న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను చెల్లించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెక్ రూపేణా మొత్తం రూ. 6,481 కోట్లు అందించాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2023–24)గాను ప్రభుత్వానికి ఉమ్మడిగా డివిడెండ్‌ను చెల్లించాయి.
దీనిలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 2,514 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 1,838 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 1,193.5 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 935.5 కోట్లు చొప్పున డివిడెండ్‌ను అందించాయి. అంతేకాకుండా వీటికి జతగా ఎగ్జిమ్ బ్యాంక్ సైతం రూ. 252 కోట్ల డివిడెండ్ చెక్‌ను ప్రభుత్వానికి అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment