చెప్పింది. ఆ ఇంటి యజమానురాలు వృద్ధురాలైన మిస్ హంట్లీ. ఆవిడ పెళ్లి చేసుకోలేదు. నన్ను హోప్ క్రాఫ్ట్‌గా పరిచయం చేసింది. మేం కరచాలనం చేసుకున్నాక గ్లోరియా చెప్పింది. ‘‘మీరు నన్ను క్షమిస్తే నేను వెళ్తాను మిస్టర్ హోప్ క్రాఫ్ట్. నాకు వేరే ముఖ్యమైన పని ఉంది. మిస్ హంట్లీ, దయచేసి మీ ఇంటిని మిస్టర్ హోప్ క్రాఫ్ట్‌కి చూపిస్తారా?’’ ఆమె సెలవు తీసుకుని వెళ్లిపోయాక మిస్ హంట్లీ నాకు గ్రీన్ రోజ్ టీని కలిపి తీసుకురావడానికి వంట గదిలోకి వెళ్లింది. నేను హాల్లోని మేంటిల్ పీస్ మీద ఉన్న ఓ జేడ్ రాయితో చేసిన బొమ్మని అందుకుని నా జేబులో వేసుకున్నాను. చెప్పాగా నేను దొంగని తప్ప హంతకుడ్ని కాదని. ఓ యువకుడి ఫొటోని చూసి అదెవరిదని అడిగితే ఆవిడ తన మేనల్లుడు రాబర్ట్ గురించి చెప్పింది. ‘‘నా మేనల్లుడు రాబర్ట్. నాకు వీడు తప్ప ఇంకో బంధువు అంటూ ఎవరూ ఈ ప్రపంచంలో లేరు.’’ ఆలోచించి నా నిర్ణయాన్ని మళ్లీ గ్లోరియాకి రెండు రోజుల్లోగా తెలియ చేస్తానని చెప్పి టీ తాగి బయటపడ్డాను. ‘‘ఆలస్యం చేయకండి. ఇప్పటికే నలుగురు ఇంటిని చూసి వెళ్లారు’’ ఆవిడ హెచ్చరించింది. మర్నాడు, బుధవారం ఉదయం ఆరున్నరకి నా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తలుపు కొట్టిన చప్పుడు విని నాకు మెలకువ వచ్చింది. లేచి వెళ్లి తలుపు తెరిస్తే ఎదురుగా యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ కనబడ్డాడు. అతను ఎందుకు వచ్చాడో ఊహించలేకపోయాను. కాని క్రితం రోజు నేను చేసిన దొంగతనం కోసం వచ్చాడని మాత్రం అనుకోలేదు. అతను లోపలికి వచ్చి అడిగాడు. ‘‘మిస్ హంట్లీ మీకు పరిచయమా?’’ ‘‘హంట్లీ. ఎక్కడో ఆ పేరు విన్న... అవును. నిన్న ఆవిడ ఇంటిని చూశాను.’’ ‘‘లక్ష పౌండ్లు ఇచ్చి దాన్ని కొనే తాహతు మీకుందా?’’... అతను నా అపార్ట్మెంట్లోని ఆట్టే ఖరీదు లేని వస్తువులని చూస్తూ అడిగాడు. నేను బదులు చెప్పలేదు. ఆ జేడ్ బొమ్మని చూశాడు. కాని ‘ఇదెక్కడిది?’ అని ప్రశ్నించలేదు. ఆవిడ ఆ బొమ్మ పోయిందని ఫిర్యాదు చేసి ఉండొచ్చు. గ్లోరియా ద్వారా నా ఫోన్ నంబర్ తెలుసుకుని, నా చిరునామా తెలుసుకుని అతను వచ్చాడని నాకు అర్థమైంది. ‘‘మీరు నాతో స్టేషన్‌కి రావాలి.’’ ‘‘దేనికి?’’ ‘‘ప్రశ్నించడానికి.’’ ‘‘ఏ విషయం మీద?’’ ‘‘మిస్ హంట్లీని మీరు ఎందుకు చంపారో తెలుసుకోడానికి.’’ నేను అదిరిపడ్డాను. ‘‘నేనావిడని చంపడం ఏమిటి?’’ అడిగాను కంగారుగా. జాన్ నేను చెప్పింది శ్రద్ధగా విని అడిగాడు. ‘‘గ్లోరియాకి, రాబర్ట్‌కి స్నేహం ఉందంటావు?’’ ‘‘అవును. కోర్టు హాలుకి వాళ్లు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని రావడం గమనించాను.’’ ‘‘నువ్వు అక్కడ మర్చి పోయిన నీ సిల్క్ రుమాలుని పోలీసులు ఆధారంగా ఉపయోగిస్తున్నారా?’’ ‘‘అవును.’’ ‘‘నిన్ను అరెస్ట్ చేశాక కాని అతను రాలేదా?’’ ‘‘అవును.’’ మర్నాడు జైలు లైబ్రరీలో జాన్ నాతో చెప్పాడు. ‘‘నేను చెప్పినట్లు ఓ ఉత్తరం రాయి. దాన్ని లైబ్రేరియన్‌కి ఇవ్వు. అతను పోస్ట్ చేస్తాడు.’’ డియర్ మిస్టర్ రాబర్ట్, హంతకుడిగా నువ్వు అనుభవించాల్సిన శిక్షని నేను అనుభవిస్తున్నాను. నేను నా కేసుని మళ్లీ తెరవమని, నువ్వే అసలు హంతకుడివి అని కోర్టుకి ఓ పిటిషన్ పెడితే చాలు. నేను బయటికి వెళ్తాను. నువ్వు లోపలికి వస్తావు. మిస్ హంట్లీ మరణించిన రెండు రోజుల దాకా నువ్వు మాంచెస్టర్లోనే ఉన్నావని పేర్కొన్నావు. కాని అది అబద్ధం. లేకపోతే నేను మరిచి పోయిన సిల్క్ రుమాలు మీద నీ డీఎన్ఏ ఎలా దొరుకుతుంది? దాన్ని నువ్వు ముక్కు తుడుచు కోడానికి ఉపయోగించావని నాకు తెలుసు. కేసు పూర్తయి తీర్పు వచ్చాక నా రుమాలుని పోలీసులు నాకు ఇచ్చేస్తారు. దాన్ని పరీక్షిస్తే నీ డీఎన్ఏ పోలీసులకి లభిస్తుంది. మనం ఎన్నడూ కలుసుకోలేదు అని కోర్టుకి తెలుసు. అలాంటప్పుడు మిస్ హంట్లీ ఇంట్లోంచి నేను బయటకి వచ్చాక, ఆ రుమాలు ఉన్న ఇంట్లోకి నువ్వు వెళ్లకపోతే దానిమీద నీ డీఎన్ఏ ఎలా వస్తుంది? నేను కోర్టుకి పిటిషన్ పెట్టుకుంటే కోర్టు దాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ఏ క్షణంలోనైనా పంపవచ్చు. నువ్వు అలా జరగకూడదనుకుంటే నా బేంక్ అకౌంట్ నంబర్ ఇస్తున్నాను. వెంటనే లక్ష పౌన్లు దానికి బదలాయించు. లేదా... జాన్ ఊహించిందే జరిగింది. లక్ష పౌన్లు నా అకౌంట్లో జమ అయ్యాయని నాకు తెలిసింది. ఆ సిల్క్ రుమాలు నా సూట్లో భద్రంగా ఉంది. అది జైల్లోని ఖైదీల వస్తువులు భద్రపరిచే గదిలో భద్రంగా ఉంది. (నీల్ స్కోఫీల్డ్ కథకి స్వేచ్ఛానువాదం) -
సాక్ష్యం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 18 కల్నల్ బ్రాక్స్టన్ తన స్టేట్మెంట్ పూర్తయ్యాక కోర్టు ప్రొసీడింగ్స్‌ని మౌనంగా గమనించసాగాడు. ‘‘కౌంటీ ఆఫీసర్‌గా నేను స్వీకరించిన ట్యాక్స్ మొత్తం పది వేల డాలర్లని ఆ రాత్రి ఆఫీస్ నించి ఇంటికి తెచ్చాను. నా భార్య ఇంట్లో లేదు. ఇంటికి వచ్చిన కొద్దిక్షణాలకి ఒంటరిగా ఉన్న నాకు ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. లేచి వెళ్లి తలుపు తెరిస్తే ఎదురుగా గడ్డం నించి ముక్కు దాకా ఎర్ర రంగు కర్చీఫ్ కట్టుకున్న ఓ వ్యక్తి చేతిలో పిస్తోలుతో కనిపించాడు. అతను నన్ను ట్యాక్స్ డబ్బివ్వమని బలవంతం చేస్తే ఇచ్చాను. తర్వాత నన్ను బట్టల అలమరాలోకి వెళ్లమని తలుపు మూసి బయట గడియపెట్టి వెళ్లిపోయాడు. నేను తలుపుని లోపల నించి కాళ్లతో తన్నాను. అది తెరచుకోకపోవడంతో గొంతు పగిలేలా అరిచాను. మా ఇల్లు హైవేకి నా అరుపులు వినపడనంత దూరంలో ఉంది. మా ఇంటి చుట్టుపక్కల ఇళ్లు లేవు’’ హెండర్సన్ చెప్పాడు. తర్వాత సాక్షిగా వచ్చిన పాలవాడు చెప్పాడు. ‘‘ఆ ఉదయం నేను హెండర్సన్ ఇంటి బెల్ నొక్కగానే లోపల నించి ఆయన అరుపులు వినిపించాయి. తలుపు తోస్తే తెరచుకుంది. లోపలికి వెళ్లి బట్టల అలమార గడియ తీస్తే అలసి పోయిన ఆయన కనిపించాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను.’’ ‘‘అతన్ని మీరు క్రాస్ ఎగ్జామ్ చేస్తారా?’’ జడ్జి డిఫెన్స్ అటార్నీని అడిగాడు. అతను లేదన్నట్లుగా చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడు. తర్వాత కల్నల్ బ్రాక్స్టన్ కోర్టుకి ఇలా చెప్పాడు. ‘హెండర్సన్ నించి ఫోన్ రాగానే వెళ్లి, నేరస్థుడి వర్ణనని రాసుకున్నాను. అది మా ఫైల్స్‌లోని ఒకతనికి సరిపోవడంతో అతని ఫొటోని కౌంటీ ఆఫీసర్ హెండర్సన్కి చూపించాను. అతను గత రాత్రి తన ఇంటికి వచ్చిన మనిషేనని కళ్లని చూసి గుర్తుపట్టాడు.’’ ‘‘కాని నేనా దొంగతనం చేయలేదు’’ నిందితుడు చార్లీ కళ్లనీళ్లతో చెప్పాడు. ‘‘ఆ సమయంలో ఎక్కడ ఉన్నావు?’’ ప్రాసిక్యూటింగ్ అటార్నీ అడిగాడు. ‘‘నా గదిలోనే ఉన్నాను. టీవీ చూస్తున్నాను’’ చార్లీ జవాబు చెప్పాడు. ‘‘నువ్వు నీ గదిలో ఉన్నట్లు ఎలిబీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా?’’ ‘‘లేరు. నేను, నా భార్య విడిపోయాం. నేను కొన్నేళ్లు జైల్లో ఉండగా విడాకులు తీసుకుని ఆమె ఇంకో పెళ్లి చేసుకుంది.’’ ‘‘ఓ! నువ్వు జైలు పక్షివే అన్నమాట! ‘‘కాని నేను విడుదలై ఏడేళ్లయింది. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు ఎవరూ మా ఇంటికి రాలేదు. కారు మెకానిక్‌గా నిజాయితీగా జీవిస్తున్నాను’’ చార్లీ అసహనంగా చెప్పాడు. చార్లీ తరఫు లాయర్ కోర్టుకి చెప్పిన మాట అందర్నీ ఆశ్చర్యపరచింది. ‘‘యువరానర్. ముద్దాయి తరఫున నేను ఒక్క సాక్షినీ ప్రవేశపెట్టడం లేదు.’’ ఆ లాయర్‌కి అతన్ని రక్షించే ఉద్దేశం లేదని, అతన్ని కోర్టు దయకి వదిలేశాడని చాలామంది చెవులు కొరుక్కున్నారు. బీదవాడైన చార్లీకి కౌంటీ నియమించిన లాయర్ కాబట్టి కేసు గెలిచినా, ఓడినా అతనికి ఒరిగేదేం లేదు. అతని ఫీజ్ అతనికి ఎటూ ముడుతుంది. కొందరు అతనిది బాధ్యతారాహిత్యం అని కూడా భావించారు. జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు. చార్లీ పాత దొంగ అని తెలియగానే జ్యూరీ సభ్యుల్లో కొందరికి ఇది అతని పనే అనే అనుమానం కూడా కలిగింది. కేసు విచారణ పూర్తయ్యాక ప్రాసిక్యూటింగ్ అటార్నీ లేచి నిలబడి అడిగాడు. ‘‘మై ఫ్రెండ్! మీరు నిజంగా మీ క్ల్లైంట్ తరఫున సాక్షుల్ని ఎవర్నీ ప్రవేశపెట్టడం లేదా? తర్వాతి ప్రొసీడింగ్స్‌లోకి వెళ్తే ఇక మీకు ఆ అవకాశం ఉండదు.’’ ‘‘లేదు. కాని కోర్టు అనుమతితో నేను ఓ సాక్ష్యాన్ని ప్రవేశ పెట్టదలచుకున్నాను.’’ ‘‘అదేమిటి? మీరు సాక్షుల్ని ప్రవేశ పెట్టనన్నారు?’’ ప్రాసిక్యూటింగ్ అటార్నీ అడిగాడు. ఆయన చిరునవ్వు నవ్వి అడిగాడు. ‘‘మీకు సాక్షికి, సాక్ష్యానికీ తేడా తెలీదా?’’ ‘‘ఏమిటా సాక్ష్యం?’’ జడ్జి కూడా ఆసక్తిగా అడిగాడు. ‘‘అందుకు నేను హెండర్సన్ని క్రాస్ ఎగ్జామ్ చేేన అవకాశం ఇప్పుడు వినియోగించుకుంటాను.’’ ‘‘సరే’’ జడ్జి అనుమతి ఇచ్చాడు. హెండర్సన్ బోనులోకి వచ్చాక డిఫెన్స్ అటార్నీ ప్రశ్నించాడు. ‘‘బట్టల అలమరాలో మీరు బంధింపబడ్డాక ఏం జరిగిందో మరోసారి చెప్తారా?’’ ‘‘ఆ పిస్తోలుతో బెదిరించి చార్లీ నన్ను లోపలికి పంపాడు. తలుపు మూయగానే అంతా చీకటి. బయట తలుపుకి గడియ పెట్టిన చప్పుడు వినిపించింది. నేను ఆ తలుపుని నా చేతులతో బాదుతూ తెరవమని అరిచాను. నా కాళ్లతో బలంగా చాలాసేపు తన్నాను. ఆ తర్వాత అలసిపోయి నిద్రపోయాను.’’ ‘‘మీరు ఆఫీస్ నించి ఆ డబ్బుతో వచ్చిన ఎంతసేపటికి ఇది జరిగింది?’’ ‘‘తక్షణం. నేను బయట నించి డబ్బుతో అప్పుడే ఇంట్లోకి వచ్చాను. వెంటనే బెల్ కొట్టి లోపలికి వచ్చాడు.’’ ‘‘అంటే మీరు ఇంకా బూట్లు విప్పి ఉండరు కదా?’’ ‘‘అవును... కాపేసినట్లున్నాడు చార్లీ. నేను దుస్తులు మార్చుకునే లోపలే బెల్ నొక్కాడు. నేను తలుపు తెరిచాక జరిగింది మళ్లీ చెప్పనా?’’ ‘‘అవసరం లేదు. బూటు కాళ్లతో తన్నడం నిజమేనా?’’ ‘‘కాళ్లకి బూట్లు ఉంటే వాటిని విప్పి తన్నేవాడు మూర్ఖుడు అవుతాడు’’ హెండర్సన్ నవ్వుతూ చెప్పాడు. డిఫెన్స్ అటార్నీ సైగ చేయగానే కోర్టు హాల్ తలుపు తెరుచుకుంది. లోపలికి ఇద్దరు సాక్ష్యాన్ని మోసుకు వచ్చారు. దాన్ని చూడగానే కోర్టులో గుసగుసలు. ‘‘ఆర్డర్. ఆర్డర్’’ జడ్జి అరిచాడు. డిఫెన్స్ అటార్నీ చెప్పాడు. ‘‘యువరానర్. ఇదే నేను ప్రవేశపెట్ట దలచుకున్న సాక్ష్యం. ఇది హెండర్సన్ ఇంట్లో, ఆయన్ని బంధించిన బట్టల అలమరా తలుపు. తప్పించుకోడానికి అతను తన బూట్ల కాళ్లతో బలంగా తన్నిన భాగాన్ని గమనించండి.’’ జడ్జితో పాటు మిగిలిన వారంతా దానివైపు చూశారు. పిడికి వెనక భాగంలో తెల్లటి రంగు వేయబడ్డ ఆ తలుపు నిగనిగలాడుతోంది. ఎక్కడా చిన్న మరక కాని, గుర్తు కాని లేదు. ‘‘యువరానర్. అది మిస్టర్ హెండర్సన్ అల్లిన కట్టుకథ మాత్రమే. ఈ కేస్‌ని పరిశోధించిన మేధావి బ్రాక్స్టన్ దృష్టిని ఏదీ తప్పించుకోలేదు అన్నది హెండర్సన్కి తెలీదు.’’ డిఫెన్స్ అటార్నీ కల్నల్ బ్రాక్స్టన్ వంక చూసి సైగ చేశాడు. బ్రాక్స్టన్ వచ్చి ‘కోర్టు అనుమతితో’ అని చెప్పి కుడి బూటు కాలితో ఆ తలుపు మీద తన్నాడు. తన్నిన చోట తెల్లటి రంగు పెచ్చు లేచింది. ‘‘యువర్ ఆనర్. దొంగిలించబడ్డ డబ్బుని ఎక్కడ దాచాడో నేరస్థుడు హెండర్సన్ చెప్తే, ముద్దాయిని మీరు నిర్దోషిగా ఇంటికి పంపచ్చు’’ డిఫెన్స్ అటార్నీ చెప్పాడు. హెండర్సన్ మొహంలో అతను పట్టుబడ్డ తాలూకు అవమానం కోర్టులోని వారందరికీ ప్రస్ఫుటంగా కనిపించింది. (మెర్విల్ డేవిసన్ పోస్ట్ కథకి స్వేచ్ఛానువాదం) -
‘జూరాల- పాకాల’ సమ్మతమేనా?
నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిరూరల్ : జిల్లా నుంచి 70 టీఎంసీల నీటి ని తీసుకువెళ్లేందుకు రూపకల్పన చేసి న జూరాల-పాకాల ప్రాజెక్టుకు అంగీకరించావా? అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి సూటిగా ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన నిరంజన్‌రెడ్డి ఆధారలతో సహా ప్రజల ముందుకొచ్చి తాను నె ట్టెంపాడుపై రాసిన వ్యాసం చూపించాలన్నారు. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆదివారం వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం బాగుండాలనే ఉద్దేశంతో దివంగత సీ ఎం వైఎస్ఆర్ హయాంలో రూ.7469. 37కోట్ల నిధులతో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. 90శాతం పనులు చేయించిన ఘనతఆయనకే దక్కిందన్నారు. తెలం గాణ మొదటి బడ్జెట్లో ఎంజీఎల్‌ఐ, కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా, నెట్టెం పాడు ప్రాజెక్టుల పాత బకాయి బిల్లుల చెల్లింపులకు కేసీఆర్ బడ్జెట్లో కేవలం రూ. 310 కోట్లు వెచ్చించడం శోచనీయమన్నారు. పెద్దాయనే బతికిఉంటే జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిచేసుకుని జిల్లా సస్యశ్యామం అయ్యేదని గుర్తుచేశారు. జూరాల- పాకాల పేరుతో జిల్లాలో ఉన్న ఏకైక ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నారని, నెట్టెంపాడు ప్రాజెక్టు సామర్థ్యం 40 టీఎంసీలకు పెంచి ఆ తరువాతే జూరాల- పాకాలకు సిద్ధంకావాలని సూచించారు. కాదని పూనుకుంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం సరికాదు జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కేసీఆర్ పర్యటన కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలను ఆహ్వానించాల్సి ఉండేదని, అందరితో కలిసి జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తే బాగుండేదని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. మెమోరాండం సిద్ధం చేసుకున్న తరువాత కేవలం మహబూబ్‌నగర్ టౌన్ వారు ఆహ్వానితులని చెప్పడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ శంకర్‌నాయక్, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
భర్తే కాలయముడు!
పోతిరెడ్డిపాలెంలో అంగన్వాడీ టీచర్ హత్య ? తండ్రే పీక నులిమి చంపాడంటున్న కొడుకు అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లి ఫిర్యాదు మూడుముళ్లు వేసి నూరేళ్లూ తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు !అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను కడతేర్చాడు !! యలమంచిలి : యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి (28) దారుణ హత్యకు గురైంది.తన తల్లిని తండ్రే పీక నులిమి హతమార్చినట్టు ఆరేళ్ల కొడుకు తరుణ్ చెబుతున్నాడు. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి... పోతిరెడ్డిపాలెం ఇందిర మ్మ కాలనీలో రాజాన సూర్యనారాయణ, రాజ్యలక్ష్మి నివాసముంటున్నారు. మాకవరపాలెం మండలం జెడ్.గంగవరానికి చెందిన రాజ్యలక్ష్మికి సూర్యనారాయణతో 2006 మే 10న వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు తరుణ్, నాలుగేళ్ల కుమార్తె గ్రీష్మ ఉన్నారు. సూర్యనారాయణ స్థానికంగా చిన్న కాన్వెంట్ నడుపుతున్నాడు. భార్య రాజ్యలక్ష్మి పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు రామభద్రపురంలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది. మద్యానికి బానిసైన సూర్యనారాయణ తరచూ భార్యను వేధించేవాడు. గతంలో పలుమార్లు గ్రామపెద్దలు, యలమంచిలి పోలీసు లు, అనకాపల్లి మహిళా పోలీసులకు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి బాగా మద్యం సే వించి వచ్చిన సూర్యనారాయణ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో వివాదం పెద్దదైంది. అనంతరం రాజ్యలక్ష్మి నిద్రపోగా ఆమె పీక నులిమి చంపినట్లు సంఘటనా స్థలంలో ఆధారాలు తెలియజేస్తున్నాయి. కొడుకు తరుణ్ కూడా ఇదే చెబుతున్నాడు. ఇద్దరికీ ముఖం, మెడ భాగాల్లో గోళ్ల రక్కులు ఉండటం, గదుల్లో చేతిగాజులు ముక్కలు, ముక్కలుగా పడి ఉండటం కన్పించాయి. అనంతరం ఆమెను మూడో గదిలో స్లాబ్‌కున్న ఇనుప కొక్కానికి చీరతో వేలాడదీశాడు. శుక్రవారం రాత్రి తాను నిద్రిస్తున్న సమయంలో ఉరిపోసుకుని చనిపోయిందంటూ శనివారం ఉదయం సూర్యనారాయణ అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ కె.రామకృష్ణ, ఏఎస్ఐ హరి జోన్స్ సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కలవారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. తన కూతురిది హత్యే : కూతురు మృతి వార్త తెలుసుకున్న ఆమె తల్లి గంగతల్లి బంధువులతో కలిసి మాకవరపాలెం మండలం జెడ్.గంగవరం నుంచి పోతిరెడ్డిపాలెం చేరుకుంది. రాజ్యలక్ష్మి మృత దేహం వద్ద బోరున విలపించింది. నిత్యం చిత్రహింసలు పెడుతున్న సూర్యనారాయణే తమ కూతుర్ని హత్య చేశాడని రూరల్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈమేరకు 498ఎ, 306 సెక్షన్ల కింద వారు కేసు నమోదు చేశారు. శవపంచనామా అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ రామకృష్ణ చెప్పారు. అయితే ఆమె తాను హత్యచేయలేదని, ఉరిపోస్తుకుందని సూర్యనారాయణ చెబుతున్నాడు. -
లాయర్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి..
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా లాయర్‌తోపాటు మరికొందరిపై భౌతిక దాడికి దిగిన ఇద్దరు న్యాయవాదులపై తగిన సాక్ష్యాధారాలున్నాయని సోమవారం హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై ఇంతకుముందు సదరు నిందితులకు షోకాజ్ నోటీసులు జారీచేసిన కోర్టు సోమవారం కోర్టు ధిక్కార నోటీసులను జారీచేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 12న చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. కేసు వివరాలిలా ఉన్నాయి. తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో గత మే 23వ తేదీన వరుణ్ జైన్, చంద్ర ప్రకాశ్ గౌతమ్ అనే ఇద్దరు న్యాయవాదులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక మహిళా న్యాయవాదితోపాటు కొందరు వ్యక్తులపై భౌతిక దాడికి దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి విచారణ జరిపారు. కాగా, కోర్టు ప్రాంగణంలో జరిగిన విషయాన్ని ఒక వ్యక్తి తీసిన ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనంతరం నిందితులిద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా, వారిద్దరూ తర్వాత జరిగిన గుర్తింపు పెరేడ్‌కు హాజరయ్యేందుకు నిరాకరించారు. దీంతో వారికి కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. గుర్తింపు పెరేడ్‌కు హాజరయ్యేందుకు నిరాకరించినందున వారిపై ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని అందులో పేర్కొంది. -
అనూహ్య హత్య కేసు
సాక్షి, ముంబై: అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో.... పోలీసులతోపాటు అందరు ఎదురుచూస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ మరో రెండు మూడు రోజుల్లో వచ్చేఅవకాశాలున్నాయి. దీని గురించి ముంబై కలీనాలోని ‘ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీస్’ డెరైక్టర్ డాక్టర్ ఎంకె మాల్వే ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు ఫోరెన్సిక్ నివేదిక ఇంకా తయారుకాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో నివేదిక అందే అవకాశముందని తెలిపారు. దర్యాప్తులో కనిపించని పురోగతి... నగరంలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్య కేసులో పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు అదుపులోకి తీసుకున్నారని చెప్పిన నిందితులనుంచి కూడా పెద్దగా ఆధారాలేవీ లభించకపోవడంతోవారిని కూడా విడిచిపెట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. -
పత్తాలేని సైబర్ ల్యాబ్స్
=న్వెస్టిగేషన్ ఎనాలసిస్కు ఉపయుక్తం =డాదిన్నర క్రితమే సర్కారుకు ప్రతిపాదనలు =పట్టించుకోని ఎంహెచ్ఏ, బీపీఆర్ అండ్ డీ =ఫలితంగా ఇప్పటికీ ఆచరణలోకి రాని వైనం సాక్షి, సిటీబ్యూరో: ఏ కేసు దర్యాప్తులో అయినా ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు కీలకపాత్ర పోషిస్తాయి. సాధారణ కేసుల్లో నమూనాలు సేకరించడం పోలీసులకు తెలిసిన విషయమే. అయితే సైబర్ నేరాల్లో మాత్రం అత్యంత సున్నితమైన టెక్నికల్ ఎవిడెన్స్‌కు కీలక ప్రాధాన్యం ఉంటుంది. వీటిని విశ్లేషించడం అంత తేలిక కాదు. చిన్న పొరపాటు జరిగినా... అవి తుడిచిపెట్టుకుపోతాయి. ఇది సైబర్ క్రిమినల్స్‌కు కలిసి రావచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు సైబర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు అనుబంధంగా వీటికి రూపమివ్వాలనే ఉద్దేశంతో ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదనల్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు పంపారు. అయితే ఇప్పటికీ ఇవి అమలుకు నోచుకోలేదు. ఆలస్యమైతే నిందితులకు లాభం... ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు నమూనాలు వెళ్తే అక్కడ మౌలికవసతుల కొరత, పని ఒత్తిడి కారణంగా రిపోర్టు రావడానికి చాలా సమయం పడుతుంది. న్యాయస్థానాల్లో కేసులు నిలవాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అందించే నివేదికలు అత్యంత కీలకం. హత్య, లైంగికదాడి, చోరీ తదితర కేసుల్లో ఆధారాలుగా భౌతికాంశాలైన రక్తం, వేలిముద్రలు, ఆయుధాలు తదితరాలు ఉంటాయి. వీటిని సేకరించిన తరవాత విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపే ముందు దర్యాప్తులో అవసరమైన మేర పోలీసులే విశ్లేషణ చేసుకుంటారు. ఈ ఆధారాలు ఫిజికల్‌గా పోలీసుల వద్ద లేకున్నా దర్యాప్తు ముందుకు సాగుతుంది. అయితే, సైబర్ నేరాల్లో ఆధారాలుగా సెల్‌ఫోన్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల్లోని డేటా, పెన్‌డ్రైవ్స్, మెమోరీ కార్డ్స్ సేకరిస్తారు. ఏమాత్రం పొరపాటు జరిగినా వాటిలోని సమాచారం తుడిచిపెట్టుకు పోయి నిందితులను దోషులుగా నిరూపించే అవకాశం లేకుండా పోతుంది. దీంతో టెక్నికల్ ఎవిడెన్స్‌గా పిలిచే వీటినీ విశ్లేషణ కోసం కచ్చితంగా ల్యాబ్‌కు పంపాల్సిందే. మరోపక్క సైబర్ క్రైమ్ సంబంధిత కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలంటే ఎప్పటికప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్లోని అంశాలను పరిగణలోకి తీసుకుని దశ, దిశలను మార్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూస్తే అది నిందితులకు అనువుగా మారే ప్రమాదం ఉంది. దీనికి పరిష్కారంగానే... నిందితులను పట్టుకోవడం, వీరిపై నమోదైన అభియోగాలను కోర్టులో నిరూపించడం కోసం సాంకేతిక ఆధారాలను విశ్లేషించాలని దర్యాప్తు అధికారులు ప్రయత్నించినా సాధ్యం కాదు. సరైన అవగాహన, శిక్షణ, ఉపకరణాలు లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే సైబర్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రాథమికంగా జంట కమిషనరేట్లలోని సైబర్ పీఎస్‌ల్లో రెండింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర పోలీసు విభాగం ఆ మేరకు రూ.3.8 కోట్ల అంచనాలతో గతేడాది ఏప్రిల్‌లో ఎంహెచ్ఏకు ప్రతిపాదనలు పంపింది. ఒక్కో ల్యాబ్‌ను రూ.1.9 కోట్లతో ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. ఇన్వెస్టిగేషన్ ఎనాలసిస్కు ఉపకరించే ఈ తరహా ల్యాబ్ ప్రస్తుతం సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ అందుబాటులో ఉంది. అక్కడి నిపుణులతోనే ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే ల్యాబ్స్‌లో పని చేసే సిబ్బందికీ శిక్షణ ఇప్పించాలని భావించారు. బీపీఆర్ అండ్ డీ కూడా మర్చిపోయింది... సదరు నిధుల్ని అందించాల్సిందిగా చేరిన ప్రతిపాదనల్ని ఎమ్హెచ్ఏ పట్టించుకోలేదు. దీని విషయం ఇలా ఉంటే... మరో రెండు ల్యాబ్స్ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామంటూ ముందుకు వచ్చిన బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) కూడా ఆ విషయం మర్చిపోయి మిన్నకుండి పోయింది. తొలినాళ్లలో బీపీఆర్ అండ్ డీ అందించే నిధులతో విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఎమ్హెచ్ఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇవి మంజూరైతే జంట కమిషనరేట్లలోనే ఇవి పెట్టి, ఆ తరవాత వచ్చే నిధులతో ఇతర ప్రాంతాల్లో నెలకొల్పాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే రెండు విభాగాలు సైతం మిన్నకుండిపోవడంతో సైబర్ ల్యాబ్స్ పత్తాలేకుండా పోయాయి. రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతుండటంతో అమాయకుల డబ్బు ఆన్లైన్ ద్వారానే వారికి చేరిపోతోంది.