
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,959 కోట్ల డివిడెండ్‌ను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మేరకు డివిడెండ్ చెక్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా అందించారు.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.13.70 చొప్పున ఎస్‌బీఐ వాటాదారులకు డివిడెండ్ ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment