
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) కాజేసేందుకు జరిగిన కుట్ర కేసులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్ వలీ పాత్రపై హైదరాబాద్ సెంట్రల్ క్రెమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆయ న పాత్రను పక్కాగా నిర్ధారించడంతో పాటు సూత్రధారులను గుర్తించేందుకు అతడిని విచారించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో జైల్లో ఉన్న మస్తాన్ వలీని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మస్తాన్ వలీ విచారణ తర్వాతే ‘తెలుగు అకాడమీ’ సూత్రధారులు సాయి తదితరులకు ఈ కేసుతో ఉన్న సంబంధాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment