అల్లీపూర్‌లో క్యూలో వ్యక్తులకు బదులు చెప్పులు
మల్యాల: మల్యాల మండల కేంద్రంలో నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. యూనియన్ బ్యాంకు ఎదుట తెల్లవారు నుంచే క్యూకడుతున్నారు. బీడీ కార్మికుల వేతనాలుసైతం బ్యాంకు ఖాతాల్లో వేస్తుండడంతో రోజురోజుకు ఖాతాదారుల క్యూ పెరుగుతోంది. దీనికితోడు ఏటీఎం సైతం పనిచేయకపోవడంతో ఇటు పింఛన్‌దారులు, బీడీ కార్మికులు, రైతులు డబ్బుల కోసం బ్యాంకు వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు.
రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట శనివారం ఉదయం 9 గంటలకు ఖాతాదారులు చెçప్పులతో నిరసన వ్యక్తం చేశారు. వివిధ గ్రామల నుంచి వచ్చిన ఖాతాదారులు క్యూలైన్ లో నిలబడే ఓపిక క లేవడంతో ఇలా చెప్పులు పెట్టారు.
తీరని నోట్ల తిప్పలు
Published Sun, Jan 8 2017 10:08 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement