న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లో రూ. 1,712 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందజేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఒక డివిడెండ్ చెక్కును కేంద్రానికి సమరి్పంచినట్లు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ స్థాయిలో డివిడెండ్‌ను యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ సమరి్పంచలేదని కూడా ప్రకటన వివరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ మణిమేఖలై డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. జాయింట్ సెక్రటరీ (బ్యాంకింగ్) సమీర్ శుక్లా తదితర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment