హైదరాబాద్: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకులో ఉండిపోవడమే కాదు.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. సదరు కస్టమర్ 85 ఏళ్ల వృద్ధుడు కావడంతో చేసేదేమీ లేకుండా పోయింది. ఉదయం వరకూ అందులోనే ఉండిపోయి నానా ఇబ్బంది పడ్డాడు. చివరకు అన్న పానీయాలు లేక అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఉదయం సిబ్బంది వచ్చి బ్యాంకు తెరిచే వరకూ కూడా ఆ కస్టమర్‌ను తాళం వేసి వెళ్లిపోయామన్న సంగతి వారికి గుర్తుకురాలేదు. కానీ ఆ వృద్ధుడు బాగా నీరసించి అక్కడే పడిపోయి ఉండటంతో ఆయన్ను.. పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. లాకర్ కోసమని 85 ఏళ్ల వృద్ధుడు జూబ్లిహిల్స్‌లోని యూనియన్ బ్యాంక్‌కు వచ్చాడు. లాకర్ చెక్ చేసుకునే క్రమంలో బ్యాంకు టై మగిసింది. ఆ వృద్ధుడు అక్కడే ఉండిపోయిన విషయాన్ని బ్యాంకు సిబ్బంది గమనించలేదు. తలుపులు వేసుకుని, బయట లాక్ చేసుకుని వెళ్లిపోయారు. ఫలితంగా ఆ వృద్ధుడు బ్యాంకులో ఉండిపోవడం, తెల్లారి వచ్చేసరికి అపస్మారక స్థితిలో వెళ్లిపోవడం జరిగింది. నిన్న(సోమవారం) బ్యాంకు పని మీద ఏ టైమ్‌కు వచ్చాడో కానీ బాగా నీరసించి పోయాడు. ఈ ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment