Union Bank
-
ప్రభుత్వ బ్యాంక్ ప్రత్యేక క్రెడిట్‌కార్డు.. భారీ రాయితీలు
మహిళల అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్‌తో ఓ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పిల్లల నుంచి మహిళలు, సీనియర్ సిటిజన్స్ వరకు అన్ని వర్గాల్లోని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కొన్ని సర్వీసులను తీసుకొస్తాయి. అలా మహిళా వినియోగదారుల కోసం యూనియన్ బ్యాంక్ ఇటీవల ‘దివా’ పేరుతో ఓ ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయో బ్యాంక్ వర్గాలు తెలిపాయి. దివా క్రెడిట్ కార్డ్ 18 నుంచి 70 ఏళ్ల వయసులోని మహిళలకు కేటాయిస్తారు. వారి కనీస సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలుగా ఉండాలి. ఆదాయ రుజువు లేనిపక్షంలో ఫిక్స్డ్ డిపాజిట్ భద్రతపై కూడా ఈ దివా కార్డును జారీ చేస్తారు. దీని నుంచి యాడ్ఆన్ కార్డులను కూడా మహిళలకే అందిస్తారు. దరఖాస్తు సమయంలో శాలరీ స్లిప్, ఫామ్ 16, ఐటీ రిటర్నులతో పాటు పాన్, ఆధార్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఏడాదికి 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లను పొందవచ్చు. వార్షిక రక్త పరీక్షలతో కూడిన హెల్త్ ప్యాకేజీని పొందే వీలుంది. ఈ కార్డును రూపే నెట్‌వర్క్‌లో జారీ చేయడంతో వివిధ వ్యాపార ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, యూపీఐ బెనిఫిట్స్ వర్తిస్తాయి. రూ.100 గరిష్ఠ మొత్తంతో 1 శాతం ఇంధన సర్ఛార్జ్ రీయింబర్స్మెంట్ లభిస్తుంది. 24/7 ట్రావెల్, హోటల్ రిజర్వేషన్లు, కన్సల్టెన్సీ సేవలపై రాయితీలు పొందవచ్చు. లాక్మీ సెలూన్, నైకా, ఇక్సిగో, మింత్రా, ఫ్లిప్‌కార్డ్, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, అర్బన్ క్లాప్ వంటి సైట్లలో స్పెషల్ డిస్కౌంట్ కూడా లభించనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ప్రతి రూ.100 ఖర్చుకు రూ.2కు సమానమైన రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కార్డు వార్షిక రుసుము రూ.499 కాగా.. ఓ ఏడాదిలో 30 వేలు ఖర్చు చేస్తే అది కూడా మినహాయిస్తారు. ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే.. -
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్‌కు చెందిన డబ్బు మాయం
హైదరాబాద్: సొంత ఇంటికి యజమానులే కన్నం వేశారు. బ్యాంకు అధికారులతో కలసి ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎఫ్డీ అకౌంట్స్‌లో ఉన్న కోట్లాది రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు సభ్యులు ఆ ఇంటి దొంగల్ని ప్రశ్నించగా వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో పక్కా ఆధారాలతో యూనియన్‌లోని సభ్యులు రాందాస్ ధన్‌రాజ్, వెంకటేశ్వరరావులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్‌లపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 420 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. దీనిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్షులతో కలపి దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్‌లో ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో ఖాతా ఉంది. దీనిలో ఎఫ్డీ, ఇతర లావాదేవీలు కలిపి మొత్తం రూ. 7 కోట్లు ఉన్నాయి. యూనియన్ బైలా ప్రకారం యూనియన్‌లో ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఎంతో కాలం నుంచి ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో ప్రెసిడెంట్ సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్‌లు ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ చూశామంటూ రాంపూర్ వద్దకు సభ్యులు రాందాస్ ధన్‌రాజ్, వెంకటేశ్వరరావు తదితరులను తీసుకెళ్లారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేసి ఓనర్ నుంచి ఇతను అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పారు. అడ్వాన్స్ కూడా నాలుగు రోజుల ముందే ఇచ్చినట్లు చెప్పడంతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావులు అలా ఏకపక్షంగా ఎలా ఇస్తారని ప్రెసిడెంట్, జీఎస్, ట్రెజరర్లను నిలదీశారు. దీంతో వీరు పొంతన లేని సమాధానాలు చెప్పండతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే యూనియన్‌లో ఉన్న 60 మంది అనుకూలమైన వ్యక్తులకు ప్రెసిడెంట్, ట్రెజరర్, జీఎస్‌లు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లలో యూనియన్‌కు చెందిన ఎఫ్‌డీలోని రూ.7 కోట్లలో ఒక్కోక్కరికీ రూ.9 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఈ 60 మందికి వచ్చిన దాదాపు రూ.5 కోట్ల 40 లక్షలు క్యాష్ రూపంలో డ్రా చేయించి ముగ్గురూ తీసుకున్నారు. మరికొంత కూడా వివిధ కారణాలు చెప్పి డ్రా చేశారు. ఇలా పలు దఫాలుగా రూ. 6 కోట్ల 50 లక్షలు యూనియన్ అనుమతి లేకుండా అనధికారికంగా బ్యాంకు అధికారుల ప్రమేయంతో కాజేశారు. దీనిపై పక్కా ఆధారాలతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావు, మరికొందరు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ చింతపల్లి మల్లికార్జున చౌదరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యూనియన్ బ్యాంక్ రికార్డు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లో రూ. 1,712 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందజేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఒక డివిడెండ్ చెక్కును కేంద్రానికి సమరి్పంచినట్లు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ స్థాయిలో డివిడెండ్‌ను యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ సమరి్పంచలేదని కూడా ప్రకటన వివరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ మణిమేఖలై డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. జాయింట్ సెక్రటరీ (బ్యాంకింగ్) సమీర్ శుక్లా తదితర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రూ. 3,000 కోట్ల మొండి పద్దుల విక్రయానికి యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాడ్ బ్యాంక్ ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించేందుకు రూ. 3,000 కోట్ల విలువ చేసే 8 మొండి పద్దులను (ఎన్పీఏ) గుర్తించినట్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్ల విలువ చేసే మూడు ఖాతాలను విక్రయించినట్లు తెలిపింది. తాజాగా దాదాపు రూ. 10,000 కోట్ల బాకీలు ఉన్న మొత్తం 42 సమస్యాత్మక ఖాతాలను గుర్తించినట్లు బ్యాంకు సీఈవో ఎ మణిమేఖలై తెలిపారు. వీటిలో కనీసం ఎనిమిది ఖాతాలను ఈ ఆర్థిక సంవత్సరం విక్రయించగలమని ఆశిస్తున్నట్లు వివరించారు. -
ఒంగోలు: బ్యాంకులో కాల్పుల కలకలం.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య
సాక్షి ప్రకాశం: ఒంగోలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు సెంటర్లోని యూనియన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఎం. వెంకటేశ్వర్లు(35) తుపాకీతో తనను తానే కాల్చుకుని మృతిచెందాడు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూనియన్ బ్యాంక్‌లో వెంకటేశ్వర్లు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం విధుల్లో ఉండగా.. బ్యాంక్‌లోని రూమ్‌లోకి వెళ్లి గన్‌తో తనను తానే కాల్చుకున్నాడు. ఈ క్రమంలో పెద్ద శబ్ధం రావడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇక, చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుటుంబం ఒంగోలు రామ్‌నగర్‌లోని 8వ లైన్లో నివాసం ఉంటోంది. ఏడేళ్ల క్రితం ఉమామహేశ్వరితో వెంకటేశ్వర్లకు వివాహం జరిగింది. వీరికి సంతానం లేనట్టు తెలుస్తోంది. కాగా, వెంకటేశ్వర్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. కారణం ఇదే.. -
యూనియన్ బ్యాంక్‌కు కొత్త అధికారి
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా శ్రీనివాసన్ వరదరాజన్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. వరదరాజన్‌కు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ ఎండీగా సేవలు అందించారు. -
బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
సాక్షి, వీరఘట్టం (మన్యం పార్వతీపురం): మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన స్థానికులైన భోగి ప్రదీప్ ఖాతా నుంచి రూ.7,500, భోగి ప్రదీప్‌కుమార్ ఖాతా నుంచి రూ.6,400, కస్పా ఉమాశంకర్‌ప్రసాద్ ఖాతానుంచి రూ.9,999లు గత నెల ఆగస్టు 13వ తేదీన విత్ డ్రా అయ్యాయి. డబ్బులు విత్ డ్రా అయినట్లు అదే రోజు మధ్యాహ్నం 3.21 గంటలకు వారి ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో విస్తుపోయిన వారు తమకు తెలియకుండా డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయి? ఎవరు విత్ డ్రా చేశారోనని తలలు పట్టుకున్నారు. ఆగస్టు 13 రెండవ శనివారం కావడంతో సాయంత్రం 4 గంటలకే బ్యాంకు మూసేశారు. మరుసటి రోజు ఆగస్టు 14న ఆదివారం, సోమవారం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకుకు వరుస సెలవులు ఇచ్చారు. దీంతో వారు ఆగస్టు 16న బ్యాంకుకు వెళ్లి మేనేజర్ జయరామ్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించి ఆధార్‌కార్డు నంబర్ ఆధారంగా 2230250000–222515304293 నంబర్ గల కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా డబ్బులు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. అయితే కస్టమర్ సర్వీసు సెంటర్ ఏ ప్రాంతానికి చెందినదో గుర్తించలేమని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ముంబైలోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి మెయిల్ చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. బాధితుడు ప్రదీప్ కుమార్ మూడు వారాలు గడుస్తోంది యూనియన్ బ్యాంకు ఖాతాల నుంచి తమ డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేసినా ఇంత వరకు బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో ఒకరైన భోగి శ్రీధర్ శుక్రవారం యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఇంత వరకు ఏ చర్యలు చేపట్టారో చెప్పండని బ్యాంకు సిబ్బందిని ప్రశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజరు సెలవులో ఉన్నారని, రెండు రోజుల తర్వాత రావాలని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి వీరి ముగ్గురి డబ్బులే విత్ డ్రా అయ్యాయా? లేక ఇంకవరివైనా విత్ డ్రా అయ్యాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఈ సైబర్ క్రైమ్‌ను ఛేదించి ఖాతాదారులకు భరోసా కల్పించాలని బ్యాంక్ సిబ్బందిని పలువురు కోరుతున్నారు. -
యూనియన్ బ్యాంక్ ఆశలు.. రూ.15,000 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిల (ఎన్పీఏలు) వసూలుపై బలమైన అంచనాలతో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.15,000 కోట్లు వసూలు అవుతాయని భావిస్తోంది. ఇందులో రూ.10,000 కోట్ల వరకు ఎన్సీఎల్టీ పరిధిలో దివాలా పరిష్కారం కోసం చూస్తున్న రుణ ఖాతాల నుంచి వస్తాయని అంచనా వేస్తున్నట్టు విశ్లేషకులతో నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ ఎండీ, సీఈవో ఎ.మణిమేఖలై స్పష్టత ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)కి కొన్ని రుణ ఖాతాలను బదిలీ చేయనున్నట్టు చెప్పారు. రూ.4,842 కోట్ల విలువ చేసే రుణ పరిష్కార దరఖాస్తులను ఎన్సీఎల్టీ ఇప్పటికే ఆమోదించినట్టు.. మరో 55 ఖాతాలకు సంబంధించి రూ.5,168 కోట్ల ఎక్స్పోజర్కు ఆమోదం లభించాల్సి ఉన్నట్టు తెలిపారు. జూన్ త్రైమాసికంలో ఎన్సీఎల్టీ పరిష్కారాల రూపంలో యూనియన్ బ్యాంకుకు రూ.122 కోట్ల మొండి రుణాలు వసూలయ్యాయి. చదవండి: Sahara Group: సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే! -
బంజారాహిల్స్: చిమ్మచీకట్లో.. లాకర్ గదిలో.. 18 గంటలు
సాక్షి, బంజారాహిల్స్: అసలే 85 ఏళ్ల వృద్ధాప్యం.. ఆపై మధుమేహం, రక్తపోటు. సమయానికి మందులు వేసుకోకపోతే ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి. గాలి సరిగా లేదు.. మంచి నీళ్లు లేవు. చిమ్మ చీకట్లో ఒంటరిగా ఓ వ్యక్తి 18 గంటల పాటు నరకం అనుభవించాడు. ఒంటరిగా స్ట్రాంగ్‌రూమ్‌లో చిక్కుకున్నా.. గుండెదిటవు చేసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్ నెం.67లోని ప్లాట్ నంబర్1338లో నివసించే వి.కృష్ణారెడ్డి (85)కి జూబ్లీహిల్స్ చౌరస్తాలోని యూనియన్ బ్యాంకు (ఆంధ్రా బ్యాంకు)లో లాకర్ ఖాతా ఉంది. కొంత నగదు తీసుకోవడానికి సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆయన బ్యాంకుకు వచ్చారు. లాకర్ తెరిచి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. బ్యాంకు వేళలు ముగియడంతో లాకర్ గదిలో ఖాతాదారు ఉన్న విషయాన్ని మరిచిన సిబ్బంది సాయంత్రం 5.30 గంటలకు లాకర్ గదికి, బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. తలుపులు వేసిన శబ్దం కూడా వినిపించకపోవడంతో ఇంకా బ్యాంకు సేవలు కొనసాగుతున్నాయని కృష్ణారెడ్డి భావించారు. కొద్దిసేపటి తర్వాత విషయాన్ని గుర్తించి అరిచినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి వద్దే ఫోన్ మరిచిరావడంతో ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మిస్సింగ్ కేసుగా నమోదు.. రాత్రి అవుతున్నా తండ్రి ఇంటికి రాకపోయేసరికి కృష్ణారెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి అన్ని ప్రాంతాలు గాలించి చివరికి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంటి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులోని పెట్రోల్‌బంక్ వరకు కృష్ణారెడ్డి నడుచుకుంటూ వెళ్లిన ఫుటేజీ కనిపించింది. ఆ తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. చివరకు ఎస్ఐ చంద్రశేఖర్ మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బ్యాంకు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా.. కృష్ణారెడ్డి బ్యాంకు లోపలికి వచ్చి, లాకర్‌గదిలోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. బయటికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేసి 10.40 గంటలకు లాకర్ గది తెరిచి చూడగా కృష్ణారెడ్డి వణికిపోతూ, చెమటలతో కుప్పకూలి కనిపించారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందిపై ఐపీసీ సెక్షన్ 336, 342ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రతిరోజూ సాయంత్రం బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత లాకర్గదితో పాటు ప్రాంగణం మొత్తం పరిశీలించాకే తాళాలు వేయాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్లాలనే తొందరలో సిబ్బంది సోమవారం తనిఖీలు చేపట్టలేదు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఉందని బ్యాంకు మేనేజర్ మురళీ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లాకర్ గది తాళాలు మేనేజర్ వేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి ఆయన లేకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ రాధ తాళాలు వేశారు. -
Hyderabad: కస్టమర్‌ను బ్యాంకులోనే ఉంచి తాళం.. ఏం జరిగిందంటే..!
హైదరాబాద్: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకులో ఉండిపోవడమే కాదు.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. సదరు కస్టమర్ 85 ఏళ్ల వృద్ధుడు కావడంతో చేసేదేమీ లేకుండా పోయింది. ఉదయం వరకూ అందులోనే ఉండిపోయి నానా ఇబ్బంది పడ్డాడు. చివరకు అన్న పానీయాలు లేక అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఉదయం సిబ్బంది వచ్చి బ్యాంకు తెరిచే వరకూ కూడా ఆ కస్టమర్‌ను తాళం వేసి వెళ్లిపోయామన్న సంగతి వారికి గుర్తుకురాలేదు. కానీ ఆ వృద్ధుడు బాగా నీరసించి అక్కడే పడిపోయి ఉండటంతో ఆయన్ను.. పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లాకర్ కోసమని 85 ఏళ్ల వృద్ధుడు జూబ్లిహిల్స్‌లోని యూనియన్ బ్యాంక్‌కు వచ్చాడు. లాకర్ చెక్ చేసుకునే క్రమంలో బ్యాంకు టై మగిసింది. ఆ వృద్ధుడు అక్కడే ఉండిపోయిన విషయాన్ని బ్యాంకు సిబ్బంది గమనించలేదు. తలుపులు వేసుకుని, బయట లాక్ చేసుకుని వెళ్లిపోయారు. ఫలితంగా ఆ వృద్ధుడు బ్యాంకులో ఉండిపోవడం, తెల్లారి వచ్చేసరికి అపస్మారక స్థితిలో వెళ్లిపోవడం జరిగింది. నిన్న(సోమవారం) బ్యాంకు పని మీద ఏ టైమ్‌కు వచ్చాడో కానీ బాగా నీరసించి పోయాడు. ఈ ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఔను.. నేనే ఇచ్చా!.. నేరం అంగీకరించిన మస్తాన్‌వలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీ) కాజేసేందుకు జరిగిన కుట్రలో తానూ పాత్రధారినే అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్‌వలీ నేరం అంగీకరించాడు. ‘తెలుగు అకాడమీ’కేసులో జైల్లో ఉన్న అతడిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలోనే తన నేరం అంగీకరించడంతోపాటు వెంకటరమణ పేరు బయటపెట్టాడు. ఎఫ్డీ స్కాముల్లో కీలక సూత్రధారిగా ఉన్న సాయికుమార్‌కు ప్రధాన అనుచరుడైన వెంకటరమణే గిడ్డంగుల సంస్థకు, కార్వాన్ యూనియన్ బ్యాంక్ శాఖకు మధ్య దళారిగా వ్యవహరించాడు. ఆ సంస్థ నుంచి రూ.3.98 కోట్ల చెక్కులు తీసుకెళ్లి మస్తాన్ వలీకి ఇచ్చాడు. అతడిచ్చిన అసలు బాండ్లను తీసుకెళ్లిన రమణ, వాటి స్థానంలో నకిలీవాటిని గిడ్డంగుల సంస్థకు అప్పగించాడు. తెలుగు అకాడమీసహా ఇతర స్కాముల మాదిరిగా సాయికుమార్ నేతృత్వంలోనే ఈ స్కామ్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని అధికారికంగా నిర్ధారించడానికి వెంకటరమణను కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. ఈ కేసులోనూ చెన్నైకి చెందిన పద్మనాభన్ ఈ నకిలీ బాండ్లు సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు అకాడమీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ ష్యూరిటీల తంతు పూర్తికాకపోవడంతో వెంకటరమణ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని దర్యాప్తు అధికారి, ఏసీపీ మనోజ్‌కుమార్ నిర్ణయించారు. మస్తాన్ వలీని విచారిస్తే ఈ కుట్రలో సాయి సహా ఇతరుల పాత్ర బయటకు వస్తుందని భావిస్తున్నారు. -
మస్తాన్ వలీని కస్టడీకి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసేందుకు జరిగిన కుట్ర కేసులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్ వలీ పాత్రపై హైదరాబాద్ సెంట్రల్ క్రెమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆయ న పాత్రను పక్కాగా నిర్ధారించడంతో పాటు సూత్రధారులను గుర్తించేందుకు అతడిని విచారించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో జైల్లో ఉన్న మస్తాన్ వలీని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మస్తాన్ వలీ విచారణ తర్వాతే ‘తెలుగు అకాడమీ’ సూత్రధారులు సాయి తదితరులకు ఈ కేసుతో ఉన్న సంబంధాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటన.. స్పందించిన డాక్టర్లు..
సాక్షి, హస్తినాపురం(హైదరాబాద్): ప్రేమోన్మాది బస్వరాజు దాడిలో గాయపడిన యువతి పూర్తిగా కోలుకోవడంతో హస్తినాపురంలోని నవీన ఆసుపత్రి వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి చైర్మన్ సుభాన్‌రెడ్డి, ఎండీ రాజవర్ధన్‌రెడ్డి, రఘుపతిరెడ్డి వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చేరినప్పుడు యువతి పొట్ట భాగంలో 18 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నారు. అయితే, తమ ఆసుపత్రి వైద్య బృందం రణధీర్‌రెడ్డి, రవితేజ, మంజునాథ్, శ్రీను నాయక్‌లు గాయపడ్డ యువతిని ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్య చికిత్స అందించారన్నారు. యువతి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నా కూడా ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే బాధితురాలు పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా వైద్యం అందించామని వారు తెలిపారు. -
టూవీలర్ కొనుగోళ్లపై తక్కువ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
మనలో చాలా మందికి సొంత బైక్‌ను కొనాలనే ఆశ అందరికీ ఉంటుంది. డబ్బులు ఉన్నవారు వెంటనే ఆయా బైక్ కొనుగోలు చేస్తారు. డబ్బులు పూర్తిగా వెచ్చించి బైక్‌ను కొనుగోలు చేసే వీలు లేని వారి కోసం పలు బ్యాంకులు నిర్ణీత వడ్డీరేటుతో అప్పును ఇస్తాయి. మీ సిబిల్ స్కోర్ 750కు మించి ఉంటే బ్యాంకులు మీకు అప్పును అందిస్తాయి. సులభ వాయిదాల చొప్పున అప్పును చెల్లిసే మీరు కొనుగోలు చేసిన బైక్ మీ సొంతం అవుతుంది. పలు బ్యాంకులు టూవీలర్ కొనుగోళ్లపై గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అప్పును ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఫలానా బ్యాంకుల నుంచి అప్పులను తీసుకోవడంలో వడ్డీరేట్లు ఎలా ఉంటాయో అనే సందేహం చాలా మందికి ఎదురై ఉంటుంది. టూవీలర్ కొనుగోళ్లపై అతి తక్కువ వడ్డీరేట్లను అందిస్తోన్న బ్యాంకుల వివరాలను మీ ముందుకు తెచ్చాం. రుణాలను పొందడానికి కావాల్సిన అర్హతలు: రుణగ్రహీతలు 21 నుంచి 58 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రుణగ్రహీత నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం కలిగి ఉండాలి. గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ను రుణగ్రహీతలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. టూవీలర్‌పై తక్కు వ వడ్డీరేట్లను అందిస్తున్న బ్యాంకులు క్రమ సంఖ్య. బ్యాంకులు అందిస్తోన్న వడ్డీరేట్లు లోన్ అమౌంట్ 1. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25% నుంచి 7.70% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 2. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35% నుంచి 8.55% రూ. 50 లక్షలు (గరిష్టంగా) 3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.70% నుంచి 10.05% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 4. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 8.70% నుంచి మొదలు రూ 2.5 లక్షలు (గరిష్టంగా) 5 పంజాబ్ & సింధ్ బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా) 6. కెనరా బ్యాంక్ 9.00% నుంచి మొదలు రూ. 10 లక్షలు (గరిష్టంగా) 7. ఐసీఐసీఐ బ్యాంక్ 9.50% నుంచి 26.00% రూ. 3 లక్షలు (గరిష్టంగా) 8. ఐడీబీఐ బ్యాంక్ 9.80% నుంచి 9.90% రూ. 1.20 లక్షలు నుంచి మొదలు 9. యూనియన్ బ్యాంక్ 9.90% నుంచి 10.00% రూ. 10 లక్షలు (గరిష్టంగా) 10. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 9.99 % అంతకంటే ఎక్కువ రూ. 3 లక్షల కంటే ఎక్కువ గమనిక: పై వడ్డీరేట్లు ఆయా బ్యాంకుల వెబ్సైట్లనుంచి గ్రహించినవి. -
48 గంటల్లోనే రుణాలు
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉంటే ఏ రుణమైన 48 గంటల్లోనే ఇస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యూబీఐ బ్రాంచ్ మేనేజర్లతో విజయవాడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూబీఐ వివిధ రకాల రుణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత, తనఖాపై రుణాలను అందిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ రుణాలు అందిస్తామన్నారు. బ్యాంక్ రీజినల్ మేనేజర్ వేగే రమేష్, డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ సుందర్, ఏజీఎం సుబ్రహ్మణ్యం, లోన్ పాయింట్ హెడ్ జేఎస్ఆర్ మూర్తి పాల్గొన్నారు. -
లీగ్ మ్యాచ్‌లు ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. లీగ్ మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్స్ కోటాలో తమ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇస్తామని, అయితే లీగ్ మ్యాచ్‌లలో తమను ఆడనివ్వడం లేదంటూ యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిభావంతులను గుర్తించడానికి తాము లీగ్ మ్యాచ్‌లలో పాల్గొంటామని, ఈ మేరకు గతంలో హైకోర్టు ఆదేశించినా తమను లీగ్ మ్యాచ్‌లు ఆడనివ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు.(చదవండి: ఓపెనర్‌గానే రోహిత్ శర్మ! ) ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తి... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎటువంటి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించరాదని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని హెచ్‌సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇటీవలే యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే హెచ్‌సీఏ లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ పేరుతో ప్రత్యేక జట్టు ఉంది. అయితే యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా తమను ప్రత్యేక జట్టుగా గుర్తించి మ్యాచ్‌ల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని హెచ్‌సీఏను కోరింది. -
బ్యాంకు ఉద్యోగులకు బదిలీ శిక్ష!
త్వరలో రిటైరయ్యే వారిపై నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ సమయంలో బదిలీ వేటు! మహిళలని కూడా చూడకుండా ఉన్నఫళాన పొరుగు రాష్ట్రాలకు ‘పని ష్మెంట్ బదిలీ’..! ఇంతకీ వారు చేసిన నేరం.. దర్యాప్తు సంస్థ చట్టబద్ధంగా కోరిన వివరాలను అందచేయడమే! సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె బ్యాంకు లావాదేవీల వివరాలను దర్యాప్తు సంస్థ ఏసీబీకి అందచేసినందుకు యూనియన్ బ్యాంక్ తమ ఉద్యోగులను ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్’ చేయడం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూ కుంభకోణంలో జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెలు భువన, తనూజలపై దర్యాప్తు సంస్థ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. వారి లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఖాతాలున్న బ్యాంకులకు లేఖలు రాసింది. జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరి కుమార్తెల్లో ఒకరి ఖాతా ఆంధ్రాబ్యాంకు (ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైంది)లో ఉంది. ఆమె ఖాతా తాలూకు లావాదేవీలు, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఏసీబీ ఆ బ్యాంకును కోరింది. ఏసీబీ విజ్ఞప్తిపై స్పందించిన బ్యాంకు సిబ్బంది లీగల్ విభాగం అభిప్రాయాన్ని తీసుకున్నారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వడం చట్టబద్ధమేనని లీగల్ విభాగం తెలిపింది. పోలీసులు అడిగిన ఖాతాలు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ శాఖలో ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆన్లైన్లో లెడ్జర్ తెరిచి లావాదేవీల వివరాలు పోలీసులకు అందచేశారు. అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల బ్యాంకు లావాదేవీలను ఏసీబీ అధికారులకు ఇచ్చిన తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులపై ఉన్నత స్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధం కాదని అభిప్రాయాన్ని చెప్పిన బ్యాంక్ లీగల్ విభాగం అధికారుల మీద ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వారి బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వడం చట్ట విరుద్ధం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలకు దేశంలో చట్టం వేరుగా ఉండదు. వివరాలు పోలీసులకు ఇవ్వడం తప్పేమీ కాదు’ అని లీగల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు బదులిచ్చిన్నట్లు తెలిసింది. ఒక్క బ్యాంకుతో ఆగదని.. అనుమానాస్పద లావాదేవీల వివరాలను వెల్లడించడం ప్రారంభమైతే అది ఒక్క బ్యాంకుతో ఆగదని, మిగతా బ్యాంకుల్లోని ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తారని నిందితులు అనుమానించారు. తమ ఖాతా లావాదేవీల వివరాలను వెల్లడించిన యూనియన్ బ్యాంకు అధికారుల మీద చర్యలు తీసుకుంటే మిగతా బ్యాంకులు వివరాలు ఇచ్చేందుకు జంకుతాయని భావించారు. ఈ నేపథ్యంలో సమాచారం ఇచ్చిన అధికారులకు ‘పనిష్మెంట్’ ఇవ్వాలని యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీనికి తలొగ్గిన అధికారులు విజయవాడ రీజనల్ కార్యాలయంలో పని చేస్తున్న ఐదుగురు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అయితే తామేమీ చట్టవిరుద్ధమైన పని చేయలేదని వారు గట్టిగా తేల్చి చెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఆ ఐదుగురిని హఠాత్తుగా బదిలీ చేసినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. ఇద్దరు మహిళా అధికారులే.. బదిలీ వేటు విధించిన ఐదుగురిలో ఒకరు లీగల్ విభాగం మహిళా అధికారి కాగా మరొకరు ‘పీ అండ్ డీ’ విభాగానికి చెందిన మహిళా అధికారి. లెడ్జర్ తెరిచి చూసిన మరో ముగ్గురు అధికారుల మీద కూడా బదిలీ వేటు వేశారు. మొత్తం ఐదుగురిలో ముగ్గురిని చెన్నైకి మరో ఇద్దరిని ముంబైకి బదిలీ చేశారు. ముంబైకి బదిలీ అయిన ఓ అధికారి మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న అధికారిని బదిలీ చేయకూడదనే నిబంధనను కూడా బ్యాంకు పాటించకపోవడం గమనార్హం. ఏం తప్పు చేశారని...? ‘కోవిడ్ నేపథ్యంలో 2021 మార్చి వరకు బదిలీలు లేవని నెల క్రితం సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. కోవిడ్ భయం వెంటాడుతున్న సమయంలో 59 ఏళ్ల వయసున్న అధికారిని ముంబైకి బదిలీ చేశారు. ఇలా చేస్తే ఉద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదా? వాళ్లు ఏం తప్పు చేశారు? చట్టబద్ధంగానే నడుచుకున్నారు’ అని అధికారులు పేర్కొంటున్నారు. బదిలీ షెడ్యూల్ పాటించకుండా.. బ్యాంకు ఉద్యోగులను ఎప్పుడుపడితే అప్పుడు బదిలీలు చేయరు. నిర్దిష్ట షెడ్యూల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తె ఖాతా లావాదేవీల వివరాలు ఇచ్చినందుకు వారికి పనిష్మెంట్ శిక్ష విధించడం గమనార్హం. ఉద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు యూనియన్లు గట్టిగా ప్రశ్నించడం సాధారణం. ఈ వ్యవహారంలో సుప్రీంను బూచిగా చూపిస్తూ యూనియన్ నేతల నోరు మూయించినట్లు బ్యాంకు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. -
రుణ రేట్లను తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ముంబై: ఇటీవలి కాలంలో ఆర్బీఐ రేపో రేటును గణనీయంగా తగ్గించడం ఫలితంగా బ్యాంకులు రుణాలపై రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐతోపాటు పీఎన్బీ రుణ రేట్లను తగ్గించగా.. తాజాగా బ్యాంకు ఆఫ్ బరోడా(బీవోబీ), యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే 0.05 శాతం. సవరణ తర్వాత ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.30 శాతానికి, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతానికి, ఏడాది కాల ఎంసీఎల్ఆర్ (రిటైల్ రుణాలకు ఎక్కువగా అమలయ్యేది) 7.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి దిగొచ్చినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రకటించింది. సవరించిన రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది. బీవోబీ సైతం ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (0.15 శాతం) తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.80 శాతం నుంచి 7.65 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.65 శాతం నుంచి 7.50 శాతానికి దిగొచ్చాయి. ఈ రేట్లు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయని బీవోబీ ప్రకటించింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.30 శాతం, ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి తగ్గాయి. -
ఎస్బీఐ బాటలో బీఓబీ, యూబీఐ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను 0.75 బేసిస్ పాయింట్లు (రెపో ప్రస్తుతం 4.4 శాతం) తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనం మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు కస్టమర్లకు బదలాయించాయి. రెపో ఆధారిత రుణ రేటు తగ్గింపు మార్చి 28వ తేదీ నుంచీ అమల్లోకి తెస్తున్నట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో రెపోకు అనుసంధానమయ్యే వ్యక్తిగత రిటైల్, కార్పొరేట్, చిన్నతరహా పరిశ్రమల రుణ రేట్లు 0.75 శాతం మేర తగ్గనున్నాయి. ఇక తమ తగ్గింపు రేట్లు బుధవారం నుంచీ అమల్లోకి వస్తాయని యూబీఐ పేర్కొంది. యూనియన్ బ్యాంక్‌లో విలీనమవుతున్న ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లకూ తగ్గించిన వడ్డీరేట్లు అమలవుతాయని తెలిపింది. పీఎన్బీ కొత్త లోగో: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కొత్త లోగోను ఆవిష్కరించింది. పీఎన్బీలో ఏప్రిల్ 1 నుంచి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. సుజ్లాన్ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ ఓకే టర్బైన్ల తయారీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ సమ్మతి తెలిపింది. 18 బ్యాంకుల కన్సార్షియంకు ఎస్బీఐ లీడ్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తోంది. సుజ్లాన్‌లో 10% వాటాను భాగస్వామ్య బ్యాంకులు తీసుకోనున్నాయి. బ్యాంకులకు సుజ్లాన్ రూ.12,785 కోట్లు బాకీ పడింది. -
నేడు ఆంధ్రా బ్యాంక్ చివరి వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, అమరావతి: ఆంధ్రా బ్యాంకుకి నవంబర్ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో గురువారం జరిగే ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈవో జె.పకీర్‌సామితోపాటు, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళి అర్పించారు. -
యూనియన్ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్ ఓకే
హైదరాబాద్: యూనియన్ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది. -
ఆంధ్రాబ్యాంక్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.13,000 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. అలాగే అదనపు టైర్ వన్/టూ బాండ్ల జారీ ద్వారా రూ.4,200 కోట్లు సమీకరిస్తామని వెల్లడించింది. బ్యాంక్‌ల విలీనానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలపడం, రూ.17,200 కోట్ల మేర నిధులు సమీకరించనుండటం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్ఈలో యూనియన్ బ్యాంక్ షేర్ 2.2% లాభంతో రూ.56.25 వద్ద ముగిసింది. 12కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంక్‌లు... గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బ్యాంక్‌ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పది బ్యాంక్‌లు విలీనమై నాలుగు బ్యాంక్‌లుగా అవతరించనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్‌లు విలీనమవుతున్నాయి. అలాగే కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ సింధ్ బ్యాంక్‌లు కొనసాగుతాయి. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గనున్నది. -
9న యూనియన్ బ్యాంక్ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసే క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సెప్టెంబర్ 9న సమావేశం కానుంది. రూ. 11,700 కోట్ల మూలధన సమీకరణ అంశంపై కూడా ఇందులో చర్చించనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు బ్యాంకు తెలియజేసింది. మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో విలీన ప్రతిపాదనను ఆమోదించేందుకు సెప్టెంబర్ 6న బోర్డు సమావేశం కానున్నట్లు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం ఆగస్టు 30న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఆంధ్రాబ్యాంక్ మటుమాయం!
ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఉద్యమంలో ఆవిర్భం చిన ఒక ముఖ్య ఘట్టం సహకార ఉద్యమం. 1904లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు మొదటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అమలులోకి వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ సహకార ఉద్యమానికి, వ్యవస్థకి ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఒక అంశం ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్‌ని నెలకొల్పడం. బందరులో డాక్టర్ పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు అనేక సంస్థలని, సంస్కరణలను చేపట్టారు. 1915లో పట్టాభి సీతారామయ్య రూ. 50 వేలతో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్‌ను స్థాపించారు. ఆ బ్యాంక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌గా ఎదిగింది. పట్టాభిగారు 1919–1921లో ఆంధ్ర ప్రొవిన్షియల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పొదుపు ఎలా చేయాలో, ప్రజలకు ధనసహాయం ఎలా చేయాలో నేర్పారు. మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు పట్టాభిగారిని ఉద్దేశించి ‘ధనం సద్వినియోగం చేయడంలో, పొదుపు చేయడంలో పట్టాభి ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్త’ అన్నారు. 1923లో పట్టాభిగారు ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపిం చారు. సామాన్య మానవునికి, రైతుకీ, చిన్న వ్యాపారికీ ధనం అందుబాటులో ఉంచడానికి వీలుగా ఈ వ్యవస్థని పెట్టి రెండు సంవత్సరాలలో 12 శాతం డివిడెండ్ ప్రకటించారు. ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించడం కూడా జాతీయ ఉద్యమంలో ఒక భాగం అన్నారు. బ్యాంక్‌ను స్థాపించడానికి లక్ష రూపాయలు సేకరించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సులభం కాలేదు. ఇంపీరియల్ బ్యాంక్ బందరు మేనేజర్ గార్డన్ అడ్డుపెట్టగా, పట్టాభి గారు మద్రాస్ వెళ్లి ప్రాంతీయ మేనేజర్ ల్యాంబ్‌ను కలిసి పోరాటంలో విజయం సాధించారు. ఆంధ్రా బ్యాంక్ స్వాతంత్య్ర ఉద్యమంలో కట్టుబానిసత్వం నుంచి ఆర్థిక స్వాతంత్య్రానికి అద్దంపట్టిందన్నారు. ఆంధ్రా బ్యాంక్ జాతీయ ఖ్యాతి గడించడం ఒక ముఖ్య విషయం అని ఆయన గర్వపడ్డారు. 1969లో ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసి, అందుకు కారణం పేద రైతుకి, శ్రామికుడికీ, కార్మికుడికీ ధనం అందుబాటులో ఉంచడమే అన్నారు. అప్పటి ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ కె. గోపాల రావు దీటుగా 50 ఏళ్ల క్రితం మా ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ముందుచూపుతో, ఆ లక్ష్యాలతోనే ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించార’ని అన్నారు. ఆంధ్రా బ్యాంక్ చరిత్ర జాతీయ ఉద్యమంలో భాగం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సేవాభావానికి చిహ్నం. పవిత్రమైన ఆశయాలతో స్థాపితమై క్రమంగా జాతీయ స్థాయికి ఎదిగిన ఆంధ్రా బ్యాంక్ పేరుని మార్చడం ఆంధ్రులకు అవమానం. వ్యాసకర్త: ప్రొ‘‘ అయ్యగారి ప్రసన్నకుమార్, విశాఖపట్నం -
‘గిన్నిస్’కే అలుపొచ్చేలా..!
ఫొటోలో ఉన్న పెద్దాయన పేరు ఆశ్రిత ఫర్మాన్. ఆయనచేతిలో ఉన్నవేంటో తెలుసా గిన్నిస్ రికార్డులు. అవన్నీ గిన్నిస్ రికార్డులా.. లేదా ఒక్క దాన్నే జిరాక్స్ తీసుకున్నాడా ఏంటి అనుకుంటున్నారా? కాదండీ ఆ రికార్డులన్నీ ఆయనవే. అమ్మో అన్ని గిన్నిస్ రికార్డులా..! జీవితంలో ఒక్క రికార్డుకే నానా తంటాలు పడతారు.. అలాంటిది అన్ని రికార్డులు సాధించాడా.. గ్రేట్ కదా.. అమెరికాకు చెందిన ఈయన పేరు మీద ప్రస్తుతానికి 226 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఒక్క గిన్నిస్ రికార్డు అయినా సాధించాలని అనుకునే వాడట. అయితే శారీరకంగా అంతగా దృఢంగా ఉండకపోవడంతో అది సాధ్యం కాదని భావించేవాడట. అయితే 1978లో ఓ స్వామి ఇచ్చిన ధైర్యంతో తొలిసారిగా అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన 24 గంటల సైకిల్ రేసులో పాల్గొన్నాడు. కానీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ మరుసటి ఏడాదే 27 వేల జంపింగ్ జాక్స్ చేసి తొలి గిన్నిస్ రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. అప్పటినుంచి వెనక్కి చూసుకోలేదు. ఎప్పుడూ వినూత్నమైన ఫీట్లు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా దాదాపు 600 గిన్నిస్ రికార్డులను సాధించారు. ప్రస్తుతం ఆయన దగ్గర 226 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. అంటే వాటిని ఎవరూ ఇంకా అధిగమించలేదన్న మాట. తాజాగా ఒక్క నిమిషంలో 26 పుచ్చకాయలను తన ఉదరంపై పెట్టుకుని పగులగొట్టుకున్నాడు. ఇది కూడా రికార్డులోకెక్కింది. కంగారూ బంతిపై గెంతుకుంటూ ఎక్కువ దూరం వెళ్లడం.. పెద్ద బంతిపై ఎక్కువ సేపు నిలబడటం.. నీటిలో చిన్న బంతులను ఎగరేసి పట్టుకోవడం.. నీటిలోపల ఎక్సర్సైజ్ చేయడం.. నీటిలోపల సైకిల్ తొక్కడం ఇలా తనకు ఏది అనిపిస్తే దాన్ని కొద్ది రోజుల్లోనే నేర్చుకోవడం గిన్నిస్ రికార్డుల్లో తన పేరు రాసుకోవడం.. తన జీవితం మొత్తం ఇలా రికార్డులు సాధిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.